
కొరియన్ స్విచ్ ఆన్ డైట్
అధిక బరువును తగ్గించుకోవాలంటే..భారీ కసరత్తే చేయాలి. చెమట చిందిస్తేనే అదనపు కొవ్వు కరుగుతుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. పట్టుదల, కృషి ఉండాలి. అలాగే ఏదో యూట్యూబ్‌లోనో, ఇంకెవరోచెప్పారని కాకుండా, శరీరంపై మనంతీసుకుంటున్న ఆహారంపైనా అవగాహన పెంచుకుని, శ్రద్ధపెట్టి, నిపుణుల సలహా తీసుకని ఈ ప్రక్రియను మొదలు పెట్టాలి. విజయం సాధించాలి. అలా కేవలం ఆరు రోజుల్లో నాలుగు కిలోల బరువు తగ్గించుకుందో మోడల్. ఆ తరువాత తన సక్సెస్ గురించి ఇన్‌స్టాలో షేర్ చేసింది.
సియోల్‌లో ఉంటున్న ఫ్రీలాన్స్ మోడల్' షెర్రీ తరచుగా ఫిట్‌నెస్ రహస్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. కండరాల నష్టం లేకుండా 6 రోజుల్లో 4 కిలోల బరువు తగ్గిన విధానాన్ని తన అభిమానులతో పంచుకుంది. దీన్ని కొరియన్ 'స్విచ్ ఆన్' డైట్ అంటారట. ఆహారం, ఉపవాసం, అధిక ప్రోటీన్ భోజనం ఈ మూడు పద్దతులను అనుసరించినట్టు తెలిపింది.
ఆహారం జీవనశైలి మార్పుల వివరాలనుఇలా పంచుకుంది..“నేను ఎలాంటి ఆహారం/జీవనశైలి మార్పులు చేసుకోవాలి లాంటి సలహా ఇవ్వడం లేదు. అంత ఎక్స్‌పర్ట్‌ని కూడా కాదు. కేవలం నా సొంత అనుభవం. కాబట్టి దీన్ని దయచేసి నా అనుభవంలాగే తీసుకోండి అంటూ తన అనుభవాన్ని షేర్ చేసింది.
చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?
షెర్రీ వెయిట్ లాస్ జర్నీ
ఆరు రోజుల్లో 4 కిలోలు తగ్గాను , ఎలా చేశానంటే.. తొలుత 'స్విచ్ ఆన్ (డైట్)' గురించి చెప్తా. ఇది చాలా కాలం పాటు బరువును నిలుపుకోవడంలో నాకు సహాయపడుతుంది. ఇది ఒక కొరియన్ వైద్యుడు అభివృద్ధి చేసిన 4 వారాల కార్యక్రమం. ఇది కండరాల నష్టాన్ని నివారించడంతో పాటు కొవ్వు జీవక్రియను సక్రియం చేయడంలో , ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలోసహాయపడుతుంది. ప్రాథమికంగా ఇది ఎలా పనిచేస్తుంది...”
కండరాల శక్తి కోల్పోకుండా బరువుతగ్గాలంటే సరైన పోషకాహారం అవసరం. తగినంత ప్రోటీన్ తినేలా చూసుకుంది. అలాగే కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లేకుండా జాగ్రత్త పడింది. ఉపవాసాలను కూడా తన డైట్ ప్లాన్‌లో చేర్చుకుంది.
ఇంకా ఇలా చెప్పింది:
మొదటి వారం: ప్రోటీన్ షేక్స్, కూరగాయలు , అధిక ప్రోటీన్ భోజనం తీసుకుంది. తద్వారా శరీరం నుంచి మలినాలు బైటికిపోతాయి. గట్ ఆరోగ్యం బలపడుతుంది. రెండో వారం అధిక మజిల్ రికవరీ కోసం ప్రోటీన్ భోజనం , ఉపవాసాలు చేసింది. మూడో వారంలో ఎక్కువ ఫాస్టింగ్‌ని ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కొవ్వు కరిగేలా జాగ్రత్త పడింది.
ఏమి తినాలి ? ఏమి తినకూడదు?
షెర్రీ స్విచ్ డైట్ ప్లాన్ ప్రకారం మూడు రోజుల్లో తొలి రోజు అల్పాహారం, భోజనం, స్నాక్స్ , రాత్రి భోజనం అన్నీ ప్రోటీన్ షేక్ మీల్స్ మాత్రమే. ఇక మిగిలిన రెండు రోజుల్లో ప్రోటీన్ షేక్స్ 'కార్బ్-లెస్' మిశ్రమం, ఇంకా మల్టీ-గ్రెయిన్ రైస్, ఉడికించిన కొవ్వు లేని చికెన్, చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, గుడ్లు, బెర్రీలు, అరటిపండు, చిలగడదుంపలు వంటి ఆహారాలతో కూడిన సాధారణ భోజనం.
ఈ డైట్ ప్రోగ్రామ్‌లో కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లాంటి పూర్తిగా నిషిద్ధం.
స్విచ్ ఆన్ డైట్ కండరాలను కాపాడుతూ, ప్రస్తుత శక్తికోసం బాడీలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. గత ఏడాది కొవ్వు శాతాన్ని తగ్గించడంలో డైట్ సహాయపడింది. శీతాకాలంలో ఎక్కువ మొబిలిటీ లేక హార్మోన్లను ప్రభావితం చేయడంతో పాటు పేగు ఆరోగ్య సమస్యలకు దారితీసిందని అలాగే తన శరీరం నీరు పడుతుందని చెప్పుకొచ్చింది. అందుకే మళ్లీ ఈ డైట్ ప్రారంభించే ముందు 3 రోజుల ఉపవాసంతో ప్రతిదీ రీసెట్ చేసాననీ తెలిపింది. అలాగే ఈసారి పాల ఉత్పత్తులు లేకుండా కొన్ని మార్పులు చేసాను. తద్వారా తన డైట్‌ను యాంటీ ఇన్ఫ్లమేటరీగా మార్చి, ఫైబర్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు చెప్పింది.

స్విచ్ ఆన్ డైట్ అంటే ఏమిటి?
శాస్త్రీయంగా, బరువు తగ్గడం, గట్ హెల్త్ కోసం దక్షిణ కొరియాలో ట్రెండింగ్‌లో ఉన్నవిధానమే స్విచ్ ఆన్ డైట్. ఇది మజిల్స్‌కు నష్టం లేకుండా కొవ్వు కరిగించుకునేలా 4 వారాల జీవక్రియ రీసెట్ ప్రోగ్రామ్. డాక్టర్ పార్క్ యోంగ్-వూ దీన్ని రూపొందించారు. భారీ కేలరీలను తగ్గించడం, క్రాష్ డైటింగ్ లాంటి విధానం గాకుండా అడపాదడపా ఉపవాసం, శుభ్రంగా తినడం, జీవక్రియను సమతుల్యం చేయడంపై దృష్టి పెడుతుంది, అదే సమయంలో గట్ ఆరోగ్యానికి కాపాడుకునేలా జాగ్రత్త పడటం.
నోట్: ఇది షెర్రీ వ్యక్తిగత అనుభవం మాత్రం అని గమనించగలరు. అధిక బరువును తగ్గించు కోవాలనుకుంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment