Gandikota project
-
పట్టం కట్టినా.. ప్రాధాన్యత ఏదీ!
‘వినేవారు లోకువైతే చెప్పేవారు చంద్రబాబు’ అనే నానుడి ఉంది. విపక్షంలో ఓ మాట..అధికారంలో మరోమాట మాట్లాడడం ఆయనకే చెల్లు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను చెప్పుకోవచ్చు. అధికారంలో ఉంటే విస్మరించడం.. లేకపోతే ప్రాజెక్టుల సందర్శనంటూ హంగామా చేయడం జిల్లా వాసులకు ఎరుకే. గండికోట ప్రాజెక్టు నిర్మాణానికి 1996, 1999 ఎన్నికలకు ముందు రెండుసార్లు శంకుస్థాపన చేయడం మినహా, ఆ ప్రాజెక్టు నిర్మాణం పట్ల చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యమే ప్రదర్శించింది. రాయలసీమలో తమకు ఓట్లు, సీట్లు ఇవ్వరని, అందుకే అభివృద్ధి చేయలేదని ప్రకటించడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, కడప: నిర్దిష్ట అభివృద్ధి సాధించే అవకాశం ఉన్నా సాగునీటి ప్రాజెక్టు పట్ల ఇదివరకు టీడీపీ సర్కార్ అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఈ మారైనా చిత్తశుద్ధితో సాగునీటి ప్రాజెక్టుల ప్రయోజనాలు కాంక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1995–2004, విభజన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2014–19లో నారా చంద్రబాబునాయుడు సాగునీటి ప్రాజెక్టుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులంటే మండిపడేవారు. నిన్నమొన్నటి వరకు 25 టీఎంసీల నిల్వకు కారణమైన గండికోట ప్రాజెక్టును ఉమ్మడి ఏపీలో నాన్ ప్రియారిటీ జాబితాలోకి చేర్చిన చరిత్రను కూడా చంద్రబాబునాయుడు మూట గట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు నీరు చేరాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ఒక్కటే మార్గమని తలచారు. అలా చేస్తేనే కాస్తో, కూస్తో రాయలసీమ ప్రాంతానికి నీరు చేరుతుందని మనస్ఫూర్తిగా నమ్మారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ సర్కార్ పెంచుతుంటే, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరావు ద్వారా అడ్డుకునే ప్రయత్నం కూడా చేపట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఈ ప్రాంత ఉన్నతికి కృషి చేస్తారంటే ఐదేళ్ల కాలం ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపెట్టారని పలువురు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు శంకుస్థాపనతో సరి... గండికోట ప్రాజెక్టుకు 1996 ఫిబ్రవరి 29న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శెట్టివారిపల్లె సమీపంలో శంకుస్థాపన చేశారు. వామికొండ వద్ద మరోమారు 1999 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశారు. తర్వాత ఆ ప్రాజెక్టు పట్ల ఏమాత్రం శ్రద్ధాసక్తులు చూపలేదు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.3213 కోట్లు వెచ్చిస్తే, తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కేవలం రూ.804 కోట్లు మాత్రమే వెచ్చించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) పరిధిలో రూ.4256 కోట్లు వ్యయం చేశారు. మరో రూ.454 కోట్లు నిర్వాసితులకు చెల్లించారు. పైగా 26.85 టీఎంసీల నీరు నిల్వ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్కే దక్కిందని పలువురు వివరిస్తున్నారు. కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళికవైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయలసీమ కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం ప్రక్రియను ప్రారంభించి వేగవంతంగా పనులు చేపట్టుతోంది. 12టీఎంసీ నీరు జీఎన్ఎస్ఎస్ ద్వారా లిఫ్ట్ చేసి చిత్తూరు అన్నయమ్య జిల్లాల్లో కరువు నివారణకు శ్రీకారం చుట్టింది. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో జంగందేవరపల్లె వద్ద నీరు కలపడం ద్వారా పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం, రాయచోటి నియోజకవర్గాలను సస్యశామలం చేసేందుకు అనువుగా మారింది. ఇలాంటి ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించి పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత చంద్రబాబు సర్కార్‌పై ఉంది. మరోవైపు జలాశయాలు ఉన్నా, వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో దక్కలేదు. డి్రస్టిబ్యూటరీ కెనాల్స్ లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. సీఎం చంద్రబాబు కోరినట్లుగా జిల్లాలో సీట్లు, ఓట్లు కూడా లభించాయి. ఈమారైనా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
రూ.100 కోట్లతో గండికోట అభివృద్ధి
బి.కొత్తకోట: వైఎస్సార్ జిల్లా గండికోటను రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) ఎండీ కె.కన్నబాబు తెలిపారు. గండికోటకు స్పెషల్ ప్రాజెక్టు కింద కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండపై అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డితో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోందని తెలిపారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా కృషి చేస్తోందని చెప్పారు. గండికోటలో చేపట్టిన రోప్ వే పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. శ్రీకాళహస్తి, లంబసింగి, పెనుగొండ, గాలికొండ, అన్నవరంలో 20 కిలో మీటర్ల మేర రోప్ వేను రూ.1,200 కోట్లతో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఒబెరాయ్ సంస్థ రూ.1,350 కోట్లతో గండికోట, తిరుపతి, పిచ్చుకలంక, హార్సిలీహిల్స్, విశాఖపట్నంలో సెవెన్ స్టార్ హోటళ్లను నిర్మించనుందని చెప్పారు. వైజాగ్ బీచ్ కారిడార్ అమలుకు ప్రణాళికలు రూపొందించామని, భోగాపురం, భీమిలిలో పర్యాటకుల కోసం సీ ప్లేన్, తొట్లకొండలో రూ.120 కోట్లతో అక్వేరియం టన్నెల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడ భవానీ ద్వీపం అభివృద్ధికి రూ.149 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. ఇంద్రకీలాద్రి నుంచి భవానీ ద్వీపం వరకు 2.5 కిలోమీటర్లు రోప్‌వే ఏర్పాటు ఈ మాస్టర్ ప్లాన్‌లో ఉందన్నారు. లంబసింగి, పాడేరులో కొత్తగా హోటళ్ల నిర్మాణం, అన్నవరంలో ఎకో రిసార్ట్‌కు చర్యలు చేపట్టామని చెప్పారు. -
నిండుకుండ.. 'గండికోట'!
సాక్షి ప్రతినిధి కడప: గండికోట ప్రాజెక్టు వరుసగా రెండో ఏడాదీ నిండుకుండలా మారనుంది. గతేడాదిలాగే ఈ ఏడాదీ ప్రాజెక్టులో 26.85 టీఎంసీల పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ పెట్టనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 23.390 టీఎంసీల నీరుంది. శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయర్ నుంచి గండికోటకు అధికారులు నీటిని విడుదల చేశారు. శనివారం ఉదయానికి నాలుగు వేల క్యూసెక్కులు చేరాయి. ముందుగా 3,000 క్యూసెక్కులు విడుదల చేసిన అధికారులు.. ఆదివారం నుంచి 5,000 క్యూసెక్కులకు పెంచనున్నారు. వారం, పది రోజుల్లోపే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ పెట్టాలన్నది లక్ష్యం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులో 12 టీఎంసీల నీటిని నిల్వ పెట్టగా, రెండో ఏడాది పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు నిల్వపెట్టింది. ఇప్పుడు మూడో ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నింపేందుకు సిద్ధమైంది. 2 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరుంటే దాని పరిధిలోని పైడిపాలెం, చిత్రావతి, వామికొండ, సర్వరాయసాగర్, మైలవరం జలాశయాలను నింపేందుకు వీలుంటుంది. 6.500 టీఎంసీల సామర్థ్యం గల మైలవరంలో ప్రస్తుతం 1.910 టీఎంసీల నీరుంది. 1.658 టీఎంసీల సామర్థ్యం గల వామికొండలో 1.377 టీంఎసీలు, 3.060 టీంఎంసీల సామర్థ్యం గల సర్వరాయసాగర్‌లో 0.638 టీఎంసీలు, 10.29 టీఎంసీల సామర్థ్యం గల చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 8.807 టీఎంసీలు, 6 టీఎంసీల సామర్థ్యం కలిగిన పైడిపాలెంలో 5.622 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వీటిని పూర్తి స్థాయిలో నింపితే వీటి పరిధిలోని రెండు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. 80 శాతానికిపైగా పునరావాస పనులు పూర్తి ఎర్రగుడి, చామలూరు, తాళ్ల ప్రొద్దుటూరు తదితర ముంపు గ్రామాల పునరావాస పనులు వేగంగా జరిగాయి. కోవిడ్ తీవ్రత కారణంగా ఇటీవల కాలంలో పనుల వేగం తగ్గింది. అయినా 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన రోడ్లు, డ్రైనేజీలు, ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. మొత్తం రూ.82 కోట్లతో ఈ పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.24.50 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం కాంట్రాక్టర్లు రూ.32 కోట్ల మేర బిల్లులు పెట్టారు. అధికారుల వద్ద రూ.24 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. సీఎఫ్ఎంఎస్(కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం) సాంకేతిక సమస్యతో నగదు విడుదల తాత్కాలికంగా నిలిచింది. ఈ మొత్తం పనులకు సంబంధించి ఇంకా రూ.52 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. బాబు హయాంలో అరకొర నిధులు, నీళ్లకు కరువు ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం గండికోటకు సంబంధించి రూ.578 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది. 2013లో మూడు టీఎంసీల నీటిని మాత్రమే ప్రాజెక్టులో నిల్వ పెట్టింది. 2014–15లో చుక్క నీరు రాలేదు. 2016లో 5, 2017లో 8, 2018లో 12 టీఎంసీల నీటిని నిల్వ పెట్టారు. లక్షలాది ఎకరాలకు నీరందించాం గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం గతేడాది గండికోటలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ పెట్టింది. దాని పరి«ధిలోని అన్ని సాగునీటి వనరులనూ నీటితో నింపి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాం. మళ్లీ తాజాగా జలాశయానికి కృష్ణా నీటిని విడుదల చేశాం. – మల్లికార్జునరెడ్డి, ఎస్ఈ, జీఎన్ఎస్ఎస్ వైఎస్సార్ హయాంలోనే నిర్మాణం గండికోట ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్సార్ 22.10.2004న శంకుస్థాపన చేశారు. తొలుత 11 టీఎంసీల సామర్థ్యంతోనే రూ.250 కోట్లతో నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత 26.85 టీఎంసీలకు సామర్థ్యాన్ని పెంచి రూ.375 కోట్లతో నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఆ తర్వాత వైఎస్ అకాల మరణంతో పునరావాసంతో పాటు పరిహార పంపిణీ నిలిచిపోయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఫేజ్–2 కింద కొండాపురం, తాళ్లప్రొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి పరిధిలోని 7,047 పీడీఎఫ్(పర్సన్ డిస్పేస్డ్ ఫ్యామిలీస్.. నిర్వాసిత కుటుంబాలు)కు సంబంధించి రూ.668.79 కోట్లు పంపిణీ చేశారు. చంద్రబాబు హయాంలో అరకొరగా డబ్బులిచ్చిన బాధితులకు సైతం పూర్తి స్థాయిలో పరిహారాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. క్యాష్ బెనిఫిట్ కోరిన వారికి పూర్తి స్థాయిలో డబ్బులిచ్చి పంపగా, మిగిలిన వారికి పునరావాసం సైతం కల్పించింది. ఫేజ్–3 కింద ఏటూరు, రేగడిపల్లె, కె.సుగుమంచిపల్లె, పి.అనంతపురం పరిధిలో 1666 పీడీఎఫ్‌లకు సంబంధించి రూ.157 కోట్ల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఈ పీడీఎఫ్‌లకు సంబంధించి చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడటంతో ఓనర్‌షిప్‌పై స్పష్టత లేదు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ నడుస్తోంది. విచారణ పూర్తవగానే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైగా పైగ్రామాల ప్రజలు గండికోట పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి 100 మీటర్ల దూరంలో ఉన్నారు. గ్రామ శివార్లలోకి గండికోట జలాలు రావడంతో వీరికీ పరిహారం ఇచ్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. -
ఇదేమి నీచ రాజకీయం!
సాక్షి, కొండాపురం: జిల్లాలో టీడీపీ తన ఉనికిని కోల్పోయిన పరిస్థితుల్లో నీచ రాజకీయాలకు తెర తీస్తోంది. గండికోట ప్రాజెక్టులో ముంపునకు గురైన నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతీ చోటు చేసుకున్న విషయం జగద్వితం. ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గండికోట ముంపు గ్రామంలో పర్యటించనుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ఇదేమి నీచ రాజకీయం అంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. 2017 లో గండికోట ప్రాజెక్టు కింద 22 గ్రామాల్లో ముంపు నిర్వాసితులను గుర్తించారు. అప్పట్లో తొలి విడత 14 గ్రామాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియ చేపట్టారు. పరిహారం చెల్లింపులో భారీగా అవినీతి చోటుచేసుకుంది. చదవండి: చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి అధికారులు, రాజకీయ నాయకులు తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి సంబంధిత అధికారి ఆర్డీఓ వినాయకంను సస్పెండ్ కూడా చేశారు. అప్పటి జాయింట్ కలెక్టర్–2 శివారెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టి అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఇప్పటికీ ఆర్డీఓ వినాయకంపై విచారణ కొనసాగుతోంది. అవినీతి అంతా టీడీపీ ప్రభుత్వ పాలనలో జరిగితే ఇప్పుడే ఏ ముఖం పెట్టుకుని నిజ నిర్ధారణ కమిటీ అని వస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. చదవండి: ఆ శాపంతోనే టీడీపీకి 23 సీట్లు: కొడాలి నాని నిజం నిర్ధారిస్తారా... గండికోట ప్రాజెక్టు కింద ముంపు పరిహారం చెల్లింపులో అవకతవకలు, అక్రమాలు అన్నీ టీడీపీ పాలనలో పాలనలో జరిగితే దాన్ని ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటకట్టేందుకు టీడీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అబద్ధాన్ని నిజం అని నమ్మించేందుకు రోజుకో డ్రామా ఆడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. గండికోట ముంపు పరిహారంలో తమ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదని కప్పి పుచ్చుకునేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు మొదలుకొని జిల్లాలోని టీడీపీ నాయకులు రోజుకో ప్రకటన చేస్తుండటం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ నేతల వ్యవహార శైలిని చూసి స్థానికులు ఇదేమి నీచ రాజకీయం అంటూ పెదవి విరుస్తున్నారు. -
వరదలో విద్యార్థులు..
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డ గురుకుల పాఠశాలను వరద నీరు చుట్టు ముట్టింది. భారీ వర్షాలు కారణంగా పాఠశాల పక్కనే ఉన్న ఏరు పొంగి ప్రవహిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి ఒకసారిగా వరద చుట్టుముట్టింది. వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను స్థానికులు కాపాడారు. అధికారులు అప్రమత్తమై.. బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థినులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గండికోట జలాశయానికి భారీగా వరదనీరు.. కడప జిల్లా: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గండికోట జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. 30 వేల క్యూసెక్కుల నీరు గండికోటకు చేరింది. మైలవరం నుండి 20 వేల క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వరద ఉధృతిపై కలెక్టర్ హరికిరణ్ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. -
ఆధునికీకరిస్తే గండికి నీరు దండి
గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీల నీటిని నిల్వ చేయాలంటే ప్రధాన కాలువను ఆధునికీకరించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పనులను తక్షణం చేపట్టకపోతే లక్ష్యం మేరకు నీరు చేరడం కష్టమని భావిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో కాలువ పనులలో సింహభాగం పూర్తయినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కనీసం పది శాతం పనుల పూర్తికి కూడా టీడీపీ ప్రభుత్వం నిధులు విదిలించలేదు. తాజాగా గండి ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన జగన్ ప్రభుత్వం కాలువ ఆధునికీకరణకు చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తోంది. తర్వాత నిధుల విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి కడప : గండికోటలో అనుకున్న మేర నీరు నిల్వ ఉంచడానికి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడానికి సర్కారు సిద్ధమవుతోంది. ఎగువన కర్నూలు జిల్లాలోని ఎస్ఆర్బీసీ (ఫ్లడ్ ఫ్లో కెనాల్) పరిధిలో కాలువ ఆధునికీకరణ పనులను పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉంది. 20 వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ప్రధాన కాలువ స్థాయి ప్రస్తుతం పది వేల క్యూసెక్కులకు పడిపోయిందంటే పరిస్థితి అర్ధమవుతుంది. 20 వేల క్యూసెక్కుల నీరు దిగువకు రావాలంటే ఎగువన పెండింగ్‌లో ఉన్న పనులను అత్యవసరంగా పూర్తి చేయాల్. అప్పుడే వరదసమయాన గండికోట ప్రాజెక్టులో అనుకున్న మేర నీరు నిలిపే అవకాశముంటుందని నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. అధికారుల నివేదిక మేరకు త్వరలోనే పెండింగ్ పనులు పూర్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో రూ.3వేల కోట్లు వెచ్చించి 80శాతం పనులను పూర్తి చేయించారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయలేకపోయింది. పెండింగ్ పనులు ఇలా.... ►ప్రధాన కాలువ పరిధిలో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి గోరకల్లు వరకూ, అక్కడి నుంచి అవుకు టన్నెల్ వరకూ కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ►బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి గోరకల్లు వరకు ప్రధాన కాలువలో కొన్ని స్ట్రక్చర్స్ వైండింగ్ పనులను చేపట్టాలి. ►కాలువ లైనిం గ్పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ►కేసీ కెనాల్ కాలువ క్రాసింగ్‌ల వద్ద స్ట్రక్చర్స్‌ను నిర్మించాలి. ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువ ఆధునికీకరణ జరగక సగం నీరు కూడా దిగువకు రావడం లేదు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 40 రోజులు మాత్రమే వరద ప్రవాహం వచ్చే కాలమని లెక్క కట్టారు. ప్రస్తుతం వరద కాలువ కాల పరిధి 20 నుంచి 30 రోజులకు తగ్గిపోయింది. రోజుకు 20 వేల క్యూసెక్కుల నీరు దిగువకు చేరితే 20 రోజుల్లో గండికోటలో 26 టీఎంసీల నీటిని నిలిపే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం పది వేల క్యూసెక్కులకు మించి నీరొచ్చే పరిస్థితి లేదు. 26 టీఎంసీల నీరు గండికోటకు చేరేందుకు నెల రోజులు పట్టే అవకాశం ఉంది. వరద కాలువ తగ్గిపోయిన నేపథ్యంలో 20 నుండి 26 టీఎంసీల నీటిని నిలపాలంటే కచ్చితంగా ఎస్ఆర్బీసీ కాలువ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు తీసుకు రావాల్సి ఉంది. అందుకే తక్షణమే ఎస్ఆర్బీసీ పరిధిలో పెండింగ్ పనులను పూర్తి చేయాల్సిన అవసరముందని గుర్తించారు. ఆధునికీకరణ పనులు ఇలా.. ప్రధాన కాలువ గోరకల్లు వరకు రూ.99 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. 26వ ప్యాకేజీలో రూ.85 కోట్ల పనులు జరగాల్సి ఉంది. అవుకు టన్నెల్స్ పూడికతీతతోపాటు మిగిలి పనులు పూర్తికి మరో రూ. 60కోట్లు అవసరం. మొత్తంగా రూ. 244 కోట్లు అవసరమని భావిస్తున్నారు. కరువుతో అల్లాడుతున్న మన జిల్లా రైతాంగం బాధలు తొలగించేందుకు సిద్దమైన ప్రభుత్వం గండికోటపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది 20 టీఎంసీలు, వచ్చే ఏడాది 26 టీఎంసీల నీటిని నిల్వ చేసి సాగుకు అందించాలని కంకణం కట్టుకుందిది. వరద సమయంలో సకాలంలో జిల్లాకు నీరు తీసుకువచ్చేందుకు ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువలో పెడింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ పనులుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అధికారులు అందించినట్లు సమాచారం. -
ఖాళీ చేయాల్సిందిగా దండోరా.. ఉత్కంఠ..!
సాక్షి ప్రతినిధి, కడప : గండికోట నిర్వాసితుల్లో ఉత్కంఠ తీవ్రమైంది. ఏడాదిగా కపట నిద్రలో ఉన్న అధికార యంత్రాంగం హఠాత్తు పరిణామానికి వారు భీతిల్లిపోతున్నారు. గంట గంటకు నీరు పెరిగే అవకాశం ఉంది. కొండాపురం మండలంలోని రామచంద్రనగర్‌ను ఖాళీ చేయాలంటూ డండోరా వేయించారు. ఉన్నట్లుండీ గ్రామాలు ఖాళీ చేసి ఎక్కడికెళ్లాలంటూ బాధితులు నిలదీస్తున్నా.. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోతున్నారు. పైగా మీ ఇష్టమంటూ రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. పాలకులు త్యాగధనుల పాలిట కర్కశ వైఖరి ప్రదర్శిస్తున్నారు. గండికోట నిర్వాసితుల పట్ల ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి లోపించింది. ఏడాదిగా ముంపు పునరావాస పరిహారం చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. ఏడాదిగా వారి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్కమారుగా ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి పెంచారు. గండికోటకు నీరు నిల్వ చేస్తున్నాం. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందేనని నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారు. పునరావాసం ఏర్పాటు చేయలేదు. పరిహారం చెక్కులు చెల్లింపుల్లేవు, ఎక్కడికి వెళ్లాలి.. ఎలా వెళ్లాలి... చెట్టు నీడనా తలదాచుకోవడం సాధ్యమేనా అంటూ కనీస ప్రశ్నలు సంధించినా.. జవాబు చెప్పే ఓపిక అధికారులకు ఏమాత్రం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై ముంపు బాధితులు మండిపడుతున్నారు. ఎందుకు తమ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నరెవెన్యూ యంత్రాంగం ముంపు వాసులను ఖాళీ చేయించడంలో రెవెన్యూ యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్వచ్ఛందంగా గ్రామాన్ని ఖాళీ చేస్తున్నట్లుగా అఫడవిట్ తయారు చేసి, అందులో సంతకాలు చేసిన తర్వాతే పరిహారం చెక్కు అందిస్తున్నారు. చెక్కు పుచ్చుకున్న వారి ఇళ్లు తక్షణమే కూలుస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి ఆది, ఎమ్మెల్సీ పీఆర్ వర్గీయులు అధికారులకు వత్తాసుగా నిలుస్తున్నారు. ముందుగా మా ఇళ్లు కూల్చాల్సిందిగా వారు వ్యూహాత్మకంగా ముందుకు వచ్చారని పలువురు వివరిస్తున్నారు. అఫిడవిట్ రాయించుకొని మరీ ఇళ్లు కూల్చడం వెనుక రెవెన్యూ అధికారుల ముందస్తు వ్యూహం దాగి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ముంపు వాసులను ఖాళీ చేయించాలి, ప్రాజెక్టులో నీరు నిల్వ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో పరిహారం అందజేసి ఉండాల్సి ఉందని పలువురు వివరిస్తున్నారు. కేవలం పులివెందులకు నీళ్లు ఇచ్చాం...అని చెప్పుకునేందుకు నిర్వాసితుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించాలా.. అంటూ ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఆవేదనలో రామచంద్రనగర్ వాసులు గండికోట ప్రాజెక్టులో ప్రస్తుతం 8.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కొండాపురం పరిధిలోని రామచంద్రనగర్‌ను గండికోట బ్యాక్ వాటర్ చుట్టుముట్టాయి. బుధవారం ఉదయం 10 గంటలకు గ్రామాన్ని ఖాళీ చేయించాల్సిందిగా రెవెన్యూ యంత్రాంగం మంగళవారం దండోరా వేయిం చింది. ఈ పరిస్థితుల్లో రామచంద్రనగర్ వాసుల్లో ఆవేదన, అలజడి రేగుతోంది. ‘ఉన్నట్లుండీ ఎక్కడికి వెళ్లాలి.. ఇంటి సామగ్రి ఎక్కడ ఉంచుకోవాలి... నడిరోడ్డుపై ఎలా ఉండగలం’.. ఇలాంటి ప్రశ్నలతో మథన పడుతున్నారు. అంతగా ఆవేదన చెందుతున్నా.. బాధ్యతాయుతమైన స్థానంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ పరిస్థితిపై తాము సమాజంలో ఉన్నామా.. లేదా.. అనే అనుమానం రేకెత్తుతోందని ఆ గ్రామ వాసి చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో విధి నిర్వహణలో ఉన్న తాను తన కుటుంబాన్ని ఉన్నట్లుండీ ఎక్కడికీ తరలించాలని సాక్షి ప్రతినిధితో తన ఆవేదన పంచుకున్నారు. ఇదే విషయమై అధికారులను వాకబు చేస్తే వారి నుంచి సమాధానమే లేదని, పైగా తహశీల్దార్ వితండవాదం చేయవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తాము ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేందుకు ఏమాత్రం అడ్డంకీగా లేమని, కాకపోతే గడువు ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయాలంటూ ఆయన వాపోవడం గమనార్హం. -
గండికోట ముంపువాసులపై ప్రభుత్వ దౌర్జన్యం
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కొండాపురం రామచంద్ర నగర్లో టీడీపీ ప్రభుత్వం మరో సారి దౌర్జన్యానికి పాల్పడింది. గండికోట ముంపువాసులను అకస్మాత్తుగా హెచ్చరికలు జారీ చేసింది. కాలనీ ఖాళీ చేసీ వెళ్లాల్సిందిగా అధికారులు చాటింపు వేయించారు. ఇంకా కొన్ని గృహాలకు పరిహారం అందకుండానే నీటి నిల్వ పెంచుతున్నారు. కాలనీ సమీపంలోకి నీరు రావడంతో ఎటు వెళ్లాలో అర్థంకాక నిర్వాసితుతు బిక్కుబిక్కుమంటున్నారు. పరిహారం ఇచ్చే వరకు నీటిని నిలుపుదల చేసే వీలున్నా అధికారులు పట్టించుకోలేదు. అకాస్మాత్తుగా హెచ్చరికలు జారీచేయడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. -
గండికోటకు పదివేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి
కడప కార్పొరేషన్: గండికోట ప్రాజెక్టుకు ఎస్ఆర్బీసీ నుంచి అవుకు, గోరకల్లు ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంట రీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోతీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, సెప్టెంబర్ మాసం వచ్చినా 10 నియోజకవర్గాలు, 51 మండలాల్లో ఎక్కడా పదును వర్షం కూడా పడలేదన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు తుంగభద్ర, జూరాల ద్వారా శ్రీశైలంకు వరదనీరు వచ్చిందని, నాగార్జున సాగర్ నిండటం వల్ల నిన్ననే గేట్లు కూడా ఎత్తారని, సోమశిల ప్రాజెక్టు కూడా నిండిందన్నారు. అన్ని ప్రాజెక్టులు నిండినా ప్రభుత్వం జిల్లాకు నీరివ్వకుండా నిర్లక్ష్యం చూపుతోం దని ఆరోపించారు. ఎస్ఆర్బీసీ ద్వారా 2వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారని, ఆ నీటితో గండికోట ఎప్పుడు నిండుతుందని ప్రశ్నించారు. జిల్లాకు గుండె కాయలాంటి గండికోటకు పదివేల క్యూసెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గండికోట నిండితేనే వామికొండ, సర్వరాయసాగర్, మైలవరం, చిత్రావతి, పైడిపాళెం ప్రాజెక్టులకు నీరు, ప్రొద్దుటూరుకు తాగునీరు అందుతాయన్నారు. వరద కేవలం 30–40రోజులే ఉంటుందని, ఆ సమయంలో నీటిని తెచ్చుకోకపోతే ఏడాదంతా ఏం చేయాలని నిలదీశారు. వరద అయిపోకముందే, శ్రీశైలంలో నీటిమట్టం పడిపోక ముందే గండికోటకు నీరివ్వాలని అన్నా రు. వెలుగోడుకు 12వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే కేవలం 4వేల క్యూసెక్కులు తెలుగుగంగకు వదులుతున్నారన్నారు. మన జిల్లాకు 600 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయన్నారు. వెలుగోడు వద్ద బలహీనంగా ఉన్న 0–18 కీ.మీ కాలువకు మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ శాఖా మంత్రికి అనేకసార్లు విన్నవించినా, ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఇప్పటికైనా ఆ పనులు చేపట్టాలని కోరారు. ఉక్కు పరిశ్రమపైఉలుకూ, పలుకూ లేని ప్రభుత్వం జూన్ 30న ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి రెండు నెలల్లో కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే తామే ఏర్పాటు చేస్తామని చెప్పారని, రెండు నెలలు పూర్తయినా సీఎం ఉలుకూ, పలుకూ లేకుండా ఉన్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఫుడ్‌పార్కు, హార్టికల్చర్ హబ్, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజ మెత్తారు. ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్ ప్రచారార్భాటంతోనే నిరవధిక నిరాహార దీక్ష చేశారని విమర్శించారు. దీక్షకు ముందుగానీ, తర్వాతగానీ ఆయన ఏనాడు ఉక్కు పరిశ్రమపై మాట్లాడలేదన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేయలేకపోతోందన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కూడా దాన్ని సాధించలేదని, ఇ ప్పుడైనా మొద్దునిద్ర నుంచి మేల్కొనా లని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఎస్.యానాదయ్య, చీర్ల సురేష్‌యాదవ్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాదయాత్ర
కడప:గండికోట ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి సర్వరాయసాగర్ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈయన పాదయాత్రకు కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్‌బాబులు సంఘీభావం తెలిపారు. ప్రాజెక్టు నుంచి మూడు రోజులపాటు పాదయాత్ర కొనసాగనున్నది. ఇతర జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు నీళ్ల కోసం పోరాడుతుంటే ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులే అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర ముగిసేలోగా నీటిని విడుదల చేయకపోతే కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపడతామని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. -
గండికోటకు నీరు విడుదల
సాక్షి, కర్నూలు: రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి గండికోట ప్రాజెక్టుకు గురువారం నీటిని విడుదల చేశారు. జిల్లాలో గల అవుకు రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని వైఎస్సార్ జిల్లాలోగల గండికోట ప్రాజెక్టుకు విడుదల చేశారు. రెండు రోజులుగా కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ మధ్య తరహా ప్రాజెక్టులు కూడా నిండాయి. కాగా... అవుకు రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు వస్తున్న దృష్ట్యా 1000 క్యూసెక్కుల నీటిని గండికోట ప్రాజెక్టుకు విడుదల చేశారు. -
గండికోట కేసు సీఐడీకి అప్పగింత
సాక్షి ప్రతినిధి, కడప : గండికోట ముంపు గ్రామాలకు చెల్లించే పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలకు ఆర్డీఓ వినాయకం సూత్రధారిగా తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసింది. రూ.479 కోట్ల పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలపై లోతైన విచారణ చేయడం కోసం కేసును సీఐడీకి అప్పగించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అవినీతిలో భాగస్వామ్యులైన రెవెన్యూ అధికారులు, బోగస్ లబ్ధిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమైంది. గండికోట ముంపు గ్రామాలకు పరిహారం పంపిణీ చేపట్టింది. ఇందులో రూ. 75 కోట్ల పరిహారం చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకోవడంతోపాటు ఇందుకు రెవెన్యూశాఖలోని అధికారులు పూర్తి సహకారం అందించారు. దీనిపై సాక్షి దినపత్రికలో వరుస కథనాలు రావడంతో స్పందిం చిన కలెక్టర్ బాబూరావునాయుడు జేసీ–2 శివారెడ్డి నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఆ మేరకు జేసీ–2 శివారెడ్డి, అధికారుల బృందం పరిహా రానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. పరిశీలనలో దాదాపు రూ. 7 కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకున్నాయని, గ్రామాల్లో లేని వారికి, అనర్హులైన వారికి, బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన వారికి పరిహారం చెక్కులు అధికారులు అందించారని తేలింది. ఈ నివేదికను జేసీ–2 కలెక్టర్‌కు సమర్పించారు. దీంతో సమగ్ర విచారణ నివేదికను కలెక్టర్ బాబూరావునాయుడు ప్రభుత్వానికి నివేదించారు. నివేదిక అందగానే దానిని ప్రభుత్వం తగు చర్యలకు ఉపక్రమించి ఆర్డీఓ వినాయకంను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ అక్రమాలతో సంబంధం ఉన్న రెవెన్యూశాఖలోని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో వంద మంది పరిహారం పొందిన అనర్హులైన వారిపై ఆర్ఆర్ యాక్టు కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి పొందిన పరి హారం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా రూ. 5 కోట్ల చెక్కులను పంపిణీ చేయకుండా నిలిపి వేశారు. ఆర్డీఓ వినాయకం సస్పెన్షన్ నుంచి తప్పించుకునేందుకు అమరావతిలోని సచివాల -
నకి‘లీలలు’
► పరిహారం అర్జీలలో కొత్త కోణం ► ముంపు వాసులకు దొంగ పత్రాలు ఇస్తూ దోచుకుంటున్న సిబ్బంది ► విచారణలో బయట పడుతున్న దొంగ పెళ్లి పత్రికలు ► పాఠశాలల్లో పేర్లు లేకపోయినా ఉన్నట్లుగా పత్రాలు సృష్టి ► ఒక్కో పత్రానికి రూ.5 వేలకు పైగానే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎర్రగుంట్ల: గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్థిక సామాజిక విచారణ సర్వేలో అధికారులకు వింత అనుభవం ఎదురైంది. ముంపు వాసులు పెట్టుకున్న అర్జీలలో కొన్ని నకిలీ పత్రాలు.. వారికి చుక్కలు చూపెడుతున్నాయి. పరిహారం కోసం స్థానిక ప్రభుత్వ సిబ్బందే అడ్డదారులు తొక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు గ్రామస్తుల చేత వివాహం అయినట్టుగా పెళ్లి పత్రికలు కొట్టించి, అందులో తేదీలను, సంవత్సరాన్ని, ముహూర్తం సమయాన్ని మార్చి నకిలీ పత్రాలను సృష్టించి అర్జీలు పెట్టించిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ అక్రమ వ్యవహారం వెనుక కొందరు అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు గురువారం ఎర్రగుంట్ల రెవెన్యూ కార్యలయంలో తహసీల్దార్ సమక్షంలో వీఆర్ఓలు విచారణ చేపట్టారు. కొండాపురంలోని అధికారులు కొందరి వద్ద నజరానాలు తీసుకుని నకిలీ పత్రాలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కొక్క నకిలీ పత్రానికి రూ.5 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. వెలుగుచూస్తున్న వాస్తవాలు గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామమైన కొండాపురం మండలంలోని చౌటిపల్లికి చెందిన ముంపు వాసులకు.. ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు ఆధారాలు సమర్పించాలని అధికారులు తెలిపారు. అంటే 2007 జనవరి 1 నుంచి విచారణ చేసే మధ్య కాలంలో కనీసం నాలుగేళ్లు ఆ గ్రామంలో నివాసమున్నట్లు.. అప్పటి రేషన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్‌కార్డు, ఉపాధి హమీ జాబ్‌కార్డు, పెన్షన్ కార్డు పుస్తకం, బ్యాంకు పాసుబుక్, పోస్టల్ పుస్తకం, గ్యాస్ కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టులు తదితర ఆధారాలు సమర్పించాలని కోరారు. అలాగే 2007 జనవరి 1కి ముందే వివాహం అయిన వారు అర్హులు కారని తెలిపారు. 2007 జనవరి 1 తర్వాత వివాహం అయిన వారు మ్యారేజ్ సర్టిఫికెట్, లేదా పెళ్లి ఆధారాలు అందజేయాలని పేర్కొన్నారు. 160 అర్జీలకు ఆధారాలు లేవు ఇలా చౌటిపల్లి నుంచి వచ్చిన 160 అర్జీలకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. తర్వాత కొన్ని అర్జీలకు ఆధారాలు జోడించి ముంపు వాసులు ఇచ్చారని వారు పేర్కొన్నారు. వీటిలో పెళ్లి అయినట్టుగా 15 అర్జీలు, పాఠశాలలో చదివినట్టుగా 60 అర్జీలు వచ్చాయి. విచారణ చేపట్టగా వీటిలో పెళ్లి పత్రికలు నకిలీవిగా గుర్తించినట్లు తహసీల్దార్ మహేశ్వరరెడ్డి తెలిపారు. పెళ్లి పత్రికలలో తేదీలు, సంవత్సరాలు.. వారి వయసు మధ్య చాలా వ్యత్యాసం ఉందని, అంతేకాక కల్యాణ మండపాలకు పోయి విచారణ చేస్తే అక్కడ ఈ తేదీలలో ఏ పెళ్లి జరగలేదని రికార్డుల్లో ఉందన్నారు. అలాగే ఆయా పాఠశాలలో విచారణ చేస్తే అక్కడ కూడా వారి పేర్లు లేవని, అదే విధంగా కొన్ని స్కూల్స్ కూడా లేవని విచారణలో తేలిందన్నారు. విచారణ పక్కగా చేస్తున్నాం ముంపువాసులు నుంచి వచ్చిన అర్జీలపై విచారణను కచ్చితంగా చేస్తున్నాం. పెళ్లి అయినట్టుగా 15 అర్జీలు రాగా, అవన్నీ నకిలీవని తేలిపోయింది. అలాగే పాఠశాలల్లో చదివిన సర్టిఫికెట్లపై విచారణ చేస్తే వారి పేర్లు లేవు. ప్రభుత్వ నిబంధనల మేరకు విచారణను సాంకేతిక పద్ధతిలో చేస్తున్నాం. –బీ మహేశ్వరరెడ్డి, తహసీల్దార్, ఎర్రగుంట్ల -
మా గ్రామాల్లో సర్వే వద్దు
కొండాపురం: గండికోట ప్రాజెక్టు కింద కొండాపురం మండలంలో రెండో విడత ముంపు గ్రామాలైన యర్రగుడి, చామలూరు, తాళ్లప్రొద్దుటూరు గ్రామాల్లో సామాజిక, ఆర్థిక సర్వే చేసేందుకు వెళ్లిన తహసీల్దార్ల బృందాన్ని ఆయా గ్రామాల నిర్వాసితులు అడ్డుకున్నారు. 11 మంది తహసీల్దార్లతో కూడిన బృందం సోమవారం జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకం, ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ నాగేశ్వర్రావుల ఆధ్వర్యంలో ముంపు గ్రామాలకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వినాయకం మాట్లాడుతూ గ్రామాల్లో సామాజిక సర్వే చేస్తే ఎంత మంది నిర్వాసితులు ఉన్నారనేది జాబితా వస్తుందని, ఆ తర్వాత ఇక్కడి సమస్యలపై కలెక్టర్‌కు నివేదిక పంపుతామని, సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరగా తమకు పరిహారంపై హామీ ఇచ్చేంత వరకు గ్రామాల్లో సర్వే చేయొద్దని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముందు తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతనే సర్వే చేయాలంటూ నిర్వాసితులు తాళ్లప్రొద్దుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉన్న రెవెన్యూ బృందాన్ని అడ్డుకున్నారు. ప్రాజెక్టు కింద మొదటి గ్రామాలకు కటాఫ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి 01–01–2007 వరకు చనిపోయిన వారికి, వివాహమైన ఆడ పిల్లలకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. తల్లి దండ్రులకు రేషన్ కార్డు ఉండి అందులో అనివార్య కారణాల వల్ల పిల్లల పేర్లు లేని వారికి కూడా ప్యాకేజి వర్తింపజేయాలన్నారు. తమ గ్రామాల్లో సామాజిక సర్వే ఎప్పుడు చేస్తారో అప్పటినుంచి కటాఫ్ డేట్ ను ప్రకటించాలన్నారు. రేషన్ కార్డు లేదా, ఆధార్‌కార్డు లేదా ఓటరు కార్డులలో ఏవి ఉన్నా వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని కోరారు. రెండో విడత ముంపు గ్రామాల్లోకి కలెక్టర్ రావాలి గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన తాళ్లప్రొద్దుటూరు, యర్రగుడి, చామలూరు గ్రామాల్లో రెండో విడత సర్వే చేయాలంటే తొలుత జిల్లా కలెక్టర్ బాబురావునాయుడు తమ గ్రామాల్లో పర్యటించాలని పట్టుబట్టారు. అంతవరకు తాము సర్వేకు సహకరించేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకం జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయకు ఫోన్ చేసి నిర్వాసితులు సర్వేకు సహకరించడం లేదని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మూడు గ్రామాల్లో ఉన్న పెద్దలతో చర్చించారు. చివరకు కలెక్టర్‌కు తమ సమస్యలను వివరిస్తామని అందుకు అధికారులు సహకరించాలని గ్రామస్తులు కోరగా విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్లో నిర్వాసితులతో సమావేశం ఉంటుందని హాజరు కావాలని ఆర్డీఓ వినాయకం చెప్పడంతో నిర్వాసితులు శాంతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొండాపురం సీఐ రవిబాబు, కొండాపురం ఎస్ఐ శివప్రసాద్‌రెడ్డి, తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ కృష్ణయ్య పర్యవేక్షించారు -
హర్షవర్థన్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. గండికోట ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రిని నిర్లక్ష్యం చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ శుక్రవారం వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లెలో ఆత్మహత్య చేసుకున్న హర్షవర్థన్ రెడ్డి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. హర్షవర్థన్ రెడ్డి కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గండికోట ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే హర్షవర్థన్ రెడ్డి ఆత్మహత్య జరిగి ఉండేది కాదన్నారు. రైతులకు 2014 నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని, ఇన్సురెన్స్ బకాయిలు కూడా అలాగే ఉన్నాయన్నారు. ఇప్పుడు ఇన్సురెన్స్ ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వొద్దని చంద్రబాబు ఆదేశించారని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. త్వరలోనే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రైతుల కష్టాలు తీరుతాయని వైఎస్ జగన్ అన్నారు. కాగా అప్పుల బాధతో హర్షవర్థన్ రెడ్డి ఈ నెల 4వ తేదీని పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో ఉన్న వైఎస్ జగన్‌ను అంతకు ముందు చేనేత రంగ కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో తమ గోడు వెల్లబోసుకున్నారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ... చేనేత రంగంపై జీఎస్టీతో ఆ రంగం మరింత కుదేలయ్యే ప్రమాదముందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా...జీఎస్టీ నుంచి చేనేత రంగాన్ని మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. ఇదే విషయమై తక్షణమే లేఖ రాయబోతున్నామని తెలిపారు. చేనేత రంగం సంక్షేమం దృష్ట్యా...... కనీసం దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడకపోవడం దారుణమన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి యనమల రామకృష్ణుడు మెంబర్‌గా ఉండి కూడా.... వారి సమస్యలను ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. -
నీళ్ల సాక్షిగా నిజాలకు పాతర
‘పైడిపాలెం’ జాతికి అంకితం చేస్తూ సీఎం పచ్చి అబద్ధాలు ♦ అసాధ్యమనుకున్న ప్రాజెక్టును సుసాధ్యం చేశామని గొప్పలు ♦ 2019లో పోలవరం జాతికి అంకితం చేస్తాం..సీఎం తీరుపై విస్తుపోయిన రైతులు ♦ దివంగత వైఎస్ హయాంలో దాదాపు పూర్తి అయిన ప్రాజెక్టులను బాబు ప్రారంభిస్తున్నారని మండిపాటు సాక్షి ప్రతినిధి, కడప: అసాధ్యమనుకున్న ప్రాజెక్టును పూర్తి చేసి చరిత్ర తిరగరాశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బుధవారం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని గండికోట ఎత్తిపోతల పథకాన్ని రిమోట్ ద్యారా ప్రారంభించి, పైడిపాలెం రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం జన్మభూమి–మా ఊరు గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను పూర్తి చేయడమే తన లక్ష్యం అన్నారు. గండికోట ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన ఈ రోజు తన జీవితంలో గుర్తుండిపోతుందన్నారు. పులివెందుల నియోజకవర్గానికి నీళ్లివ్వడం తనకు సంతోషంగా ఉందన్నారు. సోమవారం నా డైరీలో పోలవరం డేగా మార్చుకున్నానని, ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నామన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసేందుకు ప్రణాళిక చేపట్టామని, 2019లో జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు నీళ్ల సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడటంపై రైతులు విస్తుపోయారు. ప్రతిపక్ష నేతపై తీవ్ర విమర్శలు చేయిస్తూ, ఎంపీ అవినాశ్ రెడ్డి మాట్లాడుతుంటే అడ్డంకులు సృష్టిస్తూ అంతా తన ఘనతేనని చాటుకోవడాన్ని చూసి ఔరా.. అనుకుంటూ జనం ముక్కున వేలేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులకు తుది మెరుగులు దిద్ది.. తానే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని వాపోయారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించామని, నాబార్డు ద్వారా రూ.1,981కోట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందజేసిందని సీఎం చంద్రబాబు చెప్పగానే.. విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా, కమీషన్ల కోసం పట్టుబట్టి చేజిక్కించుకున్న విషయం చర్చనీయాంశమైంది. పట్టిసీమ పథకాన్ని 12 నెలల్లోగా పూర్తి చేసి గోదావరి– కృష్ణా నదులను అనుసంధానం చేశామని, దేశంలో ఇదే ప్రథమం అన్న చంద్రబాబు మాటలు విన్న అధికారులు.. 1868లోనే డచ్ దేశానికి చెందిన ప్రైవేట్ సంస్థ కేసీ కెనాల్ తవ్వి తుంగభద్ర– పెన్నా నదులను అనుసంధానం చేసిందని మాట్లాడుకోవడం వినిపించింది. కృష్ణానీటిని శ్రీశైలంలో నిల్వ చేసి రాయలసీమకు అందించగలిగామని ముఖ్యమంత్రి చెప్పడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వైఎస్ హయాంలో దాదాపు పూర్తి అయిన కాలువలకు చిన్న చిన్న పెండింగ్ పనులు పూర్తి చేసి ఉంటే దాదాపు 26 టీఎంసీల నీరు గండికోటకు తరలించే అవకాశం ఉండిందనే వ్యాఖ్యలు వినిపించాయి. అలా చేయకుండా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా కేవలం 4.8 టీఎంసీలను అతి కష్టంగా తీసుకొస్తూ గొప్పలు చెప్పకుంటున్నారని రైతులు మండిపడ్డారు. 2013లోనే ఇదే రీతిలో 3 టీఎంసీల నీటిని తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. జన్మభూమిలో ఏకపాత్రాభినయం జన్మభూమి–మాఊరు కార్యక్రమం మొత్తం చంద్రబాబు ఏకపాత్రాభినయాన్ని తలపించింది. ప్రజాస్వామ్యానికి తావులేదన్నట్లుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను విస్మరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి దోహదపడిన వ్యక్తులంటూ మంత్రి ఉమామహేశ్వరరావు, ఇతర టీడీపీ నేతలతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విమర్శలు చేయించి పొంగిపోయారు. అవకాశం దొరికిందే తడువుగా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు సాగించారు. వారందరికీ వ్యాఖ్యాత తరహాలో వ్యవహరిస్తూ సీఎం ఆనంద పడటం చూసి సభకు హాజరైన జనం విస్తుపోయారు. ఇదే సమయంలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ పేరు ప్రస్తావించగానే జనం నుంచి ఒక్కసారిగా ఈలలు, కేకలు వినిపించాయి. జన్మభూమి–మాఊరు కార్యక్రమం ఆధ్యంతం టీడీపీ కార్యక్రమంలా నిర్వహించారు. టీడీపీ నేతలు వేదికను ఆక్రమిస్తే.. కలెక్టర్ కేవీ సత్యనారాయణ, జేసీ శ్వేత తేవతియా, ఆర్డీఓ వినాయకం లాంటి అధికారులంతా నిల్చోవాల్సి వచ్చింది. ముచ్చుమర్రీ ఆయన ఘనతేనట! రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రాణనాడీ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా జీఎన్ఎస్ఎస్కు డ్రా చేసుకోవచ్చని, 834 అడుగుల స్థాయిలో హెచ్ఎన్ఎస్ఎస్కు లిఫ్ట్ చేసు కోవచ్చని, 798 అడుగులున్నా ముచ్చ మర్రి నుంచి లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంద చెప్పుకొస్తూ.. ఇదంతా తన ఘన తే అని చాటుకున్నారు. వాస్తవ మేమి టంటే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఆగస్టు 31, 2007న దివంగత సీఎం వైఎస్ హయాంలో ప్రారంభమైంది. అప్పట్లోనే దాదాపు 90 శాతం పూర్తి అయింది. మిగతా 10 శాతం పనులను కూడా సక్రమంగా పూర్తి చేయకుండానే చంద్రబాబు జాతికి అంకితం చేస్తూ గొప్పలకుపోయారు. -
‘ముంపు వాసులకు న్యాయం చేయాలి’
కడప : గండికోట ముంపువాసుల పునరావాస కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రేపు (శనివారం) జరిగే కేబినెట్ సమావేశంలో ముంపువాసులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. చవటపల్లిలో నీరు చేరిన ఇళ్లను అవినాష్ రెడ్డితో పాటు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ... నిర్వాసితులకు న్యాయం చేయకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా గండికోట ప్రాజెక్టు ముంపు వాసులకు తక్షణమే పరిహారం అందించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. నిర్వాసితుల్ని పరామర్శించేందుకు వెళుతున్న పార్టీ నేతలను కూడా మధ్యలోనే పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా గండికోట రిజర్వాయరులో ముంపునకు గురయ్యే ఆరు గ్రామాల్లో చవటపల్లె మొదటిది. గత రెండు నెలల నుంచి అవుకు రిజర్వాయరు నుంచి గండికోటకు నీరు వచ్చి చేరుతోంది. ఆర్ అండ్ ఆర్ ప్రకారం పరిహారం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ అంగీకరించింది. అయితే, గ్రామంలోని ఇళ్ల చుట్టూ నీరు చేరుతున్నా పరిహారంపై ఉలుకూపలుకూ లేకపోవటంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమకు పరిహారం ఇస్తే సంతోషంగా ఇళ్లు ఖాళీ చేసి, వెళ్లిపోతామని.. లేకుంటే తాము మునిగినా సరే కదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. రోడ్డుపైనే వంటావార్పూ చేపట్టారు. నాలుగు రోజులుగా నిర్వాసితుల ఆందోళను కొనసాగుతోంది. అయితే వారిని పరామర్శించేందుకు కూడా అధిరానేలే అటువైపు వెళ్లేందుకు కూడా సాహసం చేయడం లేదు. ఈ పరిణామం నిర్వాసితుల్లో మరింత పట్టుదలను పెంచుతోండడం విశేషం. -
గండికోట వాసుల పోరాటం
-
రెండోరోజుకు చేరిన గండికోట నిర్వాసితుల ధర్నా
-
రెండోరోజుకు చేరిన గండికోట నిర్వాసితుల ధర్నా
కొండాపురం: వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం చవటపల్లె గ్రామస్తుల ఆందోళన కొనసాగుతోంది. పరిహారం ఇప్పిస్తే సంతోషంగా ఇళ్లు ఖాళీ చేస్తాం.. లేని పక్షంలో నీళ్లలో మునిగినా సరే అక్కడినుంచి కదిలేది తమని స్పష్టం చేశారు. తమకు న్యాయమైన పరిహారం ఇవ్వకుంటే కదిలేది లేదంటూ వారు మంగళవారం ఉదయం నుంచి కడప-తాడిపత్రి జాతీయరహదారిపై చేపట్టిన ధర్నా.. నేడు కొనసాగుతోంది. గండికోట రిజర్వాయరులో ముంపునకు గురయ్యే ఆరు గ్రామాల్లో చవటపల్లె మొదటిది. గత రెండు నెలల నుంచి అవుకు రిజర్వాయరు నుంచి గండికోటకు నీరు వచ్చి చేరుతోంది. ఆర్ అండ్ ఆర్ ప్రకారం పరిహారం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ అంగీకరించింది. అయితే, గ్రామంలోని ఇళ్ల చుట్టూ నీరు చేరుతున్నా పరిహారంపై ఉలుకూపలుకూ లేకపోవటంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమకు పరిహారం ఇస్తే సంతోషంగా ఇళ్లు ఖాళీ చేసి, వెళ్లిపోతామని.. లేకుంటే తాము మునిగినా సరే కదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. రోడ్డుపైనే వంటావార్పూ చేపట్టారు. రాత్రి సమయమంతా అక్కడే గడిపారు. బుధవారం ఉదయం కూడా రోడ్డుపైనే తమ ధర్నా కొనసాగిస్తున్నారు. -
చంద్రబాబుకు ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ
కడప: గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. గాలేరి-నగరి సుజల స్రవంతి పథకంలో భాగమైన గండికోట ప్రాజెక్టు నిర్మాణం వల్ల చౌటుపల్లి గ్రామం ముంపునకు గురవుతుందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తన లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన మినహా ఆ ప్రాజెక్టు సాధనలో టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించలేదని గతంలోనూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం
రాయలసీమలో కరువు కరాళనృత్యం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరరావు చెప్పారు. రాయలసీమ కరువు, ప్రాజెక్టులపై సీమకు చెందిన భారతీయ జనతాపార్టీ నేతలు కడపలో ఆదివారం సమావేశమయ్యారు. కరువు, సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్బంగాబీజేపీ ఉపాధ్యక్షుడు కపిలేశ్వరరావు, బీజేపీ మహిళా నేత శాంతారెడ్డి మాట్లాడుతూ వలసలను ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాలమూరు-దిండి ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీమ ప్రాజెక్టులపై సర్కార్ శ్వేతపత్రం విడుదలచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరువుపై కైంద్ర ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని వారు ఆరోపించారు. పట్టిసీమను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసిన సర్కార్ గండికోట, హంద్రీ-నీవా పథకాలను ఎందుకు పూర్తి చేయట్లేదని ప్రశ్నించారు. తాము మిత్రపక్షమైనా ప్రజలపక్షాన పోరాడతామని వారు పేర్కొన్నారు. సీమ సమస్యలపై మండలస్థాయి నుంచి పోరాటానికి కార్యాచరణ రూపొందించామని చెప్పారు. -
మాటలు కోటలు దాటాయి
సాక్షి ప్రతినిధి, కడప : ‘గాలి మోటారులో పర్యటన, గాలి కబుర్లతో కాలయాపన’ అన్న మాటలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్షరాలా వర్తిస్తాయి. ఇబ్బడి ముబ్బడి హామీలు గుప్పించడం, ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా ఆయన వ్యవహరిస్తున్నారు. గండికోటకు జూలై నాటికి నీరు ఇస్తామని ఫిబ్రవరిలో ప్రకటించారు. ఇప్పటి వరకూ పెండింగ్ పనుల్లో అర ఇంచు పురోగతి లేదు. ఇదివరకే ఓమారు గండికోట ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం మరోమారు సమీక్షించనున్నారు. ‘జూలై నాటికి గండికోట, మైలవరం ప్రాజెక్టుల్లో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తాం. అవసరమైతే కాలువ గట్లపై నిద్రిస్తా. సత్వరమే పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. కుప్పం కంటే ముందే పులివెందులకు నీరు ఇస్తాం’. ఈ మాటలు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిబ్రవరి 27న గండికోట ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంగా హామీ ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఐదు శాతం పను లు పూర్తి అవుతాయని అందరూ భావించారు. ఐదు నెలల కాలం పూర్తి అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా గండికోట ప్రాజెక్టు ఉండిపోయింది. పునరావసం, పరిహారం చెల్లింపు, నిర్వాసితులను ఖాళీ చేయించడంలో ఏమాత్రం పురోగతి లేదు. సీఎం హామీలు నీటిపై రాతలే అన్నట్లుగా ఉండిపోయాయి. సీఎం హామీ అనంతరం మే 8న నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చారు. ఈసందర్భంగా సర్వరాయసాగర్ ప్రాజెక్టు సందర్శించారు. అక్కడే గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంపై అధికారులతో సమీక్షించారు. అనంతరం 3నెలలు పూర్తి అయినా అరతట్ట మట్టి తీయలేదు, ఒక మీటర్ స్ట్రక్చర్ చేపట్టలేదని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఉన్న కాంట్రాక్టర్లను తప్పించి, అనుయాయులకు కాంట్రాక్టు పనులు అప్పగించారు. సత్వరపూర్తికి చిత్తశుద్ధి ఏదీ...! దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 95 శాతం పూర్తి అయిన గండికోట ప్రాజెక్టు పనులు సత్వర పూర్తికి ఆశించిన చొరవ కన్పించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. జూలై నాటికి జిల్లాలో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని సిఎం ప్రకటించడం మినహా, ఆ తర్వాత బడ్జెట్లో తగిన గుర్తింపు ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనంగా చెప్పుకొస్తున్నారు. జిఎన్‌ఎస్‌ఎస్‌కు కేవలం రూ.169 కోట్లు మాత్రమే కేటాయించారని వివరిస్తున్నారు. గండికోట ముంపు గ్రామాలు ఖాళీ చేయించి, నీరు వచ్చేనాటికి సంసిద్ధంగా మునక ప్రాంతాన్ని చేయాలన్న ఆలోచన కూడ లేదని పలువురు వాపోతున్నారు. ముంపువాసులకు సుమారు మరో రూ.18 కోట్లు పరిహారం అందించాల్సి ఉందని, ఆర్అండ్ఆర్ పునరావాస కార్యక్రమం సైతం నిధులు లేక నీరసించిందని పలువురు వివరిస్తున్నారు. ఎంతోకాలంగా జిల్లా వాసులు ఆశలు పెంచుకున్న ఉక్కు పరిశ్రమపై సెయిల్నీళ్లు చల్లుతోంది. ఇక్కడ అన్ని రకాలుగా అవకాశాలున్నా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద సెయిల్ అధ్యయనం చేస్తుడడంపై సీఎం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
సారొస్తారని..
సాక్షి, కడప : ముఖ్యమంత్రి గండికోట ప్రాజెక్టు పరిశీలనకు వస్తారని శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎదురు చూసిన టీడీపీ ప్రజాప్రతినిధులకు నిరాశే మిగిలింది. అన్ని ఏర్పాట్లు చేసి సీఎం రాక కోసం వేచి ఉన్న అధికారులకు ‘గండికోట’పై సీఎం ఏరియల్ సర్వే మాత్రమే చేస్తారనే సమాచారం రావడంతో అందరూ కడప ఎయిర్‌పోర్ట్‌కు బయలు దేరారు. సీఎం ఏరియల్ సర్వే ముగించుకుని హెలికాఫ్టర్‌లో కడప విమానాశ్రాయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ వెళతారని భావించి ప్రజాప్రతినిధులు సైతం అక్కడికే బయలుదేరారు. ఏకంగా సీఎం పర్యటనే రద్దు అయిందని సమాచారం అందడంతో విమానాశ్రయం నుంచి అందరూ తిరుగుముఖం పట్టారు. శుక్రవారం సాయంత్రం సీఎం ‘అనంత’ నుంచి హెలికాఫ్టర్‌లో గండికోటకు చేరుకుని, అక్కడ జరుగుతున్న టన్నెల్ పనులు పరిశీలించాల్సి ఉండింది. అనంతరం పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. తీరా పర్యటన రద్దు కావడంతో లక్షలాది రూపాయల ఖర్చు వృధా అయింది. ప్రత్యేక విమానం సైతం వెనక్కు వెళ్లింది. సీఎం చంద్రబాబు పర్యటన రద్దు కావడం ఇది రెండవసారి. గత ఏడాది సెప్టెంబర్‌లో సారొస్తారని.. రైల్వేకోడూరు పరిధిలోని ఓబనపల్లెలో జన్మభూమి గ్రామ సభకు హాజరు కావాల్సి ఉండగా చివరి క్షణంలో రద్దయింది. భారీ ఏర్పాట్లు చంద్రబాబు పర్యటన కోసం జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. స్వాగతం పలికేందుకు కడప ఎయిర్‌పోర్టుతోపాటు గండికోటలోనూ జిల్లా కలెక్టర్ కేవీ రమణతోపాటు జేసీ రామరావు, జేసీ-2 చంద్రశేఖర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి (వాసు), బద్వేలు నేతలు విజయమ్మ, విజయజ్యోతి, కమలాపురం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి, కడప నేతలు దర్గాప్రసాద్, గోవర్దన్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, రాయచోటి నాయకుడు రమేష్‌రెడ్డి, యెద్దల సుబ్బరాయుడు తదితరులు తరలివచ్చారు. బందోబస్తు విధులకు చిత్తూరు ఎస్పీ కూడా హాజరయ్యారు. -
నేటి విజయమ్మ ధర్నా వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాజెక్టు వద్ద శుక్రవారం తలపెట్టిన ధర్నా వాయిదా పడింది. కృష్ణా నదీ జలాల విషయంలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల రైతులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అరుుతే ఈ కార్యక్రమం వారుుదా పడినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.