16 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ
-
సోమశిల జలాశయానికి 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సోమశిల : సోమశిల జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వచ్చి చేరడం వల్ల గురువారం సాయంత్రానికి 15.321 టీఎంసీలతో 16 టీఎంసీలకు చేరువలో ఉంది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల జ లాశయానికి మూడు రోజులుగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. నంద్యాల సమీపంలో గల రాజోలు ఆనకట్ట వద్ద కుందూ నది నుంచి ఉదయం 5 వేల క్యూసెక్కులు ఉన్న వరద సాయంత్రానికి 7 వేల క్యూసెక్కుల వంతున ప్రవహిస్తోంది. దీంతో పాటు వైఎస్సార్ జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల కడప సమీపంలో గల చెన్నూరు వద్ద ఉదయం 18 వేల క్యూసెక్కులు ఉన్న వరద మధ్యాహ్నానికి 27 వేలకు చేరింది. సాయంత్రానికి 30 వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం మరో రెండు రోజుల వరకూ కొనసాగవచ్చునని అధికారుల భావిస్తున్నారు. దీంతో ఈ వరదల వల్ల జలాÔ¶ యంలో నీటి నిల్వ 18 టీఎంసీలకు చేరవచ్చని అధికారుల అంచనా.