న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు అక్టోబర్‌లో డిమాండ్ ఏర్పడింది. ఏకంగా రూ.1.57 లక్షల కోట్లను డెట్ ఫండ్స్ ఆకర్షించాయి. సెప్టెంబర్ నెలలో ఇదే విభాగం నుంచి రూ.1.14 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోగా, మరుసటి నెలలోనే పరిస్థితుల్లో పూర్తి మార్పు కనిపించింది.
ముఖ్యంగా డెట్‌లో మొత్తం 16 కేటగిరీలకు గాను 14 విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో డెట్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూఎం) 11 శాతం వృద్ధితో అక్టోబర్ చివరికి రూ.16.64 లక్షల కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ చివరికి ఇవి రూ.14.97 లక్షల కోట్లుగా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
స్వల్పకాల ఫండ్స్‌కు ఆదరణ
» లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా 83,863 కోట్లను రాబట్టాయి. అక్టోబర్ నెలలో మొత్తం డెట్ పెట్టుబడుల్లో సగం లిక్విడ్ ఫండ్స్‌లోకే వచ్చాయి. » ఓవర్‌నైట్ ఫండ్స్ రూ.25,784 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ రూ.25,303 కోట్ల చొప్పున ఆకర్షించాయి.
» అల్ట్రా షార్ట్ డ్యురేషన్ (12 నెలల్లోపు) ఫండ్స్‌లోకి రూ.7,054 కోట్లు వచ్చాయి.
» లో డ్యురేషన్ ఫండ్స్ రూ.5,600 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.4,644 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.1,362 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ప్రధానంగా తక్కువ కాలానికి ఉద్దేశించని డెట్ ఫండ్స్‌కు ఆదరణ లభించింది.
» నాలుగు నెలల విరామం తర్వాత బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.936 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
» గిల్ట్ ఫండ్స్ రూ.1,375 కోట్లు, లాంగ్ డ్యురేషన్ బాండ్ ఫండ్స్ రూ.1,177 కోట్ల చొప్పున ఆకర్షించాయి.
Comments
Please login to add a commentAdd a comment