ముంబై: ఎస్‌బీఐ అడిషనల్ టైర్ 1 (ఏటీ1) బాండ్ల జారీ ద్వారా రూ.3,717 కోట్లను సమీకరించినట్టు ప్రకటించింది. 8.25 శాతం కూపన్ రేటు (వడ్డీ రేటు)పై ఈ బాండ్లను జారీ చేసినట్టు తెలిపింది. ఈ నిధులతో ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా క్యాపిటల్ అడెక్వసీ రేషియో బలపడుతుందని పేర్కొంది.
పదేళ్ల తర్వాత కాల్ ఆప్షన్‌తో వీటిని జారీ చేసినట్టు ప్రకటించింది. ఈ ఇష్యూకి అధిక స్పందన వచ్చిందని, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయని వెల్లడించింది. రూ.2,000 కోట్ల బేస్ ఇష్యూకి గాను, 2.27 రెట్లు బిడ్లు వచ్చాయని (రూ.4,537 కోట్లు) ఎస్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment