CBN : ఫైబర్‌ నెట్‌ కేసు విచారణ వాయిదా | After Chandrababu Quash Jolt Supreme Court Hearing Fibernet Petition | Sakshi
Sakshi News home page

CBN : ఫైబర్‌ నెట్‌ కేసు విచారణ వాయిదా

Published Wed, Jan 17 2024 7:50 AM | Last Updated on Fri, Feb 2 2024 7:31 PM

After Chandrababu Quash Jolt Supreme Court Hearing Fibernet Petition - Sakshi

చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఇవ్వాళ బెంచ్‌ మీదకు రాలేదు. ఫైబర్‌ నెట్‌ కేసుకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా.. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేశారు చంద్రబాబు. ఈ పిటిషన్‌ను ఇవ్వాళ విచారించడం లేదని జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌ వెల్లడించారు. త్వరలో విచారణ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

3.20pm, జనవరి 17, 2024
విచారణ వాయిదా ఎందుకంటే..

  • ఏపీ ఫైబర్ నెట్ కేసుపై సుప్రీంకోర్టులో నేడు జరగని విచారణ
  • చంద్రబాబు తరపున వాదించేందుకు కోర్టుకు వెళ్లిన సిద్ధార్థ్ లూథ్రా
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం CID తరపున హాజరైన అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డు
  • ఫైబర్‌ గ్రిడ్‌ కేసును జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ ముందు ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది
  • ఈ రోజు బెంచ్‌ కూర్చోవడం లేదని చెప్పిన జస్టిస్ అనిరుద్ధ బోస్
  • 14వ నెంబర్‌ కోర్టులో విచారణలో బిజీగా ఉన్న జస్టిస్ బేలా త్రివేది
  • తదుపరి విచారణ తేదీని ప్రకటిస్తామన్న జస్టిస్ బోస్

3.10pm, జనవరి 17, 2024
చంద్రబాబు పిటిషన్‌ వాయిదా

  • ఫైబర్‌గ్రిడ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కావాలంటూ చంద్రబాబు పిటిషన్‌
  • ఈ కేసులో జరగని విచారణ
  • ఈరోజు తాము కూర్చోవడం లేదని స్పష్టం చేసిన జస్టిస్ అనిరుధ్ బోస్
  • తదుపరి విచారణ తేదిని తర్వాత ప్రకటిస్తామన్న జస్టిస్ అనిరుధ్ బోస్

3.05pm, జనవరి 17, 2024
పిటిషన్‌ @ వెయిటింగ్‌

  • ఢిల్లీ: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌
  • ఇంకా విచారణకు రాని పిటిషన్‌
  • 14 వ కోర్టు విచారణలో బిజీగా ఉన్న జస్టిస్ బేలా త్రివేది

2.55pm, జనవరి 17, 2024
అంతులేని అక్రమాలు..

  • ఫైబర్‌ గ్రిడ్‌లో 2014–2019 మధ్య సుమారు రూ.3,492 కోట్ల విలువైన పనులు
  • ఫేజ్‌ 1 కింద రూ.333 కోట్ల పనులు
  • సీసీ కెమెరాల కొనుగోలుకు రూ.959 కోట్లు
  • భారత్‌ నెట్‌కు రూ.1,600 కోట్లు
  • రూ.600 కోట్లతో సెట్‌ టాప్‌ బాక్సుల కొనుగోలు
  • కొనుగోలు చేసిన 12 లక్షల సెట్‌టాప్‌ బాక్సుల్లో 3.40 లక్షల బాక్స్‌లు పని చేయలేదు
  • అవి నాసిరకంగా ఉన్నాయని కింది సిబ్బంది చెప్పినా వినని పైనవాళ్లు
  • చైనా కంపెనీలతో డీల్‌ కుదుర్చుకున్న హరికృష్ణప్రసాద్‌

2.50pm, జనవరి 17, 2024
శాఖలు దాటి సంతకాలు

  • ఏ ఫైలుపైనైనా సంబంధిత శాఖ మంత్రే సంతకం చేయాలి, ఇతర మంత్రులు సంతకం చేయకూడదు.
  • 2017లో ఏప్రిల్‌ 3న లోకేశ్‌ను కేబినెట్‌లోకి తీసుకుని IT, పంచాయతీరాజ్‌ శాఖలు అప్పగించిన చంద్రబాబు
  • లోకేశ్‌ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్‌ను 2017 సెప్టెంబర్‌ 14న APSFLకు సలహాదారుగా నియమించారు
  • లోకేశ్‌ వద్ద ఉన్న శాఖలకు, APSFLకు  సంబంధం లేదు
  • కానీ APSFLకు చెందిన ఫైల్‌ పై లోకేశ్‌ సంతకాలు చేశారు
  • భారత్‌ నెట్‌ ఫేజ్‌ 2కి సంబంధించిన MOU ఫైల్‌ పై నారా లోకేశ్‌ 2017 నవంబర్‌ 12న సంతకం
  • BBNL(భారత్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ నెట్‌ వర్క్‌ లిమిటెడ్‌) రెండో దశకు సంబంధించి ఆ సంస్థకూ APSFLకూ మధ్య MOUను ఆమోదిస్తూ సంబంధిత ఫైల్‌పై కూడా లోకేశ్‌ సంతకం
  • BBNL మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్‌ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించిన లోకేష్‌
  • అర్హత లేని టెరా సాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగింత
  • దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. 
  • వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు

2.45pm, జనవరి 17, 2024
CID దర్యాప్తులో బయటపడ్డ అంశాలు

  • దోపిడీకి అడ్డాగా ఫైబర్‌ గ్రిడ్‌
  • రాష్ట్రంలో ఒకే కనెక్షన్‌తో ఇంటింటికీ కారు చౌకగా కేబుల్‌ టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్, ఫోన్‌ సౌకర్యాన్ని కల్పిస్తామని నాడు బాబు ప్రభుత్వం ప్రచారం
  • ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు 2015లో శ్రీకారం చుట్టిన చంద్రబాబు
  • ఇందుకోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు
  • ఆగస్టు 10, 2012 నుంచి సెప్టెంబర్‌ 8, 2015 వరకూ టెరా సాఫ్ట్‌ అనుబంధ సంస్థ టెరా క్లౌడ్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా వేమూరి హరికృష్ణప్రసాద్‌
  • వేమూరిని ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా నియమించుకున్న చంద్రబాబు
  • ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌లో తొలిదశ పనులను రూ.333 కోట్లతో చేపట్టేందుకు ఆగస్టు 26, 2015న ఇన్‌క్యాప్‌(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌) నుంచి ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అనుమతి
  • ఈ టెండర్‌ మదింపు కమిటీలో ఐటీ సలహాదారు హరికృష్ణప్రసాద్‌ను చేర్చిన చంద్రబాబు
  • తూర్పుగోదావరి జిల్లాలో ఈపాస్‌ యంత్రాల సరఫరాలో గోల్‌మాల్‌ చేసిన టెరా సాఫ్ట్‌ను ఏపీటీఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌) సంస్థ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది
  • కానీ.. ఫైబర్‌ గ్రిడ్‌ తొలి దశ టెండర్‌ను మాత్రం ఆగస్టు 30, 2015న టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టారు.
  • టెరా సాఫ్ట్‌కు కేబుళ్లు, నెట్‌ వర్క్‌ ఆపరేషన్‌ సెంటర్‌(నాక్‌), హెడ్‌ ఎండ్‌ అనుభవం ఉన్నట్లు సిగ్నమ్‌ కంపెనీ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించిన ఘనులు
  • దీనిపై ఫిర్యాదు చేసిన సిగ్నమ్‌ కంపెనీ ఎండీ
  • నాసిరకం కేబుల్, క్లాంప్‌లతో టెరా సాఫ్ట్‌ తొలి దశలోనే రూ.333 కోట్లను దోపిడి

2.40pm, జనవరి 17, 2024
వాదనల సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం ఏం చెప్పారంటే..

  • చంద్ర­బాబు సిఫారసుతోనే గవర్నింగ్‌ కౌన్సిల్‌లో వేమూరి హరిప్రసాద్‌ సభ్యుడు అ­య్యా­డు
  • టెరాసాఫ్ట్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఎలాంటి కారణం లేకుండా టెండర్‌ గడువును పొడిగించారు
  • చంద్రబాబు కార్యాలయం మౌఖిక ఆదేశాలతో టెండర్‌ గడువు చివరి తేదీకి ముందు రోజు టెరాసాఫ్ట్‌ను బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తొలగించారు
  • సంబంధిత శాఖకు ఇన్‌చార్జ్‌గా ఉన్న ఓ ఉన్నతాధికారి టెరాసాఫ్ట్‌కు ప్రాజెక్టు అప్పగించడంపై అభ్యంతరం తెలిపారు
  • ఆయన్ని బదిలీ చేసి, నామమాత్రపు పోస్టుకు మార్చారు
  • టెండర్‌ నిబంధనలు, ఒప్పందంలో నిర్దేశించిన ప్రమా­ణాల­కు భిన్నంగా కాంట్రాక్టు సంస్థ నాసిరకం సామగ్రిని ఉపయో­గిం­చింది
  • ఖజానాకు రూ.115 కోట్ల మేర నష్టం వాటి­ల్లింది
  • ఈ మొత్తం టెరాసాఫ్ట్‌ అధినేత, చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్‌కు చేరింది
  • తొలుత హరిప్రసాద్‌కు, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకు, అక్కడి నుంచి చంద్రబా­బు, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకు నిధులు మళ్లాయి

2.35pm, జనవరి 17, 2024
వాదనల సందర్భంగా చంద్రబాబు లాయర్‌ అగర్వాల్‌ ఏం చెప్పారంటే..

  • చంద్రబాబు లబ్ధి పొందినట్లు ఒక్క ఆధారం చూపలేదు
  • సీఐడీ ఈ కేసు నమోదు చేసి రెండేళ్లయింది
  • ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేయ­లేదు
  • చార్జిషీట్‌ దాఖలు చేయలేదు
  • ప్రాజె­క్టు వ్యయం పెంపు పూర్తిగా సంబంధిత శాఖ అంత­ర్గత విష­య­ం
  • ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు లబ్ధి పొందలేదు

ఈ రెండేళ్లు చంద్రబాబు బయటే ఉన్నారని, ఒక్క సాక్షిని కూడా ప్రభా­వితం చేయలేదని చెప్పారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వ ప్రోద్బలంతో సీఐడీ ఈ కేసు నమోదు చేసిందన్నారు. ప్రతి కేసులో చంద్రబాబును జైలులోనే ఉంచాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోందన్నారు. 

2.30pm, జనవరి 17, 2024
ఫైబర్‌నెట్‌ కేసు @ సుప్రీంకోర్టు

  • కాసేపట్లో సుప్రీం కోర్టు లో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ
  • మద్యాహ్నం 3 గంటలకు సుప్రీం కోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ
  • ఫైబర్ నెట్ కేసుపై హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్
  • చంద్రబాబు ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసిన చంద్రబాబు
  • బాబు పిటిషన్ ను విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం
  • 17ఏపై స్పష్టత వచ్చిన తరువాతే ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో చెప్పిన సుప్రీం ధర్మాసనం

2.25pm, జనవరి 17, 2024
ఫైబర్‌నెట్‌ కేసులో ఏం జరిగిందంటే..?

  • చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫైబర్‌నెట్‌ కుంభకోణం
  • రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారని సీఐడీ అభియోగం
  • 2021లో APSFL ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు
  • 2015 సెప్టెంబర్‌ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం
  • రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టినట్టు రికార్డులు
  • నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్ని­హి­తు­డైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్‌’ కంపెనీకి టెండర్లు
  • వాస్తవానికి ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి
  • ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టు­బడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయం

ఢిల్లీ, సాక్షి: ఫైబర్‌ నెట్‌కేసులో ముందస్తు బెయిల్‌ కోసం టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. స్కిల్‌ కేసు క్వాష్‌ పిటిషన్‌పై ఈ ధర్మాసనమే నిన్న భిన్న తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ తిరస్కరణ ఎదురైంది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారాయన. అయితే స్కిల్‌ కేసుకు సంబంధించి 17-ఎ సెక్షన్‌తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఫైబర్‌ కేసు పిటిషన్‌ విచారణ వాయిదావేసింది. అప్పటివరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీచేసింది.

మంగళవారం సెక్షన్‌ 17-ఏపై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌కు రిఫర్‌ చేసింది. కానీ, స్కిల్‌ కేసులో చంద్రబాబు అరెస్టును, రిమాండ్‌ను ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌పై ఇవాళ్టి విచారణలో ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

ఫైబర్‌ నెట్‌ కేసు నేపథ్యం.. 
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫైబర్‌నెట్‌ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నది సీఐడీ ప్రధాన అభియోగం. 2021లో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయ్యింది. టీడీపీ ప్రభుత్వంలో 2015 సెప్టెంబర్‌ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగిందన్నది సీఐడీ చెబుతోంది. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్ని­హి­తు­డైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్‌’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. చంద్ర­బాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టి­పెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టు­బడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు.

చట్టానికి విరుద్ధంగా..
ఫైబర్‌ నెట్‌ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టెరా సాఫ్ట్‌కు కట్ట­బెట్ట­డం కోసం చంద్రబాబు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పర­స్పర ప్రయో­జ­నాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టెరా సాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ముందుగానే రెండు కీలక పదవుల్లో నియ­మిం­చారు. తొలుత ఆయన్ని ఏపీ ఈ– గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించ­డంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఫైబర్‌ నెట్‌ టెండర్ల మదింపు కమిటీ­లోనూ సభ్యుడిగా నియ­­మించారు.

ఓ ప్రాజెక్టు టెండర్ల మదింపు కమిటీలో ఆ ప్రాజెక్టు కోసం పోటీ పడే సంస్థకు చెందిన వారు ఉండకూడదన్న నిబంధ­ననూ ఉల్లంఘించారు. టెరా సాఫ్ట్‌ సంస్థ అప్పటికే బ్లాక్‌ లిస్టులో కూడా ఉంది. అంతకు ముందు చేపట్టిన ప్రాజె­క్టులను సకాలంలో పూర్తి చేయ­లేకపోవడంతో ఆ కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. కానీ చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చి బ్లాక్‌ లిస్ట్‌ జాబితా నుంచి టెరా సాఫ్ట్‌ కంపెనీ పేరును తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్క­న­బెట్టి మరీ టెరా సాఫ్ట్‌ కంపెనీకి ప్రాజెక్టును కట్టబెట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement