Oct 14th 2023: చంద్రబాబు కేసు అప్ డేట్స్ | Chandrababu Naidu In Remand Of 35th Day In Skill Development Scam Case, Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Oct 14th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్ డేట్స్

Published Sat, Oct 14 2023 7:59 AM | Last Updated on Sat, Oct 14 2023 8:47 PM

TDP And Chandrababu Cases Updates - Sakshi

Chandrababu Naidu Arrest Cases Remand Updates

20:33PM, అక్టోబర్‌ 14, 2023
చంద్రబాబు కోసం ఏసీ ఫిక్స్‌ చేయండి

►చంద్రబాబు లాయర్ల హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ
►వైద్యులుతోనూ, జైళ్ల శాఖాధికారులతోనూ మాట్లాడిన ఏసీబీ జడ్జి
►చంద్రబాబుకి స్కిన్ ఎలర్జీ మాత్రమే ఉందని తెలిపిన వైద్యులు
►మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడి
►చంద్రబాబు ఉన్న బ్యారెక్‌లో తక్షణమే ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశం
►వైద్యుల సూచనలు అమలు చేయాలని జైళ్ల శాఖకు ఆదేశం
► కోర్టు ఆదేశాలానుసారం వ్యవహరిస్తామని ముందే చెప్పిన జైళ్ల శాఖ డీఐజీ
 

19:29PM, అక్టోబర్‌ 14, 2023
ఏసీ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్‌
►ఏసీబీ కోర్టులో చంద్రబాబు న్యాయవాదుల  తరపు హౌస్ మోషన్  పిటిషన్
►జైలులో చంద్రబాబు బ్యారక్‌లో ఏసీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్ 
►అనారోగ్య లక్షణాలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారనీ పిటిషన్ దాఖలు
►స్కిన్‌ అలర్జీ ఉంది గనుక కూల్ వెదర్ లో ఆయన ఉంచాలని రికమెండ్ చేశామన్న వైద్య బృందం
►డాక్టర్ల సూచనల్ని ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
►అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోర్టుకు బాబు లాయర్ల విజ్ఞప్తి

19:10PM, అక్టోబర్‌ 14, 2023
బాబు అసలు రంగు బయటపెట్టిన సీమెన్స్‌ 
►స్కిల్‌ స్కామ్‌లో సీఐడీ దర్యాప్తుతో సంచలనాలు వెలుగులోకి
►సీమన్స్ కంపెనీ లిఖిత పూర్వకంగా చెప్పిన విషయాలేంటి?
సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న :3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు లో మీరు 90 శాతం పెట్టుబడితో 10 శాతం ప్రభుత్వం పెట్టుబడితో స్కిల్ సెంటర్స్ పెట్టడానికి డిజైన్ టెక్ తో కలిసి ఒప్పందం చేసుకున్నారా..?
సీమెన్స్ సమాధానం: అలాంటి ఒప్పందం మేము చేసుకోలేదు, 90 శాతం పెట్టుబడి పెట్టి ప్రాజెక్ట్ చేసే పద్దతి మా దగ్గరలేదు.
సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : 3300 కోట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా మీకు డిజైన్ టెక్ నుండి గాని స్కిల్ కార్పొరేషన్ నుండి గానీ ఏమైనా పర్చేజ్ ఆర్డర్ వచ్చిందా..?
సీమెన్స్ సమాధానం : ఈ ప్రాజెక్టు లో భాగంగా మాకు ఎటువంటి పర్చేజ్ ఆర్డర్ రాలేదు..2015 లో డిజైన్ టెక్ నుండి 3 సార్లు మొత్తంగా 58 కోట్ల రూపాయలకు మాకు ఆర్డర్ వచ్చింది,మేము సప్ప్లై చేశాం.
సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : ప్రస్తుతం సుమన్ బోస్ ఎక్కడున్నారు?? వారు అసలు ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్ట్ ని ఒప్పందం చేసుకునే అర్హత ఉందా..?
►సీమెన్స్ సమాధానం : సుమన్ బోస్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, 2018 లో వారు మా కంపెనీలో లేరు,ఇక ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్టులను మేము చేయం,ఇలాంటి ఒప్పందం చేసుకోవదానికి సుమన్ బోస్ కి ఆ అర్హత లేదు,ఇక ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇలాంటి ఒప్పందం కూడా లేదు

19:05PM, అక్టోబర్‌ 14, 2023
ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం జరిగిందిలా
►వచ్చే వారం సుప్రీంకోర్టు ముందుకు ఫైబర్ గ్రిడ్ కేసు 
►ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు 
► గతంలో ఏపీ సివిల్‌ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్‌ కంపెనీ
► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం
► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు
► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు
► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం
► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు
► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్‌
► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్‌
► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID
► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్‌ జైన్‌
► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్
► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్‌ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన సీఐడీ

18:59PM, అక్టోబర్‌ 14, 2023
చంద్రబాబు ఒక్కడే జైలుకు వెళ్లలేదు

► ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చెయ్యడం కొత్త కాదు
►ఎందరో రాజకీయ నాయకులు కోర్టు ముందు విచారణకు నిలబడ్డారు.
►ఎవరూ సానుభూతి ఆటలు ఆడలేదు
► బీహార్‌లో పశుదాణా స్కాంలో లాలూ అరెస్టయ్యారు
► తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జయలలిత జైలుకెళ్లారు
► ఉత్తరప్రదేశ్‌లో మాయావతిపై కేసు పెట్టారు
► న్యాయ స్థానం ముందు అందరూ సమానం
► రూల్ ఆఫ్ లా ఇన్ ఇండియాకు ఎవరు కూడా అతీతులు కాదు
► కోర్టు విచారణ ఎప్పుడు కూడా ఆధారాల మీద ఉంటుంది
► చంద్రబాబు నాయుడు ఏ తప్పు చెయ్యలేదని ఆధారాలు లేకపోతే కోర్టు ఆయనని జైలుకు పంపదు.!
::: చంద్ర బాబు నాయుడు అరెస్ట్ పై మేధావుల అభిప్రాయం

18:45PM, అక్టోబర్‌ 14, 2023
ప్రెస్‌ మీట్‌లో పచ్చ మీడియా అత్యుత్సాహం

►చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్య బృందంతో జైళ్ల శాఖ డీఐజీ ప్రెస్‌మీట్‌
► స్కిన్‌ అలర్జీ ఉంది గనుక కూల్ వెదర్ లో ఆయన ఉంచాలని రికమెండ్ చేశామని స్పష్టం చేసిన వైద్యుల బృందం
► ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
►చంద్రబాబుని మీడియాకు చూపించాలంటూ యెల్లో మీడియా ఓవరాక్షన్‌
►జైలు నిబంధనల పట్టింపు లేకుండా ఇష్టానుసారం ప్రశ్నలు
►మీడియా ప్రశ్నలతో షాక్‌ తిన్న జైల్‌ అధికారులు, వైద్య బృందం
►ఆయనకు శరీరంలో ఎక్కడెక్కడ సమస్య ఉందన్న విషయాన్ని మీడియాముఖంగా వెల్లడించలేమని వైద్యుల స్పష్టీకరణ
►రూల్స్‌ తెలుసుని మాట్లాడాలన్న జైళ్ల శాఖ డీఐజీ
 

18:39PM, అక్టోబర్‌ 14, 2023
చంద్రబాబు ఆరోగ్యంపై అపోహలొద్దు

►చంద్రబాబు హైప్రొఫైల్‌ ప్రిజనర్‌
►చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్క్ష్యంగా లేరు
►ఆయన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉన్నాం
►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు
►ప్రతీరోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు చేయిస్తున్నాం
►డాక్టర్‌ ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం మేం ఫాలో అవుతున్నాం
►డాక్టర్లు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పిస్తాం
►24 గంటలు చంద్రబాబుకి జైలు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు
►అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకున్నాం
►ఎవరితో ఎలా నడుచుకోవాలో మాకు తెలుసు
►ప్రోటోకాల్‌ ప్రకారమే నడుచుకుంటున్నాం
►చంద్రబాబు మెడికల్‌ రిపోర్ట్‌ను ఆయన లాయర్లే అడిగారు
►మెడికల్‌ రిపోర్ట్‌ ఇవ్వాలా? అని చంద్రబాబును అడిగాం
►చంద్రబాబు అనుమతితోనే ఆయన రిపోర్ట్‌ను న్యాయవాదులకు ఇచ్చాం
►నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు
►హైప్రోఫైల్‌ ఖైదీల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం
►చంద్రబాబు ఆరోగ్య విషయంలో ఎలాంటి అపోహలు వద్దు
::: జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ 

18:15PM, అక్టోబర్‌ 14, 2023
చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు 
►చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించాం
►ఐదుగురు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది
►చంద్రబాబుతో స్వయంగా మాట్లాడాం
►బాబును ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదు
►చంద్రబాబుకి స్కిన్‌ అలర్జీ ఉంది
►బాబు వ్యక్తిగత డాక్టర్లను సంప్రదించి మరీ ట్రీట్‌మెంట్‌ ఇచ్చాం
►రిమాండ్‌కు రాకముందు బాబుకి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో మాకు తెలియదు
►చంద్రబాబు వేసుకుంటున్న మందులను మాకు చూపించారు
►చంద్రబాబుకి ఎలాంటి స్టెరాయిడ్స్‌ ఇవ్వడం లేదు
:::ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ శివకుమార్‌

18:00PM, అక్టోబర్‌ 14, 2023
అమరావతిలో అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసు
► అసైన్డ్‌ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టు
►నారా , నారాయణ నల్లధనం నెట్‌వర్క్‌ బట్టబయలు
►అమరావతి­లోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్‌ రైతులను బెదిరించి భూములు కొట్టేశారు
►ఎన్‌స్పైర నుంచి ఆర్కే హౌసింగ్‌కు నిధుల బదిలీ.. అక్కడి నుంచి బినామీలకు నగదు
►అసైన్డ్‌ రైతుల భూముల లూటీ
►తమ బినామీలకే భూసమీకరణ ప్యాకేజీ స్థలాలు దక్కేలా వ్యూహం
►అవినీతి నెట్‌వర్క్‌ను బట్టబయలు చేసిన సిట్‌ దర్యాప్తు
►పచ్చగద్దల జాబితాలో గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, రావెల తదితరులు
►ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీవీ వియ్యంకుడు కూడా
►రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ
అసైన్డ్‌ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు
♦నారా చంద్రబాబునాయుడు  (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి)
♦  నారా లోకేశ్‌  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦ పొంగూరు నారాయణ  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  గంటా శ్రీనివాసరావు  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  దేవినేని ఉమామహేశ్వరరావు  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  ప్రత్తిపాటి పుల్లారావు  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  రావెల కిశోర్‌ బాబు  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  తెనాలి శ్రావణ్‌ కుమార్‌  (టీడీపీ మాజీ ఎమ్మెల్యే)
♦  గుమ్మడి సురేశ్‌ (టీడీపీ ప్రభుత్వంలో  ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ  వెంకటేశ్వరరావు వియ్యంకుడు)
♦   మండల ఎస్‌.ఎస్‌.కోటేశ్వరరావు (రియల్టర్‌)
♦  మండల రాజేంద్ర (రియల్టర్‌)
♦  కేవీపీ అంజనీ కుమార్‌ (రియల్టర్‌)
♦  దేవినేని రమేశ్‌ (రియల్టర్‌)
♦  బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్‌ (రియల్టర్‌)
♦ హరేంద్రనాథ్‌ చౌదరి (రియల్టర్‌)
♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్‌)
♦ దోనేపూడి దుర్గా ప్రసాద్‌ (రియల్టర్‌)

16:57PM, అక్టోబర్‌ 14, 2023
జైల్లో బాబు రాజకీయ మంతనాలు
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రాజకీయాలు 
►ఇవాళ ములాఖత్‌లో కలిసిన నారా లోకేష్, భువనేశ్వరి
►టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా 
►చంద్రబాబుకు వైద్య పరీక్షలు, మందులతో పాటు పలు విషయాలు అడిగి తెలుసుకున్న కుటుంబ సభ్యులు
►తండ్రితో ఢిల్లీ అమిత్ షా మీటింగ్ గురించి చెప్పిన నారా లోకేష్
►పాదయాత్ర వాయిదా గురించి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన భువనేశ్వరి
►జైల్లో ఉక్కపోత  గురించి చెప్పిన చంద్రబాబు 
►30 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడిన కుటుంబ సభ్యులు
►ఆపై తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు చర్చించినట్లు చెప్పిన కాసాని

16:20PM, అక్టోబర్‌ 14, 2023
ముగిసిన చంద్రబాబు ములాఖత్‌

►స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు
►శనివారం మధ్యాహ్నాం ములాఖత్‌ అయిన కుటుంబ సభ్యులు 
►గంటపాటు కొనసాగిన ములాఖత్‌ 
►ఎవరు కలుస్తారనే దానిపై చివరిదాకా స్పష్టత ఇవ్వని కుటుంబ సభ్యులు
►చివరకు.. ములాఖత్‌ అయిన భువనేశ్వరి, లోకేశ్‌, టీటీడీపీ చీఫ్‌ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
►చంద్రబాబును చూడగానే బాధ కలిగింది: కాసాని
►తెలంగాణలో టీడీపీ పోటీకి సంబంధించి పలు సూచనలు తీసుకున్నా: కాసాని

14:51PM, అక్టోబర్‌ 14, 2023
ములాఖత్‌లోనూ టీడీపీకి లేని స్పష్టత
►చంద్రబాబు నాయుడు ములాఖత్‌ విషయంలోనూ కొరవడిన స్పష్టత 
►రాజమండ్రి సెంట్రల్ జైల్‌ వద్దకు వచ్చిన భార్య నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కొందరు టీడీపీ నేతలు
►కుటుంబ సభ్యులతో పాటు టీటీడీపీ చీఫ్‌ కాసాని జ్ఞానేశ్వర్ కూడా
►ములాఖాత్‌లో చంద్రబాబును ఎవరెవరు కలుస్తారనే దానిపై టీడీపీకే లేని స్పష్టత


14:35PM, అక్టోబర్‌ 14, 2023
చంద్రబాబుకు.. పవన్‌ సినిమాలోలాగే అవుతుందేమో!

►చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచి హాని ఉండొచ్చు!
►‘కెమెరామెన్ గంగతో రాంబాబు’లో జరిగినట్లే  జరిగే అవకాశం లేకపోలేదు
►పవన్ నటించిన ఆ సినిమాలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు మధ్య జరిగే సన్నివేశాలాగా జరిగే అవకాశం ఉంది
►తనను కుటుంబీకులే కుట్ర చేసి అంతం చేస్తారనే భయం చంద్రబాబుకి ఉంది
►ఆనాడు కట్టుకున్న భర్త..  తన కన్నతండ్రిని వెన్నుపోటు పొడిచి అధికారంలో రావడమే కాదు.. చావుకు కారణమైనా భువనేశ్వరి కనీసం స్పందించలేదు
►చంద్రబాబుకు ఇప్పుడు ఏమైనా జరిగితే లోకేష్, భువనేశ్వరి బాధ్యత వహించాలి.
:::డిప్యూటీ సీఎం సత్యనారాయణ కొట్టు కామెంట్స్:

14:20PM, అక్టోబర్‌ 14, 2023
చిత్రవిచిత్రమైన నిరసన

►మరో నిరసనకు పిలుపు ఇచ్చిన టీడీపీ
►చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వరుస నిరసనలు
► ఏ ఒక్కదాన్ని పట్టించుకోని ప్రజలు
►టీడీపీ శ్రేణులే దూరంగా ఉంటున్న వైనం
►తాజాగా న్యాయానికి సంకెళ్లు పేరుతో నిరసనకు పిలుపు
►రేపు(ఆదివారం) సాయంత్రం నిరసన పాటించాలని ప్రకటన
►సాయంత్రం 07:00గం. నుంచి 07:05 దాకా చేతులు కట్టేసుకోవాలని ప్రజలకు పిలుపు
► ఇళ్ల నుంచి బయటకు వచ్చి సంకెళ్లతో ఫొటోలు, వీడియోలు దిగాట. 
►వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి చంద్రబాబుకి  సంఘీభావం తెలపాలంటూ టీడీపీ పిలుపు

01:30PM, అక్టోబర్‌ 14, 2023
చంద్రబాబుతో కాసేపట్లో కుటుంబసభ్యుల ములాఖత్

►ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్
►తల్లి భువనేశ్వరితో కలిసి ములాఖత్‌కు వెళ్లనున్న లోకేష్
►5 కేజీల బరువు తగ్గారంటూ భువనేశ్వరి, బ్రాహ్మణి ఆందోళన
►ప్రభుత్వాస్పత్రిలో వీఐపీ ఐసీయూ సిద్ధం చేసిన వైద్య సిబ్బంది
► ప్రత్యేక వార్డును శుభ్రం చేసిన ఆస్పత్రి సిబ్బంది
►జైలు నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవంటున్న ఆస్పత్రి సిబ్బంది
►దినచర్యలో భాగంగానే ఐసీయూను సిద్ధం చేశామని వెల్లడి

01:00PM, అక్టోబర్‌ 14, 2023
► రాజమహేంద్రవరం టీడీపీ క్యాంపు కార్యాలయానికి నారా లోకేష్
► టీడీపీ క్యాంపు కార్యాలయంలో లోకేష్ ను కలిసిన కాసాని జ్ఞానేశ్వర్
► బుచ్చయ్య, చినరాజప్ప, జవహర్, కాసాని జ్ఞానేశ్వkHSy సమావేశమైన లోకేష్
►మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ 

012:30PM, అక్టోబర్‌ 14, 2023
►చంద్రబాబుతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్
►ములాఖత్ తర్వాత చంద్రబాబు ఆరోగ్యంపై స్పష్టత వచ్చే అవకాశం
►అచ్చెన్నాయుడు చెప్పినట్లు ప్రభుత్వం నడవదు : మంత్రి చెల్లుబోయిన వేణు
►తెలుగు డ్రామా పార్టీగా టీడీపీ మారింది
►నిబంధనల ప్రకారమే జైలు అధికారులు నడుచుకుంటున్నారు
►చంద్రబాబు బరువు తగ్గారని అసత్య ప్రచారం చేస్తున్నారు 

11:50AM, అక్టోబర్‌ 14, 2023
హైదరాబాద్‌లో టీడీపీ ఐటీ వింగ్‌ పేరిట ఓవరాక్షన్‌

►టీడీపీ ఐటీ వింగ్‌పై మెట్రో ప్రయాణికుల ఫైర్‌
►లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌ పేరిటి టీడీపీ అతి
►టీడీపీ ఐటీ వింగ్‌ పేరుతో ఓ వర్గం డ్రామా
►టీడీపీ నేతలకు షాక్‌ ఇచ్చిన మెట్రో ప్రయాణికులు
►హైదరాబాద్‌లో అరిస్తే ఏమీ అవ్వదంటూ టీడీపీ వింగ్‌పై మెట్రో ప్రయాణికుల ఆగ్రహం

11:28AM, అక్టోబర్‌ 14, 2023
ఎన్నాళ్ళీ తెలుగు డ్రామాల పార్టీ నాటకాలు?: విజయసాయిరెడ్డి ఫైర్‌

►చంద్రబాబుకు ఇంటి భోజనం అందుతోంది
►జైలులో ప్రత్యేక గది కేటాయించారు
►ప్రతిరోజు మూడుసార్లు ముగ్గురు డాక్టర్లు చెక్ అప్ చేస్తున్నారు
►8 మంది పోలీసులు కాపలాగా ఉన్నారు 
►తాను నేరాలకు తగిన శిక్ష అనుభవించేందుకు చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు
►నెలరోజులు జైలులో ఉండేసరికి పూర్తి విశ్రాంతితో  చంద్రబాబు గారు కిలో బరువు పెరిగారు. 
►ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా పోయాయని సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారు. 
►స్కామ్స్ లో బెయిల్ రాకపోయేసరికి అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నట్లు రుజువైంది. 
 

10:35AM, అక్టోబర్‌ 14, 2023
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కొత్త ట్విస్ట్‌
►అసైన్డ్‌ భూముల కేసులో సీఐడీ సరికొత్త ఆధారాలు
►రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు
►చంద్రబాబు, పొంగూరు నారాయణ మీద అభియోగాలు
►ఈ కేసు విచారణ జరగకుండా మార్చి 19న హైకోర్టు స్టే
►కేసును కొట్టేయాలంటూ నారాయణ సైతం క్వాష్‌ పిటిషన్‌ దాఖలు
►క్వాష్‌ పిటిషన్‌పై విచారణ తర్వాత అక్టోబర్‌ 16కు తీర్పు వాయిదా
►ఈ క్రమంలోనే మళ్లీ ఓపెన్‌ చేయాలని సీఐడీ తాజా పిటిషన్‌

10:00AM, అక్టోబర్‌ 14, 2023
►ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న నారా లోకేష్‌.
►గన్నవరం నుంచి రోడ్డు మార్గాన రాజమండ్రి వెళ్లనున్న లోకేష్.
►చంద్రబాబుతో ములాఖత్‌కు ధరఖాస్తు చేసుకున్న కుటుంబ సభ్యులు.

90:50AM, అక్టోబర్‌ 14, 2023
►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అవసరం లేదన్న డాక్టర్‌లు
►చంద్రబాబుకు రాజమండ్రి ఆసుపత్రిలో వీఐపీ గది సిద్ధం
► అందుబాటులో రెండు ఆక్సిజన్ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్, వెంటిలేటర్, వైద్య పరికరాలు, మందులు
►ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి చెందిన వైద్యుడితో పాటు ఇద్దరు క్యాజువాలిటీ డాక్టర్లు, మరో ఇద్దరు స్టాఫ్ నర్సుల కేటాయింపు

9:30AM, అక్టోబర్‌ 14, 2023
►రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు
►చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన జైలు అధికారులు
►7 అంశాల పైన నిన్న వైద్య పరీక్షలు,  నివేదిక వెల్లడించిన జైలుశాఖ అధికారులు
►చంద్రబాబు కిలో బరువు పెరిగారన్న జైలు శాఖ డీఐజీ రవికిరణ్
►- 5 కిలోలు బరువు తగ్గారన్న కుటుంబసభ్యుల ఆందోళన అసరం లేదని తేల్చిన డాక్టర్

7:15AM, అక్టోబర్‌ 14, 2023
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 35వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►చంద్రబాబు భద్రత ఆరోగ్య విషయంలో నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసిన జైలు అధికారులు
►స్నేహ బ్యారక్ లో చంద్రబాబు ఉన్న గదిలో 8 ఫ్యాన్లు ఏర్పాటు చేసిన అధికారులు
►అత్యవసర పరిస్థితి ఏర్పడితే చికిత్స అందించేందుకు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ముందు జాగ్రత్త చర్యగా ఒక వీఐపీ రూమును సిద్ధం చేసిన అధికారులు
►నెల రోజులు వ్యవధి లో  జైల్లో ఒక కిలో బరువు పెరిగిన చంద్రబాబు
►చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారంటూ రెండో రోజు కూడా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన జైలు అధికారులు

7:00AM, అక్టోబర్‌ 14, 2023
ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పిటిషన్‌పై హైకోర్టు స్పందన
►చంద్రబాబు, అచ్చెన్న, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ సహా 44 మందికి నోటీసులు
►కౌంటర్లు దాఖలు చేయాలంటూ... విచారణ నవంబరు 10కి వాయిదా
►సీబీఐకి ఇవ్వాలని నాలుగేళ్ల క్రితమే మా వైఖరిని చెప్పాం
►ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు: రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌
►ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి
►హైకోర్టును కోరిన ఉండవల్లి తరఫు సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి 

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ప్రభుత్వ న్యాయవాది రోహత్గీ ప్రశ్నలు
►ఏమీ తెలియదంటూ.. 17ఏ రక్షణ కావాలంటే ఎలా? 
►ఇవి రెండూ పరస్పర విరుద్ధ వాదనలు కాదా? 
►చంద్రబాబు క్వాష్‌ పిటిషన్లో ఏపీ ప్రభుత్వ న్యాయవాది రోహత్గీ ప్రశ్నలు
►నిజాయితీపరుల రక్షణకే 17ఏ... గత ఘటనలకూ పాత చట్టాలు వర్తిస్తాయి 
►ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేశాయి... కోర్టుకు నివేదన
►చంద్రబాబుకు డబ్బు చేరినట్లు ఎలా గుర్తించారని ప్ర శ్నించిన ధర్మాసనం
►షెల్‌ కంపెనీల ద్వారా బాబు, ఆయన పార్టీ ఖాతాల్లోకి చేరిందన్న రోహత్గీ
►ఒప్పందం సీఎం స్థాయిలోనే జరిగిందని కూడా వెల్లడి
►తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా

చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామా
►చంద్రబాబుకు అనారోగ్యమంటూ టీడీపీ హడావుడి
►ఆసుపత్రిలో చేర్చేందుకే ‘అనారోగ్యం’ పథకం.. బాబు బరువు తగ్గలేదు.. జైలుకొచ్చాక మరో కిలో పెరిగారు
►ఇంటి భోజనం.. మూడు పూట్లా ఆరోగ్య పరీక్షలు.. పూర్తి ఆధారాలతో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన జైళ్ల శాఖ
►బాబు జైల్లో.. చినబాబు ఢిల్లీలో.. నైరాశ్యంలో తమ్ముళ్లు
►ఇప్పట్లో బెయిల్‌ రాదనే సానుభూతి ఎత్తుగడ
►బెడిసికొట్టిన రాజకీయ కుతంత్రం

చంద్రబాబుపై పోసాని ధ్వజం
►జైలులో ఉంటూ బయట అల్లర్లకు చంద్రబాబు కుట్ర
►తండ్రిని చంపి భర్త సీఎం కావాలని భువనేశ్వరి కోరుకున్నారు
►అందుకే ఎన్టీఆర్‌ చేసిన పాపాలే ఆయనకు ఆ గతి పట్టించాయని ప్రచారం చేశారు
►ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టించి, అన్యాయంగా బలితీసుకున్న పాపానికే తన భర్త జైలులో ఉన్నారని భువనేశ్వరి ఎందుకు చెప్పలేకపోతున్నారు?
►ఎన్టీఆర్‌కు విలువలు లేవని చంద్రబాబు చెప్పారు.. 
►చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలతో జైలులో వందల మంది పోలీసుల రక్షణలో ఉన్నారు. 
►ఇంక అన్యాయం ఎక్కడ? లోకేశ్‌ ఢిల్లీ వెళ్లి.. తన తండ్రిని అవినీతి కేసుల నుంచి బయటపడేయండి అంటూ ప్రాధేయపడుతున్నారు
►ప్రజలు తమ కోసం ప్రభుత్వంపై రాళ్లు వేయట్లేదనే భువనేశ్వరి ఏడుపు
►కులపిచ్చిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఇందుకే
►పురందేశ్వరి సిద్ధాంతం, వ్యక్తిత్వం లేని నాయకురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement