
సాక్షి ప్రతినిధి, కడప : గండికోట ముంపు గ్రామాలకు చెల్లించే పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలకు ఆర్డీఓ వినాయకం సూత్రధారిగా తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసింది. రూ.479 కోట్ల పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలపై లోతైన విచారణ చేయడం కోసం కేసును సీఐడీకి అప్పగించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అవినీతిలో భాగస్వామ్యులైన రెవెన్యూ అధికారులు, బోగస్ లబ్ధిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమైంది. గండికోట ముంపు గ్రామాలకు పరిహారం పంపిణీ చేపట్టింది. ఇందులో రూ. 75 కోట్ల పరిహారం చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకోవడంతోపాటు ఇందుకు రెవెన్యూశాఖలోని అధికారులు పూర్తి సహకారం అందించారు.
దీనిపై సాక్షి దినపత్రికలో వరుస కథనాలు రావడంతో స్పందిం చిన కలెక్టర్ బాబూరావునాయుడు జేసీ–2 శివారెడ్డి నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఆ మేరకు జేసీ–2 శివారెడ్డి, అధికారుల బృందం పరిహా రానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. పరిశీలనలో దాదాపు రూ. 7 కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకున్నాయని, గ్రామాల్లో లేని వారికి, అనర్హులైన వారికి, బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన వారికి పరిహారం చెక్కులు అధికారులు అందించారని తేలింది. ఈ నివేదికను జేసీ–2 కలెక్టర్‌కు సమర్పించారు. దీంతో సమగ్ర విచారణ నివేదికను కలెక్టర్ బాబూరావునాయుడు ప్రభుత్వానికి నివేదించారు. నివేదిక అందగానే దానిని ప్రభుత్వం తగు చర్యలకు ఉపక్రమించి ఆర్డీఓ వినాయకంను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే ఈ అక్రమాలతో సంబంధం ఉన్న రెవెన్యూశాఖలోని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో వంద మంది పరిహారం పొందిన అనర్హులైన వారిపై ఆర్‌ఆర్ యాక్టు కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి పొందిన పరి హారం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా రూ. 5 కోట్ల చెక్కులను పంపిణీ చేయకుండా నిలిపి వేశారు. ఆర్డీఓ వినాయకం సస్పెన్షన్ నుంచి తప్పించుకునేందుకు అమరావతిలోని సచివాల