Updates..
08:45PM, అక్టోబర్ 17, 2023
చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల
►నేటి చంద్రబాబు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు
►స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై.. 38 రోజులుగా రిమాండ్ ఖైదీ 7691 నెంబర్‌తో ఉన్న చంద్రబాబు
►జైల్లో స్నేహా బ్యారక్‌లో ప్రత్యేక గదిలో చంద్రబాబు
►ప్రతిరోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు
►కోర్టు ఆదేశాల మేరకే ఇంటి భోజనానికి అనుమతి
►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
►బాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల అనవసర రాద్ధాంతం
►బరువు తగ్గారని కుటుంబ సభ్యుల తప్పుడు ప్రచారం
►ప్రతిరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు
►స్కిల్ ఎలర్జీ.. ఆపై కోర్టు ఆదేశాలతో బాబు కోసం టవర్ ఏసీ ఏర్పాటు
► ఇవాళ్టి హెల్త్ బులిటెన్‌లోనూ పూర్తి వివరాలు వెల్లడి
08:23PM, అక్టోబర్ 17, 2023
ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు
►ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారెంట్‌పై రేపు చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంది
►అయితే.. సుప్రీం కోర్టు ఫైబర్ నెట్‌పై దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా వేసింది
►విచారణ జరిగే శుక్రవారం దాకా అరెస్ట్ చేయొద్దని సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీకి ఇవాళ సూచించింది
►అదే అంశాన్ని మెమో ద్వారా ఏసీబీ కోర్టుకు తెలిపిన సీఐడీ
►మళ్లీ ఎపుడు హాజరుపర్చాల్సిందీ ఏసీబీ కోర్టు రేపు నిర్ణయించే అవకాశం
07:55PM, అక్టోబర్ 17, 2023
టీడీపీ శ్రేణుల్లో కొత్త గుబులు
►చంద్రబాబు అరెస్ట్‌పై.. టీడీపీ శ్రేణుల్లో కొత్త టెన్షన్
►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ కుదరదన్న ధర్మాసనం.. నేరుగా తీర్పు ఇస్తామని వెల్లడి
►శుక్రవారానికి విచారణ వాయిదా
►కానీ, శుక్రవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయమూర్తుల
►ఈ నెల 23 నుంచి 28 దాకా దసరా సెలవులు
►తీర్పు ఆలస్యం అవుతుందేమోనన్న ఆందోళనలో టీడీపీ శ్రేణులు
07:30PM, అక్టోబర్ 17, 2023
ఆ ఐడియా లోకేష్‌దేనట!
►హక్కుల కోసం పోరాడే పేదలను అణిచివేయాలని చూసినప్పుడు ‘స్వేచ్ఛకు బేడీలు’ వేస్తారా? అని, పౌర సంఘాలు నిరసన తెలపడం చూశాం.
►చంద్రబాబు గారు అనే అవినీతి తిమింగలాన్ని సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుంది.
►ఈ ఫోటో షూట్ ఐడియా లోకేశ్ దేనని టీడీపీ వర్గాల బోగట్టా!
ట్విటర్‌లో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి
హక్కుల కోసం పోరాడే పేదలను అణిచివేయాలని చూసినప్పుడు ‘స్వేచ్ఛకు బేడీలు’ వేస్తారా అని, పౌర సంఘాలు నిరసన తెలపడం చూశాం. చంద్రబాబు గారు అనే అవినీతి తిమింగలాన్ని సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుంది. ఈ ఫోటో షూట్ ఐడియా లోకేశ్…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2023
06:45PM, అక్టోబర్ 17, 2023
ములాఖత్ తగ్గిస్తే చంద్రబాబుకే మంచిది
►చంద్రబాబు పై ఆయన పార్టీ నాయకులే కుట్ర చేస్తున్నట్లు అనుమానం
►అచ్చెన్నాయుడు,యనమల రామకృష్ణుడు కుట్ర పన్నుతున్నారు
►చంద్రబాబు ఇంకా కుర్రాడినే అనే విధంగా గతంలో జరిగిన మీటింగ్ లో చెప్పాడు
►కానీ, ముసలోడు, అనేక జబ్బులు ఉన్నాయి.. ఎందుకూ పనికిరాడంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు
►కొంతమంది రెండు పూట్ల హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని చెప్పడం దారుణం
►రోగి యొక్క వివరాలు చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు
►అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడుతో కలిసి చంద్రబాబు పై లోకేష్ కుట్ర పన్నుతున్నారు
►చంద్రబాబు పై కుట్ర పన్నేది కేవలం లోకేష్,ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలే
►చంద్రబాబు రాజకీయాలకు పనికిరాడని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారు
►చంద్రబాబు రాజకీయాలకు పనికిరాకపోతే రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు గద్దె ఎక్కాలనుకుంటున్నారు
►చంద్రబాబుకి జైల్లో ఉన్నాను అనే బాధ కంటే.. రాజకీయాలకు పనికిరాడనే ప్రచారం ఎక్కువ బాధిస్తోంది
►టీడీపీని నాశనం చేయడానికి ఒక్క లోకేష్ చాలు
►కేసు కొట్టేయాలని చంద్రబాబు లాయర్ లు కోరడం విడ్డురంగా ఉంది
►చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు కాబట్టి ప్రజా ధనం లూటీ చేసే హాక్కు ఉంటుందా?
►జైల్లో చంద్రబాబుకి ములాఖత్ తగ్గించడం అనేది సాధారణం
►ములాఖత్ తగ్గిస్తే చంద్రబాబుకే మంచిదేమో!
:::మంత్రి సీదిరి అప్పలరాజు
06:37PM, అక్టోబర్ 17, 2023
ఇంకెన్నాళ్లు సాగదీస్తాం?
►జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ భేటీ
►రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులు, ఐదో దశ వారాహి యాత్రపై చర్చ
►జనసేన- టీడీపీ సమన్వయ కమిటీ ఉమ్మడి భేటీ నిర్వహణపై చర్చ
►ఎన్ని స్థానాలకు జనసేన పోటీ చేయాలి?
►ఈసారి పవన్ కళ్యాణ్ కు అత్యంత సురక్షితమైన నియోజకవర్గం ఏది?
►ఒక చోట పోటీ చేయాలా? లేకుంటే రెండు చోట్ల నిలబడాలా ?
►వైజాగ్ విడిచి పెట్టి పవన్ అనంతపురం వెళ్తే ఎలా ఉంటుంది?
►ఇంకెన్నాళ్లు నియోజకవర్గ విషయంలో స్పష్టత ఇవ్వకుండా సాగదీస్తాం?
►అసలు టీడీపీ ఎన్ని నియోజకవర్గాలకు ఒప్పుకుంటుంది?
►ఎన్ని చోట్ల మనకు అభ్యర్థులు ఉన్నారు?
►దీర్ఘంగా చర్చలు జరిపిన పవన్-నాదెండ్ల మనోహర్
05:44PM, అక్టోబర్ 17, 2023
పిటిషన్లు వేయడం బాగా అలవాటైంది
►చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదీ
►జైలు నిబంధనల ప్రకారం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు
►ఏది కావాలన్నా కోర్టుల్లో పిటిషన్ వేయటం టీడీపీకి అలవాటైపోయింది
►దేశంలో అత్యంత ఖరీదైన లాయర్లు ఒక రిమాండ్ ఖైదీ కోసం పని చేస్తున్నారంటే అది ఒక చంద్రబాబు విషయంలోనే కావచ్చు...
►చంద్రబాబు తప్పు చేశాడన్న ఆధారాలు ఉండబట్టే జైల్లో ఉన్నాడు
►బాబు కోసం తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని ఆందోళనలు చేసిన ప్రజాస్పందన కనిపించడం లేదు
:::తూర్పుగోదావరిలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
04:37PM, అక్టోబర్ 17, 2023
బాబు హెల్త్‌బులిటెన్ పిటిషన్‌పై రేపు విచారణ
►చంద్రబాబు హెల్త్ బులెటెన్ విషయంలో పిటిషన్
►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరపు లాయర్ల పిటిషన్
►విజయవాడ ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల పిటిషన్
►కౌంటర్ వేయాలని సీఐడీని ఆదేశించిన కోర్టు
►సాయంత్రం దాఖలు చేసిన సీఐడీ తరపు న్యాయవాదులు
►రేపు విచారణ జరిగే అవకాశం
04:11PM, అక్టోబర్ 17, 2023
క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
►చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా
►తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన కోర్టు
►క్వాష్ పిటిషన్‌పై ఇరువైపులా నుంచి ముగిసిన వాదనలు
►తీర్పు రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం
►అదే రోజు ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
►క్వాష్ పిటిషన్ విచారణలో ఇవాళ.. 17ఏ వర్తించదని వాదనలు వినిపించిన సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ
► వర్తిస్తుందని వాదించిన చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే
►మధ్యంతర బెయిల్ ప్రస్తావన లేదన్న సుప్రీంకోర్టు
►వాదనలు ముగియడంతో.. FIR క్వాష్ చేయాలా? వద్దా? అనేదానిపైనే నేరుగా తదుపరి విచారణలో ఆదేశాలివ్వనున్న బెంచ్
04:00PM, అక్టోబర్ 17, 2023
మధ్యంతర బెయిల్ కుదరదు: సుప్రీం కోర్టు
►చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన లాయర్ హరీష్ సాల్వే
►సెక్షన్ 17a వర్తిస్తే అన్ని అభియోగాలు తొలగినట్టే!
►లేదంటే మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా
►చంద్రబాబు 40రోజులు జైల్లో ఉన్నారు
►73 ఏళ్ల వయసున్న వ్యక్తి కాబట్టి బెయిల్ ఇవ్వండి
►మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా సైతం ఇదే అభ్యర్థన
►ససేమీరా అనేసిన జస్టిస్ అనిరుద్ధబోస్
►వాదనలన్నీ విన్నాం.. తీర్పు వెల్లడిస్తామని స్పష్టీకరణ
03:55PM, అక్టోబర్ 17, 2023
హరీష్ సాల్వే వాదనలు
►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఇవాళ ముగిసిన వాదనలు
►సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ తర్వాత కౌంటర్ వాదనలు వినిపించిన హరీష్ సాల్వే
►17A రెట్రో యాక్టిివ్ గా వర్తిస్తుంది
►17A కింద బాబుకి రక్షణ కల్పించాలి
►17A కింద ఖచ్చితంగా అనుమతి తప్పనిసరి
►ఎన్నికలు వస్తున్నాయని, ఫిక్స్ చేస్తున్నారు
►రాజకీయ ప్రత్యర్థులైనందు వల్లే తప్పుడు కేసులు
►17ఏ గనుక లేకుంటే పబ్లిక్ సర్వెంట్స్ అందరూ పోతారు
►అయితే, ఎవరూ కూడా దీనిని ఛాలెంజ్ చేయలేదు కదా ? అని ప్రశ్నించిన జస్టిస్ బేలా త్రివేది
►17ఏ రెట్రాస్పెక్తివ్ గా ఉండదని ప్రభుత్వం అంటోంది కదా ? : జస్టిస్ అనిరుధ్ బోస్
►అన్ని అంశాలు లిఖిత పూర్వకంగా ఇస్తాం
03:49PM, అక్టోబర్ 17, 2023
చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుంది: సాల్వే
►17ఏ కింద చంద్రబాబుపై కేసు నమోదులో గవర్నర్ అనుమతి తప్పనిసరి
►17ఏ వర్తిస్తుందంటూ పలు జడ్జిమెంట్లను వివరిస్తున్న సాల్వే
03:40PM, అక్టోబర్ 17, 2023
వాదనలు వినిపిస్తున్న బాబు లాయర్ హరీష్ సాల్వే
►ఈ కేసులో 17ఏ వర్తించదన్న సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీ వాదనలకు.. కౌంటర్ వాదనలు వినిపిస్తున్న సాల్వే
►17ఏ అనేది పాత కేసులకు కూడా వర్తిస్తుంది: హరీష్ సాల్వే
►రోహత్గి తన వాదనలో 17ఏ పాత కేసులకు వర్తించదని.. కోర్టు తీర్పును ప్రస్తావించారు: జస్టిస్ అనిరుద్ధబోస్
►రోహత్గి చెప్పిన కోర్టు తీర్పు మీరు(సాల్వేను ఉద్దేశించి..) వాదిస్తున్న దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది: జస్టిస్ అనిరుద్ధబోస్
03:30PM, అక్టోబర్ 17, 2023
క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ ఆర్గ్యూమెంట్స్
►క్వాష్ పిటిషన్‌పై రోహత్గీ వాదనలకు కౌంటర్ వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే
►వర్చువల్‌గా వాదిస్తున్న హరీష్ సాల్వే
►హక్కులు పౌరులకు సంబంధించినవి: సాల్వే
►కొత్త చట్టాలు వస్తే అవి హక్కుగా పౌరులకు వర్తిస్తాయి: సాల్వే
►ప్రతీ ప్రజాప్రతినిధికి హక్కుగా 17ఏ చట్టం వర్తిస్తుంది: సాల్వే
03:20PM, అక్టోబర్ 17, 2023
రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ..
►ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు.
►ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా?
►అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణించండి
ఇప్పుడు మనం మాట్లాడుతుంది..17 ఏ వర్తిస్తుందా..లేదా అనేదే కదా?
కేసులు నమోదు, ఛార్జిషీట్, విచారణ అన్ని కేసుల్లోనూ జరిగేదే: జస్టిస్ అనిరుద్దబోస్
►అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది.
►ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయి
►జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి
►నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి
►అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు
►ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు?
►మీరు అవినీతి ఆరోపణలు వర్తించవంటున్నారు.. మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయి
జస్టిస్ అనిరుద్ధబోస్ : మీరు కేసు పెట్టేనాటికి చట్టం అమలులోకి వచ్చింది, చట్టం అమలులోకి వచ్చాక కేసు నమోదైంది
►ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది: రోహత్గీ
ఈలోపు చంద్రబాబు తరపు లాయర్ హరిష్ సాల్వే జోక్యం చేసుకుంటూ..
ఇప్పటికే గంటసేపు నుంచి రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు... ఇంకా ఎంతసేపు వాదనలు వినిపిస్తారు.
రోహత్గీ తన వాదనలు కొనసాగిస్తూ..
►రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్‌ను బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు
►కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు
►రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి
►కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు.
03:05PM, అక్టోబర్ 17, 2023
ఫైబర్‌నెట్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా
►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ శుక్రవారానికి(అక్టోబర్ 20) వాయిదా
►స్కిల్ స్కామ్ క్వాష్‌తో పాటు ఫైబర్‌నెట్ కేసులో సుప్రీం కోర్టులో విడిగా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన బాబు తరపు లాయర్లు
► విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు
► ఒకవైపు స్కిల్ స్కామ్ కేసులో 17ఏపై వాదనలు కొనసాగుతుండడంతో వాయిదా వేసిన కోర్టు
►శుక్రవారం వరకు ఫైబర్‌నెట్ కేసులో బాబును అరెస్ట్ చేయొద్దని రోహత్గికి సూచించిన సుప్రీం కోర్టు
02:59PM, అక్టోబర్ 17, 2023
ఇది చాలా తీవ్రమైన ఆర్థిక నేరం: సీనియర్ లాయర్ రోహత్గీ
►ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్‌లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది
►ఎఫ్‌ఐఆర్‌లో కాగ్నిజబుల్ అఫెన్సెస్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం
►ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి
►ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు
►స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది
►పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు
►ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి
►ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది?
►ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌కు గురవుతారు
►రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు
►అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు
►మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు
►ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు
►ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు
►నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది
ఈ కేసులో అసలు విచారణ చేయాలా? వద్దా? అనేది 17ఏపై ఆధారపడి ఉంది కదా!: కోర్టు
రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ..
►సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి
►17ఏ అనేది ఈ కేసులో వర్తించదు
► 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది
►2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది
►2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు
►2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది?
►స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం
►ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది:రోహత్గీ
►ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది:రోహత్గీ
►గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది: రోహత్గీ
👇
►రోహత్గీ : శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు
►జస్టిస్ బోస్ : ACB కోర్టుకున్న పరిధి ఏంటీ?
►జస్టిస్ త్రివేదీ : కేవలం IPC కేసులే కదా.?
►రోహత్గీ : ACB కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది.
►జస్టిస్ త్రివేదీ : ఒక వేళ అవినీతి నిరోధక చట్టం ఉపసంహరిస్తే ఏమవుతుంది?
►రోహత్గీ : పదేళ్ల తర్వాత మీరు వెనక్కి వెళ్లలేరు
02:38PM, అక్టోబర్ 17, 2023
స్పెషల్ కోర్టుకు ఆ అధికారం ఉంది
►వాదనలు వింటున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది
►ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే: ముకుల్ రోహత్గీ
►విచారణ అనేది ఛార్జెస్ ఫ్రేమింగ్ తర్వాతనే ప్రారంభం అవుతుంది కదా?: కోర్టు
►ముందుగా పీసీ యాక్ట్ పెట్టిన తర్వాత మళ్లీ దానిని తీసేస్తే స్పెషల్ జడ్జికి విచారణాధికారం ఉండదు కదా?: కోర్టు
►పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్‌లపై విచారించొచ్చు: రోహత్గీ
►ఈ కేసులో మరింత మంది ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు: రోహత్గీ
►చంద్రబాబు కూడా ప్రభుత్వ ప్రతినిధే కదా?: కోర్టు
►పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది: రోహత్గి
►సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు
►ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది
►ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది
►పీసీ యాక్ట్ ప్రకారం స్పెషల్ కోర్టుకు ఉన్న విచారణ పరిధి ఏంటి?: జస్టిస్ అనిరుధ్ బోస్ ప్రశ్న
►జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి: రోహత్గి
02:30PM, అక్టోబర్ 17, 2023
►వర్చువల్‌గా వాదనలు వింటున్న చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే
►కాసేపు ఆగి వస్తానంటూ బయటకు వెళ్లిపోయిన బాబు మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా
02:26PM, అక్టోబర్ 17, 2023
క్వాష్ వేయడం అత్యంత తొందరపాటు చర్య
►17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది: రోహత్గి
►17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు
►ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి
►పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు
►స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు:రోహత్గి
►17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది
►అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు:రోహత్గి
►అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు:రోహత్గి
►నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు:రోహత్గి
►ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం:రోహత్గి
►అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య:రోహత్గి
►విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు:రోహత్గి
►సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం:రోహత్గి
►కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు:రోహత్గి
►గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు:రోహత్గి
02:08PM, అక్టోబర్ 17, 2023
సుప్రీంలో బాబు పిటిషన్‌పై విచారణ ప్రారంభం
►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం
►వాదనలు వినిపిస్తోన్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి
►సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న రోహత్గి
►సెక్షన్ 17 ఏ చుట్టూరానే కొనసాగుతున్న వాదనలు
►ఇవాళ క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగిసే అవకాశం?
01:38PM, అక్టోబర్ 17, 2023
టీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
►తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయదట
►క్యాండిడేట్లు దొరకడంలేదని అనుకోవాలా?
►87 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు
►తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు గారు తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్నారు
►ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అంటూ ట్వీట్
తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయదట. క్యాండిడేట్లు దొరకడంలేదని అనుకోవాలా? 87 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు గారు తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్నారు. ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2023
12:50PM, అక్టోబర్ 17, 2023
చంద్రబాబు హెల్త్ బులిటెన్‌పై పిటిషన్
►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరపు లాయర్ల పిటిషన్
►విచారణ చేపట్టిన విజయవాడ ఏసీబీ కోర్టు
►పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం.
12:32PM, అక్టోబర్ 17, 2023
►స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
►విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన కోర్టు
►స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ వాయిదా
►విచారణను గురువారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
►చంద్రబాబు లాయర్ల అభ్యర్థన మేరకు విచారణ వాయిదా
12:10PM, అక్టోబర్ 17, 2023
►మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో జీజే రెడ్డి వారసులకు షేర్స్ ఉన్నాయి: అడ్వొకేట్ శివరాంరెడ్డి
►మార్గదర్శిలో జీజేరెడ్డికి షేర్స్ ఉన్నట్లు 2014 లో వెలుగులోకి వచ్చింది
►జీజే రెడ్డి మార్గదర్శి డైరెక్టర్ గా, ప్రమోటర్ గా పనిచేశారు
►జీజే రెడ్డి వారసులతో బలవంతంగా సంతకాలు పెట్టించి షేర్స్ బదిలీ చేయించుకున్నారు
►యూరిరెడ్డి ప్రమేయం లేకుండానే షేర్స్ మార్గదర్శికి బదిలీ చేశారు
►యూరిరెడ్డి కి చెందిన షేర్లను బలవంతంగా లాక్కున్నారు
►యూరిరెడ్డి షేర్లు శైలజా కిరణ్ కు బదిలీ చేసినట్లు లెక్కల్లో చూపించారు
► నా తండ్రి జీజే రెడ్డి.. రామోజీకి 1962 లో రూ. 5 వేలు ఇచ్చారు: యూరిరెడ్డి
►నా తండ్రి పేరు మీద షేర్స్ ఉన్నాయి
►మమల్ని బెదిరించడంతో సంతకం చేశారు.
►మా షేర్స్‌ను బలవంతంగా శైలజా పేరు మీదకు బదలాయించారు.
12:05PM, అక్టోబర్ 17, 2023
►సీఐడీ విచారణకు హాజరుకాని కిలారు రాజేష్
►ఇవాళ డాక్యుమెంట్లు తీసుకురావాల్సిందిగా రాజేష్‌కు తెలిపిన సీఐడీ అధికారులు
►సీఐడీ అడిగిన డాక్యుమెంట్లు అందుబాటులో లేవని మెయిల్ ద్వారా తెలిపిన కిలారు రాజేష్
►దసరా తర్వాత డాక్యుమెంట్లు తీసుకుని వస్తానని సీఐడీకి మెయిల్ చేసిన కిలారు రాజేష్
11:05AM, అక్టోబర్ 17, 2023
►న్యూఢిల్లీ: చంద్రబాబు ఫైబర్ నెట్ స్కామ్ కేసుపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా
► స్కిల్ స్కామ్ కేసు, ఫైబర్ నెట్ స్కామ్ కేసు.. రెండూ ఒకేసారి విచారణ చేస్తామన్న జస్టిస్ అనిరుధ్ బోస్
10:25AM, అక్టోబర్ 17, 2023
►ఇవాళ చంద్రబాబుతో వర్చువల్ గా మాట్లాడనున్న ఏసీబీ న్యాయమూర్తి
►మధ్యాహ్నం చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్
09:25AM, అక్టోబర్ 17, 2023
ఓటు దొంగలు వాళ్లు: తెలంగాణ మంత్రి హరీష్‌రావు
►చంద్ర బాబు డైరక్షన్ లో నాడు రేవంత్‌రెడ్డి నోటుకు ఓటు విషయంలో ప్రసిద్ధి
►నేడు అదే విధంగా కాంగ్రెస్ నోట్లకు సీట్లను అమ్ముకుంటోందని గాందీభవన్‌లో మాట్లాడుతున్నారు
►ఇలాంటి వాళ్లకు అధికారం అప్ప గిస్తే రాష్ట్రాన్ని కూడా అమ్ముతారు
09:20AM, అక్టోబర్ 17, 2023
న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి కొత్త వ్యూహం
► ఏపీ టుమారో పేరిట సంతకాల సేకరణ
► 36 లక్షల డిజిటల్ సంతకాలు సేకరించామంటూ ప్రచారం
► చంద్రబాబు బయటకు రావాలంటూ డిమాండ్లు
► ఢిల్లీకి వెళ్లి సీజేఐ ఆఫీస్ లో డిజిటల్ సంతకాలు పత్రాలు అందజేత
► చంద్రబాబు బయటకు రావాలంటే ఇదేనా మీకు తెలిసిన పద్ధతి?
► కోర్టులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి బయటపడాలనుకుంటున్నారా?
► సంతకాలు తేగానే చేసిన నేరం పోతుందా?
► చంద్రబాబు అనుభవం ఏపీకి అవసరమని చెబుతున్న వాళ్లు చంద్రబాబు చేసిన తప్పుల గురించి మాట్లాడరా?
► చంద్రబాబు తప్పు చేయలేదని కోర్టుల్లో సీనియర్ లాయర్లు ఎందుకు చెప్పడం లేదు?
► కేవలం అరెస్ట్ చేసిన విధానాన్ని మాత్రమే చూపి కేసు కొట్టేయమని ఎందుకు అడుగుతున్నారు?
► రేపు కేసు బెంచ్ మీదకు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయంలో సంతకాలు ఎలా ఇస్తారు?
► అసలు మీరు ఇచ్చిన సంతకాలకు ఎంత విశ్వసనీయత ఉంది?
► రేపు ఇంకొకరు కోటి సంతకాలు తెస్తే.. తప్పును ఒప్పు అంటారా?
09:18AM, 09:20AM, అక్టోబర్ 17, 2023
నందమూరి, నారా ఒకే లైన్లో ఉన్నారా?
► చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల మధ్య బేధాబిప్రాయాలొచ్చాయా?
► బావ చంద్రబాబు జైల్లో ఉంటే, బాలయ్య సినిమా ఫంక్షన్లో బిజీ బిజీగా ఎందుకుంటున్నారు?
► బ్రాహ్మణిని సొంత కుటుంబ సభ్యులు కనీస మాత్రం పట్టించుకోవడం లేదా?
► సినిమా ఫంక్షన్లకు హాజరయి జోకులు వేసే మోక్షజ్ఞ... అక్క బ్రాహ్మణీకి సంఘీభావం ఎందుకు తెలపలేదు?
► ఇన్నాళ్లు రాజమండ్రిలో బ్రాహ్మణీ ఉంటే కనీసం పరామర్శించలేదెందుకు?
► ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణను తలదూర్చొద్దని చంద్రబాబు చెప్పడమే కారణమా?
► కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే బాలకృష్ణను పరిమితం కావాలన్న బాబు సూచన నచ్చలేదా?
► నిరసన కార్యక్రమాల్లో బాలకృష్ణ భార్య వసుంధర ఎందుకు కనిపించడం లేదు?
► గతంలో హిందూపురం ఎన్నికల్లో ప్రచారంలో యాక్టివ్ గా కనిపించిన వసుంధర ఇప్పుడు నారా కుటుంబంపై కినుక వహించారా?
► ఇప్పుడెందుకు వదిన భువనేశ్వరీ పక్కన వసుంధర కనిపించడం లేదు?
► క్యాండిళ్ల ర్యాలీ, సంకెళ్ల ర్యాలీలో భువనేశ్వరీకి సొంత కుటుంబం నుంచి అంతగా మద్ధతెందుకు రాలేదు?
► హఠాత్తుగా బాబు కుటుంబ సభ్యులంతా రాజమండ్రి నుంచి వెళ్లిపోయారెందుకు?
09:10AM, అక్టోబర్ 17, 2023
స్కిల్ కేసుపై నేడు హైకోర్టులో విచారణ
►చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో కీలక వాదనలు
►బెయిల్ పిటిషషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు లాయర్లు
►నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదుల పిటిషన్ పై విచారణ
►చంద్రబాబు ఆరోగ్యం పై దాఖలైన పిటిషన్ పై విచారణ
09:02AM, అక్టోబర్ 17, 2023
ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో నేడు ఏపీ హైకోర్టు విచారణ
►ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన మాజీమంత్రి నారాయణ బావమరిది మునిశంకర్
►మునిశంకర్‌ను నిందితుడిగా చేర్చిన సీఐడీ
►నేడు మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
►ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో A-17గా అవుల మునిశంకర్
9:00AM, అక్టోబర్ 17, 2023
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ స్కాం కేసు విచారణ
►మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేయనున్న ధర్మాసనం
►కేసు విచారిస్తున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది
►సెక్షన్ 17- A చంద్రబాబుకు వర్తింపజేయాలని వాదిస్తున్న ఆయన తరపు న్యాయవాదులు
►2015లోనే స్కిల్ స్కాంలో నేరం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ఏపీ ప్రభుత్వం
►2018 జూన్ లోనే ఈ అంశంపై విచారణ ప్రారంభమైందని న్యాయస్థానానికి వెల్లడించిన ప్రభుత్వం
►2018 జులై నెలలో సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని, కనుక ఈ చట్టం బాబుకు వర్తించదని స్పష్టం చేస్తున్న ప్రభుత్వం
8:30AM, అక్టోబర్ 17, 2023
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 38వ రోజు రిమాండ్ ఖైదీగా అయితే చంద్రబాబు
►జైల్లో నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
►ప్రతిరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు
►స్నేహ బ్యారక్ లో చంద్రబాబుకు టవర్ ఏసి ఏర్పాటు
►ప్రతిరోజు మూడుసార్లు వైద్య పరీక్షలు
08:18AM, అక్టోబర్ 17, 2023
తాడేపల్లి:
►నేడు రెండోరోజు సిట్ విచారణకు టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్
►సోమవారం ఉదయం పదిన్నర నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన విచారణ
►మొత్తం 25 ప్రశ్నలు అడిగిన సీఐడీ అధికారులు
►మనోజ్ వాసుదేవ్ పార్ధసానితో సంబంధాల గురించి ప్రశ్నంచగా ఆయన ఎవరో తనకు తెలియదన్న కిలారి
►పార్ధసానితో వాట్సప్ చాటింగ్, నగదు ట్రాన్సాక్షన్ వివరాలను రాజేష్ ముందు పెట్టిన అధికారులు
►సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలిన రాజేష్
►నారా లోకేష్ తో పరిచయం, వ్యాపారాల గురించి అడిగిన ప్రశ్నలకూ సైలెంట్ గా ఉన్న కిలారు
►స్కిల్ స్కాం పై ప్రశ్నలకు తెలీదు, గుర్తులేదు అంటూ సమాధానం దాట వేసిన రాజేష్
►నేడు రెండోరోజు సిట్ విచారణకు టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్
►సోమవారం ఉదయం పదిన్నర నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన విచారణ
►మొత్తం 25 ప్రశ్నలు అడిగిన సీఐడీ అధికారులు
►మనోజ్ వాసుదేవ్ పార్ధసానితో సంబంధాల గురించి ప్రశ్నంచగా ఆయన ఎవరో తనకు తెలియదన్న కిలారి
►పార్ధసానితో వాట్సప్ చాటింగ్, నగదు ట్రాన్సాక్షన్ వివరాలను రాజేష్ ముందు పెట్టిన అధికారులు
►సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలిన రాజేష్
►నారా లోకేష్ తో పరిచయం, వ్యాపారాల గురించి అడిగిన ప్రశ్నలకూ సైలెంట్ గా ఉన్న కిలారు
►స్కిల్ స్కాం పై ప్రశ్నలకు తెలీదు, గుర్తులేదు అంటూ సమాధానం దాట వేసిన రాజేష్
7:00 AM, అక్టోబర్ 17, 2023
సుప్రీంలో నేడు ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ
►స్కిల్ స్కాంలో 17A వర్తింప చేయాలని పిటిషన్‌తోపాటు.. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్
►స్కిల్ స్కాంలో చంద్రబాబుకు 17A వర్తించదన్న రోహత్గీ
►17A వర్తింప చేయాలని వాదించిన చంద్రబాబు లాయర్లు
►విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
►కోర్టు నెంబర్ 6 లో ఐటం నెంబర్ 3గా లిస్టు అయిన చంద్రబాబు కేసు
►ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు
చంద్రబాబు అరెస్టుపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్...
►చంద్రబాబు తప్పు చేయలేదని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పడం లేదు
►కేవలం సాంకేతిక అంశాలు చూపించి మాత్రమే కేసు కొట్టేయాలంటున్నారు
►చంద్రబాబు జనం నుంచి వచ్చిన నాయకుడు కాదు
►నాయకుడు జనం నుండి వస్తే ప్రజల స్పందన వేరేగా ఉంటుంది
►చంద్రబాబు అరెస్టై 37 రోజులు గడుస్తున్నా ప్రజల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదు
►టిడిపి నాయకులు కూడా కొన్ని రోజులు ఆందోళన చేసినట్టు తూతూ మంత్రంగా చేసి సర్దేసుకున్నారు
►ప్రజల మనసును గెలుచుకున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే
ఇదీ చదవండి: కిలారు రాజేష్ సైలెన్స్.. మళ్లీ విచారణ
Comments
Please login to add a commentAdd a comment