default
-
ఈపీఎఫ్‌వో పెనాల్టీ తగ్గింపు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్లను జమ చేయడంలో ఆలస్యం చేసే లేదా డీఫాల్ట్ అయ్యే కంపెనీల యాజమాన్యాలకు విధించే అపరాధ రుసుమును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తగ్గించింది.కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ల ప్రకారం.. ఈ మూడు పథకాలకు సంబంధించిన కంట్రిబ్యూషన్ జమ చేయకపోతే ఒక్కో నెలకు కంట్రిబ్యూషన్ మొత్తంలో 1 శాతం అపరాధ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇది ఏడాదికి 12 శాతానికి పరిమితమవుతుంది. ఈ చర్య వల్ల డిఫాల్ట్ అయిన కంపెనీ యాజమాన్యాలపై తక్కువ భారం పడనుంది.గతంలో డిఫాల్ట్ కాలాన్ని బట్టి పెనాల్టీ అధికంగా ఉండేది. రెండు నెలలలోపు డిఫాల్ట్ కు సంవత్సరానికి 5 శాతం, రెండు నుంచి నాలుగు నెలల కాలానికి డిఫాల్ట్ లకు సంవత్సరానికి 10 శాతం అపరాధ రుసుము విధించేవారు. నాలుగు నుంచి ఆరు నెలల వరకు డిఫాల్ట్ చేస్తే జరిమానా ఏడాదికి 15 శాతం, ఆరు నెలలకు మించి డిఫాల్ట్ కొనసాగితే ఏడాదికి 25 శాతం పెనాల్టీ ఉండేది. -
పన్ను భారం తగ్గేదెలా..?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రిటర్నులు దాఖలు చేసే వారికి నూతన పన్ను విధానం డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. పాత పన్ను వ్యవస్థతోనే కొనసాగాలనుకుంటే విధిగా దానిని ఎంపిక చేసుకోవాల్సిందే. లేదంటే కొత్త విధానం అమలవుతుంది. పాత వ్యవస్థతో పోలిస్తే కొత్త పన్ను విధానంలో పన్ను భారం తక్కువ. కానీ, పాత విధానంలో పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఎక్కువ. వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కనుక కొత్త విధానంతో పోలిస్తే గణనీయమైన పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించే పన్ను తగ్గిపోతుంది. మరి వీటిల్లో తమకు ఏది అనుకూలమో తేల్చుకోవాలంటే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. ఆదాయపన్ను భారాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలని కోరుకునే వారికి.. పాత, కొత్త పన్ను విధానాల్లో ఎంపిక కీలకం అవుతుంది. చట్టప్రకారం మీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంటే, అప్పుడు విధిగా రిటర్నులు దాఖలు చేసి నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాలి. పాత, కొత్త పన్ను రేట్లను ఒకసారి పరిశీలిద్దాం. ఈ రెండు వ్యవస్థల్లోనూ కొంత పన్ను రాయితీ ఉంది. పాత విధానంలో నికరంగా రూ.5 లక్షలు, నూతన విధానంలో నికరంగా రూ.7 లక్షలు మించకుండా పన్ను వర్తించే ఆదాయం ఉంటే సెక్షన్ 87ఏ కింద ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల ప్రయోజనాన్ని కూడా కలిపి చూస్తే వేతన జీవులు పాత విధానంలో రూ.5.50,000 ఆదాయం, కొత్త విధానంలో రూ.7,50,000 మించని ఆదాయంపై రూపాయి పన్ను కట్టక్కర్లేదు. ఆదాయపన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోలేని వారికి నూతన విధానమే అనుకూలం. పాత విధానంలో సెక్షన్ 80సీ, 80డీ, 24 ఇలా పలు సెక్షన్ల కింద పన్ను తగ్గింపులు, మినహాయింపులను వినియోగించుకుంటే, రూ.5 లక్షలకు పైన ఆదాయం ఉన్నవారు సైతం గణనీయమైన ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇంతకుమించి ఆదాయం కలిగిన వారు ఈ రెండింటిలో ఏది లాభదాయకమో తేల్చుకోవాలంటే కొంత కసరత్తు అవసరం. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి దీని కింద పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సరి్టఫికెట్, పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. జీవిత బీమా పాలసీకి చెల్లించే ప్రీమియం, పిల్లల ట్యూషన్ ఫీజులను కూడా ఈ సెక్షన్ కింద చూపించుకోవచ్చు. గృహ రుణం తీసుకుని, ఒక ఆర్థిక సంవత్సరంలో దీనికి చేల్లించే అసలును (ప్రతి ఈఎంఐలో అసలు, వడ్డీ భాగం ఉంటుంది) సెక్షన్ 80సీ కింద చూపించి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను సెక్షన్ 80డీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. 60 ఏళ్లలోపు వయసున్న వారు రూ.25,000 వరకు, అంతకుమించిన వయసు వారికి రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. ఇదే సెక్షన్ కింద హెల్త్ చెకప్‌లకు చేసే వ్యయం రూ.5,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. విరాళాలు ఇస్తే.. అర్హత కలిగిన సంస్థలకు విరాళాలు ఇస్తే, ఆ మొత్తంపై సెక్షన్ 80జీ కింద పన్ను భారం ఉండదు. ఇక సెక్షన్ 80టీటీఏ కింద సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై ఆర్జించే వడ్డీ రూ.10,000 మొత్తంపై పన్ను లేదు. అదే 60 ఏళ్లు నిండిన వారికి వడ్డీ ఆదాయం రూ.50,000పై పన్ను లేదు. ఇవన్నీ పాత పన్ను విధానంలో ఉన్న చక్కని పన్ను మినహాయింపు ప్రయోజనాలు. పన్ను ఆదా, పెట్టుబడులు పాత వ్యవస్థలో ఉన్న పన్ను ఆదా ప్రయోజనాలను ఉపయోగించుకుంటే, మరింతగా పన్ను ఆదా చేసుకోవచ్చని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేష్ శడగోపన్ పేర్కొన్నారు. వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకవైపు పెట్టుబడులపై రాబడిని, మరోవైపు పన్ను ఆదా చేసుకోవడానికి వీలుంటుంది. కొత్త పన్ను విధానంలో పెట్టుబడులకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. అంటే ఇది పెట్టుబడులను నిర్బంధం చేయదు. ఎన్పీఎస్ వేతన జీవులు, స్వయం ఉపాధిలోని వారు, ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఎన్పీఎస్పై పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. వేతన జీవులు అయితే తమ మూలవేతనం, డీఏలో 10 శాతం మేర ఎన్పీఎస్కు చందా జమ చేయడం ద్వారా ఆ మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. స్వయం ఉపాధిలో ఉన్న వారు తమ మొత్తం ఆదాయంలో 20 శాతంపై ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ సెక్షన్ కింద ఈ రెండు వర్గాలకు గరిష్ట ప్రయోజనం రూ.1.5 లక్షలు. ఇక 80సీసీడీ (1బి) కింద వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు రూ.50,000 జమలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. పైన చెప్పుకున్న రూ.1.5 లక్షలకు ఇది అదనం. 80సీసీడీ(2) కింద వేతన జీవులకు అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో సంస్థ చేసే జమలు దీనికింద వస్తాయి. ప్రభుత్వరంగ ఉద్యోగులు అయితే తమ మూలవేతనం, డీఏలో 14 శాతం, ప్రైవేటు ఉద్యోగులు 10 శాతం మేర యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక్కడ గరిష్ట పరిమితి రూ.7.5 లక్షలు. ఈపీఎఫ్ జమలు కూడా ఈ పరిమితిలో భాగమే. హెచ్ఆర్ఏ అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేసే సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందుతుంటే అప్పుడు కూడా పన్ను ప్రయోజనాన్ని అందుకోవచ్చు. మెట్రోల్లో నివసించే వారు తమ మూల వేతనం, డీఏలో 50 శాతం మేర సెక్షన్ 10(13ఏ) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. నాన్ మెట్రోల్లోని వారికి ఈ పరిమితి 40 శాతంగా ఉంది. అలాగే, హెచ్ఆర్ఏ రూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న మొత్తం.. మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తీసివేయగా వచ్చే మొత్తం.. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. పనిచేసే ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉండే వారికి హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు రాదు. పనిచేసే చోట అద్దె ఇంట్లో ఉంటూ, వేరే ప్రాంతంలో సొంతిల్లును అద్దెకు ఇచి్చన వారు సైతం హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపును పొందొచ్చు. లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) పన్ను పరిధిలోకి వస్తుంది. ప్రయాణాలకు చేసిన ఖర్చును చూపించి, పన్ను భారం తొలగించుకోవచ్చు. గృహ రుణం/విద్యా రుణం రుణంపై ఇంటిని కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే ఇప్పుడు యువత సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. ఇలాంటి వారు కొంత డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తానికి రుణం తీసుకుంటున్నారు. ఈ రుణానికి చేసే అసలు చెల్లింపులు ఒక ఏడాదిలో రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద, వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల మేర సెక్షన్ 24(బి) కింద చూపించుకుని ఆ మొత్తంపై పన్ను కట్టక్కర్లేదు. సొంతగా నివాసం ఉన్నా లేదా అద్దెకు ఇచ్చినా సరే ఈ ప్రయోజనానికి అర్హులే. విద్యా రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే వడ్డీ చెల్లింపులు ఎంత ఉన్నా సరే ఆ మొత్తాన్ని రిటర్నుల్లో చూపించుకుని పన్ను లేకుండా మినహాయింపు పొందొచ్చు. మీకు ఏది అనుకూలం? పాత విధానంలో ఇక్కడ పేర్కొన్న మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే.. సెక్షన్ 80సీ కింద 1.50 లక్షలు, 80 సీసీడీ (1బి) కింద రూ.50,000 (ఎన్పీఎస్), స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, గృహ రుణం వడ్డీ రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.9.5 లక్షలపై పన్ను లేనట్టే. అలాగే, ప్రైవేటు ఉద్యోగులు పనిచేసే సంస్థ ద్వారా ఎన్పీఎస్ ఖాతాకు గరిష్టంగా రూ.7.5 లక్షల మేర జమ చేయించుకుంటే అప్పుడు మొత్తం రూ.17 లక్షలపై పన్ను లేనట్టు అవుతుంది. కొత్త విధానంలో రూ.7 లక్షల మొత్తంపై సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ కలి్పంచారు. దీనికి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే రూ.7.5 లక్షలపై పన్ను లేదు. ఆదాయం రూ.7,50,001 ఉన్న వారికి 87ఏ రాయితీ వర్తించదు. వారు తమ ఆదాయంపై పూర్తి పన్ను చెల్లించాలి. మొదటి మూడు లక్షలపై పన్ను లేదు. 3–6 లక్షలపై 5 శాతం ప్రకారం రూ.15,000. రూ.6.–7.51 లక్షలపై 10 శాతం ప్రకారం రూ.15,000 కలిపి మొత్తం రూ.30,000, దీనికి సెస్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 7.51 లక్షల ఆదాయంపై పాత విధానంలో రిటర్నులు వేసుకునేట్టు అయితే.. 87ఏ రిబేటు, స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.5.5 లక్షల వరకు పన్ను లేదు. 80సీ సాధనంలో 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుని, దీనికి అదనంగా ఎన్‌పీఎస్‌లో రూ.50,000 ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రూపాయి పన్ను లేకుండా చూసుకోవచ్చు. విధానాన్ని మార్చుకోవచ్చు.. పాత పన్ను నుంచి కొత్త పన్నుకు.. తిరిగి పాత పన్నుకు మారడంపై ఆంక్షలు ఉన్నాయి. వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆదాయం పొందని వారు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. వృత్తి లేదా వ్యాపారం నుంచి ఆదాయం పొందుతున్న వారు సెక్షన్ 115బీఏసీ కింద నూతన పన్ను విధానం నుంచి వైదొలిగే ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అప్పుడు తిరిగి నూతన పన్ను విధానానికి ఒక్కసారి మాత్రమే మారే అవకాశం ఉంటుంది. ‘‘తక్కువ పన్ను శ్లాబుల పరిధిలో ఆదాయం కలిగిన వారికి నూతన పన్ను విధానమే మెరుగైనది. అధిక రేటు శ్లాబుల్లో ఉన్నవారు, అన్ని రకాల మినహాయింపులు వినియోగించుకుంటే వారికి పాత విధానం అనుకూలం’’అని రైట్ హారిజాన్స్ సీఈవో అనిల్ రెగో సూచించారు. -
కష్టాల్లో కాఫీ డే: రూ.434 కోట్ల చెల్లింపుల వైఫల్యం
Coffee Day Enterprises ఆర్ధిక సవాళ్లు ఎదుర్కొంటున్న కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఈ జులై–సెపె్టంబర్ త్రైమాసికంలో దాదాపు రూ. 434 కోట్ల రుణ(అసలు, వడ్డీ) చెల్లింపుల్లో విఫలమైనట్లు వెల్లడించింది. అంతకుముందు ఏప్రిల్–జూన్‌లోనూ రూ. 440 కోట్ల చెల్లింపుల్లో వైఫల్యం చెందడం గమనార్హం! తాజా త్రైమాసికంలో స్వల్ప, దీర్ఘకాలిక రుణాల చెల్లింపులను పూర్తిచేయలేకపోయినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు వెల్లడించింది. వీటిలో క్యాష్ క్రెడిట్ తదితర రుణాలు రూ. 189.14 కోట్లుకాగా.. వీటిలో అసలు విలువ రూ. 183.36 కోట్లుగా కంపెనీ తెలియజేసింది. ఇక చెల్లించవలసిన అన్‌లిస్టెడ్ రుణ సెక్యూరిటీల(ఎన్సీడీలు, ఎన్సీఆర్పీఎస్లు) విలువ రూ. 244.77 కోట్లలో అసలు రూ. 200 కోట్లుకాగా.. వడ్డీ రూ. 44.77 కోట్లుగా వివరించింది. డిఫాల్ట్ నేపథ్యంలో రుణదాతలు రుణ రికవరీ నోటీసుల జారీతోపాటు.. న్యాయ వివాద చర్యలకు దిగినట్లు తెలియజేసింది. రికవరీ నోటీసులు, న్యాయ వివాదాలు, రుణదాతలతో వన్‌టైమ్ సెటిల్మెంట్ పెండింగ్‌లోఉన్న కారణంగా 2021 ఏప్రిల్ నుంచి వడ్డీ మదింపు చేయలేదని వెల్లడించింది. -
ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!
ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ ప్రయాణీకులకు బీమా సౌకర్యాన్ని డీఫాల్ట్‌గా అందివ్వనుంది. తాజా నిర్ణయంతో వెబ్సైట్/యాప్‌లో టికెట్ బుక్ చేసుకొనే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం బీమా ఆప్షన్ పక్కనున్న టిక్ బాక్స్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నుంచి ఈ ఆప్షన్‌ను ఐఆర్సీటీసీ డిఫాల్ట్‌గా ఇస్తోంది. అంటే ఐఆర్సీటీసీ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అనేది ఆటోమెటిక్‌గానే వస్తుంది. ఒకవేళ బీమా ప్రయోజనాలను వద్దనుకున్నవారు మాత్రం ఆ టిక్ మార్క్‌ను తొలగించుకునే సౌలభ్యం కూడా ఉంది. కానీ ప్రతి ప్రయాణీకులు దీన్ని వినియోగించుకోవడమే చాలా అవసరం. ఐఆర్సీటీసీ పోర్టల్‌లో తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఇప్పుడు ఆటోమేటిక్‌గా రూ. 10 లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని బీమా పరిశ్రమలోని సీనియర్ అధికారి పేర్కొన్నారని ఐఏఎన్ రిపోర్ట్ చేసింది. అయితే దీనిపై ఐఆర్సీటీసీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఇందుకోసం భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డిఎఐ)ఐఆర్సీటీసీకి మాత్రం వెసులుబాటు ఇచ్చింది. రైల్వే బీమాను ఎంచుకున్న ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం లభిస్తుంది. రైలు ప్రమాదంలో మరణించినా, లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడితే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్‌ను రైల్వే శాఖ అందిస్తుంది. ఒకవేళ తీవ్రంగా గాయపడి పాక్షిక అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా లభిస్తుంది. అలాగే గాయపడిన వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. అయితే బీమా పాలసీని ఎంచుకున్న ప్రయాణికులు నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటివరకు రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సమయంలో రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ క్లిక్ చేసి నపుడు బీమా సౌకర్యం అందించే సౌకర్యం ఉండేది. ఈ రూ. 10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఐఆర్సీటీసీ కేవలం 35 పైసలు మాత్రమే చార్జ్ చేసేది. ఈ బీమా కింద ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో విలువైన వస్తువులు, లగేజీని పోగొట్టుకుంటే పరిహారం లభించే సౌకర్య అందుబాటులోఉండేదన్న సంగతి తెలిసిందే. -
కాఫీడే కష్టాలు: రూ. 440 కోట్ల రుణాల డీఫాల్ట్
న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్) రూ. 440 కోట్ల మొత్తాన్ని డీఫాల్ట్ అయ్యింది. రూ. 220 కోట్ల రుణానికి సంబంధించి రూ. 190 కోట్ల అసలు, సుమారు రూ. 6 కోట్ల వడ్డీని చెల్లించలేకపోయినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: తప్పుదోవ పట్టించే ప్రకటనలు బీమా బ్రోకరేజీలపై ఫిర్యాదు అలాగే, ఎన్సీడీలు మొదలైన బాకీల విషయంలో దాదాపు రూ. 245 కోట్లు డీఫాల్ట్ అయినట్లు వివరించింది. 2019లో వ్యవస్థాపక చైర్మన్ వీజీ సిద్ధార్థ మరణానంతరం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయిన సీడీఈఎల్ ఆ తర్వాత నుంచి అసెట్ల విక్రయం తదితర మార్గాల్లో రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇదీ చదవండి: Jio Bharat Phone: జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) -
డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను విచారించవచ్చు
న్యూఢిల్లీ: డిఫాల్ట్ బెయిల్ కోరుతూ దాఖలయ్యే పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టతనిచ్చింది. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు అధికారులు గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ కోరుతూ నిందితులు దాఖలు చేసే పిటిషన్లను హైకోర్టులు, ట్రయల్ కోర్టులు విచారించవచ్చంది. 60 నుంచి 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయకుంటే నిందితులు ఢిపాల్ట్ బెయిల్‌కు అర్హులు. విచారణ పూర్తవకుండానే అసంపూర్తి చార్జిషీట్‌ను దాఖలు చేసినా డిఫాల్ట్ బెయిల్ పొందవచ్చని రీతూ ఛాబ్రియా కేసులో జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 26న తీర్పు వెలువరించింది. కేవలం నిందితులకు డిఫాల్ట్ రావొద్దన్న కారణంతో చార్జిషీల్ దాఖలు చేయొద్దని సూచించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తీర్పును ఉపసంహరించుకోవాలని కోరింది. ఈడీ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కింది కోర్టులు రీతూ ఛాబ్రియా కేసు తీర్పుపై ఆధారపడాల్సిన అవసరం లేదని, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. కేంద్రంపై సుప్రీంకు ఆప్ ఢిల్లీ ప్రభుత్వాధికారులపై పాలనపరమైన అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఈ విషయమై కేంద్రానికి, ఆప్ సర్కారుకు మధ్య గొడవలు సద్దుమణగడం లేదు. ప్రభుత్వ సేవల శాఖ కార్యదర్శి ఆశిష్ మోరే బదిలీని కేంద్రం అడ్డుకుంటోందని కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణకు వచ్చే వారం ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ పేర్కొన్నారు. ‘అదానీ’ విచారణకు 3 నెలలు? అదానీ గ్రూప్ అవకతవకల ఆరోపణలపై విచారణకు సెబీకి మరో మూడు నెలలు గడువివ్వాలని యోచిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. విచారణలో సెబీ వైఫల్యముందన్న వాదనలను తిరస్కరించింది. సెబీ నివేదికను తమ నిపుణుల కమిటీ అధ్యయనం చేశాక దానిపై తేలుస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళ స్టోరీపై నిషేధం ఎందుకు ? ది కేరళ స్టోరీ సినిమాను ఎందుకు నిషేధించారో చెప్పాలంటూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సీజేఐ ధర్మాసనం నోటీసులిచ్చింది. ‘‘ఇతర రాష్ట్రాలు ఏ సమస్యా లేకుండా సినిమాను ప్రదర్శిస్తున్నాయిగా! దానివల్ల ఏమీ జరగలేదు. మరి మీరెందుకు నిలిపివేశారు? సినిమా నచ్చకపోతే ప్రజలే తిరస్కరిస్తారు’’ అని వ్యాఖ్యానించింది. -
మళ్లీ డిఫాల్ట్.. రూ.4,161 కోట్ల చెల్లింపుల్లో విఫలమైన జేపీ అసోసియేట్స్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్ కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్(జేఏఎల్) తాజాగా రూ. 4,161 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైంది. దీనిలో అసలు, వడ్డీ కలసి ఉన్నాయి. మార్చి31న రూ. 1,653 కోట్ల అసలు, రూ. 2,508 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కంపెనీ నియంత్రణ సంస్థలకు వెల్లడించింది. ఈ రుణాలు వివిధ బ్యాంకులకు చెందినవని తెలియజేసింది. వడ్డీసహా కంపెనీకున్న మొత్తం రుణ భారం రూ. 29,396 కోట్లుకాగా.. 2037కల్లా తిరిగి చెల్లించవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. వీటిలో రూ. 4,161 కోట్లు 2023 మార్చి31కల్లా చెల్లించవలసి ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రతిపాదిత ఎస్పీవీ పథకాన్ని వాటాదారులంతా ఆమోదించారని, ఎన్సీఎల్టీ అనుమతించవలసి ఉన్నదని తెలియజేసింది. ఇదీ చదవండి: బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు దీంతో ఎస్పీవీకి బదిలీ తదుపరి రూ. 18,051 కోట్లమేర రుణాలు తగ్గనున్నట్లు వివరించింది. కాగా.. జేఏఎల్‌కు వ్యతిరేకంగా 2018 సెప్టెంబర్‌లో ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. 2022 సెప్టెంబర్‌లో రూ. 6,893 కోట్ల చెల్లింపుల్లో వైఫల్యంపై పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ సైతం జేఏఎల్‌పై ఎన్సీఎల్టీ వద్ద ఫిర్యాదు చేసింది. కాగా.. ఇటీవల జేఏఎల్, గ్రూప్ సంస్థలు దాల్మియా భారత్‌కు మిగిలిన సిమెంట్ ఆస్తుల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డీల్ విలువ రూ. 5,666 కోట్లుకాగా.. రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా అంతక్రితం కంపెనీ 20 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ సామర్థ్యాలను ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్నకు 2014–2017 మధ్య విక్రయించింది. ఇదీ చదవండి: లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి -
'కెఫె కాఫీ డే' కు మరో ఎదురు దెబ్బ..కొండంత అప్పును మంచులా కరిగించేసింది..కానీ!
బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ప్రయివేట్ రంగ కంపెనీలు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ విఫలమైంది.సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ2)లో దాదాపు రూ. 466 కోట్లమేర అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కేఫె కాఫీ డే సంస్థ తెలిపింది. వీటిలో ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్ తదితర అన్‌లిస్టెడ్ రుణ సెక్యూరిటీలున్నట్లు పేర్కొంది. అయితే భర్త వీజీ సిద్ధార్థ మరణంతో కొండలా పేరుకు పోయినా అప్పును మాళవిక హెగ్డే మంచులా కరిగించేశారు.కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో కెఫె కాఫీ డే ఆర్ధిక వ్యవహారాలు బిజినెస్ వరల్డ్‌లో హాట్ టాపిగ్గా మారాయి. ఎందుకంటే? మాళవిక హెగ్డే మాళవిక హెగ్డే అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురిగా మాత్రమే మాళవిక హెగ్డే సుపరిచితం. ఇది అంత గతం. ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇక నుంచి ఆమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే.. భర్త మరణంతో వెలుగులోకి 2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కొండంత అప్పును మంచులా కరిగించేసింది కేఫె కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కెఫె కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా! -
లిక్విడిటీ సంక్షోభం: కాఫీ డే రూ. 470 కోట్ల డిఫాల్ట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం ఆఖరు నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మొత్తం రూ. 470.18 కోట్ల రుణాలు, వడ్డీల చెల్లింపులో డిఫాల్ట్ అయినట్లు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్) వెల్లడించింది. నగదు కొరత సంక్షోభం వల్లే రుణాలపై వడ్డీల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలిపింది. ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న క్యాష్ క్రెడిట్‌కు సంబంధించి రూ. 216 కోట్లు, వాటిపై రూ. 5.78 కోట్ల వడ్డీ, అలాగే రూ. 200 కోట్ల ఎన్సీడీలు, నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల చెల్లింపులు, వాటిపై రూ. 48.41 కోట్ల వడ్డీ ఉన్నట్లు సంస్థ పేర్కొంది. సీడీఈఎల్కు మొత్తం రూ. 495.18 కోట్ల రుణాలు ఉన్నాయి. -
ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ మళ్లీ డిఫాల్ట్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఈఎల్) మరోసారి డిఫాల్ట్ అయ్యింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకు (ఎన్సీడీ/బాండ్ల జారీ) సంబంధించి 2022 ఏప్రిల్ 13 నాటికి చెల్లించాల్సిన రూ.1.22 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు ఒక రెగ్యులేటీ ఫైలింగ్‌లో తెలిపింది. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఈ తరహా డిఫాల్ట్ వారంలో ఇది రెండవసారి. ఏప్రిల్ 12న ఎఫ్ఈఎల్ ఒక ప్రకటన చేస్తూ, ఎన్‌సీడీలకు సంబంధించి మొత్తం రూ.9.10 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు పేర్కొంది. 2021 అక్టోబర్ 13 నుంచి 2022 ఏప్రిల్ 12 మధ్య (ఎస్సీడీలకు సంబంధించి) ఈ వడ్డీ చెల్లింపుల్లో విఫలమయినట్లు వివరించింది. ఈ నెల ప్రారంభంలో ఎఫ్ఈఎల్ ఒక ప్రకటన చేస్తూ, ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి బ్యాంకింగ్ కన్సార్షియంకు రూ.2,836 కోట్ల డిఫాల్ట్ అయినట్లు వెల్లడించింది. రిలయన్స్ రిటైల్ వెంచర్‌కు ఫ్యూచర్ గ్రూప్ విక్రయించాలని ప్రతిపాదించిన 19 కంపెనీల్లో ఎఫ్ఈఎల్ ఒకటి. 2020 ఆగస్టు నాటి రూ.24,713 కోట్ల విలువైన ఈ డీల్‌పై అమెజాన్ లేవనెత్తిన వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్‌సహా పలు న్యాయ వేదికలపై విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. -
Sri Lanka Crisis: శ్రీ లంక సంచలన ప్రకటన
ఊహించిన స్థాయిలో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక సంచలన ప్రకటన చేసింది. దేశం దాదాపుగా దివాళా తీసిందని సూత్రప్రాయంగా సంకేతాలు పంపింది. విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ఇకపై తాము కట్టలేమని, వాటిని ఎగ్గొట్టే పరిస్థితి ఎదురయ్యిందని మంగళవారం ఆ దేశ ఆర్థిక శాఖ ఒక ప్రకటన లో పేర్కొంది. తీసుకున్న అప్పులను సమయంలోగా చెల్లించలేని స్థితిలో ఉన్నాం(డిఫాల్ట్). సుమారు 51 బిలియన్ డాలర్ల అప్పులను కట్టలేని పరిస్థితిలో ఉన్నట్లు స్పష్టం చేసింది శ్రీ లంక ఆర్థిక శాఖ. ప్రస్తుతం అప్పు చెల్లింపులు తమకు పెద్ద తలనొప్పిగా మారాయని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అన్నారు. ఇప్పుడు అప్పులు కట్టడం అసాధ్యం కూడా అని తేల్చి చెప్పారు. కారణం.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి బెయిల్ అవుట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. కాబట్టే, అప్పులను కట్టలేమని లంక పేర్కొంది. అలాగే తమకు అప్పులిచ్చిన దేశాలు వడ్డీ కావాలంటే.. దేశంలోనే వేరే ఇతర మార్గాలనుంచైనా వసూలు చేసుకోవచ్చని, లేదంటే.. శ్రీలంక రూపీల్లో కట్టించుకునేందుకు అంగీకరించాలని తేల్చి చెప్పింది. ట్విస్ట్.. అయితే అప్పుల ఎగవేతపై శ్రీలంక ఆర్థిక శాఖ కాసేపటికే మరో ప్రకటన చేసింది. అప్పులు చెల్లించడాన్ని తాత్కాలికంగా మాత్రమే రద్దు చేసుకున్నామని సెంట్రల్ బ్యాంక్ అధికారులు అంటున్నారు. మార్చి చివరినాటికి కేవలం $1.9 బిలియన్ల నిల్వలు ఉండగా, ఈ సంవత్సరం తన రుణ భారాన్ని తీర్చుకోవడానికి శ్రీలంకకు $7 బిలియన్లు అవసరమని అంచనాలు ఉన్నాయి. కడితే.. పెను సంక్షోభమే! ఇప్పుడున్న మిగులు విదేశీ నిధులతో.. అప్పులు గనుక కడితే తిండి గింజలు, నిత్యావసరాల దిగుమతులపై పెను ప్రభావం పడే ముప్పుందని అంటున్నారు అక్కడి ఆర్థిక నిపుణులు. ఈ నేపథ్యంలోనే అప్పుల చెల్లింపును తాత్కాలికంగా రద్దు చేసి ఆ డాలర్లను దిగుమతులకు చెల్లిస్తామని అంటున్నారు. 1948లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అత్యంత బాధాకరమైన తిరోగమనంలో పయనిస్తోంది. దేశంలోని 22 మిలియన్ల మంది ప్రజలకు సుదీర్ఘమైన విద్యుత్ కోతలతో పాటు తీవ్రమైన ఆహారం, ఇంధన కొరతలు విస్తృతమైన బాధలను తెచ్చిపెట్టాయి. సంబంధిత వార్త: తీవ్ర సంక్షోభానికి అసలు కారణం చెప్పిన లంక ప్రధాని -
ఎగబడి లోన్లు ఇచ్చిన బ్యాంక్.. చివరికి ‘చెత్త’ ఘనత
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు మోసిన ఆ బ్యాంకు.. భవిష్యత్తు మొత్తం తనదే అనే ప్రతిష్ట సంపాదించుకుంది. కానీ, పరిస్థితులు తలకిందులు అయ్యాయి. బ్యాంకుకు సంబంధించి రియల్టి విభాగం భారీ దెబ్బ వేసింది. పోటీతత్వంలో వెనుకంజ, అడ్డగోలుగా లోన్లు మంజూరు చేయడంతో పాటు ఎవర్‌గ్రాండ్ పరిణామాలు చెత్త బ్యాంక్ ట్యాగ్‌ను తగిలించాయి చివరికి!. చైనాకు చెందిన మిన్‌షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. కొన్నేళ్ల కిందటి దాకా ఆసియాలో ఇదే అతిపెద్ద బ్యాంక్‌గా ఉండేది. ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ దిగ్గజం అప్పుల ధాటికి బాధితురాలిగా మారిపోయింది ఈ బ్యాంక్. అడ్డగోలుగా ఇచ్చిన లోన్ల కారణంగా మిన్‌షెంగ్ దారుణంగా పతనం అయ్యింది. గత ఏడాది కాలంలో స్టాక్ ధరలు 31 శాతం దిగువన ట్రేడ్ అవుతున్నాయి. ఈ చెత్త పర్ఫార్మెన్స్ కారణంగా ఇప్పుడు మరో అప్రతిష్ట మూటగట్టుకుంది. బ్లూమ్‌బర్గ్ వరల్డ్ బ్యాంకుల ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన బ్యాంక్‌గా నిలిచింది మిన్‌షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. ఈ సూచీలో ప్రపంచంలోని మొత్తం 155 బ్యాంకులను పరిగణనలోకి తీసుకుంటుంది బ్లూమ్‌బర్గ్. పైకి.. ఆపై పతనం 1996లో బీజింగ్ కేంద్రంగా నాన్-స్టేట్ కంట్రోల్ లెండర్(చైనాలోనే తొలి ఘనత) కార్యకలాపాలను మొదలుపెట్టింది మిన్‌షెంగ్. అనంతి కాలంలోనే ప్రపంచంలో టాప్ 20 బ్యాంకింగ్ దిగ్గజాల సరసన నిలిచింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ బ్యాంక్.. 2022 కార్యాచరణను ప్రకటించుకుంది. లోకల్ బ్రాంచ్ మేనేజర్లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో పాటు ప్రాపర్టీ రుణాల హోల్డింగ్లను తగ్గించడం అత్యంత ప్రాధాన్యతగా పాటించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గించడం లాంటి హేయనీయమైన నిర్ణయాలు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రంగంపై పట్టు కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేస్తోంది. ముఖ్యంగా ప్రాపర్టీ ఇండస్ట్రీని పునాదులతో సహా కుదిపేస్తోంది. ఈ పరిణామాలను తట్టుకోలేక ఎడాపెడా డిస్కౌంట్లతో ఆకర్షణ కోసం ప్రయత్నించింది రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండ్. చివరకు డిఫాల్ట్ ప్రకటనతో బాంబుపేల్చగా.. గ్లోబల్ రియల్ ఎస్టేట్‌పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎవర్‌గ్రాండ్‌కు బిలియన్ డాలర్ల లోన్ కట్టబెట్టిన మిన్‌షెంగ్.. ఇప్పుడు లబోదిబోమంటోంది. సంబంధిత వార్త: పెనుసంక్షోభం అంచున డ్రాగన్.. ఆందోళనలో గ్లోబల్ బ్యాంకింగ్, రియల్టి రంగాలు! -
ఎల్గార్ కేసులో సుధాకు డిఫాల్ట్ బెయిల్
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబం ధాల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్‌కు బాంబే హైకోర్టు బుధవారం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. వరవరరావుతో సహా మరో 8 మంది నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధా భరద్వాజ్ డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులేనని ఉత్తర్వులో స్పష్టం చేసింది.బెయిల్ కండీషన్‌తోపాటు ఆమెను ఎప్పుడు విడుదల చేయాలన్నది ప్రత్యేక కోర్టే నిర్ణయిస్తుందని తెలిపింది. కేసు నమదైన 90 రోజుల్లోగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. దాఖలు చేయకుండా దర్యాప్తు సంస్థ 90 రోజులకు మించి నిందితుడిని తమ అదుపులో ఉంచుకోవడానికి వీల్లేదు. ఇలాంటి సందర్భాల్లో నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ పొందే అర్హత ఉంటుంది. సుధా భరద్వాజ్‌ను 2018 ఆగస్టులో పోలీసులు అదుపులోకి తీసుకొని, గృహ నిర్బంధంలో ఉంచారు. -
హెడ్జ్ ఫండ్ డిఫాల్టుతో బ్యాంకులకు భారీ నష్టాలు
బెర్లిన్: అమెరికాకు చెందిన ఓ హెడ్జ్ ఫండ్ డిఫాల్ట్ కావడంతో పలు పెద్ద బ్యాంకులు భారీగా నష్టాలు నమోదు చేయనున్నాయి. మార్జిన్ కాల్స్‌కి అవసరమైన నిధులను సమకూర్చడంలో సదరు సంస్థ విఫలం కావడమే ఇందుకు కారణం. ఆర్చిగోస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనే హెడ్జ్ ఫండ్ లావాదేవీలు ఈ పరిస్థితికి దారి తీసినట్లు సమాచారం. ‘మార్జిన్ అవసరాలకు అనుగుణంగా నిధులు సమకూర్చడంలో ఫండ్ విఫలం కావడంతో మా సంస్థ సహా పెద్ద సంఖ్యలో ఇతర బ్యాంకులకు ’గణనీయంగా నష్టాలు’ వాటిల్లాయి అని స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్ సూసీ తెలిపింది. జపాన్ దిగ్గజం నొమురా తమ నష్టాలు 2 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా వేసింది. హెడ్జ్ ఫండ్లు తమ స్టాక్స్ పోర్ట్‌ఫోలియోనూ పూచీకత్తుగా ఉంచి, ట్రేడింగ్ అవసరాల కోసం నిధులను సమకూర్చుకుంటూ ఉంటాయి. ఒకవేళ షేర్ల విలువ పడిపోతే నిర్దేశిత మార్జిన్ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడంలో విఫలమైతే ప్రతికూల పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తాజాగా ఆర్చిగోస్ కూడా ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకుంది. వయాకామ్సీబీఎస్తో పాటు పలు చైనా టెక్నాలజీ కంపెనీల స్టాక్స్‌లో ఆర్చిగోస్ భారీగా పొజిషన్లు తీసుకుంది. కానీ, వయాకామ్‌సీబీఎస్ షేర్ల ధరలు గణనీయంగా పతనం కావడంతో ఆర్చిగోస్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దానికి నిధులిచ్చిన ఆర్థిక సంస్థలపైనా ప్రతికూల ప్రభావం పడింది. -
మారిటోరియం పొడిగింపుతో మరిన్ని డిఫాల్ట్స్!
కరోనా కారక సంక్షోభంలో రుణగ్రహీతలు ఇక్కట్లు పడకుండా ఉండేందుకు రుణాల ఈఎంఐ చెల్లింపులపై విధించిన మారిటోరియాన్ని మరో మూడునెలలు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. దీంతో కస్టమర్లకు మొత్తం ఆరునెలల పాటు ఈఎంఐలపై మారిటోరియం విధించినట్లు కానుంది. ఇది కస్టమర్లకు కొంతమేర సంతోషం కలిగించే అంశమైనా, బ్యాంకులకు ఇబ్బందికలిగించే విషయమని, దీని కారణంగా డిఫాల్టులు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు రిటైల్ కస్టమర్లకు ఆప్ట్అవుట పద్ధతిపై హోల్‌సేల్ కస్టమర్లకు ఆప్ట్ ఇన్ పద్దతిపై మారిటోరియం సదుపాయం కల్పిస్తున్నాయి. ఎంత ఉన్నాయి? బ్యాంకులవారీగా చూస్తే ప్రస్తుతం బంధన్‌బ్యాంకు ఇచ్చిన రుణాల విలువలో 71 శాతం మారిటోరియం కింద ఉన్నాయి. ఆర్బీఎల్ రుణాల విలువలో 35 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, కోటక్బ్యాంకుల్లాంటి దిగ్గజాల రుణాల విలువలో 26-30 శాతం మేర మారిటోరియం కిందకు వస్తున్నాయి. 2008 సమయంలో ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో సాగు రంగంలో ఎన్పీఏలు 2012నాటికి 18 శాతానికి పెరిగాయి. నోట్లరద్దువేళ ఇచ్చిన మారిటోరియంతో ఎంఎఫ్‌ఐల ఆస్తుల నాణ్యత దెబ్బతిన్నది. ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని, ప్రస్తుతం ఎకానమీ పూర్తిగా స్తంభించిందని, అన్ని రంగాలు ఒత్తిడిలో ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల రుణాల చెల్లింపు మరింత ఆలస్యం కావచ్చంటున్నారు. ఎందుకు కష్టం? ఆరునెలల మారిటోరియం అనంతరం ఏడో నెల ఆరంభంలో రుణగ్రహీత ఆరునెలల వడ్డీని కలిపి చెల్లించాల్సిఉంటుందని, దీంతో చాలామంది కట్టకుండా ఎగ్గొట్టవచ్చని ప్రభుదాస్లీలాధర నిపుణుడు అజయ్ హెచ్చరించారు. వేతనాలు లేని ఈ వేళ అంతమొత్తం ఒకేసారి కట్టాలంటే కస్టమర్లకు ఇబ్బంది అవుతుందని, ఇది బ్యాంకుల పద్దులపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈఎంఐల మారిటోరియం కన్నా రుణ పునర్వ్యవస్థీకరణకు ఆర్బీఐ అనుమతించిఉండాల్సిందన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రధాన ఆదాయ వనరు జీతమేనని, ఇప్పుడున్న సందర్భంలో సరైన వేతనాల్లేక పెద్ద మొత్తాలు కట్టడం ఇబ్బందిగామారి రిటైలర్లు ఎక్కువగా డిఫాల్ట్ కావచ్చని కొందరి అంచనా. ఇందుకే రిటైల్ రుణాలెక్కువున్న బ్యాంకు షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. లాక్డౌన్ పూర్తయి ఎకానమీలో అన్ని కార్యకలాపాలు పుంజుకుంటేనే బ్యాంకులకు తగిలిన ఎదురుదెబ్బలపై స్పష్టత వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలేంటీ మారిటోరియం? మార్చి ప్రకటన అనంతరం చాలామంది కస్టమర్లు ఈ సదుపాయం వినియోగించుకున్నట్లు బ్యాంకులు తెలిపాయి. ముఖ్యంగా అగ్రి, మైక్రో, కమర్షియల్ వాహనాలు, క్రెడిట్ కార్డుల బకాయిలకు మారిటోరియం విజ్ఞప్తులు అధికంగా వచ్చాయి. లాక్డౌన్ కారణంగా ఆదాయాలు నిలిచిపోవడంతో కస్టమర్లు రుణ వాయిదాలు కట్టేందుకు ఇబ్బంది పడకూడదని ఆర్బీఐ ఈ వెసులుబాటు ఇచ్చింది. మారిటోరియం సదుపాయం వినియోగించుకున్న వాళ్లు ఈ వాయిదాలను తర్వాత కాలంలో చెల్లించాల్సిఉంటుంది. ఈ సదుపాయం వినియోగించుకొని వాయిదాలు చెల్లించలేకపోతే క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి నెగిటివ్ ప్రభావం ఉండదు. ఈ సదుపాయాన్ని ఈఎంఐ హాలిడే అని కూడా అంటారు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత కస్టమర్లు తిరిగి ఈఎంఐలు చెల్లించేందుకు సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
చిన్న సంస్థల రుణాలపై ఆర్బీఐ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: డిఫాల్ట్ అయిన చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రుణాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం డిఫాల్ట్ అయినప్పటికీ జనవరి 1 నాటికి ’స్టాండర్డ్’ స్థాయిలోనే ఉన్న రుణాలను వన్ టైమ్ పునర్వ్యవస్థీకరణకు అనుమతించింది. వివిధ రూపాల్లో తీసుకున్న రుణపరిమాణం రూ. 25 కోట్లు దాటని సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 2020 మార్చి 31 నాటికి పునర్వ్యవస్థీకరణ అమలు చేయాల్సి ఉంటుంది. -
పీఎస్‌యూల మెడకు ఎన్పీఏలు!
• డిఫాల్ట్ అరుున ప్రైవేటు కంపెనీల ఆస్తుల టేకోవర్‌కు కేంద్రం ఒత్తిడి • మార్చి 31 డెడ్‌లైన్ దగ్గరపడుతుండటమే కారణం • వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీలు... ముంబై: కొండలాపేరుకుపోతున్న మొండిబకారుుల(ఎన్పీఏ) సమస్య ఒకపక్క బ్యాంకులను బెంబేలెత్తిస్తుంటే.. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)కు కొత్త సమస్య వచ్చిపడింది. బ్యాంకులకు కోట్ల రూపారుుల్లో అప్పులు ఎగ్గొట్టి.. డిఫాల్ట్ అరుున ప్రైవేటు కంపెనీల ఆస్తులను టేకోవర్ చేసుకోవాలంటూ పీఎస్యూలపై మోదీ సర్కారు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. తద్వారా బ్యాంకుల మొండిబాకారుులను బ్యాలెన్‌సషీట్ల నుంచి తొలగించాలన్నది ప్రభుత్వ వ్యూహం. ప్రధానంగా పీఎస్‌యూ స్టీల్, విద్యుత్, షిప్పింగ్ కంపెనీలపై కేంద్రం దృష్టిపెట్టింది. అరుుతే, ఇందుకు ఆయా కంపెనీలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గడువు ముంచుకొస్తోంది... ఎన్పీఏల సమస్య పరిష్కారం కోసం బ్యాంకులు తమ మొండిబకారుులన్నింటినీ వచ్చే ఏడాది మార్చి 31లోగా పూర్తిగా ప్రకటించి.. వాటికి తగిన కేటారుుంపులు(ప్రొవిజనింగ్) చేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. మొండిబకారుులను వదిలించుకోవడానికి డిఫాల్ట్ అరుున కంపెనీలను వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ(ఎస్డీఆర్) పేరుతో టేకోవర్ చేసుకునే అధికారాలను కూడా ఆర్బీఐ బ్యాంకులకు కట్టబెట్టింది. ఇప్పటికే ఈ దిశగా కొన్ని బ్యాంకులు చర్యలు కూడా తీసుకొని.. కొన్ని డిఫాల్ట్ కంపెనీల్లో మెజారిటీ వాటాలను దక్కించుకున్నారుు కూడా. అరుుతే, దేశంలో అత్యధికంగా మొండిబకారుులు పేరుకుపోరుున స్టీల్, విద్యుత్, షిప్పింగ్ వంటి రంగాలకు చెందిన అనేక కంపెనీలకు సంబంధించి మొండిబకారుులను బ్యాలెన్‌సషీట్ల నుంచి తొలగించడం బ్యాంకులకు కత్తిమీదసామే. దీంతో కేంద్రం పీఎస్‌యూల నుంచి ఆయా ఆస్తులను కొనిపించి.. బ్యాంకులకు ఆ మేరకు రుణ బకారుుల నుంచి విముక్తి కలిగించే ప్రణాళికను రూపొందించింది. ఒక్క విద్యుత్ రంగంలోనే ఎన్పీఏలు రూ.4 లక్షల కోట్లకు ఎగబాకినట్లు అంచనా. ఇక స్టీల్ రంగానికి చెందిన కంపెనీల మొండిబకారుులు కూడా సుమారు రూ.3.5 లక్షల కోట్లుగా లెక్కతేలుతోంది. 23 కంపెనీల జాబితా... తీవ్రమైన మొండిబకారుుల సమస్య ఎదుర్కొంటున్న ఈ మూడు రంగాలను గాడిలో పెట్టే చర్యల్లో భాగంగా గత నెలలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అగ్రగామి బ్యాంక్ చీఫ్‌లతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఎస్బీఐ అధిపతి అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జైట్లీ.. స్టీల్, విద్యుత్, షిష్పింగ్ రంగాలకు చెందిన 23 కంపెనీల జాబితాను బ్యాంకులకు అందించినట్లు ఆయా వర్గాలు వెల్లడించారుు. ఈ కంపెనీల మొత్తం మొండిబకారుుల విలువ రూ. లక్ష కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బ్యాంకులకు ఈ గుదిబండను తగ్గించేందుకు పీఎస్‌యూలు ఆయా కంపెనీల్లో మైనారిటీ వాటాలను కొనుగోలు చేయాలని సూచించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించారుు. ఈ జాబితాలో భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, ఎలక్టోస్ట్రీల్ వంటివి ఉన్నారుు. జైట్లీతో భేటీకి సెరుుల్, ఎన్టీపీసీ, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లకు చెందిన సీఎండీలు కూడా హాజరయ్యారు. సెయిల్ నో...! మొండిబకారుుల సమస్యలో కూరుకుపోరుు.. నష్టాల్లో ఉన్న కంపెనీలకు చెందిన ఆస్తులను బ్యాంకర్లతో ఒప్పందం ద్వారా కొనుగోలు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెరుుల్ ప్రాథమికంగా వ్యతిరేకించినట్లు సమాచారం. అరుుతే, బ్యాంకర్లు మొండిబకారుుల విషయంలో కొంత వెసులువాటును కల్పిస్తే... సెరుుల్ ఈ ప్రతిపాదనలను పరిశీలించే అవకాశం ఉందని జైట్లీ సమావేశం తర్వాత ప్రధాని కార్యాలయానికి ఉక్కు శాఖ తెలియజేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించారుు. ఈ వ్యవహారంపై సెరుుల్ ఉన్నతాధికారులెవరూ ఇంకా నోరు విప్పడం లేదు. ఎన్పీఏలను విక్రరుుంచేందుకు బ్యాంకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. కొనేవారు లేకపోవడంతో బ్యాంకులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక ప్రత్యామ్నాయంగా పీఎస్యూలతోనే డిఫాల్ట్ కంపెనీల వాటాలను కొనిపించేలా ప్రభుత్వం బ్యాంకులకు దారిచూపిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నారుు. ఇలా అరుుతే, బ్యాంకులు తమ బకారుుల్లో 30-40 శాతం మేర వదులుకున్నా, ఎవరూ దీనిపై ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా ఉంటుందనేది ఈ చర్యల ప్రధానోద్దేశమని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. -
మరిన్ని కష్టాల్లో జిందాల్ స్టీల్
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త , మాజీ ఎంపీ నవీన్ జిందాల్ మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు . న్యూఢిల్లీకి చెందిన, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నాన్ కన్వెర్టబుల్ డిబెంచర్స్ చెల్లించని కారణంగా నష్టాల్లో కూరుకుపోయింది.రుణభారంతో సతమత మవుతున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ సెప్టెంబర్ 30 తేదీ నాటికి మార్పిడికి వీల్లేని డిబెంచర్ల(ఎన్సీడీలు)పై వడ్డీ చెల్లింపుల్లో విఫలమైన వార్తలతో మరోసారి కుదేలైంది. గురువారం నాటి మార్కెట్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో 5 శాతానికి పైగా నష్టపోయింది. ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపులో విఫమైనట్టు బీఎస్ ఈ ఫైలింగ్ లో బుధవారం జిందాల్ స్టీల్ వెల్లడించింది. జిందాల్ చెందిన 11 గ్రూపుల సెక్యూరిటీలు ఈ చెల్లింపుల్లో ఫెయిల్ అయినట్టు ప్రకటించింది. అయితే దీనికి కారణాలను కంపెనీ స్పష్టంగా వివరించ లేదు. 10ఏళ్ల కాలపరిమితిగల ఎన్‌సీడీలకు 9.8 శాతం కూపన్ రేటుకాగా, సెప్టెంబర్ 30న వీటిపై వడ్డీ చెల్లించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న సంస్థ నికర అప్పుల విలువ రూ.46,000 కోట్లను దాటింది. ఈ నేపథ్యంలో ఆస్తుల విక్రయంపై భారీ కసరత్తలులే చేస్తోంది. మరోవైపు కంపెనీ సీఈవో రవి ఉప్పాల అప్పులను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆస్తుల అమ్మకం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోనున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, మొజాంబిక్ దేశాల్లో ఉన్న కుకింగ్ కోల్ మైన్స్ విక్రయం ద్వారా నిధులను సమీకరించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి రవి నిరాకరించారు. -
పీఎఫ్ ఎగ్గొడుతున్న పదివేలకుపైగా కంపెనీలు
న్యూఢిల్లీ: దేశంలో దాదాపు పదివేల కంపెనీలు ఉద్యోగులు పీఎఫ్ సొమ్మును మింగేస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగుల జీతంనుంచి కట్ చేస్తున్న సొమ్మును జమ చేయకుండా మింగేస్తున్న కంపెనీల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్ర, జాతీయ కంపెనీలు అన్న తేడా లేకుండా కొన్ని ప్రధానమైన సంస్థలు కూడా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తేలింది. 2014-15లో 10,091 కంపెనీలు డిఫాల్టర్లుగా ఉంటే.. 2015 డిశెంబర్ నాటికి ఈ సంఖ్య 10,932 కు పెరిగింది. దాదాపు 22వందలకు పైగా కంపెనీలు 22వందల కోట్లకు పైగా ఉద్యోగులకు చెల్లించాల్సిన సొమ్మును ఈపీఎఫ్ఒ ఖాతాల్లో జమ చేయడంలేదు. దీనికి సంబంధించి తమకు వేలకొద్దీ ఫిర్యాదులు అందుతున్నాయని, ఈపీఎఫ్‌వో అధికారులు, యజమాన్యాలు కుమ్మక్కవుతున్నాయని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సెక్రటరీ, ఈపీఎఫ్ఓ ట్రస్టీ డీఎల్ సచ్దేవ్ విమర్శించారు. ఇటీవల కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, ఈపీఎఫ్‌వో సెంట్రల్ విజిలెన్స్ ఆఫీసర్ కు ఒక వివరణాత్మక ప్రశ్నాపత్నాన్ని పంపించినా సమాధానం లేదని ఆరోపించారు. అయితే తమిళనాడులో 2644, మహారాష్ట్రలో 1692, కేరళ, లక్షద్వీప్ తో కలిపి 1118 సంస్థలు ఉద్యోగుల పీఎఫ్ డిఫాల్టర్స్ గా తేలాయని లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 192 కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఇండియా టాప్ ప్లేస్ లో నిలిచింది. 2015-16 సం.రంలో పెండింగ్ లో ఉన్న ఈపీఎఫ్ ఫిర్యాదుల సంఖ్య గత సంవత్సరం కంటే 23 శాతం పెరిగింది. 228 పోలీసు కేసులు నమోదు అయ్యాయి. 2014-15లో రూ 3,240 కోట్ల రుణాలు చెల్లించలేదనే ఆరోపణలతో నమోదైన 14,000 కేసులు విచారణలోఉన్నాయి. కాగా ఒడిశా కు చెందిన సంజయ కుమార్ (27) తన తండ్రి ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి రూ .40,000 లు డ్రా చేయాలనుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం 30 రోజుల తరువాత రావాల్సిన పీఎఫ్ సొమ్ము 1,825 రోజులు గడిచిపోయినా చేతికందలేదు. ఇంతలో కుమార్ తండ్రి కృష్ణ చంద్ర (53) 2011 లో మరణించారు. పిఎఫ్ డబ్బును డ్రా చేయడంలో తనకు సహాయం చేయమనీ, ఈ విషయంలో తన తల్లి ఆందోళన చెందుతున్నారంటూ ఆన్ లైన్ ఫోరమ్ లో సంజయ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ లెక్కలు వెలుగులోకి వచ్చాయి. -
సుప్రీం కోర్టుకు డిఫాల్టర్ల జాబితా
పేర్లు బహిర్గతం చేయొద్దని ఆర్బీఐ వినతి న్యూఢిల్లీ: భారీగా తీసుకున్న రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయిన సంస్థల జాబితాను రిజర్వ్ బ్యాంక్ .. సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్లో అందజేసింది. అయితే, ఆయా సంస్థలపై ప్రతికూల ప్రభావం పడి, వ్యాపారాలు మరింత దిగజారే ప్రమాదమున్నందున పేర్లను బహిర్గతం చేయొద్దని కోరింది. తిరిగి చెల్లించలేకపోవడానికి కారణాలను పక్కన పెట్టి కేవలం డిఫాల్ట్ అయ్యిందనే ఏకైక ఉద్దేశంతో పేర్లు బైటపెట్టిన పక్షంలో ఆయా సంస్థలు కోలుకునే అవకాశాలున్నా నష్టపోయే ముప్పు ఉందని అఫిడవిట్లో ఆర్బీఐ పేర్కొంది. ఫలితంగా వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవనోపాధిపైనా ప్రతికూల ప్రభావం పడగలదని వివరించింది. మొండిబకాయిలు అంతకంతకూ పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని బెంచ్ .. దాదాపు రూ. 500 కోట్ల పైగా బ్యాంకు రుణాలను ఎగవేసిన డిఫాల్టర్ల జాబితా ఇమ్మంటూ గత నెలలో ఆర్బీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ పథకాల కింద రుణాలు రీకన్స్ట్రక్ట్ చేసిన కంపెనీల లిస్టును ఆరు వారాల్లోగా ఇవ్వాలని సూచించింది. సరైన మార్గదర్శకాలు, రికవరీ యంత్రాంగం లేకుండా బ్యాంకులు భారీ మొత్తాల్లో రుణాలెలా ఇచ్చేస్తున్నాయంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ప్రశ్నించింది. ప్రభుత్వం.. నియంత్రణ సంస్థల నుంచి అనుమతుల్లో జాప్యాలు, స్థల సమీకరణలో ఆలస్యం, రుణాల మంజూరీలో జాప్యాలు, వ్యాపార పరిస్థితుల్లో మందగమనంతో ప్రాజెక్టులు నిల్చిపోవడం తదితర అంశాలు డిఫాల్టులకు కారణాలవుతున్నాయని ఆర్బీఐ తెలిపింది. -
Wi Fiతో జర భద్రం
ఇంటర్నెట్.. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఆధారపడుతున్న సాధనం. ముఖ్యంగా యువత ఎక్కువగా నెట్‌కు ఆకర్షితులవుతున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేని వారు వైఫై ఎక్కడుంటుందో చూసుకుని మరీ వాడుకుంటున్నారు. అయితే ఈ వైఫైతో ఒకరి ఇంటర్నెట్ కనెక్షన్‌ను వాడుకోవడం ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల చేయని తప్పులకు బాధ్యులు కావాల్సి వస్తుందంటున్నారు. నెట్ సెంటర్లతోపాటు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ప్రతీ ఒక్కరు పాస్వర్డ్ సిస్టమ్స్‌తోపాటు లాక్ వేసుకోవడం, వినియోగించిన తర్వాత ఆఫ్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. వైఫైతో జరిగే అనర్థాలు, వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలి తదితర విషయాలపై కథనం.. వైఫై అంటే.. వైఫై అంటే వైర్లెస్ ఫెడిలిటీ. రేడియో తరంగాలను ఉపయోగించి ఇంటర్నెట్ కనెక్షన్ పొందే ఒక వైర్లెస్ సాంకేతికత. ఈ వైఫై ఆధారంగా కేబుల్ అవసరం లేకుండా ఒక ఇంట్లో లేదా కార్యాలయంలో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్‌పై ఆధారపడి సమీప ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లలో ఇంటర్నెట్ సులువుగా వాడుకోవచ్చు. ఒక హాట్‌స్పాట్ నుంచి 20 మీటర్లు(66 అడుగులు) వరకు ఇండోర్‌లో అంతకంటే ఎక్కువ దూరం వరకు అవుట్‌డోర్‌లో వాడుకోవచ్చు. ఫైర్‌వాల్స్ డిజిబుల్ కావద్దు ప్రతీ కంప్యూటర్, రూటర్లలో ఉన్న ఫైర్‌వాల్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఆధునికంగా తయారవుతున్న రూటర్లలో బిల్ట్ ఇన్ ఫైర్‌వాల్స్ ఉంటున్నాయి. వాటిని డిజేబుల్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.అందుకే ఎల్లప్పుడూ ఫైర్‌వాల్స్ ఆన్‌లో ఉండేలా చూసుకుంటూ వినియోగించిన ప్రతీ సారి చెక్ చేసుకోవాలి. ఢీఫాల్ట్లు వద్దే వద్దు చాలా వరకు రూటర్లు డీఫాల్ట్ లాగిన్, పాస్ వర్డ్స్‌తో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కనె క్షన్ వినియోగంలో వీటిని కొనసాగించకూడదు. కనెక్షన్ పొందిన వెంటనే సొంతంగా మీరే లాగిన్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. డీఫాల్ట్ వివరాలను హ్యాక్ చేయడం చాలా తేలిక. యాక్సిస్ పాయింట్ అందుబాటులో వద్దు వైఫై కనెక్షన్ ఇన్ స్టాల్ చేసే సందర్భంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీని యాక్సిస్ పాయింట్, రూటర్లు బయటివారికి అందుబాటులో లేకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంతవరకు కిటికీలకు దూరంగా ఉండడం మేలు. ఎంఏసీ అడ్రస్ ఫిల్టర్స్ వదలద్దు ప్రతీ వైర్లెస్ డివైస్‌కు ఒక ప్రత్యేకమైన మీడియా యాక్సిస్ కంట్రోల్ (ఎంఏసీ) అడ్రస్ ఉంటుంది. యాక్సిస్ పాయింట్లు, రూటర్లు వాటికి కనెక్ట్ అయి ఉన్న ప్రతీ డీవైస్ కు సంబంధించిన ఈ ఎంఏసీ అడ్రస్‌ను ట్రాక్ చేస్తుంటాయి. హ్యాకింగ్‌కు దూరంగా ఉండాలంటే వైఫై కనెక్షన్‌కు సంబంధించిన ఎంఏసీ అడ్రస్ ఫిల్టర్స్‌ను ఎనేబుల్గా ఉంచుకోవాలి. టర్న్ ఆఫ్ విషయం మరవద్దు కొంత కాలంపాటు వైఫై కనెక్షన్ వాడని పక్షంలో నెట్వర్క్ అందుబాటును టర్న్ ఆఫ్ చేయడం మరవకూడదు. నెట్‌వర్క్‌ను షట్ డౌన్ చేయడం వల్ల హ్యాకింగ్ చేసుకునేందుకు ఆస్కారం ఉండదు. కనెక్షన్ బ్రేక్ చేయడానికి అవకాశం చిక్కదు. ఆటో కనెక్ట్ అసలే వద్దు వైఫై వినియోగంలో ఆటో కనెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దు. దీని వల్ల సమీపంలోని ఏ రూటర్ నుంచైనా కనెక్ట్ కావడం వంటి వాటితో మీకు సౌకర్యవంతంగా అనిపించినా, అంతకంటే ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెడుతుందని మరవద్దు. ఆటోకనెక్ట్ వాడటం వల్ల మీ కంప్యూటర్, కనెక్షన్స్‌కు సెక్యూరిటీ రిస్క్‌తో పాటు ఎటాక్స్ ముప్పు ఉంటుందని గుర్తించుకోండి. -
అమెరికా ‘షట్‌డౌన్’కు తెర..!
వాషింగ్టన్: రెండు వారాలకుపైగా కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాల నిలిపివేత (షట్‌డౌన్), రుణ పరిమితి పెంపు సంక్షోభానికి సంబంధించి పాలక డెమోక్రాట్లు-ప్రతిపక్ష రిపబ్లికన్లు ఒక అంగీకారానికి వచ్చారు. టాప్ సెనేట్ నాయకులు బుధవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. దీనితో డిఫాల్ట్ గడప ముందు ఉన్న అమెరికాకు పెద్ద ఊరట లభించినట్లయ్యింది. షట్డౌన్కు తెరపడి.. త్వరలో ప్రభుత్వ కార్యాలయాలు తెరచుకునేందుకు మార్గం సుగమం అవుతోంది. సెనేట్ మెజారిటీ డెమోక్రాటిక్ నేత హ్యారీ రీడ్ ఒప్పందం కుదిరిన విషయాన్ని సెనేట్‌లో వెల్లడించారు. తమ రాజీ ఒప్పందం అమెరికా ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష రిపబ్లికన్లకు పట్టున్న హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్(ప్రతినిధుల సభ) దీనిపై త్వరలో ఓట్ చేస్తుందని కూడా ఆయన వెల్లడించారు. సెనేట్‌లో రిపబ్లికన్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్‌కన్నెల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘‘ఈ వారం అంతా ప్రపంచం కళ్లన్నీ వాషింగ్టన్ మీద ఉన్నాయి. రాజకీయ వైరుధ్యాల తొలగింపు దిశలో పాలక, ప్రతిపక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనివల్ల అటు ప్రభుత్వం షట్‌డౌన్ సమస్యకు, ఇటు రుణ డిఫాల్ట్ సమస్యకు పరిష్కారం లభించనుంది’’ అని హరీ రైడ్ అన్నారు. కొత్త రాజీ ఒప్పందం ప్రకారం, ప్రభుత్వం కార్యకలాపాలు వచ్చే జనవరి 15 వరకూ తిరిగి యథాతథంగా నడిచేందుకు వీలవుతుంది. అదేవిధంగా వచ్చే ఫిబ్రవరి 7 వరకూ ప్రభుత్వం రుణ సమీకరణకు ఎలాంటి ఆటంకం ఉండదు. దీనిప్రకారం, ఇక వివాదాస్పద ఒబామాకేర్ చట్టం జోలికీ వెళ్లరు. ఫలితంగా ఇరుపక్షాలూ బడ్జెట్, రుణ పరిమితి పెంపు అంశాలపై ఒక దీర్ఘకాలిక ఒప్పందానికి వచ్చేందుకు, తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు కొంత వ్యవధి చిక్కుతుందని హ్యారీ రీడ్ తెలిపారు. కాగా, ఒప్పందం కుదిరినట్లు హరీ రైడ్ ప్రకటించినా... కొందరు అతివాద రిపబ్లికన్లు బిల్లులను వ్యతిరేకించే ప్రమాదం లేకపోలేదని వార్తలొస్తున్నాయి. అయితే ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు, మితవాద రిపబ్లికన్ల మద్దతుతో బిల్లు పాసవ్వొచ్చని పరిశీలకులు అంచనా. బడ్జెట్ బిల్లులు ఆమోదం పొందకపోవడంతో రెండు వారాలకుపైగా(బుధవారానికి 16 రోజులు) కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాల మూసివేత(షట్‌డౌన్)కు రుణ పరిమితి పెంపు గండం కూడా ఆజ్యం పోసింది. దీంతో.. అమెరికా రుణాల తిరిగిచెల్లింపుల విషయంలో చేతులెత్తేసే(డిఫాల్ట్) పరిస్థితికి దారితీస్తుందనే భయాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే దేశ రుణ పరపతి రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయొచ్చని టాప్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఇప్పటికే హెచ్చరించింది. కాగా, రుణ పరిమితిని ఇప్పుడున్న 16.7 లక్షల కోట్ల(ట్రిలియన్) డాలర్ల నుంచి పెంచడం అమెరికాకు తక్షణావసరం. దీనికి నేటి(17న) అర్ధరాత్రితో గడువు ముగియనుంది. మంటగలుస్తున్న అమెరికా ప్రతిష్ట... ఒబామా ఆరోగ్య బీమా పథకం(ఒబామాకేర్)పై వ్యతిరేకతతో రిపబ్లికన్లు బడ్జెట్ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో.. 17 ఏళ్ల తర్వాత తొలిసారి షట్డౌన్కు దారితీసింది. దీంతో 8 లక్షల మందికిపైగా ప్రభుత్వోద్యోగులు విధులకు దూరమయ్యారు. అత్యవసర సేవలు మినహా ఇతర ప్రభుత్వ సేవలన్నీ నిలిచిపోయాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కుమ్ములాటలతో అమెరికా ఆర్థిక వ్యవస్థతోపాటు దేశ ప్రతిష్టపై కూడా మాయనిమచ్చపడిందని అక్కడి మీడియా, ఆర్థిక నిపుణులు కూడా తీవ్రంగానే దుమ్మెత్తిపోస్తున్నారు. డిఫాల్ట్‌తో అన్ని దేశాలపైనా ప్రభావం రుణ పరిమితి డెడ్‌లైన్ ముంచుకొస్తున్నా... బిల్లు ఆమోదం పొందడంలో గందరగోళం నెలకొనడంతో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్.. అమెరికా రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయ్చొచ్చనే హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుతం ఆ దేశానికి ఉన్న ‘ఏఏఏ’ టాప్ రేటింగ్‌ను నెగటివ్ వాచ్‌లో పెట్టింది. అయితే, ఆఖరి నిమిషంలో పాలక, ప్రతిపక్షాల మధ్య డీల్ కుదరడంతో ఉపశమనం లభించినట్లయింది. రుణ పరిమతి పెంపునకు నేటి అర్ధరాత్రిలోగా ఆమోదం పొందకపోతే అమెరికా ప్రభుత్వం కొన్ని రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రెజరీ విభాగం నిధుల కోసం మరిన్ని బాండ్లను జారీచేసేందుకు అవకాశం ఉండదు. దీంతో చెల్లింపులను నిలిపేయడం లేదా వ్యయాల్లో కోతకు దారితీస్తుంది. ఇదే జరిగితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ చిక్కుల్లోపడటంతోపాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్లను కూడా కుదిపేసే ప్రమాదం ఉందని బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు హెచ్చరించారు. కాగా, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, రుణ బిల్లుల చెల్లింపునకు తగినంత నిధులను సమీకరించగలమన్న విశ్వాసాన్ని వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి జే కార్నే వ్యక్తం చేశారు. అయితే, రుణపరిమితి పెంపునకు ఆమోదం పొందినా, పొందకపోయినా తక్షణం డీఫాల్ట్ ముప్పేమీ ఉండబోదని కొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఏప్రిల్ నాటికి అమెరికా ట్రెజరీ వద్ద 200 బిలియన్ డాలర్ల నిధులు ఉండగా.. ప్రస్తుతం ఇవి 39 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అంటే తాజా రుణాల సమీకరణ కాస్త ఆలస్యమైనా, చెల్లింపుల్లో డిఫాల్ట్ తక్షణం ఉండదనేది వారి వాదన.