సాక్షి, కొండాపురం: జిల్లాలో టీడీపీ తన ఉనికిని కోల్పోయిన పరిస్థితుల్లో నీచ రాజకీయాలకు తెర తీస్తోంది. గండికోట ప్రాజెక్టులో ముంపునకు గురైన నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతీ చోటు చేసుకున్న విషయం జగద్వితం. ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గండికోట ముంపు గ్రామంలో పర్యటించనుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ఇదేమి నీచ రాజకీయం అంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. 2017 లో గండికోట ప్రాజెక్టు కింద 22 గ్రామాల్లో ముంపు నిర్వాసితులను గుర్తించారు. అప్పట్లో తొలి విడత 14 గ్రామాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియ చేపట్టారు. పరిహారం చెల్లింపులో భారీగా అవినీతి చోటుచేసుకుంది. చదవండి: చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి
అధికారులు, రాజకీయ నాయకులు తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి సంబంధిత అధికారి ఆర్డీఓ వినాయకంను సస్పెండ్ కూడా చేశారు. అప్పటి జాయింట్ కలెక్టర్–2 శివారెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టి అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఇప్పటికీ ఆర్డీఓ వినాయకంపై విచారణ కొనసాగుతోంది. అవినీతి అంతా టీడీపీ ప్రభుత్వ పాలనలో జరిగితే ఇప్పుడే ఏ ముఖం పెట్టుకుని నిజ నిర్ధారణ కమిటీ అని వస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. చదవండి: ఆ శాపంతోనే టీడీపీకి 23 సీట్లు: కొడాలి నాని
నిజం నిర్ధారిస్తారా...
గండికోట ప్రాజెక్టు కింద ముంపు పరిహారం చెల్లింపులో అవకతవకలు, అక్రమాలు అన్నీ టీడీపీ పాలనలో పాలనలో జరిగితే దాన్ని ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అంటకట్టేందుకు టీడీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అబద్ధాన్ని నిజం అని నమ్మించేందుకు రోజుకో డ్రామా ఆడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. గండికోట ముంపు పరిహారంలో తమ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదని కప్పి పుచ్చుకునేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు మొదలుకొని జిల్లాలోని టీడీపీ నాయకులు రోజుకో ప్రకటన చేస్తుండటం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ నేతల వ్యవహార శైలిని చూసి స్థానికులు ఇదేమి నీచ రాజకీయం అంటూ పెదవి విరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment