సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలను విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అరెస్టు చేసింది. కొండాపూర్‌లోని శరత్ క్యాపిటల్ సిటీ మాల్ వద్ద విశాఖపట్నంవాసి అశోక్‌ను గురువారం అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 30 ఎల్‌ఎస్డీ బ్లాట్స్, 3.59 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
అశోక్ కొండాపూర్‌లో నివాసముంటున్నాడు. హైదరాబాద్‌లో రెండు డ్రగ్ కేసులు ఎదుర్కొంటున్న విశాఖవాసి మానుకొండ సత్యనారాయణ అలియాస్ సత్తి గోవాకు మకాం మార్చి అక్కడి నుంచి నగరానికి ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను తన ఏజెంట్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు ఈ కేసు విచారణలో తేలిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఒక గ్రామ్ ఎండీఎంఏను రూ.5వేలు, ఎల్‌ఎస్‌డీ బ్లాట్ రూ.2,500 ధరతో విక్రయించేందుకు ప్రయత్నించినట్టు వెల్లడించారు. దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి, సీఐ మోహన్‌బాబు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment