kondapur
-
Hyd: కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
గచ్చిబౌలి: హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. మంగళవారం సాయంత్రం వేళ కొండాపూర్‌లో(Kondapur)ని గాలక్సీ అపార్ట్మెంట్ తొమ్మిదొవ అంతస్తులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించి తీవ్రరూపం దాల్చాయి.అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పేలినప్పుడు ఇంట్లో ఒకరు ఉన్నట్లు సమాచారం. అయితే ఆ మహిళ బాల్కనీలో ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. ప్రధానంగా ముందు సదరు మహిళను కిందకు దింపే ప్రయత్నాలు ప్రారంభించారు. -
కొండాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ.. ఢీ కొరియోగ్రాఫర్ కన్హ మహంతి అరెస్ట్
-
కొండాపూర్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించిన సినీ నటి ‘హనీ రోజ్’ (ఫొటోలు)
-
హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. లేడీస్ స్పెషల్ ట్రిప్‌లో భాగంగా.. లేడీస్ స్పెషల్ బస్సులను మళ్లీ రోడ్లపై పరుగులు పెట్టించబోతోంది. ఈ క్రమంలో.. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేసింది. లేడీస్ స్పెషల్ బస్సును ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరి.. లక్డికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషాకిరణ్, గుట్టల బేగంపేట్, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్‌రోడ్స్ మీదుగా కొండాపూర్‌కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చదవండి: కాంగ్రెస్ రూట్లో కమలం.. సర్ప్రైజ్ అందుకే! ఇదిలా ఉంటే.. నగరంలో మహిళల ప్రత్యేక బస్సులు కొత్తేం కాదు. గతంలోనూ ఆర్డినరీ బస్సులు సైతం కొన్ని ఎంపిక చేసిన రూట్లలో తిరుగుతుండేవి. కాలక్రమేణా అవి తగ్గిపోతూ వచ్చాయి. నగరవాసులు సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అదే సమయంలో మెట్రో రైలు.. ఆర్టీసీ ఆదాయానికి బాగా గండికొట్టింది. సజ్జనార్ ఆర్టీసీ ఎండీ అయ్యాక.. ఆక్యుపెన్సీని పెంచేందుకు రకరకాల పద్ధతులను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో నగరవాసులు బస్సు ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చేలా రకరకాల స్కీమ్‌ల్ని తీసుకొస్తున్నారు. మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023 -
తవ్వి తీశారు.. అప్పగించటం మరిచారు
కొండాపూర్‌లో మ్యూజియాన్ని మూడేళ్లుగా మూసి పెట్టిన కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ), అంతకంటే పెద్ద ఘనకార్యాన్నే చేసింది. పన్నెండేళ్ల క్రితం తవ్వకాల్లో వెలుగు చూసిన వస్తువులను సంబంధిత ఉన్నతాధికారి ఇప్పటివరకు వాటిని మ్యూజియంకు హ్యాండోవర్ చేయలేదు. ఆ తవ్వకాల్లో ఏయే వస్తువులు లభించాయో నివేదికనూ అందజేయలేదు. తవ్వకాల్లో దొరికిన వస్తువులెన్ని? అవి ఎక్కడున్నాయి? వాటిల్లో అన్నీ ఉన్నాయా? లేదా? వంటి విషయాలేవీ బయటి ప్రపంచానికి చెప్పలేదు. నివేదిక ఇవ్వకున్నా ఏఎస్ఐ పన్నెండేళ్లుగా చేష్టలుడిగి చూస్తుండటం విడ్డూరం. పుష్కర కాలం కిందట ఆ తవ్వకాలకు నేతృత్వం వహించిన అధికారి, ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో తవ్వకాల్లో దొరికిన చారిత్రక సంపద విషయం గందరగోళంగా మారింది. సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డికి చేరువలో ఉన్న కొండాపూర్ అద్భుత శాతవాహన కేంద్రం. క్రీ.పూ.2వ శతాబ్దం–క్రీ.శ.2వ శతాబ్దం మధ్య ఇది వ్యాపార, ఆధ్యాత్మి క పట్టణం. 19వ శతాబ్ద ప్రారంభం, 1940, 1970ల్లో పలుమార్లు ఇక్కడ తవ్వకాలు జరిగాయి. చరిత్రపరిశోధకులు గొప్పవిగా భావించే అనేక ఆధారాలు వెలుగు చూశాయి. రోమన్లు వచ్చి ఇక్కడ స్థిరపడి అంతర్జాతీయస్థాయిలో వాణిజ్యాన్ని నిర్వహించినట్టు తేలింది. అగస్టస్ కాలం నాటి బంగారు నాణేలూ ఇక్కడ దొరి కాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న చైనా పోర్సలీస్ బొమ్మలను తలదన్నే బొమ్మలు అక్కడ 2 వేల ఏళ్ల నాడే మనుగడలో ఉన్నట్టు తేలింది. నాటి బంగారు ఆభరణాలు, మణులు, వైఢూర్యాలు, కెంపులు, పచ్చల లాంటివెన్నో వెలుగు చూశాయి. ఓ పట్టణానికి సంబంధించిన అవశేషాలు కనిపించాయి. దీంతో అక్కడ 86 ఎకరాల స్థలాన్ని ఏఎస్ఐ తన ఆధీనంలోకి తీసుకుని ఓ మ్యూజియంను నిర్మించింది. తవ్వకాల్లో వెలుగు చూసిన వాటిల్లోంచి కొన్నింటిని ప్రదర్శనకు ఉంచింది. మరోసారి తవ్వకాలు.. 2009 నుంచి 2011 వరకు ఏఎస్ఐ మరోసారి తవ్వకాలు జరిపింది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తవ్వకాల విభాగం (4) సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు మహేశ్వరి ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయి. అందులోనూ వేల సంఖ్యలో విలువైన వస్తువులు, శాతవాహన కాలం నాటి నాణేలు భారీ గా వెలుగు చూశాయి. అయితే.. ఏయే వస్తువులు దొరికాయి? వాటి ప్రత్యేకతలేంటి? అనే నివేదికను మాత్రం ఏఎస్ఐ బహిర్గతం చేయలేదు. ఎంతోమంది అడిగినా స్పందించలేదు. ఈలోపు అధికారి మహే శ్వరి వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఆమె నివేదిక పోవడం, లభించిన వస్తువులను ఇక్కడి అధికారులకు హ్యాండోవర్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. వాటిని పెట్టిన గది తాళంచెవులు కూడా అప్పగించలేదు. దీంతో తవ్వి తీసినా కూడా అవి అజ్ఞాతంలోనే ఉండిపోయాయి. పరిశోధనలకు ఆస్కారమే లేక.. కర్ణాటకలోకి మస్కిలో తవ్వకాలు జరిపినప్పు డు 33 బంగారు నాణేలు వెలుగు చూశాయి. మస్కి తవ్వకాల్లో లభించిన 33 ఫనమ్ బంగారు నాణేల్లో కేవలం ఒకటి మాత్రమే హోయసల రాజ్యానిదని, మిగతావన్నీ అంతకు చాలా ముందుగా ఉన్న విష్ణుకుండినులు సహా ఇతర పాలకులు అని వాటిని పరిశోధించిన ప్రముఖ నాణేల నిపుణుడు డాక్టర్ రాజారెడ్డి తేల్చారు. అలాంటి కొత్త విషయాలు కొండాపూర్‌లో 2009లో జరిపిన తవ్వకాల్లో దొరికిన నాణేల్లోనూ ఉంటాయన్న ఉద్దేశంతో వాటి పరిశోధనకు కేంద్రప్రభుత్వం నుంచి 2015లో అనుమతి పొందారు. అయితే.. నాటి అధికారి వాటిని హ్యాండోవర్ చేయకపోవటంతో పరిశోధనకు కేటాయించలేమని అధికారులు చెప్పారు. అలా పరిశోధనలేవీ జరగలేదు. (చదవండి: అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులతో వాన) -
కొండా‘పూర్’ మ్యూజియం: అదో పట్టణం, బౌద్ధ కేంద్రం కానీ..
కొండా‘పూర్’ మ్యూజియం అదో పట్టణం.. అందమైన ఇళ్లు, భూగర్భ గృహాలతో కళకళలాడింది. అదో వ్యాపార కేంద్రం.. అత్తరు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేది.. అందుకు ప్రత్యేకంగా కయోలిన్ క్లేతో అత్తరు బుడ్లను తయారు చేసేవారు.. ఈ వ్యాపారంలో ప్రముఖ పాత్ర రోమన్ వ్యాపారులదే. అదో బౌద్ధ కేంద్రం.. స్తూపం, చైత్యం, ఆధ్యాతి్మక మందిరాలు ఎన్నో రూపుదిద్దుకున్నాయి. ఇదంతా ఎక్కడో కాదు, సంగారెడ్డి పట్టణానికి చేరువగా ఉన్న కొండాపూర్ కేంద్రంగా సాగింది. కానీ అది ఇప్పుడు కాదు, క్రీ.పూ. 2వ శతాబ్దం– క్రీ.శ.2వ శతాబ్దం మధ్య కాలం నాటి సంగతి. సాక్షి,హైదరాబాద్: శాతవాహనులు పాలించిన ప్రాంతంలో ఇప్పటివరకు జరిపిన తవ్వకాల్లో లభించిన నాణేల్లో సగానికంటే ఎక్కువ లభించిందిఈ కొండాపూర్ ప్రాంతంలోనే. రోమన్ చక్రవర్తి అగస్టస్ హయాంలో చెలామణిలో ఉన్న బంగారు నాణేలూ ఇక్కడ లభించాయి. గౌతమీ పుత్ర శాతకర్ణి.. పులుమావి శాతకరి్ణ, యజ్ఞశ్రీ శాతకర్ణి లాంటి వారు అక్కడికి వచ్చి ఉంటారన్నది చరిత్రపరిశోధకుల మాట. ఇప్పుడు పోర్సోలిన్ అనగానే చైనా తయారీ బొమ్మలు గుర్తుకొస్తాయి. కానీ రెండు వేల ఏళ్ల క్రితమే ఇక్కడ ఆ మట్టితో బొమ్మలు రూపొందించారు. ►ఇంత ఘనమైన చరిత్ర ఉన్న కొండాపూర్ ప్రాంతంలో 19వ శతాబ్దం నుంచి జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసిన ఎన్నో గొప్ప ఆధారాలను ప్రదర్శనకు ఉంచిన ఓ మ్యూజియం ఉంది. అయితే, అది మూడేళ్లుగా మూతపడి ఉంది. రాష్ట్రంలో కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) అధీనంలో ఉన్న ఏకైక మ్యూజియం ఇదే కావటం గమనార్హం. ►ప్రచారం లేకపోవడంతో... మ్యూజియం భవనం నిర్వహణ బాగానే ఉన్నా, కట్టడ పటుత్వం దెబ్బతినటంతో రూ.2.5 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. కానీ దానికి అనుమతి రాకపోవటంతో, ఉన్నదాన్నే బాగుచేసి, కొత్త గ్యాలరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇంతలో కోవిడ్ మహమ్మారి విస్తరించటంతో 2020లో దాన్ని మూసేశారు. ఆ తర్వాత మరమ్మతులు మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఫలితంగా మ్యూజియం మూసే ఉంది. దీంతో విలువైన, సున్నితమైన వస్తువులను చూసే వీలు లేకుండాపోయింది. అంత గొప్ప మ్యూజియం ఉందన్న ప్రచారం లేకపోవటంతో ప్రజలకు దాని గురించే తెలియకుండా పోయింది. ►విదేశాల్లో ఉంటే కిటకిటలాడేదేమో.. ముందస్తుగా ఫోన్ చేసి చెప్పి ఇటీవలే ఆ మ్యూజియాన్ని సందర్శించి అబ్బురపడ్డాను. 2 వేల ఏళ్ల క్రితమే మన చరిత్ర ఇంత గొప్పదా అనిపించే స్థాయి ఆధారాలు అక్కడ ఉన్నాయి. కానీ, వాటి ని చూసేందుకు జనమే రారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఇంత గొప్ప ఆధారాలతో విదేశాల్లో మ్యూజియం ఉంటే జనంతో కిటకిటలాడేది. – చిన వీరభద్రుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ►త్వరలో పునరుద్ధరిస్తాం కొండాపూర్ మ్యూజియం మన అద్భుత చరిత్రకు నిదర్శనం. దాని విషయంలో నిర్లక్ష్యం చేయం. కొత్త భవనం అనుకున్నా, ఉన్నదాన్నే బాగుచేద్దామని నిర్ణయించి పనులు జరుపుతున్నాం. త్వరలో మ్యూజియాన్ని పునరుద్ధరిస్తాం. – మహేశ్వరి, ఏఎస్ఐ రీజినల్ డైరెక్టర్ చదవండి: ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయా?! ఒక్క క్లిక్‌తో అంతా ఉల్టా పల్టా! -
వీడియో: కొండాపూర్ ఐస్‌క్రీం పార్లర్లో విజయ్ దేవరకొండ సందడి
-
కొండాపూర్‌లోని ఐస్‌క్రీమ్ సెంటర్లో విజయ్ దేవరకొండ సందడి (ఫొటోలు)
-
డ్రగ్స్ స్వాధీనం.. ఒకరి అరెస్టు.
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలను విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అరెస్టు చేసింది. కొండాపూర్‌లోని శరత్ క్యాపిటల్ సిటీ మాల్ వద్ద విశాఖపట్నంవాసి అశోక్‌ను గురువారం అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 30 ఎల్ఎస్డీ బ్లాట్స్, 3.59 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. అశోక్ కొండాపూర్‌లో నివాసముంటున్నాడు. హైదరాబాద్‌లో రెండు డ్రగ్ కేసులు ఎదుర్కొంటున్న విశాఖవాసి మానుకొండ సత్యనారాయణ అలియాస్ సత్తి గోవాకు మకాం మార్చి అక్కడి నుంచి నగరానికి ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను తన ఏజెంట్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు ఈ కేసు విచారణలో తేలిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఒక గ్రామ్ ఎండీఎంఏను రూ.5వేలు, ఎల్ఎస్డీ బ్లాట్ రూ.2,500 ధరతో విక్రయించేందుకు ప్రయత్నించినట్టు వెల్లడించారు. దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి, సీఐ మోహన్‌బాబు, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
Hyderabad: ఐటీ కారిడార్‌కు మళ్లీ కోవిడ్ భయం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ను మళ్లీ కోవిడ్ భయం వణికిస్తోంది. శివారులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాంగూడలో సుమారు మూడు వేల ఎకరాల్లో 14 ఐటీ జోన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతిష్టాత్మక అమెజాన్, గుగూల్, ట్విట్టర్, ఫేస్బుక్, మహేంద్ర వంటి ఐటీ, అనుబంధ కంపెనీలు, స్టార్ హోటళ్లు, అనేక వ్యాపార వాణిజ్య సంస్థలు వెలిశాయి. వీటిలో ప్రత్యక్షంగా ఏడు లక్షల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో పది లక్షలమంది పనిచేస్తున్నట్లు అంచనా. వీరిలో చాలామంది ఉద్యోగులు ప్రాజెక్టుల పేరుతో తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటారు. చైనా, బ్రెజిల్, బ్రిటన్ సహా పలు దేశాల్లో బీఎఫ్–7 వేరియంట్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆయా దేశాలకు వెళ్లి వచ్చిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిలో ఎవరు ఏ వేరియంట్ వైరస్‌ను వెంట తీసుకొచ్చారో? తెలియక తోటి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తోటి ఉద్యోగుల్లో ఎవరైనా ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చినట్లు తెలిస్తే చాలు వారికి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ‘బీఎఫ్7’ వేరియెంట్ నగరంలో 2020 మార్చి 2న తొలి కోవిడ్ కేసు నమోదైంది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడికి తొలుత కరోనా సోకింది. అప్పట్లో ‘ఆల్ఫా’వేరియెంట్ హల్చల్ చేసింది. అనతికాలంలోనే అనేకమంది ఈ వైరస్ గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. ఆ తర్వాత ‘డెల్టా’వేరియెంట్, మూడోదశలో ‘ఒమిక్రాన్’ రూపంలో విజృంభించింది. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో సుమారు ఏడు లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా, పదివేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. గత మూడు దశల్లో కోవిడ్ సృష్టించిన నష్టాల బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత ఏడాదికాలంగా కోవిడ్ పీడ పూర్తిగా పోయిందని భావించి స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో తాజాగా ‘బీఎఫ్7’వేరియంట్ రూపంలో ఫోర్త్ వేవ్ మొదలైంది. బూస్టర్‌డోసుకు మళ్లీ డిమాండ్ తాజా వేరియంట్ హెచ్చరికలతో ఉద్యోగులు, సాధారణ ప్రజలు మళ్లీ టీకా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. బూస్టర్ డోసు వేయించుకుంటున్నారు. ఒంట్లో ఏ కొంచెం నలతగా అన్పించినా వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు అనుమానితుల తాకిడి పెరుగు తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్‌లో అలెర్ట్ దేశవిదేశాలకు చెందిన ప్రయాణికులంతా శంషాబాద్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విమానాశ్రయం నుంచి రోజుకు సగటున 14 నుంచి 15 వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. ప్రస్తుతం స్వదేశంతో పోలిస్తే విదేశాల్లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చి పోయే ప్రయాణికుల ద్వారా ఈ కొత్త వేరియంట్ దేశంలో విస్తరించే ప్రమాదం ఉండటంతో ఎయిర్‌పోర్టు యంత్రాంగం అప్రమత్తమైంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మళ్లీ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న ప్రయాణికులను గుర్తించి ఐసోలేషన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచనలు ఇవే.. ► మార్కెట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, పార్కులు, ఫంక్షన్‌హాళ్లు, రైల్వే, బస్స్టేషన్లు, గుళ్లు గోపురాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, ఇతర సందర్శనీయ ప్రదేశాలు, రాజకీయ సభలు, సమావేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి ప్రదేశాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా, వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ► రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ఇప్పటివరకు కోవిడ్ టీకాలు తీసుకోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు త్వరగా వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు సాధ్యమైనంత వరకు ఈ రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. విదేశీ ప్రయాణాలతోపాటు దైవదర్శనాలను వాయిదా వేసుకోవాలి. ► రద్దీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలి. చేతులను తరచూ శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. షేక్ హ్యాండ్‌కు బదులు రెండు చేతులతో నమస్కారం చేయడం ఉత్తమం. దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, జ్వరం లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ► వ్యక్తిగతంగా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. ఇందుకు ఇప్పటికే ఒకటి, రెండు డోసుల టీకాలతో సరిపెట్టుకున్న వారు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలి. తాజా మాంసం, మద్యపానం, ధూమపానం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన ప్యాక్డ్ మసాల ఆహారానికి బదులు, తాజాగా వండివార్చిన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కొత్త వేరియంట్‌ను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. (క్లిక్ చేయండి: పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు కరోనా వైరస్.. బూస్టర్ డోస్ తప్పనిసరి) -
హైదరాబాద్ అంటే హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదు!
ముషీరాబాద్ (హైదరాబాద్): హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదని హైద రాబాద్ నగరం పేదలు నివసించే బస్తీల్లో, కాలనీల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వీటి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ముషీరా బాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్, రాంనగర్ డివిజన్లలోని పలు బస్తీలు, కాలనీల్లో అధికారు లతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సంద ర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పేదలు, చిన్ని చిన్న ఉద్యోగులు నివసించే కాలనీలు, బస్తీలు నిర్ల క్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి అంటే హైటెక్‌సిటీ అభివృద్ధి అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నిజమైన హైదరాబాద్ అంటే ఓల్డ్‌సిటీ, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, సనత్‌నగర్‌లతోపాటు అనేక ప్రాంతాలున్నాయన్నారు. మెయిన్రోడ్లమీద రంగులు పూసి హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా డ్రైనేజీ, వర్షపునీరు, కలుషిత మంచినీరు, రోడ్లపై గుంతలు, వీధిలైట్ల సమస్యలను చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నుంచే 80 శాతం రెవెన్యూ వస్తోంటే.. నగర అభివృద్ధికి 8 శాతం నిధులు కూడా ఖర్చుపెట్టడం లేదని చెప్పారు. హైదరాబాద్‌లోని రెండు ప్రధాన శాఖ లైన జీహెచ్ఎంసీ, జలమండలి అప్పుల ఊబిలో చిక్కి చిన్న చిన్న పనులకు సైతం నిధులు విడుదల చేయలేని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. అందువల్ల ప్రభుత్వం బస్తీల్లో ఉండే నిజమైన హైద రాబాద్ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. చదవండి: నాడు టీడీపీలో.. నేడు కాంగ్రెస్‌లో.. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు -
Hyderabad: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాజీ పీఏ కుమారుడి ఆత్మహత్య
గచ్చిబౌలి/మహబూబ్‌నగర్ క్రైం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వద్ద గతంలో వ్యక్తిగత సహాయకుడి (పీఏ)గా పనిచేసిన రెవెన్యూ ఉద్యోగి దేవేందర్ కుమారుడు కేసిరెడ్డి అక్షయ్‌కుమార్ (23) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో చోటుచేసుకుంది. అక్షయ్ మహబూబ్‌నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ స్కాంలో నిందితుడని పోలీసులు తెలిపారు. సోమవారం సీఐ గోనె సురేశ్ కథనం మేరకు వివరాలు ఇలా... మహబూబ్‌నగర్‌లోని మోనప్పగుట్టకు చెందిన అక్షయ్ కుమార్.. అమెజాన్ సంస్థలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కు వచ్చాడు. కొండాపూర్‌లోని శిల్పవ్యాలీలో నివాసం ఉండే అక్క మల్లిక వద్ద ఉంటున్నాడు. ఈ నెల 19న అక్క మల్లిక, బావ నవీన్ ఊరికి వెళ్లి తిరిగి సోమవారం ఉదయం వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్షయ్‌ని పిలిచారు. ఎంత పిలిచినా పలకకపోవడంతో వారు మరో తాళం చెవితో తలుపు తీశారు. బెడ్ రూమ్‌లోకి వెళ్లి చూడగా అక్షయ్ చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో వారు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల అక్షయ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సీఐ తెలిపారు. తన తండ్రికి చెడ్డ పేరు వస్తుందని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. అక్షయ్ తండ్రి ప్రస్తుతం మంత్రి వద్ద విధులు నిర్వహించడం లేదని పోలీసులు చెప్పారు. స్కాం ఏంటంటే... మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లిలో సయ్యద్ కలాం పాషా అనే వ్యక్తికి బి–120 నంబర్ గల డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. అయితే ఆ ఇల్లు సమాధి పక్కనే ఉండటంతో పాషాకు నచ్చలేదు. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, తాను పనిచేసి పెడతానని చెప్పి రూ.30వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ఎవరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు కావాలనుకుంటే ఇప్పిస్తానని చెప్పడంతో ఇస్తాషాద్దీన్ అనే వ్యక్తి రూ.70 వేలు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చినా కూడా పనిచేయలేదంటూ పాషా, ఇస్తాషాద్దీన్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు సెప్టెంబర్ 30న అక్షయ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకు అక్షయ్ ఆత్మహత్య చేసుకోవడం.. పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. -
ఒక్కసారిగా మారిన వాతావరణం..హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉండగా.. అంతలోనే పూర్తి బిన్నంగా వాతావరణం చల్లబడింది. నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎల్బీనగర్, కూకట్పల్లి, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, మల్కాజ్గిరి, మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. Heavy Downpour In Hafeezpet ~Kondapur Road⛈️#HyderabadRains pic.twitter.com/cGDmwSrbyL — Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2022 హైదరాబాద్ లో భారీ వర్షం #HyderabadRains pic.twitter.com/K5RT6oTJm3 — Latha (@LathaReddy704) September 6, 2022 -
కొండాపూర్ పబ్‌లో రెచ్చిపోయిన బౌన్సర్లు.. కస్టమర్‌పై పిడిగుద్దులు
గచ్చిబౌలి(హైదరాబాద్): పబ్‌లలో బౌన్సర్లు రెచ్చిపోతున్నారు. కస్టమర్లకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాల్సిన బౌన్సర్లే సహనం కోల్లోయి విచక్షణ రహితంగా దాడులుకు తెగబడుతున్నారు. వివరాలివీ... కూకట్పల్లి లోధా టవర్స్‌లో నివాసం ఉండే సంజీవ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు కొండాపూర్‌లోని కోమా పబ్‌కు వెళ్లారు. రాత్రి 1.30 సమయంలో టైం ముగిసిందని బయటకు వెళ్లాలని ఓ బౌన్సర్ సూచించారు. 5 నిమిషాల్లో వెళతానని చెప్పిన కొద్ది సేపటికే మరో బౌన్సర్ వచ్చి బయటకు వెళ్లాలని గద్దించాడు. బాధితుడు సంజీవ దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ తరువాత పబ్ నుంచి బయటకు వెళ్లగా బౌన్సర్లు వెంబడించారు. బౌన్సర్లు పట్టుకోగా మరో వ్యక్తి ముఖంపై పిడి గుద్దులు కురించాడు. దీంతో సంజీవ ముఖంపై తీవ్ర రక్త స్రావం జరిగింది. శనివారం ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బౌన్సర్లు, నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుఖేందర్ రెడ్డి తెలిపారు. బయటకు వెళుతుండగా పార్కింగ్ వద్ద నలుగురు బౌన్సర్లు నన్ను పట్టుకోగా ఓ వ్యక్తి ముఖంపై దాడి చేశాడన్నారు. -
అత్యాచారయత్నం కేసు.. గాయత్రి భర్త చెప్పిన షాకింగ్ విషయాలు..
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు గాయత్రి భర్త శ్రీకాంత్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై గాయత్రి భర్త ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తన అత్త చేసే ఆరోపణలు అసత్యమని తెలిపారు. గాయత్రి తండ్రి మరణం అనంతరం వాళ్లు గాయత్రి మీద కక్ష కట్టారన్నారు. చదవండి: ఎంత పనిచేశావ్ నాన్నా! పుట్టింటికి నవ వధువు.. ప్రాణాలు తీసిన కన్నతండ్రి ఆస్తి పంపకాల్లో గాయత్రిని ఆమె తల్లి, సోదరే వేధించారన్నారు. గాయత్రి స్థలంలో తన తమ్ముడు ప్రదీప్ ఇళ్లు కట్టాలని చూశాడని.. దాన్ని గాయత్రి అడ్డుకుందని తెలిపారు. గాయత్రి కుటుంబంలో పరస్పరం అందరూ కేసులు వేసుకున్నారన్నారు. గాయత్రికి తాను సపోర్ట్‌గా ఉన్నందుకు తనపై కక్ష కట్టారని శ్రీకాంత్ తెలిపారు. గాయత్రి అరాచకాలపై తనకేమి తెలియదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలపై తనకు సమాచారం లేదని శ్రీకాంత్ అన్నారు. కాగా, సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతిపట్ల అమానుషంగా ప్రవర్తించిన గాయత్రి ఇల్లును కబ్జా చేయడానికి ఆమె కుటుంబీకులు యత్నించారు. ఆమె భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్యసహా మరికొందరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి గాయత్రికి, ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. -
కొండాపూర్‌లో దారుణం.. యువతిని బంధించి, అత్యాచారయత్నం
-
భర్తపై అనుమానం .. యువతిపై కిరాతకం!
గచ్చిబౌలి (హైదరాబాద్): తన భర్తతో సంబంధం ఉందని అనుమానించింది. కోపంతో రగిలిపోతూ విచక్షణ కోల్పోయింది. తోటి యువతి అనే ఆలోచన ఏమాత్రం లేకుండా పాశవికంగా వ్యవహరించింది. పిన్నీ అని పిలిచే ఆ యువతిని పథకం ప్రకారం ఇంటికి పిలిపించి ఆమెపై లైంగిక దాడి చేయించేందుకు ప్రయత్నించింది. దాన్ని వీడియో కూడా చిత్రీకరించింది. దాదాపు 45 నిమిషాల పాటు ఈ ఘోరం చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు.. ప్రధాన నిందితురాలు సహా ఆరుగురిపై ‘అత్యాచారం’ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం ఈ అమానుష ఘటన వివరాలిలా ఉన్నాయి. సంబంధం లేదని తేల్చిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన యువతి (26) అశోక్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటూ ఓ ఇన్స్టిట్యూట్లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటోంది. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ బీ–బ్లాక్‌లో నివసించే శ్రీకాంత్ ఈమె సహ అభ్యర్థి. గతేడాది జరిగిన ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో వీరికి పరిచయమైంది. ఇతడు తొమ్మిదేళ్ల క్రితం గాయత్రిని (36) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గాయత్రి, శ్రీకాంత్‌లను పిన్ని, బాబాయ్ అని పిలిచే బాధిత యువతి గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వారి ఇంట్లోనే ఉంది. అప్పట్లో గాయత్రి ఆమెతో బాగానే ఉండేది. షాపింగ్‌లకూ తీసుకెళ్లేది. కానీ తర్వాత అనుమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆ యువతి వారి ఇంట్లో నుంచి బయటకొచ్చేసింది. అనుమానం వీడని గాయత్రి ఏప్రిల్ 22న ఆ మేరకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గాయత్రితో పాటు శ్రీకాంత్‌ను, ఆ యువతిని పిలిచి కౌన్సెలింగ్ చేశారు. శ్రీకాంత్, ఆ యువతి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధం లేదని తేల్చి పంపారు. భార్య అనుమానాల నేపథ్యంలో శ్రీకాంత్ ఆమెనే మరోసారి రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. అయినా ఆమెలో అనుమానం పోలేదు. సమస్య పరిష్కరించుకుందామని పిలిపించి .. సదరు యువతిని భయభ్రాంతులకు గురి చేయాలని, దారుణంగా హింసించాలని గాయత్రి పథకం వేసింది. దీనికోసం గతంలో తన వద్ద డ్రైవర్లుగా పని చేసి ప్రస్తుతం మసీద్‌బండలోని పాన్‌షాపులో పని చేసే మస్తాన్(25), ముజాహిద్‌లతో (25) పాటు వీరి స్నేహితులైన అయ్యప్ప సొసైటీకి చెందిన విష్ణు (22) మనోజ్ (22), కడపకు చెందిన మౌలాలిలతో కలిసి రంగంలోకి దిగింది. గత గురువారం బాధిత యువతికి ఫోన్ చేసి కొండాపూర్‌కు వస్తే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామంది. దీంతో ఆమె తన తల్లిదండ్రులు, ఇద్దరు న్యాయవాదులతో మధ్యాహ్నం 3 గంటలకు గాయత్రి ఇంటి వద్దకు వెళ్లింది. ఒంటరిగా ఇంటికి తీసుకెళ్లి .. గాయత్రి ఇండిపెండెంట్ హౌస్‌కు సమీపంలో ఉన్న ఓ హోటల్ వద్దకు వెళ్లిన వీళ్లు ఆ విషయం ఆమెకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో బయటకు వచ్చిన గాయత్రి మిగిలిన వారిని హోటల్ వద్దనే ఉంచి యువతిని తనతో తీసుకువెళ్లింది. అప్పటికే ఇంట్లో ఉన్న ఐదుగురు యువకులతో కలిసి యువతి నోట్లో గుడ్డలు కుక్కింది. వివస్త్రను చేసింది. సామూహిక లైంగిక దాడి చేయించేందుకు ప్రయత్నించింది. ఓ యువకుడు యువతి జననాంగంపై దాడి చేసి దారుణంగా హింసించాడు. దీంతో బాధితురాలికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘోరాన్ని గాయత్రి తన సెల్ఫోన్లో రికార్డు చేసింది. అంతసేపూ బయటే వేచి చూస్తున్న యువతి తల్లిదండ్రులు, న్యాయవాదులు ఆమె రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రధాన గేటు దాటి, నాలుగు పెంపుడు శునకాలను తప్పించుకుని లోనికి వెళ్లడానికి దాదాపు 20 నిమిషాలు పట్టింది. అప్పటికి గాయత్రి సహా ఆరుగురూ ఇంటి వెనుక ఉన్న నిచ్చెన సాయంతో గోడ దూకి పారిపోయారు. అది కూడా అత్యాచారమే.. ఈ దారుణాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు అదేరోజు గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేయించారు. అయితే మహిళ జననాంగంపై దాడి చేయడం కూడా అత్యాచారమే అని చట్టం చెబుతోందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరుగురిపైనా అత్యాచారం, నిర్భంధం, మహిళ ఆత్మ గౌరవానికి భంగం కలిగించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. గాయత్రి సహా పరారీలో ఉన్న నిందితులను శనివారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నా కూతురికి ఏ శిక్ష వేసినా ఆనందమే ఓ ఆడపిల్లపై పాశవికంగా దాడి చేసిన నా కూతురుకు ఏ శిక్ష వేసినా ఆనందమే. ఆమె ఏ తప్పు చేసినా శ్రీకాంత్ గుడ్డిగా ప్రోత్సహిస్తుంటాడు. అతని ప్రోద్బలంతోనే గాయత్రి ఆ యువతిపై ఆ విధంగా దాడి చేసి ఉండవచ్చు. శ్రీకాంత్‌ను కూడా అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. – కృష్ణవేణి, గాయత్రి తల్లి చదవండి: వివాహేతర సంబంధం: అన్న మెడకు టవల్ చుట్టి.. -
లంచం అడిగిన డాక్టర్‌పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు
గచ్చిబౌలి (హైదరాబాద్): కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్‌కు అవసరమైన ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన డాక్టర్‌ను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మంత్రి ఆస్పత్రికి వచ్చారు. కాగా డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్లో గెజిటెడ్ సిగ్నేచర్ కోసం సెక్యూరిటీ గార్డు ద్వారా సంప్రదిస్తే డాక్టర్ డబ్బు లు అడిగాడని ఓ వ్యక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డును పిలిచిన హరీశ్, తమ సంభాషణను వీడియో తీయాల్సిందిగా అధికారులను ఆదేశించి.. ఏ డాక్టర్, ఎంత అడిగాడంటూ నిలదీశారు. మూర్తి (పీవీఎస్ఎన్ మూర్తి) అనే డాక్టర్ రూ.500 అడిగాడని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో అక్కడికక్కడే ఆ డాక్టర్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాధారణ ప్రసవాలు పెంచాలి తనిఖీల్లో భాగంగా అవుట్ పేషెంట్ విభాగంతో పాటు అన్ని వార్డుల్లో హరీశ్ కలియతిరిగారు. అందుతున్న వైద్య సేవలను రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రసూతి విభాగంలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. మందులు, స్కానింగ్‌తో పాటు ఇతర పరీక్షలు బయటకు రాయవద్దని ఆర్ఎంఓ డాక్టర్ విజయకుమారిని ఆదేశించారు. 60 శాతానికి పైగా సాధారణ డెలి వరీలు కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్య మరింత పెంచాలని సూచించారు. గైనకాలజీ వార్డులో ప్రతిరోజూ స్కానింగ్‌లు చేయాలని ఆదేశిస్తూ మరో రెండు అల్ట్రా సౌండ్ మెషీన్లు అందజేస్తామని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి తనిఖీలు నిర్వహించారు. -
Harish Rao: లంచం అడిగిన వైద్యుడు.. మంత్రి రియాక్షన్ ఇది
హైదరాబాద్: ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన ఓ వైద్యుడిపై నేరుగా వెళ్లి మరీ చర్యలు తీసుకున్నారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సోమవారం ఉదయం కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం డాక్టర్ లంచం డిమాండ్ చేస్తున్నారని కొందరు బాధితులు మంత్రి హరీష్‌రావుకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆకస్మికంగా ఆస్పత్రి తనిఖీలకు వెళ్లిన ఆయన.. వివరాలు తెలుసుకుని సదరు డాక్టర్‌పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని సిబ్బంది హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రి అంతా పరిశీలించి.. పేషెంట్లతో మాట్లాడారు. మంత్రి @trsharish గారు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక సందర్శన. pic.twitter.com/pVfy3Dm1ce — Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 23, 2022 -
గచ్చిబౌలి: మద్యం మత్తులో వీరంగం.. పోలీసులపై చిందులు తొక్కిన యువకులు
సాక్షి, గచ్చిబౌలి: మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికాలో ఇంజనీరింగ్ చదివి ఇటీవలే నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును డ్రైవ్ చేస్తూ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడమే కాకుండా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసుల పై చిందులు వేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేటకు చెందిన కే.విజయ్(30), ఘట్కేసర్కు చెందిన సూర్య(28)లు గురువారం సాయంత్రం విధులు ముగించుకొని కొండాపూర్ ప్రాంతానికి వచ్చారు. కారు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ విజయ్, సూర్యలను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్దరు యువకులు నిహాల్, లోహిత్‌లుగా గుర్తించారు. మత్తులో ఉన్న వీరు పోలీసులపై తిరగబడడంతో వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటకు చెందిన లోహిత్, కొండాపూర్‌కు చెందిన నిహాల్‌రెడ్డి ఇద్దరు స్నేహితులుగా గుర్తించారు. అమెరికాలో వీరిద్దరు బీటెక్ పూర్తి చేసి ఇటీవలే నగరానికి వచ్చారు. కాగా వీరు ఇరువురు గురువారం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగి సాయంత్రం కొండాపూర్‌లోని నిహాల్ ఇంటికి వస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి వీరి ముందు బైక్‌పై వెళ్తున్న విజయ్, సూర్యల వాహనాన్ని ఢీకొట్టారు. వీరికి డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేయగా కారు నడుపుతున్న నిహాల్‌కు 234 ఎంజీ, లోహిత్‌కు 501ఎంజీ వచ్చింది. వీరు మద్యంతోపాటు మత్తు పదార్థాలను తీసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై పార్లమెంటు సభ్యుడి స్టిక్కర్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
త్వరలో 900కు పైగా ఐసీయూ పడకలు
గచ్చిబౌలి: రాష్ట్రంలో 900కు పైగా ఐసీయూ పడకలు త్వరలో అందుబాటులోకి వస్తాయని, ఇందుకోసం రూ.154 కోట్లు ఖర్చు చేయనున్నామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 27 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా సమయంలో హైదరాబాద్‌లో 1,300 పడకలను వివిధ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సర్కారు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. పిల్లల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 6 వేల పడకలతో పీడియాట్రిక్ విభాగాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రహేజా మైండ్ స్పేస్ ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో 120 బెడ్లతో ఏర్పాటు చేసిన కొత్త ఫ్లోర్‌ను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కొండాపూర్ ఆస్పత్రిలో డయాలిసిస్ యూనిట్ కేసీఆర్ కిట్ల పంపిణీని ప్రారంభించాక ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీల శాతం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం 52 శాతం డెలివరీలు సర్కారు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలిసిస్ యూనిట్లు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలోనూ త్వరలో డయాలిసిస్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో బెడ్ల ఏర్పాటుకు సహకరించిన మైండ్ స్పేస్ సీఈవోను అభినందించారు. ఆస్పత్రి మెయింటెనెన్స్‌ను కూడా మైండ్ స్పేస్ తీసుకోవాలని కోరారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల డిమాండ్ ఉన్నప్పుడు రహేజా ముందుకొచ్చిందని గుర్తు చేశారు. 100% వ్యాక్సినేషన్‌కు సహకరించాలి రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలంటే అందరూ భాగస్వాములు కావాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా నగరంలో కార్పొరేటర్లు తమ పరిధిలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ అందేలా చూడాలన్నారు. రెండు, మూడు సార్లు ఇళ్లకు వెళ్లి ఆరా తీయాలని సూచించారు. రాష్ట్రంలో రోజూ సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
Coronavirus: 500 డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్ మాయం
సాక్షి, గచ్చిబౌలి: కరోనా టీకాల్లేక జనం ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఉన్న టీకాలకు సరైన భద్రతలేక దొంగలపాలవుతున్నాయి. హైదరాబాద్‌లోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 500 డోసుల కోవాగ్జిన్ వాక్సిన్ బాక్స్ మయమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలోని డెలివరీ వార్డులో గల ఓ గదిలో వ్యాక్సిన్లను భద్రపరిచా రు. ఇటీవల ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు విరా మం ప్రకటించడంతో మిగిలిన వ్యాక్సిన్లను అదే గదిలో ఉంచారు. బుధవారం ఆ గదిని తెరిచి చూడగా కొవాగ్జిన్ 50 వయల్స్(500 డోసులు) గల బాక్స్ కనిపించలేదు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యా దు చేయగా.. దర్యాప్తు చేపట్టారు. ఆ గది ఇన్చార్జి డాక్టర్ మహేశ్‌కు కోవిడ్ రావడంతో తాళాలను మణి అనే వ్యక్తికి అప్పజెప్పారు. ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఓ వార్డ్బాయ్ వ్యాక్సిన్ ఉన్న గది వైపు వెళ్లినట్లు రికార్డు అయింది. అతను రెండు రోజులుగా ఆస్పత్రికి రావడం లేదని సమాచారం. గతంలోనూ ఓ వ్యక్తి వ్యాక్సిన్ దొంగిలించినట్లు తెలుస్తోంది. ఇంటిదొంగలే అదను చూసి వ్యాక్సిన్ మాయం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: Coronavirus: ‘లాంగ్ కోవిడ్..’ లైట్ తీస్కోవద్దు! -
Hyderabad: నగరంలో ఆక్సిజన్ సమస్యకు చెక్
సాక్షి, హైదరాబాద్( గచ్చిబౌలి): కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ దొరక్క చాలా చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రికి కోటి రూపాయల విలువ చేసే ఆక్సిజన్ ప్లాంట్ మంజూరయ్యింది. ఈ ప్లాంటు మంజూరుకు చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్య సేవల వివరాలను రంజిత్‌రెడ్డి ప్రభుత్వ వైద్యాధికారులతో మాట్లాడారు. అందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్ సమస్య తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన ఆయన ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం ఆక్సిజన్ సిలెండర్ ప్లాంట్ నిర్మాణం కోసం రంజిత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ సారథ్యంలో నడిచే భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ఉన్నతాధికారులతో చర్చించి వారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు బీడీఎల్ సంస్థ అంగీకరించింది. దీంతో ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ సమస్య ఉత్పన్నం అయ్యే ప్రసక్తే లేకుండా పోతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంటును త్వరలో ఏర్పాటు చేసేందుకు బీడీఎల్ సంస్థ ముందుకొచ్చిందన్నారు. దీంతో భవిష్యత్‌లో ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర సంస్థల సహకారంతో అవసరమైన మేరకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల కు మెరుగై న సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. – రంజిత్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ( చదవండి: కోవిడ్ బాధితుల కోసం ఉచిత ఆక్సిజన్ హబ్‌లు.. ) -
ఎయిర్ హోస్టెస్, ఏవియేషన్ సిబ్బంది ఫ్యాషన్ షో అదుర్స్
-
గోకుల్‌చాట్ యజమానికి కరోనా
సుల్తాన్‌బజార్: హైదరాబాద్‌లో పేరుపొందిన కోఠి గోకుల్‌చాట్ యజమాని (72)కి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. అధికారులు గోకుల్‌చాట్‌ను మూసివేయించడంతో పాటు 20 మంది సిబ్బందిని, కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కరోనా పా జిటివ్ వచ్చిన యజమాని ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వైద్య సిబ్బంది, పో లీసులు వివరాలు సేకరిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ సంఖ్యలోనే ప్రజలు గోకుల్‌చాట్ రుచులను ఆస్వాదిస్తుం టారు. దీంతో ఎక్కువ మంది వివరా లు సేకరించాల్సి రావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గోకుల్‌చాట్‌లో కట్లెట్, పావుబాజి, కుల్ఫీ వంటి పదార్థాలను ఎక్కువ మంది రుచిచూస్తారు. లాక్‌డౌన్‌తో మూతపడిన దుకాణం ప్ర భుత్వం సడలింపులు ఇవ్వడంతో తెరుచుకుంది. టేక్ అవే పేరుతో కట్లెట్, ఇతర స్నాక్స్ అందిస్తోంది. గోకుల్‌చాట్ యజ మానికి పాజిటివ్ రావడంతో ఇక్కడ స్నా క్స్ తిన్న వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ దుకాణంలో 40 మంది వరకు పనిచేసేవారు. కేంద్రం సడలింపులతో వారిలో చాలామంది సొంతూళ్లకు వెళ్లారు. ప్రస్తుతం సగం మందే విధులు నిర్వహిస్తున్నారు. వీరందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కలకలం గచ్చిబౌలి: కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో మరో 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 10 మంది వైద్య సిబ్బందితో పాటు ఆస్పత్రికి వచ్చిన నలుగురి శాంపిల్స్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీకి పంపించగా పాజిటివ్‌గా తేలిం ది. వీరిలో ఇద్దరు డాక్టర్లు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, సెక్షన్ ఆఫీసర్, సె క్యూరిటీ గార్డు, జూనియర్ అసిస్టెంట్, వీసీటీసీ కౌన్సిలర్, అంబులెన్స్ డ్రైవర్, ఫార్మసిస్ట్తో పాటు ఆస్పత్రికి వచ్చిన మరో నలుగురు ఉన్నారు. ఇప్పటికే సూ పరింటిండెంట్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో కేసుల సంఖ్య 15కు చేరింది. వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరాడు న్యూమోనియాతో బాధపడుతున్న మా నాన్నను మూడు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని సెంచూరీ ఆసుపత్రిలో చేర్పించాం. సోమవారం రాత్రి అక్కడి వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో మేమంతా హోం క్వారంౖ టెన్ అయ్యాం. మా దుకాణ సిబ్బందిని కూడా క్వారంటైన్లో ఉండాలని సూచించాం. లాక్డౌన్ తర్వాత నుంచి మా నాన్న బయటకు రావడం లేదు.. గోకుల్‌చాట్‌కు కూడా రాలేదు. కాబట్టి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – రాకేష్, గోకుల్‌చాట్ యజమాని కుమారుడు