
న్యూఢిల్లీ: డిఫాల్ట్ అయిన చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) రుణాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం డిఫాల్ట్ అయినప్పటికీ జనవరి 1 నాటికి ’స్టాండర్డ్’ స్థాయిలోనే ఉన్న రుణాలను వన్ టైమ్ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించింది. వివిధ రూపాల్లో తీసుకున్న రుణపరిమాణం రూ. 25 కోట్లు దాటని సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 2020 మార్చి 31 నాటికి పునర్‌వ్యవస్థీకరణ అమలు చేయాల్సి ఉంటుంది.