
గచ్చిబౌలి: హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. మంగళవారం సాయంత్రం వేళ కొండాపూర్‌లో(Kondapur)ని గాలక్సీ అపార్ట్‌మెంట్ తొమ్మిదొవ అంతస్తులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించి తీవ్రరూపం దాల్చాయి.
అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పేలినప్పుడు ఇంట్లో ఒకరు ఉన్నట్లు సమాచారం. అయితే ఆ మహిళ బాల్కనీలో ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. ప్రధానంగా ముందు సదరు మహిళను కిందకు దింపే ప్రయత్నాలు ప్రారంభించారు.