ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మళ్లీ డిఫాల్ట్‌ | Future Enterprises defaults on Rs 1. 22 cr interest payment for NCDs | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మళ్లీ డిఫాల్ట్‌

Published Sat, Apr 16 2022 1:19 AM | Last Updated on Sat, Apr 16 2022 1:19 AM

Future Enterprises defaults on Rs 1. 22 cr interest payment for NCDs - Sakshi

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఎఫ్‌ఈఎల్‌) మరోసారి డిఫాల్ట్‌ అయ్యింది. నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లకు (ఎన్‌సీడీ/బాండ్ల జారీ) సంబంధించి 2022 ఏప్రిల్‌ 13 నాటికి చెల్లించాల్సిన రూ.1.22 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు ఒక రెగ్యులేటీ ఫైలింగ్‌లో తెలిపింది. కిషోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థ  ఈ తరహా డిఫాల్ట్‌ వారంలో ఇది రెండవసారి. ఏప్రిల్‌ 12న  ఎఫ్‌ఈఎల్‌ ఒక ప్రకటన చేస్తూ, ఎన్‌సీడీలకు సంబంధించి మొత్తం రూ.9.10 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు పేర్కొంది.

2021 అక్టోబర్‌ 13 నుంచి 2022 ఏప్రిల్‌ 12 మధ్య (ఎస్‌సీడీలకు సంబంధించి) ఈ వడ్డీ చెల్లింపుల్లో విఫలమయినట్లు వివరించింది. ఈ నెల ప్రారంభంలో ఎఫ్‌ఈఎల్‌ ఒక ప్రకటన చేస్తూ, ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి బ్యాంకింగ్‌ కన్సార్షియంకు రూ.2,836 కోట్ల డిఫాల్ట్‌ అయినట్లు వెల్లడించింది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌కు ఫ్యూచర్‌ గ్రూప్‌ విక్రయించాలని ప్రతిపాదించిన 19 కంపెనీల్లో ఎఫ్‌ఈఎల్‌ ఒకటి. 2020 ఆగస్టు నాటి రూ.24,713 కోట్ల విలువైన ఈ డీల్‌పై అమెజాన్‌ లేవనెత్తిన వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌సహా పలు న్యాయ వేదికలపై విచారణలో ఉన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement