- పెరిగిన ఔట్ ఫ్లో
- డ్యాంలో 3.57 టీఎంసీల నీరు నిల్వ
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. హంద్రీ నీవా కాలువ ద్వారా 715 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 10 రోజుల క్రితం వరకు సుమారు 1050 క్యూసెక్కుల నీరు సరఫరా అయ్యేది. హెచ్చెల్సీ ద్వారా టీబీ డ్యాం నుంచి వచ్చే నీటిని నిలిపివేశారు. ఇన్‌ఫ్లో కన్నా ఔట్ ఫ్లో పెరిగింది. ఏపీ జెన్‌కో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీకి సుమారు 700 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే డ్యాంలో ఏర్పాటు చేసిన అనంత , సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజు సుమారు 60–70 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 3.57 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నెల 22న ధర్మవరం కుడికాలువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నీటిని విడుదల చేస్తే ఔట్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది.