Bonds Issue
-
ఎస్బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాజాగా రూ.10,000 కోట్లు సమీకరించింది. ఏడోసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ ద్వారా పెట్టుబడులు సమకూర్చుకుంది. 15 ఏళ్ల కాలపరిమితిగల వీటికి కూపన్ రేటు 7.23 శాతంకాగా.. రూ.11,500 కోట్లకుపైగా విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. నిజానికి బ్యాంక్ రూ.5,000 కోట్ల విలువైన బాండ్ల జారీకి తెరతీసింది. అధిక బిడ్డింగ్ నమోదైతే మరో రూ.5,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించేందుకు గ్రీన్‌షూ ఆప్షన్(ఓవర్ అలాట్మెంట్)ను ఎంచుకుంది. వెరసి బాండ్ ఇష్యూకి రెండు రెట్లు అధికంగా స్పందన లభించింది.ఇదీ చదవండి: లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లుబిడ్ చేసిన సంస్థలలో ప్రావిడెంట్ ఫండ్స్, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ తదితరాలున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల హౌసింగ్ విభాగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులుగా తాజా నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఎస్బీఐ జారీ చేసిన బాండ్లకు స్థిరత్వ ఔట్లుక్సహా ఏఏఏ రేటింగ్‌ను పొందింది. వీటి జారీతో దీర్ఘకాలిక బాండ్లపై ఇతర బ్యాంకులు సైతం దృష్టి సారించేందుకు వీలు చిక్కినట్లు ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. -
రూ. 20,000 కోట్ల ఇన్ఫ్రా బాండ్ల జారీ
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ స్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనుంది. ఇందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేయనుంది. ఈ బాటలో మరో పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రమోట్ చేసిన పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సైతం బాండ్ల జారీ ద్వారా పెట్టుబడులను సమకూర్చుకోనుంది. రూ. 20,000 కోట్లు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని చేపట్టనుంది. తద్వారా ఈ ఏడాది తొలిసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీకి తెరతీయనుంది. ఈ ఆరి్థక సంవత్సరం(2024–25)లోగా బాండ్ల విక్రయాన్ని నిర్వహించేందుకు ఎస్బీఐ బోర్డు తాజాగా అనుమతించింది. పబ్లిక్ ఇష్యూ లేదా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 20,000 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు ఆమోదించింది. వెరసి దీర్ఘకాలిక బాండ్ల జారీకి జులై మొదటి వారంలో బిడ్స్‌ను ఆహా్వనించవచ్చని మర్చంట్ బ్యాంకర్లు తెలియజేశారు. ఇప్పటికే ఎస్బీఐ మార్కెట్ వర్గాలతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 10–15 ఏళ్ల కాలావధితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ యోచనలో ఉంది. జనవరిలో పెర్పెట్యువల్ బాండ్ల జారీ ద్వారా రూ. 5,000 కోట్లు అందుకున్న సంగతి తెలిసిందే. వీటికి కూపన్ రేటు 8.34 శాతంకాగా.. ఇంతక్రితం 15ఏళ్ల కాలపరిమితితో గతేడాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని చేపట్టి రూ. 20,000 కోట్లు సమీకరించింది. ఎస్బీఐలో కేంద్ర ప్రభుత్వం 57.49 శాతం వాటాను కలిగి ఉంది.పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా..మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు)ను జారీ చేయనున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో ఒకేసారి లేదా దశలవారీగా ఎన్సీడీల జారీని చేపట్టనున్నట్లు పేర్కొంది. నిధులను బిజినెస్ వృద్ధికి వినియోగించనున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ తెలియజేసింది. ఈ మారి్టగేజ్ సంస్థ అందుబాటు ధరల గృహ విభాగంపై దృష్టిపెట్టడం ద్వారా ఈ ఏడాది లోన్‌బుక్‌లో 17 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది(2023–24)లో లోన్‌బుక్ రూ. 63,000 కోట్లకు చేరింది. బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1 శాతం బలహీనపడి రూ. 836 వద్ద నిలవగా.. పీఎన్బీ హౌసింగ్ షేరు 1 శాతం నీరసించి రూ. 784 వద్ద ముగిసింది. -
రూ.3,717 కోట్లను సమీకరించిన ఎస్బీఐ
ముంబై: ఎస్బీఐ అడిషనల్ టైర్ 1 (ఏటీ1) బాండ్ల జారీ ద్వారా రూ.3,717 కోట్లను సమీకరించినట్టు ప్రకటించింది. 8.25 శాతం కూపన్ రేటు (వడ్డీ రేటు)పై ఈ బాండ్లను జారీ చేసినట్టు తెలిపింది. ఈ నిధులతో ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా క్యాపిటల్ అడెక్వసీ రేషియో బలపడుతుందని పేర్కొంది. పదేళ్ల తర్వాత కాల్ ఆప్షన్‌తో వీటిని జారీ చేసినట్టు ప్రకటించింది. ఈ ఇష్యూకి అధిక స్పందన వచ్చిందని, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయని వెల్లడించింది. రూ.2,000 కోట్ల బేస్ ఇష్యూకి గాను, 2.27 రెట్లు బిడ్లు వచ్చాయని (రూ.4,537 కోట్లు) ఎస్బీఐ తన ప్రకటనలో తెలిపింది. -
గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో విడత సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ 19న ప్రారంభం కానుంది. ఈ నెల 23న ఇష్యూ ముగుస్తుంది. ఇందులో భాగంగా ఒక గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409 అని ఆర్బీఐ ప్రకటించింది. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఎనిమిదేళ్లు. పెట్టుబడి నాటికి ప్రకటించిన గ్రాము బంగారం విలువ ఆధారంగా వార్షికంగా 2.5 శాతం వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. గడువు తీరిన తర్వాత వచ్చే రాబడి, పెట్టుబడి మొత్తంపై పన్ను ఉండదు. ఒక ఇన్వెస్టర్ కనీసం ఒక గ్రాము నుంచి, గరిష్టంగా 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఆన్లైన్ పేమెంట్ చేసిన వారికి ఒక గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది. -
బాండ్ల జారీపై ఎస్బీఐ కన్ను
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) బాండ్ల జారీకి సిద్ధపడుతోంది. టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు బ్యాంకు బోర్డు అనుమతించినట్లు తాజాగా వెల్లడించింది. అదనపు టైర్–1(ఏటీ–1) బాండ్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లవరకూ సమకూర్చుకునే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందవలసి ఉన్నట్లు తెలియజేసింది. బాసెల్–3 నిబంధనలకు అనుగుణమైన రుణ సెక్యూరిటీల జారీ ద్వారా 2024వరకూ నిధుల సమీకరణపై సెంట్రల్ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు ఎస్బీఐ వివరించింది. నిధులను లోన్ బుక్ వృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది. అధిక విలువగల గృహ రుణాలు మినహా వ్యక్తిగత బ్యాంకింగ్ అడ్వాన్సులు రూ. 5 లక్షల కోట్లను దాటినట్లు గత వారమే ఎస్బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. చివరి రూ. లక్ష కోట్ల రుణాల మంజూరీకి ఏడాది కాలంపట్టగా.. అంతకుముందు 15 నెలల్లో ఈ ఫీట్ సాధించినట్లు తెలియజేసింది. దీనికంటే ముందు రూ. లక్ష కోట్ల రుణ విడుదలకు 30 నెలలు పట్టడం గమనార్హం! ఈ వార్తల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం బలపడి రూ. 625 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 627 సమీపంలో 52 వారాల గరిష్టానికి చేరింది! -
ఐసీఐసీఐ బ్యాంక్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ బాండ్ల జారీని చేపట్టింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించింది. బిజినెస్ వృద్ధికి నిధులను వినియోగించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. రిడీమబుల్ డిబెంచర్ల రూపేణా 50,000 సీనియర్ సెక్యూర్డ్ దీర్ఘకాలిక బాండ్లను జారీ చేసినట్లు బ్యాంక్ తెలియజేసింది. ప్రయివేట్ ప్లేస్మెంట్లో భాగంగా వీటిని ఈ నెల 12న(సోమవారం) జారీ చేసినట్లు వెల్లడించింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. 7.63 శాతం కూపన్ రేటుతో వార్షిక చెల్లింపులకు వీలున్న ఈ బాండ్లు ఏడేళ్ల తదుపరి అంటే 2029 డిసెంబర్ 12న రిడీమ్ కానున్నట్లు వెల్లడించింది. ఎన్ఎస్ఈలోని సంబంధిత విభాగంలో ఇవి లిస్ట్‌కానున్నట్లు తెలియజేసింది. -
సావరీన్ గ్రీన్ బాండ్ల జారీకి ఫ్రేమ్‌వర్క్
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సావరీన్ గ్రీన్ బాండ్లను జారీ చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (2022–23 అక్టోబర్–మార్చి) గ్రీన్ బాండ్ల జారీ ద్వారా రూ.16,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం కేంద్ర రుణ సమీకరణలో (రూ.5.92 లక్షల కోట్లు) ఈ నిధులు భాగం కానున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022–23 బడ్జెట్లో సావరీన్ గ్రీన్ బాండ్ల జారీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ప్యారిస్ ఒప్పందం లక్ష్యాలపై భారత్ నిబద్ధతను ఈ ఫ్రేమ్‌వర్క్ బలోపేతం చేస్తుందని అన్నారు. అలాగే అర్హతగల గ్రీన్ ప్రాజెక్ట్‌ల్లోకి ప్రపంచ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపారు. ఫ్రేమ్‌వర్క్‌లో ముఖ్యాంశాలు... ► గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల అవసరాలకు అనుగుణంగా, ఎకానమీలో కార్బన్ తీవ్రత తగ్గింపు లక్ష్యంగా జారీఅయ్యే ఈ రూపాయి డినామినేటెడ్ బాండ్ల సుదీర్ఘ కాల వ్యవధిని కలిగి ఉంటాయి. ► గ్రీన్ బాండ్ల జారీకి గరిష్టంగా 12 నెలల ముందు జరిగిన ప్రభుత్వ వ్యయాలకు ఈ సమీకరణ నిధులు పరిమితమవుతాయి. అలాగే జారీ చేసిన 24 నెలల్లోపు మొత్తం ఆదాయాన్ని ప్రాజెక్టులకు కేటాయించేలా కృషి జరగనుంది. ► గ్రీన్ బాండ్ల జారీ ద్వారా వచ్చే ఆదాయాన్ని శిలాజ ఇంధనాల వెలికితీత, ఉత్పత్తి, పంపిణీ లేదా అణు విద్యుత్ ప్రాజెక్టులకు వినియోగించరాదు. ► అర్హత కలిగిన పెట్టుబడులు, సబ్సిడీలు, గ్రాంట్–ఇన్–ఎయిడ్స్ లేదా పన్ను మినహాయింపులు లేదా ఎంపిక చేసిన కార్యాచరణ ఖర్చుల రూపంలో గ్రీన్ బాండ్ల ప్రభుత్వ వ్యయాలు ఉంటాయి. -
ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ మళ్లీ డిఫాల్ట్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఈఎల్) మరోసారి డిఫాల్ట్ అయ్యింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకు (ఎన్సీడీ/బాండ్ల జారీ) సంబంధించి 2022 ఏప్రిల్ 13 నాటికి చెల్లించాల్సిన రూ.1.22 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు ఒక రెగ్యులేటీ ఫైలింగ్‌లో తెలిపింది. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఈ తరహా డిఫాల్ట్ వారంలో ఇది రెండవసారి. ఏప్రిల్ 12న ఎఫ్ఈఎల్ ఒక ప్రకటన చేస్తూ, ఎన్‌సీడీలకు సంబంధించి మొత్తం రూ.9.10 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు పేర్కొంది. 2021 అక్టోబర్ 13 నుంచి 2022 ఏప్రిల్ 12 మధ్య (ఎస్సీడీలకు సంబంధించి) ఈ వడ్డీ చెల్లింపుల్లో విఫలమయినట్లు వివరించింది. ఈ నెల ప్రారంభంలో ఎఫ్ఈఎల్ ఒక ప్రకటన చేస్తూ, ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి బ్యాంకింగ్ కన్సార్షియంకు రూ.2,836 కోట్ల డిఫాల్ట్ అయినట్లు వెల్లడించింది. రిలయన్స్ రిటైల్ వెంచర్‌కు ఫ్యూచర్ గ్రూప్ విక్రయించాలని ప్రతిపాదించిన 19 కంపెనీల్లో ఎఫ్ఈఎల్ ఒకటి. 2020 ఆగస్టు నాటి రూ.24,713 కోట్ల విలువైన ఈ డీల్‌పై అమెజాన్ లేవనెత్తిన వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్‌సహా పలు న్యాయ వేదికలపై విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. -
ఆర్ఐఎల్కు భారీ నిధులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా 4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 30,000 కోట్లు) సమీకరించింది. తద్వారా గరిష్టస్థాయిలో ఫారెక్స్ బాండ్లను జారీ చేసిన తొలి దేశీ కార్పొరేట్‌గా నిలిచింది. మూడు దశలలో జారీ చేసిన ఈ బాండ్ల ద్వారా సమకూర్చుకున్న నిధులను రుణ చెల్లింపులకు వినియోగించే ప్రణాళికల్లో ఉంది. ఫిబ్రవరిలో గడువు తీరనున్న 1.5 బిలియన్ డాలర్ల రుణం దీనిలో కలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఫారెక్స్ బాండ్ల ఇష్యూకి దాదాపు 3 రెట్లు అధిక రెస్పాన్స్ లభించినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. వెరసి 11.5 బిలియన్ డాలర్లమేర డిమాండ్ కనిపించినట్లు వెల్లడించింది. అతిపెద్ద ఇష్యూగా రికార్డు... ఆర్ఐఎల్ తాజా నిధుల సమీకరణ దేశంలోనే అతిపెద్ద విదేశీ కరెన్సీ బాండ్ లావాదేవీగా నమోదైంది. గతంలో పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ 2014లో చేపట్టిన 2.2 బిలియన్ డాలర్ల ఫారెక్స్ బాండ్ల ఇష్యూ ఇప్పటివరకూ రికార్డుగా నమోదైంది. ఆర్ఐఎల్ 2.875 శాతం కూపన్ రేటుతో 10 ఏళ్ల కాలపరిమితి బాండ్ల జారీ ద్వారా 1.5 బిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ బాటలో 3.625 శాతం రేటుతో 30ఏళ్ల కాలావధిగల బాండ్ల జారీ ద్వారా 1.75 బిలియన్ డాలర్లను అందుకుంది. ఇదేవిధంగా 3.75 శాతం రేటుతో 40 ఏళ్ల బాండ్ల జారీ ద్వారా 0.75 బిలియన్ డాలర్లను సమకూర్చుకుంది. జపాన్ వెలుపల బీబీబీ రేటింగ్ కలిగిన ఒక ఆసియా కంపెనీ 40 ఏళ్ల కాలపరిమితిగల డాలర్ బాండ్లను జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం! మూడు కాలావధులుగల ఈ బాండ్ల గడువు 2032–2062 మధ్య కాలంలో ముగియనుంది. యూఎస్ ట్రెజరీలతో వీటి కూపన్(వడ్డీ) రేట్లు అనుసంధానమై ఉన్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. తద్వారా వీటి కూపన్ రేట్లను ట్రెజరీలకంటే 1.2 శాతం, 1.6 శాతం, 1.7 శాతం చొప్పున అధికంగా నిర్ణయించినట్లు తెలియజేసింది. అంతేకాకుండా అతితక్కువ కూపన్ రేటుతో వీటిని జారీ చేసినట్లు తెలియజేసింది. డన్జోలో రిలయన్స్ రిటైల్‌కు వాటాలు 25.8 శాతం కొనుగోలు డీల్ విలువ రూ. 1,488 కోట్లు దేశీ రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్.. ఆన్లైన్ నిత్యావసర సరుకుల డెలివరీ విభాగంలో కార్యకలాపాలు విస్తరించడంపై మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా క్విక్ కామర్స్ సంస్థ డన్జోలో 25.8 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,488 కోట్లు). ప్రస్తుత ఇన్వెస్టర్లు లైట్‌బాక్స్, లైట్‌రాక్, 3ఎల్ క్యాపిటల్, అల్టీరియా క్యాపిటల్ కూడా ఈ విడతలో మరికొంత పెట్టుబడులు పెట్టాయి. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నిర్వహించే రిటైల్ స్టోర్లకు అవసరమయ్యే హైపర్‌లోకల్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా డన్జో అందిస్తుంది. అలాగే జియోమార్ట్ వ్యాపారుల నెట్‌వర్క్‌కు డెలివరీల సదుపాయాలు కూడా కల్పిస్తుంది. -
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం..!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి ఉన్న రుణభారాన్ని వదిలించుకునేందుకు ఓవర్సీస్ బాండ్లను జారీ చేసేందుకు రిలయన్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది. రూ. 500 కోట్ల డాలర్ల బాండ్స్..! రిలయన్స్ డిసెంబర్ 31 న జరిగిన సమావేశంలో ఓవర్సీస్ బాండ్లపై కంపెనీ నిర్ణయం తీసుకుంది. సుమారు 500 కోట్ల డాలర్ల విలువ గల బాండ్లను జారీ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. దేశీయ చట్టాలకు లోబడి యూఎస్ డాలర్ డినామినేషన్ కలిగి ఉండి ఫిక్స్డ్ రేట్ గల సీనియర్ అన్ సెక్యూర్డ్ బాండ్లను జారీ చేయనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. కాగా బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను రిలయన్స్ బయటకు తెలుపలేదు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధానంగా దాని ప్రస్తుత రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ఉపయోగించాలని రిలయన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్.. మరో కీలక నిర్ణయం -
ఎస్బీఐ భారీగా నిధుల సమీకరణ
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) బాండ్ల జారీ ద్వారా రూ.4,000 కోట్లు సమకూర్చుకుంది. బాసెల్ నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్-1 బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించినట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ ఏటీ-1 బాండ్లకు 7.72 శాతం కూపన్ రేటును ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. రూ.1,000 కోట్ల బేస్‌తో జారీ చేసిన బాండ్లకు భారీ స్థాయిలో డిమాండ్ కనిపించినట్లు ఎస్బీఐ తెలియజేసింది. రూ.10,000 కోట్లకుపైగా విలువైన బిడ్స్ లభించినట్లు వెల్లడించింది. దీంతో 7.72 శాతం కూపన్ రేటుతో రూ.4,000 కోట్ల విలువైన బిడ్స్‌ను అంగీకరించినట్లు వివరించింది. కాగా.. 2013లో బాసెల్-3 నిబంధనలు అమల్లోకి వచ్చాక ఏటీ-1 బాండ్లకు ఒక దేశీ బ్యాంక్ ఆఫర్ చేస్తున్న అత్యంత కనిష్ట ధర ఇదని ఎస్బీఐ తెలియజేసింది. వీటికి రేటింగ్ సంస్థలు అత్యుత్తమ రేటింగ్ ఏఏప్లస్‌ను ప్రకటించినట్లు వెల్లడించింది. నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ.429 వద్ద ముగిసింది.(చదవండి: దాల్ సరస్సులో ఎస్బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్) -
తప్పని పరిస్థితుల్లోనే నగదు ముద్రణ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నగదును ప్రత్యక్షంగా ముద్రించి ప్రభుత్వానికి ద్రవ్య పరమైన మద్దతు అందించవచ్చని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. అయితే ఇక ప్రత్యామ్నాయంలేని తప్పని పరిస్థితుల్లోనే ఈ తరహా ప్రత్యక్ష నగదు ముద్రణ విధానాన్ని అవలంభించాలని బుధవారం ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా పరిస్థితిని భారత్ ఎప్పుడూ ఎదుర్కొనలేదని కూడా వివరించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ బాండ్ల జారీ అంశాన్ని కేంద్రం పరిశీలించవచ్చని సూచించారు. దేశం కరోనా సవాళ్లలో ఉన్న నేపథ్యంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వూరి అభిప్రాయాలు ఇవీ... కోవిడ్ బాండ్లతో ప్రయోజనం ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం కరోనా బాండ్ల జారీ ద్వారా రుణ సమీకరణ అంశాన్ని పరిశీలించవచ్చు. బడ్జెట్లో పేర్కొన్న రుణ సమీకరణ ప్రణాళికకు అదనంగా... ‘కోవిడ్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణగా’ దీనిని పరిగణించవచ్చు. మార్కెట్ సమీకరణలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు కోవిడ్ బాండ్ల జారీ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లకు స్వల్పంగా అదనపు వడ్డీ ఇవ్వడం ద్వారా పొదుపరులను కోవిడ్ బాండ్లతో ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. మనీ సప్లై, ఆర్బీఐ ద్రవ్య లభ్యతా చర్యలకు దీనివల్ల ఎటువంటి అవరోధం ఏర్పడదు. ‘లాభాలు’... ఆర్బీఐ ధ్యేయం కాదు ప్రభుత్వ ద్రవ్య ఒత్తిడులను ఎదుర్కొనడానికి ఆర్బీఐ మరిన్ని లాభాలను ఆర్జించడంపై దృష్టి పెట్టవచ్చు అనుకోవడం సరికాదు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య సంస్థ కాదు. లాభార్జన దాని ధ్యేయాల్లో ఒకటి కాదు. తన కార్యకలాపాల్లో భాగంగానే ఆర్బీఐ కొంత లాభాలను ఆర్జిస్తుంది. ఇందులో తన వ్యయాలు పోను ‘మిగిలిన లాభాన్ని’’ కేంద్రానికి బదలాయిస్తుంది. తన వద్ద ఎంత మొత్తం ఉంచుకోవాలన్న అంశాన్ని బిమల్ జలాన్ కమిటీ సూచించింది. 2021–22 బడ్జెట్ అంచనాలకు మించి రెండు రెట్లు రూ.99,122 కోట్లను కేంద్రానికి ఆర్బీఐ బదలాయించిన సంగతి తెలిసిందే. మహమ్మారిని ఎదుర్కొనడానికి ఆర్బీఐ గడచిన ఏడాదిగా క్రియాశీలంగా, వినూత్నంగా వివిధ చర్యలను తీసుకుంటోంది. ఇప్పుడు ముద్రణ జరుగుతోంది, కానీ.. తన లోటును ప్రభుత్వం తగిన మార్గాల ద్వారా భర్తీ చేసుకోలేని పరిస్థితి ఉత్పన్నమయినప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రత్యక్ష నగదు ముద్రణ వైపు మొగ్గుచూపవచ్చు. అయితే భారత్ ఎప్పుడూ ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొనలేదు. ప్రభుత్వ లోటును భర్తీ చేయడానికి ఆర్బీఐ నగదు ముద్రణ చేయాలనే వారు ఒక విషయాన్ని గుర్తించడంలేదు. ప్రభుత్వ లోటును భర్తీ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు కూడా నగదు ముద్రణ జరుపుతోంది. అయితే ఇది పరోక్ష నగదు ముద్రణా విధానం. ఉదాహరణకు ఆర్బీఐ తన ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్(ఓఎంఓ) కింద బ్యాంకర్ల నుంచి బాం డ్లను కొనుగోలు చేస్తుంది. లేదా విదేశీ మారకద్రవ్య నిల్వల(ఫారెక్స్) ఆపరేషన్ల కింద డాలర్లను కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులకు ఆర్బీఐ ముద్రణ జరుపుతుంది. ప్రత్యక్ష మనీ ప్రింట్‌తో ఇబ్బందులు ఇక ప్రభుత్వ ద్రవ్య లోటును భర్తీ చేయడానికి కరెన్సీ ప్రత్యక్ష ముద్రణకు పైన పేర్కొన్న దానితో పూర్తి వైరుధ్యం ఉంది. ఇక్కడ కరెన్సీ ముద్రణ ఎప్పుడు ఎంత జరగాలన్న అంశం ప్రభుత్వ రుణ ప్రణాళిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్య సరఫరాపై ఆర్బీఐ తన నియంత్రణలను కోల్పోతుంది. దీనితోపాటు అటు ఆర్బీఐ ఇటు ప్రభుత్వ విశ్వసనీయ పరిస్థితులు కోల్పోయే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి కీలక మౌలిక ఆర్థిక గణాంకాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫెడ్, ఈసీబీలతో పోల్చకూడదు... సవాళ్లను ఎదుర్కొనడంలో ఆర్బీఐ వంటి వర్థమాన దేశాల సెంట్రల్ బ్యాంకులకు, అమెరికా ఫెడరల్ బ్యాంక్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వంటి ధనిక దేశాల సెంట్రల్ బ్యాంకులకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఒక సమస్యను ఎదుర్కొనడానికి ప్రత్యక్ష మనీ ప్రింట్‌సహా ఎటువంటి సాంప్రదాయేత నిర్ణయమైనా తీసుకోగలుగుతాయి. మనకు అటువంటి సౌలభ్యమైన పరిస్థితి ఉండబోదు. దీనికితోడు వర్థమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న మితిమీరిన నిర్ణయాలను మార్కెట్లు సహించబోవు. -
విదేశీ ఎక్సే్చంజీల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్!
న్యూఢిల్లీ: విదేశీ సంస్థల నుంచి దేశానికి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే కీలక చర్యలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శ్రీకారం చుడుతోంది. విదేశీ ఎక్సే్చంజ్‌ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్‌కు తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ‘‘గ్లోబల్ ఇండెక్స్‌లను నిర్వహించే పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు పురోగతిలో ఉన్నాయి. అయితే ఎప్పటిలోగా ప్రభుత్వ బాండ్లు విదేశీ ఎక్సే్చంజ్‌ల్లో లిస్టవుతాయన్న విషయాన్ని మాత్రం నేను చెప్పలేను’’ అని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. విదేశీ ఎక్సే్చంజ్‌ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్‌కు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సుదీర్ఘకాలంగా సూచనలు అందుతున్నాయి. అయితే దీనికి 2020–21 బడ్జెట్లోనే సూత్రప్రాయ ఆమోదముద్ర పడింది. ‘‘కొన్ని నిర్దిష్ట కేటగిరీల ప్రభుత్వ బాండ్లను నాన్–రెసిడెంట్ ఇన్వెస్టర్లకు ఉద్దేశించడం జరుగుతోంది. దేశీయ ఇన్వెస్టర్లతోపాటు విదేశీ ఇన్వెస్టర్లకూ ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయి’’ అని తన ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా ద్రవ్య స్థిరత్వానికి ఆర్బీఐ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, 50 ఎన్‌బీఎఫ్‌సీల పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోందని గవర్నర్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బ్యాంకులుసహా ఫైనాన్షియల్ విభాగం మొత్తం ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందనీ ఆయన పేర్కొన్నారు. -
వ్యవస్థలోకి మరిన్ని నిధులు..
ముంబై: తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తసుకుంది. ఓపెన్‌మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా జనవరి 6న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు, అమ్మకం చర్యలను చేపట్టనుంది. రూ.10,000 కోట్ల చొప్పున బాండ్ల కొనుగోలు, అమ్మకానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. అర్హులు తమ బిడ్స్, ఆఫర్లను జనవరి 6 ఉదయం 10.30 నుంచి 12.00 గంటల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిస్టమ్‌పై ఎలక్ట్రానిక్ ఫార్మేట్ రూపంలో సమర్పించవచ్చని గురువారం విడుదలైన ఆర్బీఐ ప్రకటన తెలిపింది. బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌సహా ఫైనాన్స్ సంస్థల్లోకి మరింత నిధులు పంప్ చేయడానికి వీలు కలుగుతుంది. అలాగే బాండ్ల విక్రయ చర్య... వ్యయాలకు సంబంధించి కేంద్రానికి మరిన్ని నిధులు సమకూరడానికి దోహదపడుతుంది. ఇప్పటికే ఈ తరహా ఓఎంఓ చర్యలను రెండుసార్లు ఆర్బీఐ చేపట్టింది. -
సెబీ ‘స్మార్ట్’ నిర్ణయాలు
ముంబై: స్టార్టప్‌లకు జోష్‌నిచ్చే నిర్ణయాలను సెబీ తీసుకుంది. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకునే వెసులుబాటును స్మార్ట్ సిటీస్‌కు కల్పించింది. వీటితో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే నిర్ణయాలను కూడా ప్రకటించింది. మరోవైపు ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులకు సంబంధించి సమాచారమందించే వ్యక్తులకు రూ. కోటి నజరానా ఇస్తామని ప్రకటించింది. హౌసింగ్ ఫైనాన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ విభాగాలు కలిగిన కంపెనీలకు షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన నిబంధనలను సెబీ సరళీకరించింది. రుణ చెల్లింపుల విఫలానికి సంబంధించిన వివరాలను రేటింగ్ ఏజెన్సీలకు లిస్టెడ్ కంపెనీలు వెల్లడించడానికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. మ్యూచువల్ ఫండ్స్‌కు కూడా కఠిన నిబంధనలను జారీ చేసింది. బుధవారం సమావేశమైన సెబీ డైరెక్టర్ల బోర్డ్ పలు నిర్ణయాలు తీసుకుంది. వివరాలు.. ► ఎఫ్‌పీఐల నో యువర్ కస్టమర్(కేవైసీ) నిబం ధనలు మరింత సరళతరమయ్యాయి. ► స్మార్ట్ సిటీలు, సిటీ ప్లానింగ్, అర్బన్ డెవలప్మెంట్ విభాగాల్లో నమోదైన సంస్థలు మునిసిపల్ బాండ్లతో నిధులు సమీకరించవచ్చు. ► ప్రస్తుతం స్టాక్ ఎక్సే్చంజ్‌ల ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్ఫార్మ్పై నమోదైన స్టార్టప్‌లు ఇక నుంచి స్టాక్ సూచీలకు మారవచ్చు. అయితే, దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. ► ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి సమాచారమందించే వ్యక్తులు, సంస్థలకు (విజిల్ బ్లోయర్స్) రూ.కోటి దాకా నజరానా ఇవ్వనున్నారు. కంపెనీ ఆడిటర్లు దీనికి అనర్హులు. ► కంపెనీ చెల్లించిన మూలధనం, రిజర్వ్‌ల్లో 25%కి మించకుండా బైబ్యాక్ ఆఫర్ ఉండాలి. ఈ ఆఫర్ 10%కి మించినట్లయితే, ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ► లిస్టింగైన లేదా లిస్టింగ్ కాబోతున్న ఈక్విటీ, డెట్ సెక్యూరిటీల్లోనే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచిది. అంతేకాకుండా రేటింగ్ లేని డెట్ సాధనాల్లో ప్రస్తుతం 25 శాతంగా ఉండే పెట్టుబడులను 5 శాతానికే పరిమితం చేయాలని కూడా సూచించింది. ► డెట్ పోర్ట్‌ఫోలియో స్కీమ్‌లు లిస్టింగ్ కాని ఎన్‌సీడీల్లో గరిష్టంగా 10 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ప్రతిపాదిత పరిమితులపై కాలానుగుణంగా సమీక్షించి, అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు. ► రేటింగ్ లేని డెట్ సాధనాల్లో డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్, ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్, రెపో ఆన్ జీ–సెక్, ట్రెజరీ బిల్లులను మినహాయిస్తే, కొన్ని మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్‌కు మిగులుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, బిల్స్ రీ–డిస్కౌంటింగ్(బీఆర్డీఎస్), మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, రెపో ఆన్ కార్పొరేట్ బాండ్స్, రీట్స్/ఇన్విట్స్ యూనిట్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► లిస్టైన కంపెనీల్లో ప్రజలకు ఉండాల్సిన కనీస వాటాను 25% నుంచి 35%కి పెంచాలన్న ప్రతిపాదనకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉందని సెబీ పేర్కొంది. అయితే లిస్టైన ప్రభుత్వ రంగ సంస్థల్లో 45 శాతం వరకూ ఇప్పటికీ, 25 శాతం నిబంధనను అందుకోలేకపోయాయి. అందుకని 35 శాతం పబ్లిక్ హోల్డింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని మరింతగా మదింపు చేయాల్సి ఉందని సెబీ పేర్కొంది. -
ఎలక్టోరల్ బాండ్లపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకం అమలుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్లపై లోతుగా విచారించాల్సిన అవసరముందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో మరో పిటిషన్ దాఖలు చేయాలని ఎన్జీవో సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్)కు సూచించింది. ఏడీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి రాజకీయ పార్టీలకు నిధులు అందుతున్నాయని తెలిపారు. ఈ నిధుల్లో 95 శాతం అధికార పార్టీకే దక్కాయని గుర్తుచేశారు. నిధులపై పారదర్శకత లోపించిన నేపథ్యంలో ఈసీ కూడా దీన్ని వ్యతిరేకించిందన్నారు. ఈ వాదనల్ని ఖండించిన అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్.. నల్లధనాన్ని నియంత్రించేందుకే ఈ బాండ్లను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. -
అప్పులు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు
-
‘చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకరా?’
సాక్షి, హైదరాబాద్: అమరావతి బాండ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అప్పులు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అమరావతి బాండ్లపై 10 శాతానికి మించి వడ్డీ ఇస్తున్నారని.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకరా లేక స్టాక్ బ్రోకరా అని ప్రశ్నించారు. కేవలం రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేస్తే సరిపోదని సూచించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరువు కనబడటం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు బినామీలు ఉన్న చోటే నిధులు ఇస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ర్టానికి అప్పులు పెరిగి.. ఆస్తులు తగ్గాయని వ్యాఖ్యనించారు. ఏపీలోని 5 కోట్ల మంది ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు సెక్యూరిటీ కోసం నెలకు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా అంటూ నిలదీశారు. నీరు చెట్టు కార్యక్రమంలో టీడీపీ నేతలు 13 కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. సొంత ఖర్చుల కోసం కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాలు విసిరారు. చంద్రబాబు బీఎస్ఈలో గంట కొట్టడానికి ముంబై వెళ్లారని.. కానీ రానున్న రోజుల్లో చంద్రబాబు నెత్తిన ప్రజలే గంట కొడతారని ఆయన తెలిపారు. -
పోలీస్‌స్టేషన్ సాక్షిగా.. వసూళ్ల దందా
అగ్రిగోల్డ్ బాధితులకు కష్టాలు వెంటాడుతున్నాయి. అవసరాలు తీరుతాయని రూపాయి..రూపాయి కూడగట్టి అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి నష్టపోయిన బాధితులను కొంతమంది వ్యక్తులు మరో రకంగా దోచుకుంటున్నారు. బాండ్ల పరిశీలన కోసం పోలీసుస్టేషన్లకు వస్తున్న వారి నుంచి రూ. 50 నుంచి వంద రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. దాచుకున్న సొమ్ము వస్తుందనే ఆశతో బాధితులు కాదనలేక డబ్బులను చెల్లిస్తున్నారు. టెక్కలి పోలీసుస్టేషన్ సాక్షిగా బుధవారం ఈ దందా వెలుగుచూసింది. టెక్కలి: అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు చెందిన వివిధ రకాల పత్రాలను ఆన్లైన్ నమోదు పరిశీలన చేసే ప్రక్రియలో భాగంగా బుధవారం డివిజన్ కేంద్రమైన టెక్కలి పోలీస్‌స్టేషన్ సాక్షిగా కొంత మంది వ్యక్తులు అక్రమ వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 50 నుంచి వంద రూపాయలు వసూలు చేసి పత్రాలను ఆన్లైన్లో నమోదు చేయడం కనిపించింది. పోలీస్‌స్టేషన్‌లోనే దందా జరగడంపై బాధితులు నివ్వెరపోయారు. ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఆన్లైన్ నమోదు ప్రక్రియ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశించిన బాధితులంతా తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.అగ్రిగోల్డ్ పత్రాల ఆన్లైన్ నమోదుకు గురువారంతో గడువు ముగిసే క్రమంలో టెక్కలి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు పోలీసుస్టేషన్‌కు బుధవారం చె?రుకున్నారు. అయితే స్టేషన్ లోపల అగ్రిగోల్డ్ ఏజెంట్లు, ప్రైవేట్ వ్యక్తులు కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని డిపాజిట్‌దారుల పత్రాలను ఆన్లైన్ నమోదు చేశారు. ఇందులో కొంత మంది వ్యక్తులు ఒక్కో బాధితుడి వద్ద రూ. 50 నుంచి 100 రూపాయలు వసూలు చేసి ఆన్లైన్ నమోదు చేయడం కనిపించింది. ఇప్పటికే విసిగిపోయిన బాధితులు ప్రైవేట్ వ్యక్తులు డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చి పత్రాలను ఆన్లైన్ నమోదు చేయించుకున్నారు. సాక్షాత్తు న్యాయాన్ని రక్షించాల్సిన పోలీస్‌స్టేషన్‌లో ఇటువంటి వసూళ్ల పర్వం జరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. మరో వైపు ముందుగా ఆన్లైన్ నమోదు కోసం పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చిన పత్రాలు గల్లంతు కావడంతో బాధితులు లబోదిబోమన్నారు. -
ముగిసిన ఆంధ్రా బ్యాంక్ బాండ్స్ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ. 1,000 కోట్ల సమీకరణ కోసం చేపట్టిన బాండ్స్ ఇష్యూ ముగిసినట్లు ఆంధ్రా బ్యాంకు తెలిపింది. జూన్ 22న ప్రారంభమైన ఇష్యూ 27న ముగిసిందని, పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ అయ్యిందని వెల్లడించింది. పదేళ్ల కాల వ్యవధితో అన్సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డెట్ బాండ్లు జారీ చేసింది. వీటికి 8.65 శాతం వడ్డీ రేటు ఉంటుంది.