fund rising
-
ఇక అనిల్ కంపెనీల జోరు
న్యూఢిల్లీ: ప్రసిద్ధ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ వృద్ధి బాటలో సాగనున్నాయి. ఇటీవల ఉమ్మడిగా రూ. 17,600 కోట్ల పెట్టుబడులు సమీకరించే ప్రణాళికలకు తెరతీయడంతో వృద్ధి వ్యూహాలను అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గత రెండు వారాలుగా ఇరు కంపెనీలు ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించడంతోపాటు.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వర్డే పార్ట్నర్స్ నుంచి రూ. 7,100 కోట్లు అందుకునేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. ఈక్విటీ ఆధారిత దీర్ఘకాలిక ఎఫ్‌సీసీబీల జారీ ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళికలు వేశాయి. పదేళ్ల ఈ విదేశీ బాండ్లకు 5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయనున్నాయి. వీటికి జతగా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 3,000 కోట్లు చొప్పున సమీకరించనున్నట్లు ఇరు కంపెనీల అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బోర్డు ఆమోదించిన పలు తీర్మానాలపై ఈ నెలాఖరుకల్లా వాటాదారుల నుంచి అనుమతులు లభించగలవని తెలియజేశాయి. వెరసి నిధుల సమీకరణ ద్వారా గ్రూప్ కంపెనీల విస్తరణకు అనుగుణమైన పెట్టుబడులను వినియోగించనున్నట్లు వివరించాయి. -
Greg Chappell: ఆర్థిక ఇబ్బందుల్లో క్రికెట్ దిగ్గజం
మెల్బోర్న్: క్రికెట్ దిగ్గజం, భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ (75) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆదుకునేందుకు ఆయన స్నేహితులు ముందుకు వచ్చారు. ఆన్లైన్లో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ విషయాన్ని ఛాపెల్ స్వయంగా ధృవీకరించారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సమావేశమైన ఛాపెల్ స్నేహితులు.. ‘గో ఫండ్ మీ’ ద్వారా విరాళల సేకరణకు నడుం బిగించారు. ఛాపెల్ ఇందుకు అయిష్టంగానే అంగీకరించినట్లు సమాచారం. అయితే.. తాను ఆర్థికంగా అంత దారుణంగా ఏమీ దెబ్బతినలేదని, సాధారణ జీవితమే గడుపుతున్నట్లు పేర్కొన్నారాయన. ‘‘మేం తీవ్ర కష్టాల్లో ఉన్నామని నేను చెప్పడం లేదు. అలాగని విలాసవంతమైన జీవితమూ గడపడం లేదు. మేం క్రికెటర్లం కాబట్టి లగ్జరీ లైఫ్ గడుపుతున్నామని చాలామంది అనుకుంటారు. అయితే, నేను పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నానని చెప్పడం లేదు. ఈ తరం క్రికెటర్లు పొందుతున్న విలాసవంతమైన ప్రయోజనాలను మేం పొందలేకపోతున్నాం. నా తరం క్రికెటర్లలో రిటైర్ అయిన తర్వాత కూడా ప్రొఫెషనల్ క్రికెట్లో నేను భాగంగానే ఉన్నా. కానీ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది మాత్రం నేనొక్కడినే’’ అని అన్నారాయన. ఆస్ట్రేలియా టీం ప్లేయర్‌గా 1970-84 మధ్యకాలంలో రాణించారాయన. 1975 నుంచి రెండేళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి.. 2005 నుంచి 2007 మధ్య కాలంలో భారత జట్టుకు కోచ్‌గా పని చేశారు. ఆ సమయంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారాయన. -
అదానీ గ్రూప్ సంస్థల్లో మరో కీలక పరిణామం!
న్యూఢిల్లీ: Gautam Adani Raised rs 11,330 crore : ప్రణాళికలకు అనుగుణంగానే నిధుల సమీకరణ చేపట్టినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. దీంతో గత నాలుగేళ్లలో రూ. 73,800 కోట్లు(9 బిలియన్ డాలర్లు) సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. ఇందుకు గ్రూప్ కంపెనీలలో వాటాల విక్రయాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. ఈ బాటలో ఇటీవలే మూడు కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా రూ. 11,330 కోట్లు(1.38 బిలియన్ డాలర్లు) సమీకరించిన అంశాన్ని ప్రస్తావించింది. 10ఏళ్ల కాలానికిగాను పెట్టుబడుల పరివర్తన నిర్వహణ (ట్రాన్స్ఫార్మేటివ్ క్యాపిటల్ మేనేజ్మెంట్) ప్రణాళికల్లో భాగంగా నిధుల సమీకరణ చేపడుతున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. వివిధ పోర్ట్‌ఫోలియో కంపెనీల కోసం 2016లో ఈ ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేసింది. దీనిలో భాగంగానే ఇటీవల అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా రూ. 11,330 కోట్లు అందుకున్నట్లు వివరించింది. దీంతో గ్రూప్ స్థాయిలో అత్యధిక పెట్టుబడులు అందుబాటులోకి వచ్చినట్లు తెలియజేసింది. -
ఐఐఎఫ్ఎల్ నిధుల సమీకరణ
ముంబై: బ్యాంకింగేతర సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రుణ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతోంది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్ల విలువైన సెక్యూర్డ్ రీడీమబుల్ ఎన్సీడీలను విక్రయించనున్నట్లు తెలియజేసింది. వీటికి 9 శాతంవరకూ రిటర్నులను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 9న వీటిని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధులను వ్యాపారాభివృద్ధి, మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇష్యూకి అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో రూ. 1,200 కోట్ల విలువైన ఎన్సీడీలను సైతం కేటాయించేందుకు గ్రీన్ షూ అప్షన్‌ను ఎంచుకున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 1,500 కోట్లను సమీకరించే వీలున్నట్లు తెలియజేసింది. 60 నెలల కాలానికిగాను ఇన్వెస్టర్లకు 9 శాతం వరకూ రిటర్నులను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. 24 నెలలు, 36 నెలల కాలావాధితోనూ బాండ్లను కేటాయించనున్నట్లు పేర్కొంది. వడ్డీని వార్షికంగా లేదా నెలవారీ చెల్లించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఏప్రిల్‌లో 40 కోట్ల డాలర్ల విలువైన డాలర్ బాండ్లను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే. వీటిని 2020 ఫిబ్రవరిలో జారీ చేసింది. -
Hyd: చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్.. మోటార్ ఫెస్ట్..
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ రోటరీ క్లబ్ గొప్ప కార్యం తలపెట్టింది. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ చాంపియన్‌షిప్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను హైదరాబాద్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో గోల్ఫ్‌కోర్స్ ట్రాక్ ఏర్పాటుకు వినియోగించనుంది. అదే విధంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని సత్య సాయి ఆస్పత్రిలో ఈ మేరకు ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి వచ్చిన నిధులను ఖర్చు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నిర్మాణానికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. కాగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగనున్న ఆటోక్రాష్ చాంపియన్‌షిప్‌లో టాప్ రేసర్లు పాల్గొననున్నారు. జూన్ 2-4 వరకు ఈ ఈవెంట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్‌ను విజయవంతం చేయాలని నిర్వాహకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చి రేసింగ్ ఈవెంట్‌ను ఆస్వాదించాలని కోరారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు -
నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు పెట్టుబడులున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. గతేడాది నవంబర్‌లో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన కంపెనీ మే నెలలో ఐపీవో చేపట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వెరసి దేశీయంగా తొలి రిటైల్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రిటైల్ రీట్.. 17 నిర్వహణలోగల షాపింగ్ మాల్స్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఇవి 14 పట్టణాలలో 9.8 మిలియన్ చదరపు అడుగులలో విస్తరించి ఉన్నాయి. వీటి విలువ రూ. 23,000 కోట్లు. బ్లాక్‌స్టోన్ స్పాన్సర్ చేసిన మూడో రీట్‌గా ఇది నిలవనుంది. ఇప్పటికే దేశీయంగా సంస్థకు పెట్టుబడులున్న రీట్ ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ లిస్టయ్యాయి. మరో కంపెనీ బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కాగా.. ఇవన్నీ ఆఫీస్ ఆస్తులపైనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ మాత్రం రిటైల్ రియల్టీ ఆస్తులపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఐపీవో నిధులను కొంతమేర రుణ చెల్లింపులకు వినియోగించే వీలుంది. 2022 జూన్‌కల్లా రూ. 4,500 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. -
రూ.3,717 కోట్లను సమీకరించిన ఎస్బీఐ
ముంబై: ఎస్బీఐ అడిషనల్ టైర్ 1 (ఏటీ1) బాండ్ల జారీ ద్వారా రూ.3,717 కోట్లను సమీకరించినట్టు ప్రకటించింది. 8.25 శాతం కూపన్ రేటు (వడ్డీ రేటు)పై ఈ బాండ్లను జారీ చేసినట్టు తెలిపింది. ఈ నిధులతో ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా క్యాపిటల్ అడెక్వసీ రేషియో బలపడుతుందని పేర్కొంది. పదేళ్ల తర్వాత కాల్ ఆప్షన్‌తో వీటిని జారీ చేసినట్టు ప్రకటించింది. ఈ ఇష్యూకి అధిక స్పందన వచ్చిందని, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయని వెల్లడించింది. రూ.2,000 కోట్ల బేస్ ఇష్యూకి గాను, 2.27 రెట్లు బిడ్లు వచ్చాయని (రూ.4,537 కోట్లు) ఎస్బీఐ తన ప్రకటనలో తెలిపింది. -
ఫైనాన్స్‌పీర్ 31 మిలియన్ డాలర్ల సమీకరణ!
హైదరాబాద్: ఎడ్యు–ఫిన్‌టెక్ స్టార్టప్ ఫైనాన్స్‌పీర్ .. సిరీస్ బీ ఫండింగ్‌లో భాగంగా 31 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఆవిష్కార్ క్యాపిటల్, అమెరికాకు చెందిన క్యూఈడీ ఇన్వెస్టర్స్ తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులు సేకరించినట్లు సంస్థ తెలిపింది. కోవిడ్–19 విజృంభించిన 2020లో కూడా 3 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నట్లు .. మహమ్మారి ప్రభావంతో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడ్పాటు అందించినట్లు ఫైనాన్స్‌పీర్ సీఈవో రోహిత్ గజ్భియె తెలిపారు. -
పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి..
ఆమె ఓ క్రీడాకారిణి.. కష్టపడి ఒలింపిక్స్‌లో పతకం సాధించి సత్తా చాటింది. పతకంతో ఇంటికి వెళ్లిన ఆమె సంబరాల్లో మునిగింది. ఈ సమయంలో ఓ పసిపాపకు ఆరోగ్యం బాగాలేదు.. పసికందు చికిత్సకు భారీగా ఖర్చవుతోందని తెలుసుకుని ఆమె తల్లడిల్లింది. దీంతో ఎంతో శ్రమకోర్చి సాధించిన తన ఒలింపిక్ పతకాన్ని వేలానికి పెట్టింది. ఆమె మానవత్వాన్ని మెచ్చి వేలం దక్కించుకున్న సంస్థ ఆమె మెడల్‌ను తిరిగి ఇచ్చేసింది. దీంతోపాటు పాప చికిత్సకు అయ్యే ఖర్చుకు డబ్బును కూడా సమకూర్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ( చదవండి: నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు) పోలాండ్‌కు చెందిన మరియా అండ్రెజెక్ జావెలిన్ త్రోయర్ క్రీడాకారిణి. ఆమె తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంది. మన హీరో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన క్రీడ జావెలిన్ త్రో మహిళల విభాగంలో 64.61 మీటర్ల దూరం జావెలిన్ విసిరి మరియా రెండో స్థానంలో నిలిచింది. రజత పతకం సొంతం చేసుకుంది. అయితే ఆమెకు ఇటీవల 8 నెలల వయసున్న మలీసా అనే పాప అరుదైన వ్యాధి (గుండె సంబంధిత)తో బాధపడుతోందని తెలుసుకుని ఆవేదనకు లోనైంది. ఆ పాప చికిత్సకు అవసరమైన ఖర్చును తాను పెట్టలేని స్థితిలో ఉండడంతో తన రజత పతకాన్ని వేలం పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె చర్యను అందరూ అభినందించారు. కొందరు వేలం వద్దు.. మేం కొంత ఇస్తాం అని కామెంట్ చేశారు. అయితే ఆమె ప్రకటనతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. ఏకంగా 1.25 లక్షల డాలర్ల వరకు విరాళాలు సమకూరాయి. ఇక పతకం వేలంలో పోలాండ్‌కు చెందిన సూపర్‌మార్కెట్ చెయిన్ సంస్థ జాబ్కా పోటీ పడింది. చివరకు వేలంలో ఆ సంస్థ మెడల్‌ను దక్కించుకుంది. అయితే ఆ సంస్థ మాత్రం మెడల్ తీసుకునేందుకు నిరాకరించింది. పాప చికిత్సకు అయ్యే డబ్బు ఇవ్వడంతో పాటు మరియా దక్కించుకున్న పతకాన్ని కూడా తిరిగి ఇచ్చేయాలని జాబ్క సంస్థ తెలిపింది. మానవత్వం చాటుకున్న మరియా ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌ను జయించింది. 2018లో బోన్ క్యాన్సర్‌తో బాధపడింది. క్యాన్సర్‌ను జయించడంతో ఇప్పుడు పోలాండ్ దేశానికి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం తీసుకువచ్చింది. రియో ఒలింపిక్స్‌లో మరియాకు త్రుటిలో పతకం చేజారింది. 2 సెంటీ మీటర్ల దూరంలో మెడల్ ఆగిపోయింది. View this post on Instagram A post shared by Maria M. Andrejczyk (@m.andrejczyk) -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకపాత్ర పోషించేదిదే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే మాటలు కాదు.. అక్కడ ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలు పోటీపడి కోట్లకొద్దీ డాలర్లు సేకరిస్తాయి. అటు అమెరికా, ఇటు భారత్‌లోనూ ప్రజాస్వామ్య వ్యవస్థే ఉన్నా.. ఎన్నికల ప్రచార ఖర్చులకు సంబంధించి ఉన్న ప్రధానమైన తేడా ఇదే. ఇక్కడ పార్టీలకు నిధులు ఇవ్వడం గుట్టుగా జరిగిపోతే.. అక్కడ మాత్రం అంతా బ్లాక్ అండ్ వైట్!. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అక్కడి ‘ఫండ్ రైజింగ్’ కథా.. కమామిషు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫండ్ రైజింగ్ది కీలకపాత్ర. 2020 అధ్యక్ష ఎన్నికలనే తీసుకుంటే డెమొక్రాట్ల తరఫు అభ్యర్థి జో బైడెన్ దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల డబ్బులు సేకరించగలిగితే.. అధ్యక్షుడిగా ఇంకోసారి ఎన్నిక కావాలని ఆశిస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఏకంగా పదివేల కోట్ల రూపాయల వరకు రాబట్టగలిగారు. అయితే, ఎక్కువ డబ్బులు సమకూర్చుకోగలిగిన, ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధిస్తాడన్న గ్యారెంటీ ఏమీ లేదు. కాకపోతే గెలిచే అవకాశాలెక్కువ. 2018 నాటి సాధారణ ఎన్నికల్లో (భారత్‌లో రాజ్యసభలో ఏర్పడిన ఖాళీల భర్తీకి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగినట్లే అమెరికాలోని హౌస్, సెనేట్ పేర్లతో ఉన్న రెండు సభలకు ఎన్నికలు జరుగుతాయి. వీటిని సాధారణ ఎన్నికలంటారు. అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి) హౌస్ కోసం పోటీపడి గెలిచిన వారిలో 89 శాతం మంది ఎన్నికల నిధులను బాగా ఖర్చు పెట్టినవారైతే.. సెనేట్‌లో ఈ సంఖ్య 83 శాతంగా ఉంది. కొత్తగా బరిలోకి దిగి ఎన్నికల ప్రచారం కోసం నిధులు సేకరించడం కష్టమైన పని. అధికారంలో ఉన్న వారికైతే సులువు. (పెద్దన్న ఎన్నిక ఇలా..) నిధుల సేకరణ పలు విధాలు అమెరికా రాజకీయ నేతలు ఎన్నికల నిధుల కోసం రకరకాల మార్గాలు అనుసరిస్తుంటారు. తనకు నిధులివ్వండని నేరుగా హోర్డింగ్‌లు పెట్టడం మొదలు ఇంటింటికీ తిరగడం, పాంప్లెట్లు పంచడం, శ్రేయోభిలాషులు, తమ సిద్ధాంతాలకు మద్దతు తెలిపేవారికి మెయిళ్లు పెట్టడం, విందు భోజనాల ఏర్పా టు, టెలివిజన్, న్యూస్‌పేపర్ ప్రకటనల వంటి అనేక రూపాల్లో నిధుల సేకరణ జరుగుతుంది. తనతో కలిసి భోం చేయాలంటే ఇంత మొత్తం చందాగా ఇవ్వాలన్న షరతులు పెట్టడం అక్కడ సాధారణ విషయం. 2008లో బరాక్ ఒబామా తొలి సారి సోషల్ మీడియా ప్రకటనల ద్వారా నిధుల సేకరణను ప్రారం భించారు. అప్పటి నుంచి ఇప్పటివర కు ఆన్లైన్ ప్రకటనల ఖర్చు అంతకంత కు పెరిగిపోయి ఏకంగా పదివేల కోట్ల రూపాయల పైమాటే అయ్యింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. డబ్బులు సేకరించినంత వేగంగా ఖర్చు పెట్టేయడం. (భారత్‌తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం) అమెరికన్ సివిల్ వార్ తరువాత రాజకీయ నాయకుల ప్రచార ఖర్చులను భరించడం వల్ల ప్రయోజనాలున్నాయని ధనికులు గుర్తించడం మొదలుపెట్టారు. అయితే కొంత కాలానికి కార్పొరేట్ సంస్థలు ఎన్నికల ఖర్చులకు చందాలివ్వడం ఇబ్బందికరంగా పరిణమించడంతో వాటిని నిషేధించేందుకు టెడ్డీ రూజ్వెల్ట్ విఫలయత్నం చేశారు. ఈ దశలో పుట్టుకొచ్చిన టిల్‌మ్యాన్ యాక్ట్ కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు నేరుగా ప్రచారం ఖర్చుల నిధులు ఇవ్వరాదని తీర్మానం జరిగింది. ఈ చట్టంలోని లోపాలను క్రమేపీ అధిగమించే ప్రయత్నం జరిగినా పరిస్థితిలో మార్పేమీ రాలేదు. తరువాత కాలంలో ఏర్పాటైన ఫెడరల్ ఎలక్షన్స్ కమిషన్ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా.. నిధుల సేకరణ, ఖర్చుల్లోనూ పారదర్శకత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మొదలైంది. సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్, కన్సూమర్ వాచ్డాగ్, కామన్ కాజ్ వంటి సంస్థలు కూడా పార్టీలు ఎంతమేరకు, ఎలా నిధులు సేకరిస్తున్నాయి? ఎలా ఖర్చు పెడుతున్నాయి? అన్న అంశాలపై నిశితమైన నిఘా ఏర్పాటు చేస్తుంటాయి. ఫండ్‌రైజింగ్‌లో ఆ 527 గ్రూపులు కీలకం ఎన్నికల ప్రచారం కోసం నిధులు ఎవరు ఇవ్వవచ్చన్న ప్రశ్న వచ్చినప్పుడు అమెరికాలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్ల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. వీటిలో 527 గ్రూపులు ఒకటి. వ్యక్తులు, పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ)తోపాటు 527 గ్రూపుల నుంచి నిధులు సేకరించేందుకు అమెరికన్ చట్టాలు అనుమతిస్తాయి. సేకరించిన మొత్తం నిధుల్లో సింహభాగం వ్యక్తుల నుంచే అందుతాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కో వ్యక్తి గరిష్టంగా 2,800 డాలర్లు అభ్యర్థులకు విరాళంగా ఇవ్వవచ్చు. పార్టీకైతే 35 వేల డాలర్ల వరకు చెల్లించవచ్చు. ద్రవ్యోల్బణం తదితర అంశాల ఆధారంగా ఈ గరిష్ట పరిమితులను నిర్ణయిస్తారు. విదేశీయులు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు చందాలు ఇవ్వడం నిషేధం. కాకపోతే గ్రీన్‌కార్డ్ కలిగి ఉన్న వారిని విదేశీయులుగా పరిగణించరు కాబట్టి వారు అమెరికన్ పౌరులతో సమానంగా ఎన్నికలకు నిధులివ్వచ్చు. పొలిటికల్ యాక్షన్ కమిటీలు ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసుకునేవి. వెయ్యి డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని ఎన్నికల ఖర్చు కోసం అందించేవి కూడా. ఒకవేళ ఈ పీఏసీ కార్పొరేట్ సంస్థ లేదా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదైతే.. యూనియన్ సభ్యులు, వారి కుటుంబాలు, షేర్ హోల్డర్లు, ఉద్యోగుల నుంచే నిధులు సేకరించి ఇవ్వాలి. ఒక్కో అభ్యర్థికి ఏడాదికి ఐదు వేల డాలర్ల వరకు చెల్లిం చేందుకు పీఏసీలకు అనుమతి ఉంటుంది. అలాగే ఒక పార్టీకి 15,000 డాలర్ల వరకూ చెల్లించవచ్చు. పీఏసీ లు జారీచేసే టీవీ, రేడియో, ప్రింట్ ప్రకటనలపై ఆ విషయాన్ని స్పష్టం చేయాలి. అంటే ఏ అభ్యర్థి ప్రకటన జారీ చేసినా.. దానికైన ఖర్చు ఏ పీఏసీ భరించిందో తెలపాలి. ఇక 527 గ్రూపులు పీఏసీల మాదిరే పనిచేస్తాయి. కానీ ఎన్నికల్లో విధానపరమైన అంశాలను ప్రభావితం చేసేందుకు ఏర్పాటైన లాభాపేక్ష లేని రాజకీయ బృందాలివి. ఇవి అభ్యర్థులకు అనుకూలంగా, ప్రతికూలంగా నేరుగా ప్రచారం చేయవు. ఫలితంగా వీటిపై ఎన్నికల కమిషన్ అజమాయిషీ ఉండదు. (నేడు అత్యంత కీలక రక్షణ ఒప్పందం) పోటాపోటీగా నిధుల సమీకరణ 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఒకవైపు రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్, మరోవైపు డెమొక్రాట్ల తరఫున పోటీచేస్తున్న బైడెన్ పోటాపోటీగా నిధుల సమీకరణ చేపట్టారు. అయితే నిధుల సేకరణలో ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ పరిస్థితి ఇప్పటికీ మెరుగ్గా ఉందని అంచనా. ఎందుకంటే సేకరించిన నిధుల్లో బైడెన్ కొంతే ఖర్చుపెట్టి చేతిలో నగదు కలిగి ఉండగా.. ట్రంప్ మాత్రం ఇప్పటికే జేబులు ఖాళీ చేసుకున్నాడు. అభ్యర్థులు ఎవరైనా సరే.. ఎన్నికల ప్రచారం కోసం సేకరించే నిధుల వివరాలను ప్రతి నెలా ఫెడరల్ ఎలక్షన్స్ కమిషన్‌కు తెలియజేయాలి. ఎంత మొత్తం సేకరించారు? ఖర్చు పెట్టిందెంత? మిగిలిన మొత్తం ఎంత? అన్న వివరాలతో నెలవారీ నివేదికలు సమర్పించాలి. ఈసారి ఎన్నికలకు ఆగస్టులోనే నిధుల సేకరణ ఘట్టం మొదలు కాగా.. అధ్యక్ష స్థానంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తొలి నెలలో ప్రత్యర్థి కంటే ఎక్కువ నిధులు కలిగి ఉన్నప్పటికీ సెప్టెంబర్ నాటికి పరిస్థితి తారుమారైంది. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్బర్గ్ మరణం సందర్భంలో, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ను ఎంపిక చేసినప్పుడు బైడెన్‌కు ప్రజల నుంచి భారీగా విరాళాలు అందాయి. అప్పట్లో లింకన్ దివాలా తీసినంత పనైంది! అమెరికాలో ఎన్నికలకు, డబ్బుకు ఉన్న సంబంధాలకు కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1700ల ఆఖరులో 21 ఏళ్లపైబడ్డ తెల్లజాతి భూస్వాములు మాత్రమే ఓటుహక్కు కలిగి ఉండేవారు. అంటే డబ్బున్న వారి మాటే చెల్లుబాటయ్యేది. 1828 నాటికి ఎవరు ఓటేయాలో ఎవరు కూడదో రాష్ట్రాలు నిర్ణయించేవి. కాకపోతే భూస్వాములకు మాత్రమే ఉన్న ఓటుహక్కును తొలగించారు. ఈ సమయంలోనే ఆండ్రూ జాక్సన్ అనే రాజకీయ నేత తొలిసారి ఓట్ల ప్రచారం కోసం డబ్బులు సేకరించడం మొదలుపెట్టాడని చరిత్ర చెబుతోంది. కొన్ని కమిటీలను ఏర్పాటుచేసి వాటితో ర్యాలీలు, పెరేడ్లు నిర్వహించడం ద్వారా ఆండ్రూ జాక్సన్ తన సందేశాలను ప్రజల వద్దకు చేర్చేవాడు. ఆ తరువాత కాలంలో అబ్రహం లింకన్ తన సొంత డబ్బులతో ప్రచారం నిర్వహించాడు. కొంతమంది ధనిక స్నేహితులూ ఒకింత సాయం చేశారు. అయినా సరే.. ఆ ఎన్నికల్లో లింకన్ దివాలా తీసినంత పనైంది. -
అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి
డల్లాస్ : ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారై నూనె సురేష్ ప్రమాదవశాత్తు దుర్మరణం చెందారు. కుటుంబం సమేతంగా హాలిడే ట్రిప్‌కి వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. డల్లాస్‌లోని సింటెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా సురేష్ పని చేస్తున్నాడు. స్వగ్రామంలో అంత్యక్రియలు తరలించేందుకు కుటుంబసభ్యుల ప్రయత్నం చేస్తున్నారు. అయితే మృతదేహం తరలింపుకు దాదాపుగా 80 వేల డాలర్లు అవసరం కావటంతో కుటుంబసభ్యులు, బంధువులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫండ్ రైజింగ్ వెబ్సైట్లో అమెరికా లో స్థిరపడ్డ తెలుగు వారు, తెలుగు సంఘాలు తమకు తోచిన సహాయం అందజేస్తున్నాయి. వీలైనంత తొందరగా సురేష్ మృతదేహాన్ని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ఆటా ఆధ్యర్యంలో విరాళల సేకరణ
అట్లాంట : అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్యర్యంలో విరాళల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అట్లాంటాలో జరిగిన ఈ కార్యక్రమానికి సూపర్ సింగర్ ఫేమ్ అంజనా సౌమ్యతో పాలు పలువురి సింగర్స్ పాల్గొని ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ఈవెంట్‌తో సుమారు రూ.1 కోటి 46 లక్షల విరాళాలు వచ్చాయని, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికి ప్రత్యేక ధన్యవాదాలని నిర్వాహకులు తెలిపారు. తెలుగు ప్రజల సంక్షేమానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. -
'అమరావతి'కి తలా రూ.10 ఇవ్వండి..
- రాజధాని నిర్మాణం కోసం విద్యార్థుల నుంచి విరాళాలు కోరిన ప్రభుత్వం - సేకరణ బాధ్యతలు డీఈవోలకు అప్పగిస్తూ జీవో జారీ హైదరాబాద్: రాజధాని భూములను విదేశీ ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని భావిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసమని విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విధిగా రూ. 10 విరాళాన్ని ఇవ్వాలి. విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా విరాళం ఇవ్వాల్సిందే. విరాళాలు సేకరించే బాధ్యత డీఈవోలది. ఒక్క పాఠశాలలే కాక ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి కూడా విరాళం సేకరించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. అన్ని స్థాయిల్లో కలిపి ఏపీలో దాదాపు 50 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో చాలా మంది నిరుపేద విధ్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఉపకారవేతనమే ఆధారం. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం కోసమంటూ విద్యార్థుల నుంచి విరాళాలు కోరడంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.