సాక్షి, నెల్లూరు: సోమశిల హైలెవల్ కెనాల్ రెండో ఫేజ్ పనులు త్వరలోనే పూర్తి చేసి.. దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో వానలు లేవు.. నీళ్లు లేవని.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు. జలవనరుల శాఖ మంత్రిగా మన జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ యాదవ్ ఉండటం సంతోషకరమన్నారు.
సోమశిల నుంచి నీటిని విడుదల చేసిన మంత్రులు..
సోమశిల జలాశయం నుంచి కండలేరు జలాశయానికి మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి మంగళవారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వర ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment