goutham reddy
-
చంద్రబాబును గిన్నిస్ బుక్ లో ఎక్కించాలి
-
ఇంకెన్నాళ్లు ఈ డైవర్షన్ పాలిటిక్స్.. చంద్రబాబుకు అదిరిపోయే కౌంటర్
-
వరద బాధితులకు అండగా YSRCP
-
ఏం పీక్కుంటారో పీక్కోండి అచ్చన్నాయుడుకి మాస్ కౌంటర్
-
ఏపీ ఫైబర్‌నెట్.. ప్రతి దాంట్లో అవినీతే
-
డిజిటల్ సేవలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది: గౌతం రెడ్డి
-
ఏపీ ఫైబర్ నెట్.. కేవలం రూ.40కే ఫ్యామిలీతో సినిమా చూసేయండి!
ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మరో వారం రోజుల్లో ఫైబర్ నెట్ వేదికగా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్స్మ్ ప్రారంభించనున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్(ఏపీఎస్ఎఫ్ఎల్) డా.పి.గౌతమ్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో 'కాస్ట్లీ కోరికలు' అనే చిత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ చిత్ర బృందంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! ) ఫైబర్ నెట్ ద్వారా కాస్ట్లీ కోరికలు అనే సినిమాను కేవలం రూ.40కే విడుదల చేస్తున్నామన్నామని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఈ సినిమా తెరకెక్కిందన్నారు. కొత్త తరహా కాన్సెప్ట్ కావడం, హీరోయిన్ లేకుండా కేవలం యంగ్ స్టర్స్ తో మాత్రమే తీసిన సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారన్నారు. ఈ చిత్రాన్ని ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బ్లాక్ స్పేస్ ప్రొడక్షన్ లో ఎస్వీ ఝాన్సీలక్ష్మీ నిర్మాతగా.. ఎస్వీవీ సాయి కుమార్ రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. గతంలో తొలి సినిమాను రూ.100కు అందించిన ఏపీఎస్ఎఫ్ఎల్ ఈ చిత్రాన్ని కేవలం రూ.40కే అందిస్తున్న విషయాన్ని గౌతమ్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా భవిష్యత్తులో లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడమే తమ ధ్యేయమన్నారు. ఔత్సాహిక కళాకారులకు ఏపీ ఫైబర్ నెట్ సరైన వేదిక అని ఆయన అభివర్ణించారు. ప్రతి ఏటా 250 చిన్న చిత్రాలు రూపుదిద్దుకుంటే అందులో థియేటర్లలో విడుదలయ్యేవి కేవలం 40 చిత్రాలు మాత్రమే అన్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు పడుతున్న ఇబ్బందులు అధిగమించాలనే ఉద్దేశంతో మరింత ప్రోత్సాహమందించేందుకు చిన్న చిత్రాలను తక్కువ ధరకే విడుదల చేస్తున్నామని గౌతమ్ రెడ్డి అన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిన చిత్రాలను మాత్రమే తాము విడుదల చేస్తామన్నారు. (ఇది చదవండి: కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!) రానున్న రోజుల్లో పెద్ద చిత్రాలను కూడా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిరంజీవి భోళాశంకర్ చిత్రాన్ని థియేటర్లో ప్రదర్శించిన వారం, పది రోజుల్లో ఏపీ ఫైబర్ నెట్లో ప్రదర్శించేందుకు ఆ చిత్ర నిర్మాత సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. సినిమా విడుదల రోజే తక్కువ ధరకే కొత్త సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో చూడటం మంచి అనుభూతి అన్నారు. పైరసీ చేసేందుకు అవకాశం లేని టెక్నాలజీతో తాము పైబర్ నెట్ వేదికగా సినిమాలను విడుదల చేస్తున్నామన్నారు. -
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’: గౌతం రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతం రెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు వినోదాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని పార్క్ హోటల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా గౌతం రెడ్డి మాట్లాడారు. (ఇది చదవండి: ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల రికార్డులు బ్రేక్: రానా కామెంట్స్ వైరల్) గౌతం రెడ్డి మాట్లాడుతూ.. 'దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఈ కార్యక్రమం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. 99 రూపాయలకే సినిమా మొత్తం కుటుంబం చూడవచ్చు. ఈ 99 రూపాయ ప్లాన్ 24 గంటలు పని చేస్తుంది .' అని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు: గుడివాడ అమర్నాథ్, ఐటీశాఖ మంత్రి దేశంలో ఎక్కడ లేనివిధంగా ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సెప్ట్ రాష్ట్రంలో తీసుకువచ్చామని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా ఫ్యామీలీ మెంబర్స్ అంతా ఇంట్లోనే చూసే అవకాశం ఉంటుందని తెలిపారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..' ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సప్ట్‌తో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల ఫిల్మ్ ఇండ్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 80 శాతం సినిమాలు రిలీజ్ కాకుండానే మిగిలిపోతున్నాయి. ఒక్కొసారి సినిమాలు విడుదలకు థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు. అటువంటి సినిమాలకు పస్ట్ డే పస్ట్ షో ప్లాట్ ఫామ్ ఎంతో ఉపయోగడుతుంది.' అని అన్నారు. చిన్న సినిమాలకు ఉపయోగం: నిర్మాత సి.కల్యాణ్ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. '148 దేశాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి ప్రయోగమే లేదు. మారుమూల గ్రామాల ప్రేక్షలకు ఎంతో ఉపయోగం. ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ నిర్ణయంతో థియేటర్లకు, నిర్మాతలకు ఎలాంటి నష్టం ఉండదు. చిన్న సినిమాలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది మంచి ప్రయోగం. చిన్న సినిమాలు బతుకుతాయి. కొంతమంది సినిమా వాళ్ల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం జగన్‌కు ఎంతో మంచి పేరు వస్తుంది.' అని అన్నారు. సినిమా ఇండస్ట్రీకి వరం: రమాసత్యం నారాయణ, నిర్మాత నిర్మాత నారాయణ మాట్లాడుతూ..'చిన్న సినిమాలు బతకాలంటే ఓటీటీ తరువాత ఫైబర్ నెట్ అవసరం. ప్రజలకు నవ రత్నాలను సీఎం జగన్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి పదో వరంగా ఫస్ట్ డే ఫస్ట్ షో ఇచ్చారు. 99 రూపాయలకే ఇంటిల్లిపాది సినిమా హాయిగా సినిమా చూడవచ్చు.' అని అన్నారు. అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఏంటీ? చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా ఉంటోంది. ఈ సమయంలో థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సినిమాలు చూసేందుకు తీసుకొచ్చిందే ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్. ఏపీ ఫైబర్ నెట్ తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ద్వారా కేవలం రూ.99 కే ఫ్యామిలీ అంతా కలిసి రిలీజ్ మూవీస్ చూడొచ్చు. ఈ ప్లాన్‌కు 24 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. థియేటర్లకు వెళ్లకుండానే కుటుంబమంతా కలిసి సినిమా చూసే సదవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. -
స్టీల్ ప్లాంట్ కార్మికులతో చర్చలు జరిపిన ఏకైక సీఎం వైఎస్ జగన్
-
కేబుల్ ఆపరేటర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
-
కేబుల్ ఆపరేటర్లకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: కేబుల్ టీవీ ఆపరేటర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ టాక్స్‌ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి చెప్పారు. చదవండి: దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి.. ఎవరో చెప్పిన కొడాలి నాని గతంలో పాదయాత్ర సందర్భంగా అనేకమంది కేబుల్ ఆపరేటర్లు తమకు పోల్ టాక్స్ వలన ఇబ్బందులు వస్తున్నాయంటూ జగన్ దృష్టికి తెచ్చారనీ, దీనిపై స్పందించిన సీఎం ఆ టాక్సును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. త్వరలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను కూడా తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ ఛానల్ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. -
మంచి మిత్రుణ్ని కోల్పోయా: సీఎం వైఎస్ జగన్
-
బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న గౌతమ్‌రెడ్డి పార్థివ దేహం
-
గౌతమ్ రెడ్డిని చూసి కన్నీరు మున్నీరు అయిన మంచు ఫ్యామిలీ
-
గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని చూసి బోరున ఏడ్చేసిన ఎమ్మెల్యే రోజా
-
కార్మికులను ఆదుకుంటున్న ఘనత సీఎం జగన్ దే : గౌతమ్ రెడ్డి
-
రేపటికల్లా ఆత్మకూరుకు ఆక్సిజన్ సరఫరా: మంత్రి గౌతమ్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు : రేపటికల్లా ఆత్మకూరుకు ఆక్సిజన్ సరఫరా చేస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. మరో 100 ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు తెప్పిస్తున్నామని చెప్పారు. కోవిడ్ సమయంలో రోగులు కోలుకోవడానికి ఇచ్చే ఔషధాల సరఫరా, డిమాండ్, ఐసొలేషన్ కిట్ల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్‌తో మంత్రి మేకపాటి గురువారం చర్చించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులైన జీజీహెచ్, నారాయణ, అపోలో సహా పలు ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలు, ప్రజల ఇబ్బందులు, కరుణ సోకిన వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో అందుబాటులో ఉన్నప్పుడే ప్రజాసేవకు అసలైన గుర్తింపని, మండలస్థాయిలో ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. నోడల్ అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడాలని, ఆక్సిజన్ అత్యవసర సమయంలోనే అవసరమనుకుంటేనే వినియోగించాలని అన్నారు. ఆక్సిజన్ వృధా కాకుండా కోవిడ్ వచ్చిన వారికి అవగాహన కల్పించడం కూడా అవసరమన్నారు. -
ఇక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో ప్రాముఖ్యత ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 జిల్లాలకు 13 ఉత్పత్తులను ఎంపిక చేసి.. వాటిని మేడిన్ ఆంధ్రా పేరుతో బ్రాండింగ్ కల్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్లో భాగంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా వన్ డి్రస్టిక్ట్ – వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో సర్వే నిర్వహించి, విశేష ప్రాచుర్యం ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల ప్రాముఖ్యాన్ని ప్రతిబింబించడంతో పాటు స్థానికులకు అత్యధికంగా ఉపాధి కల్పించే ఉత్పత్తులను ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. హస్తకళలు, చేనేత, ఆహారం, వ్యవసాయం, ఖనిజాలు, బొమ్మల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఓడీఓపీ సెల్ నాణ్యమైన స్థానిక ఉత్పత్తులను విక్రయించడం ద్వారా బ్రాండ్ ఏపీ పేరు ఇనుమడించే విధంగా చేయడం కోసం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం ముడి పదార్థం ఎంపిక దగ్గర నుంచి తుది ఉత్పత్తి విక్రయించే వరకు ఉత్పత్తిదారులకు సహకరించేలా అన్ని మౌలిక వసతులు, ప్రత్యేక క్లస్టర్లు, ఉమ్మడి సౌకర్యాల వేదికలను అభివృద్ధి చేయనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో అధిక ఉత్పత్తి సాధించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం సిడ్బీ, స్ఫూర్తి వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓడీఓపీ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. కేంద్రం సహకారాన్ని కోరాం వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 స్థానిక ఉత్పత్తులను ఎంపిక చేశాం. ఈ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడానికి సహకారం అందించాల్సిందిగా కేంద్రాన్ని ఇప్పటికే కోరాం. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వదావన్లతో ఈమేరకు మాట్లాడాము. – గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి ఆన్లైన్ మార్కెట్‌పై దృష్టి బ్రాండ్ ఏపీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రాచుర్యం కల్పించేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తద్వారా ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త రకాలను రూపొందించే విధంగా నిఫ్ట్ వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. సంస్థలకు ఆరి్థక సహకారం అందించడానికి సిబ్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. చూడగానే ఆకర్షించేలా ఉత్పత్తులను తీర్చిదిద్దడానికి ప్యాకేజింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమైన మానవ వనరులను అందుబాటులో ఉంచే విధంగా ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏపీ బ్రాండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
బ్యాంకులకు మంచి రోజులు వచ్చాయి
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల కోసం సహకార బ్యాంకులను అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పునూరు గౌతమ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులకు మంచి రోజులు వచ్చాయని, బ్యాంక్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వైఎస్సార్ టీయూసీ సహకార సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘‘ 1987 నుండి బ్యాంకింగ్ వ్యవస్థను నీరుకార్చారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలోని కార్మిక వర్గానికి పెద్ద పీట వేశారు. వారికి నెలకు 16,000 రూపాయలు ఇస్తున్నారు. సహకార సంస్థ కోసం గతంలో సీఎం జగన్ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. మా ప్రభుత్వంలో ధర్నాలు ఉండవు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్మికులను మోసం చేశారు. ముఖ్యమంత్రి ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.వైఎస్సార్ టీయూసీలోకి 15000 మంది వచ్చారు. సహకార ఉద్యోగులకు ప్రమోషన్లు త్వరలోనే వస్తాయ’’ని అన్నారు. ఏపీ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎండీ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఐసీఐసీ బ్యాంక్‌తో సహకార బ్యాంక్‌ను టీడీపీ విలీనం చేయబోయింది. సహకార బ్యాంక్ వ్యవస్థలో కొత్త విధానాన్ని తెస్తున్నా’’మన్నారు. -
సీఎం జగన్ కార్మిక వర్గానికి పెద్దపీట వేశారు
సాక్షి, విజయవాడ: అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'సీఎం జగన్ సచివాలయ ఉద్యోగుల పక్షపాతి. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల ద్వారా వచ్చింది. సీఎం రాష్ట్రంలోని కార్మిక వర్గానికి పెద్దపీట వేశారు. అక్టోబర్ 2నాటికి గ్రామ సచివాలయాలు ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా సచివాలయ ఉద్యోగులు ప్లకార్డులు పట్టుకొని సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా సంవత్సరం దాటిన తర్వాత ప్రొవిషనల్ టెస్ట్ ఉంటుందని.. అదే విధంగానే సచివాలయ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని' గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. -
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్ వన్
-
మరో ఐదు ‘శ్రీసిటీ’లు
సాక్షి, అమరావతి: భారీఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన మల్టీ ప్రొడక్ట్ సెజ్ ‘శ్రీసిటీ’ తరహాలో అన్ని వసతులతో ఐదు పారిశ్రామిక పార్కులను నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తోంది. గురువారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలన భవనంలో ఉన్న ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ తొలిసారి సమావేశమైంది. ఈ భేటీలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టాస్క్‌ఫోర్స్ కమిటీ వైస్ చైర్మన్ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్, టాస్క్‌ఫోర్స్ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పంచాయతీ రాజ్, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఐదు డిజిగ్నేటెడ్ క్లస్టర్స్, పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా రక్షణ–ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా–హెల్త్‌కేర్, టెక్స్టైల్ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే విధంగా అన్ని వసతులతో డిజిగ్నేటెడ్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లగ్అండ్ప్లే విధానంలో విదేశీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించుకునే విధంగా ఈ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ♦ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న దేశాలను గుర్తించి వాటి కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా దేశాల్లో స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ♦ పెట్టుబడి ప్రతిపాదనలు వేగంగా వాస్తవరూపం దాల్చడం కోసం దేశాల వారీగా, రంగాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. ♦ ప్రతిపాదన వచ్చిన 30 రోజుల్లో పరిశ్రమకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్, మానవ వనరులను అందించే విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ♦ పారిశ్రామిక పాలసీతో పాటు, ఐటీ–ఎలక్ట్రానిక్స్ పాలసీలను జూన్ 26న విడుదల చేసేందుకు కృషిచేస్తున్నామని మంత్రి చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా వచ్చే నాలుగేళ్లలో పెద్దఎత్తున సంపద సృష్టిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ♦సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఉండే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ముందుకు నేడు వచ్చే సుమారు రూ. 18,000 కోట్ల విలువైన 25 పెట్టుబడి ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు. నేతన్నల స్థితిగతులపై సర్వే చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సర్వే చేపట్టాలని చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చేనేతల స్థితిగతులపై గురువారం సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెలలో అందించే ‘నేతన్న నేస్తం’ సాయానికి అర్హులైన వారి జాబితాను రూపొందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమాంధ్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్: గత సర్కారు మాదిరిగా అవాస్తవాలు, లేనివి ప్రచారం చేయడం, గ్రాఫిక్స్ చూపించి అన్యాయం చేయడం మాకు సాధ్యం కాదు. రాష్ట్రం నుంచి కియా వెళ్లిపోయిందని మాజీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన మీడియా దుష్ప్రచారం చేసింది. మైక్రోసాఫ్ట్ వస్తోందని, బుల్లెట్ రైలు వస్తోందని, రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ గత ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ అంటూ గ్రాఫిక్స్ చూపించింది. అలాంటి అవాస్తవాలను మా ప్రభుత్వం ప్రచారం చేయదు. సాక్షి, అమరావతి: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 972 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటు నాలుగు పోర్టులు, ఆరు విమానాశ్రయాలున్నాయని మంచి రహదారులు, రైల్వే లైన్లు మన బలమని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి భూమి, నీరు, విద్యుత్తు లాంటి మౌలిక వసతులతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 30 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటుకు ప్రపంచస్థాయి అత్యుత్తమ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యం పెంచేలా ఈ కేంద్రాలు పని చేస్తాయన్నారు. టెక్స్టైల్స్ రంగానికి గత సర్కారు రూ.1,100 కోట్లు బకాయిలు పెట్టిందని, వాటిపై కూడా త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని సీఎం తెలిపారు. గత సర్కారు కేంద్రంతో కలసి కాపురం చేసినా ప్రత్యేక హోదా తేలేదని, ఎప్పటికైనా హోదా సాధిస్తాననే నమ్మకం తమకు ఉందని సీఎం అన్నారు. దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే సత్తా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకే ఉందన్నారు. ‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో పారిశ్రామిక రంగం–మౌలిక సదుపాయాలపై మేధోమ«థన సదస్సు నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు, నిపుణులు, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలివీ.. విభజనతో చాలా నష్టపోయాం మన ఆర్థిక రథం నడవాలంటే వ్యవసాయం ఒక చక్రం అయితే, రెండో చక్రం పారిశ్రామిక సేవా రంగం. వాటిలో అభివృద్ధి కనిపిస్తేనే ఆర్థిక రథం పరుగెత్తుతుంది. రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు హోదా ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇవ్వలేదు. దీనివల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పారిశ్రామికంగా పలు రాయితీలు ఇన్‌కమ్‌ట్యాక్స్, జీఎస్టీ లాంటి రాయితీలు వచ్చేవి. వాటివల్ల రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వచ్చి ఉండేవి. హోదాను ఎప్పటికైనా సాధిస్తాం 2014–19 వరకు కేంద్రంతో కలసి కాపురం చేసినా గత ప్రభుత్వం ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోయింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీ సాధించింది. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకవేళ కేంద్రంలో పూర్తి మెజార్టీ రాకుండా ఉండి ఉంటే వాళ్లతో బేరం పెట్టే అవకాశం ఉండేది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి పూర్తి మెజార్టీ రావడంతో వారు మా మద్దతు కోరే అవకాశమే లేకుండా పోయింది. గత సర్కారులా అసత్యాలు చెప్పం మనం ఏదైనా చెప్పేటప్పుడు ఆ మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వం మాదిరిగానే మేం కూడా రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించామని మాట్లాడితే అర్ధం లేదు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడి, 40 లక్షల ఉద్యోగాలు అని ఒకరోజు. నెలకో విదేశీ కంపెనీ అంటూ హడావుడి, రూ.50 వేల కోట్లతో సెమీ కండక్టర్ పార్కు, బుల్లెట్ రైలు వస్తుందని ఒకరోజు, ఎయిర్‌బస్ వచ్చేస్తుందని ఇంకోరోజు, మైక్రోసాఫ్ట్ వచ్చేస్తోందని మరొక రోజు, హైపర్ లూప్ వస్తుందని ఇంకొక రోజు ప్రచారం.. ఇవన్నీ సరిపోవని ఈ మధ్యనే దివాలా తీసిన బీఆర్ «శెట్టి ఈ పక్కనే 1,500 పడకలతో రూ.6 వేల కోట్లతో దిగుతున్నాడని చెప్పారు. ఇవన్నీ నేను కూడా చెబితే అర్ధం ఉండదు. అదేనా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’? గత ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేది. 2014 – 2019 వరకు పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలు రూ.4 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టింది. వాటిలో దాదాపు రూ.968 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు ఇవ్వాల్సినవి. పరిశ్రమలు పెట్టించిన తర్వాత రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటి? ఇక్కడ అంతా బాగుందని ఎలా చెబుతాం? గతంలో పారిశ్రామిక రాయితీలు కూడా అమ్ముకున్నారు. ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్టచెబితే తప్ప రాయితీలు ఇచ్చేవారు కాదు. అలా నేను చెప్పలేను.. డిస్కమ్‌లకు కూడా గత ప్రభుత్వం దాదాపు రూ.20 వేల కోట్లు బకాయి పెట్టింది. ఇదేనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఏటా క్రమం తప్పకుండా దావోస్ వెళ్లారు. ప్రతి రెండు నెలలకు విదేశీ పర్యటనలు, చెప్పిందే చెప్పారు కానీ ఏమీ సాధించలేదు. అన్నీ అబద్ధాలు చెప్పారు. మీడియా వారికి అనుకూలంగా ఉండడం వల్ల అలా అబద్ధాలు చెబుతూ పోయారు. అవన్నీ నేను చెప్పలేను. పారిశ్రామికవేత్తలకు నేను చెప్పేది ఒక్కటే. చెప్పిన దానికి కట్టుబడి ఉంటాం. నిజాయితీ, నిబద్ధత మాలో ఉన్నాయి. మాది 4వ అతి పెద్ద పార్టీ 175 సీట్లకు గానూ 151 సీట్లు, 86 శాతం స్థానాలను గెల్చుకుని రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. ప్రో యాక్టివ్‌గా ఉన్నాం. 22 ఎంపీ స్థానాలను గెల్చి దేశంలోనే 4వ అతి పెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ నిలిచింది. అవినీతికి తావే లేదు ఇక్కడ ఎవరికీ డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడా అవినీతికి తావు లేదు. వ్యవస్థలో మార్పు తెస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ కోసం కమిషన్ కూడా ఏర్పాటు చేశాం. సంస్కరణలు చేపట్టి రివర్స్ టెండరింగ్ విధానం. తెచ్చారు. టెండర్లలో ఎల్–1 వచ్చినా అంతకంటే ఎవరైనా తక్కువకు వస్తే రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నాం. దేశంలో అత్యున్నత పోలీసు వ్యవస్థ ఏపీలో ఉంది. గ్రామ స్థాయిలో సచివాలయాల్లో మహిళా పోలీసులున్నారు. ఆ స్థాయిలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది. శాంతి భద్రతలకు ఢోకా లేదు. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు రూ.లక్ష కోట్ల విలువైన చేపలు, రొయ్యలు, వ్యవసాయ ఉత్పత్తులు, పొగాకు, కాఫీతోపాటు ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేశాం. మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు. విస్తృతమైన బ్యాంకింగ్ నెట్వర్క్ ఉంది. అవసరాలకు తగినట్లుగా పారిశ్రామికవేత్తలకు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తాగు, సాగు నీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాల కోసం వాటర్ గ్రిడ్స్, కాలువల నుంచి ఢోకా లేకుండా నీరు ఇచ్చేవిధంగా వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. పదేళ్లలో అద్భుతమైన మానవ వనరులు.. ► ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలు చేయాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ఇందులో తెలుగు తప్పనిసరి సబ్జెక్‌గా ఉంటుంది. దీనివల్ల వచ్చే 10 ఏళ్లలో సేవా రంగానికి అద్భుతమైన మానవ వనరులు అందించే పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్తుందని గర్వంగా చెప్పగలుగుతా. ► గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో కూడా మన స్థానం మారుతుంది. ఇంటర్ తర్వాత కాలేజీలో చేరుతున్న వారి నిష్పత్తి చూస్తే.. రష్యాలో 82 శాతం, చైనాలో దాదాపు 51 శాతం, బ్రెజిల్లో కూడా దాదాపు 51 శాతం ఉండగా, భారత్‌లో మాత్రం అది కేవలం 26 నుంచి 28 శాతం వరకు మాత్రమే ఉంది. ► ఈ పరిస్థితి మారాలని 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. 34 దేశాల రాయబారులను పిలిచాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండున్నర నెలలు కూడా గడవకముందే డిప్లొమాటిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించి దాదాపు 34 దేశాల రాయబారులను కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఆహ్వానించాం. ఇక్కడ పెట్టుబడి అవకాశాలను వివరించాం. ఇవన్నీ చేస్తుంటే, గత సర్కారు పెద్దమనుషులు, వారి అనుకూల మీడియా దుష్ప్రచారం చేసింది. కియా మోటర్స్ వెళ్లిపోతోందని ప్రచారం చేశారు. అప్పుడు కియా మోటర్స్ ఎండీ స్పందించి ఇక్కడ ఇంత సానుకూలంగా ఉంటే ఎందుకు వెళ్లిపోతామని లేఖ ఇచ్చారు. పరిశ్రమలు–పెట్టుబడులు–ఉద్యోగాలు ► పరిశ్రమల పట్ల సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం ఉంది కాబట్టే గత ఏడాది 34,322 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలో 39 భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తి మొదలు పెట్టాయి. ► 13,122 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి. వాటి ద్వారా రూ.2503 కోట్లు పెట్టుబడి రాగా, 63,897 మందికి ఉద్యోగాలు వచ్చాయి. కోవిడ్ వల్ల కాస్త మందగించినా పుంజుకుంటున్నాయి. ► ఇంకా రూ.11,548 కోట్ల పెట్టుబడికి 1,466 కంపెనీలు రెడీగా ఉన్నాయి. వాటికి ఏపీఐఐసీ 1,600 ఎకరాల భూమి కేటాయించింది. మరో 20 ప్రముఖ సంస్థలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎంఎస్ఎంఈలకు చేయూత ► సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కార్యాచరణ చేపట్టాం. రాష్ట్రంలో దాదాపు 98 వేల యూనిట్లు దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వాటిని కాపాడుకుంటేనే వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందుకే వైఎస్ఆర్ నవోదయం పథకం ద్వారా 81 వేల ఎంఎస్ఎంఈలకు రూ.2,300 కోట్ల మేర ప్రయోజనం కలిగేలా బ్యాంకులతో మాట్లాడి ప్యాకేజీలు రెడీ చేసి అండగా నిలిచాం. ► కోవిడ్‌తో చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు మూతబడే స్థితికి చేరుకున్నాయి. వాటికి గత ప్రభుత్వం రూ.968 కోట్ల ప్రోత్సాహక రాయితీలు బకాయి పెడితే మేం ఇస్తామని చెప్పాం. ఇప్పటికే రూ.450 కోట్లు ఇచ్చాం. మిగిలిన మొత్తం కూడా జూన్ 29న ఇవ్వబోతున్నాం. ఇది నిజమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ► ఇవే కాకుండా ఏప్రిల్ నుంచి జూన్ వరకు పవర్‌పై ఫిక్స్డ్ ఛార్జీలు రూ.188 కోట్లు రద్దు చేశాం. కేంద్రం ఇచ్చేవి కూడా పంపిణీ చేసి తోడుగా ఉంటాం.ప్రభుత్వం ఇంకా వాటికి రూ.1200 కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటోంది. పెద్ద కంపెనీలకు చాలా చేయాలి.. పెద్ద కంపెనీలకు ఇంకా ఆశించిన స్థాయిలో చేయలేకపోతున్నాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. అందుకోసమే సూచనలు, సలహాలు తీసుకుందామని మిమ్మల్ని ఆహ్వానించాం. ఏంచేస్తే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలలో విశ్వాసం కలుగుతుందో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడేళ్లలో చేయాల్సిన ప్రాజెక్టులు.. ► రాష్ట్రానికి మూడేళ్లలో కొన్ని ప్రాజెక్టులు తప్పనిసరిగా చేయాల్సినవి ఉన్నాయి. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులు నిర్మాణం, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావాలి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది. అక్కడ మెట్రో రైలు రావాలి. ► ఇంకా 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లతో పాటు 2.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. జాయింట్ వెంచర్‌కు సిద్ధంగా ఉన్నాం. ప్లాంట్‌కు ముడి సరుకు సరఫరా కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకున్నాం. సాంకేతిక పరిజ్ఞానం కోసం డీఆర్డీవోతో ఒప్పందం చేసుకున్నాం. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ విశాఖలో హైఎండ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. టైర్–1 సిటీ కాబట్టి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో విశాఖ పోటీ పడగలుగుతుంది. అక్కడ నిపుణులైనసాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందుబాటులోకి వస్తారు. రాబోయే రోజుల్లో అది కార్యరూపం దాల్చనుంది. సదస్సులో మంత్రులు గౌతమ్‌రెడ్డి, బొత్స, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు, నిపుణులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న మంత్రులు గౌతమ్‌రెడ్డి, బొత్స, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు -
పారిశ్రామికాభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం
-
తప్పుడు ప్రచారం పై కియా స్పందన
-
కియాపై కీలక ప్రకటన..
సాక్షి, అమరావతి: తమ అనంతపురం ప్లాంటు వేరే ప్రాంతానికి తరలి వెళుతోందంటూ వచ్చిన వార్తలో నిజం లేదంటూ కియా మోటర్స్ స్పష్టం చేసింది. తప్పుడు కథనాలను పట్టించుకోవద్దని సూచించింది. సమర్థుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని వెల్లడించింది. దీర్ఘకాలిక లక్ష్యంతో అనంతపురంలో 1.1 బిలియన్ డాలర్లతో యూనిట్‌ను ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లను తయారుచేసి వినియోగదారులకు అందిస్తామని తెలిపింది. ఈ మేరకు కియా మోటర్స్ ఎండీ కుక్యున్ షిమ్ లేఖ రాశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్పోలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలసి కియా ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కియా ఎండీ కుక్యున్ షిమ్ రాసిన లేఖను కియా ప్రతినిధులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా కియా జనరల్ మేనేజర్ సన్ ఊక్ వాంగ్ మాట్లాడుతూ.. కియా సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉన్న బంధం చెక్కు చెదరదని, కలసిమెలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రాయిటర్స్ రాసిన తప్పుడు కథనంపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. కియా మోటార్స్ ఎక్కడికీ వెళ్లదని, రానున్న కాలంలో మరిన్ని ఆటో మొబైల్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వ సహకారంతోనే కియా మోటార్స్ రెండో మోడల్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని చెప్పారు. కియో మోటార్స్, తమిళనాడు ప్రభుత్వం కూడా అసత్య ప్రచారాన్ని ఖండించిందని, అయినా కొందరు కావాలనే స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కియాపై బాధ్యతరాహిత్యంతో ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత దుష్ప్రచారాలకు తెరతీయడం రాజకీయంగా దిగజారడమేనన్నారు. (చదవండి: రాయిటర్స్‌కు బాబు సర్కారు పందేరం) -
ఏపీ విధానాలను కేంద్రం ఆదర్శంగా తీసుకోవాలి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న విధానాలను కేంద్రం ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిన మహానుభావుడు సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. కార్మిక విధానాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు.కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా కేంద్రం ఆలోచనలున్నాయని విమర్శించారు. కనీస వేతనాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కార్మిక వ్యతిరేక విధానాలపై జనవరి 8న పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకి పిలుపునిచ్చారు. సమ్మెలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొనాలని విజ్ణప్తి చేశారు. కార్మికులకి 21 వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఉండాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను పోస్కోకి కట్టబెట్టడం దారుణమని గౌతంరెడ్డి మండిపడ్డారు. -
కార్మికుల జీవితాల్లో వైఎస్ జగన్ వెలుగులు నింపుతున్నారు
-
కార్మిక వర్గానికి సీఎం జగన్ పెద్దపీట
సాక్షి, తాడేపల్లి: కార్మిక వర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి అన్నారు.అక్టోబర్ 4 నుంచి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభం అవుతుందని, సంఘీభావంగా వారంపాటు అభినందనల ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దమ్మున్న నేతగా వైఎస్ జగన్ ప్రజల ముందుకు వచ్చి... ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేస్తున్నారు. పిల్లిగంతులు వేసే చంద్రబాబు... వైఎస్సార్ సీపీ, ముఖ్యమంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు 620 వాగ్ధానాలు చేసి, వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇంటికో ఉద్యోగం అని, అది కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రివర్స్ టెండర్ చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటో చెప్పాలని గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. విచారణలో చంద్రబాబు అవినీతి బయటపడుతుందని భయపడుతున్నారని గౌతమ్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో ఆదివారం గౌతమ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ గ్రామ స్వరాజ్యం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం. అవినీతిరహిత పరిపాలనను గ్రామ స్వరాజ్యన్ని ముఖ్యమంత్రి అందించబోతున్నారు. అయిదేళ్లలో అద్భుతమైన పరిపాలన మనం చూడబోతున్నాం. ఒకేసారి లక్షా 27వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి చరిత్ర సృష్టించారు. పారిశుద్ధ్య కార్మికులకు రూ.18వేలు జీతం పెంచిన ఘనత కూడా ముఖ్యమంత్రికే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు పిల్లిగంతులు వేస్తూ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు, చంద్రబాబు ఇచ్చిన హామీలపై చర్చించడానికి మేం సిద్ధం. గత ప్రభుత్వంలో చంద్రబాబు తాను ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు’ అని అన్నారు. -
దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తాం..
సాక్షి, నెల్లూరు: సోమశిల హైలెవల్ కెనాల్ రెండో ఫేజ్ పనులు త్వరలోనే పూర్తి చేసి.. దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో వానలు లేవు.. నీళ్లు లేవని.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు. జలవనరుల శాఖ మంత్రిగా మన జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ యాదవ్ ఉండటం సంతోషకరమన్నారు. సోమశిల నుంచి నీటిని విడుదల చేసిన మంత్రులు.. సోమశిల జలాశయం నుంచి కండలేరు జలాశయానికి మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి మంగళవారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వర ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు పాల్గొన్నారు. -
శ్రామికుల సంక్షేమమే మేడే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా శ్రామిక జనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా మే నెల ఒకటో తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) నిర్వహిస్తారని ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మే డేను ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో కార్మికుల శ్రేయస్సు కోసం అనేక అంశాలు పొందుపరిచినట్లు వివరించారు. ప్రతి కార్మికుడికీ శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ నాయకులులు ధర్మాన కృష్ణదాసు, అంకంరెడ్డి నారాయణమూర్తి, డాక్టర్ ప్రపుల్లారెడ్డి, బి.సంజీవరావు, పాలెం రఘునాథ్‌రెడ్డి, నాగదేశి రవికుమార్, బి.శ్రీవర్దన్‌రెడ్డి, మాజిద్, కనుమూరి రవిచంద్రారెడ్డి, ఆర్.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 23 తర్వాత కార్మిక పక్షపాత సర్కార్: గౌతమ్‌రెడ్డి రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ తర్వాత కార్మిక పక్షపాత ప్రభుత్వం ఏర్పాటవుతుందని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌టీయూ జెండా ఆవిష్కరించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పాలనలో కార్మికుల పొట్టగొట్టే చర్యలు ఎన్నో చేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ జెండా, అజెండాలో కార్మికుల సంక్షేమం ఉందని.. పార్టీ మేనిఫెస్టోలో మొదటిగా కార్మికుల సంక్షేమం గురించి పొందుపర్చినట్లు చెప్పారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేసి కార్మిక ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి మల్లాది విష్ణు మాట్లాడుతూ కార్మికుల అభ్యున్నతికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని చెప్పారు. పార్టీ ట్రేడ్ యూనియన్ బందరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మాధు శివరామకృష్ణ, విజయవాడ పార్లమెంట్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ప్రదీప్, విజయవాడ నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు విశ్వనాథ్ రవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ హామీని నెరవేరుస్తాం..
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే కోటిన్నర మంది కార్మికులకు న్యాయం చేస్తారని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి అన్నారు. ఆదివారమిక్కడ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్మిక లోకం పండుగలా భావించే మేడే సందర్భంగా వైఎస్సార్ టీయూసీ ఆధ్వర్యంలో అన్ని చోట్లా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే కార్మికుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. -
‘విద్వేషాలు రెచ్చగెట్టేందుకు టీడీపీ ప్రయత్నం’
అమరావతి: ఓడిపోతామన్న భయంతో భావోద్వేగాలను , ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, గౌతమ్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని ఆదివారం నాగిరెడ్డి, గౌతం రెడ్డిలు కలిశారు. తన వాయిస్ ఇమిటేట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించే కుట్ర పన్నారంటూ ఎంపీ విజయసాయి రెడ్డి తరపున సీఈఓకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. ఏబీఎన్‌లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయ రెడ్డి వాయిస్‌ను ఇమిటేట్ చేసిన టేప్ ప్రసారం చేశారని వెల్లడించారు. అది తన వాయిస్ కాదని విజయసాయి రెడ్డి స్పష్టం చేసినా ఏబీఎన్ అడ్డదారి తొక్కటం దారుణమన్నారు. మోసపూరిత విధానంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ జేబు మీడియా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మిమిక్రీ ఆర్టిస్టులతో వాయిస్ ఇమిటేట్ చేసి దుష్ప్రచారం చేస్తే ప్రజలు వినే పరిస్థితిలో లేరని అన్నారు. టీడీపీకి ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికల ప్రక్రియ అన్నా గౌరవం లేదన్నారు. ఎన్నికల కమిషన్ వాట్సాప్ గ్రూప్‌ల్లోకి తెలుగు తమ్ముళ్లు చొరబడి లొల్లి చేస్లున్నారని విమర్శించారు. టీడీపీని గెలిపిస్తే పథకాల అమలు కోసం మళ్లీ వచ్చే ఎన్నికల వరకు ఆగాలన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు. ఎన్నికలు వస్తే తప్ప చంద్రబాబుకు ఇచ్చిన హామీలు గుర్తుకు రావన్న విషయం అందరికీ అర్ధమైపోయిందని చెప్పారు. ఎన్నికుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా జగన్ జనసునామీలో కొట్టుకుపోకతప్పదని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుకైనా ఓటమి తప్పదు
సాక్షి, సంగం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బొల్లినేని కృష్ణయ్యనాయుడే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేసినా గెలుపొందేది తానేనని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. సంగం మండలం దువ్వూరుకు చెందిన నాయకుడు సూరి మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది సోమవారం నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ నాయకులకు ఏ అవసరమొచ్చినా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. టీడీపీ నాయకులు పెట్టే ప్రలోభాలకు ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులు ఏ ఒక్కరూ లొంగబోరన్నారు. ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటి చేస్తున్న బోల్లినేని కృష్ణయ్యనాయుడు ఆదివారం చేజర్ల మండలంలో మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఓడిస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. బొల్లినేని కృష్ణయ్య ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాలను అరికట్టాలని తెలిపారు. రైతుల కష్టాలను గుర్తించి టీడీపీ ప్రభుత్వానికి ముందు తెలియజేయాలన్నారు. అంతేగానీ గౌతమ్‌రెడ్డిని ఓడిస్తానంటే కృష్ణయ్య కాదు కదా సాక్షాత్తు చంద్రబాబు పోటీ చేసినా తన చేతిలో ఓటమి తప్పదని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేపట్టడంతో పేదలు పడుతున్న కష్టాలను గుర్తించి ఆరోగ్య శ్రీ తదితర గొప్ప పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పాదయాత్ర అనే పదానికి అర్థమే వైఎస్ కుటుంబమని, ఇది రాష్ట ప్రజలందరికీ తెలుసునన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబంలో నుంచి వచ్చిన రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని 2019లో ఓటు అనే ఆయుధంతో ఆశీర్వదించాలన్నారు. 2019లో రాజన్న రాజ్యం తిరిగి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వారు కోరిన పనిని ఒక్క రోజులో పూర్తి చేసే విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో నాయకులు షేక్ మహబూబ్‌బాష, కరీముల్లా, నాయబ్బాషా, అబ్దుల్ జలీల్, రఫీ అహ్మద్, షాహుల్, హమీద్, అబిద్‌బాషా, జమీర్, అలీంబాషా, ఖాజారసూల్, సిరాజ్, ఇర్ఫాన్, వహాబ్బాషా, ఉస్మాన్, జలీల్, జన్నత్, చోటా, బాషా, గౌస్‌మొహిద్దీన్, షఫీ, సమీవుల్లా, గౌస్‌బాషా, జమీర్, నిజాం, అక్బర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు మెట్టుకూరు వాసుదేవరెడ్డి, రేబాల సురేంద్రరెడ్డి, వేల్పుల కోటేశ్వరరావు, భువన రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయి
సాక్షి, అమరావతి : టీడీపీ పాలనలో రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. చంద్రగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని తుద ముట్టించడానికి టీడీపీ నేతలు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఇద్దరి చేత రెక్కీ నిర్వహించడం దారుణమన్నారు. సుపారీ చెల్లించి మనషులను పెట్టారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా అన్ని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో సహా నిందితులను పోలీసులకు అప్పగించినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే కేసు నమోదు చేయటంలేదని విమర్శించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందించిన సాక్ష్యాధారాలతో వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులకు గౌతమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
‘బాబు కేవలం గ్రాఫిక్స్‌లకు మాత్రమే పరిమితం’
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : గత ఎన్నికల్లో కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదని వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో కార్మికులు ఇచ్చిన 42 వాగ్ధానాల్లో కనీసం ఒక్కటైనా నెరవేర్చలేదని విమర్శించారు. చంద్రబాబు కేవలం గ్రాఫిక్స్‌కు మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరు కార్మికుల పొట్ట కొట్టేలా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించే ప్రభుత్వం కావాలని, అది వైఎస్ జగన్‌తోనే సాధ్యమవుతుందన్నారు. అన్ని రంగాల కార్మికులకు అన్యాయం చేసిన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 7న కడపలో జరగబోయే బూత్ స్థాయి కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలి కోరారు. -
కార్మికులను దగా చేసిన టీడీపీ సర్కార్
తూర్పుగోదావరి, బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను అన్నివిధాలా దగా చేసిందని, కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. కాకినాడ సూర్యకళా మందిరంలో పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులకు గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపట్టారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన 42 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో పనిచేస్తున్న 80 వేల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు పీకేశారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా రాష్ట్రంలో కార్మిక కుటుంబాలను రోడ్దున పడేశారని విమర్శించారు. మైనింగ్, ఇసుక, మద్యం స్కామ్‌ల్లో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కాకినాడలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమానికి ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వం కృషి చేసిన దాఖలాలు లేవన్నారు. కనీసం వేతనాలు కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులు ఉద్యమం చేస్తే వారిని ఉద్యోగం నుంచి తొలగించారని విమర్శించారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉండగా ఏనాడు కార్మిక సంఘాల ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదన్నారు. కానీ ఇటీవల జరిగిన హెచ్ఎంఎస్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కొండబాబు జోక్యం చేసుకొని వారి మధ్య అగాదాలు సృష్టించారని విమర్శించారు. ఎమ్మెల్యేకు కార్మికుల సమస్యలు పట్టించుకునే ఖాళీ లేకున్నా ఆయిల్ మాఫీతోను, మద్యం, పేకాట మాఫీయాలతో కోట్లు కాజేసేందుకు సమయం ఉందాని ప్రశ్నించారు. పార్టీ అధికారంలోనికి రాగానే కార్మికుల యూనియన్‌కు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం నియోజవకర్గ కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు మాట్లాడుతూ కార్మికులు సంక్షేమం కోసం జగన్మోహన్రెడ్డి అనేక పథకాలు రూపొందించారన్నారు. పెద్దాపురం నియోజకవర్గ కో– ఆర్డినేటర్ దవులూరి దొరబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రావడానికి వందలాది దొంగ హామీలు ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా పలు కార్మికల సంఘాల నాయకులు తమకు ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, ఇళ్లు మంజూరు చేయాలని, యూనియన్‌కు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. దీనిపై గౌతంరెడ్డి స్పందిస్తూ కార్మికుల సమస్యలను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళతామన్నారు. పార్టీ అధికారంలోనికి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు దుగ్గన బాబ్జి, పార్టీ బీసీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి పెద్ది రత్నాజీ, రాష్ట్ర ప్రచారం విభాగం కార్యదర్శి రావూరి వేంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు గంగాపాత్రుని శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షుడు ప్రూటీకుమార్, కార్పొరేటర్లు రోకళ్ల సత్యనారాయణ, ఎంజీకే కిశోర్, మీసాల ఉదయకుమార్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
‘స్టేట్‌ను చెత్తాంధ్ర ప్రదేశ్‌గా మార్చిన బాబు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ ప్రదేశ్‌గా కాదు.. చెత్తాంధ్ర ప్రదేశ్‌గా మారుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జీవో 279 వెంటనే రద్దు చెయ్యాలనే కార్మికుల డిమాండ్‌పై చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందని అన్నారు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయినా బాబు తీరు మారదా అని వ్యాఖ్యానించారు. సమస్యను విన్నవిస్తే తప్పా..? వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతియేడు డీఎస్సీ నోటిఫికేషన్ వేశారని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రికి బేరం కుదరలేదు కాబట్టే డీఎస్సీని మళ్లీ వాయిదా వేశారని ఆరోపించారు. ఆశ వర్కర్లను ప్రభుత్వం చులకన గా చూస్తోందని ధ్వజమెత్తారు. కార్మికులకి కనీస వేతనం పదివేల రూపాయల ఇవ్వాలనే తమకు సమస్యను లేవనెత్తడం నేరమా? అని చంద్రబాబుని ప్రశ్నించారు. తమ సమస్య పరిష్కారానికి మద్దతు కోరుతూ ప్రతిపక్ష నాయకుడు వద్దకు వెళ్లిన ఉద్యోగులను సస్పెండ్ చెయ్యటం దారుణమని మండిపడ్డారు. -
అన్నం పెట్టే మహిళలను అరెస్టులు చేస్తారా?
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు గౌతమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం కార్మికులను పోలీసులు జలియన్ వాలాబాగ్ తరహాలో పాశవికంగా అరెస్ట్‌లు చేశారని విమర్శించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్న బోజన కార్మికులు చేపట్టిన ఆందోళనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని చూడటాన్ని దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు . 85 వేల మందిని విధుల నుంచి తొలగించడం దారుణమని మండిపడ్డారు. వారికి తాము అండగా ఉంటామని తెలిపారు. అన్నం పెట్టే మహిళలను ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయవాడలోని అన్ని పోలీసు స్టేషన్లు మహిళలతో నిండిపోయాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి కార్మికుల అంటే చిన్నచూపేనని అన్నారు. దుర్గగుడిలో అమ్మవారికే రక్షణ కరువయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కిరీటం మాయం అయిందని, తర్వాత క్షుద్రపూజలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. అమ్మవారి చీర మాయంపై అదే గుడి కమిటీ సభ్యులు విచారణ జరపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘ఛలో విజయవాడ కార్యక్రమం’లో ఉద్రిక్తత -
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేస్తోంది
-
సీఐడి నివేదిక తప్పని పత్తిపాటి అంగీకరిస్తారా ?
-
‘లోకేష్ కనుసన్నల్లోనే భారీ అవినీతి’
-
‘లోకేష్ కనుసన్నల్లోనే భారీ అవినీతి’
విజయవాడ: సుమారు రూ.1000 కోట్ల విలువ చేసే భూములను సిద్ధార్థ విద్యాసంస్థలకు అప్పగించడం వెనక భారీ అవినీతి జరుగుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గౌతంరెడ్డి విమర్శించారు. విజయవాడలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. లోకేష్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతోందని ఆరోపించారు. అతి తక్కువ ధరకు ఈ భూములను సిద్ధార్థ సంస్థలకు అప్పగించారన్నారు. ఏడాదికి కోటి రూపాయలు వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధపడిందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీడీపీ అక్రమ సొమ్ము దాచే డెన్‌గా సిద్ధార్ధ విద్యాసంస్థలు ఉపయోగపడ్డాయన్నారు. అందుకు కృతజ్ఞతగా దేవాదాయభూములను నామమాత్రపు లీజుకు ప్రభుత్వం ఇచ్చిందని విమర్శించారు. -
అరుణ్ జైట్లీ అదనంగా ఒరగబెట్టిందేమీ లేదు
► ఆర్థిక మంత్రిపై మండిపడ్డ వైఎస్సార్సీపీ నేత గౌతమ్‌రెడ్డి సాక్షి, అమరావతి బ్యూరో: విభజన చట్టంలో ఉన్న అంశాలు మినహా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదనంగా ఒరగబెట్టిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కృష్ణా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాల సముదాయానికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన అరుణ్ జైట్లీ రాష్ట్రానికి ఏవైనా వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశించారన్నారు. అయితే ఎలాంటి వరాల జల్లు కురిపించకపోగా విభజన చట్టంలో ఉన్న అంశాలను వల్లె వేస్తూ ఏపీకి కేంద్రం ఎంతో సాయం చేస్తోందన్నట్లుగా చెప్పుకొచ్చారని విమర్శించారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇచ్చామని, దుగరాజపట్నం పోర్టు పనులు పీపీపీ పద్ధతితో నిర్మించడానికి పరిశీలిస్తున్నట్లు గొప్పలు చెప్పారని, ఇవేమీ కేంద్రం ఏపీకి అదనంగా ఇచ్చినవి కావని, విభజన చట్టంలో ఉన్నవేనని అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఎందుకు గట్టిగా నిలదీయడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి సాయం అడగడం కూడా బిచ్చమెత్తుకునే రీతిలో టీడీపీ ధోరణి ఉందని ధ్వజమెత్తారు. అమరావతిలో ఇప్పటికే ప్రభుత్వం మూడుసార్లు శంకుస్థాపన కార్యక్రమాలను ఆర్భాటంగా నిర్వహించిందని, తాజాగా శుక్రవారం ఆర్థిక మంత్రి జైట్లీతో చేయించిన ప్రభుత్వ భవనాల సముదాయ శంకుస్థాపన కార్యక్రమం కూడా అలాంటి ప్రచారార్భాటమేనని అన్నారు. -
హక్కుల కోసమే ఈ పోరు
సందర్భం కార్మిక సంఘాలను కలవడం, వారితో మాట్లాడటమంటేనే చంద్రబాబుకు పరమ చికాకుగా ఉంది. రోజూ విదేశీ వ్యాపార ప్రతినిధులతో మాట్లాడటానికి, వారికి రెడ్ కార్పెట్ పరచి ఆహ్వానం పలకడానికి మాత్రం బోలెడంత తీరికసమయం ఉంది. తమ హక్కుల సాధన కోసం కార్మికులు దేశవ్యాప్తంగా రోడ్డెక్కి సమ్మెచేసి సెప్టెంబర్ 2వ తేదీ నాటికి సరిగ్గా ఏడాది కాలం పూర్తవుతుంది. నిరంతర ధరల పెరుగుదల, తీవ్రమవుతున్న నిరుద్యోగం, ఉపాధి కోల్పో వడం, నిజవేతనాల తగ్గుదల, పరిశ్రమల మూసివేత, వ్యవ సాయ సంక్షోభాల యొక్క వ్యక్తీకరణే సెప్టెంబర్ 2 సమ్మె. కేంద్రంలో, రాష్ట్రంలో నూతన ప్రభుత్వాలు ఏర్పడి రెండేళ్ల కాలం దాటింది. ఎన్నికల ముందు దేశ ప్రజలకు మరీ ముఖ్యంగా కార్మిక వర్గానికి ఎన్నో వరాలు ప్రకటిం చారు. వాటిని తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని తమతమ ఎన్నికల ప్రణాళికల్లోనూ పేర్కొన్నారు. అధికార పగ్గాలు చేపట్టగానే తమ కర్కశమైన మొదటి దాడిని కార్మిక వర్గంపైనే ప్రారంభించారు. నరేంద్రమోదీ అధికారంలోకి రాగానే జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గతంలో యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టిన కీలకమైన డిమాండ్లతోపాటు.. కార్మిక చట్టాలకు చేయదల్చిన సవరణ లను వెంటనే విరమించాలని విన్నవించడమైంది. కానీ కార్మిక సంఘాలతో సంప్రదించకుండా, పార్లమెంటుతో సంబంధం లేకుండా ఆర్డినెన్స్‌లతో ఎఫ్‌డీఐలకు తలుపులు తెరిచి భారత ఆర్థిక వ్యవస్ధను పరాధీనం చేశారు. ఇది చాలదన్నట్లు కేంద్రప్రభుత్వం ఆలోచనలకు అను గుణంగా, వారి చెప్పుచేతల్లో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్న కార్మిక చట్టాలను నీరుగార్చడానికి సవరణలు తెచ్చి 100కు 70 మందికిపైగా కార్మికులను చట్టపరిధిలోకి రాకుండా యజమానుల దయా దాక్షిణ్యాలకు కార్మికులను బలిపెట్టే విధంగా ఆయా రాష్ట్రాల్లో ఆమోదం పొందారు. విశాఖ జిల్లా బ్రాండెక్స్, అనంతపురం జిల్లా రావతార్, నెల్లూరు లోని కృష్ణపట్నం పోర్టు, శ్రీకాళహస్తిలోని ల్యాంకో, శ్రీకాకుళం జిల్లాలోని అరబిందో, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని సిమెంటు ఫ్యాక్టరీలు తదితర పరిశ్రమల్లో కార్మికులపై, కార్మిక సంఘాలపై జరుగుతున్న దాడులకు, కక్ష సాధింపు చర్యలకు స్ఫూర్తి ఇక్కడినుంచే ప్రారంభం అవుతోంది. ధర్నాల్లో పాల్గొంటే ఉద్యోగాల నుంచి తొలగించే విధంగా స్కీం వర్కర్లకు వ్యతిరేకంగా నేరుగా ఆదేశాలు ఇవ్వడం బాబు నిరంకుశ విధానానికి పరాకాష్టగా అభివర్ణించవచ్చు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సెస్సును తమ రాజకీయ ప్రచారానికి విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. చంద్రన్న చలవ పందిళ్ళు, ప్రజలంద రికీ వేసవిలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ, మేడే సందర్భంగా పారిశ్రామికవేత్త లకు సన్మానాలు, ట్రాన్స్‌పోర్టు కార్మి కుల భీమా పథకం కోసం చెల్లించిన ప్రీమియం, చంద్రన్న భీమా పథకం ప్రీమియంతో సహా ప్రభుత్వం తన రాజ కీయ ప్రచారానికి చేపడుతున్న అన్ని పథకాలకు భవన నిర్మాణ కార్మికుల సెస్సు నిధిని వాడేస్తున్నారు. బాబువస్తే జాబు వస్తుందని ఆశించిన యువతకు ఈ పాలన తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేయలేదు. అంతే కాకుండా ప్రభుత్వమే తన శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. గృహ నిర్మాణ శాఖ లోని వేలాదిమంది వర్క్ ఇన్స్పెక్టర్లు, ఉపాధి హామీ శాఖ లోని ఫీల్డ్ అసిస్టెంట్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖలోని వేలాది మంది చిరుద్యోగులు, ఆరోగ్యమిత్ర, ఐకేపీ రంగాల్లోని వేలాదిమంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఫెర్రో ఎల్లాయిస్, జూట్, కో ఆపరేటివ్ షుగర్స్, పేపర్ తదితర రంగాల్లో అనేక పరిశ్రమలు మూతపడి వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు, కార్మికులకు తగిన నష్టపరిహారం ఇప్పించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యా తీసుకోలేకపోవడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం యజమానుల తొత్తుగా, పెట్టుబడికి తివాచీ పరిచే దళారీగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నాం. తక్షణమే ఈ క్రింది న్యాయమైన కోర్కెలు ఆమో దించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 1. రాష్ట్రంలోని కార్మికులందరికి రూ.18,000 కనీస వేతనం ఉండేట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 2. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసి వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 3. అసంఘటితరంగ కార్మికులందరికీ సమగ్ర చట్టం చేయాలి. 4. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలన్నింటినీ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో భర్తీ చేయాలి. 5. ఆశా, ఐకేపీ మధ్యాహ్న భోజన కార్మికులకు తక్షణం నెలకు రూ.5 వేలు చెల్లించాలి. 6. మూతపడిన పరిశ్రమలను తెరిపించడానికి తక్షణం చర్యలు తీసుకుని అవసరమైన రాయితీలు ఇవ్వాలి. 7. మున్సిపాలిటీల్లో 279 జీవో అమలును నిలిపి వేయాలి. రాత్రి షిప్టుల్లో మహిళలచే పనిచే యించడం నిలిపివేయాలి. 8. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధిని దారి మళ్లించ కుండా తగు చర్యలు చేపట్టాలి. కార్మిక వర్గంపై కత్తులు దూస్తున్న పాలకుల నిరంకుశ ఏకపక్ష ప్రజా వ్యతిరేక విధానాలపై మరోమారు సమర శంఖం పూరించాలని 50 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత, సర్వీసు రంగ కార్మికుల పక్షాన అన్ని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు సెప్టెంబర్ 2న జరుపతలపెట్టిన సార్వత్రిక సమ్మెకు వై.యస్.ఆర్. ట్రేడ్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. (సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల, ఫెడరేషన్ల సార్వత్రిక సమ్మె సందర్భంగా) వ్యాసకర్త డా. పి.గౌతమ్ రెడ్డి, ఏపీ రాష్ర్ట అధ్యక్షులు, వై.యస్.ఆర్. ట్రేడ్ యూనియన్ 98481 05455 -
ప్రత్యామ్నాయం చూపండి : ఎమ్మెల్యే
ఆత్మకూరురూరల్ : ఏఎస్‌పేట దర్గా వద్ద రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించనున్న దుకాణదారులకు ప్రత్యామ్నాయం చూపాలని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ వెంకటరమణను కోరారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆర్డీఓతో సమావేశమయ్యారు. దుకాణదారులకుS కొంతసమయం ఇవ్వాలని గౌతమ్‌రెడ్డి కోరారు. ఆర్డీఓ మాట్లాడుతూ తొలగించనున్న దుకాణదారుల కోసం సమీపంలోని పంచాయతీ స్థలంలో కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దత్తత తీసుకున్న కంపసముద్రం గ్రామంలో ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనులను త్వరగా మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆయన వెంట మల్లు సుధాకర్‌రెడ్డి, ఏఎస్‌పేట నాయకులు వీజీఆర్ సుబ్బారెడ్డి, బోయిళ్ల చెంచురెడ్డి, నంది హజరత్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి ఉన్నారు. ç -
రెండువేల ఎకరాల్లోనే బందరు పోర్టు నిర్మించాలి
గతంలో ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాట ప్రకారమే పోర్టు నిర్మించాలి విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకే 1.05లక్షల ఎకరాలు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.గౌతంరెడ్డి విజయవాడ (గాంధీనగర్) : ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు చెప్పిన విధంగా బందరు పోర్టును రెండు వేల ఎకరాల్లో నిర్మించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూనూరు గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అవినీతికి అంతులేకుండా పోతోందని, అబద్ధాలతో చంద్రబాబు రోజులు గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా పోర్టు నిర్మాణానికి భూములు తీసుకోవడానికి వీల్లేదు, 2వేల నుంచి 4వేల ఎకరాలు సరిపోతుందని చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఆయన నాలుక నాలుగు రకాలుగా మడత పెట్టగలడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి బందరు పోర్టు పేరుతో 1.05 లక్షల ఎకరాలు పూలింగ్ విధానంలో రైతుల నుంచి లాక్కునేందుకు సన్నద్ధమవుతున్నారన్నారు. కేబినెట్లో నిర్ణయాలు ఒక రకంగా, బయటకు వచ్చి మీడియా ఎదుట మరో రకంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రాజధాని పేరుతో 33వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కున్న చంద్రబాబు, జిల్లాల్లోని అసైన్డ్, పోరంబోకు, దేవాలయాలకు చెందిన లక్షల ఎకరాలు కైంకర్యం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని చెప్పారు. పోర్టు పేరుతో భూములు లాక్కుని సింగపూర్, జపాన్ కంపెనీలకు కట్టబెడితే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్రం ఎందుకు అడ్డుకోవడం లేదు.. చంద్రబాబు చైనా పర్యటనలో అక్కడి కంపెనీలతో చేసుకున్న రహస్య ఒప్పందాలు బహిర్గతం చేయాలని గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. ఇతర దేశాలతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుని భారత్ భూభాగంలోని పోర్టులు, భూములు అప్పగిస్తుంటే మోదీ ప్రభుత్వం కళ్లు మూసుకుందా? అని ప్రశ్నించారు. ఒప్పందాలను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఉందన్నారు. మంత్రులు డూడూ బసవన్నలు మంత్రులు డూడూ బసవన్నల్లా తలూపుతున్నారు. గొర్రెల్లా తల ఒంచుకుని వెళ్తున్నారు. రాష్ట్ర మంత్రులకు ఏమాత్రం విలువలేదని గౌతంరెడ్డి అన్నారు. మంత్రులతో నిమిత్తం లేకుండా చంద్రబాబే నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. పురాతన కోర్టులో పనిచేయడం అదృష్టం జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు మచిలీపట్నం : న్యాయవ్యవస్థలో ఎంతో చరిత్ర కలిగిన మచిలీపట్నంలోని జిల్లా కోర్టులో పనిచేయడం తన అదృష్టమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు అన్నారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పరిచయ కార్యక్రమం మచిలీపట్నం బార్ అసోసియేషన్ హాలులో మంగళవారం జరిగింది. బార్ అధ్యక్షుడు కూనపరెడ్డి శ్రీనివాసరావు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని న్యాయవాదులకు పరిచయం చేశారు. అసోసియేషన్ తరఫున జిల్లా ప్రధాన న్యాయమూర్తిని సన్మానించారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
8 ఎకరాల ఆసామి..83 ఎకరాలు కొనడమా? : గౌతంరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : సదావర్తి సత్రం భూములుకొన్న చలమలశెట్టి నిరంజన్‌బాబుకు కృష్ణాజిల్లా కలిదిండిలో కేవలం 8 ఎకరాల 69 సెంట్లు భూమి మాత్రమే ఉందని, అలాంటి వ్యక్తి ఒక్కసారిగా 83 ఎకరాలు ఎలా కొన్నారో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పి.గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. సత్రం భూముల కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ విచారణ జరిపించాలని, తాము ఆధారాలతో సహా ఆ కుంభకోణాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన సవాలు విసిరారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను తాము సేకరించామన్నారు. విదేశాల్లో తమ మిత్రులు పంపిన డబ్బుతో ఈ భూములు కొన్నామని నిరంజన్ తండ్రి రామానుజయ చెబుతున్నారని, అలాంటపుడు ఫెమా చట్టంలోని సెక్షన్ 4ను అనుసరించి చర్యలెందుకు తీసుకోలేదు? ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. బహిరంగ విచారణ నిర్వహిస్తే లోకేశ్‌కు విదేశాల్లో ఉన్న స్నేహితులె వరో ఆయన బండారం ఏమిటోలో తాము బయట పెడతామని విచారణకు చంద్రబాబుగాని, ఆయన శిష్యులుగాని రావాలని గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. -
'కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం'
కృష్ణా: కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతంరెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లాలోని చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కౌలు రైతులు తీవ్ర అవస్తలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రావుతో పాటు పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. -
'ముద్దాయిలకు షెల్టర్‌జోన్‌గా బెజవాడ'
-
వైసిపి నేత గౌతంరెడ్డి అరెస్ట్
-
విభజన జ్వాల
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ రెండోరోజు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జిల్లా బంద్ సంపూర్ణంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల జాతీయ రహదారులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు దిగ్బంధించడంతో వాహనాలు బారులు తీరాయి. గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాం కులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు దగ్గరుండి మూయించారు. ముం దు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ సర్వీసులను డిపోల నుంచి కదలనీయలేదు. బంద్ సందర్భంగా నెల్లూరు నగరంతో పాటు ముఖ్య పట్టణాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆత్మకూరులో మేకపాటి గౌతంరెడ్డి సహా మేరిగ మురళీధర్, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ కూడలిలో గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నెల్లూరురూరల్ నియోజకవర్గంలోని రామలింగాపురం, హరనాథపురం, వీఆర్సి సెంటర్, మద్రాసు బస్టాండ్, ఆర్టీసీ, కేవీఆర్ పెట్రోలు బంక్, దర్గామిట్ట, వేదాయపాళెం, బీవీనగర్ తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మోటారు సైకిళ్ల ర్యాలీ జరిగింది. ఆత్మకూరు మండలం నెల్లూరు పాళెం వద్ద నెల్లూరు- ముంబయి రహదారిపై సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. మేకపాటి గౌతంరెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. మద్దూరుపాడు జాతీయ రహదారిని వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో దిగ్బంధించారు. సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమైక్యాంధ్ర కోసం పట్టణంలోని విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ బాలచెన్నయ్య, పాశం సునీల్‌కుమార్‌లు గూడూరులో బంద్‌ను పర్యవేక్షించారు. పోటుపాళెం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్సార్సీపీ పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలులో రెండో రోజు శనివారం రాస్తారొకో నిర్వహించారు. మండల కన్వీనర్ పచ్చిపాల జయరామిరెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలు మూయించారు.వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన బంద్‌ను సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు పర్యవేక్షించారు. అనంతరం బాలాయపల్లి మండలంలో గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమానికి హాజరయ్యారు. తడలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నెలవల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయుడుపేటలో సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సూళ్లూరుపేటలో బంద్ పాటించారు.