సాక్షి, కర్నూలు: రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి గండికోట ప్రాజెక్టుకు గురువారం నీటిని విడుదల చేశారు. జిల్లాలో గల అవుకు రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని వైఎస్సార్ జిల్లాలోగల గండికోట ప్రాజెక్టుకు విడుదల చేశారు. రెండు రోజులుగా కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ మధ్య తరహా ప్రాజెక్టులు కూడా నిండాయి. కాగా... అవుకు రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు వస్తున్న దృష్ట్యా 1000 క్యూసెక్కుల నీటిని గండికోట ప్రాజెక్టుకు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment