ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మరో వారం రోజుల్లో ఫైబర్ నెట్ వేదికగా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్స్మ్ ప్రారంభించనున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్(ఏపీఎస్ఎఫ్ఎల్) డా.పి.గౌతమ్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో 'కాస్ట్లీ కోరికలు' అనే చిత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ చిత్ర బృందంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
(ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! )
ఫైబర్ నెట్ ద్వారా కాస్ట్లీ కోరికలు అనే సినిమాను కేవలం రూ.40కే విడుదల చేస్తున్నామన్నామని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఈ సినిమా తెరకెక్కిందన్నారు. కొత్త తరహా కాన్సెప్ట్ కావడం, హీరోయిన్ లేకుండా కేవలం యంగ్ స్టర్స్ తో మాత్రమే తీసిన సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారన్నారు. ఈ చిత్రాన్ని ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై బ్లాక్ స్పేస్ ప్రొడక్షన్ లో ఎస్వీ ఝాన్సీలక్ష్మీ నిర్మాతగా.. ఎస్‍వీవీ సాయి కుమార్ రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు.
గతంలో తొలి సినిమాను రూ.100కు అందించిన ఏపీఎస్ఎఫ్ఎల్ ఈ చిత్రాన్ని కేవలం రూ.40కే అందిస్తున్న విషయాన్ని గౌతమ్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా భవిష్యత్తులో లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడమే తమ ధ్యేయమన్నారు. ఔత్సాహిక కళాకారులకు ఏపీ ఫైబర్ నెట్ సరైన వేదిక అని ఆయన అభివర్ణించారు. ప్రతి ఏటా 250 చిన్న చిత్రాలు రూపుదిద్దుకుంటే అందులో థియేటర్లలో విడుదలయ్యేవి కేవలం 40 చిత్రాలు మాత్రమే అన్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు పడుతున్న ఇబ్బందులు అధిగమించాలనే ఉద్దేశంతో మరింత ప్రోత్సాహమందించేందుకు చిన్న చిత్రాలను తక్కువ ధరకే విడుదల చేస్తున్నామని గౌతమ్ రెడ్డి అన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిన చిత్రాలను మాత్రమే తాము విడుదల చేస్తామన్నారు.
(ఇది చదవండి: కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!)
రానున్న రోజుల్లో పెద్ద చిత్రాలను కూడా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిరంజీవి భోళాశంకర్ చిత్రాన్ని థియేటర్‌లో ప్రదర్శించిన వారం, పది రోజుల్లో ఏపీ ఫైబర్ నెట్‌లో ప్రదర్శించేందుకు ఆ చిత్ర నిర్మాత సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. సినిమా విడుదల రోజే తక్కువ ధరకే కొత్త సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో చూడటం మంచి అనుభూతి అన్నారు. పైరసీ చేసేందుకు అవకాశం లేని టెక్నాలజీతో తాము పైబర్ నెట్ వేదికగా సినిమాలను విడుదల చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment