
ఇద్దరూ మృతి
పల్లిమక్త, కొండాపూర్‌లలో విషాదం
కోనరావుపేట(వేములవాడ): ఓ గర్భిణిని ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్తే.. శిశువు కడుపులోనే చనిపోగా.. పరిస్థితి విషమించి, కాసేపటికే తల్లి మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెంది సిద్దరవేణి బాబుకు కొండాపూర్ గ్రామానికి చెందిన లాస్యతో ఏడాది క్రితం వివాహం జరిగింది. గర్భిణి అయిన లాస్యను కుటుంబసభ్యులు ప్రసవం నిమిత్తం గురువారం వేములవాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది ఇంజక్షన్ వేయడంతో ఆమెకు ఫిట్స్ వచ్చాయి.
దీంతో వారు ఆందోళనకు గురై, కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. బాధితులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు కరీంనగర్ వెళ్లాలని చెప్పడంతో వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. వైద్యులు లాస్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడికి చేరుకోగా వైద్యులు ఆపరేషన్ చేసి, మృత శిశువును బయటకు తీశారు. పరిస్థితి విషమించడంతో కాసేపటికే తల్లి లాస్య కూడా మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో పల్లిమక్త, కొండాపూర్‌లలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment