సాక్షి, వైఎస్సార్ జిల్లా : కొండాపురం రామచంద్ర నగర్‌లో టీడీపీ ప్రభుత్వం మరో సారి దౌర్జన్యానికి పాల్పడింది. గండికోట ముంపువాసులను అకస్మాత్తుగా హెచ్చరికలు జారీ చేసింది. కాలనీ ఖాళీ చేసీ వెళ్లాల్సిందిగా అధికారులు చాటింపు వేయించారు. ఇంకా కొన్ని గృహాలకు పరిహారం అందకుండానే నీటి నిల్వ పెంచుతున్నారు. కాలనీ సమీపంలోకి నీరు రావడంతో ఎటు వెళ్లాలో అర్థంకాక నిర్వాసితుతు బిక్కుబిక్కుమంటున్నారు. పరిహారం ఇచ్చే వరకు నీటిని నిలుపుదల చేసే వీలున్నా అధికారులు పట్టించుకోలేదు. అకాస్మాత్తుగా హెచ్చరికలు జారీచేయడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment