ఢిల్లీ, సాక్షి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఊరట కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సర్వోన్నత న్యాయస్థానంలో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. 17-ఏ విషయంలో భిన్నాభిప్రాయాలు మాత్రమే వ్యక్తం చేస్తూ సీజేఐకి పిటిషన్‌ను బదిలీ చేశారు ఇద్దరు న్యాయమూర్తులు. ఈ క్రమంలో ACB కోర్టు అంటే ట్రయల్ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను పూర్తిగా సమర్థించారు. ఇది ఏరకంగా చూసినా చంద్రబాబుకు భారీ భంగపాటే అంటున్నారు న్యాయ నిపుణులు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూస్తే ఎవరికైనా అర్థమవుతుందంటున్నారు న్యాయ నిపుణులు. తీర్పు విషయంలో జడ్జిలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ చంద్రబాబు రిమాండ్ విషయంలో జోక్యం చేసుకోబోమని ఇద్దరు కూడా స్పష్టం చేయడం గమనార్హం. అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే వాదనను తోసిపుచ్చారు. అలాగే.. ఈ కేసులో చంద్రబాబుకి ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ చెల్లుతుందని, దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపారు. దీంతో ఈ కేసు విచారణ ముందుకు సాగేందుకు దర్యాప్తు సంస్థ సీఐడీకి మార్గం సుగమం అయ్యింది.
క్వాష్ చేసేదే లే..
ఈ కేసును మొదటి నుంచి రాజకీయ కక్ష వ్యవహారంగా ప్రొజెక్ట్ చేసే యత్నం చేశారు చంద్రబాబు లాయర్లు. కానీ, కోర్టు మాత్రం ఆ వాదనతో ఏకీభవించలేదు. దీనిని రాజకీయాలకు ముడిపెట్టలేమని, ఈ కేసుకు రాజకీయ కక్షలకు సంబంధం లేదని తేల్చేసింది. ఈ కేసులో నేరం జరిగింది, నిధుల మళ్లింపు జరిగింది, విశ్వాస ఘాతుకం చోటు చేసుకుందన్న సీఐడీ వాదనను సమర్థించింది. అరెస్ట్‌పై అభ్యంతరాన్ని లేవనెత్తుతూ బాబు లాయర్లు కేసును క్వాష్ చేయాలన్న వాదన అసమంజసంగా తేల్చేసింది సుప్రీంకోర్టు.
ఇదీ చదవండి: రిమాండ్ సబబే.. క్వాష్ చేయలేం
యావజ్జీవం తప్పదా?
మొత్తమ్మీద ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట దక్కలేదు. పైగా.. ఇప్పుడయినా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చన్న సుప్రీంకోర్టు సూచనపై న్యాయనిపుణులు ఏం చెబుతున్నారంటే.. ‘‘నేరం జరిగింది, దర్యాప్తును కూడా పక్కాగా చేయమని మాత్రమే సుప్రీంకోర్టు చెబుతున్న విషయం స్పష్టమవుతోంది. ఈ కేసులో సెక్షన్ 409 కొనసాగుతుంది, నేరం రుజువయితే యావజ్జీవ ఖైదు చంద్రబాబుకు తప్పదు. అలాగే ఈ కేసులో 120B కూడా కొనసాగుతుంది. అంటే ఈ కేసులో IPC మరియు PC act (అవినీతి నిరోధక చట్టం) రెండూ కొనసాగుతాయి.
బయటపడేందుకు నానా రకాల యత్నాలు చేశారు: ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి
ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు నాయుడు సాంకేతిక కోణాలు వెతికినా లాభం లేకపోయిందని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటున్నారు. "సుప్రీంకోర్టులో ఇవాళ్టి పరిణామాలను స్వాగతిస్తున్నాం. చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఎక్కడా అనుమతించలేదు. తనను అరెస్ట్ చేస్తారా? అంటూ ఊగిపోయారు. అసలు చంద్రబాబు మీద కేసేంటీ అని ఎల్లో మీడియా ఉదరగొట్టింది. రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు చేసిన వాదనను సుప్రీంకోర్టు తీసిపుచ్చింది. నేరం బయటపడేసరికి గవర్నర్ అనుమతి అంటూ సాంకేతిక కోణాలు వెతికారు. కొన్ని అబద్దాలను ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఇన్నాళ్లు చేసిన విష ప్రచారం తప్పని తేలిపోయింది, గోబెల్స్ ప్రచారానికి అడ్డుకట్ట పడింది" అని ఏఏజీ పొన్నవోలు అన్నారు.
స్కిల్ స్కాంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
- చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
- అవినీతి నిరోధక కేసుల్లో గవర్నర్ అనుమతి అవసరం అన్న జస్టిస్ అనిరుద్ధ బోస్
- అయితే ఐపీసీ సెక్షన్ల నమోదు చేసిన అభియోగాలు కొనసాగుతాయని స్పష్టం చేసిన జస్టిస్ బోస్
- గవర్నర్ అనుమతి తీసుకొని అవినీతి నిరోధక చట్టం కూడా అమలు చేయవచ్చన్న జస్టిస్ బోస్
- జస్టిస్ అనిరుద్ధ బోస్ అభిప్రాయంతో విభేధించిన జస్టిస్ బేలా త్రివేది
- చంద్రబాబు కేసులో 17ఏ అవసరం లేదు, అది వర్తించదన్న జస్టిస్ బేలా త్రివేది
- స్కిల్ స్కాంలో చంద్రబాబును ఐపీసీ, పీసీ యాక్ట్ రెండింటి ప్రకారం విచారించాల్సిందే అన్న జస్టిస్ బేలా త్రివేది
- భిన్న అభిప్రాయాల నేపధ్యంలో కేవలం 17ఏ వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని తేల్చడానికి… సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు నివేదన
- చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు… చంద్రబాబుకు ఊరట ఇవ్వడానికి నిరాకణ
- చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ తీసుకున్న నిర్ణయాలను సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు
- రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు
- చంద్రబాబు అరెస్టు విషయంలో ఎలాంటి రాజకీయ కక్ష్య సాధింపు లేదని స్పష్టం చేసిన ఇద్దరు న్యాయమూర్తులు
- చంద్రబాబు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని ఇద్దరు న్యాయమూర్తుల స్పష్టీకరణ
- స్కిల్ స్కాం కేసులో సీఏం హోదాలో చంద్రబాబు అవినీతి, నమ్మక ద్రోహం పాల్పడినట్లు తీవ్రమైన అభియోగాలున్నాయన్న ఇద్దరు న్యాయమూర్తులు
- చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం చట్ట ప్రకారమే ఉందన్న ఇద్దరు న్యాయమూర్తులు
- 17ఏ వర్తింపు విషయంలో ఒక న్యాయమూర్తి అనుకూలంగా మరో న్యాయమూర్తి వ్యతిరేకమైన అభిప్రాయం
- చంద్రబాబుపై ఉన్న అభియోగాలను కొట్టేసేందుకు నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు
- గవర్నర్ అనుమతి తీసుకుని పీసీ యాక్ట్లో సైతం విచారణ చేయవచ్చన్న జస్టిస్ అనిరుద్ధ బోస్
- రాజకీయ కక్ష్య సాధింపు అని చంద్రబాబు చేసిన ఆరోపణలను కొట్టి పారేసిన ఇద్దరు న్యాయమూర్తులు
- ఎలాంటి ఆధారాలు లేవన్న చంద్రబాబు వాదనను తొసిపుచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు
- స్కిల్ స్కాంలో సెక్షన్ 409 ప్రకారం చంద్రబాబును విచారించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
- సెక్షన్ 409 ప్రకారం నేరం రుజువైతే చంద్రబాబుకు జీవితఖైదు శిక్షపడే అవకాశం
- సెక్షన్ 409ను కొట్టేయాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు
- సెక్షన్ 120బీ కొనసాగుతుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
- సెక్షన్ 10బీ ప్రకారం నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని చంద్రబాబుపై పెట్టిన అభియోగాలను కొట్టేయడానికి నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు
- చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేసేందుకు నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు
- చంద్రబాబును విచారించేందుకు పూర్తి ఆధారాలున్నాయని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు
- స్కిల్ స్కాంలో చంద్రబాబును విచారించేందుకు ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి ఉందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
- ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడం సబబే అన్న ఇద్దరు న్యాయమూర్తులు
Comments
Please login to add a commentAdd a comment