సోమశిలలో 32.617 టీఎంసీలు
ఆత్మకూరు రూరల్: సోమశిల జలాశయంలో గురువారం నాటికి 32.617 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 4937 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండగా, జలాశయం నుంచి పెన్నార్‌డెల్టాకు 500 క్యూసెక్కులు, దక్షణ కాలువకు 100 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 92.300 మీటర్లు, 302.82 అడుగుల నీటిమట్టం ఉంది.