inflow
-
డెట్ ఫండ్స్‌లోకి రూ.1.57 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు అక్టోబర్‌లో డిమాండ్ ఏర్పడింది. ఏకంగా రూ.1.57 లక్షల కోట్లను డెట్ ఫండ్స్ ఆకర్షించాయి. సెప్టెంబర్ నెలలో ఇదే విభాగం నుంచి రూ.1.14 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోగా, మరుసటి నెలలోనే పరిస్థితుల్లో పూర్తి మార్పు కనిపించింది.ముఖ్యంగా డెట్‌లో మొత్తం 16 కేటగిరీలకు గాను 14 విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో డెట్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూఎం) 11 శాతం వృద్ధితో అక్టోబర్ చివరికి రూ.16.64 లక్షల కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ చివరికి ఇవి రూ.14.97 లక్షల కోట్లుగా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.స్వల్పకాల ఫండ్స్‌కు ఆదరణ » లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా 83,863 కోట్లను రాబట్టాయి. అక్టోబర్ నెలలో మొత్తం డెట్ పెట్టుబడుల్లో సగం లిక్విడ్ ఫండ్స్‌లోకే వచ్చాయి. » ఓవర్‌నైట్ ఫండ్స్ రూ.25,784 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ రూ.25,303 కోట్ల చొప్పున ఆకర్షించాయి. » అల్ట్రా షార్ట్ డ్యురేషన్ (12 నెలల్లోపు) ఫండ్స్‌లోకి రూ.7,054 కోట్లు వచ్చాయి. » లో డ్యురేషన్ ఫండ్స్ రూ.5,600 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.4,644 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.1,362 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ప్రధానంగా తక్కువ కాలానికి ఉద్దేశించని డెట్ ఫండ్స్‌కు ఆదరణ లభించింది. » నాలుగు నెలల విరామం తర్వాత బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.936 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. » గిల్ట్ ఫండ్స్ రూ.1,375 కోట్లు, లాంగ్ డ్యురేషన్ బాండ్ ఫండ్స్ రూ.1,177 కోట్ల చొప్పున ఆకర్షించాయి. -
జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో...
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 7గంటల వరకు కేవలం 317 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 67 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 161 క్యూసెక్కులు క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 388 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 768 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.048 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. -
జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 1,980 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 78 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 731 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 300 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,044 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.340 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రామన్‌పాడుకు 1,140 క్యూసెక్కులు మదనాపురం: జూరాల ఎడమ కాల్వ నుంచి రామన్‌పాడు జలాశయానికి 1,140 ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు వచ్చి చేరింది. రామన్‌పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు 1,150, కుడి కాల్వకు 10, ఎడమ కాల్వకు 10 క్యూసెక్కులు విడుదల చేయడంతో పాటు తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ రనిల్‌రెడ్డి తెలిపారు. -
స్తబ్దుగా గోదావరి
సాక్షి, అమలాపురం: గలగలా గోదావరి... స్తబ్దుగా ఉంది. ‘నైరుతి’ ముఖం చాటేయడంతో ఈ ఏడాది గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో పెద్దగా వర్షాలు పడలేదు. ఆ ప్రభావం ఇన్‌ఫ్లోపై పడింది. నైరుతి ముగియడం, వరదల సీజన్ కూడా అయిపోవడంతో జలాల రాక క్రమేణా తగ్గిపోయి ఇన్‌ఫ్లో తక్కువ స్థాయిలో నమోదవుతోంది. గడచిన రెండురోజులుగా బ్యారేజ్ నుంచి దిగువునకు నీటి విడుదల ఆగిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభావం వచ్చే రబీపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆశాజనకం గతేడాది జూలైలో చరిత్రలో రెండో అతి పెద్ద వరద రాగా, ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా అది కొనసాగింది. అక్టోబరు ఇదే సమయానికి బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 6,231 టీఎంసీలు నమోదవ్వగా, ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు విస్తృతంగా పడే ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా వరద జాడ లేదు. గతంలో అంటే... 2016లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ఏడాది బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 2,750.944 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. రబీ మొత్తం ఆయకట్టుకు అనుమతి ఇచ్చినా తరువాత కొంత అనధికారికంగా కోత విధించాల్సి వచ్చింది. తగ్గిన ఇన్‌ఫ్లో ధవళేళ్వరం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో గణనీయంగా పడిపోవడంతో రెండు రోజులుగా గేట్లు మూసివేసి సముద్రంలోకి నీటి విడుదల నిలిపివేశారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో 14,700 క్యూసెక్కులు మాత్రమే ఉంది. దీనిలో సీలేరు పవర్ జనరేషన్ నుంచి వచ్చింది 3,765 క్యూసెక్కులు. అంటే సహజ జలాలు కేవలం 10,935 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. ఈ నీటిని తూర్పు డెల్టాకు 4,900, మధ్యడెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 7,200 చొప్పున మొత్తం 14,700 క్యూసెక్కులు వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదిలేస్తున్నారు. -
‘మూసీ’కి పెరిగిన ఇన్‌ఫ్లో.. ఒక గేటు ఎత్తివేత
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు 892 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. మూసీ గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 644.10 అడుగులు ఉంది. దీంతో అధికారులు ఒక క్రస్టు గేటును ఒక అడుగు మేర ఎత్తి 609 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా 509 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.22 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
ధరూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగింది. నీటి ప్రవాహం తగ్గడంతో రెండ్రోజుల క్రితం గేట్లు మూసివేయగా..బుధవారం ఉదయం నుంచి ఇన్‌ఫ్లో పెరిగింది. రాత్రి 10 గంటల సమయంలో ప్రాజెక్టుకు 95వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..పది క్రస్టు గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి 39,580 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. అదేవిధంగా 12 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 38,864 క్యూసెక్కులు వదులుతుండగా..మొత్తంగా జూరాల నుంచి 83,077 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 7.836 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి జూరాల క్రస్టు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 78,444 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 886 క్యూసెక్కులు మొత్తం 79,330 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 854.40 అడుగులమేర 90.348 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఈక్విటీ పథకాల్లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మరోసారి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించాయి. జూన్ నెలలో నికరంగా రూ.8,637 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. వివిధ ఏఎంసీలు కొత్త పథకాల ద్వారా (ఎన్‌ఎఫ్‌వోలు) పెట్టుబడులు సమీకరించడం, సిప్ పెట్టుబడులు బలంగా కొనసాగడం, స్మాల్‌క్యాప్ పథకాలకు చక్కని ఆదరణ లభించడం ఇందుకు దారితీసింది. జూన్ నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. ఈక్విటీ పథకాల్లోకి జూన్ నెలలో వచ్చిన పెట్టుబడులు మూడు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. మే నెలలో రూ.3,240 కోట్లను ఈక్విటీ పథకాలు ఆకర్షించగా, ఏప్రిల్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.6,480 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మార్చి నెలలో ఈక్విటీ పథకాలు భారీగా రూ.20,534 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ‘‘ఈక్విటీ పథకాల్లోకి మెరుగైన పెట్టుబడులు రావడం అన్నది ప్రధానంగా ఆరు కొత్త పథకాలు రూ.3,038 కోట్లు సమీకరించడం వల్లేనని చెప్పుకోవాలి’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారియా పేర్కొన్నారు. జూన్ నెలలో 11 ఎన్‌ఎఫ్‌వోలు (ఓపెన్ ఎండెడ్) ప్రారంభం కాగా, ఇవి సమీకరించిన పెట్టుబడులు రూ.3,228 కోట్లుగా ఉన్నాయి. మే నెలతో పోలిస్తే జూన్ పెట్టుబడులు మెరుగ్గా ఉన్నట్టు కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సేల్స్ హెడ్ మనీష్ మెహతా చెప్పారు. గరిష్ట స్థాయిలో అస్సెట్ అలోకేషన్ కారణంగా కొంత లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదన్నారు. అయితే ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) ద్వారా పెట్టుబడులు కొనసాగించుకోవాలని సూచించారు. నికరంగా చూస్తే ఉపసంహరణే జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం మీద నికరంగా రూ.2,022 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ప్రధానంగా డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.14,135 కోట్లను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీనివల్లే మొత్తం మీద పెట్టుబడుల క్షీణత చోటు చేసుకుంది. అంతకుముందు మే నెలలో డెట్ విభాగంలోకి రూ.45,959 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. విభాగాల వారీగా.. ►స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రికార్డు స్థాయిలో రూ.5,472 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ►సిప్ రూపంలో ఇన్వెస్టర్లు జూన్‌లో రూ.14,734 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మే నెలలో సిప్ పెట్టుబడులు రూ.14,749 కోట్లుగా ఉన్నాయి. ►లార్జ్‌క్యాప్ పథకాల నుంచి రూ.2,049 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ నుంచి రూ.1,018 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ►వ్యాల్యూ ఫండ్స్ రూ.2,239 కోట్లు, మిడ్‌క్యాప్ పథకాలు రూ.1,748 కోట్లు, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,147 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ►ఈటీఎఫ్ ల్లోకి రూ.3,402 కోట్లు వచ్చాయి. ►అన్ని ఏఎంసీల నిర్వహణలోని మొత్తం నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) విలువ మే చివరికి ఉన్న రూ.42.9 లక్షల కోట్ల నుంచి, జూన్ చివరికి రూ.44.8 లక్షల కోట్లకు పెరిగింది. ►డెట్ విభాగంలో హైబ్రిడ్ ఫండ్స్‌లోకి రూ.4,611 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ►లిక్విడ్ ఫండ్స్ రూ.28,545 కోట్లు కోల్పోయాయి. -
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.165 కోట్లు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) వరుసగా మూడు నెలల పాటు అమ్మకాలు చూసిన తర్వాత తేరుకున్నాయి. ఫిబ్రవరిలో రూ.165 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది జనవరిలో రూ.199 కోట్లు, 2022 డిసెంబర్లో రూ.273 కోట్లు, అదే ఏడాది నవంబర్‌లో రూ.195 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఉపసంహరించుకోవడం గమనార్హం. 2022 అక్టోబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.147 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశీయంగా బంగారం ధరలు కొంత తగ్గడం పెట్టుబడుల రాకకు అనుకూలించిందని.. బంగారం ధరలు తగ్గినప్పుడు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు సహజంగానే వస్తుంటాయని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. భౌతిక బంగారానికి సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఫోలియోలు (ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి ఇచ్చే గుర్తింపు) ఫిబ్రవరిలో 20వేలు పెరిగి మొత్తం 46.94 లక్షలకు చేరాయి. బంగారంలో రాబడులు ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటాయని, అందుకే అది నేడు ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా మారినట్టు కవితా కృష్ణన్ తెలిపారు. ఫిబ్రవరి చివరికి గోల్డ్ ఈటీఎఫ్‌లు అన్నింటి పరిధిలోని నిర్వహణ ఆస్తుల విలువ రూ.21,400 కోట్లుగా ఉంది. -
ఈక్విటీల్లోకి మళ్లీ పెట్టుబడుల వరద
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు జనవరిలో తిరిగి డిమాండ్ ఏర్పడింది. రూ.12,546 కోట్లు నికరంగా ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. గత నాలుగు నెలల్లో ఈక్విటీ ఫండ్స్‌లోకి ఒకనెలలో వచ్చిన గరిష్ట పెట్టుబడులు ఇవి. 2022 డిసెంబర్లో ఈక్విటీల్లోకి రూ.7,303 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే ఏడాది నవంబర్‌లో రూ.2,258 కోట్లు, అక్టోబర్‌లో రూ.9,390 కోట్ల చొప్పున వచ్చాయి. ఇక 2022 సెప్టెంబర్‌లో వచ్చిన రూ.14,100 కోట్లు నెలవారీ గరిష్ట స్థాయిగా ఉంది. ఈక్విటీ పథకాల్లోకి వరుసగా 23వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు రావడాన్ని గమనించొచ్చు. 2023 జనవరి గణాంకాలను ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. విభాగాల వారీగా.. అత్యధికంగా స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,256 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,902 కోట్లు, మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.1,773 కోట్లు, మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,628 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.14,14 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.1,006 కోట్లు, సెక్టోరల్, థీమ్యాటిక్ పథకాల్లోకి రూ.903 కోట్లు, కాంట్రా ఫండ్స్‌లోకి రూ.763 కోట్లు, లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.716 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్‌లోకి రూ.183 కోట్ల చొప్పున నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ఫిక్స్డ్ ఇన్కమ్ స్థిరాదాయ పథకాల (డెట్) నుంచి జనవరిలో నికరంగా రూ.10,316 కోట్లు బయటకు వెళ్లాయి. అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లో రూ.5,042 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో రూ.3,859 కోట్లు, ఓవర్‌నైట్ ఫండ్స్‌లో రూ.3,688 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు విక్రయించారు. మనీ మార్కెట్ పథకాలు రూ.6,460 కోట్లు ఆకర్షించాయి. ఇక హైబ్రిడ్ పథకాలు సైతం రూ.4,492 కోట్లు ఆకర్షించగా, మల్టీ అస్సెట్ పథకాల్లోకి రూ.2,182 కోట్లు, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి రూ.2,055 వచ్చాయి. ఇండెక్స్ ఫండ్స్‌లోకి రూ.5,813 కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్లలో నమ్మకం ‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాలపై నమ్మకాన్ని ఉంచారు. దీనికి నిదర్శనమే రూ.12,546 కోట్లు రావడం. నెలవారీగా చూస్తే ఇది 72 శాతం అధికం’’అని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. మార్కెట్లలో ఆటుపోట్లు ఉన్నా ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించినట్టు మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది పేర్కొన్నారు. సిప్ బలం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.13,856 కోట్లు వచ్చాయి. డిసెంబర్లో వచ్చిన రూ.13,573 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. సిప్ పెట్టుబడులు రూ.13వేల కోట్లకు పైగా రావడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైంది. సిప్ ఖాతాల సంఖ్య 6.21 కోట్లుగా ఉంది. నికరంగా 9.20 లక్షల కొత్త సిప్ ఖాతాలు రిజిస్టర్ అయ్యాయి. ఒకవైపు ఎఫ్‌పీఐలు విక్రయాలు చేస్తున్నప్పటికీ మార్కెట్లు స్థిరంగా ఉండడానికి సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. -
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి పోటెత్తిన వరద
-
కృష్ణా నదికి పోటెత్తిన వరద (ఫొటోలు)
-
వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు
నిర్మల్/కడెం: సముద్రం నుంచి సునామీ దూసుకువస్తోందా అన్నట్టు కడెం ప్రాజెక్టుపై వరద పోటెత్తింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రాజెక్టు పైనుంచి వరద ప్రవహించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 5 లక్షల క్యూసెక్కులు వస్తుంటేనే కడెం గుండె దడదడలాడింది. అధికారులు, సమీప గ్రామాల ప్రజలు వణికిపోయారు. అలాంటిది బుధవారం రాత్రి 2 గంటల తర్వాత ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద దూసుకొచ్చింది. ఎత్తిన 17 గేట్లతో పాటు (ఒక గేటు పనిచేయడం లేదు) ఎడమకాలువకు పడ్డ గండి నుంచి 3.5 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తుండగా అంతకు దాదాపు రెట్టింపు స్థాయిలో వచ్చిన వరద ప్రాజెక్టుపై నుంచి పొంగింది. అలా దాదాపు మూడునాలుగు గంటల పాటు కొనసాగింది. ఇక ప్రాజెక్టు కొట్టుకుపోవడం ఖాయమని భావించిన సిబ్బంది వదిలేసి వచ్చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అంతటి తాకిడినీ తట్టుకుని ఆనకట్ట చెక్కుచెదరకుండా నిలబడింది. రెండు గేట్ల కౌంటర్ వెయిట్ దిమ్మెలు మాత్రం కొట్టుకుపోయాయి. గేట్ల గదులు, ప్రాజెక్టు పైభాగం మొత్తం వరద తాకిడితో వచ్చిన చెట్లు, చెట్లకొమ్మలు, చెత్తా చెదారంతో నిండిపోయాయి. ఈ కారణంగా గేట్లను దించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడటంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ఎన్నడూ చూడని వరద ఉధృతి కడెం ప్రాజెక్టుకు తొలిసారి ఈస్థాయి ఇన్‌ఫ్లో వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదను చూడలేదని అధికారులు, స్థానికులు పేర్కొన్నారు. 1958లో ఒకసారి 5.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. (అప్పట్లో 9 గేట్లే ఉండేవి) దిగువన మొత్తం నీటమునిగింది. భారీ వరదకు డ్యామ్ ఒకవైపు కోతకు గురయ్యింది. ఆ ప్రమాదం తర్వాత మరో తొమ్మిది గేట్లను నిర్మించి, ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచారు. అయితే 1995లో 4 లక్షల క్యూసెక్కుల వరద రాగా డ్యామ్ ఎడమ కాలువ వద్దనే గండిపడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టుపై నుంచి పారింది. ఈసారి కూడా ఎడమవైపు గండిపడటం వల్లే కట్ట ఆగిందని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎడమకాలువ వద్ద గండి పడటంతో కోతకు గురైన ప్రాంతం ప్రాజెక్టు నిలిచింది..నష్టం మిగిల్చింది కడెం ప్రాజెక్టు పైభాగమంతా అటవీ ప్రాంతమే ఉంటుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు అధికారులు అంచనా వేసే లోపే ఎగువన ఉన్న వాగులన్నీ పొంగి ప్రాజెక్టులోకి వరద వేగంగా వచ్చేస్తుంది. ఈవిధంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువ జాము వరకు పోటెత్తిన వరదతో కడెం ప్రాజెక్టు చాలావరకు దెబ్బతింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రాజెక్టు ఒకటి, రెండు గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. వరద గేట్లను ఎత్తి దించేందుకు ఈ దిమ్మెలు ఉపయోగపడతాయి. 2018లో కూడా రెండో నంబర్ గేటు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఇక వరద గేట్లలో మొత్తం చెత్త పేరుకుపోవడం, ఎలక్ట్రికల్ కనెక్షన్లు దెబ్బతినడంతో వాటిని సరిచేయడం ఇప్పట్లో కుదరని పని అని అంటున్నారు. ఎడమ కాలువకు గండిపడ్డ ప్రాంతంలో వందమీటర్ల మేర కాలువ కోతకు గురైంది. వరద ఉధృతికి ప్రాజెక్టు దిగువన సైడ్‌వాల్స్ మొత్తం దెబ్బతిన్నాయి. కొనసాగుతున్న అవుట్ ఫ్లో ప్రస్తుతం 17 గేట్ల ద్వారా దిగువకు అవుట్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి 9 గంటలకు మొత్తం 700 అడుగులకు గానూ 684.725 అడుగుల నీటిమట్టం, మొత్తం 7.603 టీఎంసీలకు గానూ 4.259 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,25,582 క్యూసెక్కులు ఉండగా అదేస్థాయిలో వరద దిగువకు వెళుతోంది. పెను ప్రమాదం తప్పింది: మంత్రి కడెం ప్రాజెక్టుకు పెనుప్రమాదం తప్పిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రం అధికారులతో కలిసి ఆయన కడెం ప్రాజెక్టును సందర్శించారు. పరిస్థితిని పరిశీలించారు. కడెం వాగుకు పూజలు చేశారు. -
ఎర్రకాలువకు పెరుగుతున్న నీటిమట్టం
-
వాయుగుండంగా మారిన గులాబ్ తూఫాన్
-
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద
-
చంద్రబాబు నివాసం చుట్టూ వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల)/అచ్చంపేట(పెదకూరపాడు): కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. బుధవారంతో పోలిస్తే గురువారం వరద ఉద్ధృతి మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత కాస్త తగ్గింది. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీలోకి 7,28,934 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 70 గేట్లను పూర్తిగా ఎత్తేసి అంతేస్థాయిలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటికి.. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాల ప్రభావం వల్ల కట్టలేరు, మున్నేరు, కొండవాగుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తింది. అదేస్థాయిలో దిగువకు వదులుతున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణాజిల్లాల్లో నదీ తీరప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. శుక్రవారం ప్రకాశం బ్యారేజీలోకి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో 2009 అక్టోబర్ 5న తొలిసారిగా గరిష్ఠంగా 11,10,404 క్యూసెక్కుల వరద వచ్చింది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా పదిగేట్లను 20 అడుగుల మేర ఎత్తేసి, కుడి విద్యుత్కేంద్రం ద్వారా 5.07 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి నాలుగు లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీటికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలోనూ భారీవర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యామ్, సుంకేశుల నుంచి 50 వేల క్యూసెక్కుల మేర నీరు కృష్ణానదిలోకి చేరుతోంది. (చదవండి: మహోగ్ర కృష్ణమ్మ) వంశధారలో స్థిరంగా వరద ఉద్ధృతి ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వంశధారలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 41,253 క్యూసెక్కులు చేరుతుండగా.. 43,197 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నాగావళి ప్రధాన ఉపనది అయిన సువర్ణముఖి నదిలో వరద మరింత పెరిగింది. మడ్డువలస ప్రాజెక్టులోకి 25,428 క్యూసెక్కులు చేరుతుండగా.. 27,706 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో నదీ తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం నుంచి 2.31 లక్షల క్యూసెక్కులు కడలిలోకి గోదావరిలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. చంద్రబాబు నివాసం చుట్టూ వరద ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో గురువారం ఎగువ ప్రాంతంలోని కరకట్ట వెంబడి రిజర్వ్ కన్జర్వేటరీలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ల చుట్టూ వరదనీరు చేరింది. కొన్ని గెస్ట్‌హౌస్‌లు వరదనీటిలో మునిగిపోయాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నివాసం చుట్టూ రహదారుల్లో తప్ప నాలుగువైపులా నీళ్లు చుట్టుముట్టాయి. హెలీప్యాడ్ సగం వరకు మునిగిపోయింది. గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్, చందన బ్రదర్స్ గెస్ట్‌హౌస్ ఐదడుగుల వరకు నీళ్లలో మునిగిపోగా, ఆక్వా డెవిల్స్‌లో కరకట్ట వరకు నీళ్లు చేరాయి. ఇసుక ర్యాంప్ వద్ద ఉన్న మత్స్యకారుల ఇళ్లు మునిగిపోవడంతో అధికారులు వారిని అక్కడినుంచి ఖాళీ చేయించారు. గురువారం రాత్రి మరింత వరద వస్తుందని సమాచారం అందటంతో ముందు జాగ్రత్తగా కరకట్ట లోపల ఉన్న గెస్ట్‌హౌస్‌ల వారిని ఖాళీచేయాలని అధికారులు ఆదేశించారు. మేం ఉంటే గంటగంటకూ టెలీకాన్ఫరెన్స్‌లు: చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలో ఉంటే వరదల సమయంలో గంట గంటకు అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించేవాళ్లమని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేవాళ్లమన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి గురువారం టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘తీరం దాటే సమయాన్ని, తాకే ప్రదేశాన్ని ముందే అంచనా వేసేవాళ్లం. ఏ ప్రాంతంలో ఎంత నష్టం వాటిల్లుతుందో ఆర్టీజీఎస్ ద్వారా అంచనా వేసి ప్రజల్ని ముందే అప్రమత్తం చేసేవాళ్లం. ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించేవాళ్లం. అధికార యంత్రాంగమంతా అక్కడే మకాం వేసేలా చూసేవాళ్లం. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాకే తిరిగి వచ్చేవాళ్లం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ చొరవ, స్ఫూర్తి లేవు. ప్రజల ప్రాణాలన్నా, ఆస్తినష్టం అన్నా వైఎస్సార్సీపీకి లెక్కేలేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు. -
ప్రకాశం బ్యారేజికి భారీగా వస్తున్న వరదనీరు
-
నిండుకుండలా శ్రీశైలం,జూరాల ప్రాజెక్ట్
-
భారీ వర్షాలతో ఉప్పొంగిన వాగులు
-
ఎస్సారెస్సీలో పెరుగుతున్న వరద
సాక్షి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 9,342 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1055.00 అడుగులు (9.287 టీఎంసీలు) లుగా ఉంది. ఈ నెలలో 14 రోజుల్లో ప్రాజెక్టులోకి 2 టీఎంసీల వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద
సాక్షి, నిజామాబాద్: మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరికి జలకళ సంతరించుకుంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేశారు. దీంతో నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1052 అడుగులుగా ఉంది. -
ఎఫ్ఐపీబీ రద్దుతో ఎఫ్‌డీఐల జోరు
-
తగ్గిన ఇన్ ఫ్లో
పెరిగిన ఔట్ ఫ్లో డ్యాంలో 3.57 టీఎంసీల నీరు నిల్వ కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. హంద్రీ నీవా కాలువ ద్వారా 715 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 10 రోజుల క్రితం వరకు సుమారు 1050 క్యూసెక్కుల నీరు సరఫరా అయ్యేది. హెచ్చెల్సీ ద్వారా టీబీ డ్యాం నుంచి వచ్చే నీటిని నిలిపివేశారు. ఇన్‌ఫ్లో కన్నా ఔట్ ఫ్లో పెరిగింది. ఏపీ జెన్కో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీకి సుమారు 700 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే డ్యాంలో ఏర్పాటు చేసిన అనంత , సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజు సుమారు 60–70 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 3.57 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నెల 22న ధర్మవరం కుడికాలువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నీటిని విడుదల చేస్తే ఔట్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. -
‘ఎల్లంపల్లి’కి తగ్గిన ఇన్‌ఫ్లో
రామగుండం : ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో గురువారం భారీగా తగ్గింది. పక్షం రోజులు లక్షల క్యూసెక్కుల్లో వచ్చిన ఇన్‌ఫ్లో ప్రస్తుతం 36,539 క్యూసెక్కులకు చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు రెండు గేట్ల ద్వారా 21,095 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 148.00 మీటర్లకు ప్రస్తుతం 147.55 మీటర్లు ఉంది. 20.175 టీఎంసీల నీటికి 18.92 టీఎంసీలు నిల్వ ఉంది. -
తగ్గిన సాగర్ ఇన్‌ఫ్లో
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నీటి మట్టం 532.80(173.664టీఎంసీలు) అడుగులకు చేరింది. ‡జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు). ఇన్‌ఫ్లో తగ్గడంతో నీటిమట్టం నిలకడగా ఉంది. శ్రీశైలం జలాశయం ఎడమ విద్యుదుత్ ఉత్పాదన కేంద్రం ద్వారా గడిచిన 24 గంటల్లో 5,094 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885.00 అడుగులు(214 టీఎంసీలు). కాగా ప్రస్తుతం 882.80 (203.4270టీఎంసీలు) అడుగులున్నది. ఎగువనుంచి 48,000 క్యూసెక్కుల నీరు జలాశయంలో చేరుతుంది. కొంతనీటిని పోతిరెడ్డి పాడు ద్వారా విడుదల చేస్తున్నారు. రైతులకు అందుబాటులో... సాగర్ ఆయకట్టు రైతులకు 245 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. రబీలో ఆరుతడి పంటలు సాగు చేసేందుకు సరిపోతుందని అధికారులు అంచనావేస్తున్నారు. శ్రీశైలంలో 203 టీఎంసీలు ఉండగా నాగార్జునసాగర్ జలాశయంలో 510 అడుగులు కనీస నీటిమట్టం పైన 42టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. దిగువన గల నీటిని రెండు రాష్ట్రాల్లో గల పలు జిల్లాలకు తాగు నీటి అవసరాలకు మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది. వాస్తవంగా సాగర్ ఆయకట్టుకు రెండు రాష్ట్రాల్లోని కుడి, ఎడమ కాల్వలకు వరి పంటకు గాను ఒక పంటకు 132 టీఎంసీల చొప్పున 264 టీఎంసీల నీరు కావాలి. అదే విధంగా ఆవిరి నష్టం మరో 17 టీఎంసీలు అవసరమవుతాయి. ఈనీటితో కుడికాల్వ కింద 11,74,874 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 10,37,796 ఎకరాలు మొత్తం 22,12,670 ఎకరాలకు నీరందుతుంది. ఈ పంటల ద్వారా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.10 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. గత రెండేళ్లుగా సాగర్ జలాశయం నిండకపోవడంతో ఆయకట్టు రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఈ సీజన్లోనైనా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తే పంటలను సాగు చేయనున్నారు. నిండుకుండల్లా ఎగువన జలాశయాలు కృష్ణానది పైన గల జలాశయాలు సాగర్ మినహా మిగతావన్నీ నిండుకుండలా ఉన్నాయి. ఆల్మట్టి నుంచి నారాయణపూర్, జూరాల, శ్రీశైలం వరకు పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళలాడుతున్నాయి. ఇకపై ఎగువ నుంచి అదనంగా వచ్చే ప్రతి నీటి బొట్టు సాగర్ జలాశయానికే వచ్చే అవకాశాలున్నాయి.