అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి | Telugu NRI Died At Oklahoma Turner Waterfalls | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి

Published Sat, Jul 6 2019 7:56 PM | Last Updated on Sat, Jul 6 2019 8:48 PM

Telugu NRI Died At Oklahoma Turner Waterfalls - Sakshi

కుటుంబ సభ్యులతో సురేష్‌ (ఫైల్‌ ఫోటో)

డల్లాస్‌ : ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారై నూనె సురేష్ ప్రమాదవశాత్తు దుర్మరణం చెందారు. కుటుంబం సమేతంగా హాలిడే ట్రిప్కి వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. డల్లాస్‌లోని సింటెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా సురేష్ పని చేస్తున్నాడు. స్వగ్రామంలో అంత్యక్రియలు తరలించేందుకు కుటుంబసభ్యుల ప్రయత్నం చేస్తున్నారు. అయితే మృతదేహం తరలింపుకు దాదాపుగా 80 వేల డాలర్లు అవసరం కావటంతో కుటుంబసభ్యులు, బంధువులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫండ్ రైజింగ్ వెబ్‌సైట్‌లో అమెరికా లో స్థిరపడ్డ తెలుగు వారు, తెలుగు సంఘాలు తమకు తోచిన సహాయం అందజేస్తున్నాయి. వీలైనంత తొందరగా సురేష్ మృతదేహాన్ని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement