సాక్షి, విజయవాడ: కేబుల్ టీవీ ఆపరేటర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ టాక్స్‌ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి చెప్పారు.
చదవండి: దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి.. ఎవరో చెప్పిన కొడాలి నాని
గతంలో పాదయాత్ర సందర్భంగా అనేకమంది కేబుల్ ఆపరేటర్లు తమకు పోల్ టాక్స్ వలన ఇబ్బందులు వస్తున్నాయంటూ జగన్ దృష్టికి తెచ్చారనీ, దీనిపై స్పందించిన సీఎం ఆ టాక్సును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. త్వరలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను కూడా తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ ఛానల్ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment