Somasila reservoir
-
ఏపీ,తెలంగాణ మధ్య మరో సమస్య!
-
పుష్ప సినిమా సీన్.. రియల్‌గా ఎక్కడంటే?
ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో ఓ సీన్ ఇది. ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు ఓ ప్రదేశంలో దాచి ఉంచుతారు. ఆ ప్రదేశం గురించి పోలీసులు తెలుసుకుంటారు. వారు అక్కడికి వెళ్తున్న సమాచారం స్మగ్లర్లకు చేరడంతో ఆ సినిమా హీరో, మరికొందరు వెంటనే దుంగలను పక్కనే ఉన్న నీటి ప్రవాహంలోకి నెట్టేస్తారు. హీరో తన అనుచరుడి ద్వారా జలాశయ అధికారికి ముడుపులిచ్చి గేట్లు మూయించేస్తాడు. ఈ సీన్ మొత్తం రక్తి కట్టిస్తుంది. ఇలాంటి సీన్ జిల్లాలోని సోమశిల జలాశయంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు విలువైన దుంగలను నరికించి ఎవరికీ అనుమానం రాకుండా జలాశయంలో దాచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. సాక్షి, నెల్లూరు: జిల్లా జలనిధిగా ఉన్న సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతం ఎక్కవ భాగం వైఎస్సార్ జిల్లాలో ఉంది. రెండు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఆ ప్రాంతంలో రిజర్వు ఫారెస్ట్ సుమారు 48 చదరపు కి.మీ విస్తరించి ఉంది. ఆ ఫారెస్ట్‌లో ఎర్రచందనం వృక్షాలున్నాయి. నాణ్యత కలిగిన దుంగలు ఇక్కడ లభిస్తుండడంతో అక్రమార్కులు ఆ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నారు. దీనికితోడు జలాశయ లోతట్టు ప్రాంతం కావడంతో రవాణా మార్గానికి అనువుగా ఉండదు. దీంతో అటవీ, పోలీస్ శాఖల అధికారులు ఆ వైపు వెళ్లేందుకు ఇష్టపడరు. దీంతో స్మగ్లర్లు రెచ్చిపోతుంటారు. తమ పరిధి కాదంటూ.. గతంలో సోమశిల జలాశయంలో ఓ ఇంజినీర్ లోతట్టు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి గేటు తాళం తనవద్దే ఉంచుకుని అక్రమ చేపల వేటకు, ఎర్ర స్మగ్లర్లకు రాత్రి వేళల్లో సహకరించి అధికారులకు దొరికిన సందర్భం ఉంది. కానీ ఆ అధికారి రాజకీయ పరపతితో కేసు లేకుండా తప్పించుకోగలిగాడు. మూడు రోజుల క్రితం 11 దుంగలు జలాశయంలో బయటపడ్డాయి. వాస్తవానికి దీని గురించి ముందే తెలిసినా అటవీశాఖ, పోలీస్ అధికారులు ఎవరికి వారు తమ పరిధిలో కాదంటూ పట్టించుకోలేదు. తాజాగా దుంగల ఫొటోలతో సహా సోషల్ మీడియాలో రావడంతో హడావుడిగా స్వాధీనం చేసుకున్నట్లుగా అటవీ శాఖ ప్రకటించింది. ఇలా చేస్తున్నారు.. జలాశయం లోతట్టు ప్రాంతంలో ఇరువైపులా చేపలు పట్టే జాలర్లు ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఉంటూ చేపలు పట్టి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. స్థానికంగా ఎర్ర స్మగ్లర్లకు సహకరించే వ్యక్తుల ద్వారా కొందరు జాలర్లతో పరిచయం పెంచుకుని వారి ద్వారా పడవలో లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అలాగే తమిళ కూలీలను కూడా ఇదే పద్ధతిలో చేర్చి ఎర్ర వృక్షాలను నరికిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దుంగలను జలాశయం లోతట్టు కోనల్లోని నీటిలో నిల్వ ఉంచుతారని చెబుతున్నారు. ఒకవేళ అధికారులు దాడులు చేసినా కనిపించని విధంగా నీటిలో డంపింగ్ చేస్తారు. వారికి అనువైన సమయంలో ఆ డంప్‌ను రవాణా చేసుకుంటారు. ఇలా విలువైన సంపద తరలిపోతున్నా అధికారుల్లో చలనం లేదనే విమర్శలున్నాయి. పక్కా సమాచారం ఉన్నా.. స్థానికంగా ఉన్న ఎర్ర అక్రమార్కుల సహకారంతోనే దుంగలు తరలుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఎవరు దొంగలో కూడా స్థానిక అటవీ, పోలీస్ శాఖకు పక్కా సమాచారం ఉంది. అయితే అక్రమార్కులతో ఉన్న లోపాయికారి ఒప్పందంతో వారు పట్టుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఏదైనా ఒత్తిడి వచ్చినా, సమాచారం బహిరంగమైతే అప్పటికప్పుడు అధికారులు నాణ్యత లేని దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ప్రచారం ఉంది. మూడు రోజుల క్రితం జరిగిన దుంగల విషయంలో కూడా అధికారులు పట్టించుకోకపోగా సమాచారం ఇచ్చిన మీడియాపై రుసరుసలాడడం వారి లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీరు చెబితే సస్పెండ్ చేయాలా? సోమశిల జలాశయంలో ఎర్రచందనం దుంగల డంప్‌పై మీడియా సమాచారం ఇస్తే వెంటనే మేము స్థానిక అధికారులను సస్పెండ్ చేయాలా?. మూడు రోజల క్రితం జరిగింది అని చెబుతున్నారు. అవన్ని మేము పరిశీలిస్తాం. విచారణ జరిపిస్తాం. – షణ్ముగకుమార్, డీఎఫ్ఓ, నెల్లూరు -
సోమశిల రెండో దశకు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-2కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-2కు వర్చువల్ విధానంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. కాగా.. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ -1 నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా.. 460 కోట్ల రూపాయల వ్యయంతో ఫేజ్-2 నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కాలువ పనులు పూర్తయితే మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వింజమూరు, దుత్తల్లూరు, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలకు నీరు పుష్కలంగా అందుతుంది. దశాబ్దాల కాలంగా మెట్ట ప్రాంత వాసులు కలలుగన్న సాగునీటి సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని ఆ ప్రాంతవాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వ్యవసాయం, నీటి విలువ తెలిసిన ప్రభుత్వం మాది. సోమశిల రెండో దశ ద్వారా సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గతంలో సోమశిలను ఎన్నికల కోసం హడావుడిగా ప్రారంభించారు. అవినీతి లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాం. సోమశిల హైలెవల్ ప్రాజెక్ట్‌లో రివర్స్ టెండరింగ్ ద్వారా 68 కోట్ల రూపాయలు ఆదా చేసి.. గత ప్రభుత్వం అవినీతికి చెక్ పెట్టాం. సంగం బ్యారేజీ, పెన్నా బ్యారేజ్ పనులు ఈ ఏడాది పూర్తిచేసి, జనవరిలో నెల్లూరుకి అంకితం ఇస్తాం. కండలేరు కాలువ దుబ్లింగ్ పనులు, సోమశిల ఉత్తర కాలువ డబ్లింగ్ పనులు ప్రారంభిస్తాం. 2022 ఖరీఫ్ సీజన్‌కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. 2021లో ఆరు ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నాం. కృష్ణా నది దిగువ బ్యారేజీలకు వేగవంతంగా అడుగులు వేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు పూర్తి చేస్తాం. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రూ.40 వేల కోట్లతో కరువు నివారణ చర్యలు చేపడుతున్నాం అని సీఎం జగన్ తెలిపారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం వద్ద సోమశిల హైలెవల్ కెనాల్ పేజ్-2 పనుల ప్రారంభంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సోమశిల హైలెవల్ కెనాల్ ఈ ప్రాంత రైతుల కల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో ఆలోచించి హైలెవల్ పేజ్ 2ను ప్రారంభిస్తున్నారు. వెలిగొండ కూడా పూర్తయితే కరువు ప్రాంతమైన ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి. ముఖ్యమంత్రి పాదం పెట్టిన వేళా విశేషం రాష్ట్రం సుభిక్షంగా ఉంది. సోమశిల హైలెవల్ ఫేజ్- 2, వెలిగొండ ప్రాజెక్ట్స్ పూర్తయితే ఇక సస్యశ్యామలమే. త్వరలో చాగోలు రిజర్యాయర్ కూడా పూర్తి చేస్తాం. పదేళ్ల తరువాత నెల్లూరు జిల్లాలో వరదలు పోటెత్తాయి. పెన్నా నుంచి 100 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది' అని అన్నారు. ఈ దశలో దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మండలాల్లో 46,453 ఎకరాలకు నీళ్లందించనున్నారు. నెల్లూరు జిల్లాలో వర్షాభావ ప్రాంతంలో ఉన్న అనంతసాగరం, మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, ఆత్మకూరు మండలాల్లో సాగు, తాగునీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమశిల జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి.. తాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు ఈ మండలాల్లో 90 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి దశ కింద 43,547 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. రూ.840.72 కోట్ల వ్యయం కాగల పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఇప్పటివరకు రూ.572.11 కోట్లను ఖర్చు చేసింది. అటవీ శాఖకు చెందిన 4.28 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియను పూర్తి చేసి.. మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. -
‘సోమశిల రెండో దశ’కు నేడు శ్రీకారం
సాక్షి, అమరావతి: సోమశిల రిజర్వాయర్ జలాలతో నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సోమశిల హైలెవల్ లిఫ్ట్ కెనాల్ (ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ) రెండో దశ పనులకు సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ దశలో దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మండలాల్లో 46,453 ఎకరాలకు నీళ్లందించనున్నారు. నెల్లూరు జిల్లాలో వర్షాభావ ప్రాంతంలో ఉన్న అనంతసాగరం, మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, ఆత్మకూరు మండలాల్లో సాగు, తాగునీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమశిల జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి.. తాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు ఈ మండలాల్లో 90 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి దశ కింద 43,547 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. రూ.840.72 కోట్ల వ్యయం కాగల పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఇప్పటివరకు రూ.572.11 కోట్లను ఖర్చు చేసింది. అటవీ శాఖకు చెందిన 4.28 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియను పూర్తి చేసి.. మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. శరవేగంగా పూర్తికి ప్రణాళిక ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ తొలి దశలో మిగిలిన పనులతో పాటు రెండో దశ పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించింది. బడ్జెట్లో నిధుల కేటాయింపులకుతోడు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది. రివర్స్ టెండరింగ్‌తో రూ.67.9 కోట్లు ఆదా 2014లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ తొలి దశ పనులను పూర్తి చేయడంలో విఫలమైంది. కాగా ఎన్నికలకు ముందు కమీషన్ల కోసం, ఓట్ల కోసం ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ రెండో దశ పనులకు రూ.503.37 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపిక చేసిన సంస్థకు రూ.4.79 శాతం అధిక ధర (రూ.527.53 కోట్లకు)కు అప్పగించింది. అంటే ఖజానాపై రూ.24.16 కోట్ల భారం వేసిందన్నమాట. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. అయినప్పటికీ ఈ పనులకు సంబంధించి తట్టెడు మట్టి కూడా ఎత్తకపోవడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ రెండో దశ టెండర్‌ను రద్దు చేసింది. టీడీపీ సర్కార్ నిర్ణయించిన రూ.503.37 కోట్ల అంచనా వ్యయంతోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. రివర్స్ టెండరింగ్‌లో 8.69 శాతం తక్కువ ధరకు అంటే రూ.459.63 కోట్లకు కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. టీడీపీ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు 8.69 శాతం తక్కువ ధరకు అప్పగించడం వల్ల మొత్తంమీద 13.48 శాతం తక్కువ ధరకే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినట్లయింది. దీని వల్ల ఖజానాకు రూ.67.9 కోట్లు ఆదా అయ్యాయి. చదవండి: రూ. 820 కోట్లతో ఎన్‌హెచ్–167కె నిర్మాణం -
సోమశిల జలాశయానికి పెరుగుతున్న నీరు
-
దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తాం..
సాక్షి, నెల్లూరు: సోమశిల హైలెవల్ కెనాల్ రెండో ఫేజ్ పనులు త్వరలోనే పూర్తి చేసి.. దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో వానలు లేవు.. నీళ్లు లేవని.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు. జలవనరుల శాఖ మంత్రిగా మన జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ యాదవ్ ఉండటం సంతోషకరమన్నారు. సోమశిల నుంచి నీటిని విడుదల చేసిన మంత్రులు.. సోమశిల జలాశయం నుంచి కండలేరు జలాశయానికి మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి మంగళవారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వర ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు పాల్గొన్నారు. -
సోమశిలలో 38.394 టీఎంసీలు
సోమశిల: సోమశిల జలాశయంలో శనివారం 38.394 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3,167 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు విడుదలవుతున్న నీటిని నిలుపుదల చేశారు. ఉత్తర కాలువకు 325 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 250 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 93.772 మీటర్లు, 307.65 అడుగు మట్టం నమోదైంది. సగటున 138 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది. -
సోమశిలకు 8646 క్యూసెక్కులు
జలాశయంలో 37.508 టీఎంసీల నీరు నిల్వ సోమశిల: బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు సోమశిల జలాశయానికి మంగళవారం 8,646 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో 37.508 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు విడుదలవుతున్న నీటిని నిలుపుదల చేశారు. అలాగే ఉత్తర, దక్షిణ కాలువలకు కూడా నిలిపి వేశారు. ప్రస్తుతం జలాశయంలో 93.555 మీటర్లు , 306.501 అడుగు మట్టం నమోదైంది. జలాశయం వద్ద 18 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
నీటి పంపిణీని పెంచాలి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): పెన్నా డెల్టాకు సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీటి పంపిణీని పెంచాలని జిల్లా రైతు సంక్షేమ సమాఖ్య నాయకులు కోరారు. ఈ మేరకు హరనాథపురం ఇరిగేషన్ కార్యాలయంలో ఎస్ఈ కోటేశ్వరరావుకు బుధవారం వినతిపత్రం అందజేసిన అనంతరం సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ గోవిందరెడ్డి మాట్లాడారు. సోమశిల ప్రాజెక్ట్ కింద పెన్నా డెల్టా ప్రథమ హక్కును కలిగి ఉందన్నారు. పెన్నా డెల్టాలోని 2.5 లక్షల ఎకరాలకు 3500 క్యూసెక్కులను విడుదల చేసినా, ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఏ చెరువుకు గానీ, డైరెక్ట్ ఆయకట్టుకు గానీ నీరు అందడంలేదని తెలిపారు. సమస్యను గుర్తించి తక్షణమే సోమశిల ప్రాజెక్ట్ నుంచి రోజుకు ఐదు వేల క్యూసెక్కులను విడుదల చేయాలని కోరారు. గత ఐఏబీ తర్వాత ప్రాజెక్ట్‌లోకి అదనంగా ఐదు టీఎంసీల నీరు చేరిందని, అప్రువ్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఖరీఫ్ పంటకు ఏయే కాలువలకు ఎంత దామాషా ప్రకారం ఇవ్వాల్సి ఉందో ఆ కేటాయింపులను కచ్చితంగా పాటించాలని కోరారు. జిల్లా రైతు సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు ఓబిలి గోవిందరెడ్డి, జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, కోశాధికారి నిరంజన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సోమశిలలో 40.02 టీఎంసీలు
సోమశిల: సోమశిల జలాశయంలో మంగళవారం సాయంత్రానికి 40.026 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3451 క్యూసెక్కుల వంతున నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 4150 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే జలాశయం నుంచి ఉత్తర కాలువకు 400క్యూసెక్కులు, దక్షిణ కాలులవకు 350 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 94.171 మీటర్లు, 308.97 అడుగు మట్టం నమోదైంది. సగటున 137 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృధా అవుతోంది. -
సోమశిలలో 40.450 టీఎంసీలు
సోమశిల: సోమశిల జలాశయంలో బుధవారం సాయంత్రానికి 40.450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3360 క్యూసెక్కుల వంతున నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 3500 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 94.275 మీటర్లు, 309.30 అడుగు మట్టం నమోదైంది. సగటున 149 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది. -
సోమశిల జలాశయంలో 39.042 టీఎంసీలు
సోమశిల: సోమశిల జలాశయంలో «శుక్రవారం నాటికి 39.042 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 3035 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 93.930 మీటర్లు 308.17 అడుగుల నీటి మట్టం నమోదైంది. సగటున 153 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది. -
సోమశిల జలాశయంలో 37.533 టీఎంసీలు
సోమశిల{ సోమశిల జలాశయంలో శుక్రవారం నాటికి 37.533 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 1875 క్యూసెక్కుల వంతున వరద నీరు వచ్చి చేరుతోంది.ప్రస్తుతం జలాశయంలో 93.561 మీటర్లు, 306.96 అడుగుల నీటిమట్టం నమోదైంది. సగటున 150 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది. -
సోమశిలో 37.247 టీఎంసీల నీరు
సోమశిల : సోమశిల జలాశయంలో బుధవారం 37.247 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 1,737 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 93.491 మీటర్లు 306.73 అడుగుల మట్టం నమోదైంది. సగటున 151 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. -
సోమశిలలో 36.786 టీఎంసీల నీరు నిల్వ
సోమశిల: సోమశిల జలాశయంలో ఆదివారం 36.786 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 2175 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 93.379 మీటర్లు 306.36 అడుగుల మట్టం నమోదైంది. సగటున 150 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. -
సోమశిలో 33.071 టీఎంసీలు నీరు
సోమశిల : సోమశిల జలాశయంలో శనిæవారం నాటికి 33.071 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పెతట్టు ప్రాంతాల నుంచి 2,656 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 700 క్యూసెక్కుల వంతున నీరు విడుదల చేస్తున్నారు. దక్షిణ కాలువకు 100 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 92.421 మీటర్లు 303.22 అడుగుల మట్టం నమోదైంది. సగటున 143 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. -
సోమశిలలో 32.617 టీఎంసీలు
ఆత్మకూరు రూరల్: సోమశిల జలాశయంలో గురువారం నాటికి 32.617 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 4937 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండగా, జలాశయం నుంచి పెన్నార్‌డెల్టాకు 500 క్యూసెక్కులు, దక్షణ కాలువకు 100 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 92.300 మీటర్లు, 302.82 అడుగుల నీటిమట్టం ఉంది. -
సోమశిలలో 30.949 టీఎంసీలు
సోమశిల: సోమశిల జలాశయంలో ఆదివారం నాటికి 30.949 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 11,493 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 500 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 100 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 91.851 మీటర్లు 301.35 అడుగుల నీటి మట్టం ఉంది. సగటున 129 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథావుతోంది. -
సోమశిలో 29.41 టీఎంసీలు
సోమశిల: సోమశిల జలాశయంలో శుక్రవారం నాటికి 29.417 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 7,897 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 500 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 100 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 91.440 మీటర్లు, 300 అడుగుల నీటి మట్టం ఉంది. సగటున 126 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వథావుతోంది. -
20 టీఎంసీలకు చేరువలో సోమశిల
సోమశిల: సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంత నుంచి వస్తున్న వరద ప్రవాహం ఆదివారం సాయంత్రం తగ్గు ముఖం పట్టింది. జలాశయానికి ఉదయం 18 వేల క్యూసెక్కుల వంతున వస్తున్న వరద ప్రవాహం సాయంత్రానికి 13 వేలకు తగ్గింది. దీంతో జలాశయంలో నీటి నిల్వ 19.5 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన నంద్యాల సమీపంలోని రాజోలు వద్ద గల కుందూనది అనకట్ట వద్ద 5 వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహిస్తోంది. పెన్నానది ప్రధాన హెడ్ రెగ్యులేటర్ అయిన ఆదినిమ్మాయపల్లి వద్ద 12 వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహిస్తోంది. చెన్నూరు గేజి వద్ద 13,500 క్యూసెక్కుల వరద నమోదైంది.ప్రస్తుతం జలాశయంలో 88.07 మీటర్ల నీటి మట్టం ఉంది. వరద ప్రవాహం మరో 4 రోజలు కొనసాగవచ్చునని అధికారులు భావిస్తున్నారు. -
16 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ
సోమశిల జలాశయానికి 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సోమశిల : సోమశిల జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వచ్చి చేరడం వల్ల గురువారం సాయంత్రానికి 15.321 టీఎంసీలతో 16 టీఎంసీలకు చేరువలో ఉంది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల జ లాశయానికి మూడు రోజులుగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. నంద్యాల సమీపంలో గల రాజోలు ఆనకట్ట వద్ద కుందూ నది నుంచి ఉదయం 5 వేల క్యూసెక్కులు ఉన్న వరద సాయంత్రానికి 7 వేల క్యూసెక్కుల వంతున ప్రవహిస్తోంది. దీంతో పాటు వైఎస్సార్ జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల కడప సమీపంలో గల చెన్నూరు వద్ద ఉదయం 18 వేల క్యూసెక్కులు ఉన్న వరద మధ్యాహ్నానికి 27 వేలకు చేరింది. సాయంత్రానికి 30 వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం మరో రెండు రోజుల వరకూ కొనసాగవచ్చునని అధికారుల భావిస్తున్నారు. దీంతో ఈ వరదల వల్ల జలాÔ¶ యంలో నీటి నిల్వ 18 టీఎంసీలకు చేరవచ్చని అధికారుల అంచనా. -
సోమశిలకు మళ్లీ వరద
5500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సోమశిల: సోమశిల జలాశయం పైతట్టు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయానికి బుధవారం 5500 క్యూసెక్కుల వంతున ప్రవాహం వచ్చి చేరుతోంది. రెండు వేల క్యూసెక్కుల వంతున రెండు రోజులు క్రితం మొదలైన వరద అంచలంచెలుగా పెరుగుతోంది. వైఎస్సార్ జిల్లా చెన్నూరు వద్ద ఉదయం ఆరు వేల క్యూసెక్కుల వంతున ప్రవహించిన వరద, సాయంత్రానికి 8 వేల క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయంలో నీటి నిల్వ 14.304 టీఎంసీలకు చేరుకుంది. మరో టీఎంసీ వరకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 85.92 మీటర్లు, 281.89 అడుగుల నీటిమట్టం నమోదైంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 20 వరకు రెండో పంటకు నీరు జిల్లాలో రెండో పంటకు ఈ నెల 20 వరకు జలాశయం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. జిల్లా సాగునీటి సలహా మండలిలో తీసుకున్న నిర<యం మేరకు 1.75 లక్షల ఎకరాలతో పాటు అదనంగా సాగునీటి శాఖ మరో 50 వేల ఎకరాలను గుర్తించింది. గత నెల్లో జలాశయంలో నీరు డెడ్ స్టోరేజీకి చేరుతున్నా, రైతులకు నష్టం వాటిల్లకూడదనే ఆలోచనతో సాగునీటిని అందించాలని నిర్ణయించారు. అనూహ్యంగా పైతట్టు ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల దాదాపు 8 టీఎంసీల నీరు జలాశయానికి చేరింది. ఇప్పటి వరకు రెండో పంటకు 23.5 టీఎంసీలను విడుదల చేయగా, మరో 0.5 టీఎంసీల వరకు ఇచ్చే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. -
లీకేజీ.. టేకిటీజీ
సోమశిల జలాశయంలో రోజూ సుమారు 70 క్యూసెక్కులు వృథా అవుతున్న వైనం లీకేజీ అరికట్టలేక నీటి లెక్కల్లో జిమ్మిక్కులు 70 క్యూసెక్కులు.. రోజూ జిల్లా జలనిధి సోమశిల జలాశయం నుంచి వృథా అవుతున్న నీరు.. వినేందుకు నమ్యశక్యంగా లేకున్నా ఇది నిజం. లీకేజీని అరికట్టాల్సిన అధికారులు అసలు పనిచేయకుండా నీటి గణాంకాల్లో జిమిక్కులు చేస్తున్నారు. సోమశిల : సోమశిల జలాశయం పెన్నార్ డెల్టాకు నాలుగురోజుల క్రితం విడుదల నిలుపుదల చేవారు. అయితే స్లూయిజ్ గేట్ల నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ గేట్ల నుంచి సుమారు 70 క్యూసెక్కుల నీరు ధారాపాతంగా పోతోంది. ఈ విషయం ఉన్నతస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి అధికారుల వరకు తెలిసినా ఏ చర్య తీసుకోలేని దుస్థితి. ఈ స్లూయిజ్ గేట్ల ద్వారా విపరీతంగా లీకేజీ సమస్య ఉంది. గేట్ల వ్యవస్థ ప్రారంభం నుంచే ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. చూసేందుకు ఇది చిన్న సమస్యే అయినా అధికారుల చిత్తశుద్ధి లోపం ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి ఇది నిరదర్శంగా ఉంటుంది. దీంతో ప్రతిసంవత్సరం నీరు వృథా అవుతూనే ఉంది. స్లూయిజ్ గేట్లు మరమ్మతులకు గురై సంవత్సరాలు గడిచిచాయి. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రోలర్స్ కూడా మరమ్మతులు గురియ్యాయి. ఈ నేపథ్యంలో గేటు దిగడం గగనమైపోతోంది. దీంతో సుమారు 70 క్యూసెక్కులు ఒక్క రోజులోనే లీకేజీ రూపంలో వృథా అవుతున్నాయి. ఈ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ఓ మార్గం అన్వేషించారు. వృథా నీటిని ఆవిరి రూపంలో ఖర్చయ్యే నీటి లెక్కల్లో కలిపి చూపిస్తున్నారు. ఓ వైపు జలాశయం అడుగంటుతోంది. ఇంకా మరో 16 రోజులవరకు రెండో పంటకు నీరివ్వాలి. ఈ విషయాలన్నీ అధికారులకు తెలిసినా మౌనంగానే ఉంటున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం : దేశ్‌నాయక్, ఇన్చార్జి ఈఈ, సోమశిల సోమశిల గేట్ల లీకేజీ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కొంతమంది నిపుణుల బృందం కూడా వచ్చి పరిశీలించింది. అయినా ఇది దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్య. ఉన్నతాధికారులు దీనిని పరిశీలించారు. త్వరలోనే లీకేజీ అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం మార్గాలకు అన్వేషిస్తున్నారు. -
అడుగంటిన జలనిధి
కరుణించని వరుణుడు అందని కృష్ణా జలాలు ఆందోళన ఎడగారు రైతులు సోమశిల : జిల్లా జలనిధి సోమశిల జలాశయం రోజు రోజుకి అడుగంటుతోంది. జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు జిల్లా, తమిళనాడు ప్రజల దాహార్తిని తీర్చే జలాశయం డెడ్‌స్టోరేజ్‌కు చేరుకుంది. వరుణుడు కరుణించకపోవడానికి తోడు రెండో పంటకు పెరిగిన ఆయకట్టుతో జలాశయంలోని నీరు ఆవిరై పోయింది. ఎడగారు పూర్తవక ముందే జలాశయం అడుగంటడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా సాగునీటి సలహా మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు రెండో పంటకు పెన్నార్ డెల్టాలోని 1.76 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఐఏబీ సమావేశ సమయంలో జలాశయంలో 27.322 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది. రెండో పంటకు జలాశయం నుంచి 22 టీఎంసీలు ఇవ్వాలని తీర్మానించారు. జలాశయంలోని 18 టీఎంసీలు, ప్రధాన చెరువులైన కనిగిరి ,సర్వేపల్లి చెరువులలోని మరో 4 టీఎంసీలను రెండో పంటకు కేటాయించారు. రెండో పంట సాగు విస్తీర్ణం మరో 30 వేల ఎకరాలు పెరగడంతో పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇటీవల జలాశయం నుంచి మరో 5 టీఎంసీలు నీరు ఇవ్వాలని తీర్మానించారు. రెండో పంటకు ఇప్పటి వరకు జలాశయం నుంచి 19.5 టీఎంసీల నీరు విడుదల చేశారు. సెప్టెంబర్ 15 వరకు రెండో పంటకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం జలాశయంలో 7.800 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో 4 టీఎంసీలను ఎడగారుకు కేటాయిస్తే జలాశయంలో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్ (7.567 టీఎంసీలు) కన్నా పడిపోతుంది. వర్షాలు పడుతాయనే ఆశతో అధికారులు ఎడగారు పంట ఎండకుండా నీరు విడుదల చేస్తున్నట్లు సమాచారం. వరుణుడు కరుణించకపోతే పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. 22ఏళ్ల తరువాత డెడ్ స్టోరేజీ నుంచి నీరు విడుదల తీవ్ర వర్షాభావ పరిస్థితులతో 1994–95లో సోమశిల జలాశయం నుంచి జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని విడుదల చేశారు. అప్పట్టో జలాశయంలో నీటి నిల్వ 2.36 టీఎంసీలకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డెyŠ స్టోరేజీ నుంచి సాగుకు నీటిని విడుదల చేయాలని అధికారులు చూస్తున్నారు. వర్షాలు పడుతాయనే ఆశతో ఒక్క ఎకరా కూడా ఎండ కూడదని సాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కృష్ణా వరద ప్రవాహం రాకుండా, వరుణుడు కరుణించకపోతే తాగు నీటి ఎద్దడి పరిస్థితి ఎండమావే. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం–దేశ్ నాయక్,ఈఈ,సోమశిల సోమశిల జలాశయం డెడ్‌స్టోరేజ్‌కు చేరుకున్న విషయాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నాం. సెప్టంబర్లో కూడా సాగుకు నీరు అందించాల్సి ఉంది. కృష్ణా జలాలు, వర్షాలపై ఆశలు పెట్టుకుని సాగుకు నీటిని విడుదల చేస్తున్నాం. -
సోమశిలకు వరద ప్రవాహం
సోమశిల: రాయలసీమలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సోమశిలకు శనివారం వరద ప్రవాహం రావచ్చని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి పెన్నానది ఎగువ ప్రాంతాలైన వైఎస్సార్ జిల్లా చెన్నూరు గేజీ వద్ద 1000 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం కొనసాగుతోంది. కడపతో పాటు సిద్ధవటం, తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పెన్నానది ఉపనది అయిన సగిలేరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో జలాశయానికి శనివారం ఉదయం వరద ప్రవాహం చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. రెండో పంటకు ఇంకా సెప్టెంబరు వరకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నా సోమశిల జలాశయంలో నీటి నిల్వ 10.968 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం అడుగంటుతున్న తరుణంలో వరద ప్రవాహం కొనసాగనుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.