
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలోని నగర వాసులను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన విషయం తెలిసిందే. తాజాగా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా సూపరింటెండెంట్ అధిక జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు పాజిటివ్ అని తేలడంతో అదే హాస్పిటల్‌లో ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. సూపరింటెండెంట్‌తో ప్రైమరీ కాంటాక్ట్ అయినవారి కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో హాస్పిటల్ సిబ్బంది అందరికి రంగారెడ్డి ఆరోగ్య శాఖ కరోనా టెస్టులు నిర్వహించనుంది. (‘వారిని పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు’)
Comments
Please login to add a commentAdd a comment