
సాక్షి, ఢిల్లీ: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఇక, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌లో చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ పేర్కొంది. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ ప్రధానం పిటిషన్‌లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment