APSFL
-
ప్రజల భద్రతపైనా బురద రాతలేనా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పించడం కూడా రామోజీకి తప్పుగా కనిపిస్తోంది. ప్రజల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి తీసుకుంటున్న చర్యలపైనా బురద జల్లుతూ ‘ఈనాడు’ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కింది. ‘సీసీ కెమెరాల పేరుతో మరో అప్పు’ అంటూ శుక్రవారం ప్రచురించిన కథనాన్ని ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మధుసూదన్‌రెడ్డి ఖండించారు. అప్పు కోసం హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని.. ఆ అప్పును తీర్చడానికి జరిమానాలు విధిస్తున్నారంటూ ప్రజలను భయపెట్టే విధంగా కథనం రాశారంటూ తప్పుపట్టారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. పటిష్ట భద్రత కోసం సుదీర్ఘ కసరత్తు తర్వాతే నిర్ణయం.. రాష్ట్ర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని అనేక అంశాలను పరిశీలించిన తర్వాత.. దీర్ఘకాలం ఉండే విధంగా రాష్ట్రంలో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆర్థికంగా సాధ్యాసాధ్యాలు, సర్వైలెన్స్ మౌలిక వసతులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సుదీర్ఘ కసరత్తు అనంతరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజల భద్రత కోసం ప్రస్తుతం ఉన్న వ్యవస్థను వినియోగించుకుంటూ కొత్తగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి అభ్యర్థన వచ్చిన 10 రోజుల్లోనే రుణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిదంటూ ఈనాడు రాసిన కథనంలో వాస్తవం ఏమాత్రం లేదు. తుది నిర్ణయం తీసుకునే ముందు ఆలోచనాత్మకంగా సుదీర్ఘంగా జరిగిన చర్చ.. ఇందుకు పట్టిన సమయాన్ని ‘ఈనాడు’ ఉద్దేశపూర్వకంగానే పరిగణనలోకి తీసుకోలేదు. రుణానికి, జరిమానాలకు లింకేంటి? ఎక్కడా కూడా ఒక ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి జరిమానాలపై ఆధారపడటం అనేది ఉండదు. ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నుంచి పొందిన లీజు అద్దెల వంటి ఆదాయాల ద్వారా మాత్రమే రుణాలు తిరిగి చెల్లిస్తాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించిన జరిమానాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రజల భద్రతా చర్యలకు వినియోగిస్తాం. అంతేగానీ జరిమానాల సొమ్మును రుణాలకు చెల్లిస్తారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం. ఏపీని టాప్‌లో నిలబెట్టిన బీబీఎన్ఎల్.. ఏపీఎస్ఎఫ్ఎల్ మొదటి నుంచీ ఈ ప్రాజెక్ట్ అమలు నిర్వహణ ఏజెన్సీగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును హోం శాఖ కూడా వినియోగించుకుంటోంది. అలాగే రూ.300 కోట్ల రుణం అనేది బీబీఎన్ఎల్ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేవలం 50 శాతమేనన్న విషయాన్ని గమనించాలి. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, బీబీఎన్ఎల్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేశాం. అంతేకాదు దేశంలో భారత్ నెట్ మిషన్ లక్ష్యాలను సాధించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను బీబీఎన్ఎల్ నిలబెట్టింది. బీబీఎన్ఎల్ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణంలో పురోగతి లేదనే ఆరోపణ పూర్తిగా నిరాధారమైనది. -
కేవలం రూ.39కే కొత్త సినిమా.. త్వరలో ఆర్జీవీ సినిమాలు కూడా!
కొత్త సినిమాలు రిలీజవగానే చూసేయాలని చాలామందికి ఉంటుంది. అందుకు సమయం ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి సరిపడా డబ్బు కూడా ఉండాలి. థియేటర్లో బోలెడన్ని సినిమాలు రిలీజవుతుంటాయి. వాటన్నింటినీ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే! పోనీ వారానికో, నెలకోసారైనా సినిమాకు వెళ్తామన్నా మల్టీప్లెక్స్‌లో టికెట్, స్నాక్స్ ఖర్చు అంతా కలిసి వేలల్లో ఉంటోంది. అటు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడమే గగనమైపోతోంది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం, అటు చిన్న సినిమాలను బతికించడం కోసం అత్యంత తక్కువ ధరకే, ఇంట్లోనే సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది ఏపీ ఫైబర్ నెట్. చిన్న సినిమాలకు చేయూతనివ్వాలనే.. దీని వల్ల కొత్త సినిమా రిలీజైనరోజే కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో ఎంచక్కా చూసేయొచ్చు. అటు చిన్న సినిమాలకు సైతం లాభం చేకూరనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్)లో ఓటు అనే మరో కొత్త సినిమా రిలీజైంది. ఈ సినిమా పోస్టర్‌ను ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'చిన్న సినిమాలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఏపీ ఫైబర్ నెట్లో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటు ప్రాధాన్యత తెలిపేందుకు ఏపీ ఫైబర్ నెట్లో ఓటు అనే సినిమా రిలీజవుతోంది. కేవలం రూ.39కే కొత్త సినిమా ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ మూవీతో కార్తీక్ శౌర్య హీరోగా పరిచయం అవుతున్నారు. కేవలం రూ.39కే ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఇకపోతే రామ్‌గోపాల్ వర్మ తీసిన సినిమాలను ప్రదర్శించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాం. కాగా సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ప్రకారం రాష్ట్రంలోని ప్రతి గ్రామం, చివరి ఇంటి వరకు ఇంటర్నెట్ ఇచ్చే దిశగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఉచితంగా ఇంటర్నెట్ ఇస్తాం' అని తెలిపారు. చదవండి: తినడానికి తిండి లేని రోజులు.. కన్నీళ్లు పెట్టుకున్న శోభ తల్లి -
ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా గ్రామాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్..!
-
ఏపీ ఫైబర్ నెట్.. కేవలం రూ.40కే ఫ్యామిలీతో సినిమా చూసేయండి!
ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మరో వారం రోజుల్లో ఫైబర్ నెట్ వేదికగా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్స్మ్ ప్రారంభించనున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్(ఏపీఎస్ఎఫ్ఎల్) డా.పి.గౌతమ్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో 'కాస్ట్లీ కోరికలు' అనే చిత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ చిత్ర బృందంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! ) ఫైబర్ నెట్ ద్వారా కాస్ట్లీ కోరికలు అనే సినిమాను కేవలం రూ.40కే విడుదల చేస్తున్నామన్నామని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఈ సినిమా తెరకెక్కిందన్నారు. కొత్త తరహా కాన్సెప్ట్ కావడం, హీరోయిన్ లేకుండా కేవలం యంగ్ స్టర్స్ తో మాత్రమే తీసిన సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారన్నారు. ఈ చిత్రాన్ని ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బ్లాక్ స్పేస్ ప్రొడక్షన్ లో ఎస్వీ ఝాన్సీలక్ష్మీ నిర్మాతగా.. ఎస్వీవీ సాయి కుమార్ రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. గతంలో తొలి సినిమాను రూ.100కు అందించిన ఏపీఎస్ఎఫ్ఎల్ ఈ చిత్రాన్ని కేవలం రూ.40కే అందిస్తున్న విషయాన్ని గౌతమ్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా భవిష్యత్తులో లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడమే తమ ధ్యేయమన్నారు. ఔత్సాహిక కళాకారులకు ఏపీ ఫైబర్ నెట్ సరైన వేదిక అని ఆయన అభివర్ణించారు. ప్రతి ఏటా 250 చిన్న చిత్రాలు రూపుదిద్దుకుంటే అందులో థియేటర్లలో విడుదలయ్యేవి కేవలం 40 చిత్రాలు మాత్రమే అన్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు పడుతున్న ఇబ్బందులు అధిగమించాలనే ఉద్దేశంతో మరింత ప్రోత్సాహమందించేందుకు చిన్న చిత్రాలను తక్కువ ధరకే విడుదల చేస్తున్నామని గౌతమ్ రెడ్డి అన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిన చిత్రాలను మాత్రమే తాము విడుదల చేస్తామన్నారు. (ఇది చదవండి: కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!) రానున్న రోజుల్లో పెద్ద చిత్రాలను కూడా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిరంజీవి భోళాశంకర్ చిత్రాన్ని థియేటర్లో ప్రదర్శించిన వారం, పది రోజుల్లో ఏపీ ఫైబర్ నెట్లో ప్రదర్శించేందుకు ఆ చిత్ర నిర్మాత సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. సినిమా విడుదల రోజే తక్కువ ధరకే కొత్త సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో చూడటం మంచి అనుభూతి అన్నారు. పైరసీ చేసేందుకు అవకాశం లేని టెక్నాలజీతో తాము పైబర్ నెట్ వేదికగా సినిమాలను విడుదల చేస్తున్నామన్నారు. -
ఈ యాప్‌లో సినిమాలు రిలీజ్
సాక్షి, అమరావతి: త్వరలోనే ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ఒక యాప్‌ను రూపొందిస్తుందని, ఇకపై ఆ యాప్ ద్వారా పాత, కొత్త సినిమాలను కూడా వీక్షించే అవకాశం లభిస్తుందని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి గురువారం చెప్పారు. ఇటీవల విశాఖలో ‘నిరీక్షణ’అనే సినిమాతో రిలీజ్ రోజే థియేటర్లో మాదిరిగా కొత్త సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షోని కుటుంబమంతా కలిసి ఇంట్లోనే కూర్చొని వీక్షించే విధానాన్ని ప్రవేశపెట్టామని..దానికి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. ఈ స్ఫూర్తితో ఏపీ ఫైబర్‌నెట్ జూన్ 16న రూ.39 కే ‘లవ్ యూ టూ’ చిత్రాన్ని అందిస్తోందని, దీన్ని ఏపీఎస్ఎఫ్ఎల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వివరించారు. సబ్‌స్రై్కబ్ చేసుకున్న తర్వాత 24 గంటల వరకు ఈ సినిమాను చూడవచ్చని చెప్పారు. చిన్న చిత్రాల నిర్మాతలను ప్రోత్సహించి, వీక్షకుడికి అతి తక్కువ ధరకే నేరుగా సినిమాను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని ఇది ఓటీటీలకు, థియేటర్ల యాజమాన్యానికి పోటీ కాదన్నారు. రూ.100 కోట్ల బడ్జెట్ మూవీకి మొదటి వారంపాటు టికెట్ ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం జీవో 13ను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. రూ.20 కోట్లలోపు నిర్మించిన సినిమాలను చిన్న చిత్రాలుగా భావిస్తూ వాటిని కూడా పండుగ రోజుల్లో ప్రతి థియేటర్లో పెద్ద చిత్రంతో పాటు ఒక షో చిన్న చిత్రానికి కేటాయించే అవకాశం కల్పించామన్నారు. రాబోయే రోజుల్లో థియేటర్లలో ప్రదర్శించే ప్రతి చిత్రాన్ని ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తామన్నారు. -
రిలీజ్ రోజున సినిమా చూసే ఛాన్స్.. చిన్న నిర్మాతలకు వరం
సినిమా రిలీజైన రోజు ఇంట్లోనే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ఛాన్స్ కల్పిస్తోంది ఏపీ ఫైబర్ నెట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు ప్రజల వద్దకు సినిమా తీసుకు వస్తున్నాం అన్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజే సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. శుక్రవారం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. 'భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నెట్ సేవలను ఏపీలో తక్కువ ధరకు అందిస్తున్నాం. పెద్ద హీరోలకు, నిర్మాతలకు మేము వ్యతిరేకం కాదు. సినిమాను బేస్ చేసుకుని ఫిఫ్టీ-ఫిఫ్టీ రేషియో ఉంటుంది. ఎల్పీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నాము కాబట్టి పైరసీ ఉండదు. ఏపీఎస్ఎఫ్ఎల్ పల్లెటూర్లతో ఎక్కువ కనెక్ట్ అయింది. దీనివల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజు సినిమా చూసే అవకాశం లభిస్తుంది' అన్నారు. ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. 'ఏ రోజు సినిమా రిలీజ్ అవుతుందో అదే రోజు పల్లెటూరులో కూడా సినిమా చూడవచ్చనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమా కూడా ఫైబర్ నెట్లో రిలీజ్ అయితే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది' అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ.. 'ఒక నిర్మాత కష్టపడి సినిమా తీస్తే అది రిలీజ్ రోజునే పైరసీ అయిపోతుంది. ఇండస్ట్రీలో ఉన్న మనం పైరసీని ఎందుకు అరికట్టలేకపోతున్నాము. పెద్దలందరూ కూడా దీనిపై పోరాడాలి. ఫైబర్ నెట్లో రిలీజ్ రోజున సినిమా చూడడం అనేది చిన్న సినిమాకు ఆక్సిజన్ లాంటిది. చిన్న నిర్మాతలు ఫైబర్ నెట్లో రిలీజ్ చేస్తారు. పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తారని అనుకుంటున్నాను' అన్నారు. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. 'ఏపీ ప్రభుత్వం, పోసాని అలీ గారి వల్ల సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతోంది. ఫైబర్ నెట్లో సినిమా రిలీజ్ అనేది చిన్న నిర్మాతకు జగన్ గారిచ్చిన వరం. చిన్న సినిమాకు అసలు థియేటర్స్ ఇవ్వడం లేదు. జనాలు ఓటీటీకి అలవాటు పడ్డారు. ఈ రోజు చిన్న నిర్మాతలకు పేదల పాలిట పెన్నిదే ఈ ప్లాట్‌ఫామ్. ఏపీ సీఎం జగన్ గారి విజన్ చాలా పెద్దది.. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం మంచి ఆలోచన చేశారు. చిన్న నిర్మాతలకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు సినీ ఇండస్ట్రీ తరపున ఏ సహాయం కావాలన్నా ముందుంటాం' అని పేర్కొన్నారు. -
ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులకు శుభవార్త!
ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అదే విధంగా ఓటీటీలు వచ్చాక థియేటర్లో ఏ సినిమా రిలీజైనా కొంతకాలానికి ఓటీటీలోకి వస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమా విడుదల రోజున ఏపీ ఫైబర్ నెట్లో కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలకు గొప్ప సువర్ణ అవకాశం అనే చెప్పవచ్చు. ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ఏప్రిల్ 7 న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికె APSFL(ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్)లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సర్వీసెస్ సబ్‌స్క్రైబ్ చేసుకొని "ఫస్ట్ డే ఫస్ట్ షో" చూడవచ్చు. ఏపీ ఫైబర్ నెట్ డిజిటల్ సాధికారత ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మార్చడం, నెట్వర్క్ మౌలిక సదుపాయాలను వివక్షత లేని ప్రాతిపదికన అందుబాటులో ఉండే "ట్రిపుల్ ప్లే" సేవలను (IPTV, ఇంటర్నెట్, టెలిఫోన్) అందించడం.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పౌరులకు, ప్రభుత్వ సంస్థలకు ఇది మానవాభివృద్ధిని సులభతరం చేస్తుంది. ఆర్థికాభివృద్ధిని పెంచుతుంది. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. APSFL తన నిరంతర ప్రయత్నాల ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో సురక్షితమైన, నమ్మదగిన, అధిక నాణ్యత గల కనెక్టివిటీని అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం APSFLలో ఎన్నో మార్పులు తీసుకురావడంతో అది మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫైబర్ నెట్ చైర్మన్ పునూరు గౌతంరెడ్డి, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అలీ, సినీ నిర్మాత సి కళ్యాణ్ గారు, ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారు. -
దేశంలోనే వైఎస్ జగన్ అరుదైన రికార్డ్
ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏపీ.ఎస్.ఎఫ్.ఎల్ సంస్థ కొత్తగా 9 ప్యాకేజీలు ప్రకటించింది. ►రూ.190 రూపాయలకే 20 ఎంబీపీఎస్(mbps) స్పీడ్ తో 400 జిబి (జీబీ) ఇంటర్నెట్ ఇవ్వాలని నిర్ణయం ►రూ.190 రూపాయల కనెక్షన్ తీసుకున్న వారికి ఉచితంగా సెట్ టాప్ బాక్స్ ►రూ.249 కే 50..ఎంబీపీఎస్ స్పీడ్ తో 600 జీబీ ఇంటర్నెట్ ►రూ.295 రూపాయలకు ఎఫ్‌టీఏ ఛానల్స్, 15ఎంబీపీఎస్ స్పీడ్ తో 200జీబీ ఇంటర్నెట్ ►ఏపీ.ఎస్.ఎఫ్.ఎల్ లో త్వరలో OTTలు ►రూ.299, రూ.399,రూ.799 రూపాయలతో ఒటీటీ ,ఇంటర్నెట్ ,టెలిఫోన్ సదుపాయం ►రూ.499,రూ.699,రూ.999.. రూపాయలకే ఒటీటీతో పాటు ట్రిపుల్ ప్లే ప్యాకేజీలు అందిస్తుండగా మరో పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభం మరో పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభిస్తున్నట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు. 19 వేల పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో చివరి ఇంటి వరకు ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తామన్నారు. ప్రీపెయిడ్ విధానంలో బిల్లులు చెల్లింపు, ఏ ప్రాంతంలోనైనా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ను ప్రజలందరికి చేరువ చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వైఎస్ జగన్ సరికొత్త రికార్డులు ఆధునాత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ సేవల ప్రాధాన్యం పెరిగింది. కేబుల్‌తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడం కూడా ఇటీవలి కాలంలో చాలా మందికి సర్వసాధారణంగా మారింది. ఫోన్ సదుపాయం ఎప్పడో తప్పనిసరిగా మారింది. కానీ.. ఈ మూడిటికీ అయ్యే ఖర్చు మాత్రం వినియోగదారులకు భారమే. ఈ నేపథ్యంలో మూడు రకాల సేవలనూ కేబుల్, ఇంటర్నెట్, ఫోన్,వాయిస్, డేటా సేవల్ని ఒకే గొడుకు కిందకు తెచ్చి, అతి తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందిస్తుంది. దేశంలో హైస్పీడ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ సేవలను అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రిగా వైఎస్ జగన్ రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. -
ఏపీ ఫైబర్ నెట్ అదిరిపోయే ప్లాన్స్: 245+ ఛానల్స్, అన్లిమిటెడ్ డేటా, ఓటీటీ కూడా..
గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కొరకు దేశంలోనే మరెవ్వరు అందించలేనటువంటి ట్రిపుల్ ప్లే సర్వీస్‌లను తక్కువ ధరలకే మీ ముందుకు తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL). వినియోగదారులకు సరికొత్త హంగులతో డిఫెరెంట్ ప్యాకేజీలతో ఇంటర్నెట్, టెలిఫోన్, ఓటీటీ సేవలను అతి తక్కువ ధరలలో కస్టమర్లకు అందిస్తోంది. వాటి పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం! హోమ్ లైఫ్ ప్యాకేజీ: రూ.295/- ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్‌తో పాటు 15 ఎంబీపీఎస్(Mbps) ఇంటర్నెట్ స్పీడ్, 200 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్(Mbps) Post FUB అన్ లిమిటెడ్ నెట్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. ప్రస్తుత ట్రిపుల్ ప్లే సేవలతో పాటు ఓటీటీ ఇంటిగ్రేటెడ్ ప్యాకేజీలు IP టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ ఓటీటీ సౌకర్యంతో: హోమ్ గోల్డ్ ప్యాకేజీ: రూ.499.. 200 + ఛానెల్స్, 20 ఎంబీపీఎస్ స్పీడ్, 150 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్ Post FUP, ఓటీటీ(OTT) సేవలు.. Aha, Voot Select, Epic On, 1 OTT, Eros Now, Meemoతో పాటు టెలిఫోన్ సౌకర్యం హోమ్ గోల్డ్ ప్లస్ ప్యాకేజీ: రూ.699 240+ ఛానల్స్, 30 ఎంబీపీఎస్ స్పీడ్, 300 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్ Post FUP, ఓటీటీ సేవలు.. Aha, Eros Now, ShemarooMe, Discovery PLus, Hungama Play, Hungama Music, Epic On, 1 OTT, Eros Now, Meemo తో పాటు టెలిఫోన్ సౌకర్యం. హోమ్ గోల్డ్ ప్లస్ ప్యాకేజీ: రూ.999 245+ ఛానల్స్, 50 ఎంబీపీఎస్ స్పీడ్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్, FUB లిమిట్ లేదు. ఓటీటీ సేవలు.. Aha, Zee5, Voot, Sun nxt Premium, Alt Balaji, Eros Now, Discovery PLus, Hungama Play, Hungama Music, Discovery PLus, Meemo, MX player Gold, Aao NXT,Gaana Plus Epic On, 1 OTT, Eros Now తో పాటు టెలిఫోన్ సౌకర్యం ఓటీటీ , ఇంటెర్నట్, టెలిఫోన్ సౌకర్యంతో ప్లాన్లు ఇవే.. ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.299 (10 ఎంబీపీఎస్ స్పీడ్, 150 GB FUP, 2 ఎంబీపీఎస్ Post FUB, ఓటీటీ సేవలు.. Epic On, 1 OTT, Meemo/Aha, టెలిఫోన్ సౌకర్యం) ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.399 30 ఎంబీపీఎస్ స్పీడ్, 300 GB FUP, 2 ఎంబీపీఎస్ Post FUB, ఓటీటీ సర్వీసులు.. Ah, Voot, epic on, 1 ott, eros now, Meemoతో పాటు టెలిఫోన్ సౌకర్యం) ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.799 50 ఎంబీపీఎస్ స్పీడ్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్..FUP లిమిట్ లేదు, ఓటీటీ సేవలు Aha, Zee5, Voot, Sun nxt Premium, Alt Balaji, Eros Now, Discovery PLus, Hungama Play, Hungama Music, Discovery PLus, Meemo, MX player Gold, Aao NXT,Gaana Plus Epic On, 1 OTT, Eros Now.. టెలిఫోన్ సౌకర్యం) ఈ వివిధ ప్యాకేజీలను ఏపీఎస్ఎఫ్ఎల్ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీల సమాచారం కొరకు వెంటనే మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి లేదా APSFL కాల్ సెంటర్ -18005995555 కు సంప్రదించాల్సి ఉంటుంది. (అడ్వటోరియల్) -
కేబుల్ ఆపరేటర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
-
కేబుల్ ఆపరేటర్లకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: కేబుల్ టీవీ ఆపరేటర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ టాక్స్‌ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి చెప్పారు. చదవండి: దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి.. ఎవరో చెప్పిన కొడాలి నాని గతంలో పాదయాత్ర సందర్భంగా అనేకమంది కేబుల్ ఆపరేటర్లు తమకు పోల్ టాక్స్ వలన ఇబ్బందులు వస్తున్నాయంటూ జగన్ దృష్టికి తెచ్చారనీ, దీనిపై స్పందించిన సీఎం ఆ టాక్సును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. త్వరలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను కూడా తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ ఛానల్ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. -
ఏపీ ఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ ను విస్తరిస్తాం : గౌతమ్ రెడ్డి
-
అధిక డేటా.. మరింత వేగం
సాక్షి, అమరావతి: మరింత వేగంగా అధిక డేటాను అందించే విధంగా ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) బేసిక్ ప్లాన్‌లో మార్పులను చేసింది. ఇప్పటివరకు ప్రతి నెలా 100 జీబీగా ఉన్న డేటా వినియోగ సామర్థ్యాన్ని 150 జీబీకి పెంచడంతో పాటు ఇంటర్నెట్ వేగాన్ని 15 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్‌కు పెంచినట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. విజయవాడలో ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీటితో పాటు సోనీ గ్రూపునకు చెందిన స్పోర్ట్స్ చానల్స్, సీఎన్‌బీసీ, జీ గ్రూపునకు చెందిన మొత్తం 10 చానల్స్‌ను అదనంగా అందిస్తున్నట్లు తెలిపారు. కేబుల్ టీవీతో పాటు ఉచితంగా టెలీఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్న బేసిక్ ప్లాన్ చార్జీని రూ.300 నుంచి రూ.350కి సవరించినట్లు తెలిపారు. రూ.449, రూ.599 ప్లాన్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీఎస్ఎఫ్ఎల్ 9.2 లక్షల కనెక్షన్లను కలిగి ఉందని, వీటికి అదనంగా మరో 10 లక్షల కనెక్షన్లు అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలలో సెట్‌టాప్ బాక్స్‌ల మరమ్మతుల కోసం సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అక్రమాల కారణంగా నష్టాల్లోకి జారుకున్న సంస్థను తిరిగి లాభాల్లోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్ పేరుతో జరిపిన కుంభకోణంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ప్రస్తుతం ఈ కేసును సీఐడీ వేగంగా విచారణ జరుపుతోందని పేర్కొన్నారు. -
వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్‌రెడ్డి
-
వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్‌రెడ్డి
విజయవాడ: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగినట్లు తమ ప్రాధమిక రిపోర్టుల్లో తేలిందని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాలను ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. దాంతో ప్రభుత్వం వెంటనే సిఐడి విచారణకు ఆదేశించిందని వెల్లడించారు. సాక్షి తో ఏసీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరి గౌతం రెడ్డి ఆదివారం మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫైబర్ నెట్లో అవకతవలు జరిగాయని అన్నారు. ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వంకు పంపించినట్లు తెలిపారు. కాంట్రాక్టర్లకు వందలాది కోట్లను దోచిపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల స్కాంలో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర ఉందన్నారు. కాంట్రాక్టుల విషయంలో ఈ అవకతవకలు జరిగాయని, వందల కోట్ల అవినీతి బయటపడింది అన్నారు. 650 కోట్ల అప్పు ఆయన చార్జి తీసుకునే సమయంలోనే ఉందని, అన్ని చోట్లా లాభాలు ఉంటే ఫైబర్‌లో మాత్రం అప్పులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ‘ఏసీ ఫైబర్‌లో ఇప్పుడు అప్పులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. నిజం నిగ్గు తేలుతుంది. సీఐడీ విచారణలో నాయకులంతా బయటకొస్తారు. పూర్తి అధారాలు మా వద్ద ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు, చిన్నలు కూడా ఇందులో ఉన్నారు. సీఐడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఇందుకు బాధ్యులను గుర్తించాలి. రెండు, మూడు రోజుల్లోనే అన్ని విషయాలు బయటపెడతా.’’ అని అన్నారు. -
ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్‌గా గౌతమ్‌రెడ్డి బాధ్యతలు
సాక్షి, విజయవాడ: ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ మిలిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్‌గా పి. గౌతమ్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ట్రిపుల్ ప్లే సర్వీసులు అందిస్తామని ఆయన వెల్లడించారు.ఈ సర్వీసులు తక్కువ ధరకే అందిస్తామని చెప్పారు. కేబుల్,ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. (చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..) ‘‘గ్రామ, మండలస్థాయిలో అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ వేస్తాం. ఫైబర్ గ్రిడ్‌లో 10లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. త్వరలో కొత్త సెట్ టాప్బాక్స్లు తీసుకువస్తాం. రూ. 599లకే అన్ లిమిటెడ్ ప్లాన్‌తో నెట్ కేబుల్ ఇస్తాం. రూ.450లకే ఇంటర్నెట్ను అన్‌లిమిటెడ్‌తో ఇస్తాం. విద్యార్థుల లాప్‌ట్యాప్‌లకు ఫైబర్ గ్రిడ్ ద్వారా నెట్ ఇస్తాం. ఫైబర్‌గ్రిడ్‌లో రూ.వేల కోట్లు స్వాహా చేశారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీస్తాం. సీబీఐ విచారణ కూడా చేస్తుంది.అవినీతికి పాల్పడిన ఒక్కరినీ కూడా వదలమని’’గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు.(చదవండి: టీడీపీ కుటిల యత్నం!) -
ఏపీ ఫైబర్‌నెట్ విస్తరణ
సాక్షి, అమరావతి: ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) భారీ విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే మూడేళ్లలో ఫైబర్‌నెట్ సేవలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఏటా కనీసం 20 లక్షల మంది కొత్త చందాదారులను ఏపీ ఫైబర్ నెట్ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా మూడేళ్లలో కనెక్షన్ల సంఖ్యను 60–70 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం.మధుసూదన్ రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ప్రస్తుతం ఎపీఎస్ఎఫ్ఎల్ చందాదారుల సంఖ్య 9.5 లక్షలు. చందాదారులను పెంచుకోవడం ద్వారా వార్షిక ఆదాయం రూ.336 కోట్ల నుంచి రూ.3,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ పే సర్వీసుల ద్వారా ప్రతి నెలా రూ.28 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, కొత్త కనెక్షన్ల సంఖ్య 70 లక్షలకు చేరుకుంటే నెలవారీ ఆదాయం రూ.230 కోట్లకు చేరుతుందని అంచనా. ఇదే సమయంలో ప్రభుత్వ, ఇతర కార్పొరేట్ కనెక్షన్ల నెలవారీ ఆదాయం ప్రస్తుతం ఉన్న రూ.5 కోట్ల నుంచి రూ.25 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు. మరిన్ని గ్రామాలకు విస్తరణ ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ సేవలు 2,816 గ్రామాల్లో ఉన్నాయి. త్వరలో 11,274 గ్రామాలకు సేవలను విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇంటర్నెట్కు డిమాండ్ పెరుగుతుండటంతో ఆ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ స్థాయికి హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో దానికి తగ్గట్టుగా ఏపీ ఫైబర్ నెట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. మండల స్థాయి వరకు ఫైబర్ కనెక్షన్‌ను విద్యుత్ స్తంభాల ద్వారా తీసుకువెళ్లి.. అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు భూగర్భ కేబుల్ ద్వారా తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. ప్రస్తుత మార్కెట్ సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, టెలిఫోన్ (ట్రిపుల్ ప్లే సర్వీసు) సేవలను అందిస్తుండటంతో గ్రామీణ స్థాయి నుంచి కొత్త కనెక్షన్లకు డిమాండ్ బాగుందని, దానికి తగ్గట్టుగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నట్లు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. -
రూటర్ల కాంట్రాక్టులో రూ.700 కోట్ల దోపిడీకి తెర