fiber net
-
ఫైబర్ నెట్లో తారస్థాయికి చేరిన రచ్చ
-
జీవీ రెడ్డి ‘ఔట్’
సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి(GV Reddy) వెల్లడించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని తెలిపారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తన రాజీనామా లేఖను జీవీ రెడ్డి పోస్ట్ చేశారు. నాలుగు రోజుల కిందటే తీవ్ర ఆరోపణలు నాలుగు రోజుల క్రితం ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్‌కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నాడంటూ జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్ సంస్కరణల్లో భాగంగా 410 మంది ఉద్యోగులను తొలగించడంతోపాటు సంస్థ పని తీరు మెరుగుపరిచేందుకు చైర్మన్‌గా తాను తీసుకున్న నిర్ణయాలను ఎండీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఫైబర్ నెట్ అభివృద్ధికి ఏ మాత్రం సహకరించకపోగా, సంస్థను మూసివేసే విధంగా ఆయన చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఈ ఆరోపణలపై ఐఏఎస్ అధికారులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఐఏఎస్ అధికారుల ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం తక్ష ణం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. జీవీ రెడ్డి, దినేష్‌కుమార్‌ను మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి పిలిచి మాట్లాడారు. అన్ని ఆరోపణలపై ఆధారాలతో వివరణ ఇవ్వాలని జీవీ రెడ్డిని ఆదేశించారు. దీంతో ఆయన ఆధారాలు అందించలేకపోయారని సమాచారం. సీఎం కూడా జీవీ రెడ్డిని పిలిచి తీవ్రంగా మందలించి నట్లు తెలిసింది.అసత్య ఆరోపణలు, అర్థంలేని మాటలతో పలచనకావొద్దని గట్టిగా హెచ్చరించారని సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థను రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు తీసుకువెళ్లడానికి కృషి చేస్తుంటే దానికి అడ్డుపడుతున్న అధికారికి అందరూ మద్దతు పలుకుతున్నారని, గౌరవం లేని చోట పనిచేయడం కష్టమంటూ సన్నిహితుల వద్ద జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఫైబర్‌నెట్ ఎండీ దినేష్‌కుమార్‌పై బదిలీ వేటుజీవీ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ ఎండీ, ఐఏఎస్ అధికారి కె. దినేష్‌కుమార్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం పెట్టుబడులు, మౌలి క వసతుల శాఖ కింద ఏపీ ఫైబర్‌నెట్ ఎండీగా ఉన్న దినేష్‌కుమార్‌ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని సోమవారం సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు ఆర్టీజీఎస్ సీఈఓ, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ, ఏపీ డ్రోన్ కార్పొరేష్న్ ఎండీగా నిర్వహిస్తున్న పూర్తిస్థాయి బాధ్యతల నుంచి కూడా దినేష్‌కుమార్‌ను తప్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. -
GV Reddy : జీవీ రెడ్డి రాజీనామా వెనక అసలు కారణం అదే
సాక్షి, విజయవాడ : ఏపీ ఫైబర్ నెట్లో రచ్చ తారాస్థాయికి చేరింది. ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా ఉన్న జీవీ రెడ్డి సోమవారం తన పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవీరెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు. కానీ వ్యక్తిగత కారణలతో కాదని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ తిట్టడం వల్లే జీవీరెడ్డి బయటకు వచ్చినట్లు సమాచారం. ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా ఉన్నా సరే వేమూరి హరికృష్ణ మాట వినాలని జీవీరెడ్డికి చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. వేమూరి హరికృష్ణ పెత్తనం సహించలేక, వేమూరి హరికృష్ణ మాట విననందుకు చంద్రబాబు, లోకేష్ తిట్టడంతో జీవీరెడ్డి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా అనంతరం ఫైబర్‌నెట్‌లో ఎండీ దినేష్ కుమార్‌పై ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఫైబర్ నెట్‌తో పాటు ఆర్టీజీఎస్, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుండి తప్పించింది. జీఏడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్త్వులు జారీ చేసింది. -
GV Reddy: టీడీపీకి షాక్.. పార్టీకి జీవీరెడ్డి రాజీనామా
సాక్షి, విజయవాడ: టీడీపీకి ఆ పార్టీ నేత జీవిరెడ్డి షాకిచ్చారు. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్న జీవీ రెడ్డి.. ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు.ఇటీవల, ‘తొమ్మిది నెలల్లో ఎటువంటి పురోగతి లేని సంస్థ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) మాత్రమే. మేం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒక్క కనెక్షన్ ఇవ్వలేదు. అంతేకాదు... ఉన్న కనెక్షన్లకు కూడా ప్రసారాలు నిరంతరాయంగా ఇవ్వలేకపోతున్నాం. దీనిపై కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారులు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు...’ అంటూ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో జీవీ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ దినేష్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎండీ మరో ముగ్గురు అధికారులు భరద్వాజ(చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్), సురేష్(బిజినెస్ హెడ్), శశాంక్ (ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్)లతో కలిసి ప్రభుత్వంపై కుట్రకు తెరతీశారని ఆరోపించారు. సంస్థను చంపే కుట్రకు తెరతీసి రాజద్రోహానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే భరద్వాజ, సురేష్, శశాంక్లను టెర్మినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఏపీఎస్ఎఫ్ఎల్లో 410మంది అక్రమ నియామకాలను రద్దు చేస్తే వారిని ఇంతవరకు తొలగించకుండా జీతాలు చెల్లిస్తున్నారని చెప్పారు. అధికారుల అలసత్వం కారణంగా జీఎస్టీ అధికారులు రూ.370 కోట్ల పెనాల్టీ విధించారని తెలిపారు. ఈ మొత్తాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ చెల్లించదని, జీఎస్టీ పెనాల్టీకి కారణమైన ఎండీ దినేష్ కుమార్, ఈడీ(హెచ్ఆర్) రమేష్‌నాయుడు నుంచి రికవరీ చేయాలన్నారు. విజిలెన్స్ కమిటీ రూ.60 కోట్ల చెల్లింపులను నిలిపివేయాలని చెప్పినా.. వారు చెల్లించేశారని తెలిపారు. ఈ డబ్బులను కూడా వారి నుంచే రికవరీ చేస్తామన్నారు.దినేష్‌కుమార్, రమేష్ నాయుడుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వొకేట్ జనరల్‌కు ఫిర్యాదు చేస్తానని, వారి ఆదేశాలకు అనుగుణంగా తాను నడుచుకుంటానని జీవీ రెడ్డి చెప్పారు. ఇప్పటి కంటే గత ప్రభుత్వ హయాంలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రసారాలు బాగున్నాయన్నారు. తాను అధికారులపై మాత్రమే ఆరోపణలు చేస్తున్నానని, దీనికి, వైఎస్సార్సీపీకి సంబంధం లేదన్నారు.గత ప్రభుత్వ హయాంలో కూడా అధికారుల నిర్వాకం వల్లే వైఎస్ జగన్మోహన్రెడ్డి నష్టపోయారన్నారు. ‘మరో ఆరు నెలల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ చనిపోతుంది. దీనికి కారణమైన మా ప్రభుత్వంలోని అధికారుల నిర్వాకం బహిర్గతం చేయకపోతే జీవీ రెడ్డి వల్లే సంస్థ మూత పడింది. కేబుల్ ప్రసారాలు ఆగిపోయాయి. తొలగించిన ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుని కొనసాగిస్తున్నారు.’ అని అనుకునే ప్రమాదం ఉందనే ఈ విషయాలను చెబుతున్నానని ఆయన వివరించారు. -
నీకు దమ్ము, ధైర్యం ఉంటే. .. చంద్రబాబు కుట్ర బయటపెట్టిన గౌతంరెడ్డి
-
మాకు చేతకావడం లేదు
సాక్షి, అమరావతి: ‘తొమ్మిది నెలల్లో ఎటువంటి పురోగతి లేని సంస్థ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) మాత్రమే. మేం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒక్క కనెక్షన్ ఇవ్వలేదు. అంతేకాదు... ఉన్న కనెక్షన్లకు కూడా ప్రసారాలు నిరంతరాయంగా ఇవ్వలేకపోతున్నాం. దీనిపై కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారులు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు...’ అంటూ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన గురువారం విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ దినేష్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎండీ మరో ముగ్గురు అధికారులు భరద్వాజ(చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్), సురేష్(బిజినెస్ హెడ్), శశాంక్ (ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్)లతో కలిసి ప్రభుత్వంపై కుట్రకు తెరతీశారని ఆరోపించారు. సంస్థను చంపే కుట్రకు తెరతీసి రాజద్రోహానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే భరద్వాజ, సురేష్, శశాంక్లను టెర్మినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీఎస్ఎఫ్ఎల్లో 410మంది అక్రమ నియామకాలను రద్దు చేస్తే వారిని ఇంతవరకు తొలగించకుండా జీతాలు చెల్లిస్తున్నారని చెప్పారు. అధికారుల అలసత్వం కారణంగా జీఎస్టీ అధికారులు రూ.370 కోట్ల పెనాల్టీ విధించారని తెలిపారు. ఈ మొత్తాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ చెల్లించదని, జీఎస్టీ పెనాల్టీకి కారణమైన ఎండీ దినేష్ కుమార్, ఈడీ(హెచ్ఆర్) రమేష్‌నాయుడు నుంచి రికవరీ చేయాలన్నారు. విజిలెన్స్ కమిటీ రూ.60 కోట్ల చెల్లింపులను నిలిపివేయాలని చెప్పినా.. వారు చెల్లించేశారని తెలిపారు. ఈ డబ్బులను కూడా వారి నుంచే రికవరీ చేస్తామన్నారు. దినేష్‌కుమార్, రమేష్ నాయుడుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వొకేట్ జనరల్‌కు ఫిర్యాదు చేస్తానని, వారి ఆదేశాలకు అనుగుణంగా తాను నడుచుకుంటానని జీవీ రెడ్డి చెప్పారు. ఇప్పటి కంటే గత ప్రభుత్వ హయాంలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రసారాలు బాగున్నాయన్నారు. తాను అధికారులపై మాత్రమే ఆరోపణలు చేస్తున్నానని, దీనికి, వైఎస్సార్సీపీకి సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా అధికారుల నిర్వాకం వల్లే వైఎస్ జగన్మోహన్రెడ్డి నష్టపోయారన్నారు. ‘మరో ఆరు నెలల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ చనిపోతుంది. దీనికి కారణమైన మా ప్రభుత్వంలోని అధికారుల నిర్వాకం బహిర్గతం చేయకపోతే జీవీ రెడ్డి వల్లే సంస్థ మూత పడింది. కేబుల్ ప్రసారాలు ఆగిపోయాయి. తొలగించిన ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుని కొనసాగిస్తున్నారు.’ అని అనుకునే ప్రమాదం ఉందనే ఈ విషయాలను చెబుతున్నానని ఆయన వివరించారు. -
అబద్ధపు వాంగ్మూలం చెప్పించి.. ఆడిట్ నివేదికను తొక్కిపెట్టి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అవినీతి బాగోతాన్ని కప్పిపుచ్చే కుట్రకు కూటమి ప్రభుత్వం మరింత పదును పెడుతోంది. ఇప్పటికే అసైన్డ్ భూముల కుట్ర కేసులో గతంలో చంద్రబాబు అవినీతిని బయటపెడుతూ సీఆర్సీపీ 164 కింద న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్‌ను వేధించి లొంగదీసుకుంది. నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా ఇటీవల అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది.ఇదే తీరులో చంద్రబాబు నిందితుడుగా ఉన్న ఫైబర్‌నెట్ కుంభకోణం కేసునూ నీరుగార్చే యత్నంలో ప్రభుత్వం ఉంది. అందుకోసం మరో ఐఏఎస్ అధికారిని వేధించి, కీలక పోస్టింగ్ ఎరగా వేసి మరీ లొంగదీసుకుంది. ఆయన ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా కోర్టులో వాంగ్మూలాన్ని రీరికార్డింగ్ చేయించారు. ఫైబర్‌నెట్ అవినీతిని బటయపెట్టిన ఆడిట్ నివేదికనూ తొక్కిపెడుతూ అనుకూలంగా నివేదిక ఇప్పించేందుకు ఏపీ టెక్నాలజీ సర్విసెస్‌తో చేయిస్తోంది. ఐఏఎస్ అధికారిని లొంగదీసుకొని.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ కుంభకోణం ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా ఆ అవినీతిని బట్టబయలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు (ఏ1), ఆయన సన్నిహితుడైన టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత వేమూరి హరికృష్ణ (ఏ2)తో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చార్జ్‌షిట్ దాఖలు చేసింది. కాగా గత ఏడాది రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు తెరతీసింది.ఫైబర్‌నెట్ కేసులో గతంలో చంద్రబాబు ఎలా అవినీతికి పాల్పడిందీ, ఆయన ఒత్తిడితోనే తాము నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి కాంట్రాక్టు కేటాయించిందీ వెల్లడిస్తూ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సీఆర్సీపీట వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ ఆ ఐఏఎస్ అధికారిని కూటమి ప్రభుత్వం వేధించింది. ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా వాంగ్మూలం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ అధికారి గుర్తించారు. అలా ఇస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా నిపుణులు స్పష్టం చేశారు. దాంతో అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు వెనుకంజ వేశారు. కానీ ఆయన్ని సీఐడీ అధికారులు వారి శైలిలో వేధించి బెంబేలెత్తించారు. ‘మేము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తాం. ఏం చేసినా పర్వాలేదని ప్రభుత్వ ముఖ్యనేత మాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు’ అంటూ బ్లాక్మెయిల్ చేశారు. తాము చెప్పినట్టు చేస్తే మరో కీలక పోస్టింగ్ కూడా ఇస్తామని ప్రభుత్వ పెద్దలు తాయిలం ఎర వేశారు. దాంతో ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు సమ్మతించారు. ఆ వెంటనే గృహ నిర్మాణ శాఖలో కీలక అధికారిగా ఉన్న ఆయనకు పర్యాటక శాఖలో కీలక పోస్టును పూర్తి అదనపు బాధ్యతలతో సహా అప్పగించడం గమనార్హం. తర్వాత అబద్ధపు వాంగ్మూలం కథ నడిపారు. కొన్ని రోజుల క్రితం ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు దగ్గరుండి తీసుకువెళ్లి మరీ గుంటూరులోని న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 వాంగ్మూలాన్ని రీరికార్డింగ్ చేయించారు. ఆ విషయం మీడియాలో వచ్చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఈసారి ఫైబర్‌నెట్ కేసులో సీఐడీ అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారితో గుట్టు చప్పుడు కాకుండా విజయవాడలోని న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని రీరికార్డింగ్ చేయించారు. సీఐడీ అధికారులు, పోలీసులు లేకుండానే ఆ అధికారి తన వాహనంలో వచ్చి సీఐడీ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాన్ని నమోదు చేసి వెళ్లిపోయారు. ఈ సమాచారాన్ని సీఐడీ వర్గాలు వెంటనే ముఖ్యనేతకు చేరవేశాయి.అంతా సవ్యంగా ఉందని సర్టీఫికెట్! గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని థర్డ్ పార్టీ ఆడిట్ నివేదిక తేల్చింది. ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఎండీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ఆడిటింగ్ కన్సల్టెన్సీతో ఆ ఆడిట్ చేయించారు. ఏకంగా 8 శాతం ప్రాజెక్టు పనులు నాసిరకంగా చేసి నిధులు కొల్లగొట్టారని నివేదిక వెల్లడించింది. సీఐడీ కేసులో ఆ ఆడిట్ నివేదిక కీలక సాక్ష్యం. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ నివేదికకు ప్రాదాన్యం లేకుండా చేసి కేసును పక్కదారి పట్టించే కుట్రకు తెరతీసింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన ఏపీ టెక్నాలజీ సర్విసెస్‌తో ఫైబర్‌నెట్ ప్రాజెక్టుపై మరోసారి ఆడిట్ చేయాలని నిర్ణయించింది. అంటే తాము చేసిన పనులను తామే మదింపు చేసి అంతా సవ్యంగా ఉందని సర్టిఫికెట్ ఇచ్చుకునేందుకు సిద్ధపడుతోంది. తద్వారా చంద్రబాబు కీలక పాత్రధారిగా ఉన్న ఫైబర్‌నెట్ కేసు దర్యాప్తును నీరుగార్చి, మూసివేసేందుకు కుతంత్రం పన్నింది. -
ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులను తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం
-
పచ్చ కక్ష.. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ సస్పెండ్
-
ఏఐతో వై-ఫై స్పీడ్ పెంచేందుకు పెట్టుబడులు
యాక్ట్ ఫైబర్‌నెట్ కంపెనీ..నెట్వర్క్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ స్టార్టప్ అప్రెకామ్లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది. యాక్ట్ ఫైబర్‌నెట్ తమ కస్టమర్లకు అందిస్తున్న హోమ్ వై-ఫై సదుపాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు, నెట్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు.ఈ సందర్భంగా యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈఓ బాల మల్లాది మాట్లాడుతూ..‘అప్రెకామ్ అధునాతన సాంకేతికతను యాక్ట్ ఫైబర్‌నెట్ వై-ఫై టెక్నాలజీకు అనుసంధానం చేయనున్నాం. ఇది వై-ఫై పనితీరులో వేగాన్ని పెంచుతుంది. రియల్‌టైమ్ నెట్వర్క్ విజిబిలిటీని అందిస్తుంది. ఇకపై కస్టమర్లకు మరింత ఉత్తమమైన నెట్ సేవలందుతాయి. అప్రెకామ్ తయారుచేసిన ఏఐ ఆధారిత సెల్ఫ్ ఆప్టిమైజింగ్ టెక్నాలజీ, అధునాతన వై-ఫై అనాలసిస్ కంపెనీ నెట్‌వర్క్‌ను నిరంతరం ఆప్టిమైజ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.బెంగళూరుకు చెందిన యాక్ట్ ఫైబర్‌నెట్ దేశంలోని అతిపెద్ద వైర్డ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ 25 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2.2 మిలియన్ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. -
ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లడం కలకలం రేపుతోంది. ఒకవైపు చంద్రబాబుపై సీఐడీ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు అమలులో ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలోనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు. చంద్రబాబు దేశం విడిచి వెళ్లకూడదని సీఐడీ గతేడాది లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా? అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగు తిన్నారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తరువాత ఇమిగ్రేషన్ అధికారులు పలు దఫాలు సీఐడీ అధికారులతో చర్చించారు. అనంతరం ఎట్టకేలకు అనుమతించారు. పార్టీ ఖాతాల్లోకి అవినీతి నిధులు..టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌తోపాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఆయన్ని అరెస్ట్ చేయగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ వాదనలు వినిపించింది. కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీ బ్యాంకు ఖాతాలకు తరలించిన విషయాన్ని న్యాయస్థానానికి నివేదించింది. దీనిపై చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. షరతులు బేఖాతర్!స్కిల్ స్కామ్ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్‌పై సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని అందులో స్పష్టం చేసింది. అయితే సీఐడీ ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులతో చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇమిగ్రేషన్ అధికారులకు తెలియచేశారు. సీఐడీకి సమాచారం ఇచ్చిన తరువాతే విదేశాలకు వెళ్లాలని చెప్పారు. చార్జ్షీట్లను పరిగణలోకి తీసుకున్న తరువాత న్యాయస్థానం విధించే షరతులను పాటించాలన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు సమ్మతించారు. సీఐడీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని మరోసారి చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. న్యాయస్థానం విధించే షరతులు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్నారు. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించడంతో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలసి దుబాయి మీదుగా అమెరికా వెళ్లారు.చికిత్స కోసం అంటున్న టీడీపీ వర్గాలుచంద్రబాబు తన విదేశీ పర్యటన గురించి చివరి వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. కొద్ది రోజుల పాటు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించిన ఆయన అమెరికా పర్యటన విషయంలో మాత్రం గోప్యత పాటించారు. వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ చంద్రబాబు చికిత్స కోసం అమెరికా వెళ్లారు. వారం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు నారా లోకేష్ కూడా నాలుగు రోజుల క్రితం చడీ చప్పుడు లేకుండా అమెరికా వెళ్లినట్లు సమాచారం. -
అమరావతి కలిపింది ఇద్దరినీ..
సాక్షి, అమరావతి : ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్‌ది ఐదో స్థానం.. అలాంటి దేశానికి మంత్రిగా ఉండి భారీ అవినీతికి బరితెగించి సింగపూర్ ప్రతిష్టకు మాయని మచ్చ తీసుకొచి్చన అమాత్యుడు ఈశ్వరన్.. అతనికి మన అమరావతి రింగ్ మాస్టర్ బినామీ బాబు జతకలిశారు. ఇంకేముంది రాజధాని పేరుతో ప్రజలకు గ్రాఫిక్స్ చూపించి అందినంత దోచేశారు. తోడుదొంగలు ఇద్దరూ కలిసి అమరావతిలో స్టార్టప్ ఏరియా అంటూ ఏకంగా 1,400 ఎకరాలను కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. పాపం పండి ఇద్దరి బాగోతం బట్టబయలైంది. స్కిల్ స్కామ్ కేసులో ‘రాజధాని ఫైల్స్’ సూత్రధారి చంద్రబాబు, సింగపూర్‌లో అవినీతి అభియోగాలతో ఈశ్వరన్ అరెస్టయ్యారు. వీరిద్దరి అవినీతి లింకులు కలిసింది మాత్రం అమరావతిలోనే.. అవినీతి ‘ఆట’లో ఈశ్వరన్ వాటా.. సింగపూర్‌లో భారీ ఎత్తున అవినీతికి బరితెగించిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ ఆట కట్టింది. ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు పాల్పడ్డారని సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(సీపీఐబీ) నిగ్గు తేలి్చంది. ఈ కేసులో నేరం రుజువైతే కనీసం ఏడేళ్లు శిక్ష పడవచ్చు. సింగపూర్‌కు ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించారని ఆ దేశ అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేలి్చంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్, సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీపోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గతేడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్షిట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని ఒకటి ఉంది. చంద్రబాబు ‘స్కిల్’తో కటకటాలకు ఈశ్వరన్ తోడు దొంగ చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రూ.5 వేల కోట్ల మేర అసైన్డ్ భూముల కుంభకోణం, రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణం, రూ.6,500 కోట్ల మద్యం కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సెక్షన్ 17 ఏ ప్రకారం తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఆయనపై కేసు కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రూ.66 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ స్టార్టప్ ఏరియా 20 ఏళ్ల పాటు సింగపూర్ కన్సార్షియం ఆ«దీనంలో ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణకు నియమించిన మేనేజ్మెంట్ కమిటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బినామీలే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఏమైనా న్యాయ వివాదాలుంటే లండన్ కోర్టును ఆశ్రయించాలన్నారు. స్టార్టప్ ఏరియాలో ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా తేల్చారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి తరువాత అంతర్జాతీయ సంస్థలకు ఎకరా రూ.25 కోట్ల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేశారు. 20 ఏళ్లలో ఎకరా విలువ రూ.50 కోట్లకు చేరుతుందని చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం ...సింగపూర్ కన్సార్షియం గుప్పిట్లో 1,320 ఎకరాలు (1,070 + 250) ఉంటాయి. ఆ 1,320 ఎకరాలను రూ.50 కోట్ల చొప్పున విక్రయిస్తే రూ.66 వేల కోట్లు ఆర్జించే అవకాశముంది. బాబుతో కలిసి అభాసుపాలు కృష్ణా నదీ తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ రూ.66 వేల కోట్ల పన్నాగాన్ని చంద్రబాబు, ఈశ్వరన్ రక్తి కట్టించారు. అమరావతి ప్రాంతంలో అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో మౌలిక సదుపాయాలు కలి్పంచి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరిట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారు. ఇందులో సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీని తెరపైకి తెచ్చారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని నమ్మించి, తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్ను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానంలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టినా.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్‌ను తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు. ఆ 1,691 ఎకరాల్లోని 371 ఎకరాల్లో ప్రభుత్వం రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. సింగపూర్ కన్సార్షియం అసెండాస్‌కు ప్రభుత్వం 250 ఎకరాలను ఉచితంగా ఇస్తుంది. మిగిలిన 1,070 ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా విక్రయిస్తారు. ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా నిర్ణయించారు. 1,070 ఎకరాల విలువ రూ.4,280 కోట్లుగా లెక్కతేల్చారు. నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 42 శాతం వాటా, కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. -
ఏం పీక్కుంటారో పీక్కోండి అచ్చన్నాయుడుకి మాస్ కౌంటర్
-
ఫైబర్ నెట్ స్కామ్ లో ఆస్తుల అటాచ్..సీఐడీకి అనుమతి
-
ఫైబర్ నెట్ స్కామ్‌లో నిందితుల ఆస్తుల అటాచ్
సాక్షి, విజయవాడ: ఫైబర్ నెట్ స్కామ్‌లో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏపీసీఐడీకి రాష్ట్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ నెట్ స్కామ్‌లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏ4గా టెరా సాఫ్ట్ ఎండీ, ఏ5గా తుమ్మల గోపిచంద్ ఉన్నారు. మొత్తం రూ. 17.75 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీకి అనుమతి లభించింది. ఫైబర్ నెట్ స్కామ్‌లో నిందితులు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీకి అనుమతి వచ్చింది. మరో నిందితుడు తుమ్మల గోపిచంద్, తుమ్మల పవన దేవి, తుమ్మల బాపయ్య చౌదరి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కూడా ఏపీ సీఐడీకి అనుమతి లభించింది. నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి సీఐడీ.. ఏసీబీ కోర్టు అనుమతి కోరనుంది. చదవండి: Fibernet Scam Case: ఫైబర్‌నెట్ స్కామ్ కేసు.. సీఐడీ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు -
ఏపీ ఫైబర్‌నెట్.. ప్రతి దాంట్లో అవినీతే
-
‘ఫైబర్’ ఫ్రాడ్ సూత్రధారి బాబే
సాక్షి, అమరావతి: కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడైన, నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ నేపథ్యంలో ఏ 1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ 2గా టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ 3గా ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్, ఇన్‌క్యాప్ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు (ప్రస్తుతం ద.మ. రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్)తోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసులు నమోదు చేసింది. ఫైబర్‌నెట్ పేరుతో చంద్రబాబు బృందంప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ తన చార్జ్‌షీట్‌లో సవివరంగా పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును ఏ 25గా పేర్కొనగా అనంతరం దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా తాజాగా చార్జ్‌షీట్‌లో ఏ1గా చేర్చారు. ఈ వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉంది. ఐటీ శాఖకు బదులుగా.. టెరాసాఫ్ట్‌కు ఫైబర్‌నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల పనుల్లో అక్రమాలకు బరితెగించారు. ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలని స్వయంగా ఆదేశించారు. నాడు ఈ శాఖలను చంద్రబాబే నిర్వహించడం గమనార్హం. బిడ్లు.. టెండర్లు వేమూరివే వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరిని ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ను కీలక స్థానంలో నియమించి పనులు చక్కబెట్టారు. నిబంధనలను విరుద్ధంగా ఫైబర్‌నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వ్యక్తులు నిబంధనల ప్రకారం టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదు. చంద్రబాబు దీన్ని తుంగలోకి తొక్కారు. అమాంతం విలువ పెంచేసి... ప్రాజెక్ట్ విలువను అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండా సరఫరా చేయాల్సిన పరికరాలు, నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతం పెంచేశారు. వేమూరి హరికృష్ణ, నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ.. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ – పోస్ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్‌ను అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చారు. చంద్రబాబు ఆ కంపెనీని ఏకపక్షంగా బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. పోటీలో ఉన్న ఇతర కంపెనీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఖాతరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం సాంకేతిక కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్‌ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత టెరాసాఫ్ట్ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకుగా వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు. అమలు లోపభూయిష్టం ప్రాజెక్టును అమలు చేయడంలో టెరాసాఫ్ట్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ నోటిఫికేషన్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో వ్యవహారాన్ని నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కాగితాలపై చూపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. నాసిరకమైన పనులతో ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేలింది. కీలక అధికారుల వాంగ్మూలం.. ఫైబర్‌నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలను సేకరించింది. ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించి నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారని సెక్షన్ 164 సీఆర్పీసీ ప్రకారం న్యాయస్థానంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఫైబర్‌నెట్ స్కామ్ కేసు.. సీఐడీ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు
అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది సీఐడీ. ఈ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా వేమూరి హరికృష్ణ, ఏ-3గా కోగంటి సాంబశివరావులను పేర్కొంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దోపిడీ పర్వంలో ఫైబర్‌నెట్ కుంభకోణం ఒకటి. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో పచ్చ ముఠా అడ్డగోలు అవినీతికి పాల్పడింది. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన “టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని నిగ్గు తేల్చింది. ఈ మేరకు సీఐడీ.. ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇదీ చదవండి: ఫైబర్‌నెట్‌లోనూ బాబు మార్కు అవినీతి -
ఫైబర్‌నెట్‌లోనూ బాబు మార్కు అవినీతి
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దోపిడీ పర్వంలో ఫైబర్‌నెట్ కుంభకోణం ఓ పెద్ద అధ్యాయం. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో పచ్చ ముఠా చేసిన అడ్డగోలు అవినీతికి నిదర్శనం. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన “టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని నిగ్గు తేల్చింది. అందుకోసం టీడీపీ ప్రభుత్వం పక్కా పన్నాగంతో కథ నడిపించింది. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో సాధ్యమైనంత దోపిడీ చేయడానికి పక్కా ప్రణాళికే రచించారు అప్పటి ప్రభుత్వ పెద్దలు. వాస్తవంగా ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉంది. కానీ, అప్పటి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు బాధ్యతలను విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖకు అప్పగించారు. ఎందుకంటే ఆ శాఖ చంద్రబాబు వద్దే ఉంచుకున్నారు. చంద్రబాబు ఆయన బినామీ సంస్థ అయిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించడం కోసం ముందస్తు పన్నాగంతోనే టెరాసాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యునిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయనను అంతటి కీలక స్థానంలో నియమించడంపై వెల్లువెత్తిన విమర్శలను కూడా పట్టించుకోలేదు. అంతే కాదు.. నిబంధనలను ఉల్లంఘించి, ఫైబర్‌నెట్ టెండర్ల మదింపు కమిటీలో కూడా ఆయన్ని సభ్యుడిగా నియమించారు. ప్రాజెక్టు కోసం పోటీ పడే సంస్థకు చెందిన వారు టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదన్న నిబంధననూ చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు చంద్రబాబు బినామీ కంపెనీ కావడంతో టెరాసాఫ్ట్ సంస్థఫైబర్నెట్ ప్రాజెక్ట్‌ను అత్యంత నాసిరకంగా చేసి నిధులు కొల్లగొట్టింది. టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి, కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ప్రభుత్వంలో ‘ముఖ్య’నేతకు చేరినట్టు సీఐడీ గుర్తించింది. నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది. ఆధారాలతోసహా బట్టబయలు ఫైబర్‌నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ముందుగా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. అనంతరం ఐపీసీ సెక్షన్లు 24, 166, 167, 418, 465, 468, 471, 409, 506, అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ.. గతంలో పౌర సరఫరాల శాఖలో ఈపోస్ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్‌ను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. కానీ ఫైబర్ నెట్ ప్రాజెక్టును టెరాసాఫ్ట్‌కే అడ్డగోలుగా కేటాయించాలని నిర్ణయించిన చంద్రబాబు.. ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి ఏకపక్షంగా తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేసి మరీ టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. కేసులో ప్రధాన నిందితులు వీరే.. ఏ1: వేమూరి హరికృష్ణ – టెరాసాఫ్ట్ కంపెనీ ఏ2: కె.సాంబశివరావు – టీడీపీ ప్రభుత్వంలో ఇన్‌క్యాప్ వీసీ ఏ3: టెరాసాఫ్ట్ కంపెనీ ఏ11: తుమ్మల గోపీచంద్ – టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ ఏ21: విజయ్ కుమార్ – డైరెక్టర్, జెమిని కమ్యూనికేషన్స్ ఏ22 : రామ్‌కుమార్ రమణమూర్తి ఏ23 : కనుమూరి కోటేశ్వరరావు – డైరెక్టర్, నెటాప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ25: నారా చంద్రబాబునాయుడు – టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రూ.114 కోట్ల ఆస్తులుఅటాచ్మెంట్ ఫైబర్‌నెట్ ప్రాజెక్టు ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సీఐడీ తదుపరి కార్యాచరణను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ కేసులో నిందితులకు చెందిన రూ.114 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసింది. హోం శాఖ, అనంతరం న్యాయస్థానం అనుమతులు తీసుకొని ఆ ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తులు ♦ నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చ.అడుగుల విస్తీర్ణం గల ఇంటి స్థలం ♦ కనుమూరి కోటేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్న నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్‌కు చెందిన కిర్లంపూడి లేఅవుట్లోని ఓ ఫ్లాట్ ♦ టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్ ♦ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో గల రెండు ఫ్లాట్లు ♦ తుమ్మల గోపీచంద్ పేరిట హైదరాబాద్ యూసఫ్‌గూడలో ఉన్న ఫ్లాట్ ♦ తుమ్మల గోపీచంద్ భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి -
ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
-
CBN : ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదా
చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఇవ్వాళ బెంచ్ మీదకు రాలేదు. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా.. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేశారు చంద్రబాబు. ఈ పిటిషన్‌ను ఇవ్వాళ విచారించడం లేదని జస్టిస్ అనిరుధ్ బోస్ వెల్లడించారు. త్వరలో విచారణ తేదీని ప్రకటిస్తామని తెలిపారు. 3.20pm, జనవరి 17, 2024 విచారణ వాయిదా ఎందుకంటే.. ఏపీ ఫైబర్ నెట్ కేసుపై సుప్రీంకోర్టులో నేడు జరగని విచారణ చంద్రబాబు తరపున వాదించేందుకు కోర్టుకు వెళ్లిన సిద్ధార్థ్ లూథ్రా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం CID తరపున హాజరైన అడ్వొకేట్ ఆన్ రికార్డు ఫైబర్ గ్రిడ్ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్ ముందు ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఈ రోజు బెంచ్ కూర్చోవడం లేదని చెప్పిన జస్టిస్ అనిరుద్ధ బోస్ 14వ నెంబర్ కోర్టులో విచారణలో బిజీగా ఉన్న జస్టిస్ బేలా త్రివేది తదుపరి విచారణ తేదీని ప్రకటిస్తామన్న జస్టిస్ బోస్ 3.10pm, జనవరి 17, 2024 చంద్రబాబు పిటిషన్ వాయిదా ఫైబర్‌గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలంటూ చంద్రబాబు పిటిషన్ ఈ కేసులో జరగని విచారణ ఈరోజు తాము కూర్చోవడం లేదని స్పష్టం చేసిన జస్టిస్ అనిరుధ్ బోస్ తదుపరి విచారణ తేదిని తర్వాత ప్రకటిస్తామన్న జస్టిస్ అనిరుధ్ బోస్ 3.05pm, జనవరి 17, 2024 పిటిషన్ @ వెయిటింగ్ ఢిల్లీ: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణకు రాని పిటిషన్ 14 వ కోర్టు విచారణలో బిజీగా ఉన్న జస్టిస్ బేలా త్రివేది 2.55pm, జనవరి 17, 2024 అంతులేని అక్రమాలు.. ఫైబర్ గ్రిడ్‌లో 2014–2019 మధ్య సుమారు రూ.3,492 కోట్ల విలువైన పనులు ఫేజ్ 1 కింద రూ.333 కోట్ల పనులు సీసీ కెమెరాల కొనుగోలుకు రూ.959 కోట్లు భారత్ నెట్‌కు రూ.1,600 కోట్లు రూ.600 కోట్లతో సెట్ టాప్ బాక్సుల కొనుగోలు కొనుగోలు చేసిన 12 లక్షల సెట్‌టాప్ బాక్సుల్లో 3.40 లక్షల బాక్స్‌లు పని చేయలేదు అవి నాసిరకంగా ఉన్నాయని కింది సిబ్బంది చెప్పినా వినని పైనవాళ్లు చైనా కంపెనీలతో డీల్ కుదుర్చుకున్న హరికృష్ణప్రసాద్ 2.50pm, జనవరి 17, 2024 శాఖలు దాటి సంతకాలు ఏ ఫైలుపైనైనా సంబంధిత శాఖ మంత్రే సంతకం చేయాలి, ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. 2017లో ఏప్రిల్ 3న లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకుని IT, పంచాయతీరాజ్ శాఖలు అప్పగించిన చంద్రబాబు లోకేశ్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్‌ను 2017 సెప్టెంబర్ 14న APSFLకు సలహాదారుగా నియమించారు లోకేశ్ వద్ద ఉన్న శాఖలకు, APSFLకు సంబంధం లేదు కానీ APSFLకు చెందిన ఫైల్ పై లోకేశ్ సంతకాలు చేశారు భారత్ నెట్ ఫేజ్ 2కి సంబంధించిన MOU ఫైల్ పై నారా లోకేశ్ 2017 నవంబర్ 12న సంతకం BBNL(భారత్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్) రెండో దశకు సంబంధించి ఆ సంస్థకూ APSFLకూ మధ్య MOUను ఆమోదిస్తూ సంబంధిత ఫైల్‌పై కూడా లోకేశ్ సంతకం BBNL మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించిన లోకేష్ అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగింత దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు 2.45pm, జనవరి 17, 2024 CID దర్యాప్తులో బయటపడ్డ అంశాలు దోపిడీకి అడ్డాగా ఫైబర్ గ్రిడ్ రాష్ట్రంలో ఒకే కనెక్షన్‌తో ఇంటింటికీ కారు చౌకగా కేబుల్ టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తామని నాడు బాబు ప్రభుత్వం ప్రచారం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 2015లో శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఇందుకోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ పరిధిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏర్పాటు ఆగస్టు 10, 2012 నుంచి సెప్టెంబర్ 8, 2015 వరకూ టెరా సాఫ్ట్ అనుబంధ సంస్థ టెరా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా వేమూరి హరికృష్ణప్రసాద్ వేమూరిని ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా నియమించుకున్న చంద్రబాబు ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో తొలిదశ పనులను రూ.333 కోట్లతో చేపట్టేందుకు ఆగస్టు 26, 2015న ఇన్‌క్యాప్(ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ అనుమతి ఈ టెండర్ మదింపు కమిటీలో ఐటీ సలహాదారు హరికృష్ణప్రసాద్‌ను చేర్చిన చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో ఈపాస్ యంత్రాల సరఫరాలో గోల్మాల్ చేసిన టెరా సాఫ్ట్‌ను ఏపీటీఎస్ (ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) సంస్థ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది కానీ.. ఫైబర్ గ్రిడ్ తొలి దశ టెండర్‌ను మాత్రం ఆగస్టు 30, 2015న టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టారు. టెరా సాఫ్ట్‌కు కేబుళ్లు, నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్(నాక్), హెడ్ ఎండ్ అనుభవం ఉన్నట్లు సిగ్నమ్ కంపెనీ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించిన ఘనులు దీనిపై ఫిర్యాదు చేసిన సిగ్నమ్ కంపెనీ ఎండీ నాసిరకం కేబుల్, క్లాంప్‌లతో టెరా సాఫ్ట్ తొలి దశలోనే రూ.333 కోట్లను దోపిడి 2.40pm, జనవరి 17, 2024 వాదనల సందర్భంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరాం ఏం చెప్పారంటే.. చంద్రబాబు సిఫారసుతోనే గవర్నింగ్ కౌన్సిల్లో వేమూరి హరిప్రసాద్ సభ్యుడు అయ్యాడు టెరాసాఫ్ట్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఎలాంటి కారణం లేకుండా టెండర్ గడువును పొడిగించారు చంద్రబాబు కార్యాలయం మౌఖిక ఆదేశాలతో టెండర్ గడువు చివరి తేదీకి ముందు రోజు టెరాసాఫ్ట్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు సంబంధిత శాఖకు ఇన్చార్జ్గా ఉన్న ఓ ఉన్నతాధికారి టెరాసాఫ్ట్‌కు ప్రాజెక్టు అప్పగించడంపై అభ్యంతరం తెలిపారు ఆయన్ని బదిలీ చేసి, నామమాత్రపు పోస్టుకు మార్చారు టెండర్ నిబంధనలు, ఒప్పందంలో నిర్దేశించిన ప్రమాణాలకు భిన్నంగా కాంట్రాక్టు సంస్థ నాసిరకం సామగ్రిని ఉపయోగించింది ఖజానాకు రూ.115 కోట్ల మేర నష్టం వాటిల్లింది ఈ మొత్తం టెరాసాఫ్ట్ అధినేత, చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్‌కు చేరింది తొలుత హరిప్రసాద్‌కు, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకు, అక్కడి నుంచి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకు నిధులు మళ్లాయి 2.35pm, జనవరి 17, 2024 వాదనల సందర్భంగా చంద్రబాబు లాయర్ అగర్వాల్ ఏం చెప్పారంటే.. చంద్రబాబు లబ్ధి పొందినట్లు ఒక్క ఆధారం చూపలేదు సీఐడీ ఈ కేసు నమోదు చేసి రెండేళ్లయింది ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేయలేదు చార్జిషీట్ దాఖలు చేయలేదు ప్రాజెక్టు వ్యయం పెంపు పూర్తిగా సంబంధిత శాఖ అంతర్గత విషయం ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు లబ్ధి పొందలేదు ఈ రెండేళ్లు చంద్రబాబు బయటే ఉన్నారని, ఒక్క సాక్షిని కూడా ప్రభావితం చేయలేదని చెప్పారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వ ప్రోద్బలంతో సీఐడీ ఈ కేసు నమోదు చేసిందన్నారు. ప్రతి కేసులో చంద్రబాబును జైలులోనే ఉంచాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోందన్నారు. 2.30pm, జనవరి 17, 2024 ఫైబర్‌నెట్ కేసు @ సుప్రీంకోర్టు కాసేపట్లో సుప్రీం కోర్టు లో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ మద్యాహ్నం 3 గంటలకు సుప్రీం కోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ ఫైబర్ నెట్ కేసుపై హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ చంద్రబాబు ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసిన చంద్రబాబు బాబు పిటిషన్ ను విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం 17ఏపై స్పష్టత వచ్చిన తరువాతే ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో చెప్పిన సుప్రీం ధర్మాసనం 2.25pm, జనవరి 17, 2024 ఫైబర్‌నెట్ కేసులో ఏం జరిగిందంటే..? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫైబర్‌నెట్ కుంభకోణం రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారని సీఐడీ అభియోగం 2021లో APSFL ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టినట్టు రికార్డులు నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయం ఢిల్లీ, సాక్షి: ఫైబర్ నెట్‌కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. స్కిల్ కేసు క్వాష్ పిటిషన్‌పై ఈ ధర్మాసనమే నిన్న భిన్న తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ తిరస్కరణ ఎదురైంది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారాయన. అయితే స్కిల్ కేసుకు సంబంధించి 17-ఎ సెక్షన్‌తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఫైబర్ కేసు పిటిషన్ విచారణ వాయిదావేసింది. అప్పటివరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీచేసింది. మంగళవారం సెక్షన్ 17-ఏపై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. చీఫ్ జస్టిస్ బెంచ్‌కు రిఫర్ చేసింది. కానీ, స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టును, రిమాండ్‌ను ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై ఇవాళ్టి విచారణలో ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఫైబర్ నెట్ కేసు నేపథ్యం.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫైబర్‌నెట్ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నది సీఐడీ ప్రధాన అభియోగం. 2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయ్యింది. టీడీపీ ప్రభుత్వంలో 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగిందన్నది సీఐడీ చెబుతోంది. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. చంద్రబాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు. చట్టానికి విరుద్ధంగా.. ఫైబర్ నెట్ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టెరా సాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ముందుగానే రెండు కీలక పదవుల్లో నియమించారు. తొలుత ఆయన్ని ఏపీ ఈ– గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించడంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. ఓ ప్రాజెక్టు టెండర్ల మదింపు కమిటీలో ఆ ప్రాజెక్టు కోసం పోటీ పడే సంస్థకు చెందిన వారు ఉండకూడదన్న నిబంధననూ ఉల్లంఘించారు. టెరా సాఫ్ట్ సంస్థ అప్పటికే బ్లాక్ లిస్టులో కూడా ఉంది. అంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. కానీ చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చి బ్లాక్ లిస్ట్ జాబితా నుంచి టెరా సాఫ్ట్ కంపెనీ పేరును తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టి మరీ టెరా సాఫ్ట్ కంపెనీకి ప్రాజెక్టును కట్టబెట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేయడం గమనార్హం. -
ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో మరో కీలక పరిణామం
-
ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో మరో కీలక పరిణామం.. డీఆర్ఐ కొరడా
సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెరాసాఫ్ట్ కేసులో డీఆర్ఐ కొరడా ఝుళిపించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ చర్యలు తీసుకుంది. ఫైబర్ నెట్ స్కాంలో పన్ను ఎగ్గొట్టినందుకు ఫాస్ట్‌లేన్ టెక్నాలజీస్‌కు రూ.34 కోట్ల పెనాల్టీ విధించింది. కొన్నవారి నుంచి GSTని సేకరించి ప్రభుత్వానికి అమ్మకం దారు చెల్లించాల్సి ఉంది. GST నిబంధనలను ఫాస్ట్‌లైన్ టెక్నాలజీస్ తుంగలో తొక్కింది. ఆధారాలను పరిశీలిస్తే రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించారు. ఈ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్టు ఆధారాలు ఉండగా, ఫాస్ట్‌లేన్ టెక్నాలజీస్ వెనక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీగా గుర్తించారు. ఏపీ ఫైబర్‌నెట్ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే కాగా, విచారణలో ఫాస్ట్‌లేన్ మాజీ ఎండీ విప్లవ్‌కుమార్ పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్నారు. నిధులన్నీ డొల్ల కంపెనీల ద్వారా రూటు మార్చినట్టు అంగీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వేమూరి హరిప్రసాద్‌ని(చంద్రబాబు సన్నిహితుడు) గుర్తించారు. టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్ విజ్ఞప్తి మేరకే పాస్ట్‌లేన్‌ను ఏర్పాటు చేసినట్టు విప్లవ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఇంగ్రామ్ ఆశ్రయించింది. ఫాస్ట్‌లేన్ దివాళా తీసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు ఇంగ్రామ్ తెలిపింది. సెప్టెంబర్ 2020 నుంచి ఫాస్ట్‌లేన్ కార్యకలపాలు నిలిపివేసింది. ఎలాంటి కార్యకలపాలు చూపించకపోవడంతో ఫాస్ట్‌లేన్ రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేసులో వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచంద్‌కు ముందస్తు బెయిల్ రాగా, ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరిస్కరించింది. సుప్రీంకోర్టులో డిసెంబర్ 12న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఇదీ చదవండి: స్కిల్ కుంభకోణం కేసులో కీలక పరిణామం -
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కేసుకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు తరువాత ఫైబర్ నెట్ కేసు విచారిస్తామని ధర్మాసనం గతంలో పేర్కొంది. అయితే గురువారం నాటి జాబితాలో స్కిల్ కేసు తీర్పు అంశం లేదు. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సీఐడీ దాఖలు చేసిన అటాచ్మెంట్ పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ–25గా, ఏ–1 గా వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ ఉన్నారు. కుంభకోణంలో నిందితుల పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో వారి ఆస్తులను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఏపీ, తెలంగాణలో టెరాసాఫ్ట్ కంపెనీ, తుమ్మల గోపీచంద్ తదితరుల పేరిట ఉన్న రూ.114 కోట్ల విలువైన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనను హోం శాఖ ఆమోదించింది. దాంతో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు న్యాయస్థానం అనుమతినివ్వడంతో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ సిద్ధమవుతోంది. చంద్రబాబు పన్నాగమే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అప్పటి సీఎం చంద్రబాబు తన సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్‌నెట్ టెండర్లను కట్టబెట్టారు. మొత్తం రూ.3,300 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. మొదటి దశ కింద రూ.330 కోట్ల ప్రాజెక్టును టెండర్లలో ఎల్–1గా వచ్చిన బిడ్డర్‌ను కాదని మరీ టెరాసాఫ్ట్‌కు కట్టబెట్టారు. అందుకోసం బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీని ఆ జాబితా నుంచి తొలగించి, టెండర్లలో పాల్గొనేందుకు అనుమతించారు. ఏపీ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణను ఫైబర్‌నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఆయనకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీయే టెండర్లలో పాల్గొని, పనులు దక్కించుకుంది. ఇది పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధం. టెరాసాఫ్ట్ కంపెనీ పనులు కూడా నాసిరకంగా చేసి, రూ.144.53 కోట్లను దారి మళ్లించినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అటాచ్ చేయాలనినిర్ణయించిన ఆస్తులు ♦ ఈ కేసులో నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చదరపు అడుగుల ఇంటి స్థలం. ♦ కోటేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్‌కు చెందిన విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్లోని ఓ ఫ్లాట్. ♦ టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్, శ్రీనగర్ కాలనీలో ఉన్న రెండు ఫ్లాట్లు, ఆయన పేరిటే యూసఫ్‌గూడలో ఉన్న మరో ఫ్లాట్. ♦ తుమ్మల గోపీచంద్ భార్య పవన దేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి. -
ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల ఆస్తుల్ని అటాచ్ చేయాలని నేర దర్యాప్తు విభాగం(సీఐడీ)ని మంగళవారం ఆదేశించింది విజయవాడ అవినీతి నిరోధకశాఖ న్యాయస్థానం(ఏసీబీ కోర్టు). ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ, ఏసీబీ కోర్టును నవంబర్ 6వ తేదీన ఆశ్రయించింది. టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు సీఐడీ ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించింది. నిందితులకు సంబంధించి.. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని పిటిషన్లో సీఐడీ కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఫైబర్‌నెట్ కేసులో అటాచ్‌కు నిర్ణయించిన ఆస్తుల వివరాలు ఇవి ►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు ►నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు. ►మొత్తంగా అటాచ్ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది. -
ఆస్తులను అటాచ్మెంట్ చేయాలన్న సీఐడి ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం
-
ఫైబర్ గ్రిడ్ స్కాంలో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కోరుతూ సీఐడీ పిటిషన్
-
కేవలం రూ.39కే కొత్త సినిమా.. త్వరలో ఆర్జీవీ సినిమాలు కూడా!
కొత్త సినిమాలు రిలీజవగానే చూసేయాలని చాలామందికి ఉంటుంది. అందుకు సమయం ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి సరిపడా డబ్బు కూడా ఉండాలి. థియేటర్లో బోలెడన్ని సినిమాలు రిలీజవుతుంటాయి. వాటన్నింటినీ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే! పోనీ వారానికో, నెలకోసారైనా సినిమాకు వెళ్తామన్నా మల్టీప్లెక్స్‌లో టికెట్, స్నాక్స్ ఖర్చు అంతా కలిసి వేలల్లో ఉంటోంది. అటు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడమే గగనమైపోతోంది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం, అటు చిన్న సినిమాలను బతికించడం కోసం అత్యంత తక్కువ ధరకే, ఇంట్లోనే సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది ఏపీ ఫైబర్ నెట్. చిన్న సినిమాలకు చేయూతనివ్వాలనే.. దీని వల్ల కొత్త సినిమా రిలీజైనరోజే కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో ఎంచక్కా చూసేయొచ్చు. అటు చిన్న సినిమాలకు సైతం లాభం చేకూరనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్)లో ఓటు అనే మరో కొత్త సినిమా రిలీజైంది. ఈ సినిమా పోస్టర్‌ను ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'చిన్న సినిమాలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఏపీ ఫైబర్ నెట్లో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటు ప్రాధాన్యత తెలిపేందుకు ఏపీ ఫైబర్ నెట్లో ఓటు అనే సినిమా రిలీజవుతోంది. కేవలం రూ.39కే కొత్త సినిమా ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ మూవీతో కార్తీక్ శౌర్య హీరోగా పరిచయం అవుతున్నారు. కేవలం రూ.39కే ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఇకపోతే రామ్‌గోపాల్ వర్మ తీసిన సినిమాలను ప్రదర్శించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాం. కాగా సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ప్రకారం రాష్ట్రంలోని ప్రతి గ్రామం, చివరి ఇంటి వరకు ఇంటర్నెట్ ఇచ్చే దిశగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఉచితంగా ఇంటర్నెట్ ఇస్తాం' అని తెలిపారు. చదవండి: తినడానికి తిండి లేని రోజులు.. కన్నీళ్లు పెట్టుకున్న శోభ తల్లి -
ఫైబర్ నెట్ కేసులో బాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
-
ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నమోదైన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర సీఐడీ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ ఇప్పటికే ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సీఐడీ సోమవారం ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్లోనూ ఫైబర్ నెట్ కుంభకోణం నిందితులకు సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాలని కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది. సీఐడీ ప్రతిపాదనల్లో ఉంది ఏంటంటే.. ►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు ►నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు. ►మొత్తంగా అటాచ్ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి. హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో సీఐడీ ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేసింది. -
చంద్రబాబుకు బిగ్ షాక్..ఆస్తులు అటాచ్ మెంట్
-
ఫైబర్ నెట్ కేసులో వేగం పెంచిన సీఐడీ
-
ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ 9కి వాయిదా
-
చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు
సాక్షి, ఢిల్లీ/విజయవాడ: అవినీతి కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ శుక్రవారమూ కలిసి రాలేదు. న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అటు సుప్రీంకోర్టులో.. ఇటు విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ శుక్రవారం ఆయనకు ఎలాంటి ఊరటా లభించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్‌ను విచారణ అనంతరం సుప్రీం కోర్టు శుక్రవారం వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. సిద్ధార్థ లూథ్రా వాదనలు పిటిషనర్‌పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ఫైబర్‌నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం విచారణను నవంబర్ ఎనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తరఫు లాయర్లకు గుర్తు చేసిన ధర్మాసనం ఆ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన తర్వాతనే ఫైబర్‌నెట్ కేసును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌పై తీర్పును నవంబర్ ఎనిమిదవ తేదీన వెల్లడిస్తామంది ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. అయితే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఎనిమిదవ తేదీకి కాకుండా.. తొమ్మిదవ తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు లాయర్ లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత ఇబ్బంది రీత్యా తదుపరి విచారణను ఒక్కరోజు ముందుకు జరపాలని కోరారు. ధర్మాసనం ఆ విజ్ఞప్తిని మన్నించి.. నవంబర్ తొమ్మిదివ తేదీనే విచారణ చేపడతామని తెలిపింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని.. పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే పక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. సెక్షన్17-ఏ మీదనే వాడివేడి వాదనలు జరిగాయి. వాదనలు ముగిసే సమయంలో చంద్రబాబు తరఫు లాయర్ హరీశ్ సాల్వే మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేశారు. కానీ, కేసులో ప్రధాన వాదనలు విన్నామని.. ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ప్రస్తావన ఉండబోదని.. నేరుగా తుది తీర్పే ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీర్పు ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠత సర్వత్రా ఏర్పడింది. ఇదీ చదవండి: అవినీతిపరులకు ‘17ఏ’ రక్షణ కవచం కాదు మరోవైపు ఫైబర్ నెట్ కేసు పిటిషన్‌ను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తాలూకూ ప్రభావం శుక్రవారం ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ జరిగే విచారణపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ సీఐడీ చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. చంద్రబాబును కోర్టులో హాజరు పర్చాలని కూడా ఆదేశించింది. కానీ, సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో.. అది వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం జరగాల్సిన విచారణ సైతం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబును కోర్టులో హాజరుపరచాల్సి వస్తే.. అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. ఏసీబీ కోర్టులోనూ.. లీగల్ ములాఖత్‌ల సంఖ్య పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్‌ను శుక్రవారం అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం కొట్టేసింది. ములాఖత్‌ల సంఖ్య పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు గురువారం కోరారు. చంద్రబాబు కేసుల విచారణ వివిధ కోర్టుల్లో ఉన్నందున ములాఖత్‌ల సంఖ్య మూడుకు పెంచాలని పిటిషన్లో అభ్యర్థించారు. అయితే.. అలా చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది. తాజాగా శుక్రవారం ఈ పిటిషన్ ఏసీబీ కోర్టు ముందుకు రాగా.. కోర్టు కొట్టేసింది. ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని తిరస్కరిస్తూ.. సరైన లీగల్ ఫార్మట్‌లో దాఖలు చేయాలంటూ చంద్రబాబు తరపు లాయర్లకు సూచించింది. ►కాల్ డేటా రికార్డింగ్స్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించగా.. ఈ నెల 26వ తేదీ వరకు సమయం కావాలని కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పిటిషన్‌ను వాయిదా వేసింది ఏసీబీ కోర్టు -
బాబులో టెన్షన్..ఫైబర్ నేట్ కేసు విచారణ
-
నేడు సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ
-
Oct 20th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases Arrest Remand Court Hearings And Political Updates 20:49, అక్టోబర్ 20, 2023 మనసంతా బాబే.! ► తెలంగాణ ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబు గురించే ► బాబు ఎప్పుడొస్తాడు? తనకు ఎలా దారి చూపిస్తాడు? ► తెలంగాణ ఎన్నికల కీలక సమయంలో బాబు గైడెన్స్ లేకుండా ఎలా పని చేసేది? 19:49, అక్టోబర్ 20, 2023 రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691 చంద్రబాబు ఆరోగ్యం కుశలం ► రాజమండ్రి జైల్లో చంద్రబాబు క్షేమంగా ఉన్నారన్న డాక్టర్లు ► ఇవ్వాళ్టి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన డాక్టర్లు 19:39, అక్టోబర్ 20, 2023 యాక్షన్ ఎవరిపై.? రియాక్షన్ ఎవరిపై ? ► రాజమండ్రిలో ఈ నెల 23 న టీడీపీ - జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ ► పైకి పొత్తుల ప్రకటన, లోలోన గుంభనంగా మంతనాలు ఈ పొత్తుతో నాకేంటీ అన్న చందాన టీడీపీ, జనసేన నాయకులు ఎంత లాభపడదాం? ఎన్ని సీట్లలో పోటీ చేద్దాం? గెలిచే సీట్లు ఎన్ని? కచ్చితంగా ఓడే సీట్లు ఎన్ని? పైకి ఉద్యమ కార్యాచరణ, లోన సమన్వయ సమస్య ఇప్పటికిప్పుడు పక్క పార్టీకి ఎలా జై కొట్టేది? పోటీకి అవకాశం లేనపుడు సాగిలపడడమెందుకు? అసంతృప్తిని కప్పిపుచ్చేందుకు అటు పవన్, ఇటు లోకేష్ రకరకాల ప్రయత్నాలు 19:19, అక్టోబర్ 20, 2023 ముఖ్యమంత్రి ఆశలకు మంగళం ► జనసేన కార్యవర్గానికి స్పష్టత ఇచ్చిన పవన్ ► సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యం ► ముఖ్యమంత్రి పదవి అంటే ఇష్టమే, సుముఖమే ► కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పదవి గురించి ఆలోచించే పరిస్థితి లేదు ► ఈరోజు మన ప్రాధాన్యం సీఎం పదవి కాదు ► జనసేన కార్యకర్తలకు ఇబ్బందులు ఉన్నా టిడిపితో కలిసి వెళ్లాలి ► గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలి ► ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుంది ► ఒకరి అండదండలు లేకుండా జనాదరణతో ఇంతదూరం వచ్చాం ► 150 మంది క్రియాశీల సభ్యులతో పార్టీ ప్రారంభమైంది ► ప్రస్తుతం పార్టీలో 6.5 లక్షల మందికి పైగా సభ్యులున్నారు ► పార్టీపరంగా ఏ నిర్ణయమైనా నేను ఒక్కడినే తీసుకునేది కాదు ► ప్రజల్లో ఉన్న భావాన్ని పలు నివేదికల ద్వారా తెప్పించుకున్నా ► మన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులే ► క్రియాశీల సభ్యుల అభిప్రాయాలు నివేదిక రూపంలో తీసుకుంటున్నా ► అందరి అభిప్రాయాల మేరకే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నా 18:18, అక్టోబర్ 20, 2023 2 ములాఖత్ లకు ఓకే ►చంద్రబాబుకు జైల్లో రెండు లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ►చంద్రబాబుకు భద్రత దృష్ట్యా రెండు ములాఖత్‌లను ఒకటికి కుదించిన జైలు అధికారులు ►లీగల్ ములాఖత్‌లు మూడుకి పెంచాలని మరోసారి పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు ►వివిధ కోర్టులలో కేసులు ఉండటంతో మూడు ములాఖాత్‌లు ఇవ్వాలని కోరిన బాబు తరపు న్యాయవాదులు ►రెండు ములాఖత్ లను అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు 17:20 అక్టోబర్ 20, 2023 నవంబర్ 9కి ఫైబర్ గ్రిడ్ కేసు ►ఏసీబీ కోర్టులో ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై నిర్ణయం వాయిదా ►పైబర్‌నెట్ పీటీ వారెంట్‌పై నిర్ణయం నవంబర్ 10కి వాయిదా ►సుప్రీంకోర్టులో ఫైబర్‌నెట్ కేసుపై విచారణ ఉన్నట్లు సీఐడీ మెమో ►సీఐడీ మెమో ఆధారంగా ఏసీబీ కోర్టులో విచారణ నవంబర్ 10కి వాయిదా ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ నవంబర్9కి వాయిదా ►తొలుత నవంబర్8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ►నవంబర్9న విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాది విజ్ఞప్తి 15:10, 20 అక్టోబర్ 20, 2023 హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ ఖాళీ ►బీఆర్ఎస్లో చేరిన టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ► రావులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ►కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు అధికారం లోకి వచ్చింది బీఆర్ఎస్: రావుల ►కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుంది ►మేము అభివృద్ది కోసం పోటీ పడ్డాం కానీ వ్యక్తుల కోసం ఏనాడూ పోటీ పడలేదు 14:05 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్ వాయిదా ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్ విచారణ వాయిదా ►ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►చంద్రబాబు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడీకి ఆదేశం ►ఈ నెల 26వరకు సమయం కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►పీపీ విజ్ఞప్తితో పిటిషన్ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 13:55 అక్టోబర్ 19, 2023 టీడీపీ శ్రేణుల్లో వైరాగ్యం ►చంద్రబాబు అరెస్ట్‌తో పాతాళానికి పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ►నాయకత్వ లేమితో పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ►మాటిమాటికి ఢిల్లీకి పోతున్న నారా లోకేష్ ►హడావిడి చేసి.. ఆపై సినిమాలతో బిజీ అయిన నందమూరి బాలకృష్ణ ►సగం సినిమా షూటింగ్‌లతో.. సగం రాజకీయాలతో అయోమయస్థితిలోకి జనసేన క్యాడర్‌ను నెట్టేసిన పవన్ ► సింపథీ కోసం నారా భువనేశ్వరి యాత్ర తెరపైకి ►బాబు అరెస్ట్ అప్పటి నుంచి.. ఇచ్చిన నిరసనల పిలుపునకు ప్రజల నుంచి కనీసం స్పందన లేని వైనం ►న్యాయస్థానాల్లోనూ వరుసగా తగులుతున్న దెబ్బలు.. దక్కని ఊరట ►పండుగ తర్వాత కూడా పరిస్థితి మారకుంటే.. తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్న కొందరు నేతలు 13:34 అక్టోబర్ 19, 2023 స్కిల్ స్కామ్ లో బయటపడింది గోరంత! డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కామెంట్స్ ►దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు చంద్రబాబు ►చంద్రబాబు అరెస్టు అయిన బాధ ఆయన కుటుంబ సభ్యుల్లో కనిపించలేదు.. ►చంద్రబాబు బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు? ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయం చేస్తున్నారు ►బాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారు? ►చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణ కోరవచ్చు కదా! ► రూ. 371 కోట్ల అవినీతిలో అడ్డంగా దొరికిపోయారు కాబట్టి జైలు జీవితం అనుభవిస్తున్నారు ►స్కిల్ స్కామ్ లో బయటపడింది కేవలం గోరంత మాత్రమే ►చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెతికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుంది నారా బ్రాహ్మణి ట్వీట్స్ వెనుక అత్తమామల వేధింపులే కారణం అయ్యుండొచ్చు. @brahmaninaraతో గొడవపడి అప్పట్లో నారా భువనేశ్వరి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. నారా ఇంటిగుట్టు వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. - మాజీ మంత్రి పేర్నినాని #GajaDongaChandrababu#EndofTDP pic.twitter.com/slTX4WCgm5 — YSR Congress Party (@YSRCParty) October 20, 2023 13:06 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మరో రెండు పిటిషన్లు బాకీ ►ఏసీబీలో కోర్టులో ఇవాళ ఇంకా రెండు విచారణకు రావాల్సిన చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ విచారణపై నిర్ణయం తీసుకోనున్న ఏసీబీ కోర్టు ►సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదాతో.. ఏసీబీ కోర్టులోనూ వాయిదా పడే అవకాశం ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు 12:55 అక్టోబర్ 19, 2023 ఓడిపోయే స్థానాలు మనకొద్దు సార్ ►మంగళగిరిలో జనసేన సీనియర్లు, ముఖ్యనేతలతో భేటీ కానున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ►టీడీపీతో పొత్తు, వారాహి యాత్రపై చర్చించనున్న పవన్ ►టీడీపీ ముందర జనసేన డిమాండ్లు ఉంచాలని పవన్‌పై ఒత్తిడి చేయనున్న సీనియర్లు ►పాతికా, ముప్ఫై కాదు.. జనసేనకు యాభై సీట్లు కేటాయించాలి ►సామాజిక వర్గ బలం ఉన్న నియోజకవర్గాలతో పాటు అడిగిన నియోజకవర్గాలే ఇవ్వాలి ►ఓడిపోయే స్థానాలను అంటగట్టొద్దు ►వారాహి యాత్ర అంతటా చేయడం దండగ ►పోటీ చేసే స్థానాల్లోనే చేద్దాం ►పవన్ కల్యాణ్‌కు రెండు సీట్లు ఇవ్వాలి.. రెండు చోట్లా పోటీకి టీడీపీ వాళ్లు కృషి చేయాలి ►టీడీపీకి సమాన గౌరవం జనసేనకు ఇవ్వాలి ►టీడీపీ రెబల్స్‌కు జనసేనలోకి పంపకూడదు ►పార్టీని నమ్ముకున్న వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి ►లిక్కర్, పెట్రోల్.. ఇలా మొత్తం ఎన్నికల ఖర్చంతా టీడీపీనే భరించాలి 12:32 అక్టోబర్ 19, 2023 లాయర్ల కోట్ల ఫీజులకు డబ్బెక్కడది?: లక్ష్మీ పార్వతి ►చంద్రబాబు కేసుల కోసం సీనియర్ లాయర్లు ►40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పని చేస్తున్నారు ►సీనియర్ లాయర్లకు రోజు రూ.కోటి నుంచి రూ.2.50 కోట్లు ఫీజు ►లాయర్ల ఫీజుకే కోట్లకు పైగా ఖర్చు ఉండొచ్చు ►2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పారు ►లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడ్నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తెలపాలి ►దాచుకున్న అవినీతి సొమ్మును లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా? 11:22 అక్టోబర్ 19, 2023 క్వాష్ తర్వాతే ఫైబర్ నెట్ సంగతి ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 9వ తేదీకి వాయిదా ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు పెండింగ్‌లో ఉందని.. అది ఇచ్చేవరకు ఆగాలని బాబు లాయర్లకు సూచించిన సుప్రీంకోర్టు ►ఆ తర్వాతే ఫైబర్ నెట్ కేసు సంగతి చూస్తామని వెల్లడి ►చంద్రబాబు జైలులోనే ఉన్నారు కదా, మీరు ఇంటరాగేషన్ చేసుకోవచ్చు కదా: జడ్జి ►క్వాష్ పిటిషన్‌పై 8వ తేదీన తీర్పు ఇస్తామన్న ధర్మాసనం ►క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►ఇవాళ లిఖిత పూర్వక వాదనల సమర్పణకు ఆఖరు తేదీ ►17ఏ సెక్షన్‌పైనా సాగిన వాడీవేడి వాదనలు ►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్‌కు సుప్రీం నో ► నేరుగా తుది తీర్పే ఇస్తామని చంద్రబాబు లాయర్లకు స్పష్టీకరణ ►నవంబర్ 8 కోసం ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన టీడీపీ శ్రేణులు 10:59 అక్టోబర్ 19, 2023 ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ►విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్ వాదనలు సిద్ధార్థ లూథ్రా వాదనలు: ►పిటిషనర్‌పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ►ఫైబర్‌నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు ►ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ►చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం -- ►వాదనల తర్వాత తదుపరి విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు ►వ్యక్తిగత ఇబ్బంది కారణంగా ఆ మరుసటి రోజుకి విచారణ కోరిన లాయర్ లూథ్రా ► సరేనన్న ధర్మాసనం ► నవంబర్ 9దాకా.. చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని, పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం 10:49 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ ►చంద్రబాబు లీగల్ ములాఖత్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు ►లీగల్ ములాఖత్‌లను పెంచాలని గురువారం పిటిషన్ వేసిన బాబు లాయర్లు ► వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసుల విచారణలు ఉన్నందునా.. లీగల్ ములాఖత్‌ల సంఖ్య మూడుకి పెంచాలని పిటిషన్లో కోరిన లాయర్లు ► అత్యవసర విచారణ కోరగా.. సాధ్యం కాదన్న కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశం ►ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదంటూ ఇవాళ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ►సరైన లీగల్ ఫార్మట్‌లో మరోసారి పిటిషన్ ఫైల్ చేయమని సూచన 10:15 అక్టోబర్ 19, 2023 చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్‌నెట్ స్కాం ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ అభియోగాలు ►టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనం దోపిడీ ►రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారు ►బాబు హయాంలో 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగింది ►2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు ►చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ ►హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీ ►బ్లాక్ లిస్టులో ఉన్న టెరా కంపెనీకి టెండర్ ►అభ్యంతరం తెలిపిన ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ బదిలీ ►టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగింపు ►ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల ►అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి చేరిక ►ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటు!! ►అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బుల తరలింపు ►నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బు బదిలీ ►ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమకు చేరిక ►పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చివరకు చంద్రబాబు వద్దకు ►ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లే అని సీఐడీ దర్యాప్తులో వెల్లడి 09:45 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్లపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు చంద్రబాబు మూడు పిటిషన్లపై విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ ►సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ►నేడు ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డ్స్ పిటిషన్‌పై విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు ►సీడీఆర్ పిటిషన్ నేడు విచారించనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబుకి లీగల్ ములాఖాత్ల సంఖ్య మూడుకి పెంచాలని గురువారం బాబు లాయర్ల పిటిషన్ ►అత్యవసర విచారణకు నిరాకరించిన ఏసీబీ కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశం ►నేడు లీగల్ ములాఖత్‌ల పిటిషన్‌పైనా విచారణ జరిగే అవకాశం 08:55 అక్టోబర్ 19, 2023 బాబు ఆరోగ్యం.. నారా ఫ్యామిలీ అల్లిన కథలు ►గురువారం వర్చువల్ విచారణ టైంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన జడ్జి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? చంద్రబాబు : ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : జైల్లో డాక్టర్లున్నారు కదా, రోజూ చెక్ చేస్తున్నారా? చంద్రబాబు : అవును, రోజూ డాక్టర్లు చెక్ చేస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : డాక్టర్లు హెల్త్ రిపోర్ట్ ఇస్తున్నారా? చంద్రబాబు : అవును, డాక్టర్లు ఏ రోజుకారోజు హెల్త్ రిపోర్టు ఇస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? చంద్రబాబు : జెడ్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిని నేను, నాకు సెక్యూరిటీపై అనుమానాలున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : మీకున్న సందేహాలను రాతపూర్వకంగా ఇవ్వండి, పరిశీలిస్తాం ఇవి చంద్రబాబు స్వయంగా జడ్జి ఎదుట చెప్పిన మాటలు.. మరి నారా ఫ్యామిలీ ఏమంటోంది? మా నాన్నకు స్టెరాయిడ్స్ : గత వారం తనయుడు నారా లోకేష్ బాబు చంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉంది, ఆయన కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ►ఈ ఆరోపణలన్నీ వట్టివేనని తేల్చిన కోర్టు విచారణ ►లోకేష్, భువనేశ్వరీ అసత్య ఆరోపణలు ఎందుకు? ►స్టెరాయిడ్స్, కిడ్నీలు ఎక్కడినుంచి అల్లిన కథలు? ►టీడీపీ పతనం నేపథ్యంలోనే.. సానుభూతి కోసం అసత్యాల ప్రచారమా? 08:36 AM, అక్టోబర్ 20, 2023 తీర్పు ఎప్పుడన్న దానిపై ఉత్కంఠ ►చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ ►స్కిల్ డెవెలప్మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏపై వాడీవేడిగా సాగిన వాదనలు ►ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి ఇవాళ(శుక్రవారం) ఆఖరిరోజు ►వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ ►నేరుగా తీర్పు ఇస్తామంటూ.. బాబు లాయర్లు చేసిన మధ్యంతర బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం ►21 నుంచి 29 దాకా కోర్టుకు దసరా సెలవులు ►ఎలాంటి తీర్పు వస్తుందో? ఎప్పుడు వస్తుందోనని చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళన 08:15 AM, అక్టోబర్ 20, 2023 టీడీపీ ఆశలన్నీ ఆ ఫలితం మీదే! ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఇవాల్టి నుండి చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ కొనసాగింపు ►నవంబర్ 1 వరకు రిమాండ్‌లోనే చంద్రబాబు ►సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ ఫలితంపైనే టీడీపీ ఆశలు ►జైల్లో చంద్రబాబుకు యధావిధిగా కొనసాగుతున్న ఆరోగ్య పరీక్షలు ►సుప్రీంలో క్వాష్ పిటిషన్ ఫలితం తేలాకే ప్రారంభం కానున్న భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర 07:43 AM, అక్టోబర్ 20, 2023 సుప్రీంలో బాబు ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►సుప్రీం కోర్టులో నేడు ఫైబర్ నెట్ స్కామ్ కేఏసు విచారణ ►ఫైబర్ నెట్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ► ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణ ► హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►9వ నెంబర్ కేసుగా లిస్ట్ అయిన పిటిషన్ ►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపుల్లో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు ►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాప్ట్ కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడం పై అవినీతి ఆరోపణలు ► ఇవాళ్టి సుప్రీం ఆదేశాల తర్వాతే.. పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 07:30, అక్టోబర్ 19, 2023 అన్నీ నిజాలే చెప్పాలి ► నిజం గెలవాలి పేరిట యాత్రలో నారా భువనేశ్వరీ నిజం చెప్పాలి ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 07:10 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబుకు భద్రతా అనుమానాలు ►జైల్లో తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు ►గురువారం వర్చువల్ విచారణ సందర్భంగా జడ్జితో ప్రస్తావించిన బాబు ►అలాంటి సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని బాబుకి సూచించిన కోర్టు ►చంద్రబాబు రాసిన లేఖను సీజ్ చేసి సమర్పించాలని అధికారులకు కోర్టు ఆదేశం ►ఆరోగ్య సమస్యలూ ఉన్నాయని జడ్జితో చెప్పిన చంద్రబాబు ►అధికారుల్ని వివరణ కోరిన ఏసీబీ న్యాయమూర్తి ►ప్రత్యేక వైద్య బృందం ఉందన్న అధికారులు ►వైద్య నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించిన ఏసీబీ జడ్జి 07:10 AM, అక్టోబర్ 20, 2023 వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ►సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ను తోసిపుచ్చిందని గుర్తు చేసిన సీఐడీ తరపు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణ చేపట్టలేమన్న హైకోర్టు ►విచారణను దసరా తర్వాతకి వాయిదా వేసిన కోర్టు ► వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని రిక్వెస్ట్ చేసిన బాబు లాయర్లు ►బాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం ►చంద్రబాబు ఆరోగ్య సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లిన బాబు లాయర్లు 06:55 AM, అక్టోబర్ 20, 2023 వివిధ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ కేసులో నేడు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ►ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న ద్విసభ్య ధర్మాసనం ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ ►ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►నేడు లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయవాదులు ►తీర్పు దసరా తర్వాతే వెలువడే అవకాశం? ►ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసు విచారణ నవంబరు 7కి వాయిదా ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►సుప్రీంలో ఫైబర్‌నెట్ కేసు విచారణ ఉండడంతో.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హాజరు పెండింగ్ ► సుప్రీం ఆదేశాల తర్వాతే.. ఫైబర్ నెట్ కేసులోనూ పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే ఛాన్స్ 06:35 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబు రిమాండ్ @41 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజుకి చేరిన జ్యుడీషియల్ రిమాండ్ ► 7691 నెంబర్‌తో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ► స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది వసతి ►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి ►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు ►తాజాగా.. గురువారం ఐదోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగింపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రం అట్టుడికిపోతున్నట్లు JaiTDP, ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కరోజూ కూడా ఎక్కడా హెరిటేజ్‌ని మూసిన దాఖలాలు కనిపించలేదు. నేను వస్తున్నా అంటూ గప్పాలు కొట్టిన బాలయ్య.. హైదరాబాద్‌కి వెళ్లిపోయి కులాసాగా సినిమా పూర్తి చేసుకుని ఈరోజు… pic.twitter.com/C9SXh0EKTU — YSR Congress Party (@YSRCParty) October 19, 2023 -
ఫైబర్ నెట్ స్కామ్ లో సంచలనం...100 కోట్లు దారి మళ్లించి దొరికిపోయారు
-
సుప్రీంలో చంద్రబాబు రెండు పిటిషన్ల విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. స్కిల్‌డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో క్వాష్ పిటిషన్‌తో పాటు ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేర్వేరు పిటిషన్లు వేశారాయన. ఈ క్రమంలో ఇవాళ రెండు పిటిషన్లు విచారణకు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు వినిపించారు. ‘‘ఐదేళ్ల కిందట జరిగిన నేరానికి కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చట్టం అనుమతిస్తుంది. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారనేది ముఖ్యం కాదు. నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టం ఆధారంగానే విచారణ జరగాలి. కొన్ని చట్టాలను సవరించిన ఆ చట్టంలోని మిగిలిన భాగం అలాగే కొనసాగుతుంది. 17ఏ చట్టం తర్వాత జరిగిన కేసులకే వర్తిస్తుందని.. సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవినీతి అనేది ఎప్పుడు ఉద్యోగ బాధ్యత కిందకు రాదు. 17ఏ చట్టంం ప్రాథమిక విచారణకే వ్యతిరేకం అయినప్పుడు.. కేసులు ఎలా విచారిస్తారు. 17ఏ విషయంపై నాలుగు హైకోర్టులు చెప్పిన తీర్పులు చంద్రబాబుకి వ్యతిరేకంగానే ఉన్నాయి. నేరం జరిగిన సమయానికి 17ఏ లేదు కాబట్టి.. ఇది బాబుకి వర్తించదు. ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 17ఏ చంద్రబాబుకు వర్తించదు. ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 17ఏ చంద్రబాబుకు వర్తించదు.. ఇది అవినీతికి సంబంధించిన చట్టం. అవినీతి పరుల్ని కాపాడే చట్టం కాదు. చంద్రబాబు కేసు ఉద్యోగ బాధ్యత కిందకు రాదు కాబట్టి 17ఏ వర్తించదు. గతంలో నేరం జరిగి.. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసినా 17ఏ వర్తించదు. చంద్రబాబుది సాక్ష్యాలు తారుమారు చేయడం.. ప్రజాధనం లూటీ చేసిన కేసు. అరెస్ట్ చేసిన వెంటనే సెక్షన్ 482 కింద క్వాష్ అడగడం ఎంత వరకు కరెక్టో కోర్టు నిర్ణయించాలి. పోలీసులకు కనీసం విచారణ చేసే అవకాశం ఇవ్వకుండా క్వాష్ కోరడం ఎంత వరకు సబబు. స్కిల్ స్కాం కేసు విచారణ ప్రాథమిక దశలో ఉంది. ఈ సమయంలో చంద్రబాబు క్వాష్ సరికాదు. 17ఏ చట్టం రాకముందు జరిగిన నేరాలకు.. 17ఏ వర్తించదని నాలుగు హైకోర్టులు తీర్పు ఇచ్చాయి. 17ఏ వర్తిస్తుందని ఏమైనా తీర్పులున్నాయా? అని ప్రశ్నించిన బెంచ్ అలా తీర్పులు వచ్చినట్లు నా దృష్టికి రాలేదు.. రోహత్గీ 17ఏ వర్తిస్తుందని తీర్పులు ఉన్నాయి.. చంద్రబాబు తరపు న్యాయవాది లాయర్ లూథ్రా రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ.. ‘‘కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు.. విచారణను అడ్డుకోవద్దని సుప్రీం కోర్టు పలుమార్లు తీర్పు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నారు. మరి నిర్ణయాలతో సంబంధం లేకుంటే.. 17ఏ ఎలా వర్తిస్తుంది?. 17ఏ అనేది కేవలం అధికార బాధ్యతలకు సంబంధించిన సెక్షన్. నేనే ఈ నిర్ణయాలకు బాధ్యుడిని అని చంద్రబాబు అంటేనే సెక్షన్ 17ఏ వర్తిస్తుంది. ఈ కేసులో 2018 జూన్ 5వ తేదీన జీఎస్టీ డీజీ రాసిన లేఖ చాలా కీలకం. విచారణ 2018లోనే ప్రారంభమైంది అని చెప్పడానికి ఇది తిరుగులేని సాక్ష్యం. జీఎస్టీ డీజీ రాసిన లేఖపై హైకోర్టులోనూ వాదనలు జరిగాయి. జీఎస్టీ రాసిన సమయంలో చంద్రబాబే సీఎంగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతోందని.. 2017లోనే ఒక విజిల్ బ్లోయర్ లేఖ రాశారు. విజిల్ బ్లోయర్ పేరు చెప్పకుండా ఉండే చట్టం.. ఇంకా అమల్లో ఉందా? అని రోహత్గీని అడిగిన సుప్రీం కోర్టు విజిల్ బ్లోయర్తన గుర్తింపును చెప్పకుండా ఉండే హక్కు ఉంది: రోహత్గీ ..14మే 2017లో మరోసారి విజిల్ బ్లోయర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతోందని పుణే జీఎస్టీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రత్యేక చట్టానికి సవరణ 6ఏను గతంలో సుప్రీం కోర్టు కొట్టేసింది. విచారణ సంస్థలను విచారణ నుంచి అడ్డుకునేందుకు సవరణ చేయలేదు’’ అని రోహత్గీ వాదించారు. దాదాపు గంటన్నరపాటు సాగిన వాదనల అనంతరం పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది ధర్మాసనం. చంద్రబాబుని అరెస్ట్ చేస్తారేమో? ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వాయిదా వేసింది. అయితే.. పీటీ వారెంట్ ప్రకారం చంద్రబాబుని సోమవారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చాల్సి ఉందని, ఆ రోజు హాజరుపరిస్తే గనుక ఈ కేసులో అరెస్ట్ చేస్తారని చంద్రబాబు లాయర్ లూథ్రా విచారణ వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రోజు హాజరుపరిస్తే అరెస్టు చేస్తారని, అప్పుడు ఈ పిటిషన్ నిరర్థకం అవుతుందని లూథ్రా ధర్మాసనానికి వివరించారు. ఆ దశలో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి జోక్యం చేసుకుని.. ‘‘సోమవారం అరెస్టు ఉండద’’ని సీఐడీ తరఫున హామీ ఇచ్చారు. -
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ
-
ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు బిగ్ షాక్
సాక్షి, విజయవాడ: ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. సోమవారం చంద్రబాబును హాజరుపర్చాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చాలని పేర్కొంది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని సీఐడీ న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు అనంతరం పీటీ వారెంట్‌కు అనుమతి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అడ్డగోలుగా అవినీతి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. అందుకోసం టీడీపీ ప్రభుత్వం పక్కా పన్నాగంతో కథ నడిపించింది. చంద్రబాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు. నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘన.. ఫైబర్ నెట్ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టెరా సాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ముందుగానే రెండు కీలక పదవుల్లో నియమించారు. తొలుత ఆయన్ని ఏపీ ఈ– గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించడంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. చదవండి: లోకేష్ సన్నిహితుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు -
కోర్టు ముందుకు చంద్రబాబు..!?
-
ఫైబర్ నెట్ స్కామ్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు
-
ఇన్నర్ రింగ్ రోడ్, అంగుళ్లు కేసుల్లో బెయిల్ పిటిషన్ తిరస్కరణ
-
Chandrababu: చంద్రబాబుకు మరో బిగ్ షాక్..
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు దాడుల కేసు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు వేసిన మూడు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. వివరాల ప్రకారం, చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు దాడులకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణ, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు దాడుల కేసులో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఫైబర్ నెట్ కేసు ఇదే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. అందుకోసం టీడీపీ ప్రభుత్వం పక్కా పన్నాగంతో కథ నడిపించింది. చంద్రబాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా.. ఫైబర్ నెట్ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టెరా సాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ముందుగానే రెండు కీలక పదవుల్లో నియమించారు. తొలుత ఆయన్ని ఏపీ ఈ– గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించడంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. ఓ ప్రాజెక్టు టెండర్ల మదింపు కమిటీలో ఆ ప్రాజెక్టు కోసం పోటీ పడే సంస్థకు చెందిన వారు ఉండకూడదన్న నిబంధననూ ఉల్లంఘించారు. టెరా సాఫ్ట్ సంస్థ అప్పటికే బ్లాక్ లిస్టులో కూడా ఉంది. అంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. కానీ చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చి బ్లాక్ లిస్ట్ జాబితా నుంచి టెరా సాఫ్ట్ కంపెనీ పేరును తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టి మరీ టెరా సాఫ్ట్ కంపెనీకి ప్రాజెక్టును కట్టబెట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేయడం గమనార్హం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్లో మార్పులు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలైన్మెంట్ ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి, దానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంస్థ చేత అలైన్‌మెంట్‌ను తయారు చేయించారని వివరించారు. ఈ మార్పుల ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు చంద్రబాబు లబ్ధి చేకూర్చారని చెప్పింది. అందుకు ప్రతిఫలంగా రమేష్ కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇది క్విడ్ ప్రోకోయేనని వెల్లడించింది. ఇది కూడా చదవండి: బాబు కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు ఇది కూడా చదవండి: తోడు దొంగల ‘రింగ్’! అంగళ్లు కేసు ఇదే.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు సంబంధించి టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ప్రథమ ముద్దాయిగా పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద ఎస్ఐ షేక్ ముబిన్తాజ్ కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: ‘అంగళ్లు’ దాడుల కేసులో ఎ1గా చంద్రబాబు -
కాసేపట్లో తేలనున్న చంద్రబాబు భవితవ్యం ?
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు..నిజాలకు రామోజీ పాతర !
-
ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ పిటిషన్
-
Fact Check: గాంధీ జయంతి రోజూ నిజాలకు పాతరేనా!?
సాక్షి, అమరావతి: తన మనిషి సీఎం కుర్చీలో లేడన్న అక్కసుతో నిత్యం అబద్ధాలనే అచ్చేస్తూ ప్రజలెనుకున్న ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును తీస్తూ అసత్య కథనాలు ప్రచురిస్తున్న ఈనాడు పత్రిక గాంధీ జయంతి రోజున కూడా నిస్సిగ్గుగా నిజాలకు పాతరేసింది. ఫైబర్‌నెట్ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు రామోజీరావు ‘‘వైర్లు పీకేశారు.. గుండెలు బాదుకుంటున్నారు’’ అంటూ విషం కక్కారు. ఉపయోగంలేని చోట్ల ఉన్న ఫైబర్ కేబుల్‌ను తొలగించి వాటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే అదో పెద్ద నేరం అంటూ గగ్గోలు పెడుతున్నారు. 2019 నవంబర్‌లో జరిగిన మెయిల్స్‌ను చూపిస్తూ వైర్లు పీకేశారంటూ అసత్యాలతో కూడిన కథనాన్ని ప్రచురించారు. ఇదంతా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీగా నియమించిన ఐఏఎస్ అధికారి ఎ. సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో టెరాసాఫ్ట్‌కు అనుబంధంగా పనిచేసిన నెటాప్స్ సంస్థలే ఈ తొలగింపు ప్రక్రియలో పాల్గొన్న విషయాన్ని వ్యూహాత్మకంగా ఎక్కడా పేర్కొనలేదు. చోరీ జరగక్కుండా ఉండేందుకు తొలగిస్తే.. ఫైబర్‌గ్రిడ్ ఫేజ్–1 ప్రాజెక్టు కింద అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ కేబుల్ కాంట్రాక్టును టెరాసాఫ్ట్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో 24,000 కి.మీ మేర 24ఎఫ్ ఫైబర్ కేబుల్, దానికి కావాల్సిన స్తంభాలు ఇతర పరికరాలతో సమకూర్చారు. అందులోని 524 కి.మీ పరిధిలో సబ్‌స్రై్కబర్స్ లేకపోవడంవల్ల అక్కడ కేబుల్‌ను చోరీచేసే అవకాశం ఉండటంతో వీటిని ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని ఏపీఎస్ఎఫ్ఎల్ నిర్ణయించింది. 12 జిల్లాల్లో ఉపయోగంలేని చోట్ల మొత్తం 524 కి.మీ పరిధిలోని కేబుల్‌ను ఇతరచోట్ల బిగించుకునేందుకు వీలుగా తొలగించాలని ఏపీఎఎస్ఎఫ్ఎల్ ఉద్యోగి రాజేశ్‌రాయ్ తన ఈ–మెయిల్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు.. అప్పటి ప్రభుత్వంలో ఫైబర్‌నెట్ కేబుల్ బిగించడంలో పాలుపంచుకున్న నెటాప్స్ సంస్థకే ఈ తొలగింపు కాంట్రాకును ఇచ్చారు. దీంతో ఆ సంస్థ మీటరుకు రూ.12 ఇవ్వాలని కోరగా ఏపీఎస్ఎఫ్ఎల్ రూ.8 మాత్రమే చెల్లించింది. మొత్తం 1,25,677 మీటర్ల 24ఎఫ్ ఫైబర్ కేబుల్‌ను తొలగించినందుకు రూ.11,86,391 చెల్లించారు. ఈ తొలగించిన కేబుల్‌ను వైర్లు కట్ అయ్యి ప్రసారాలు ఆగిపోయిన చోట్ల తిరిగి బిగించడానికి వినియోగిస్తున్నారు. వక్రీకరించి విషప్రచారం.. ఇలా వృధాగా ఉన్న విలువైన వైరును తిరిగి ఉపయోగిస్తుంటే దాన్ని అభినందించాల్సిందిపోయి చంద్రబాబు తప్పేం చేయలేదు.. వీళ్లే కేబుల్స్ తొలగించి గుండెలు బాదేసుకుంటున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు వక్రీకరించి విషప్రచారం చేయడాన్ని అధికారులు ఖండిస్తున్నారు. అసలు ఫైబర్‌నెట్ కుంభకోణానికి ఈ వైర్ల తొలగింపునకు ఎలాంటి సంబంధం లేకపోయినా బోడిగుండుకు మోకాలుకు ముడిపెడుతూ చంద్రబాబుని ఈ కుంభకోణం నుంచి తప్పించడానికి రామోజీ పడుతున్న పాట్లు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఫైబర్ నెట్ లోనూ అదే స్కిల్
-
ఫైబర్ నెట్లో రూ.114 కోట్లు దోచేశారు!
సాక్షి, అమరావతి: ఫైబర్‌నెట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఇది ఒక కేస్ స్టడీ లాంటిదని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగిందన్నారు. 2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైనట్లు చెప్పారు. చంద్రబాబు తన ఓఎస్డీ అభీష్ణ ద్వారా ఈవీఎంల దొంగ వేమూరి హరికృష్ణప్రసాద్ని మెంబర్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సి ల్గా నియమించాలని ఐటీ కార్యదర్శికి లేఖ రాశా రని చెప్పారు. ప్రాజెక్టు సాంకేతిక మదింపు కమిటీ, టెండర్ మదింపు కమిటీలోనూ హరికృష్ణప్రసాద్ సభ్యుడిగా ఉన్నాడని తెలిపారు. హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన దేవినేని సీతారా మయ్య 2000 సెప్టెంబర్ 30 నుంచి 2014 వరకు టెరా సాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్‌గా ఉన్నారని వెల్లడించారు. ఫైబర్‌నెట్ ప్రాజెక్టుపై మంగళవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. బ్లాక్ లిస్టు కంపెనీకి టెండర్ అప్పటిదాకా బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్‌ను రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. అప్పటి ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ దీనిపై అభ్యంతరం తెలిపితే ఆయన్ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగించారు. ఈ స్కామ్ పూర్తిగా చంద్రబాబు కనుస న్నల్లోనే జరిగింది. ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల చేయగా అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చా రు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్వేర్ అడ్రస్ ఒక్కటే. అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బులను తరలించారు. పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చంద్రబాబు వద్దకు చేరింది. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సీమెన్స్ వెబ్సైట్లో ఏపీ ప్రాజెక్టు గురించి ఎక్కడా లేదు. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక ప్రాజెక్టుల గురించి మాత్రమే ఉంది. తమకున్న వ్యాపార సంస్థలో 2 శాతం అమ్మేస్తే రూ.400 కోట్లు వస్తాయని బాబు సతీమణి అంటున్నారు. ఆ వ్యాపారాలు ఉండడానికి ఆమె భర్త బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? 2 శాతం అమ్మితేనే రూ.400 కోట్ల వస్తాయంటే వంద శాతం అమ్మేస్తే రూ. 20 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు రెండు ఎకరాల నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగారు? అన్నీ అవకతవకలే: వేణుగోపాల్, ఎమ్మెల్యే టెండర్లలో నిబంధనలను పాటించలేదు. ఇతర సంస్థలతో కన్సార్టియమ్గా ఏర్పడి టెరాసాఫ్ట్ వేసిన టెండర్ డాక్యుమెంట్లు సరైనవి కాకపోవడంతో ఇతరులు అభ్యంతరం తెలిపారు. ఈ స్కామ్‌కు ప్రత్యక్ష సాక్షిని, బాధితుడిని నేనే కనుక ఈ విషయాలు స్పష్టంగా చెప్పగలుగుతున్నా. సూత్రధారులు బాబు, లోకేశ్‌లే: అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లే. వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీకి పాల్పడ్డారు. టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనాన్ని దోచేశారు. బాబు అవినీతిని ఎవరు కట్ చేస్తారు? (ఫైబర్ గ్రిడ్ స్కామ్‌పై 26.3.2016న ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీలో ఏమన్నారో తాజాగా సభలో ప్రదర్శించారు) ‘చంద్రబాబు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ప్రాజెక్టును రూ.333 కోట్లకు ఎంత దారుణంగా ఇచ్చారో, ఇందులో ఎన్ని వందల కోట్ల స్కామ్ జరిగిందో చెబుతా. చౌక దుకాణాల్లో ఈ–పోస్ యంత్రాలను అమర్చడంలో విఫలమై బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ అనే సంస్థకు ఫైబర్ గ్రిడ్ పనులను రూ.333 కోట్లకు ఎలా అప్పగించారో చంద్రబాబుకే తెలియాలి. హెరిటేజ్‌తో సంబం«ధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్కి టెరా సాఫ్ట్‌తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్‌కు పనులు ఇచ్చేసుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న దేవినేని సీతారామయ్య 2014 సెప్టెంబర్ 30 వరకు టెరా సాఫ్ట్‌వేర్‌లోనూ డైరెక్టర్‌గా పనిచేశాడు. అదే సంస్థకు ఫైబర్ ఆప్టికల్ పనుల్ని చంద్రబాబు అప్పగించారు. వేమూరి హరికృష్ణప్రసాద్, చంద్రబాబు కుటుంబం మధ్య సన్నిహిత సంబంధాలున్నట్లు తేటతెల్లమవు తుంటే ఇక ఇది ఏ రకంగా పారదర్శకం? ఇది సబబేనా? పెన్షన్లు, ఇళ్ల విషయంలో ఒకటో అరో అవినీతి జరిగితే కట్ చేయాలంటాడు చంద్రబాబు. మరి ఆయనే దగ్గరుండి చేస్తున్న అవినీతిని ఎవరు కట్ చేస్తారు?’ అని అప్పట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఫైబర్ నెట్ కేసులోనూ చంద్రబాబుపై పీటీ వారెంట్
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఫైబర్ నెట్ కుంభకోణంలో అరెస్టు చేసి విచారించేందుకు అనుమతించాలని సీఐడీ మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ దాఖలు చేసింది. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ పేరుతో చేసిన భూ దోపిడీ కేసులో ఏ1 చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు పీటీ వారెంట్‌ను సీఐడీ ఇటీవల దాఖలు చేసింది. తాజాగా ఫైబర్ నెట్ కుంభకోణంలోనూ చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించడంతో న్యాయస్థానంలో పీటీ వారెంట్ దాఖలు చేసింది. అందుకు న్యాయస్థానం అనుమతిస్తే ఈ కేసులో కూడా చంద్రబాబును అరెస్ట్ చేసి విచారించి న్యాయస్థానంలో హాజరుపరచనుంది. బినామీ కంపెనీకి అడ్డగోలుగా ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. అందుకోసం టీడీపీ ప్రభుత్వం పక్కా పన్నాగంతో కథ నడిపించింది. చంద్రబాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా ఫైబర్ నెట్ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టెరా సాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ముందుగానే రెండు కీలక పదవుల్లో నియమించారు. తొలుత ఆయన్ని ఏపీ ఈ– గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించడంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. ఓ ప్రాజెక్టు టెండర్ల మదింపు కమిటీలో ఆ ప్రాజెక్టు కోసం పోటీ పడే సంస్థకు చెందిన వారు ఉండకూడదన్న నిబంధననూ ఉల్లంఘించారు. టెరా సాఫ్ట్ సంస్థ అప్పటికే బ్లాక్ లిస్టులో కూడా ఉంది. అంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. కానీ చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చి బ్లాక్ లిస్ట్ జాబితా నుంచి టెరా సాఫ్ట్ కంపెనీ పేరును తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టి మరీ టెరా సాఫ్ట్ కంపెనీకి ప్రాజెక్టును కట్టబెట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేయడం గమనార్హం. ఆధారాలతో సహా బట్టబయలు ఫైబర్ నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ముందుగా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో మొత్తం అవినీతి బట్టబయలైంది. టెరా సాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. అనంతరం ఐపీసీ సెక్షన్లు 24, 166, 167, 418, 465, 468, 471, 409, 506, అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. కుంభకోణంలో కీలక పాత్రధారులైన టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్‌క్యాప్ వీసీ కె.సాంబశివరావు, ఫాస్ట్‌లేన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ డైరెక్టర్ విప్లవ కుమార్, జెమిని కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రామ్మూర్తి, నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించిన కనుమూరి కోటేశ్వరరావులను సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏ11 తుమ్మల గోపీచంద్, ఏ22 రామ్‌కుమార్ రామ్మూర్తి ముందస్తు బెయిల్ పొందారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుకు అనుమతి కోరుతూ సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయడంతో ఈ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. షెల్ కంపెనీల ద్వారా.. చంద్రబాబు బినామీ కంపెనీ కావడంతో ఫైబర్ నెట్ ప్రాజెక్టును టెరా సాఫ్ట్ కంపెనీ అత్యంత నాసిరకంగా చేసి నిధులు కొల్లగొట్టింది. టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగమయ్యాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మేన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరా సాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు గత సర్కారు ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో కొల్లగొట్టిన ఆ నిధులను కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ప్రభుత్వంలో ‘ముఖ్య’ నేతకు చేరినట్టు సీఐడీ గుర్తించింది. ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది. చదవండి: ‘నేరం కనిపిస్తున్నప్పుడు గవర్నర్ అనుమతి అక్కర్లేదు’ -
గ్రామాల బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానికి రూ.1 లక్ష కోట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6.4 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అనుసంధానించే భారత్‌నెట్ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటికే 1.94 లక్షల గ్రామాల్లో ఈ ఆప్టికల్ ఫైబర్ నెట్ అనుసంధానం పూర్తవ్వగా మొత్తంగా అన్ని గ్రామాలకు నెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకు సంబంధించిన రూ.1.39 లక్షల కోట్ల నిధుల కేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొదట నాలుగు జిల్లాల్లోని గ్రామాల అనుసంధానానికి ఉద్దేశించిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఈ ఫైబర్–టు–హోమ్ మోడల్‌ను తర్వాత వేర్వేరు రాష్ట్రాల్లోని 60వేల గ్రామాలకు విస్తరించారు. ప్రాజెక్టు ద్వారా 2.5 లక్షల ఉద్యోగాల సృష్టి సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. -
ఏపీ ఫైబర్ నెట్.. కేవలం రూ.40కే ఫ్యామిలీతో సినిమా చూసేయండి!
ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మరో వారం రోజుల్లో ఫైబర్ నెట్ వేదికగా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్స్మ్ ప్రారంభించనున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్(ఏపీఎస్ఎఫ్ఎల్) డా.పి.గౌతమ్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో 'కాస్ట్లీ కోరికలు' అనే చిత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ చిత్ర బృందంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! ) ఫైబర్ నెట్ ద్వారా కాస్ట్లీ కోరికలు అనే సినిమాను కేవలం రూ.40కే విడుదల చేస్తున్నామన్నామని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఈ సినిమా తెరకెక్కిందన్నారు. కొత్త తరహా కాన్సెప్ట్ కావడం, హీరోయిన్ లేకుండా కేవలం యంగ్ స్టర్స్ తో మాత్రమే తీసిన సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారన్నారు. ఈ చిత్రాన్ని ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బ్లాక్ స్పేస్ ప్రొడక్షన్ లో ఎస్వీ ఝాన్సీలక్ష్మీ నిర్మాతగా.. ఎస్వీవీ సాయి కుమార్ రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. గతంలో తొలి సినిమాను రూ.100కు అందించిన ఏపీఎస్ఎఫ్ఎల్ ఈ చిత్రాన్ని కేవలం రూ.40కే అందిస్తున్న విషయాన్ని గౌతమ్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా భవిష్యత్తులో లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడమే తమ ధ్యేయమన్నారు. ఔత్సాహిక కళాకారులకు ఏపీ ఫైబర్ నెట్ సరైన వేదిక అని ఆయన అభివర్ణించారు. ప్రతి ఏటా 250 చిన్న చిత్రాలు రూపుదిద్దుకుంటే అందులో థియేటర్లలో విడుదలయ్యేవి కేవలం 40 చిత్రాలు మాత్రమే అన్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు పడుతున్న ఇబ్బందులు అధిగమించాలనే ఉద్దేశంతో మరింత ప్రోత్సాహమందించేందుకు చిన్న చిత్రాలను తక్కువ ధరకే విడుదల చేస్తున్నామని గౌతమ్ రెడ్డి అన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిన చిత్రాలను మాత్రమే తాము విడుదల చేస్తామన్నారు. (ఇది చదవండి: కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!) రానున్న రోజుల్లో పెద్ద చిత్రాలను కూడా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిరంజీవి భోళాశంకర్ చిత్రాన్ని థియేటర్లో ప్రదర్శించిన వారం, పది రోజుల్లో ఏపీ ఫైబర్ నెట్లో ప్రదర్శించేందుకు ఆ చిత్ర నిర్మాత సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. సినిమా విడుదల రోజే తక్కువ ధరకే కొత్త సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో చూడటం మంచి అనుభూతి అన్నారు. పైరసీ చేసేందుకు అవకాశం లేని టెక్నాలజీతో తాము పైబర్ నెట్ వేదికగా సినిమాలను విడుదల చేస్తున్నామన్నారు. -
ఏపీ ఫైబర్ నెట్ ద్వారా మరో సినిమా రిలీజ్.. ఈసారి రూ.39కే
కొత్త సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే కూర్చొని చూసే ఛాన్స్ 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్' రీసెంట్ గానే ప్రారంభించింది. ఈ విషయాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి ఇదివరకే చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ 3వ అంతస్తులోని ఫైబర్ నెట్ కార్యాలయంలో 'లవ్ యూ టూ' చిత్ర బృందంతో కలిసి గురువారం పత్రికా సమావేశం నిర్వహించారు. మరో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా నిర్మాతకు, ప్రేక్షకుడికి లాభం కలిగేలా అతి తక్కువ ధరకే తొలిరోజే సినిమాను రాష్ట్ర ప్రజలు ఇంట్లో వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమాగా ఇప్పటికే 'నిరీక్షణ' అనే చిత్రాన్ని రూ.99కి విడుదల చేశాం. రెండో సినిమాగా 'లవ్ యూ టూ' చిత్రాన్ని కేవలం రూ.39కే జూన్ 16 నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో థియేటర్లలోకి వచ్చే ప్రతి సినిమాను ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా చూసే ఛాన్స్ కల్పిస్తాం. త్వరలో మూరుమూల ప్రాంతాలకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు విస్తరిస్తాం. ఏపీఎస్ఎఫ్ఎల్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్, థియేటర్లకు పోటీ కాదు' అని గౌతంరెడ్డి చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 31 సినిమాలు.. లిస్ట్ ఇదే!) -
మీ ఇల్లే.. ఇక సినిమా థియేటర్!.. రూ.99 టికెట్‌తో 24 గంటల పాటు
సాక్షి, విశాఖపట్నం : అరెరె.. మంచి సినిమా రిలీజైంది. ఏ థియేటర్లోనూ టికెట్స్ దొరకడం లేదు.. ఫ్యామిలీతో సినిమా ప్లాన్ చేశాను. కానీ నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందే.. ఈ అనుభవం సినిమా అభిమానులందరికీ చాలాసార్లు ఎదురయ్యే ఉంటుంది. ఇకపై మీ ప్లాన్లు ఫ్లాప్ అవ్వవు. ఎందుకంటే.. ఫ్యామిలీ మొత్తం.. ఒకే టికెట్‌పై రిలీజ్ సినిమాని ఇంటి నుంచే ఎంచక్కా చూసెయ్యవచ్చు. అదీ 99 రూపాయలకే... అది కూడా 24 గంటల సేపు.. ఆ సినిమాని ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు చూడొచ్చు కూడా..నిజమండీ.. రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ డే.. ఫస్ట్ షో పేరిట ఈ అవకాశం కల్పిస్తోంది. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏంటీ.. ఫస్ట్ డే ఫస్ట్ షో..? కోవిడ్ తర్వాత సినీ పరిశ్రమ కుదేలైంది. థియేటర్లకు వెళ్లేందుకు జనం భయపడేవారు. క్రమంగా పరిస్థితులు చక్కబడ్డాయి. థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఓటీటీ ప్లాట్‌ఫారాలు కూడా అదే రీతిలో దూసుకొచ్చాయి. ఓటీటీల కోసమే కొన్ని సినిమాలు తీస్తూ థియేటర్లో కాకుండా ఈ ప్లాట్‌ఫారాలు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఓటీటీ హవా నడుస్తోంది. ప్రజలు థియేటర్‌కు వెళ్లే కంటే ఇంట్లోనే సినిమా చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఇదే బాటలో ఫైబర్ నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీటీలకు భిన్నంగా ఫస్ట్ డే ఫస్ట్ షోను విశాఖ వేదికగా శుక్రవారం ప్రారంభించింది. ఓటీటీ ప్లాట్ఫారంలో రిలీజ్ అయిన సినిమాలు థియేటర్లో కనిపించవు. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోలో మాత్రం.. థియేటర్లోనూ, ఇటు ఇంట్లోనూ ఒకేసారి రిలీజ్ అవుతాయి. సినీ ప్రముఖులతో చర్చలు జరిపి ఈ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. నిర్మాతలకు లాభమేనా.. తెలుగులో ఏటా వందకుపైగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఒక పెద్ద హీరో సినిమా లేదా.. పెద్ద బ్యానర్ సినిమా రిలీజ్ అయితే, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. థియేటర్లు ఖాళీ అయ్యేంత వరకూ చిన్న సినిమాలు విడుదలకు నోచుకోవు. ఈ సమయంలో థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సినిమాలు చూసేందుకు తీసుకొచ్చిందే ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్. ఏపీ ఫైబర్ నెట్ తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ద్వారా చిన్న సినిమా నిర్మాతలకు ఊతంలా ఉంటుంది. నిర్మాతలకు ప్రమోషనల్ ఖర్చులు తగ్గుతాయి. ఇందులో వచ్చే ఆదాయాన్ని ఫైబర్ నెట్, నిర్మాతలు పంచుకుంటారు. ఉదాహరణకు రాష్ట్రంలోని 660 మండలాల్లోని 950 ప్రాంతాల్లో ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులు 8 లక్షల మంది ఉన్నారు. వీరిలో కనీసం లక్షల మంది ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూసేందుకు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే.. దాదాపు రూ.కోటి వస్తుంది. ఈ మొత్తాన్ని ఫైబర్ నెట్, నిర్మాతలు షేర్ చేసుకుంటారు. తద్వారా చిన్న సినిమా నిర్మాతలు కూడా లాభపడి మరిన్ని విభిన్నమైన సినిమాలు వచ్చే అవకాశాలున్నాయి. తొలి సినిమా నిరీక్షణ : ఫస్ట్ డే.. ఫస్ట్ షో కాన్సెప్ట్ ద్వారా ప్రజల ఇంటికి చేరువైన తొలి సినిమా నిరీక్షణ.. టేక్ ఓకే క్రియేషన్స్ బ్యానర్‌పై ఉత్తరాంధ్రకు చెందిన వంశీకృష్ణ దర్శకత్వంలో సాయిరోనక్ హీరోగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఎలా చూడగలరు..? ఎవరు చూడగలరు.. ఇందుకోసం.. ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండాలి. రూ.199 నుంచి ఈ కనెక్షన్ అందుబాటులో ఉంది. కొత్త సినిమాని ఫైబర్ నెట్లో రిలీజ్ చెయ్యాలని ప్రభుత్వంతో నిర్మాతలు ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందన్నది ముందుగానే ప్రకటిస్తారు. సినిమా చూడాలనుకున్న వినియోగదారులు.. రూ.99తో ఏపీఎస్ఎఫ్ఎల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. ఆ సినిమా లింక్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న వినియోగదారుడికి పంపిస్తారు. ఒకే టికెట్‌తో ఇంటిల్లపాదీ రిలీజ్ సినిమాను ఫస్ట్ డే రోజున.. ఫస్ట్ షో ఇంట్లోనే చూసుకోవచ్చు. ఈ లింక్ 24 గంటల పాటు యాక్టివేట్‌గా ఉంటుంది. అంటే.. 24 గంటల సమయంలో ఎన్నిసార్లు అయినా ఈ సినిమా చూసుకోవచ్చు. -
ఫస్ట్ డే ఫస్ట్ షో.. వినూత్న ఆలోచనకు ఏపీ ఫైబర్ నెట్ శ్రీకారం
సాక్షి, విజయవాడ: వినూత్న ఆలోచనకు ఏపీ ఫైబర్ నెట్ శ్రీకారం చుట్టిందని ఆ సంస్థ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. కొత్త సినిమా రిలీజ్ రోజునే ఫైబర్ నెట్లో తిలకించే అవకాశముంటుందని తెలిపారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్‌తో కొత్త సినిమా ప్రదర్శన సదుపాయాన్ని తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకసారి సబ్ స్క్రైబ్ చేసుకుంటే 24 గంటలు కొత్త సినిమా చూసే అవకాశం కల్పించామన్నారు. pic.twitter.com/C4bKDJH3Gt — AP Fiber (@FiberAp) May 30, 2023 ‘‘ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనేదే మా లక్ష్యం. ఫైబర్ నెట్‌ను కూడా ఒక థియేటర్‌గానే చూడాలి. జూన్ 2న విశాఖలో ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్ లాంఛనంగా ప్రారంభిస్తాం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, నటీనటుల సమక్షంలో ప్రారంభిస్తాం. 55 వేల కిలోమీటర్ల మేర ఓఎఎఫ్.సీ కేబుల్ వేయాలనేది మా లక్ష్యం. 37 వేల కిలోమీటర్ల ఓఎఫ్.సీ కేబుల్ వేశాం. 7600 పై చిలుకు గ్రామ పంచాయతీలకు చేరువయ్యాం. పాఠశాలలకు నెట్ అందించడంలో ప్రథమ భాగంలో ఉన్నాం. గ్రామసచివాలయాలు, ఆర్బీకేలకు కనెక్టివిటీ కలిగి ఉన్నాం. 5 కంపెనీలతో సెటాప్ బాక్స్ లు తయారు చేయిస్తున్నాం. సెటాప్ బాక్స్ ల కొరతను అధిగమిస్తాం ’’ అని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: అలర్ట్: రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు -
ఎన్నేళ్లకు చిక్కి'నారా'? లోపలేస్తారా?
-
సినిమా వాళ్లంటే సీఎం జగన్‌కు ఎంతో అభిమానం, అందుకే..: జోగి నాయుడు
ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం అందరికీ సాధ్యపడదు. అంతదాకా ఎందుకు థియేటర్లో సినిమా చూడటం కూడా చాలామందికి సాధ్యం కాని అంశమే! పల్లెటూర్లలో ఉన్నవాళ్లు, మారుమూల గ్రామాల్లో నివసించేవారికి థియేటర్ అందుబాటులో ఉండదు. దీంతో వారు సినిమాలు రిలీజైన వెంటనే చూడలేరు. ఓటీటీలకు వచ్చేదాకా ఆగాల్సిందే! అయితే వారికి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఏపీఎస్ఎఫెల్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురాగా ఇప్పుడేకంగా సినిమాలను డైరెక్ట్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్, నటుడు జోగి నాయుడు మాట్లాడుతూ.. 'సినిమా ఇండస్ట్రీకి సీఎం జగన్ ప్రభుత్వం ఎంతో గౌరవం ఇచ్చింది. సినిమా వాళ్లంటే ఆయనకు ఎంతో అభిమానం. అందుకే సినిమావాళ్లకు ఏడెనిమిది పోస్టులు ఇచ్చారు. ఫైబర్‌నెట్ ద్వారా సినిమా రిలీజ్ అనేది కూడా ఒక సంక్షేమమే! ఈ అవకాశం చిన్న నిర్మాతలకు గొప్ప వరం' అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'చిన్న నిర్మాతలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న గొప్ప అవకాశమిది. ఇప్పుడు ఓటీటీ కోసం సినిమాలు చేస్తున్నారు. రేపు ఫైబర్ నెట్ కోసం సినిమాలు తీస్తారు. ఏపీ ఫైబర్‌నెట్ పెద్ద రేంజ్‌కు వెళ్లడానికి మేము సహకరిస్తాం' అని తెలిపారు. -
రిలీజ్ రోజున సినిమా చూసే ఛాన్స్.. చిన్న నిర్మాతలకు వరం
సినిమా రిలీజైన రోజు ఇంట్లోనే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ఛాన్స్ కల్పిస్తోంది ఏపీ ఫైబర్ నెట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు ప్రజల వద్దకు సినిమా తీసుకు వస్తున్నాం అన్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజే సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. శుక్రవారం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. 'భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నెట్ సేవలను ఏపీలో తక్కువ ధరకు అందిస్తున్నాం. పెద్ద హీరోలకు, నిర్మాతలకు మేము వ్యతిరేకం కాదు. సినిమాను బేస్ చేసుకుని ఫిఫ్టీ-ఫిఫ్టీ రేషియో ఉంటుంది. ఎల్పీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నాము కాబట్టి పైరసీ ఉండదు. ఏపీఎస్ఎఫ్ఎల్ పల్లెటూర్లతో ఎక్కువ కనెక్ట్ అయింది. దీనివల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజు సినిమా చూసే అవకాశం లభిస్తుంది' అన్నారు. ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. 'ఏ రోజు సినిమా రిలీజ్ అవుతుందో అదే రోజు పల్లెటూరులో కూడా సినిమా చూడవచ్చనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమా కూడా ఫైబర్ నెట్లో రిలీజ్ అయితే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది' అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ.. 'ఒక నిర్మాత కష్టపడి సినిమా తీస్తే అది రిలీజ్ రోజునే పైరసీ అయిపోతుంది. ఇండస్ట్రీలో ఉన్న మనం పైరసీని ఎందుకు అరికట్టలేకపోతున్నాము. పెద్దలందరూ కూడా దీనిపై పోరాడాలి. ఫైబర్ నెట్లో రిలీజ్ రోజున సినిమా చూడడం అనేది చిన్న సినిమాకు ఆక్సిజన్ లాంటిది. చిన్న నిర్మాతలు ఫైబర్ నెట్లో రిలీజ్ చేస్తారు. పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తారని అనుకుంటున్నాను' అన్నారు. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. 'ఏపీ ప్రభుత్వం, పోసాని అలీ గారి వల్ల సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతోంది. ఫైబర్ నెట్లో సినిమా రిలీజ్ అనేది చిన్న నిర్మాతకు జగన్ గారిచ్చిన వరం. చిన్న సినిమాకు అసలు థియేటర్స్ ఇవ్వడం లేదు. జనాలు ఓటీటీకి అలవాటు పడ్డారు. ఈ రోజు చిన్న నిర్మాతలకు పేదల పాలిట పెన్నిదే ఈ ప్లాట్‌ఫామ్. ఏపీ సీఎం జగన్ గారి విజన్ చాలా పెద్దది.. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం మంచి ఆలోచన చేశారు. చిన్న నిర్మాతలకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు సినీ ఇండస్ట్రీ తరపున ఏ సహాయం కావాలన్నా ముందుంటాం' అని పేర్కొన్నారు. -
ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులకు శుభవార్త!
ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అదే విధంగా ఓటీటీలు వచ్చాక థియేటర్లో ఏ సినిమా రిలీజైనా కొంతకాలానికి ఓటీటీలోకి వస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమా విడుదల రోజున ఏపీ ఫైబర్ నెట్లో కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలకు గొప్ప సువర్ణ అవకాశం అనే చెప్పవచ్చు. ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ఏప్రిల్ 7 న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికె APSFL(ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్)లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సర్వీసెస్ సబ్‌స్క్రైబ్ చేసుకొని "ఫస్ట్ డే ఫస్ట్ షో" చూడవచ్చు. ఏపీ ఫైబర్ నెట్ డిజిటల్ సాధికారత ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మార్చడం, నెట్వర్క్ మౌలిక సదుపాయాలను వివక్షత లేని ప్రాతిపదికన అందుబాటులో ఉండే "ట్రిపుల్ ప్లే" సేవలను (IPTV, ఇంటర్నెట్, టెలిఫోన్) అందించడం.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పౌరులకు, ప్రభుత్వ సంస్థలకు ఇది మానవాభివృద్ధిని సులభతరం చేస్తుంది. ఆర్థికాభివృద్ధిని పెంచుతుంది. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. APSFL తన నిరంతర ప్రయత్నాల ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో సురక్షితమైన, నమ్మదగిన, అధిక నాణ్యత గల కనెక్టివిటీని అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం APSFLలో ఎన్నో మార్పులు తీసుకురావడంతో అది మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫైబర్ నెట్ చైర్మన్ పునూరు గౌతంరెడ్డి, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అలీ, సినీ నిర్మాత సి కళ్యాణ్ గారు, ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారు. -
Fact Check: పాతర.. కుంభకోణాలకే! అసలు విషయం ఇదీ!
సాక్షి, అమరావతి: ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ప్రతిష్టను కుంభకోణాలతో మసకబార్చిన గత సర్కారు నిర్వాకాలపై ఏనాడూ స్పందించని ఈనాడుకు హఠాత్తుగా ఫైబర్‌నెట్ గుర్తొచ్చింది. అంతే.. ‘ఫైబర్ నెట్‌కు పాతర’ శీర్షికన ఓ కథనాన్ని వండి పారేసి చంకలు గుద్దుకుంది. నిజం చెప్పాలంటే పాతర వేసింది ఫైబర్ నెట్‌కు కాదు.. కుంభకోణాలకే తెర పడింది మరి! ఏపీఎస్ఎఫ్ఎల్లో ప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. గిరిజనులు అత్యధికంగా నివసించే ఐటీడీఏ పాడేరు, రంపచోడవరం లాంటి ప్రాంతాలకు సైతం కార్యకలాపాలను చేరువ చేసింది. మరింత స్పీడ్.. అధిక డేటాతో ఈనాడు పత్రిక ప్రచురించిన కథనాలను ఏపీఎస్ఎఫ్ఎల్ తీవ్రంగా ఖండించింది. 2018లో కనెక్షన్ల సంఖ్య 3.12 లక్షలు కాగా 2019 అక్టోబర్ నాటికి 7.3 లక్షలకు పెరిగి ఇప్పటికీ అదే సంఖ్య కొనసాగుతోందని స్పష్టం చేసింది. గతం కంటే అధిక స్పీడ్, అధిక డేటాతో ప్యాకేజీలను ప్రవేశపెట్టి వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. గతంలో రూ.235 ప్యాకేజీ ద్వారా 50 జీబీ డేటా, 10 ఎంబీఎస్ స్పీడ్ ఉండగా 2021 సెపె్టంబర్ 21 నుంచి 150 జీబీ డేటా, 20 ఎంబీపీఎస్ స్పీడ్‌కు పెంచినట్లు వివరించింది. డేటా వినియోగం ఆధారంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.508 వరకు నాలుగు రకాల ప్యాకేజీలను ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రవేశపెట్టింది. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేలా 2022 ఆగస్టు 22 నుంచి ప్రీపెయిడ్ సేవలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది. కొత్తగా 15,421 ప్రాంతాలకు.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల నుంచి 13 ప్రాజెక్టులను దక్కించుకోవడం ద్వారా వ్యాపారపరంగా ఏపీఎస్ఎఫ్ఎల్ మరింత విస్తరించింది. 15,421 కొత్త ప్రాంతాలకు సేవలను అందించడమే కాకుండా 15,000 కి.మీ ఫైబర్ కనెక్టివిటీని విస్తరించింది. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఫ్యామిలీ హెల్త్‌కేర్ లాంటి 13కుపైగా కీలక ప్రాజెక్టులను దక్కించుకొని వేగవంతమైన నెట్ సేవలను అందిస్తోంది. శ్రీసిటీలోని ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌కు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తోంది. వీటితో ఏపీఎస్ఎఫ్ఎల్ ఆదాయం గణనీయంగా పెరిగింది. 2018–19లో రూ.51.25 కోట్లుగా ఉన్న ఏపీఎస్ఎఫ్ఎల్ ఆదాయం 2021–22 నాటికి రూ.215.63 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి నాటికి రూ.150.50 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. నాడు.. టెరాసాఫ్ట్ ముసుగులో టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ ఫేజ్–1 ప్రాజెక్టును నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్‌కు కట్టబెట్టడం ద్వారా పెద్ద ఎత్తున నిధులను దారి మళ్లించినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో 18 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏపీఎస్ఎఫ్ఎల్కు రూ.120 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలతో తేలడంతో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ కె.సాంబశివరావు, టెరాసాఫ్ట్ సబ్‌కాంట్రాక్టర్ కోటేశ్వరరావులను సీఐడీ అరెస్ట్ చేసింది. చదవండి: 20 వేల కిలో మీటర్లు ప్రయాణించి.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఆసక్తికర విషయాలు.. -
దేశంలోనే వైఎస్ జగన్ అరుదైన రికార్డ్
ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏపీ.ఎస్.ఎఫ్.ఎల్ సంస్థ కొత్తగా 9 ప్యాకేజీలు ప్రకటించింది. ►రూ.190 రూపాయలకే 20 ఎంబీపీఎస్(mbps) స్పీడ్ తో 400 జిబి (జీబీ) ఇంటర్నెట్ ఇవ్వాలని నిర్ణయం ►రూ.190 రూపాయల కనెక్షన్ తీసుకున్న వారికి ఉచితంగా సెట్ టాప్ బాక్స్ ►రూ.249 కే 50..ఎంబీపీఎస్ స్పీడ్ తో 600 జీబీ ఇంటర్నెట్ ►రూ.295 రూపాయలకు ఎఫ్‌టీఏ ఛానల్స్, 15ఎంబీపీఎస్ స్పీడ్ తో 200జీబీ ఇంటర్నెట్ ►ఏపీ.ఎస్.ఎఫ్.ఎల్ లో త్వరలో OTTలు ►రూ.299, రూ.399,రూ.799 రూపాయలతో ఒటీటీ ,ఇంటర్నెట్ ,టెలిఫోన్ సదుపాయం ►రూ.499,రూ.699,రూ.999.. రూపాయలకే ఒటీటీతో పాటు ట్రిపుల్ ప్లే ప్యాకేజీలు అందిస్తుండగా మరో పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభం మరో పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభిస్తున్నట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు. 19 వేల పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో చివరి ఇంటి వరకు ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తామన్నారు. ప్రీపెయిడ్ విధానంలో బిల్లులు చెల్లింపు, ఏ ప్రాంతంలోనైనా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ను ప్రజలందరికి చేరువ చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వైఎస్ జగన్ సరికొత్త రికార్డులు ఆధునాత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ సేవల ప్రాధాన్యం పెరిగింది. కేబుల్‌తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడం కూడా ఇటీవలి కాలంలో చాలా మందికి సర్వసాధారణంగా మారింది. ఫోన్ సదుపాయం ఎప్పడో తప్పనిసరిగా మారింది. కానీ.. ఈ మూడిటికీ అయ్యే ఖర్చు మాత్రం వినియోగదారులకు భారమే. ఈ నేపథ్యంలో మూడు రకాల సేవలనూ కేబుల్, ఇంటర్నెట్, ఫోన్,వాయిస్, డేటా సేవల్ని ఒకే గొడుకు కిందకు తెచ్చి, అతి తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందిస్తుంది. దేశంలో హైస్పీడ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ సేవలను అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రిగా వైఎస్ జగన్ రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. -
ఏపీ ఫైబర్ నెట్ అదిరిపోయే ప్లాన్స్: 245+ ఛానల్స్, అన్లిమిటెడ్ డేటా, ఓటీటీ కూడా..
గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కొరకు దేశంలోనే మరెవ్వరు అందించలేనటువంటి ట్రిపుల్ ప్లే సర్వీస్‌లను తక్కువ ధరలకే మీ ముందుకు తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL). వినియోగదారులకు సరికొత్త హంగులతో డిఫెరెంట్ ప్యాకేజీలతో ఇంటర్నెట్, టెలిఫోన్, ఓటీటీ సేవలను అతి తక్కువ ధరలలో కస్టమర్లకు అందిస్తోంది. వాటి పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం! హోమ్ లైఫ్ ప్యాకేజీ: రూ.295/- ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్‌తో పాటు 15 ఎంబీపీఎస్(Mbps) ఇంటర్నెట్ స్పీడ్, 200 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్(Mbps) Post FUB అన్ లిమిటెడ్ నెట్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. ప్రస్తుత ట్రిపుల్ ప్లే సేవలతో పాటు ఓటీటీ ఇంటిగ్రేటెడ్ ప్యాకేజీలు IP టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ ఓటీటీ సౌకర్యంతో: హోమ్ గోల్డ్ ప్యాకేజీ: రూ.499.. 200 + ఛానెల్స్, 20 ఎంబీపీఎస్ స్పీడ్, 150 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్ Post FUP, ఓటీటీ(OTT) సేవలు.. Aha, Voot Select, Epic On, 1 OTT, Eros Now, Meemoతో పాటు టెలిఫోన్ సౌకర్యం హోమ్ గోల్డ్ ప్లస్ ప్యాకేజీ: రూ.699 240+ ఛానల్స్, 30 ఎంబీపీఎస్ స్పీడ్, 300 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్ Post FUP, ఓటీటీ సేవలు.. Aha, Eros Now, ShemarooMe, Discovery PLus, Hungama Play, Hungama Music, Epic On, 1 OTT, Eros Now, Meemo తో పాటు టెలిఫోన్ సౌకర్యం. హోమ్ గోల్డ్ ప్లస్ ప్యాకేజీ: రూ.999 245+ ఛానల్స్, 50 ఎంబీపీఎస్ స్పీడ్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్, FUB లిమిట్ లేదు. ఓటీటీ సేవలు.. Aha, Zee5, Voot, Sun nxt Premium, Alt Balaji, Eros Now, Discovery PLus, Hungama Play, Hungama Music, Discovery PLus, Meemo, MX player Gold, Aao NXT,Gaana Plus Epic On, 1 OTT, Eros Now తో పాటు టెలిఫోన్ సౌకర్యం ఓటీటీ , ఇంటెర్నట్, టెలిఫోన్ సౌకర్యంతో ప్లాన్లు ఇవే.. ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.299 (10 ఎంబీపీఎస్ స్పీడ్, 150 GB FUP, 2 ఎంబీపీఎస్ Post FUB, ఓటీటీ సేవలు.. Epic On, 1 OTT, Meemo/Aha, టెలిఫోన్ సౌకర్యం) ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.399 30 ఎంబీపీఎస్ స్పీడ్, 300 GB FUP, 2 ఎంబీపీఎస్ Post FUB, ఓటీటీ సర్వీసులు.. Ah, Voot, epic on, 1 ott, eros now, Meemoతో పాటు టెలిఫోన్ సౌకర్యం) ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.799 50 ఎంబీపీఎస్ స్పీడ్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్..FUP లిమిట్ లేదు, ఓటీటీ సేవలు Aha, Zee5, Voot, Sun nxt Premium, Alt Balaji, Eros Now, Discovery PLus, Hungama Play, Hungama Music, Discovery PLus, Meemo, MX player Gold, Aao NXT,Gaana Plus Epic On, 1 OTT, Eros Now.. టెలిఫోన్ సౌకర్యం) ఈ వివిధ ప్యాకేజీలను ఏపీఎస్ఎఫ్ఎల్ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీల సమాచారం కొరకు వెంటనే మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి లేదా APSFL కాల్ సెంటర్ -18005995555 కు సంప్రదించాల్సి ఉంటుంది. (అడ్వటోరియల్) -
వేమూరి హరికృష్ణ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంపై నమోదు చేసిన కేసులో నిందితుడిగా పేర్కొన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ విషయంలో మంగళవారం వరకు అతని అరెస్ట్‌తో సహా ఎలాంటి తొందరపాటు చర్యలేవీ వద్దని హైకోర్టు సీఐడీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని కోరింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ఉత్తర్వులు జారీ చేశారు. ఫైబర్ నెట్ టెండర్ల మదింపు సాంకేతిక కమిటీలో సభ్యుడిగా ఉన్న హరికృష్ణ ప్రసాద్ సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ లలిత విచారణ జరిపారు. -
ఫైబర్ నెట్ కుంభకోణంలో సాంబశివరావు అరెస్ట్
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటుచేసుకున్న ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంలో ఏ–2 నిందితుడు, అప్పటి ఇన్‌క్యాప్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ కె.సాంబశివరావును సీఐడీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. అక్టోబర్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను మచిలీపట్నంలోని సబ్‌జైలుకు తరలించారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ఫైబర్ నెట్ టెండర్ల మొదటి దశలో రూ.330 కోట్ల అవినీతిపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేసి 19మంది నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా సాంబశివరావును కొన్ని రోజులుగా సీఐడీ అధికారులు విచారించారు. Raj Kundra: నీలిచిత్రాల కేసులో నేనే బలిపశువును: రాజ్ కుంద్రా చంద్రబాబు తన సన్నిహితులకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టడంలో సాంబశివరావు కీలకంగా వ్యవహరించారు. టెరాసాఫ్ట్ బిడ్ దాఖలు చేసేందుకే టెండర్ల గడువును పొడిగించారు. టెరాసాఫ్ట్ సమర్పించిన ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్‌ను ఆయన ఆమోదించారు. ఆ ఫేక్ సర్టిఫికెట్ సరైందేనని ఒప్పుకోమని సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఒత్తిడి తెచ్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. దీనిపై విచారణలో ప్రశ్నించగా ఫేక్ సర్టిఫికెట్‌ను ఆమోదించడం నేరమేనని సాంబశివరావు సమ్మతించినట్టు సమాచారం. వీడియోలను అడ్డం పెట్టుకుని.. 250 మందిని ట్రాప్ చేశారు ఇక కేంద్ర టెలికాం శాఖ మార్గదర్శకాలు, టెండరు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అర్హత లేదని పలువురు బిడ్డర్లు ఆధారాలతో ఆయనకు ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఆ ఫిర్యాదులను ఆయన బేఖాతరు చేశారు. టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టారు. ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంలో మరికొందరు కీలక నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. -
ఏపీ ఫైబర్‌నెట్ కేసు: రెండో రోజు సీఐడీ విచారణ
-
ఏపీ ఫైబర్‌నెట్ కేసు: రెండో రోజు సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ కేసును బుధవారం రెండో రోజు సీఐడీ విచారణ చేపట్టింది. రెండో రోజు సీఐడీ విచారణకు వేమూరి హరిప్రసాద్ హాజరయ్యారు. నిన్న(మంగళవారం) వేమూరితో పాటు ఇన్ కాప్ మాజీ ఎండి సాంబశివరావుని కూడా సీఐడీ విచారించింది. నోటీసులు అందుకున్న ముగ్గురిలో నిన్న ఇద్దరు విచారణకు హాజరయ్యారు. సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదు ఫైబర్ నెట్ కుంభకోణంలో A-1 వేమూరి హరిప్రసాద్, ఎ-2 మాజీ ఎండి సాంబశివరావు.. టెర్రా సాఫ్ట్‌కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడంపై సీఐడీ ప్రశ్నించింది. ఫైబర్ నెట్ కుంభకోణంపై సీఐడీ మొత్తం19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మిగిలిన నిందితులకి సీఐడీ నోటీసులు జారీ చేయనుంది. -
ఫేక్ సర్టిఫికెట్ కోసం బెదిరించడం నిజమే
సాక్షి, అమరావతి: ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంపై విచారణలో సీఐడీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్లను ఏకపక్షంగా కట్టబెట్టేందుకు ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే విషయంలో కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన టెండర్ల కుంభకోణంలో మొదటి దశలో రూ.330 కోట్ల టెండర్లలో అవినీతిపై సీఐడీ ఇప్పటికే టెరాసాఫ్ట్ కంపెనీతో సహా 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా టీడీపీ ప్రభుత్వంలో ఇన్‌క్యాప్ ఎండీగా వ్యవహరించిన కె.సాంబశివరావు, ఇ–గవర్నెన్స్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్ సీఐడీ అధికారుల వద్ద మంగళవారం విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో కె.సాంబశివరావును అధికారులు మొదట విచారించారు. రెండు దఫాలుగా దాదాపు ఐదు గంటలపాటు సాగిన ఈ విచారణలో సీఐడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. కాగా టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టడంలో తప్పులు జరిగాయని సాంబశివరావు ఒప్పుకున్నట్లు సమాచారం. టెరాసాఫ్ట్ కంపెనీ సమర్పించిన ఫోర్జరీ ఎక్స్పీరియన్స్ పత్రాలు, వాటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలను సీఐడీ అధికారులు ఆయన ముందుంచి వాటిపై విచారించారు. దాంతో టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు ఆయన అంగీకరించాల్సి వచ్చిందని తెలిసింది. ప్రశ్నల వర్షం.. టెండర్లలో పాల్గొనేందుకు అర్హత లేకపోయినప్పటికీ, సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఫోర్జరీ పత్రాలు సమర్పించడం కచ్చితంగా తప్పేనని సాంబశివరావు అంగీకరించారని తెలుస్తోంది. ఆ విధంగా టెరాసాఫ్ట్ కంపెనీ సమర్పించిన ఫోర్జరీ పత్రాలు సరైనవే అని చెప్పమని సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ సీఈడీ గౌరీశంకర్‌ను బెదిరించడం నేరంగానే పరిగణించక తప్పదని కూడా ఆయన సమ్మతించారని సమాచారం. అదే విధంగా ఫైబర్ నెట్ టెండర్ల ప్రక్రియలో కేంద్ర మార్గదర్శకాలను పాటించక పోవడం, నాసిరకం పరికరాల సరఫరా, నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై సీఐడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారని తెలుస్తోంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టడంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న వేమూరి హరి కృష్ణ ప్రసాద్‌ను కూడా సీఐడీ అధికారులు కాసేపు విచారించారు. ఆయన్ను బుధవారం కూడా పూర్తి స్థాయిలో విచారించనున్నారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులు అందరినీ వరుసగా విచారించేందుకు సీఐడీ అధికారులు సమాయత్తమవుతున్నారు. కాగా, సీఐడీ కార్యాలయం వద్ద వేమూరి హరి కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టెరా సాఫ్ట్ కంపెనీకి, తనకు సంబంధం లేదన్నారు. సీఐడీ అధికారులకు విచారణలో సహకరిస్తానని చెప్పారు. -
ఏపీ ఫైబర్‌నెట్ కేసు: ముగ్గురికి సీఐడీ నోటీసులు
-
ఫైబర్‌నెట్ అక్రమార్కులకు శిక్ష తప్పదు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణానికి సంబంధించి సీఐడీ దర్యాప్తులో స్పష్టమైన ఆధారాలు లభించాయని, ఇందులోని సూత్రధారులు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ చైర్మన్ పి. గౌతమ్‌రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని టెరాసాఫ్ట్ కంపెనీకి రూ.321 కోట్ల విలువైన టెండర్లు అప్పగించడమే కాకుండా రూ.121 కోట్ల పనులకు అక్రమ చెల్లింపులు జరిపారన్న విషయం సీఐడీ ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలోని కొంతమంది పెద్దలు టెరాసాఫ్ట్ పేరుతో ఏ విధంగా టెండర్లు దక్కించుకున్నారన్న విషయంపై స్పష్టమైన ఆధారాలు లభించాయన్నారు. టెండర్ల ఎంపికలో టెరాసాఫ్ట్ ఎండీ.. టెరాసాఫ్ట్‌కు ఎండీగా ఉన్న వేమూరి హరికృష్ణప్రసాద్ 2015లో టెండర్లు పిలిచే సమయానికి ఆ పదవికి ఆయనతో రాజీనామా చేయించి ఏపీఎస్ఎఫ్ఎల్ టెండర్ల పరిశీలన కమిటీలో సభ్యునిగా నియమించారని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. అలాగే, ఏడాదిపాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఆ సంస్థను కేవలం రెండు నెలల్లోనే నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించారని.. టెండర్ల గడువును ఒక వారం పొడిగించి బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించిన మర్నాడే ఆ కంపెనీతో టెండర్లు వేయించారన్నారు. టెరాసాఫ్ట్‌కు ఈ రంగంలో అనుభవం లేకపోయినా టెండర్లు కట్టబెట్టినట్లు ఆయన తెలిపారు. ఇలా అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వైనంపై బేస్ పవర్ సిస్టమ్స్ అనే కంపెనీ ఫిర్యాదు చేస్తే దానిపై దర్యాప్తు చేయకుండా, ఏకంగా ప్రభుత్వమే బేస్ పవర్ సిస్టమ్స్‌పై కేవియట్ దాఖలు చేసిందంటే ఈ కుట్ర వెనకున్న వారి హస్తం స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న ప్రతీఒక్కరూ శిక్ష ఎదుర్కొక తప్పదన్నారు. ప్రస్తుతం 19 మంది అనుమానితులపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని, దర్యాప్తు తర్వాత కీలక వ్యక్తుల పాత్ర బయటకు వస్తుందని గౌతమ్‌రెడ్డి చెప్పారు. -
చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌నెట్ లో అవకతవకలు : గౌతమ్ రెడ్డి
-
ఫైబర్ గ్రిడ్ టెండర్లలో భారీ ఫ్రాడ్
సాక్షి, అమరావతి: ఫైబర్‌నెట్ కార్పొరేషన్ల టెండర్లలో టీడీపీ సర్కారు అవినీతి బాగోతం బట్టబయలైంది. నాటి సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు, బినామీ వేమూరి హరికృష్ణప్రసాద్‌కు చెందిన టెరా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ (టెరాసాఫ్ట్) సంస్థకు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం ఆధారసహితంగా నిర్ధారణ అయింది. నిబంధనలు ఏమార్చి.. కంపెనీని బ్లాక్‌లిస్టు నుంచి హడావుడిగా తొలగించి.. ఫోర్జరీ పత్రాలు సృష్టించి.. టెక్నికల్ కమిటీలో అస్మదీయుడిని నియమించి.. నిపుణుల అభ్యంతరాలను బేఖాతర్ చేసి రూ.330 కోట్ల విలువైన ఫైబర్‌నెట్ టెండర్లను కట్టబెట్టేశారనే నిజం సీఐడీ దర్యాప్తులో నిగ్గుతేలింది. నాసిరకం పరికరాలు సరఫరా చేసినా సరే అడ్డగోలుగా రూ.119.98 కోట్ల మేర బిల్లులు చెల్లించారని స్పష్టమైంది. మిగిలిన దశల టెండర్లతో కలిపి దాదాపు రూ.2 వేల కోట్ల మేర సాగిన ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ టెండర్ల వ్యవహారంలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన సీఐడీ ఫైబర్ నెట్ టెండర్లలో అవినీతిని ఆధారసహితంగా బట్టబయలు చేసింది. మొదటి దశ టెండర్లలో అవకతవకలకు పాల్పడిన కేసులో వేమూరి హరికృష్ణప్రసాద్ (టీడీపీ ప్రభుత్వంలో ఇ–గవర్నెన్స్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు), కె.సాంబశివరావు (నాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ– ఎండీ) సహా మొత్తం 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ను గురువారం న్యాయస్థానానికి సమర్పించింది. ఆ అవినీతి బాగోతం ఇదిగో ఇలా సాగింది... టెరాసాఫ్ట్ కోసం టెండర్ గడువు పొడిగింపు.. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన పనులకు సంబంధించి మొదటి దశలో రూ.330 కోట్లకు ఫైబర్‌నెట్ కార్పొరేషన్ 2015లో ఇన్‌క్యాప్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ) ద్వారా ఈ –టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు 2015 జూలై 31 వరకు గడువు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఒక్క రోజు ముందు అంటే జూలై 30న టెండర్ల దాఖలు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించింది. ఆ రోజు నాటికి ప్రభుత్వ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టెరా సాఫ్ట్ సంస్థ టెండర్ దాఖలు చేయకపోవడమే అందుకు కారణం. ఫోర్జరీ పత్రాలతో అర్హత ఫైబర్ నెట్ టెండర్లలో పాల్గొనేందుకు ఫోర్జరీ అర్హత పత్రాలను సృష్టించి టెరాసాఫ్ట్ కంపెనీ కనికట్టు చేసింది. నిబంధనల ప్రకారం బిడ్ దాఖలు చేసే కంపెనీ మరో రెండు సంస్థలతో కలసి కన్సార్టియంగా ఏర్పడాలి. కన్సార్టియం లీడ్ కంపెనీకి మూడేళ్లలో కనీసం రూ.100 కోట్ల టర్నోవర్ ఉండాలి. మిగిలిన రెండు కంపెనీలకు ఏడాదికి కనీసం రూ.50 కోట్ల చొప్పున టర్నోవర్ ఉండాలి. అయితే కన్సార్టియంలో మూడో కంపెనీ హారిజన్ బ్రాడ్కాస్ట్ ఏర్పాటై అప్పటికి 8 నెలలే అయింది. మరోవైపు ఫైబర్ నెట్ రంగంలో పనులు చేసినట్లు టెరాసాఫ్ట్ ఫోర్జరీ పత్రాలు సమర్పించింది. సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాలు సరఫరా చేసినట్టు ఫోర్జరీ పత్రాలు సృష్టించింది. వాస్తవానికి మోడర్న్ కమ్యూనికేషన్ – బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్స్ అనే సంస్థ ఆ పరికరాలను సరఫరా చేసింది. టెరాసాఫ్ట్ మోసాలపై కొన్ని సంస్థలు ఫైబర్ నెట్ టెక్నికల్ కమిటీకి ఫిర్యాదు చేయడంతో నిర్ధారించుకునేందుకు సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈ మెయిల్ పంపారు. అయితే టెరాసాఫ్ట్, అప్పటి ప్రభుత్వ పెద్దల హెచ్చరికలతో గత్యంతరం లేక ఆ పత్రాలు సరైనవేనని సిగ్నం సంస్థ పేర్కొంది. సీఐడీ విచారణలో సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యం ఆ విషయాన్ని నిర్ధారించింది. టెండర్ల కమిటీలోనూ వేమూరి టీడీపీ పెద్దలు తమ బినామీ వేమూరి హరికృష్ణప్రసాద్‌ను ప్రభుత్వ ఇ–గవర్నింగ్ అథారిటీ ఆధ్వర్యంలోని గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా నియమించారు. అనంతరం ఆయన్ను ఫైబర్‌నెట్ టెండర్ల ప్రక్రియను పరిశీలించే సాంకేతిక కమిటీలో సభ్యుడిని కూడా చేశారు. నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియలో పాల్గొనే సంస్థలతో అనుబంధం ఉన్నవారు సాంకేతిక కమిటీలో ఉండకూడదు. కానీ వేమూరి అప్పటికే టెరా సాఫ్ట్ అనుబంధ కంపెనీ టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. అదే కంపెనీలో టెరా సాఫ్ట్ యజమాని తుమ్మల గోపీచంద్ భార్య పావనీదేవి కూడా డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. ఇక టెండర్ల కమిటీ సమావేశంలో ఏపీటీఎస్ చైర్మన్ సుందరం టెరా సాఫ్ట్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ వాటిని బేఖాతరు చేస్తూ వేమూరి హరికృష్ణ ప్రసాద్ నిర్ణయంతో టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ టెండర్లను కట్టబెట్టారు. నాసిరకం పరికరాలతో రూ.119.98 కోట్ల నష్టం ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌కు టెరాసాఫ్ట్ సరఫరా చేసిన పరికరాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. టెండర్ నిబంధనలను పాటించకపోయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేశారు. ఒప్పందం మేరకు పరికరాలు సరఫరా చేయకపోవడం, నాసిరకం, నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండా బిల్లుల చెల్లింపు, నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవడం తదితరాల వల్ల ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు రూ.119.98 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ విచారణలో నిగ్గు తేల్చింది. బ్లాక్ లిస్టు నుంచి టెరాసాఫ్ట్ తొలగింపు... పౌరసరఫరాల శాఖకు అంతకుముందు టెరా సాఫ్ట్ సరఫరా చేసిన ఇ–పీవోఎస్(ఇ–పోస్) పరికరాలు నాసిరకంగా ఉండటంతో ఆ కంపెనీని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) బ్లాక్ లిస్టులో చేర్చింది. ప్రభుత్వానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో పాల్గొనకుండా ఏడాదిపాటు నిషేధిస్తూ 2015 మే 11న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ నిషేధాన్ని ఏపీటీఎస్ కేవలం నాలుగు నెలల్లోనే ఆగస్టు 6న తొలగించడం గమనార్హం. అందుకోసం ఏపీటీఎస్ టెక్నికల్ కమిటీ ఆగమేఘాల మీద అదే రోజు సమావేశమైంది. ఏపీటీఎస్ ఎండీ బి.సుందర్ ఆ సమావేశం మినిట్స్‌లో సంతకం చేయకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. టెరాసాఫ్ట్‌పై నిషేధం తొలగింపును ఆయన వ్యతిరేకించారు. కానీ కమిటీలో సభ్యులైన ఐటీ శాఖ కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్, ఆర్థిక శాఖలోని ఐటీ విభాగం డైరెక్టర్లు టెరా సాఫ్ట్‌పై నిషేధాన్ని తొలగించాలని నిర్ణయించడంతో టీడీపీ ప్రభుత్వ పెద్దల పన్నాగం సాఫీగా సాగిపోయింది. ఫైబర్ నెట్ టెండర్ల బిడ్ దాఖలుకు 2015 ఆగస్టు 7 చివరి తేదీ కాగా టెరా సాఫ్ట్ కంపెనీని ఒక రోజు ముందు అంటే ఆగస్టు 6న బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించడం గమనార్హం. -
టీడీపీ కుంభకోణాలపై దర్యాప్తు.. సీఐడీ సమాయత్తం
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఫైబర్‌నెట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లలో చోటుచేసుకున్న కుంభకోణాలపై దర్యాప్తునకు సీఐడీ సంసిద్ధమవుతోంది. ఫైబర్‌నెట్ టెండర్లలో రూ.2వేల కోట్ల అవినీతి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లింపు వ్యవహారాలపై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో సీఐడీ కార్యాచరణకు సమాయత్తమవుతోంది. ఇందుకోసం రెండు వేర్వేరు దర్యాప్తు బృందాలను నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఆ రెండు సంస్థల్లో టెండర్ల, నిధుల మళ్లింపు వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. అనంతరం ఎఫ్ఐఆర్లను నమోదు చేస్తారు. అలాగే, దర్యాప్తులో భాగంగా ప్రశ్నించాల్సిన సంస్థలు, వాటికి సంబంధించిన వ్యక్తులు, అప్పటి ప్రభుత్వ అధికారుల జాబితాలను కూడా రూపొందించనున్నారు. దర్యాప్తులో పరిశీలించేవి ఇవే.. ఫైబర్‌నెట్ టెండర్ల కోసం కేంద్ర టెలికాం శాఖ రూపొందించిన నిబంధనలు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్, సాంకేతిక బిడ్లలో అర్హతలు నిర్ణయించిన విధానం, ఫైనాన్స్ బిడ్లలో కోట్ చేసిన రేట్లు, వాటిపై పలు సంస్థల అభ్యంతరాలు మొదలైనవి దర్యాప్తులో ప్రధానంగా పరిశీలించనున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు పేరుతో షెల్ కంపెనీలకు రూ.241.78 కోట్లు దారి మళ్లించిన తీరుపై సీఐడీ దర్యాప్తు చేయనుంది. ఆ షెల్ కంపెనీల చిరునామాలు, వాటిలోని డైరెక్టర్లు, వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించి వారితో అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులకు ఉన్న సంబంధాలను ఆరా తీయనుంది. ఈ రెండు కేసుల్లో దర్యాప్తును ముమ్మరం చేసి నిర్ణీత సమయంలో విచారణను ఓ కొలిక్కి తీసుకురావాలని సీఐడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్‌రెడ్డి
విజయవాడ: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగినట్లు తమ ప్రాధమిక రిపోర్టుల్లో తేలిందని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాలను ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. దాంతో ప్రభుత్వం వెంటనే సిఐడి విచారణకు ఆదేశించిందని వెల్లడించారు. సాక్షి తో ఏసీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరి గౌతం రెడ్డి ఆదివారం మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫైబర్ నెట్లో అవకతవలు జరిగాయని అన్నారు. ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వంకు పంపించినట్లు తెలిపారు. కాంట్రాక్టర్లకు వందలాది కోట్లను దోచిపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల స్కాంలో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర ఉందన్నారు. కాంట్రాక్టుల విషయంలో ఈ అవకతవకలు జరిగాయని, వందల కోట్ల అవినీతి బయటపడింది అన్నారు. 650 కోట్ల అప్పు ఆయన చార్జి తీసుకునే సమయంలోనే ఉందని, అన్ని చోట్లా లాభాలు ఉంటే ఫైబర్‌లో మాత్రం అప్పులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ‘ఏసీ ఫైబర్‌లో ఇప్పుడు అప్పులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. నిజం నిగ్గు తేలుతుంది. సీఐడీ విచారణలో నాయకులంతా బయటకొస్తారు. పూర్తి అధారాలు మా వద్ద ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు, చిన్నలు కూడా ఇందులో ఉన్నారు. సీఐడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఇందుకు బాధ్యులను గుర్తించాలి. రెండు, మూడు రోజుల్లోనే అన్ని విషయాలు బయటపెడతా.’’ అని అన్నారు. -
ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాలపై సీఐడీ విచారణ
-
ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాలపై సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ : గత ప్రభుత్వంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఫైబర్‌నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్ అక్రమాలకు నిలయంగా మారింది. టీడీపీ పెద్దల అండతో యథేచ్ఛగా అక్రమాలు జరిగాయి. కాంట్రాక్టర్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండిపడింది. -
నిమ్మగడ్డ.. చంద్రబాబు ఏజెంట్: గౌతమ్‌రెడ్డి
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబుకు ఏజెంట్‌గా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరిస్తున్నారని ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ మిలిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్, వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు పి. గౌతమ్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాక్ స్వాతంత్రం హరించేలా ఎస్ఈసీ ప్రవర్తించారని ధ్వజమెత్తారు. టీడీపీ మేనిఫెస్టో మీద ఎలాంటి చర్య తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. ఫైబర్ నెట్లో సీఎం ఫోటో రాకుండా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతల ఫిర్యాదును ఆయన తప్పుపట్టారు. ఇది సబబు కాదన్నారు. కేంద్ర పథకాలలో ప్రధానమంత్రి ఫోటో ఉంటే.. అది కూడా తీసెయ్యాలా అని గౌతమ్‌రెడ్డి ప్రశ్నించారు. (చదవండి: హైకోర్టులో నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ) (చదవండి: చంద్రబాబూ.. డ్రామాలు ఆపు: అవంతి) -
ఏపీలో సాంకేతిక విప్లవం తీసుకువస్తాం: గౌతమ్ రెడ్డి
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తామని, సాంకేతిక విప్లవం తీసుకువస్తామని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ మొత్తం విశాఖపట్నం నుంచే మొదలవుతుంది. ఫైబర్ నెట్ వర్క్ సేవల్ని మరింత పటిష్టం చేస్తాం. ఫైబర్ నెట్‌కు రెండు ఎకరాలు కేటాయించారు. ప్రతి పల్లెకు ఇంటర్ నెట్ సేవలు అందిస్తాం. గూగుల్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బ్యాండ్ విడ్త్ స్పీడ్ పెంచుతాం. 10 లక్షల కనెక్షన్లు ఉన్న వాటిని 50-70 లక్షల కనెక్షన్లు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయి. విచారణ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారి ఆలోచనలకు అనుగుణంగా ఏపీ ఫైబర్ నెట్ సేవలు ఉంటాయి. మారుమూల పల్లెల్లో కూడా ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. 599 రూపాయలు చెల్లిస్తే ఆన్ లిమిటెడ్ ఇంటర్ నెట్. చాలా క్వాలిటీతో కూడిన సేవల్ని అందిస్తాం. పోల్ ఉచితంగా అందిస్తా’’ మన్నారు. -
ఏపీ ఫైబర్‌నెట్ విస్తరణ
సాక్షి, అమరావతి: ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) భారీ విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే మూడేళ్లలో ఫైబర్‌నెట్ సేవలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఏటా కనీసం 20 లక్షల మంది కొత్త చందాదారులను ఏపీ ఫైబర్ నెట్ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా మూడేళ్లలో కనెక్షన్ల సంఖ్యను 60–70 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం.మధుసూదన్ రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ప్రస్తుతం ఎపీఎస్ఎఫ్ఎల్ చందాదారుల సంఖ్య 9.5 లక్షలు. చందాదారులను పెంచుకోవడం ద్వారా వార్షిక ఆదాయం రూ.336 కోట్ల నుంచి రూ.3,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ పే సర్వీసుల ద్వారా ప్రతి నెలా రూ.28 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, కొత్త కనెక్షన్ల సంఖ్య 70 లక్షలకు చేరుకుంటే నెలవారీ ఆదాయం రూ.230 కోట్లకు చేరుతుందని అంచనా. ఇదే సమయంలో ప్రభుత్వ, ఇతర కార్పొరేట్ కనెక్షన్ల నెలవారీ ఆదాయం ప్రస్తుతం ఉన్న రూ.5 కోట్ల నుంచి రూ.25 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు. మరిన్ని గ్రామాలకు విస్తరణ ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ సేవలు 2,816 గ్రామాల్లో ఉన్నాయి. త్వరలో 11,274 గ్రామాలకు సేవలను విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇంటర్నెట్కు డిమాండ్ పెరుగుతుండటంతో ఆ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ స్థాయికి హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో దానికి తగ్గట్టుగా ఏపీ ఫైబర్ నెట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. మండల స్థాయి వరకు ఫైబర్ కనెక్షన్‌ను విద్యుత్ స్తంభాల ద్వారా తీసుకువెళ్లి.. అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు భూగర్భ కేబుల్ ద్వారా తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. ప్రస్తుత మార్కెట్ సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, టెలిఫోన్ (ట్రిపుల్ ప్లే సర్వీసు) సేవలను అందిస్తుండటంతో గ్రామీణ స్థాయి నుంచి కొత్త కనెక్షన్లకు డిమాండ్ బాగుందని, దానికి తగ్గట్టుగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నట్లు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. -
గిరిజన గూడేలకూ ఇంటర్నెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడేనికీ ఇంటర్నెట్ సౌకర్యం కలగనుంది. కొండకోనల మధ్య ఉండే గిరి శిఖర గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సేవల్ని అందించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ నిర్వహణకు ఇంటర్ నెట్ తప్పనిసరి కావడంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి గిరిజన గ్రామానికీ ఈ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. 134 గూడేల్లో వేగంగా పనులు ఇప్పటికే 134 గిరిజన గూడేల్లో ఫైబర్ నెట్ కనెక్టివిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు ఇప్పటికే చెల్లించింది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 51 గ్రామాలు, విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 49 గ్రామాలు, విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 26 గ్రామాలు, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 6 గ్రామాలు, చింతూరు, కేఆర్ పురం ఐటీడీఏల పరిధిలో ఒక్కో గ్రామంలో ఫైబర్ నెట్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో ప్రభుత్వ సహకారంతో రిలయన్స్ సంస్థ 200కు పైగా టవర్స్ ఏర్పాటు చేసింది. వీటిద్వారా సమీప ఏజెన్సీ గ్రామాల్లో వైర్లెస్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో 251 గూడేల్లోనూ.. ఫైబర్ నెట్‌ను ప్రతి గిరిజన గ్రామానికి విస్తరించే కార్యక్రమంలో భాగంగా 251 గూడేల్లో పనులు చేపట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇందుకు రూ.24.50 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. త్వరలోనే నిధులు మంజూరవుతాయని, ఆ వెంటనే పనులు చేపడతామని అధికారులు చెప్పారు. -
చౌకగా ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం
సాక్షి, అమరావతి: చౌకగా ఇంటర్నెట్తో పాటు, నాణ్యతగా ఫైబర్ నెట్ సేవలందించడమే లక్ష్యమని పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్‌కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో రానున్న 2-3 ఏళ్ల కాలంలో 60 లక్షల మంది సబ్స్క్రైబర్లకు ఫైబర్ నెట్ సేవలు అందిస్తామన్నారు. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారన్నారు. అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా దశలవారీగా కొత్త సబ్స్క్రైబర్లను పెంచుతామన్నారు. బుధవారం మంత్రి తన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ, మండలాల్లో రూటర్ల సంఖ్య వీలైనంతవరకూ తగ్గించడంపై దృష్టి పెడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేలా చూడడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వ్యాఖ్యానించారు. (ఫ్యాబ్రిక్ హబ్‌గా ఏపీ) గ్రామీణ ప్రజలందరికీ అందుబాటులోకి ఇంటర్నెట్ తెస్తామన్నారు. నిర్దేశించుకున్న గ్రామపంచాయతీలు, మండలాలలో పక్కాగా ఫైబర్ నెట్వర్క్ సేవలు అందుతాయని స్పష్టం చేశారు. రూటర్ల ఇన్‌స్టాలేషన్‌లో మరింత పారదర్శకతతోపాటు, కొత్త పరికరాల సేకరణ, అంచనా, ఆర్థిక భారం తగ్గించేందుకు 'టెక్నికల్ కమిటీ' ఏర్పాటు చేశామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. (‘కనెక్షన్’ కింగ్: టీడీపీ అండ.. రూ.కోటి స్వాహా) -
టీడీపీ అండ.. రూ.కోటి స్వాహా
టీడీపీ హయాంలో అట్టహాసంగా ప్రారంభించిన ఏపీ ఫైబర్‌నెట్ అక్రమాలకు నిలయంగా మారింది. టీడీపీ పెద్దల అండతో రాజమహేంద్రవరం బ్రాంచిలోని మెయిన్ సర్వీస్ ఆపరేటర్ (ఎంఎస్ఓ) యథేచ్ఛగా అక్రమాలకు తెరలేపాడు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కనెక్షన్ల పేరిట రూ.కోటి స్వాహా చేశాడు. ప్రభుత్వ ఆదేశాలతో తాజాగా ప్రక్షాళన చేపట్టిన అధికారులకు ఎంఎస్ఓ అక్రమాలు విస్తుగొలుపుతున్నాయి. ప్రభుత్వానికి రూ.58 లక్షల బకాయిలు చెల్లించకపోవడంతోపాటు అధిక వసూళ్లకు దర్జాగా బిల్లులు ఇచ్చిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: 2018 జూన్‌లో రాజమహేంద్రవరంలో ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. టీడీపీ పెద్దల అండదండలతో రాజమహేంద్రవరం బ్రాంచి ఎంఎస్ఓ ఆశపు రాజేశ్వరరావు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డాడు. నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్ల చార్జీలను పెంచేసి అటు వినియోగదారులను, టార్గెట్ల పేరిట ఇటు ఆపరేట్లను అడ్డగోలుగా దోచేసుకున్నాడు. నగరంలో దాదాపు వంద మంది ఆపరేటర్లు పదివేల కనెక్షన్లు తీసుకువచ్చారు. నెలకు కనెక్షన్ చార్జి రూ.235కు గాను ప్రభుత్వానికి రూ.105 చెల్లించగా, ఎంఎస్ఓ వాటా రూ.30, మిగిలిన రూ.100 ఆపరేటర్లకు చెల్లించాల్సి అతను ఉంది. కాగా జీఎస్టీ అంటూ రూ.85 మాత్రమే ఆపరేటర్లకు చే ల్లించేవాడు. ఈ మేరకు ఒక్కో కనెక్షన్‌కి అదనంగా రూ.15 వంతున పదివేల కనెక్షన్లకు నెలకి రూ.1.50 లక్షలు తన ఖాతాలో వేసుకునేవాడు. ఈ మేరకు ఏడాదిలో రూ.18 లక్షల మొత్తాన్ని ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్ల నుంచి దోచేశాడు. ఆయా ఆర్థిక లావాదేవీలకు ఫైబర్‌నెట్ పేరిట రశీదులు ఇవ్వాల్సి ఉండగా, అదనపు వసూళ్ల విషయం బయటకు పొక్కకుండా తనకు చెందిన శ్రీవేన్ గ్రూప్ పేరిట బిల్లులు ఇచ్చేవాడు. 2018 ఆగస్టు నెల నాటికి 100 కనెక్షన్ల లక్ష్యాన్ని పూర్తి చేసిన కేబుల్ ఆపరేటర్లకు కనెక్షన్‌కు రూ.250 వంతున ఏపీ ఫైబర్‌నెట్ చెల్లించిన ఇన్సెంటివ్ రూ.6.47 లక్షలు కాజేసిన విషయం వెలుగుచూసింది. వంద కనెక్షన్లకు వసూళ్లు.. ఉన్న మేరకే చెల్లింపులు వంద కనెక్షన్లు లక్ష్యం చేరుకోకుంటే తొలగిస్తారని ఎంఎస్ఓ భయాందోళనలకు గురిచేయడంతో 20, 30 కనెక్షన్లు ఉన్న ఆపరేటర్లు సైతం వంద కనెక్షన్ల మొత్తాన్ని చెల్లించేవారు. అయితే ఫైబర్‌నెట్‌కు మాత్రం ఉన్న కనెక్షన్లకు మాత్రమే సొమ్ము చెల్లించేవాడు. 2018 జూన్ నుంచి ఏడాదికాలం పాటు కనెక్షన్ల పేరిట దాదాపు 7.5 లక్షలు వసూలు చేశారు. పాన్ పేరిట అక్రమాలు : కేబుల్ ఆపరేటర్లకు ఏపీ ఫైబర్‌నెట్ ఉచితంగా పాన్ (పాసీవ్ ఆప్టికల్ నెట్వర్క్) అందజేస్తుంది. కాగా ఎంఎస్ఓ రాజేశ్వరరావు ఒక్కొక్కరి వద్ద నుంచి పాన్ పేరిట రూ.5,000 నుంచి రూ.25,000 వరకు దాదాపు రూ.7.5 లక్షలు వసూలు చేసినట్టు ఓ అంచనా. బాక్స్‌లు డియాక్టివ్ కావడంతో ఏపీ ఫైబర్‌నెట్ నుంచి వెనక్కి వచ్చిన రూ.2.47 లక్షలు కేబుల్ ఆపరేటర్లకు ఇవ్వకుండా ఎంఎస్ఓ స్వాహా చేశాడు. ప్రభుత్వానికి బకాయిలు ఎగవేత కనెక్షన్లకు సంబంధించి చార్జీలను రాజేశ్వరరావు ఏపీ ఫైబర్‌నెట్‌కు చెల్లించలేదు. దాదాపు రూ.58 లక్షల బకాయిలు పేరుకుపోవడంతో ఏపీ ఫైబర్‌నెట్ ప్రసారాలు నిలిపివేసింది. వినియోగదారులు ఆపరేటర్లను నిలదీయడంతో చేసేదిలేక ఎంఎస్ఓ రాజేశ్వరరావుకు వ్యతిరేకంగా గత ఏడాది అక్టోబరులో ఆందోళనలు నిర్వహించి త్రీటౌన్ పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. కేబుల్ ఆపరేటర్లకి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లిస్తానని పోలీసుల సమక్షంలో రాజీ కూడా కుదుర్చుకున్నాడు. కాని ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదు. వెలుగుచూస్తున్న అక్రమాలు 2018 జూలై నుంచి 2019 జూన్ వరకు యథేచ్ఛగా సాగిన రాజేశ్వరరావు అక్రమాలకు ప్రభుత్వం మారడంతో తెరపడింది. ఆపరేటర్ల నుంచి అందిన ఫిర్యాదులతో అధికారులు నిర్వహించిన విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. దాదాపు కోటి రూపాయల మేర అక్రమాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరావు మీద చర్యలకు ఉపక్రమించిన అధికారులు అతనిని పక్కనపెట్టి మరొకరిని ఎంఎస్ఓగా నియమించారు. ప్రసారాల నిలుపుదలతో ఇబ్బంది ఏపీ ఫైబర్‌నెట్‌కి చెల్లించవలసిన మొత్తాన్ని నేను చెల్లించాను. కాని పాత ఎంఎస్ఓ వాటిని ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో మా ప్రాంతంలో ప్రసారాలను నిలుపుదల చేశారు. దానితో కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఏపీ ఫైబర్‌నెట్ వారు కలుగచేసుకుని మా ప్రసారాలను తిరిగి ప్రారంభించవలసిందిగా కోరుతున్నా. – కాకర ప్రవీణ్‌కుమార్, ఫైబర్‌నెట్ ఆపరేటర్ మాకు కోడ్లను కూడా ఇవ్వలేదు కేబుల్ ఆపరేటర్లకు వ్యక్తిగతంగా ఇవ్వవలసిన కోడ్లకు బదులు ఎంఎస్ఓ రాజేశ్వరరావు తన సొంత కోడ్‌తో యాక్సిస్ చేసేవాడు. ఇప్పుడు ప్రసారాలను నిలిపివేయడంతో మాకు కోడ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా మాకు రావల్సిన కోడ్లను కూడా తన వద్దే ఉంచుకున్నాడు. – బల్లా సూరిబాబు, ఫైబర్‌నెట్ ఆపరేటర్ బాబు శ్రీకారం చుట్టింది ఇక్కడే రాష్ట్రంలో ఏపీ ఫైబర్‌నెట్‌కు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మన జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. 2016 డిసెంబర్ 29న సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామంలో ఈ వ్యవస్థను ఆరంభించారు. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి ఈ వ్యవస్థను ప్రారంభించిన ఈ జిల్లాలోనే ఇంత పెద్దఎత్తున దోపిడీ జరుగగా ఇక మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2016లో ఫైబర్‌నెట్‌ను ప్రారంభిస్తున్న నాటి సీఎం చంద్రబాబు -
పడకేసిన ఫైబర్ నెట్
సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ పడకేసింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ బాజాతో విసిగిపోయిన ప్రజలు దీన్ని దూరం పెట్టడంతో ప్రభుత్వానికి కోపమొచ్చింది. తమ ప్రచారానికి అంతగా ఉపయోగపడలేదన్న దుగ్దతో ప్రభుత్వం దానిపై శీతకన్నేసింది. ఎన్నికలకు ముందు అధికారుల్ని ఊదరగొట్టి ప్రజలకు ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లను ప్రభుత్వం అంటగట్టింది. ఇపుడు దానికి కావాల్సిన మెటీరియల్ సరఫరాను నిలిపివేసింది. దీంతో కొత్త కనెక్షన్లు ఇవ్వడం సాధ్యం కావడంలేదని ఆపరేటర్లు చెబుతున్నారు. మూడు నెలలుగా ఓఎల్టీ, పాన్ బాక్స్‌లు నిల్ ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వాలంటే ఆప్టికల్ లైన్ టెర్మినల్ (ఓఎల్టీ) బాక్స్‌లు, పాన్ బాక్స్‌లు అవసరం. ఒక ఓఎల్టీకి ఎనిమిది పాన్లు ఉంటాయి. ఒక్కొక్క పాన్ నుంచి 125 కనెక్షన్లు ఇవ్వవచ్చు. అంటే ఒక ఓఎల్టీ ఉంటే సుమారు వెయ్యి కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. రూ.2.5 లక్షలు చెల్లిస్తే ప్రభుత్వమే ఓఎల్టీ, పాన్ బాక్స్‌లు సరఫరా చేస్తుంది. వీటి కోసం ఆపరేటర్లు డబ్బులు చెల్లించినా అధికారులు బాక్స్‌లు ఇవ్వడం లేదు. గత మూడు నెలలుగా ఓఎల్టీ బాక్స్‌ల సరఫరాను ప్రభుత్వం ఆపివేసింది. ఫైబర్ నెట్ నిధుల్ని పసుపు–కుంకుమ కోసం వినియోగించడంతో నిధులు లేక వాటిని కొనుగోలు చేయడం లేదని సమాచారం. లంచాలు ఇస్తేనే బాక్స్‌లు గ్రామీణ ప్రాంతాల్లో రూ.125, నగరాల్లో రూ.235 చెల్లిస్తే ఫైబర్ నెట్ ద్వారా కనెక్షన్ ఇస్తున్నారు. వీటి ద్వారా వినియోగదారుడు టీవీ, ఇంటర్ నెట్ సదుపాయం పొందొచ్చు. ఇవి కల్పించాలంటే ఓఎల్టీ, పాన్ బాక్స్‌లు కావాలి. ముడుపులు ఇవ్వందే అధికారులు వాటిని ఇవ్వడం లేదు. ఒక్కో ఓఎల్టీ, పాన్ బాక్స్‌లకు రూ.50 వేల వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆపరేటర్లు అవసరమైన బాక్సులను సమకూర్చలేకపోతున్నారు. ప్రభుత్వ ప్రచారం రోతతో కనెక్షన్లు రద్దు చేసుకున్న ప్రజలు... ఎన్నికల ముందు ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు తీసుకోవాలంటే ప్రజలు భయపడ్డారు. అందులో ఎక్కువగా ప్రభుత్వం గురించి ప్రచారం జరుగుతూ ఉండటంతో రోతపుట్టి ఎక్కువ మంది ప్రజలు ఫైబర్ నెట్ కనెక్షన్లు రద్దుచేసుకున్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత వారిలో ఎక్కువమంది కావాలంటున్నారని ఒక కేబుల్ ఆపరేటర్ ‘సాక్షి’ కి తెలిపారు. ఫైబర్ నెట్ ఎన్నికల సమయంలో తమకు పూర్తిగా ఉపయోగపడలేదని భావించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ మెటీరియల్ సరఫరాను నిలిపివేసిందని అంటున్నారు. -
జియో బ్రాడ్‌బ్యాండ్‌కు రిజిస్ట్రేషన్లు షురూ
న్యూఢిల్లీ: టెలికం సంస్థ రిలయన్స్ జియో తాజాగా ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. సెకనుకు ఒక గిగాబిట్ వేగంతో ఇంటర్నెట్ను అందిస్తామని జియో హామీ ఇస్తోంది. జియోడాట్‌కామ్ వెబ్సైట్, మైజియో యాప్ ద్వారా కనెక్షన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ‘జియోగిగాఫైబర్. గిగాబిట్ వైఫై, టీవీ, స్మార్ట్ హోం, ఫ్రీ కాలింగ్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందండి‘ అంటూ మైజియో యాప్‌లో కంపెనీ ప్రకటించింది. టారిఫ్‌ల యుద్ధం... ప్రస్తుతం పోటీ సంస్థలు హోమ్ యూజర్స్‌కి సెకనుకు 100 మెగాబిట్ డౌన్లోడ్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందిస్తున్నాయి. ఇందుకు చార్జీలు నెలకు సుమారు రూ. 1,000 దాకా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతకు 10 రెట్లు వేగంతో ఇంటర్నెట్ అందిస్తామని జియో చెబుతోంది. చార్జీల గురించి ఇంకా వెల్లడించకపోయినప్పటికీ.. మిగతా కంపెనీలకు గట్టి పోటీనిచ్చే విధంగానే ఉండవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ముందుగా దేశవ్యాప్తంగా 1,100 నగరాల్లో ఇళ్లు, వ్యాపార సంస్థలు, చిన్న..పెద్ద సంస్థలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘కేబుల్‌పై జీఎస్టీ తొలగించాలి’
సాక్షి, విజయవాడ : కేబుల్‌పై జీఎస్టీని తొలగించాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనేరు మురళి కృష్ట డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై ఈ నెల 13న ముఖ్యమంత్రిని కలిసి వివరించామన్నారు. ఫైబర్ నెట్ కలిగి ఉన్న వారికి పోల్ టాక్స్ వర్తించదని సీఎం హామి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 19న జరిగే సమావేశంలో కేబుల సమస్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం జరిగే సభకు కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి కె.విజ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జీఎం నెంబర్ 15 జారీ చేసి పోల్ టాక్స్ విధించడం కెబుల్ రంగానికి పెను భారంగా మారిందన్నారు. కేబుల్ ఆపరేటర్లను ప్రభుత్వం ఆసంఘటిత కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కేబుల్‌పై జీఎస్టీని తొలగించే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. కేబుల్ ఆపరేటర్లకు ప్రమాద బీమా, ఇన్యూరెన్స్, ముద్ర పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
కోటి కుటుంబాలకు హైస్పీడ్ ఇంటర్నెట్
మహేశ్వరం : తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో కోటి కుటుంబాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రక టించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మం డలం రావిర్యాల గ్రామంలోని ఫ్యాబ్‌సిటీ (ఈ–సిటీ)లో హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (హెచ్ఎఫ్సీఎల్) స్థాపించనున్న ఆప్టికల్ ఫైబర్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డిలు సోమవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. టీ–ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కింద మహేశ్వరంలోని మహేశ్వరం, మన్సాన్పల్లి, తుమ్మలూరు, సిరిగిరిపురం గ్రామాలకు అడ్వాన్స్ సిస్టమ్స్‌తో ఇంటర్నెట్ కనెక్షన్లు ఇప్పించామన్నారు. పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. మరిన్ని ఐటీ కంపెనీలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. దేశంలో పేరుగాంచిన హెచ్ఎఫ్సీఎల్ కంపెనీ రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఫ్యాబ్‌సిటీలో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 2 దశల్లో రూ.1,100 కోట్ల పెట్టుబడితో స్థాపించనున్న ప్లాంట్ ద్వారా 4వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా కంపెనీలు, పరిశ్రమలు స్థాపించే వారికి భూమి, నీటి, విద్యుత్‌తో పాటు మౌలిక వసతులను తక్కువ కాలంలోనే కల్పించి అప్పగిస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్లాంట్ ఏర్పాటు వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన ఆప్టికల్ ఫైబర్‌ను ఇండియాలో 4జీ, 5జీ, బ్రాడ్‌బ్యాండ్ ఎఫ్టీటీఎక్స్కు వినియోగించడం తోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, హెచ్ఎఫ్సీఎల్ కంపెనీ చైర్మన్ మహేంద్ర ప్రతాప్ శుక్లా, ఎండీ మహేంద్ర సహతా, ఐటీ, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూ నిర్వాసితుల ముందస్తు అరెస్టు మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డిలను అడ్డుకుంటారనే సమాచారంతో రావిర్యాల, జెన్నాయిగూడ భూ నిర్వాసితులను ఆదిభట్ల పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. -
మీడియాపై 'ఫైబర్' కంట్రోల్
సాక్షి, అమరావతి ఫైబర్ నెట్ కనెక్షన్ వద్దు మొర్రో అంటున్నా ప్రభుత్వం ప్రజల వెంట ఎందుకు పడుతోంది? కనెక్షన్లు బదలాయించాల్సిందేనని ఆపరేటర్లు, ఎంఎస్‌వోలపై ఎందుకు ఒత్తిడి చేస్తోంది? సహకరించకపోతే ఉన్న కనెక్షన్లు కట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏమిటి? మీడియాపై ఆధిపత్యానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ప్రజా వ్యతిరేకత జనంలోకి వెళ్ళకుండా కొన్ని ఛానల్స్‌ను కట్టడి చేసే కుట్ర చేస్తోందా? ఫైబర్‌నెట్ విషయంలో సర్కార్ వేస్తున్న అడుగులు చూస్తే ఇవన్నీ నిజమే అన్పిస్తోంది. అమరావతిలో ఏర్పాటు చేసే కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్నిచోట్ల కేబుల్ ప్రసారాలను నియంత్రించవచ్చట. అంటే కేబుల్ ప్రసారాలు పూర్తిగా ప్రభుత్వ గుప్పిట్లోకి వెళ్లిపోతాయన్నమాట. వద్దనుకున్న చోట వద్దనుకున్న చానెల్‌ను అనుకున్న సమయం వరకు ఆపగలిగే శక్తి ప్రభుత్వానికి ఉంటుందన్నమాట. ఇక ప్రభుత్వం చెబుతున్న నెట్, కేబుల్, ఫోన్ మూడు సదుపాయాలూ అరకొరగా మాత్రమే అందుతాయని, వాటి కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్న విషయం ప్రజలకు అర్ధమయ్యింది. అందుకే ఫైబర్ నెట్‌పై ఎవరూ అంతగా ఆసక్తి చూపించడం లేదని వినిపిస్తోంది. అధికారులను ప్రయోగించి ఒత్తిళ్లు.. గత ఏడాది మార్చి 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ఏర్పాటు సందర్భంగా ఓ ప్రకటన చేశారు. అడిగిన వాళ్ళకు మాత్రమే ఫైబర్ నెట్ కనెక్షన్ ఇస్తామన్నారు. ఎవరినీ ఒత్తిడి చేయబోమన్నారు. నెట్, కేబుల్, ఫోన్... మూడూ అతి తక్కువ ధరకు ప్రజలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కానీ ఇప్పుడు కథ మారిపోయింది. కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌వోల మీద ప్రభుత్వాధికారులే ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్వోలుగా అధికార పార్టీ వాళ్ళే ఉన్నారు. ఫైబర్ నెట్ కావాలని ప్రజలు అడిగితే ఇవ్వడానికి వాళ్ళు ఏమాత్రం సంకోచించరు. జనం ఆసక్తి చూపించడం లేదు కాబట్టే రకరకాల ఎత్తులు వేస్తున్నారు. అంతా ఒక ‘పథకం’ ప్రకారమే.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటువ్యక్తులకు తెగనమ్మిన చరిత్ర ఉన్న చంద్రబాబు ... కేబుల్ వ్యాపారంలోకి ప్రభుత్వాన్ని ఎందుకు చొప్పిస్తున్నారనేది అర్ధం చేసుకోలేనంత బ్రహ్మపదార్ధమేమీ కాదు. నాలుగేళ్ళ పాలనలో ప్రజలకిచ్చిన హామీలేవీ నెరవేర్చలేకపోయారు. మరో పక్క అన్ని రంగాల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. ప్రభుత్వ అనుకూల మీడియా ఎంత వెనకేసుకొచ్చినా... కొన్ని ఛానల్స్ ప్రసారం చేసే వాస్తవాలను ప్రజలు విశ్వసిస్తున్నారు. అంతిమంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత చంద్రబాబు సర్కారుకు నిద్ర పట్టనివ్వడం లేదు. వ్యతిరేక మాధ్యమాల గొంతు నొక్కేందుకే ఫైబర్‌నెట్ ప్రయత్నం మొదలుపెట్టారు. ఫైబర్ నెట్ ద్వారా కేబుల్ ప్రసారాలను గుప్పిట్లో పెట్టుకోవడం, తనకు అనుకూలంగా లేని మీడియాను అదుపు చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలుస్తోంది. కేంద్ర కార్యాలయం నుంచి నియంత్రణ.. కేబుల్ ప్రసారాలు సాధారణంగా ప్రభుత్వ అజమాయిషీలో ఉండవు. అయితే ఫైబర్ నెట్ ద్వారా ప్రసారాలను అదుపు చేసే వీలుంటుంది. ప్రభుత్వం కొత్తగా వేయించిన ఫైబర్‌నెట్ ఏపీఎస్ఎఫ్ఎల్ ఆధీనంలో ఉంటుంది. ఓపీఇఎన్ (ఆప్టికల్ ప్రిమిసెస్ ఇంటర్నెట్ నెట్వర్క్), ఐపీటీవీ (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) బాక్సులు ఫైబర్‌నెట్ సర్వర్లకు లింక్ అయి ఉంటాయి. అవసరం అనుకున్నప్పుడు ఏదైనా ఛానల్ ప్రసారాలను కేంద్ర కార్యాలయం నుంచే నియంత్రించే వ్యవస్థ ఇందులో ఉందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ధర్నాలు చేసినా, విపక్ష నేతలు ఎవరైనా మాట్లాడుతున్నా అప్పటికప్పుడే దాన్ని అమరావతిలో ఏర్పాటు చేసిన కేంద్ర కార్యాలయం నుంచి నిలువరించవచ్చు. దీనికోసమే ప్రభుత్వం ఫైబర్ నెట్ విస్తరణకు ఈ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు కన్పిస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచి, నెట్, కేబుల్, టెలిఫోన్ మూడూ కలిపి తక్కువకే ఇస్తున్నామని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ప్రజలెందుకు ఇష్టపడటం లేదంటే.. ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్‌లైన్ ఫోన్ ... ఈ మూడింటికి నెలకు రూ.149 చెల్లిస్తే సరిపోతుందని సర్కారు చెబుతున్నా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగానే ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి, బలవంతంగా అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. ఫైబర్‌నెట్‌ను నిశితంగా పరిశీలిస్తే... దీని ద్వారా వచ్చే ప్రసారాలలో కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉండవు. ఈ ఛానళ్ళను ప్రత్యేక ప్యాకేజీ కింద కొనుగోలు చేయాలి. దీనికి అదనంగా మరో రూ. 180 అవుతుంది. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లు రూ.150లకే పెయిడ్ ఛానళ్ళు కూడా ఇస్తున్నారు. ఇంటర్నెట్ విషయానికొస్తే గృహావసరాలకు 15 ఎంబీపీఎస్ వేగంతో నెలకు 5 జీబీ మాత్రమే ఇస్తారు. ఇది దాటితే స్పీడ్ తగ్గుతుంది. వాస్తవానికి 5 జీబీ పరిమితి కేవలం మూడు వీడియోలు చూస్తే ఖర్చయిపోతుంది. కాబట్టి దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ల్యాండ్‌లైన్ ఫోన్ విషయానికొస్తే ఫైబర్‌నెట్ వినియోగదారుల మధ్య మాత్రమే ఉచిత కాల్స్ ఉంటాయి. ఇతర నెట్‌వర్క్‌కు ఫోన్‌చేస్తే.... ల్యాండ్‌లైన్‌కు అయితే నిమిషానికి 50 పైసలు, సెల్‌కు అయితే రూపాయి చెల్లించాలి. ప్రై వేటు మొబైల్ ఆపరేటర్లు ఇంతకన్నా తక్కువకే ప్యాకేజీలు అందిస్తున్నారు. అందువల్ల ఫైబర్‌నెట్ శుద్ధ దండగమారి స్కీమ్ అని జనం నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆది నుంచి ఎన్నో ఆరోపణలు.. ఫైబర్‌నెట్ పథకంపై ఎన్ని ఆరోపణలొచ్చినా సర్కారు వెనక్కు తగ్గలేదు. గతంలో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన టెరాసాఫ్ట్ అనే సంస్థకు ఫైబర్ కేబుల్ వేసే కాంట్రాక్టును అప్పగించింది. చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఫైబర్‌నెట్ సంస్థలోనూ డైరెక్టర్‌గా ఉన్నారు. సెట్‌టాప్ బాక్సుల వ్యవహారం కూడా గందరగోళంగానే ఉంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే బాక్సుల కాంట్రాక్టును నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుకూల సంస్థలకు కట్టబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. నాణ్యత లేని సెట్‌టాప్ బాక్సులను తరలిస్తుండగా చెన్నైలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కేంద్రం వద్ద సాగిలపడాల్సి వచ్చింది. సెట్‌టాప్ బాక్స్‌ల ధరపై కూడా రకరరాల విమర్శలున్నాయి. ఒక్కో బాక్సు రూ. 4 వేల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల కనెక్షన్లకు అవసరమైన సెట్‌టాప్ బాక్సులకు పథక రచన చేయడం వెనుక కోట్లాది రూపాయల కుంభకోణం ఉందనే ఆరోపణలున్నాయి. ట్రాయ్ రూల్స్ ప్రకారం ప్రతీ కేబుల్ వినియోగదారుడు ఈ ఏడాది జనవరి 31 నాటికే సెట్‌టాప్ బాక్సులు అమర్చుకున్నారు. వీటిని ఒక్కొక్కటీ రూ. 2 వేలు వెచ్చించి కొన్నారు. వీటిల్లో కొన్ని మార్పులు చేసినా ఫైబర్ నెట్ వాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అయినా ఆ బాక్సులను పక్కన పారేసి కొత్త బాక్సులు కొనాల్సిందేనని ప్రభుత్వం పట్టుబడుతోంది. ఇలా అయినవారికి కోట్లు పంచిపెట్టి వాటాలు దండుకోవడమే కాకుండా, మీడియాను అరచేతిలో పెట్టుకునేందుకు ప్రభుత్వం పథకం పన్నడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రూ.149కే ఏపీ ఫైబర్ నెట్
డిప్యూటీ సీఎం చినరాజప్ప వివిమెరక (సఖినేటిపల్లి) : ఈ నెల 29వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు మోరిపోడు రివర్సైడు స్కూలులో ప్రారంభించనున్న ఏపీ ఫైబర్ నెట్ సౌకర్యం ద్వారా రూ.149కే మోరి, మోరిపోడు గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇంటర్నెట్, టీవీ కనెక్షన్, కేబుల్ టీవీ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నట్టు డిప్యూటీ సీఎం, హోం శాఖామంత్రి ఎ¯ŒS.చినరాజప్ప తెలిపారు. సోమవారం వివిమెరకలో సీఎం సభ విజయవంతానికై రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం జరిగింది. సమావేశంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ ద్వారా వేగమైన, స్పష్టత కలిగిన ప్రసారాలను ఈ నెట్ సౌకర్యం ద్వారా అందజేయనున్నట్టు వెల్లడించారు. సీఎం సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త జనసమీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ రివర్సైడు స్కూలు ఫౌండర్, బెర్క్లీ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాల్మ¯ŒS డార్వి¯ŒS కృషితో స్మార్ట్విలేజస్గా ప్రభుత్వం ప్రకటించిన మోరి, మోరిపోడు గ్రామాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు 12 బహుళ జాతీయ కంపెనీలు రానున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారని, శంకరగుప్తంలో డాక్టరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు, టీడీపీ రాష్ట్ర ప్రతినిధులు పెచ్చెట్టి చంద్రమౌళి, గేదెల వరలక్ష్మి, ధవళేశ్వరం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటి చైర్మ¯ŒS ఈశ్వరరాజు వర్మ, రాజోలు సబ్‌డివిజ¯ŒS నీటి సంఘ చైర్మ¯ŒS ఓగూరి విజయ్‌కుమార్, రాజోలు టీడీపీ నియోజకవర్గ ఇ¯ŒSచార్జ్ బత్తుల రాము, మోరి చేనేత సొసైటీ అధ్యక్షుడు చింతా వీరభద్రేశ్వరరావు, రాజోలు ఏఎంసీ చైర్మ¯ŒS కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, రాష్ట్ర రైతు ప్రతినిధి బోణం నాగేశ్వరరావు, పలు ప్రాంతాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.