LSD
-
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 9 సినిమాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారంలో చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయాయి. తెలుగులో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, బిగ్‌బాస్ సోహైల్ సినిమా 'బూట్ కట్ బాలరాజు' సందడి చేయనున్నాయి. వీటితో పాటు అభినవ్ గోమటం నటించిన కిస్మత్, యశ్ పూరి చిత్రం హ్యాపీ ఎండిగ్, మరో చిత్రం గేమ్ ఆన్ కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే థియేటర్లలో ఈ వారంలో చిన్న సినిమాల హడావుడి ఉండనుంది. దీంతో ఈ వీకెండ్లో ఓటీటీ వైపు సినీ ప్రియులు చూసేస్తున్నారు. ఈ వచ్చే మూడు రోజుల్లో ఏయే సినిమాలు వస్తున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఓటీటీ సినిమాలు కూడా సిద్ధమైపోయాయి. వీటిలో పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన మిస్ ఫర్ఫెక్స్ వెబ్ సిరీస్, మరో సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎల్ఎస్డీ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అయితే వెంకటేశ్ నటించిన సైంధవ్ కూడా స్ట్రీమింగ్కు వస్తుందన్న టాక్ అయితే వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరో ఈ వీకెండ్ ఓ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేయండి. ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే నెట్‌ఫ్లిక్స్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 01 లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) - ఫిబ్రవరి 02 ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02 అమెజాన్ ప్రైమ్ డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) - ఫిబ్రవరి 02 మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 02 సైంధవ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 02 (రూమర్ డేట్) హాట్‌స్టార్ మిస్ ఫెర్ఫెక్ట్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 02 సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02 మనోరమ మ్యాక్స్ ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) - ఫిబ్రవరి 02 ఎమ్ఎక్స్ ప్లేయర్ ఎల్ఎస్డీ (తెలుగు వెబ్ సిరీస్)- ఫిబ్రవరి-2 -
డ్రగ్స్ స్వాధీనం.. ఒకరి అరెస్టు.
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలను విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అరెస్టు చేసింది. కొండాపూర్‌లోని శరత్ క్యాపిటల్ సిటీ మాల్ వద్ద విశాఖపట్నంవాసి అశోక్‌ను గురువారం అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 30 ఎల్ఎస్డీ బ్లాట్స్, 3.59 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. అశోక్ కొండాపూర్‌లో నివాసముంటున్నాడు. హైదరాబాద్‌లో రెండు డ్రగ్ కేసులు ఎదుర్కొంటున్న విశాఖవాసి మానుకొండ సత్యనారాయణ అలియాస్ సత్తి గోవాకు మకాం మార్చి అక్కడి నుంచి నగరానికి ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను తన ఏజెంట్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు ఈ కేసు విచారణలో తేలిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఒక గ్రామ్ ఎండీఎంఏను రూ.5వేలు, ఎల్ఎస్డీ బ్లాట్ రూ.2,500 ధరతో విక్రయించేందుకు ప్రయత్నించినట్టు వెల్లడించారు. దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి, సీఐ మోహన్‌బాబు, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కణుతులకు ఇంటి వైద్యం!
కొద్ది నెలలుగా పశువులకు అక్కడక్కడా లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్.ఎస్.డి.) సోకుతూ రైతులను బెంబేలెత్తిస్తోంది. ఇది క్యాప్రిపాక్స్ అనే వైరస్ కారణంగా సోకుతోంది. దోమలు, పిడుదులు, ఇతర కీటకాల ద్వారా బలహీనంగా ఉన్న పవువులకు సోకుతుంది. కలుషిత దాణా, నీరుతో పాటు.. సరిగ్గా శుభ్రం చేయిన పరికరాలతో భారీ స్థాయిలో వాక్సిన్లు వేయడం, కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కూడా ఈ అంటు వ్యాధి ప్రబలుతోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) పేర్కొంది. పశువు వంటిపైన అనేక భాగాల్లో బొబ్బలు, కణుతుల మాదిరిగా రావటం దీని ప్రధాన లక్షణం. కుంకుడు గింజ నుంచి చిన్న నిమ్మకాయ అంతటి కణుతులు వస్తాయి. వైరస్ సోకిన 4 నుంచి 14 రోజుల్లో జ్వరం, దురదలు, ముక్కులు, కళ్ల నుంచి స్రావాలు కారటం కనిపిస్తాయి. కనుగుడ్లు ఎర్రబడటం, కాంతిని చూడలేకపోవటంతో పశువు నీరసిస్తుంది. తగిన చికిత్స అందకపోతే కణుతులు పగిలి పశువును బాధిస్తాయి. మందలలో 10–20 శాతం పశువులకు ఇది సోకుతున్నట్లు గుర్తించారు. అయితే, ఈ వైరస్ బారిన పడిన పశువుల్లో తగిన చికిత్స లభించని పక్షంలో 2 నుంచి 4 శాతం చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. పశువుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకదని నిపుణులు చెబుతున్నారు. ఇది పాడి పశువులకు ఈ వైరస్ సోకితే పాల దిగుబడి తగ్గిపోతుంది. అయితే, దూడలకు ఎక్కువగా సోకుతుంది. సాధారణంగా పశువైద్యులు ఈ వ్యాధి వచ్చిన పశువులకు ఇంజక్షన్లు, యాంటిబయోటిక్స్‌తో చికిత్స చేస్తున్నారు. అయితే, కేవలం ఇంటి వైద్యంతోనే ఈ వైరస్ వ్యాధిని 4–5 రోజుల్లో సంపూర్ణంగా నయం చేయవచ్చని, పశు మరణాల సంఖ్యను కూడా బాగా తగ్గించవచ్చని పశు వైద్య నిపుణులు డాక్టర్ మల్లంపల్లి సాయి బుచ్చారావు(99122 92229) తెలిపారు. ఔషధ మొక్కల ఆకులతో చేసిన కషాయం, పైపూత లేపనంతో లంపీ స్కిన్ డిసీజ్‌ను పారదోలవచ్చని ఘంటాపథంగా చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన గోసేవకుడు రవికి చెందిన గిర్ ఆవుకు ఈ వైరస్ సోకి వంటిపైన కణుతులు వచ్చాయి. డా. సాయి బుచ్చారావు సూచన మేరకు.. ఔషధ మొక్కలతో తయారు చేసిన ద్రావణం ఆవుకు తాగించి, ఔషధ మొక్కల ఆకులు నూరి ఆవు శరీరానికి పూయటంతో నాలుగైదు రోజుల్లో ఈ జబ్బు నుంచి ఆవు పూర్తిగా కోలుకుందని రవి (90007 00020) తెలిపారు. ఈ ఫలితం చూసి తొలుత ఇంజక్షన్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారని అన్నారు. తనతోపాటు ఇతర రైతులు కూడా ఈ చికిత్సతో మంచి ఫలితాలు సాధించారన్నారు. కషాయం తయారు చేసే విధానం 100 గ్రాములు వేప ఆకులు, 100 గ్రాములు తులసి ఆకులు, 100 గ్రాములు పసుపు, 50 గ్రాములు మిరియాలను అర లీటరు (500 ఎం.ఎల్.) నీటిలో వేసి మరిగించాలి. రెండు పొంగులు వస్తే చాలు. ఇలా తయారు చేసిన 200 గ్రాముల కషాయాన్ని పశువుకు తాగించాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 3 నుంచి 5 రోజులు తాగించాలి. పైపూత మందు తయారు చేసే విధానం కలబంద ఆకుల గుజ్జు, పసుపు, గోరింటాకులను కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్దను పశువు వంటికి లేపనంగా పట్టించాలి. శరీరం అంతా రాస్తే మంచిది. ఒకవేళ వీలుకాకపోతే కణుతులు తేలిన ప్రాంతాల్లో రాసినా పర్వాలేదు. ఈ లేపనం పూయక ముందు 2 శాతం (వంద లీటర్ల నీటికి 2 కిలోల ఉప్పు) ఉప్పు ద్రావణంతో పశువును శుభ్రంగా కడగాలి. ఖర్చు లేకుండా రైతులు ఈ చికిత్స ద్వారా లంపీ స్కిన్ డిసీజ్ బారి నుంచి పశువులను కాపాడుకోవచ్చు. -
డ్రగ్స్ రాకెట్లో నలుగురు విద్యార్థుల అరెస్ట్
న్యూ ఢిల్లీ : న్యూ ఇయర్ వేడుకలకు ముందు దేశ రాజధానిలో డ్రగ్స్ రాకెట్ ముఠాతో సంబంధం ఉన్న నలుగురు విద్యార్థులను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబి) అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి 1.14 కిలోల గంజాయితో పాటు ఎల్ఎస్డీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ పంపిణీ చేయబోతున్నట్టు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. ఎన్సీబి డిప్యూటీ జనరల్ డైరక్టర్ ఎస్కె జా మాట్లాడుతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం ఇటీవల ఎక్కువ అయిందని తెలిపారు. హిమచల్ ప్రదేశ్ నుంచి వీరికి డ్రగ్స్ సరఫర అవుతున్నాయన్నారు. హిందు కాలేజీకి చెందిన గౌరవ్ ఈ రాకెట్‌ని కింగ్‌పిన్ అనే కోడ్‌తో రన్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతని నుంచి మిగిలిన ముగ్గురికి(అనిరుధ్ మాథుర్, టెన్జిన్ ఫుంచోగ్, సామ్ మల్లిక్) డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, వారు చెప్పిన వివరాల ప్రకారం మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ : నగర శివారలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న పలువురు నైజీరియన్లతో పాటు విజయవాడకు చెందిన ఓ యువతిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.50 లక్షలతో పాటు భారీగా ఎల్ఎస్డీ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో నైజీరియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నాడు. వీరందరినీ పోలీసులు రహస్యప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. కాగా ప్రేమికుల ముసుగులో గత కొంతకాలంగా వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.