ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్లను జమ చేయడంలో ఆలస్యం చేసే లేదా డీఫాల్ట్ అయ్యే కంపెనీల యాజమాన్యాలకు విధించే అపరాధ రుసుమును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తగ్గించింది.
కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ల ప్రకారం.. ఈ మూడు పథకాలకు సంబంధించిన కంట్రిబ్యూషన్ జమ చేయకపోతే ఒక్కో నెలకు కంట్రిబ్యూషన్ మొత్తంలో 1 శాతం అపరాధ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇది ఏడాదికి 12 శాతానికి పరిమితమవుతుంది. ఈ చర్య వల్ల డిఫాల్ట్ అయిన కంపెనీ యాజమాన్యాలపై తక్కువ భారం పడనుంది.
గతంలో డిఫాల్ట్ కాలాన్ని బట్టి పెనాల్టీ అధికంగా ఉండేది. రెండు నెలలలోపు డిఫాల్ట్ కు సంవత్సరానికి 5 శాతం, రెండు నుంచి నాలుగు నెలల కాలానికి డిఫాల్ట్ లకు సంవత్సరానికి 10 శాతం అపరాధ రుసుము విధించేవారు. నాలుగు నుంచి ఆరు నెలల వరకు డిఫాల్ట్ చేస్తే జరిమానా ఏడాదికి 15 శాతం, ఆరు నెలలకు మించి డిఫాల్ట్ కొనసాగితే ఏడాదికి 25 శాతం పెనాల్టీ ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment