prakasham district
-
ప్రకాశం జిల్లా కారుమంచి గ్రామంలో దారుణ ఘటన
-
వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు ఏం చేశారు?: వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం,సాక్షి: వెలిగొండ ప్రాజెక్టుపై తెలుగు దేశం ప్రభుత్వం దిగజారి మాట్లాడుతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వై.వి సుబ్బారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘అసలు వెలిగొండ ప్రాజెక్టుకు ఎవరు ఎన్ని నిధులు కేటాయించిందనే విషయం, పనులు ఎవరు పూర్తి చేశారనే విషయం ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలుసు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై చంద్రబాబు కూడా అనుమానం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఈవీఎంలపై అనుమానం ఉందనే విషయాన్ని తాము చెబుతునే ఉన్నాము. అయితే కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. -
ప్రతిపక్ష నేత చంద్రబాబును నమ్మితే పులినోట్లో తలపెట్టినట్లేనంటూ ప్రజలను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు ఒక శాడిస్ట్ అని మేమంత సిద్ధం సభలో మండిపాటు..ఇంకా ఇతర అప్డేట్స్
-
Watch Live: కొనకమెట్ల జంక్షన్ లో సీఎం జగన్ బహిరంగ సభ
-
నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర
-
నాన్నగారు మొదలుపెట్టారు కొడుకుగా నేను పూర్తి చేశాను...
-
Live: సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన
-
నేడు సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన
-
రేపు సీఎం జగన్ చేతుల మీదుగా భూ బదిలీ పత్రాలు పంపిణీ
అమరావతి: పేద అక్క చెల్లమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ.. రికార్డు స్థాయిలో 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అందించడమే గాక దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరు మీదనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం పంపిణీ ప్రకాశం జిల్లా ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రేపు(శుక్రవారం) 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి, ఆ పత్రాలు పంపిణీ చేయనుంది సీఎం జగన్ ప్రభుత్వం దీంతోపాటు 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' క్రింద రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్కచెల్లెమ్మల పేరు మీదుగానే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ కూడా చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించే కార్యక్రమాన్ని రేపు ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ ద్వారా కలిగే ప్రయోజనాలు పదేళ్ల తర్వాత ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండేలా లబ్ధిదారుల పేరిట గ్రామ/వార్డు సచివాలయాల్లోనే, ఇప్పుడే ఉచితంగా స్థలాల రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ కూడా అందజేత రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ఇప్పటికే దాదాపు 15 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి.. శరవేగంగా మిగిలిన రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (జెఎస్ఆర్వో) డేటాబేస్‌లో వివరాలన్నీ పదిలం.. ఎప్పుడైనా ఈ జెఎస్ఆర్వోలలో సర్టిఫైడ్ కాపీ పొందే అవకాశం.. ఫోర్జరీ గానీ, ట్యాంపర్ చేయడానికి గానీ ఆస్కారమే ఉండదు పదేళ్ల తర్వాత ఆటోమేటిక్ గా క్రయ, విక్రయ, దాన, వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు.. అత్యవసర సమయాల్లో ఇంటిని అమ్ముకునే వీలు.. అమ్ముకునే సమయంలో ఎన్వోసీ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎలాంటి లింకు డాక్యుమెంట్ల అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. శుక్రవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లు, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు. అర్హులైన 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు, మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ చేసి రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్స్‌ను అందజేయనున్నారు. భూమి కొనుగోలు, జగనన్న టౌన్ షిష్‌ల అభివృద్ధికి రూ.210 కోట్లు, లే అవుట్ల అభివృద్ధికి రూ. 21.33 కోట్లు సీఎం జగన్ ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. -
చెట్లు నరుకుతుండగా వింత ఘటన
-
బస్సు డ్రైవర్ నిద్రమత్తు..పెళ్లింట విషాదం
-
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ప్రకాశం: దర్శి పట్టణంలో అగ్నిప్రమాదం
-
మరోసారి వాత్సల్యం చూపిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
-
ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల
-
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
-
చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ కు సీఎం జగన్ దిమ్మతిరిగే కౌంటర్
-
పేదవారి సొంతింటి కల నెరవేర్చారన్న..
-
దేశంలో ఈబీసీ నేస్తం లాంటి పథకం ఎక్కడా లేదు : సీఎం జగన్
-
అక్క చెల్లెమ్మలను అన్ని విధాలా ఆదుకుంటున్నాం: సీఎం జగన్
-
దేశానికి ఆదర్శం సీఎం వైఎస్ జగన్
-
YSR ఈబీసీ నేస్తం లబ్ధిదారులతో సీఎం జగన్ ముచ్చట్లు
-
ప్రకాశం జిల్లా మార్కాపురానికి సీఎం జగన్
-
దర్శి దాహార్తి తీరేలా.. ప్రత్యేక దృష్టి సారించిన సీఎం జగన్
దర్శి పట్టణవాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు పడుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రూ.121 కోట్లు మంజూరు చేశారు. రానున్న 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక టెండర్లు పిలవడమే తరువాయి. దీనిపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శి(ప్రకాశం జిల్లా): దర్శి పట్టణంలో 33,500 మంది జనాభా నివశిస్తున్నారు. అధికారికంగా పన్ను చెల్లిస్తున్న నివాసాలు 8,800 ఉండగా అనధికారికంగా 10 వేలకు పైగానే ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఉన్న నిమ్మలబావి కనెక్షన్లు 600, ఆర్డబ్ల్యూఎస్ కనెక్షన్లు 60, వీధి కుళాయిలు మరో 960 ఉన్నాయి. ప్రస్తుతం మూడు రోజులకు ఒక సారి నీరు అందుతోంది. 50 ఏళ్లు నీటి ఇబ్బందులు అధిగమించేలా: మరో 50 ఏళ్లు ఇంటింటికీ కుళాయి నీరు ఇచ్చి నీటి ఇబ్బందులు అధిగమించేలా సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. ఈ ఎస్ఎస్ ట్యాంక్‌లో 1600 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. రోజుకు 9 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేలా ప్రణాళికలు చేశారు. రోజుకు ఒక వ్యక్తికి 135 లీటర్ల నీరు సరఫరా చేస్తారు. కేటాయింపు ప్రణాళికలు ఇలా.. ఈ ప్రాజెక్ట్‌కు రూ.121 కోట్లు మంజూరు చేస్తూ జీఓ విడుదల చేశారు. నాలుగు విభాగాలుగా పనులకు ప్రణాళికలు రూపొందించారు. సాగర్ కాలువ నుంచి ఎస్ఎస్ ట్యాంక్ (సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్)కు నీరు రావడానికి, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్, ఫుట్ బ్రిడ్జి, ఇంటేక్ వెల్ ల నిర్మాణానికి, నీటి సరఫరా లైన్లకు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణాలకు రూ.8938.67 లక్షలు కేటాయించారు. రెండో విభాగంలో 7 సంవత్సరాల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు రూ.660.85 లక్షలు కేటాయించారు. మూడో విభాగంలో జీఎస్టీ ఇతర చార్జీలు రూ.1752.64 లక్షలు కేటాయించగా నాలుగో విభాగంలో ఏపీఎస్పీ డీసీఎల్, ప్రైజ్ వేరియేషన్స్, కన్సల్టెన్సీ చార్జెస్, ల్యాండ్ కేటాయింపునకు, ఇతర అవసరాలకు రూ.747.84 లక్షలు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను దర్శి పట్టణాన్ని ఆనుకుని ఉన్న ముండ్లమూరు మండలం పులిపాడు చెరువు వద్ద నిర్మిస్తారు. ఆ చెరువుకు మొత్తం 250 ఎకరాలు భూమి ఉంది. చెరువు నిండితే 120 నుంచి 150 ఎకరాల భూమిలో నీరు నిల్వ ఉంటుంది. 100 ఎకరాల నుంచి 130 ఎకరాల వరకు చెరువుకు మిగులు భూమి ఉంది. అందులో 96 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్‌కు సేకరించారు. ప్రత్యేకంగా రావాటర్ స్టోరేజ్ ట్యాంక్, నీటి శుద్ది కర్మాగారాలు, స్టాఫ్ క్వార్టర్స్ వంటి సౌకర్యాలకు భూమిని ఉపయోగిస్తారు. సాగర్ కుడి కాలువ నుంచి నేరుగా చెరువులోకి నీరు వచ్చేలా పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ నీటిని శుద్ధి ప్లాంట్‌లో శుద్ధి చేసి పైప్లైన్ల ద్వారా పట్టణంలోని ఇంటింటికీ నీటి సరఫరా చేస్తారు. వీధి పంపులకు చెక్: ప్రస్తుతం మంజూరైన ప్రాజెక్ట్ పూర్తయితే మహిళలు వీధి కుళాయిల వద్ద లైన్లో నిలబడి నీరు పట్టుకోవాల్సిన పని లేదు. నేరుగా ఇంట్లోకే తాగు నీరు పైప్ లైనుల ద్వారా చేరేలా ప్రణాళికలు చేశారు. వారి సమయం కూడా వృథా కాదు. పాత పైప్ లైనులు బాగున్న చోట అవే లైన్లు ఉంచి, నీరు అందని ఎత్తు పల్లాల వద్ద నూతన పైప్ లైన్లు వేస్తారు. దీంతో ప్రతి ఇంటికి నీరు కచ్చితంగా చేరుతుంది. పరోక్షంగా పట్టణ అభివృద్ధి: తాగునీటి ఇబ్బందులు అధిగమిస్తే నివాసాలు ఉండేవారు ఎక్కువ చొరవ చూపుతారు. దీంతో దర్శిలో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. తద్వారా పట్టణం కూడా వ్యాప్తి చెందుతుంది. శిథిలావస్థలో నెదర్లాండ్ చెరువు 35 సంవత్సరాల క్రితం సాగర్ కాలువ నిర్మించినప్పుడు ఏర్పాటు చేసిన తాగునీటి రిజర్వాయర్ మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉంది. అప్పటి జనాభా ప్రకారం ప్రణాళికలతో నిర్మించిన నిర్మాణాలు, పైపులైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పట్టణం తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ప్రాజెక్ట్ పూర్తయితే ఇబ్బందులను అధిగమించవచ్చు. -
సముద్రంలో ఛేజింగ్ సీన్
-
ఆదిమూలపు సురేష్ కుటుంబానికి సీఎం పరామర్శ
-
ప్రకాశం జిల్లా ఒంగోలు లో రోడ్డు ప్రమాదం
-
ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురైన గ్యాస్ సిలిండర్ల లారీ
-
ప్రకాశం జిల్లాలో గంజాయి అమ్మకాలు
-
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సీఎం వైఎస్ జగన్
-
ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్
-
ప్రకాశం జిల్లా కంభం సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం
-
అధికారంలో ఉండగా అరాచకాలు చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు: మాజీ మంత్రి అనిలా కుమార్ యాదవ్
-
సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి..
-
ప్రకాశం జిల్లా ఒంగోలు ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో అగ్ని ప్రమాదం
-
1905లో నాటారు.. ఇప్పటికీ చెక్కుచెదరకుండా
వేటపాలెం: ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలోని ప్రాథమి ఆరోగ్య కేంద్రం వద్ద గల శతాబ్థాల చరిత్ర గల మర్రివృక్షం ఇప్పటికి చెక్కుచెదర కుండా ఉంది. ఈ వృక్షానికి ఇక చరిత్ర ఉంది. 1904 సంవత్సరంలో జెయంజే సంస్థకు చెందిన నలుగురు కన్యాస్త్రీలు వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేదలకు వైద్యం చేస్తు వాటితో పాటు సామాజిక సేవలు చేసేవారు. అప్పటిలో వారు వైద్యశాలకు వచ్చే రోగులకు నీడ కోసం 1905 సంవత్సరంలో మే 1వ తేదీన వైద్యశాల ముందు మర్రి చెట్టు మొక్కలు రెండు నాటారు. అనంతరం వారు 1911 మే 11వ తేదీన వరకు వైద్యశాల్లో సేవలు అందించారు. అనంతరం సంస్థ కార్యకలాపాలు చీరాల మార్చడం జరిగింది. అప్పడు వారు నాటిన మర్రి మొక్కలే నేడు మహవృక్షాలుగా నేటికీ ఉన్నాయి. శతాబ్థాల చరిత్ర గల ఈ మర్రి వృక్షాలను కాపాడుకోవడం తోపాటు అవి చిరస్మరణీ యంగా నిలువాలని సంస్థ వాటికి రక్షణ కోడలు నిర్మించి రోగులు సేద తీరడానికి వృక్షాల చుట్టూ అరుగులు ఏర్పాటు చేశారు. 2019 సంవత్సరంలో సంస్థ ప్రతినిధులు బెంగుళూరు నుండి వేటపాలెం వచ్చి రూ.10 లక్షల ఖర్చుతో పార్కును ఏర్పాటు చేసి సుందరంగా అలకంరించారు. ఈ వృక్షాలు దశాబ్థాల చరిత్రను తెలియజేస్తున్నాయి. -
ఆవుల సంరక్షణ కోసం గాయత్రి కృషి
-
ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్
-
ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల హవా
-
ఇద్దరు యువకులు కాడెద్దులుగా మారి పొలాన్ని
సీఎస్‌పురం: వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకునేందుకు ఇద్దరు యువకులు కాడెద్దులుగా మారి పొలాన్ని చదును చేశారు. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలంలోని అరివేముల గ్రామానికి చెందిన మారంరెడ్డి రత్నారెడ్డికి అర ఎకరా పొలం ఉంది. అందులో వరి సాగు చేసేందుకు సిద్ధం చేస్తున్నాడు. చదును చేసేందుకు పాకుమాను వేయాల్సి వచ్చింది. ఎద్దులు లేకపోవడం, ట్రాక్టర్ యజమానులు బాడుగ ఎక్కువగా చెబుతుండటంతో ఏం చేయలో అర్థం కాలేదు. పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా ఉన్న తన అన్న కుమారులు మారంరెడ్డి రమణారెడ్డి, మోహన్‌రెడ్డిలను కాడి లాగేందుకు ఉపయోగిస్తూ తాను వెనుక ఉండి పాకుమానుతో భూమిని చదును చేయడం ప్రారంభించాడు. గురువారం వరి నాటాల్సి ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఈవిధంగా భూమిని చదును చేస్తున్నట్లు రత్నారెడ్డి తెలిపారు. -
హేళన చేసిన వారే అనుసరిస్తున్నారు..!
ఎకరం పొలమే ఉన్న రైతు పొలంలో ఎంత పంట పండిస్తే మాత్రం ఏమంత సంతోషం కలుగుతుంది? అని ఎవరైనా అనుకుంటూ ఉంటేæవారు నిస్సందేహంగా పప్పులో కాలేసినట్లేనంటున్నారు యువ మహిళా రైతు రజిత! రసాయనాలు వాడకుండా, ఒకటికి పది–పదిహేను పంటలు పండిస్తే.. చిన్న కుటుంబం ఆనందంగా జీవించడానికి ఎకరం భూమి ఉన్నా చాలని రుజువు చేస్తున్నారామె. 8 ఏళ్లుగా ఆదర్శ సేద్యం చేస్తూ తోటి రైతులకు వెలుగు బాట చూపుతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో పాటు ఏడాది పొడవునా పలు పంటల విధానాన్ని అనుసరిస్తూ సేద్యాన్ని సంతోషదాయకంగా మార్చుకోవడమే కాకుండా ఇతర రైతులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడుకు చెందిన కె.రజిత(27). 19 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత పెళ్లవడంతో చదువు ఆగిపోయింది. ఆ దశలో డ్రాక్రా గ్రూపులో చేరిన రజిత విష రసాయనాల్లేని వ్యవసాయం (నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్)లో శిక్షణ పొంది తమ కున్న ఎకరం నల్లరేగడి భూమిలో విభిన్నంగా పంటలు పండించడం ప్రారంభించారు. 2012లో ఎన్‌పిఎం వ్యవసాయంలో విలేజ్ యాక్టివిస్టుగా చేరి.. తాను వ్యవసాయం చేసుకుంటూ తమ గ్రామంలో ఇతర రైతులకూ ఈ సేద్యాన్ని నేర్పించేందుకు కృషి చేశారు. తదనంతర కాలంలో పూర్తిస్థాయి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమంలో క్లస్టర్ యాక్టివిస్టుగా బాధ్యతలు తీసుకొని ఐదుగురు సిబ్బంది తోడ్పాటుతో మూడు గ్రామాల్లో ప్రకృతి సేద్య విస్తరణకు కృషి చేస్తున్నారు. తమ ఎకరం పొలంలో ఆదర్శవంతంగా ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఎన్‌పిఎం సాగుతో ప్రారంభం మెట్ట ప్రాంతమైన నాగులుప్పలపాడు రబీ మండలం కావడంతో రైతులు ఎక్కువగా రసాయనిక వ్యవసాయంలో పుల్ల శనగను పండిస్తూ ఉంటారు. రజిత ఎన్‌పిఎం సేద్యం చేపట్టినప్పుడు పురుగుమందులు వాడకుండా వ్యవసాయం ఎట్లా అవుతుందని రైతులు ఎద్దేవా చేసేవారు. కానీ, క్రమంగా ఆమె మెళకువలను అలవరచుకొని ముందుకు సాగడంతో వారే ముక్కున వేలేసుకున్నారు. మూడేళ్లుగా కూరగాయ పంటలను సైతం అంతరపంటలుగా సాగు చేసుకుంటున్నారు రజిత. గత నాలుగైదేళ్లుగా పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ప్రధాన పంటతోపాటు అనేక అంతర పంటలు పండిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారామె. ఎన్ని రకాల పంటలు సాగు చేసినా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు పండించటమే ప్రధాన ధ్యేయం. జీవామృతం, పంచగవ్య, కషాయాలను పంటలపై పిచికారీ చేస్తారు. ఎకరానికి 400 కిలోల ఘన జీవామృతం తయారు చేసుకొని పంటలకు సకల పోషకాలను అందిస్తున్నారు. మిత్ర పురుగులు వృద్ధి చెంది చీడపీడల బెడద నష్టదాయకంగా పరిణమించకుండా కాపాడుతున్నాయి. 10 రకాల అంతరపంటలు ప్రధాన పంట మిరపలో అంతర పంటలుగా 10 రకాలు సాగు చేసి మంచి ఫలితాలు సాధించింది. మిరప పంట ఆరు నెలల కాల వ్యవధిలో కాపు ముగుస్తుంది. ఈ లోగా మూడు నెలలు, రెండు నెలలు, నాలుగు నెలల కాల వ్యవధిలో ఉండే పంట రకాలను ఎంచుకొని సాగు చేపట్టింది. మిరప పంటకు చుట్టూ బెల్టుగా కంది పంటను సాగు చేసింది. కందితో పాటు ముల్లంగి, ఉల్లి, కొత్తిమీర, మొక్కజొన్న, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమోటా, ఎర పంటలుగా బంతి, ఆముదం కూడా సాగు చేపట్టింది. ఏడాది పొడవునా పంటలు 2017 ఏప్రిల్ నుంచి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిలో నవధాన్యాలను ఎండాకాలంలోనే వెదజల్లి పచ్చి రొట్ట పంటలు సాగు చేసి కలియదున్ని.. తదనంతరం పంటలు సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఏడాది పొడవునా పొలాన్ని ఖాళీగా ఎండబెట్టకుండా ఏదో ఒక పంట లేదా పచ్చిరొట్ట పంటలు సాగులో ఉంటాయి. దీంతో భూమి గుల్లబారి భూసారం మరింత పెరగడంతోపాటు.. మిర్చి ప్రధాన పంటగా సాగు చేస్తుండగా ఇతర రైతులతో పోల్చితే చీడపీడల బెడద తమ పొలంలో చాలా తక్కువగా ఉందని, దిగుబడుల పరిమాణం, నాణ్యత కూడా బాగా పెరిగాయని రజిత తెలిపారు. మిర్చితోపాటు కొందరు రైతులు ఉల్లిని అంతర పంటగా వేశారని, తాను మిర్చితోపాటు వేసిన ఉల్లిపాయ ఒక్కొక్కటి పావు కిలో తూగితే, రసాయనిక వ్యవసాయం చేసే ఇతరుల పొలాల్లో ఉల్లి మధ్యస్థంగా పెరిగిందన్నారు. సాగు వ్యయం సగమే ప్రకృతి వ్యవసాయంలో ఎకరం పొలంలో ఎండు మిర్చితోపాటు పలు అంతర పంటలు సాగు చేయడానికి రజిత ఇప్పటి వరకు అన్ని ఖర్చులూ కలిపి రూ. 62,550 ఖర్చు పెట్టారు. మిర్చి సాగు చేసే ఇతర రైతులకు కనీసం రూ. 1,10,000 అయ్యిందని రజిత తెలిపారు. మిర్చి తొలి కోతలో ఎకరానికి 4.5 క్వింటాళ్లకు పైగా ఎండు మిర్చి దిగుబడి వచ్చింది. ధర క్వింటాకు రూ. 14,500 ఉండగా తమ పంటను రూ. 16,000కు అడిగారని, అయినా ధర పెరుగుతుందన్న భావనతో కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టానని రజిత వివరించారు. మొత్తంగా 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నానన్నారు. అంతరపంటల అమ్మకం ద్వారా రూ. 35 వేలు ఆదాయం వచ్చిందన్నారు. ఖర్చులన్నీ పోను రూ. 2.30 లక్షలకు తగ్గకుండా నికరాదాయం వస్తుందని రజిత లెక్కగడుతున్నారు. ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారుగా కుటుంబానికి రసాయనిక అవశేషాల్లేని ఆహారాన్ని అందించడంతోపాటు ఇతర రైతులకు స్ఫూర్తినిస్తున్న రజిత.. మరో వైపు చదువును సైతం కొనసాగిస్తున్నారు. దూరవిద్య ద్వారా బీకాం చదువుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరూ సంతోషంగా ఉన్నారని రజిత సంతోషపడుతున్నారు. హేళన చేసిన వారే అనుసరిస్తున్నారు..! నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన కొత్తలో గ్రామంలోని చాలా మంది రైతులు హేళన చేసేవారు. చిన్న అమ్మాయి ఏమి తెలుసని అనేవారు. 2012 నుంచి పురుగుమందుల్లేని వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంలోని మెళకువలను అధ్యయనం చేసి, నా ఎకరం పొలంలో ఆచరిస్తున్నాను. ఇవే నన్ను ఆత్మస్థయిర్యంతో ముందుకు నడిపించాయి. జీవామృతంతో పంటలు పండించే విధానాన్ని 2, 3 ఏళ్ల పాటు రైతులు మా పొలంలో చూసి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో తగ్గిన ఖర్చులు చూసి రసాయన ఎరువులు, పురుగుమందులతో పంటలు సాగు చేసే రైతులు నివ్వెరపోయారు. వాళ్ళు 2, 3 రెట్లు అధికంగా ఖర్చు పెడుతున్నారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణించిపోతున్నది. ప్రకృతి వ్యవసాయమే అన్ని విధాలా మంచిది. – కె.రజిత (76740 21990), యువ ప్రకృతి వ్యవసాయదారు, నాగులుప్పలపాడు, ప్రకాశం జిల్లా – ఎన్.మాధవరెడ్డి, సాక్షి ప్రతినిధి, ఒంగోలు ఫొటోలు: ఎమ్. ప్రసాద్, సీనియర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
పట్టపగలే నడిరోడ్డుపై దారుణం
సాక్షి, ప్రకాశం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపేశారు. పట్టపగలే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒంగోలులోని గాంధీ పార్కు ఎదుట ఈ ఘటన జరిగింది. వివరాలు.. వస్త్ర దుకాణంలో పనిచేసే థామస్.. సహచర ఉద్యోగి భార్యను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధిత మహిళ భర్తకు ఈ విషయం గురించి చెప్పింది. కోపోద్రిక్తుడైన అతడు, థామస్‌తో మాట్లాడేందుకు గాంధీ పార్కుకు రావాలని పిలిచాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. బాధితురాలి భర్త తన వెంట తెచ్చుకున్న కత్తితో థామస్‌ను పొడవగా.. అక్కడిక్కడే అతడు మృతి చెందాడు. దీంతో కంగారు పడిన భార్యాభర్తలు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.(చదవండి: నటి ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు) -
ప్రకాశం జిల్లాలో కొండచిలువ కలకలం
-
వైఎస్సార్సీపీ నాయకుడి దారుణ హత్య
సాక్షి, ప్రకాశం : వైఎస్సార్సీపీ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని తాళ్లురు మండలం రజానగరంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, హతుని భార్య కథనం ప్రకారం.. మారం సుబ్బారెడ్డి(64) అలియాస్ భూమిరెడ్డి సుబ్బారావు తన ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక నుంచి ప్రహారీ దూకి వచ్చి ఒక్కసారిగా తలపై, మెడపై తీవ్రంగా నరికి చంపారు.(చదవండి : దారుణం: కత్తితో గొంతు కోసి..) ఆ సమయంలో భార్య పాల కోసం గ్రామంలోకి వెళ్లింది. అర్థగంట తరువాత వచ్చి చూడగా భర్త ఒళ్లంతా రక్తంతో కుర్చీలో వాలి ఉండటంతో భయంతో కేకలు వేయడంతో, అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుబ్బారావు మృదుస్వభావి. ఆయన గతంలో బెంగళూరులో బ్రిక్స్ వ్యాపారం చేసేవాడు. ప్రస్తుతం గ్రామంలోనే దానిమ్మ తోటలను సాగు చేసుకుంటున్నారు. హత్యకు గల కారణాలేమిటనేది తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని ఎస్ నాగరాజు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యానికి బానిసై.. ప్రాణాలు కోల్పోయి..
-
కురిచేడులో విషాదం..
-
అవాస్తవాలను రాస్తే చట్టపరమైన చర్యలు
-
కరోనా వైరస్: క్రైం డౌన్ !
సాక్షి, ఒంగోలు: జిల్లాలో పోలీసులంతా స్టేషన్లను వదిలి రోడ్లపై కాపలా కాస్తున్నారు.. జనమంతా ఇళ్లకే పరిమితమైపోయారు.. కరోనా మహమ్మారి విజృంభించకుండా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో నేరాల సంఖ్య సైతం పూర్తిగా తగ్గిపోయింది. దొంగలు, నేరగాళ్లు సైతం లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్లున్నారు. అందుకే క్రైం రేటు తగ్గిపోయింది. పోలీసులు రోడ్లపై జనం తిరగకుండా కాపలా కాయడం మినహా నేరాలపై దృష్టిసారించే పరిస్థితి లేనప్పటికీ క్రైం రేటు తగ్గడానికి ప్రధాన కారణం లాక్డౌన్ అని చెప్పవచ్చు. జిల్లాలో లాక్‌డౌన్‌కు ముందు ఉన్న పరిస్థితిని పరిశీలిస్తే నెలకు సగటున 1800 నుంచి 2 వేల వరకు నేరాల సంఖ్య ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య మూడో వంతుకు పడిపోయింది. ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులు, గృహ హింసలు వంటి కేసులతో పాటు రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల గత నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ ఆ తరువాత నుంచి లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కరోనా నియంత్రణ విధుల్లోనే కొనసాగుతున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద, క్వారంటైన్ కేంద్రాల వద్ద, గ్రామాల నుంచి నగరాల వరకు రోడ్లపైన ప్రజలెవరూ తిరగకుండా కాపలాలు కాస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ కరోనాను నియంత్రించే పనిలోనే ఉన్నప్పటికీ నేరాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి నెలలో జిల్లాలో నేరాల సంఖ్య మూడో వంతుకు పడిపోవడం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా లాక్డౌన్ వల్ల రోడ్లపై వాహనాలను పూర్తిగా నియంత్రించడంతో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. అందులో కూడా ఫిబ్రవరి నెలాఖరుతో పోలిస్తే మార్చి నెల చివరి పదిరోజుల్లో నేరాల సంఖ్య ఐదో వంతు కూడా లేకపోవడం విశేషం. ఇలా ఎలాంటి నేరాలను పరిశీలించినా లాక్డౌన్ సమయంలో మామూలు రోజుల కంటే ఐదో వంతుకు నేరాల సంఖ్య పడిపోవడం చూస్తుంటే జనంతో పాటు నేరస్తులు సైతం లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
ఇస్లాంపేట ప్రాంతంలో పూర్తిస్ధాయి ఆంక్షలు
-
చెన్నైలో ఉండలేక.. సొంతూరికి వెళ్లలేక
ఒంగోలు: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది వలస కూలీల పరిస్థితి. పని ప్రదేశంలో ఉండే అవకాశం లేక సొంతూరికి వెళ్లే దారి లేక అవస్థలు పడుతున్నారు. రోనా దెబ్బకు సోమవారం 48 మంది ఇతర రాష్ట్రాల వారు పడ్డ అవస్థలు వర్ణణాతీతం. గుజరాత్‌కు చెందిన 36 మంది, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 12 గత కొన్నేళ్లుగా చెన్నైలో పెయింటింగ్, స్వీపింగ్, కార్పెంటింగ్ వంటి పనులుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించడంతో ఉపాధితోపాటు కనీసం నిలువనీడ కూడా లేక వారంతా ఒక లారీ డ్రైవర్‌ను పట్టుకుని నాగపూర్ వరకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరు రూ.2వేలు చొప్పున లారీ బాడుగ మాట్లాడుకున్నారు. తీరా తెలంగాణ సరిహద్దు అయిన నల్గొండ వద్దకు వెళ్లగానే తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. (ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించారా? ) మేదరమెట్ల నుంచి ఒంగోలు వైపు జాతీయ రహదారిపై ఎర్రటి ఎండలో కాలినడకన వస్తున్న గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన యువకులు రాష్ట్రంలోకి అనుమతించేదే లేదంటూ నిలిపివేశారు. దీంతో దిక్కుతోచక తిరిగి చెన్నైకు వెళ్ళడమే ఉత్తమమని భావించి 20 కిలోమీటర్ల దూరం వెనుకకు నడిచి మరో లారీ మాట్లాడుకున్నా రు. నెల్లూరు వరకు రూ.500 చొప్పున చెల్లించేందుకు అంగీకరించారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వరకు రాగానే ముందుకు పోయే అవకాశం లేదంటూ లారీ డ్రైవర్ వారిని దింపేశాడు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారని సమాచారం ఉందని పేర్కొనడంతో వారంతా దిగిపోయారు. కనీసం తాము ఎక్కడ ఉన్నామో కూడా తెలియని స్థితిలో గూగుల్ మ్యాప్ ఆధారంగా తాము ఉన్న ప్రదేశాన్ని గుర్తించి చెన్నై వైపు నడక సాగించారు. దాదాపు 30 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ రాగా ఒంగోలు సమీపంలో త్రోవగుంట చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న తాలూకా సీఐ యం.లక్ష్మణ్ వారిని అడ్డుకొని విచారించారు. తమ గోడు విన్నవించున్న బాధితుల్లో చాలా మంది నీరసించి ఉండడంతో భోజనం చేశారా అంటూ ప్రశ్నించారు. తినడానికి రొట్టె కూడా దొరకలేదని, ఏదైనా తిని 24 గంటలు దాటిపోయిందని చెప్పడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు సమీపంలోని శ్రీలక్ష్మీ ఎంటర్ప్రైజెస్ వారితో మాట్లాడి 48 మందికి భోజనం ఏర్పాట్లు చేయించాడు. భౌతిక దూరం పాటించేలా కూర్చోబెట్టి కరోన పరిస్థితుల నేపథ్యంలో క్వారంటైన్ హోంలో ఉండాలని సూచించి, వారందరినీ టంగుటూరు హోంకు తరలించారు. -
వైరస్ కారణంగా ఇంట్లో మరో గదిలో..
-
ఆత్మహత్య: ఏం కష్టం వచ్చిందో..?
సాక్షి, పొట్టిరెడ్డిపాలెం(మర్రిపూడి): ఏం కష్టం వచ్చిందో..ఏమో తల్లీ, కూతుళ్లు ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పొట్టిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని పొట్టిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సందల జనార్దన్ రెడ్డితో సుమారు పదిహేనేళ్ల క్రింత కోటేశ్వరమ్మతో వివాహమైంది. వీరికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. రోజువారీ పనుల్లో భాగంగా భర్త జనార్దన్‌రెడ్డి పశుగ్రాసం కోసం పొలం వెళ్లాడు. అయితే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న సంఘటనను మృతురాలు మామ ఒక్కెయ్య చూసి కుమారుడుకు సమాచారం ఇచ్చాడు. కొడుకు పొలం నుంచి తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య కోటేశ్వరమ్మ(32), ఆమె కూతురు నందిని(13) ఇద్దరు ఒకే మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురు నందినికి కుర్చీ ఎక్కించి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసి ఉండవచ్చని, అనంతరం ఇంట్లో ఉన్న కందుల బస్తాల పైకి ఎక్కి తల్లి కోటేశ్వరమ్మ కూడా అదే చీరతో మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తుందని ఎస్సై ఏ. సుబ్బరాజు తెలిపారు. భార్య, భర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన కోటేశ్వరమ్మ ఈ సంఘటనకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కూతురు మర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. పొట్టిరెడ్డిపాలెం గ్రామంలో ఆరు నెలల వ్యవధిలో నలుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం కలకలం రేపింది. జనార్దన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కరోనాపై సమీక్ష: వలంటీర్ల వ్యవస్థ కీలకం
సాక్షి, ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల్లో కోవిడ్-19 (కరోనా వైరస్) గురించి పూర్తి అవగాహన కల్పిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ఒంగోలులో శనివారం నిర్వహించిన కరోనా నివారణ సమీక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. జిల్లాలో కరోనాపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. అధికార యంత్రాంగం చాలా కష్టపడుతోందన్నారు. (కరోనా వైరస్: ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం) ఒకప్పుడు గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. ఇప్పడు అదే వ్యవస్థ కీలకంగా మారిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతోనే వాలంటీర్లు వ్యవస్థ ఏర్పాటైందన్నారు. ఇలాంటి సమయంలో మీడియా బాధ్యతగా మెలగాలని మంత్రి సూచించారు. వైరస్‌పై తప్పుడు, అసత్య ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బాలినేని పేర్కొన్నారు. (‘వారి నమూనాలను ల్యాబ్‌కు పంపించాం’) అదేవిధంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీలపై పూర్తి నిఘా పెట్టామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాసంస్థలపై తనిఖీలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఆపదకాలంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఉపయోగిస్తున్నామని సురేష్ చెప్పారు. (కరోనా: జనతా కర్ఫ్యూ.. ఏపీలో బస్సులు బంద్!) -
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో బీచ్ ఫెస్టివల్
-
పీసీసీ ఉపాధ్యక్షుడిగా శ్రీపతి ప్రకాశం
సాక్షి, ఒంగోలు: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ )ఉపాధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది శ్రీపతి ప్రకాశంను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అందులో భాగంగా పీసీసీ కార్యాలయం నుంచి నియామక పత్రాన్ని శ్రీపతి ప్రకాశంకు పంపించారు. శ్రీపతి ప్రకాశం టంగుటూరు మండలం కాకుటూరువారి పాలెం ఆయన జన్మస్థలం. విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా కావలిలోని జవహర్ భారతి కాలేజీ, ఒంగోలులో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఒంగోలులోని ఇందిరా ప్రయదర్శిని లా కాలేజీలో న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. అనంతరం న్యాయవాద వృత్తి కొనసాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోనై 1978లో యూత్ కాంగ్రెస్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పారీ్టలో పలు పదవులు అలంకరించారు. స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్‌గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఆలిండియా టెలియం అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా, ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా, ఆలిండియా కోర్ బోర్డు మెంబర్‌గా, ఆలిండియా సోలార్ బోర్డు మెంబర్‌గా, ఆలిండియా టెక్స్టైల్స్ బోర్డు మెంబర్‌గా వివిధ పదవులు అలంకరించారు. 2015లో కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడిగా పదవిని చేపట్టి నేటికీ కొనసాగుతున్నారు. 2019లో కొండపి అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. శ్రీపతి ప్రకాశంకు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఈ సందర్భంగా శ్రీపతి మాట్లాడుతూ 42ఏళ్లుగా పారీ్టకి సేవ చేసినందుకు గుర్తుగా తనకు ఈ అవకాశాన్ని అందించారని శ్రీపతి ప్రకాశం ఉధ్ఘాటించారు. పారీ్టనే నమ్ముకుని నాలుగు దశాబ్దాలుగా సేవలు చేశానని ఆయన పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి పారీ్టకి చేసిన సేవలకు గుర్తుగా పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, తమ నేత రాహుల్ గాందీకి, పీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానా«థ్‌కు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఈదా కొనసాగింపు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు(పీసీసీ) రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈదా సుధాకరరెడ్డిని తిరిగి రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఆవకాశం కలి్పస్తూ నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా 2017 ఫిబ్రవరి 20వ తేదీన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈదా మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (పీసీసీ) సాకె శైలజనాథ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. -
‘వెలిగొండ’ పనులపై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్ష
-
వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం జగన్
-
వరాల వెలిగొండ..!
సాక్షి, ఒంగోలు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా వరప్రదాయని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అత్యధికంగా నిధులు కేటాయించి పనులు వేగంగా చేయించగలిగారు. 2005 నుంచి 2009 వరకు రిజర్వాయర్, కాలువలు, పైపులైన్ల నిర్మాణ పనులు చేసుకుంటూ వచ్చారు. అయితే 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో వెలిగొండ పనులకు గ్రణం పట్టినట్లైంది. టీడీపీ పాలనలో నత్తనడకన.. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు వెలిగొండ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ధనార్జనే ధ్యేయంగా వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వాడుకున్నారు. గతంలో రెండో టన్నెల్ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి అంచనాలు విపరీతంగా పెంచి తన బినామీ, అప్పటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ«కు అప్పగించారు. అయినా ఆ సంస్థ పనులను సక్రమంగా చేయలేదు. అంచనాలు పెంచి ప్రజాధానాన్ని లూటీ చేయాలని వేసిన పన్నాగం తర్వాత అధికారం కోల్పోవడంతో బెడిసి కొట్టింది. కాలువల వివరాలు ఇవే.. తీగలేరు ప్రధాన కాలువ బి. చెర్లోపల్లి వద్ద నల్లమల సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రారంభమై ప్రకాశం జిల్లాలోని 5 మండలాల్లో 62వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించడానికి రూపొందించారు. ఈ కాలువ 12.80 మీటర్ల వెడల్పుతో 48.3 కిలో మీటర్ల పొడవుతో త్రిపురాంతకం వద్ద ముగుస్తుంది. గొట్టిపడియ ప్రధాన కాలువ జమ్మనపాలెం వద్ద గొట్టిపడియ కట్టడం నుంచి జిల్లాలోని రెండు మండలాల్లో 9500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించనుంది. ఈ కాలువ 6.9 మీటర్ల వెడల్పుతో 11.435 కిలోమీటర్ల పొడవుతో గుండ్లకమ్మ వాగు వద్ద ముగుస్తుంది. తూర్పు ప్రధాన కాలువ కాకర్ల వద్ద నల్లమల సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రారంభమై జిల్లాలోని 15 మండలాలు, నెల్లూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో కలిపి 2,45,500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించనుంది. అదే విధంగా కంభం చెరువు కింద 6,500 ఎకరాల ఆయకట్టు భూమి స్థిరీకరించడానికి కూడా రూపొందించారు. కాలువ 15.50 మీటర్ల వెడల్పుతో 130.66 కిలోమీటర్ల పొడవుతో నెల్లూరు జిల్లా పెద్దిరెడ్డిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ముగుస్తుంది. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్, ఉదయగిరి ఉపకాలువ రిజర్వాయర్ నిర్మించనున్న పెద్దిరెడ్డిపల్లి గ్రామం వద్ద తూర్పు ప్రధాన కాలువ చివరి భాగాన 2.02 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి 39.966 కిలోమీటర్ల మేర ఉదయగిరి ఉప కాలువ తవ్వడం ద్వారా నెల్లూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో 52వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, గండిపాలెం రిజర్వాయర్ కింద సాగు చేస్తున్న 6500 ఎకరాలు స్థిరీకరించడానికి ఉద్దేశించారు. పశ్చిమ ఉప కాలువ, తూర్పు ప్రధాన కాలువ నుంచి 25.45 కిలోమీటర్ వద్ద ప్రారంభమై 5 ఎత్తిపోతల ద్వారా 23.68 కిలోమీటర్ల పొడవుతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 60,300 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు రూపొందించారు. తురిమెళ్ల రిజర్వాయర్‌లో 2.453 టీఎంసీల సామర్థ్యంతో తురిమెళ్ల గ్రామం వద్ద నిర్మిస్తారు. 3.1 కిలోమీటర్ల దూరం నుంచి పడమర ఉప కాలువ ప్రారంభమై 6.7 కిలోమీటర్ల దూరం వరకు ప్రవహించిన తర్వాత దీని నుంచి రెండో ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వరుసగా 3,4,5 ఎత్తిపోతల పథకాల నిర్మాణం కూడా కొంతమేర జరిగాయి. నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం గ్రామం వద్ద నిర్మించతలపెట్టిన సీతారామసాగర్ జలాశయం 1.0 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నారు. దాని ద్వారా మండలంలోని 7500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించారు. రాళ్ళవాగు జలాశయం, గుండ్లబ్రహ్మేశ్వరం జలాశయాలు కూడా ఈ ప్రాజెక్టు పరిధిలోనే ఉన్నాయి. రాళ్లవాగు జలాశయం 0.138 టీఎంసీల సామర్థ్యంతో రాళ్లపాడు గ్రామం వద్ద నిర్మించనున్నారు. దీని ద్వారా ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు గ్రామంలో 1500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ప్రతిపాదించారు. గుండ్లబ్రహ్మేశ్వరం జలాశయం 0.415 టీఎంసీల సామర్థ్యం కలిగి గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద గుండ్లకమ్మ వాగుమీద నిర్మించి ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో 3,500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ప్రతిపాదించారు. పూర్తయితే 4,47,300 ఎకరాలకు సాగునీరు ప్రకాశం జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా వెలిగొండ ప్రాజెక్టుకు రూప కల్పన చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణమ్మ వరద నీటిని మళ్లించి సాగు, తాగునీరు అందించే విధంగా రూపొందించారు. ప్రకాశం జిల్లాలో 23 మండలాల పరిధిలో 3,36,100 ఎకరాలకు సాగునీరు, కడప జిల్లాలోని రెండు మండలాల పరిధిలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో 84వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మూడు జిల్లాలకు కలిపి 15.25 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు డిజైన్ తయారు చేశారు. కొల్లంవాగు నుంచి హెడ్‌రెగ్యులేటర్ శ్రీశైలం జలాశయం నీటి మట్టం 256.032 మీటర్లు ఉన్నప్పుడు జలాశయం అంతర్భాగంలో కలుస్తున్న కొల్లంవాగులోకి నీరు వచ్చి చేరుతుంది. కొల్లంవాగు జన్మస్థలం నుంచి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్, సొరంగాలు, వరద కాలువ ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్‌ను నింపాల్సి ఉంది. నల్లమలసాగర్ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 43.58 టీఎంసీలు. కొల్లంవాగు జన్మస్థలం వద్ద 328 క్యూసెక్కుల సామర్థ్యంతో హెడ్ రెగ్యులేటర్‌ను నిర్మించ తలపెట్టారు. ఈ నిర్మాణం రాజీవ్ పులుల అటవీ సంరక్షణ కేంద్రం పరిధిలో ఉంది. హెడ్‌రెగ్యులేటర్ నుంచి రెండు సొరంగాల ద్వారా నీటిని నల్లమల కొండల్లోని నల్లమలసాగర్ రిజర్వాయర్‌కు చేరడానికి సుమారు 19 కిలోమీటర్ల మేర నీరు ప్రయాణించాల్సి ఉంది. ఈ రెండు సొరంగాలు ఒక్కొక్కటి 19 కిలో మీటర్ల మేర కొండలను తొలిచి నిర్మిస్తున్నారు. నల్లమల సాగర్ జలాశయం నల్లమల అటవీ ప్రాంతంలోని కొండల మధ్య సహజ సిద్ధంగా నల్లమలసాగర్ ఏర్పడింది. అయితే కొండల మధ్య సహజ సిద్ధంగానే ఏర్పడిన సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్రామాల వద్ద ఉన్న గ్యాప్‌లను కాంక్రీటు ద్వారా కొండలను కలిపారు. నేడు సీఎం ప్రాజెక్టు సందర్శన పెద్దదోర్నాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, కలెక్టర్ పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బుధవారం మండల పరిధిలోని కొత్తూరు వద్దకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొదటి టన్నెల్, రెండో టన్నెల్ ప్రాంగణాలతో పాటు, ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించే ప్రాంగణం, రాజకీయ నాయకులు వేచి ఉండే ప్రాంతాలను పరిశీలించారు. హెలీపాడ్ వద్దకు చేరుకుని సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్‌ను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పర్యవేక్షించారు. భారీ బందోబస్తు సీఎం పర్యటన దృష్ట్యా బందోబస్తు పర్యవేక్షణ బాధ్యతలను అడిషనల్ ఎస్పీలకు అప్పగించారు. ఏడుగురు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, 1000 మంది కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ పోలీసులు 100 మంది, ఏరియా డామినేషన్ 40 మందిని నియమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 60 మంది కూంబింగ్ పార్టీ సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించామని ఎస్పీ తెలిపారు. హెలీపాడ్ వద్ద బారికేడ్లు, సమీక్ష ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను మంత్రి సురేష్‌తో కలిసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం అక్కడ విధులు నిర్వహించే అ«ధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాజెక్టు సవరించిన అంచనాలు విలువ రూ. 8,440 కోట్లు ఈ సంవత్సరం జనవరి 31 వరకు ఖర్చు చేసింది. రూ. 5237.30 కోట్లు నిర్మాణ పనుల కోసం రూ. 3661.46 కోట్లు భూముల కొనుగోలు ద్వారా ఖర్చు చేసింది రూ. 384.21 కోట్లు పునరావాసం కోసం రూ. 97.27 కోట్లు అటవీ శాఖకు చెల్లించింది రూ. 437.04 కోట్లు ఇతర ఖర్చులకు చెల్లించింది రూ. 657.32 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం కావాల్సిన మొత్తం భూమి 42,684 ఎకరాలు కొనుగోలు చేసింది 30,391 ఎకరాలు ఇంకా తీసుకోవాల్సిన భూములు 2,442 ఎకరాలు -
కనీస మానవత్వం చూపని చంద్రబాబు అండ్ బ్యాచ్
-
సంపూర్ణేష్ బాబు సందడి
సాక్షి, చీమకుర్తి: సీనీ నటుడు సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న ప్రొడక్షన్ నంబర్–1 సినిమా షూటింగ్ శనివారం సంతనూతలపాడులోని కృష్ణసాయి గ్రానైట్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరిగింది. గ్రానైట్ యజమాని శిద్దా వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి సంపూర్ణేష్ బాబుపై క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. కేఎస్ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా నూతన తార నటించనున్నట్లు యూనిట్ నిర్వాహకులు తెలిపారు. పృథీ్వ, షియాజీ షిండే, కత్తి మహేష్, తనికెళ్ల భరణి, సుధాతో పాటు పలువురు తారాగణం ఈ సినిమాలో నటించనున్నారని తెలిపారు. సినిమాకి మాటలు మరుదూరి రాజా రచిస్తుండగా కెమెరామెన్‌గా అడుసుమల్లి విజయ్‌కుమార్, ఎడిటింగ్ గౌతమ్‌రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అలవలపాటి శేఖర్, నిర్మాతలుగా ఎస్ శ్రీనివాసరావు, నారాయణ, చిరంజీవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎన్.హరిబాబు చేస్తున్నట్లు తెలిపారు. సినిమా షూటింగ్ చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు. -
బియాండ్ ది బోర్డర్ బాగుంది: సినీ నటుడు రఘుబాబు
సాక్షి, ఒంగోలు: ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరం నుంచి నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా బియాండ్ ది బోర్డర్‌కు ఆరు ఫిర్యాదులు వచ్చాయి. అమెరికా నుంచి 2, బెంగళూరు నుంచి 3, హైదరాబాద్ నుంచి ఒకటి చొప్పున వచ్చాయి. మొత్తంగా 153 ఫిర్యాదులు రాగా వాటిలో నేరుగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వారు 125, ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసిన వారు 22, బియాండ్ది బోర్డర్ ఆరు ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిశీలించి చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు, ఎస్బీ–2 సీఐ ఎన్.శ్రీకాంత్‌బాబు, ఐటీ కోర్ ఎస్ఐ, కోఆర్డినేషన్ ఎస్ఐలు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి సినీ నటుడు రఘుబాబు ఎస్పీతో మాట్లాడుతూ స్కాచ్ అవార్డు, జిఫైల్స్ అవార్డులు అందుకున్నందుకు ముందుగా జిల్లా ఎస్పీకి కృతతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం పోలీసు శాఖ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం బాగుందని, ప్రజలు కూడా సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారన్నారు. బియాండ్ది బోర్డర్ కార్యక్రమం ఎంతోమందికి ఉపయోగపడుతుందని రఘుబాబు పేర్కొన్నారు. బెంగళూరు నుంచి చంద్రబాబు అనే ఫిర్యాది మాట్లాడుతూ తన సొంత ఊరు కొత్తపట్నం అని, తను 2019 నవంబరు 20న కొత్తపట్నం నుంచి ఒంగోలులోని గోరంట్ల సినిమాహాల్కు వచ్చానన్నారు. అయితే మార్గంమధ్యలో రూ.80 వేల విలువైన తన బ్రేస్లెట్ కనిపించలేదని, సీసీ పుటేజి చూడగా ఒక వ్యక్తి ఆ బ్రేస్లెట్ తీసుకున్నట్లు కనిపిస్తుందని తెలిపారు. దయచేసి రికవరీ చేయించాలని కోరగా టూటౌన్ సీఐ రాజేష్‌కు దర్యాప్తు బాధ్యతలను ఎస్పీ అప్పగించారు. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ నుంచి షేక్ షర్విజ్ మాట్లాడుతూ తన సొంత ఊరు చీరాల అని, చీరాలకు చెందిన గోలి గంగాధరరావు, అతని కుటుంబ సభ్యులు తమకు చెందిన రూ.10 కోట్ల విలువైన ఆస్తులను ఆక్రమించుకున్నారని, తన తల్లి మరణానికి కూడా కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా చీరాల ఒన్‌టౌన్ సీఐని సత్వరమే విచారించి సత్వర న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు. బెంగళూరు నుంచి వంశీకృష్ణ మాట్లాడుతూ తన సొంత ఊరు రాచర్ల అని, అక్కడ తన పూర్వీకుల ఆస్తి ఉందన్నారు. అందులో తాను ఇల్లు కట్టుకోగా తన ఇంటి పక్కన ఉండే దూదేకుల ఖాశిం అనే అతను, అతని కుటుంబ సభ్యులు తమ ఇంటి కాంపౌండ్ ముందు గేదెలు, ట్రాక్టర్లు ఉంచి తమను ఇబ్బంది పెడుతున్నారన్నారు. తక్షణమే విచారించి తగు చర్యలు చేపట్టాలని రాచర్ల ఎస్ఐని ఎస్పీ ఆదేశించారు. -
ఎమ్మెల్యే అనుచరుల క్వారీలపై విజిలెన్స్ దాడులు
సాక్షి, ప్రకాశం : అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అనుచరులకు చెందిన బల్లికురవ మండలంలోని క్వారీలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు జరిపారు. శనివారం ఉదయం కొనిదెన రెవెన్యూ పరిధిలోని ఈర్లకొండ వద్ద ఉన్న మూడు క్వారీలలో తనిఖీలు నిర్వహించారు. కిషోర్, గంగాభవాని, అంకమ్మ చౌదరిలకు చెందిన క్వారీలలో రికార్డులు, పద్దులను అధికారులు పరిశీలించారు. ఈ దాడుల్లో ఆ శాఖ డీఐజీ వెంకటరెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. -
నిద్రమత్తులో డ్రైవర్.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు!
సాక్షి, కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లి స్టేజి సమీపంలో జాతీయ రహదారి 565పై రోడ్డుప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో జోగుతూ కారును నడిపించడంతో.. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న రైలింగ్‌ను దాటి.. పల్టీలు కొడుతూ.. పంటపొల్లాలోకి దూసుకెళ్లింది. అయితే, ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారు పూణే నుంచి కనిగిరి మండలం మాచవరంలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. -
ఒంగొలు: మగ గొంతుతొ యువతులకు వల
-
ప్రకాశం జిల్లా టీడీపీ పై బీజేపీ కన్ను!
-
7వ ఆర్థిక గణన సర్వే ఆరంభం
సాక్షి, ఒంగోలు:కుటుంబ ఆర్థిక స్థితిగతులపై వివరాల సేకరణకు కసరత్తు మొదలైంది. 7వ ఆర్థిక గణన సర్వేను జిల్లాలో మంగళవారం కలెక్టర్ పోల భాస్కర్ లాంఛనంగా ప్రారంభించారు. సరిగ్గా వంద రోజుల్లో సర్వే పూర్తి చేసి వివరాలను అప్లోడ్ చేయాలి. ఈ సర్వే ద్వారా దారిద్యరేఖకు దిగువ, ఎగువ ఎందరు ఉన్నారో లెక్క తేల్చనున్నారు. ఈ తరహా సర్వేలు ఇప్పటికి ఆరు పూర్తయ్యాయి. ఈ నివేదికల ఆధారంగానే తలసరి గ్రాంటులు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన సర్వేలన్నీ మాన్యువల్‌గా జరగగా ఈ ఏడాది సర్వే డిజిటల్ ఇండియాను దృష్టిలో ఉంచుకొని కాగిత రహితంగా చేయనున్నారు. మొట్టమొదటి సారిగా ఆర్థిక గణన సర్వేకి మొబైల్ యాప్‌ను వినియోగిస్తున్నారు. కుటుంబాల ఆర్థిక స్థితి గతులను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వాల నుంచి సహాయం, వివిధ రకాల సహాకారం అందనుంది. ఎంతో కీలకమైన ఆర్థిక గణన కుటుంబాల్లో తలసరి ఆదాయాల లెక్క తేల్చనుంది. పట్టణాలు, పల్లెల్లో వేర్వేరుగా.. జిల్లాలో 1028 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవి కాకుండా 35 అటవీ గ్రామాలు ఉన్నాయి. ఒంగోలు నగర పాలక సంస్థతో పాటు కందుకూరు, చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 12.5 లక్షల కుటుంబాలు ఉన్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో విడివిడిగా 7వ ఆర్థిక గణన సర్వే జరగనుంది. వీరిలో భూమి కలిగిన వారు 7.22 లక్షలు, మధ్య తరహా రైతులు 4.32 లక్షలు, చిన్నతరహా రైతులు 1.78 లక్షల మంది ఉన్నారు. వీరి వివరాలను సర్వే ద్వారా సేకరిస్తారు. ఎన్యూమరేటర్ల ఎంపిక ఆర్థిక గణన సర్వే కోసం ఎన్యూమరేటర్ల ఎంపిక కార్యక్రమం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. నగరంతో పాటు మున్సిపాలిటీలు, పట్టణ పాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో సర్వే విడివిడిగా జరగనుంది. ఏడవ ఆర్థిక గణన సర్వేను గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ, రాష్ట్ర ప్రభుత్వంలోని ఆర్ధిక గణాంక శాఖ, జాతీయ శాంపుల్ సర్వే, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చేపట్టింది. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫ్ర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారితో నియమించిన కామన్ సర్వీసెస్ సెంటర్స్.. ఈ గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ ఈ సర్వేను సంయుక్తంగా అమలు చేస్తోంది. ఆర్థిక లెక్క తేలుతుంది.. సర్వే ద్వారా కుటుంబాల ఆర్థిక లెక్క తేలనుంది. కార్యక్రమం దేశం భౌగోళిక సరిహద్దుల్లోని అన్ని సంస్థల పూర్తి లెక్కలను, అసంఘటిత రంగంలోని కుటుంబాల వారి వివరాలను సర్వేద్వారా అందిస్తోంది. అన్ని సంస్థల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది. సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రణాళికల కోసం ఆర్ధిక కార్యకలాపాల భౌగోళిక వ్యాప్తి జిల్లాలోని రకరకాల యాజమాన్యాల నమూనాలు, ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తుల ఉద్యోగులు ఇతర విలువైన సమాచారాన్ని సేకరించనున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే.. సర్వే కచ్చితత్వం కోసం మొబైల్ యాప్ ద్వారా చేపట్టారు. ఇందు కోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేశారు. గతంలో నిర్వహించిన 6వ గణన కార్యక్రమం మాన్యువల్‌గా చేసినందున సమగ్ర నివేదిక రావడానికి నెలల పాటు కాలహరణం జరిగింది. 2013లో ఈ గణన సర్వే వివరాలు 2016లో గానీ అవుట్‌పుట్ విడుదల కాలేదు. ఈ దఫా సర్వేలో ఈ ఇబ్బందులు లేకుండా డిజిటల్ ఇండియా నియమాలను అనుసరించి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేయనున్నారు. ఇందు కోసం ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. జియో ట్యాగింగ్, టైమ్ స్టాంపింగ్, యాప్ లెవల్ డేటా ధ్రువీకరణ, డేటాను సంరక్షించేందుకు సురక్షితం కోసం లాగిన్,వెబ్ అప్లికేషన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని నివేదికలను పై స్థాయి అధికారులకు అప్లోడు చేయడం కోసం సులభతరంగా వీటిని రూపొందించారు. ఎన్యుమరేటర్ల పైన సూపర్వైజర్లు లెవన్–1 , లెవల్–2 అధికారులు ఉన్నారు. ఎన్యుమరేటర్లకు ప్రైవేటు వ్యక్తులను నియమించారు. వీరికి ఎస్ఎస్సి విద్యార్హత ఉంటే సరిపోతుంది. 1028 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. వీరు కాకుండా పట్టణ,నగర పాలక సంస్థ పరిధిలో ఎన్యుమరేటర్లను ప్రత్యేకంగా నియమించారు. ఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని లెవల్–1 అధికారి తనిఖీ చేసి సర్వే సరిగ్గా వచ్చిందని బావిస్తే లెవల్–2 అధికారికి పంపుతారు. అక్కడి నుంచి యాప్ ద్వారా అప్లోడు చేస్తే సర్వే నివేదికకు చేరుతుంది. ఈ పద్దతిలో సర్వే అవుట్‌పుట్ జనవరి ఆఖరుకే ప్రభుత్వానికి ఇవ్వడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. సూపర్వైజర్లకు ఇప్పటికే డీఈఎస్, ఎన్ఎస్వో, సీఎస్ఈ సంస్థలు శిక్షణ ఇచ్చాయి. కలెక్టర్ అధ్యక్షతన కమిటీ.. ఆర్థిక సర్వేకి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ నియమించారు. జిల్లా స్థాయి కమిటీ ఈ సర్వేను పర్యవేక్షిస్తుంది. జిల్లా ఎస్పీ, సీపీవో, ఇతర 14 శాఖల అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పోగ్రాం ఇంప్లిమెంట్ జిల్లా మేనేజర్ ప్రమోద్‌కుమార్ సూపర్వైజర్ల పనితీరు, ఆపై అధికారుల పని తీరును పర్యవేక్షిస్తుంటారు. సర్వేని రెండు రకాలుగా చేస్తారు. ప్రతి కుటుంబాన్ని కలుస్తారు. ఇల్లు తీరును పరిశీలించి వివరాలను సేకరిస్తారు. ఇంటి ముందు దుకాణాలు ఉన్నా, ఇంటి ముందు కమర్షియల్ గదులు ఉన్నా, మొత్తంగా కమర్షియల్ దుకాణాలు ఉన్న వివిధ విభాగాల కింద వివరాలను సేకరించి నమోదు చేస్తారు. నార్మల్ హౌస్‌హోల్డ్, సెమి నార్మల్ హౌస్‌హోల్డ్, కమర్షియల్ విభాగాల కింద సర్వే వివరాలను నమోదు చేస్తారు. ఎంతో కీలకమైన ఈ ఏడవ ఆర్ధిక గణన సర్వేను జిల్లాలో వంద రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. -
మూడేళ్ల బాలుడిపై లైంగిక దాడి
సాక్షి, చీమకుర్తి: కామంతో కళ్లు మూసుకుపోయిన 16 ఏళ్ల మైనర్.. మూడేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన వాంఛ తీర్చుకున్న తర్వాత విషయం బయటకు తెలుస్తుందని భయపడిన కామాంధుడు బాలుడి తలపై అక్కడే ఉన్న బండరాయితో బాదాడు. స్పృహ తప్పిన తర్వాత బాలుడు మృతి చెంది ఉంటాడని భావించి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడేశాడు. ఈ దారుణమైన సంఘటన ఆదివారం మధ్యాహ్నం చీమకుర్తిలోని బైపాస్‌లో జరిగింది. బాలుడి తల్లి, కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. బాలుడి తల్లి తన కుమారుడు కనిపించట లేదని బంధువులతో కలిసి వెతుకుతుంటే లైంగిక దాడికి పాల్పడిన యువకుడు కూడా వారితో కలిసి ఏమీ తెలియనట్లు నటించాడు. బైపాస్‌లోని ముళ్ల పొదల సమీపంలో వెతుకుతున్నట్లు నటించి చివరకు నేరుగా బాలుడు పడి ఉన్న ప్రాంతాన్ని తానే కనుగొన్నట్లు నేరానికి పాల్పడిన మైనర్ యువకుడు బాలుడి తల్లి, బంధువులకు చూపించాడు. అప్పటికే ముళ్ల పొదల్లో తలకు వెనుక వైపు బలమైన గాయాలై ముఖం మీద ఎర్రగా కంది, ధరించిన నిక్కర్ తొలగించిన పరిస్థితిని చూసి తల్లి కలవరపడింది. బాలుడు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి వెంటనే 108లో రిమ్స్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ముళ్ల పొదల్లో బాలుడు ఉన్నాడనే విషయం నీకు ఎలా తెలుసని బంధువులు లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని నిలదీసి అడగటంతో చేసిన నేరాన్ని నిందితుడు అంగీకరించారు. బాధిత బాలుడి తండ్రి దుప్పట్లు, కుర్చీలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. చీమకుర్తిలోని వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సమీపంలో ఉన్న చర్చికి తల్లి తన ముగ్గురు కుమారులను తీసుకొని ప్రార్థనకు వెళ్లింది. భర్త వ్యాపారం కోసం తిరుపతి వెళ్లాడు. చర్చికి వెళ్లిన తల్లి చర్చిలో ప్రార్థన సమయంలో మూడో కుమారుడు చర్చి నుంచి బయటకు వచ్చాడు. ఆడుకుంటుంటాడనుకొని తల్లి చర్చిలో ప్రార్థనలో నిమగ్నమైంది. ఇంతలో ఘోరం జరిగింది. ఇలా ఎందుకు చేశావని ఇతరులు నిందితుడిని అడిగితే పిల్లోడు ముద్దుగా ఉన్నాడని తన పైశాచికత్వాన్ని బయట పెట్టుకున్నాడు. బాలుడి తల్లి నుంచి పోలీసులు ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో కేసు వివరాలు నమోదు చేసుకున్నారు. పోక్సా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.నాగశివారెడ్డి తెలిపారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒంగోలు డీఎస్పీ చీమకుర్తి పోలీసుస్టేషన్‌కు వచ్చి ఎస్ఐ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కందుకూరులో మెగా జాబ్‌మేళా
-
అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి
డల్లాస్ : ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారై నూనె సురేష్ ప్రమాదవశాత్తు దుర్మరణం చెందారు. కుటుంబం సమేతంగా హాలిడే ట్రిప్‌కి వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. డల్లాస్‌లోని సింటెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా సురేష్ పని చేస్తున్నాడు. స్వగ్రామంలో అంత్యక్రియలు తరలించేందుకు కుటుంబసభ్యుల ప్రయత్నం చేస్తున్నారు. అయితే మృతదేహం తరలింపుకు దాదాపుగా 80 వేల డాలర్లు అవసరం కావటంతో కుటుంబసభ్యులు, బంధువులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫండ్ రైజింగ్ వెబ్సైట్లో అమెరికా లో స్థిరపడ్డ తెలుగు వారు, తెలుగు సంఘాలు తమకు తోచిన సహాయం అందజేస్తున్నాయి. వీలైనంత తొందరగా సురేష్ మృతదేహాన్ని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో దారుణం
-
అవమానంతో ఆత్మహత్య
సాక్షి, చినగంజాం(ప్రకాశం) : బంధువులు తనపై దాడి చేశారని మనస్తాపానికి గురైన వివాహిత ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చినగంజాం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు మండలంలోని మోటుపల్లి పంచాయతీ రుద్రమాంబపురం గ్రామానికి చెందిన బసంగారి పద్మ (31) తన ఇంటిలోని ఫ్యానుకు ఉరివేసుకొని మృతి చెందింది. వివరాల్లోకి వెళితే రుద్రమాంబపురం గ్రామంలో బసంగారి కనకయ్య, శ్రీను, భద్రయ్య, ఆంజనేయులు, నాగేశ్వరరావు, బ్రహ్మయ్యలు మొత్తం ఆరుగురు అన్నదమ్ములు కాగా వీరిలో పెద్దవాడు కనకయ్య వేరే గ్రామంలో ఉంటున్నాడు. అయితే శ్రీను, భద్రయ్య, నాగేశ్వరరావు కుటుంబాలకు మిగిలిన ఇరువురు కుటుంబాలకు గత ఐదేళ్లుగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంధువుల మధ్య తలెత్తిన చిన్నపాటి మనస్పర్థలు తోడి కోడళ్ల మధ్య గొడవకు కారణమయ్యాయి. గతంలో మృతురాలి భార్యభర్తలు ద్విచక్రవాహనం మీద వెళుతున్నప్పుడు తమకు తగిలిందని వారిలో ఒక తోడి కోడలు మంగళవారం ఉదయం గొడవ పెట్టుకొని, ఆమెతో పాటు బావలు, మరుదులు, వీరి మద్దతుదారులు మృతురాలు పద్మపై చేతులతో, కాళ్లతో దాడి చేశారు. శరీరంపై దుస్తులు చెదిరిపోయేలా దాడి చేయడంతో ఆమె అవమానానికి గురైంది. ఆ సమయంలో ఆమె భర్త బ్రహ్మయ్య అడ్డుపడి వారిని వారించి పద్మను ఇంటిలోకి పంపి బయట తలుపు వేశాడు. దాంతో వారు బ్రహ్మయ్యపై కూడా చేయి చేసుకున్నారు. అరగంట అనంతరం తోడికోడళ్లు దాడి చేశారని అవమానభారంతో ఇంటిలోకి వెళ్లిన పద్మ లోపల గడియ వేసుకోవడంతో పాటు కిటికీలను సైతం మూసి వేసి ఫ్యానుకు చీర తగిలించి ఉరి వేసుకుంది. భర్త అనుమానంతో తలుపు తీసేందుకు ప్రయత్నించి రాక పోవడంతో వాటిని పగలగొట్టి లోపలికి వెళ్లి చూడటంతో ఆమె ఫ్యానుకు వేలాడుతూ కన్పించింది. వెంటనే ఆమె వదిన, బావలు ఉరి వేసుకున్న చీరను కూరగాయల కత్తితో కోసి ప్రాణాలతో ఉన్న ఆమెను కిందకు దించారు. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు రాజారావును పిలిచి చూపించగా అతను మెరుగైన వైద్యశాలకు తీసుకెళ్లాల్సిందిగా సూచించాడు. ఈ లోగా సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు. గ్రామంలో ఘర్షణ జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆమె మృతి చెందడంతో సమాచారాన్ని తమ ఉన్నతాధికారులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇన్చార్జ్ ఎస్ఐ కే అజయ్ బాబు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ సంఘటనా స్థలాన్ని చీరాల డీఎస్పీ నాగరాజు, ఇంకొల్లు సీఐ రాంబాబులు సందర్శించి పరిశీలించారు. బాధితుడు బ్రహ్మయ్యను జరిగిన సంఘటనపై విచారించారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా స్పెషల్ పార్టీ పోలీసు బృందం గ్రామంలోకి తెప్పించారు. జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో గట్టిబందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు, ఒక ఎస్ఐను కూడా గ్రామంలో ఉంచి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో ప్రస్తుతం 10 మంది మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన వారిని కూడా తీసుకొచ్చి విచారణ జరపనున్నట్లు ఆయన తెలిపారు. -
దొంగ దొరికాడు..
సాక్షి, చీరాల (ప్రకాశం): తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి అర్ధరాత్రి సమయంలో చోరీలకు పాల్పడిన కేసుల్లో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను చీరాల పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మంగళవారం ఇక్కడి టూటౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు నిందితుల వివరాలు వెల్లడించారు. ‘చీరాల ఐఎల్టీడీ కంపెనీ సమీపంలోని శాంతినగర్‌కు చెందిన అల్లు సంజయ్ కుమార్, అతని తల్లి సలోమి, ఆమె అల్లుడు గుంటూరు జిల్లా బాపట్ల దగ్గుమల్లివారిపాలేనికి చెందిన గుర్రాల దయారాజు ఒక జట్టుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతుంటారు.అల్లు సంజయ్‌ది దొంగతనాల్లో అందెవేసిన చేయి. ఇతనిపై తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ, తెనాలి, బాపట్ల, చీరాల ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 32 దొంగతనాలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సంజయ్ అన్న సన్నీ కూడా హైదరాబాద్‌లో పలు చోరీలు చేసి పట్టుబడి చెర్లపల్లి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. ప్రస్తుతం పట్టుబడిన నిందితులు చీరాల ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు, టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు చోరీలకు పాల్ప డ్డారు. అల్లు సంజయ్ చోరీ చేసిన బంగారం, ఇతర వస్తువులను అతని తల్లి సలోమికి, ఆమె అల్లుడు బాపట్లకు చెందిన గుర్రాల దయారాజుకు ఇస్తుంటాడు. ఆ వస్తువులను వీరిరువురూ వివిధ దుకాణాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. అతనంతరం అందరూ కలిసి వాటాలు పంచుకుని జల్సాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చీరాల టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తపేట పంచాయతీ గోపాలపురానికి చెందిన రాపూడి రజని ఇంట్లో అర్ధరాత్రి సమయంలో టీవీ, హోమ్ థియేటర్, మరికొన్ని వస్తువులు అపహరించారు. అలాగే ఈ నెల 10వ తేదీన చీరాల పెద్దరథం సెంటర్ సమీపంలోని డక్కుమళ్ల అనిత అనే మహిళ ఇంట్లో చొరబడి వెండి వస్తువులతో పాటు కొంత నగదు, సెల్ఫోన్లు, రిస్ట్‌వాచీలు అపహరించారు. ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని హరిప్రసాద్ నగర్‌కు చెందిన మచ్చా అంకయ్య ఇంట్లో రూ.2 లక్షల నగదు, బంగారం, వెండి వస్తువులు చోరీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెస్తపాలేనికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ తుపాకుల రఘనాథబాబు ఇంట్లో 49 ఇంచెస్ ఎల్జీ ప్లాస్మా టీవీని కొట్టేశారు. ఈ చోరీలపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన ఒన్‌టౌన్, టూటౌన్ పోలీసులు డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2.75 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, టీవీలు, సెల్ఫోన్లు, రిస్ట్‌వాచీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడుతున్న సెల్ఫోన్ల ఆధారంగా కేసులను ఛేదించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన టూటౌన్ ఎస్సై నాగేశ్వరరావును డీఎస్పీ అభినందించారు. -
బాలికపై ఆరుగురు యువకుల గ్యాంగ్ రేప్
-
అవినాష్‌రెడ్డిది హత్యే
ఒంగోలు: తిరుపతికి చెందిన పురిణి అవినాష్‌రెడ్డి (23)ది ముమ్మాటికీ హత్యేనంటూ మృతుడి తండ్రి శ్రీనివాసరెడ్డి, బంధువులు ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం అవినాష్‌రెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకొని స్థానిక గోపాల్నగరంలోని ఒకటో లైను ఎక్స్‌టెన్షన్‌లోని యువతి ఇంటి ముందు ఉంచి ధర్నా చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని చివరకు వారి డిమాండ్ మేరకు యువతితో పాటు కుటుంబ సభ్యులు ఆరుగురిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇదీ..జరిగింది అవినాష్‌రెడ్డి విషం లాంటి మందు తాగాడంటూ ఓ వ్యక్తి ఆటోలో రిమ్స్‌కు తీసుకొచ్చాడు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. వైద్యులు సంబంధిత సమాచారాన్ని రిమ్స్‌లోని ఔట్‌పోస్టు పోలీసులకు పంపారు. ఔట్‌పోస్టులోని సిబ్బంది సుధాకర్ అనే వ్యక్తి నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవాలగదిలో భద్రపరిచారు. ఈ సమాచారాన్ని ఔట్‌పోస్టు పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత తాలూకా పోలీసులకు తెలియజేశారు. మృతి చెందాడన్న సమాచారం అవినాష్‌రెడ్డి తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆదివారం తెల్లవారు జామున మూడుగంటల సమయంలో రిమ్స్‌కు చేరుకున్నారు. ఆస్పత్రిలో ఎవరు చేర్పించారంటూ ఆరా తీసేందుకు యత్నించారు. అతను ఎవరైంది సమాచారం రాకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమైంది. వారు నేరుగా 3.30 గంటల సమయంలో తాలూకా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తమకు అనుమానం ఉందంటూ చెప్పగా స్టేషన్లో అధికారులు అందుబాటులో లేకపోవడంతో వారు తిరిగి రిమ్స్‌కు చేరుకున్నారు. ఫిర్యాదు స్వీకరించక పోవడంపై ఆగ్రహం ఈ నేపథ్యంలో మృతుని బంధువులు తాము ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. రాత్రి ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేస్తామని, పోస్టుమార్టంలో వచ్చే అంశాల ఆధారంగా తదుపరి దర్యాప్తు చేస్తామంటూ అధికారులు చెప్పుకొచ్చారు. శనివారం రాత్రి 7.30 గంటలకు ఘటన జరిగితే కనీసం సంఘటన స్థలానికి ఎవరు వెళ్లారంటూ ప్రశ్నించగా సమాధానం రాలేదు. దీంతో అప్పటికప్పుడు ఎస్ఐ హరిబాబు మృతుని బంధువులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ లభించిన సమాచారం ఆధారంగా యువతి ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్‌పై లభించిన ఓ క్రిమిసంహారక మందు డబ్బాను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం పోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేశారు. అన్యాయం జరుగుతోందంటూ ఆగ్రహం తాము ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడం, మృతదేహాన్ని సైతం తమను సరిగా చూడనివ్వలేదంటూ మృతుడి బంధువులు మండిపడ్డారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు దాదాపు 14 గంటల పాటు సందర్శించకపోవడం, చివరకు తమ ఒత్తిడితో దర్యాప్తునకు ముందుకు వచ్చారని, క్రిమిసంహారక మందు తాగాడనేది అబద్ధమని, సూసైడ్‌నోట్ అంటూ పోలీసులు పేర్కొంటున్నది తమ వాడి చేతిరాత కాదని మృతుని తండ్రి, బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన వ్యక్తిని కనీసం తమకు చూపకుండా ఎందుకు దాచారు, ఎవరు దాచారో చెప్పాలంటూ నిలదీశారు. అయినా స్పందించకపోవడంతో ఆగ్రహం చెంది పోస్టుమార్టం గది నుంచి అంబులెన్స్‌లో యువతి ఇంటికి చేరుకొని మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. తరలి వచ్చిన పోలీసులు విషయం రచ్చగా మారడంతో నగరంలోని పోలీసు అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పోస్టుమార్టం నివేదికలో మీ అనుమానాలన్నీ నివృతమవుతాయంటూ సర్థి చెప్పేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో మృతుడి బంధువులు పోలీసులపై మండిపడ్డారు. తమ బిడ్డ తప్పు చేస్తే తమకు అప్పగించాలని, అంతేగాని చంపేస్తారా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే కట్టేసి పోలీసులకు అప్పగించినా సరిపోతుందని అంతే తప్ప చంపుతారా అంటూ నిలదీశారు. రాత్రి అనగా సంఘటన జరిగితే మీరు పొద్దున వరకు ఎందుకు ఈ ఇంటికి రాలేదో చెప్పాలంటూ ప్రశ్నల పరంపర కొనసాగించారు. అవినాష్‌రెడ్డి స్నేహితులు రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని తమకు చెప్పాడని, అంతే తప్ప ఆత్మహత్య చేసుకునేంత సున్నితమైన మనస్తత్వం కాదని పేర్కొన్నారు. చివరకు ఇంట్లో తలుపులు వేసుకొని దాక్కున్నవారందరినీ అరెస్టుచేస్తేగానీ తాము కదలం అంటూ మొండిపట్టు పట్టడంతో పోలీసులు తొలుత యువతి తండ్రితో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కొంతమందినే తరలించారని, ఇంకా కొంతమంది ఇంట్లోనే ఉన్నారంటూ ఆగ్రహించడంతో చివరకు వారి సాయంతో పోలీసులు ఇంట్లో వెతికి యువతితో పాటు మరో ఇద్దరిని స్టేషన్‌కు తరలించారు. అవినాష్‌రెడ్డి బంధువులు శాంతించి మృతదేహాన్ని తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. సీఐ ఏమంటారంటే.. దీనిపై తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు స్పందిస్తూ తమ ప్రాథ«మిక దర్యాప్తులో పురిణి అవినాష్‌రెడ్డి(23)ది నెల్లూరు జిల్లా కావలి మండలం సర్వేపాలెం అని, అతని కుటుంబం మొత్తం తిరుపతిలో నివాసం ఉంటోందన్నారు. అవినాష్ అమ్మమ్మ ఊరు కొత్తపట్నం మండలం మోటుమాల అని, ఈ నేపథ్యంలో వీరికి బంధువైన యుగంధర్‌రెడ్డితో ఒంగోలులో నివాసి వెంకటేశ్వరరెడ్డి పెద్ద కుమార్తె వివాహం జరిగిందన్నారు. ఈ వేడుకలో ఆయన చిన్న కుమార్తెను చూసిన అవినాష్‌రెడ్డి ప్రేమించడం ప్రారంభించాడని, ఈ క్రమంలోనే అవినాష్‌రెడ్డి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉండటం, వెంకటేశ్వరరెడ్డి చిన్న కుమార్తె బెంగళూరులో అగ్రికల్చర్ బీఎస్పీ చదువుతుందన్నారు. ఫేస్ బుక్ ద్వారా యువతితో చాటింగ్ చేస్తూ చివరకు ప్రేమిస్తున్నానంటూ ప్రపోజల్ చేశాడని, అందుకు యువతి తిరస్కరించడంతో వివాదం ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో బెదిరింపులు కూడా రావడంతో ఆమెను కొన్నాళ్లపాటు బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచారని, చివరకు చదువుకు ఆటంకం ఉండకూడదని తిరిగి పంపారన్నారు. మళ్లీ బెదిరింపులు పెరగడం, పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ నోట్ రాసి చచ్చిపోతానంటూ హెచ్చరించాడని తమ దృష్టికి యువతి తీసుకొచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆమెకు ఈ నెల 26న వివాహం నిశ్చయించారని, ఇది తెలుసుకొని శనివారం రాత్రి యువతి ఇంటి వద్దకు వచ్చి పెళ్లి చేసుకోకపోతే మందుతాగి చచ్చిపోతానని బెదిరించాడని, బెదిరించినట్లుగానే అతను మందుతాగుతుండగా పరిసర ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు ఆ మందుడబ్బాను తీసుకొని విసిరేశారన్నారు. ఇది గమనించిన యువతి బావ అవినాష్‌రెడ్డిని తీసుకొని రిమ్స్‌కు చేరుకోవడం, అప్పటికే అతను మృతి చెందినట్లు సీఐ వివరించారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు వ్యక్తం చేసిన అనుమానాలను శవపంచానామాలో పొందుపరిచామని, పోస్టుమార్టం నివేదిక రాగానే తదుపరి చర్యలను వేగవంతం చేస్తామన్నారు. సూసైడ్ నోట్‌ను కూడా సీజ్ చేశామని, యువకుడి ఫోన్‌కాల్స్ డేటాను కూడా సేకరించి అవినాష్‌రెడ్డి తనంతట తానుగా వచ్చాడా లేక అతడిని ఎవరైనా పిలిపించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతామని సీఐ వివరించారు. -
ప్రకాశం జిల్లాలో దారుణం
-
మార్కాపురంలో నాటు బాంబు పేలడం కలకలం
-
చీరాలలో పనిచేయని ఈవీఎంలు
-
పరిశ్రమలు మూతపడితే బాబు ఏం చేస్తున్నారు?
-
వామ్మో నాకొద్దు ఆ టికెట్!
సాక్షి, ప్రకాశం : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రకాశం జిల్లా టీడీపీలో గందరగోళం నెలకొంది. జిల్లాలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేయడంతో అధికార టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో టీడీపీ అధిష్టానం అయోమయంలో పడింది. ఒక వైపు నామినేషన్ల గడువు సమీపిస్తుండం.. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై స్పష్టత లేకపోవడంతో జిల్లా టీడీపీ కార్యకర్తలు కూడా గందరగోళానికి గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు ఒంగోలు అభ్యర్థి కోసం గాలింపు మొదలుపెట్టారు. మంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు బరిలోకి దించేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే శిద్దా మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. దర్శి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని, ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయలేనని చంద్రబాబుకు విన్నవించినట్లు తెలుస్తోంది. మరో వైపు తమ నేతకు దర్శి టికెట్ ఇవ్వాలని శిద్దా రాఘవరావు వర్గం కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో ఎవరిని ఒంగోలు నుంచి బరిలోకి దింపాలో తెలియక చంద్రబాబు అయోమయానికి గురవుతన్నారు. దర్శి, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆ స్థానాల నుంచి ఎవరిని పోటీలో నిలబెడుతున్నారు ఇంకా స్పష్టత రాలేదు. ఎంపీ అభ్యర్థిపై స్పష్టత వచ్చాకే దర్శి, కనిగిరి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. చదవండి : బాబ్బాబు.. పోటీ చేయండి -
ప్రకాశంలో టీడీపీకి బిగ్ షాక్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నేతలంతా వరుస పెట్టి వెళ్లిపోతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. కేడర్ డీలా పడిపోయింది. అరకొరగా ఉన్న నేతలకు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జ్‌లతో పొసగడం లేదు. ఈ పరిస్థితుల్లో గట్టెక్కేదెలా..? అంటూ జిల్లా టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఆ పార్టీ నేతలు వరుస పెట్టి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. మరోవైపు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఉన్న క్యాడర్ కాస్తా డీలా పడిపోయింది. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక టీడీపీ నేతలు మరింత ఆందోళన చెందుతున్నారు. కోట్లు కుమ్మరించి ఓటమి చెందాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. అదే జరిగితే రెండు విధాలుగా నష్టపోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. తూర్పు, పశ్చిమల్లోనూ గడ్డు పరిస్థితే.. ఇప్పటి వరకు తూర్పు ప్రకాశంలో బలంగా ఉన్నామని అధికార టీడీపీ భావిస్తూ వచ్చింది. ప్రధానంగా పర్చూరు, చీరాల, అద్దంకి నియోజకవర్గాలతో పాటు మరి కొన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. పర్చూరు నుంచి దగ్గుబాటి కుటుంబం, చీరాల సిటింగ్ ఎమ్మెల్యే ఆమంచి వైఎస్సార్ సీపీలో చేరడంతో టీడీపీ ఆ సీట్లపైనా ఆశలు వదులుకుంది. అద్దంకి నియోజకవర్గంలో అటు సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం కుటుంబం అధికార పార్టీలోనే ఉన్నా ఇక్కడ వైఎస్సాసీపీ బలంగా తయారవుతోంది. ఒంగోలులో పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. మాజీ మంత్రి, పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తనదైన శైలి వ్యూహాలతో దూసుకువెళ్తుండడంతో టీడీపీ దరిదాపుల్లోకి రాలేకపోతోంది. ఇక్కడ టీడీపీలో అసంతృప్తులు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇక పశ్చిమ ప్రకాశం పరిధిలోని అన్ని సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి తిరుగులేదన్నది పరిశీలకుల అంచనా. మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి చేరికతో కందుకూరులో వైఎస్సార్సీపీ విజయం తథ్యమని టీడీపీలోని ఓ వర్గమే పేర్కొంటుండం గమనార్హం. ప్రస్తుత పరిస్థితిల్లో జిల్లాలోని 12 స్థానాల్లో వైఎస్సాసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. చంద్రబాబు సర్కారుపై ప్రజాగ్రహం.. ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీని కుదిపేస్తోంది. అభివృద్ధి పథకాలు ప్రధానంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా ఆగిపోవడం, సంక్షేమ పథకాలు అర్హులకు కాకుండా అధికార పార్టీ కార్యకర్తలకు కమిషన్లు ఇచ్చే వారికే దక్కుతుండడంతో ప్రజల్లో మరింత వ్యతిరేక వ్యక్త మవుతోంది. రైతు రుణమాఫీ సక్రమంగా అమలు జరగక పోవడం, డ్వాక్రా రుణమాఫీ హామీని చంద్రబాబు పక్కన పెట్టడం, కౌలు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందక పోవడంతో అన్ని వర్గాలు ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని ప్రతికూలాంశాల మధ్య టీడీపీ నుంచి పోటీ చేయడం సాహసంగానే మారిందని కొందరు అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
జిల్లాలో 40 కరువు మండలాలు
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రబీ సీజన్లో కరువు మండలాలను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 228 మండలాలను తీవ్రమైన కరువు మండలాలుగా ప్రకటించగా అందులో ప్రకాశం జిల్లాలో 40 మండలాలు ఉన్నాయి. తీవ్రమైన కరువు జిల్లాల్లో ప్రకాశం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. వైఎస్సార్ కడప జిల్లా 43 తీవ్ర కరువు మండలాలతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ప్రకాశం 40, చిత్తూరులో 37, కర్నూలు 33, అనంతపురం 32, విజయనగరంలో 22 మండలాలలో తీవ్రమైన కరువు ఉన్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా ఒకమోస్తరు కరువు ఉన్నట్లు 29 మండలాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డి.వరప్రసాదు బుధవారం జీఓ ఎంఎస్ నంబర్–2 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఖరీఫ్ సీజన్లో ప్రకాశం జిల్లాలోని మొత్తం 56 మండలాలనుకరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం రబీలో ఏం వర్షాలు పడి పంటలు పండాయో గాని 16 మండలాలను తాజా జాబితాలో చేర్చలేదు. వర్షపాతం కూడా పూర్తి లోటుగా ఉన్నా కరువు మండలాల ప్రకటనలో మాత్రం ప్రభుత్వం పూర్తి అధ్యయనం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కరువు మండలాలు ఇవే.. అద్దంకి, అర్ధవీడు, బేస్తవారిపేట, సీఎస్ పురం, చీమకుర్తి, కంభం, దొనకొండ, పెదదోర్నాల, గిద్దలూరు, హనుమంతునిపాడు, గుడ్లూరు, లింగసముద్రం, కొనకనమిట్ల, కారంచేడు, కొమరోలు, కనిగిరి, కొండపి, కొరిశపాడు, కొత్తపట్నం, మార్కాపురం, మర్రిపూడి, మార్టూరు, ఒంగోలు, పామూరు, పెద్దారవీడు, పీసీపల్లి, పొదిలి, పొన్నలూరు, పుల్లలచెరువు, సంతనూతలపాడు, సింగరాయకొండ, రాచర్ల, టంగుటూరు, తర్లుపాడు, తాళ్ళూరు, ఉలవపాడు, వెలిగండ్ల, వలేటివారిపాలెం, యద్దనపూడి, యర్రగొండపాలెం. -
ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు కొత్త డ్రామా
-
ప్రకాశం జిల్లా మర్రిపూడిలో పేలిన సెల్‌ఫోన్
-
విద్యార్థినిపై ఏడాదికాలంగా అత్యాచారం
సాక్షి, ప్రకాశం: మహిళలపై లైంగిక అకృత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై తొమ్మిది మంది యువకులు ఏడాది కాలంగా లైగికంగా హింసిస్తూ, పలుమార్లు అత్యాచారం జరిపారు. ఈ దుర్మార్గంపై బాధితురాలు ఆదివారం గిద్దలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, పరారీలో ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని మార్కాపురం డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు విలేకరులకు తెలిపారు. -
అల్పాహారానికి వెళ్తూ..అనంత లోకాలకు!
సాక్షి, వేటపాలెం: అల్పాహారానికి వెళ్తున్న బాలికను వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని రామన్నపేటలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన పృధివి బ్రహ్మణి (12) సైకిల్‌పై వస్తుండగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో చికిత్స కోసం చీరాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. స్థానికుల, బాధితుల కథనం ప్రకారం.. రామన్నపేట శివాలయం ఎదురుగా నివాసం ఉంటున్న పృధివి శ్రీనివాసరావు, జ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి 9వ తరగతి చదువుచుండగా కుమార్తె బ్రహ్మణి స్థానికంగా 7వ తరగతి చదువుతోంది. ఎస్ఏ పరీక్షలు జరగుతుండటంతో ఉదయం ఎనిమిది గంటల సమయంలో తన సైకిల్‌పై బ్రహ్మణి పెట్రోలు బంకు సమీపంలో అల్పాహారం తెచ్చుకునేందుకు ఇంటి నుంచి పందిళ్లపల్లి–వేటపాలెం ప్రధాన రోడ్డు పక్కన సైకిల్‌పై వెళ్తోంది. వాటర్ ట్యాంకు సమీపంలోకి వచ్చే సరికి బాపట్ల ప్రాంతానికి చెందిన ట్రాక్టర్ పందిళ్లపల్లి వైపు వేగంగా వస్తూ ఎడమ వైపు ఉన్న ఉల్లిపాయల ఆటోను క్రాస్ చేసి ముందుకు వెళ్లే ప్రయత్నంలో ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు మార్జిన్లో సైకిల్‌పై వెళ్తున్న బ్రహ్మణిని ఢీకొట్టింది. కింద పడిన బాలిక ఛాతీపై ట్రాక్టర్ చక్రం ఎక్కడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా బ్రహ్మణిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. పక్కనున్న మృతురాలి బంధువులు మృతదేహాన్ని ఇంటికి చేర్చడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా శోకంలో మునిగిపోయారు. ఎప్పుడూ చలాకీగా ఉండే తన కుమార్తె విగత జీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు, బంధువులు ఆ ప్రాంతం చేరడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ పాటల హోరుతో అతి వేగంగా నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ వెంకటకృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రకాశం జిల్లా కందుకూరులో భారీ అగ్నిప్రమాదం
-
ఖాళీ కుర్చీలకు.. బాబు ప్రజాస్వామ్య ముచ్చట్లు
-
టీడీపీపై ఫైర్ అయిన జీవీఎల్
సాక్షి, ప్రకాశం : రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రూ.3 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటే.. టీడీపీ పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి బాండ్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం వెనక్కి పోవడానికి ఏపీ ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరే కారణమన్నారు. ఈ విషయంలో కేంద్రం సుముఖంగానే ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోర్టు వెనక్కు వెళ్తోందని దుయ్యబట్టారు. ఇండస్ట్రీయల్ మానుఫ్యాక్చరింగ్ జోన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి సహాయం చేయడం లేదంటూ టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. -
చంద్రబాబు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకే నిధులిస్తారు
-
వెలిగొండ ప్రాజెక్టును టీడీపీ నిర్లక్ష్యం చేస్తోంది
-
జెండా ఆవిష్కరణ చేస్తుండగా కరెంట్ షాక్
-
తుని సభకు వచ్చిన జనమే యనమలకు చెంపపెట్టు
-
చంద్రబాబు పర్యటన.. స్కూళ్లకు సెలవు
సాక్షి, ప్రకాశం : సీఎం చంద్రబాబు నాయుడు చీరాల పర్యటనకు స్కూల్ బస్సులన్నీ తరలించడంతో విద్యార్ధులకు పాఠశాల యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. చంద్రబాబు మంగళవారం దూబగుంట్ల గ్రామం వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాల భూమిపూజ కార్యక్రమానికి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలను భారీ ఎత్తున తరలించేందుకు ప్రైవేటు పాఠశాలల బస్సులను తరలిస్తున్నారు. దీంతో విద్యార్థులకు అనధికారికంగా సెలవు ప్రకటించారు. సీఎం పర్యటన కారణంగా పాఠశాలలకు సెలవు ఇవ్వడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఎక్కువ భాగం నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యలకు సంబంధించిన పాఠశాలలే ఉన్నందున అనధికారికంగా సెలవు ప్రకటించారు. మధ్యాహ్నం 12.30కు సీఎం రామన్నపేట హెలిప్యాడ్‌కు చేరుకుని పందిళ్లపల్లి గ్రామంలో చేనేతలతో ముచ్చటించి ఎంపీపీ స్కూలులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సెయింటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బహిరంగసభ జరుగుతుంది. -
కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకులు
-
ఒంగోలులోముగ్గురు చిన్నారులను బలిగొన్న గోడ
-
రాత్రికి రాత్రే కింగ్‌లా మారాలనుకుని...
వ్యాపారంలో అప్పులపాలైనవారు దురదృష్టం వెంటాడి ఉన్నదంతా కోల్పోయినవారు రాత్రికి రాత్రే కింగ్‌లా మారాలనుకొనేవారు పైలాపచ్చీసుగా తిరిగేవారు జల్సాలకు అలవాటుపడిన విద్యార్థులు... వీరందరికీ ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ పెద్ద లాటరీ టికెట్లా కనిపిస్తోంది ఉన్న కాస్త డబ్బులను పందేల్లో పెడుతూ మరిన్ని కష్టాల్లో కూరుకు పోతున్నారు... కందుకూరు రూరల్: ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. వాస్తవానికి దీనిపై క్రీడాభిమానులు పెద్దగా ఆసక్తి చూపరు. అయితే ఎక్కడైనా టీవీ ముందు నలుగురు కూర్చొని ఆసక్తిగా చూస్తున్నారంటే కచ్చితంగా అక్కడ బెట్టింగ్ రాజులు ఉన్నట్లే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా వందలు వేలు దాటి కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. యువత లక్ష్యంగా కొందరు మధ్య వర్తులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై పోలీస్, ఇంటిలిజెన్స్ ని«ఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయనే చెప్పాలి. తీవ్ర స్థాయికి.. గతంలో క్రికెట్ గెలుపోటములపై బెట్టింగులు పెట్టేవారు. గెలిచినవారు సొమ్ము చేసుకొని ఆనందించే వారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పోయింది. వెంటనే నగదు కావాలనే ఆతృతతో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది. ఒక క్రీడాకారుడు ఐపీఎల్ మ్యాచ్‌లో 50 పరుగులు చేస్తాడని, ఒక ఓవర్లలో ఇన్ని పరుగులు చేస్తారని, ఈ బాల్ కచ్చితంగా ఫోర్ పోతుందని, సిక్స్ కొడతారని, రెండు పరుగులు మాత్రమే వస్తాయని ఇలా మధ్య వర్తులు రెచ్చగొట్టి మరీ పందెం పెట్టిస్తున్నారు. అదే విధంగా మ్యాచ్ చివర మూడు, నాలుగు ఓవర్ల నుంచి బెట్టింగ్స్ అధికంగా జరుగుతున్నాయి. రూ. 100కి రూ. 200, రూ. 100కి రూ. 150 ఇలా కోట్లమేర లావాదేవీలు జరుగుతున్నాయి. 5 నుంచి 10 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రూమ్‌లు, గెస్ట్ హౌస్‌లలో ఈ బెట్టింగ్ వ్యవహారం జోరుగా సాగుతోంది. కొన్ని దుకాణాల్లో టీవీలు పెట్టుకొని బెట్టింగ్ సాగిస్తున్నారు. కందుకూరులో ఐదుగురు బుకీలు? ఆన్లైన్, ఫోన్ల ద్వారా బెట్టింగులు కొనసాగిస్తున్నారు. కందుకూరులో పెద్ద మొత్తంలో వ్యాపారం నడిపించే బుకీలు సుమారు ఐదుగురికి పైగా ఉన్నట్లు సమాచారం. వీరు లక్షల్లో పెందేలు వేస్తున్నారు. మొత్తం మీద 15 బుకీ కేంద్రాలున్నట్లు తెలుస్తోంది. కొందరిని రంగంలోకి దించి వారికి ఆకర్షణీయమైన కమీషన్లు ఇచ్చి దందా కొనసాగిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్ అయితే బెట్టింగ్ పాయింట్ నిర్వహిస్తున్న వారి ఖాతాతో ముందుగా నగదును జమ చేసి ఆన్లైన్ అకౌంట్లు ద్వారా లావాదేవీలు నడుపుతున్నారు. కొందరు బెట్టంగ్ నిర్వాహకులు కార్లు, ఆటోల్లో తిరుగుతూ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిబారిన పడిన బాధిత కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వడ్డీ వ్యాపారులు.. తండావ్యాపారుల హవా క్రికెట్ బెట్టింగ్‌ల వద్ద వడ్డీ వ్యాపారులు, తండా వ్యాపారులు తిష్ట వేస్తున్నారు. బెట్టింగ్‌లో చేయి తిరిగిన వారికి వెంటనే డబ్బులు ఇచ్చి గెలిస్తే అధిక మొత్తంలో వడ్డీ వస్తూలు చేస్తున్నారు. ఒకవేళ ఓడిపోయి నగదు పోతే వెంటనే ప్రామిసరీ నోట్ రాయించుకుంటున్నారు. ఇలా వడ్డీకి తిప్పేవారి వ్యాపారం విరాజిల్లుతోంది. చిత్తవుతున్న యువత బెట్టింగ్ మోజులో పడిన యువతి చిత్తవుతోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఎంబీఏ, డిగ్రీ చదివే విద్యార్థులు బెట్టింగ్‌లకు బానిసలవుతున్నారు. చేతి ఖర్చులకు తల్లిదండ్రులు ఇచ్చిన నగదుతో పాటు, బంగారు ఆభరణాలు, స్నేహితుల వద్ద అప్పులు తీసుకొని మరీ బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఒక్కసారి పోయిన నగదును తిరిగి తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతూ చెడు అలవాట్లకు లోనవుతున్నారు. ఇలాంటివారే దొంగతనాలు, చైన్ స్నాచింగ్, బైక్‌లు దొంగతనాలు వంటి కేసుల్లో చిక్కుకుంటున్నారు. బెట్టింగ్స్‌లో తేడాలు వచ్చి సమయంలో ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. వీటిపై నిఘా ఉంచాల్సిన పోలీస్, ఇంటిలిజెన్స్ నిఘా వర్గం పూర్తిగా విఫలమయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఎవరైన సమాచారం ఇచ్చినప్పుడు దాడులు చేయడం ఆ తర్వాత వారి వద్ద ఎంతో కొంత వసూళ్లు చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. -
వైఎస్ విగ్రహం పెట్టాడని పాలకుల దౌర్జన్యం
-
105వ రోజు మొదలైన వైఎస్ జగన్ పాదయాత్ర
-
శివరాంపురంలో జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
100వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, ప్రకాశం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100వ రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నానని భరోసా కల్పిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. బుధవారం ఉదయం ఉప్పలపాడు శివారు నుంచి 100వ రోజు వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెల్లురు క్రాస్ మీదుగా మర్రిచెట్టపాలెంకు పాదయాత్ర చేరుకుంటుంది. ఆయన అక్కడ ప్రజలతో మమేకం కానున్నారు. మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బుదవాడ, రామతీర్థం మీదుగా చీమకుర్తి వరకు పాదయాత్రను కొనసాగిస్తారు. ఆయన రాత్రి ఇక్కడే బస చేస్తారు. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 1340 కిలోమీటర్లు నడిచారు. -
ప్రారంభమైన 99వ రోజు ప్రజాసంకల్పయాత్ర
-
ప్రారంభమైన 99వ రోజు ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, ప్రకాశం : ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం మార్కాపురం నియోజకవర్గంలోని కటురివారిపాలెం నుంచి ఆయన 99వ రోజు పాదయాత్రను ఆరంభించారు. దారిపొడవునా ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలుకుతున్నారు. అక్కడి నుంచి కొండేపి నియోజకవర్గంలోని అగ్రహారం క్రాస్ రోడ్డు మీదుగా తలమళ్ల చేరుకొని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఫిరదోసినగర్, గోగినేనిపాలెం క్రాస్ రోడ్డు మీదుగా ఉప్పలపాడు చేరుకుంటారు. అక్కడ ప్రజలతో జగన్ మమేకం కానున్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 1,323.8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. -
98వ రోజు పాదయాత్ర డైరీ
-
98వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, ఒంగోలు : వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం చిన్నారికట్ల శివారు నుంచి ఆయన 98వ రోజు పాదయాత్రను ఆరంభించారు. దారిపొడవునా ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలుకుతున్నారు. అక్కడ నుంచి చిన్నారికట్ల, చిన్నారికట్ల జంక్షన్, కంభాలపాడు మీదుగా పోతవరం చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు వైఎస్ జగన్ తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. మూడు గంటలకు పొదిలి చేరుకొని అక్కడి ప్రజలతో జగన్ మమేకం కానున్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ రక్కసి
-
ప్రకాశం జిల్లాలో వడ్డీ వ్యాపారి ఆగడాలు
-
ఏం కష్టమొచ్చిందో.. కుమార్తె పుట్టినరోజు నాడే..!
కుమార్తె పుట్టిన రోజును ఎంతో సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కొత్త బట్టలు కొనాలనుకున్నారు. ఉదయాన్నే పిల్లల్ని రెడీ చేసి స్కూలుకు పంపించారు. అంతలోనే ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు బిడ్డలతో కలసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. స్కూలుకు వెళ్లిన పిల్లల్ని వెంట తీసుకొచ్చి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ముందుగా భర్తకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చింది. ఇది విన్న ఆ భర్త తానూ పురుగుమందు తాగి ప్రాణాలు విడిచాడు. సోమవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన జె.పంగులూరు మండలం రామకూరులో తీవ్ర విషాదం నింపింది. సాక్షి, జె.పంగులూరు: మండలం రామకూరు గ్రామానికి చెందిన పెనుబోతు సోమశేఖర్ (40)కు తొమ్మిదేళ్ల క్రితం గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని అప్పాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి (32)తో వివాహం జరిగింది. వ్యవసాయం చేసుకుంటూ జీవించే ఈ దంపతులకు కుమార్తె దిగ్విజయ (7), కుమారుడు గణేశ్‌సాయి (4) ఉన్నారు. సోమవారం దిగ్విజయ పుట్టినరోజు కావడంతో కొత్త బట్టలు తెచ్చేందుకు తండ్రి వద్ద డబ్బులు తెచ్చి భార్యకు ఇచ్చాడు సోమశేఖర్. ఉదయం పిల్లలిద్దరీనీ మార్టూరులోని ప్రైవేటు పాఠశాలకు పంపారు. అనంతరం సోమశేఖర్ మాగాణికి నీరు పెట్టడానికి వెళ్లాడు. విజయలక్ష్మి మధ్యాహ్నం పిల్లలు చదువుతున్న స్కూలుకు వెళ్లింది. వారితో కలిసి భోజనం చేసింది. పిల్లలను తాను తీసుకువెళ్తున్నట్లుగా రిజిస్టర్లో సంతకం పెట్టి వారిని నరసరావుపేటకు తీసుకెళ్లింది. అక్కడో స్టూడియోలో పిల్లలతో కలసి ఫొటో తీయించుకుంది. ఆ ఫొటో వెనుక ముగ్గురి పేర్లతోపాటు అడ్రస్ రాసి హ్యాండ్ బ్యాగ్‌లో పెటుకున్న ఆమె పిల్లలను ఇద్దరినీ తీసుకుని ట్రైన్ వచ్చే సమాయానికి పట్టాలపైకి వెళ్లి, కుమార్తె దిగ్విజయ కాలిని తన కాలికి కలిపి కట్టేసుకుని, కుమారుడు గణేశ్‌సాయిని ఎత్తుకుంది. అదే సమయంలో భర్తకు ఫోన్ చేసి తాను పిల్లలు రైలు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పింది. భార్యాపిల్లలు ఇక లేరని.. ఈ విషయం తెలుసుకున్న సోమశేఖర్ తన తండ్రి వద్ద రూ.200 తీసుకుని వలపర్లకు వెళ్లి, పురుగుల మందు కొనుగోలు చేశాడు. అక్కడికి సమీపంలోని నూలు మిల్లులోనికి వెళ్లి తాగి, కేకలు వేశాడు. అది విన్న స్థానికులు అతన్ని చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి, మృతి చెందినట్లు చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదు. సోమశేఖర్ మృతదేహం సోమవారం రాత్రి ఇంటికి చేరింది. భార్య పిల్లల మృతదేహాలు మంగళవారం గ్రామానికి చేరే అవకాశం ఉంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకే రోజు మృతి చెందడంతో రామకూరులో విషాదం అలముకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో బాధితుల ఇంటి వద్దకు చేరుకున్నారు. -
పైసా వసూల్!
ఒంగోలు నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగం (టౌన్ ప్లానింగ్) అధికారులు, సిబ్బంది దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. భవన నిర్మాణ అనుమతులు, ఆక్రమణలు, ఆక్రమ కట్టడాలు, పబ్లిసిటీ ఫ్లెక్సీలు ఇలా..పలు అంశాల్లో పైసానే పరమావధి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. విభాగ అ«ధిపతి నుంచి చైన్‌మెన్ వరకు అందరిదీ అదే దారి. రోజువారీ కలెక్షన్లు, టార్గెట్లు పెట్టుకొని మరీ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లు కూడా వ్యవహరిస్తున్నారు. ఒంగోలు అర్బన్: నగరంలోని విలేకరుల కాలనీ, ఇందిరా కాలనీ, కర్నూలు రోడ్డు, 60 అడుగుల రోడ్డు వంటి ప్రధాన రోడ్లలో అనుమతులు మీరి నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు చాలానే ఉన్నాయి. అయినా టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలక సంస్థకు చెందిన తాగునీటి పైపులైన్లు ఉన్న చోట్ల కొంతమంది ఆక్రమించి మరీ వ్యాపార సముదాయలు నిర్మించారు. చివరకు పక్కపక్కనే ఉండే రెండు భవనాల యజమానుల మధ్య తలెత్తే తగాదాల్లో సైతం వీరి తలదూర్చుతున్నారు. ఒకరికి లోపాయికారిగా అండగా ఉంటున్నారు. అవతలి వ్యక్తి భవన నిర్మాణాన్ని అడ్డుకోవడం, నిర్మించిన భవనాలను కూలగొట్టడం దగ్గరుండి చేస్తున్నారు. ఇక్కడ మరీ దారుణం నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు వీల్లేని బాపూజీ కాంప్లెక్స్ పై అంతస్తులో వందల సంఖ్యలో గదులు నిర్మిస్తుంటే పట్టించుకున్న దాఖాలాలు లేవు. కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్న భనాలను సైతం కూలదోసిన ఘటనలు లేకపోలేదు. మూడు నెలల క్రితం అనధికారిక భవనాల పేరుతో 21 భవనాలు తొలగించారు. అయితే ఎటువంటి పలుకుబడి లేని వాళ్ల భవనాలను భారీగా కూలదోసి, పలుకుబడి ఉన్న భవనాలను నామమాత్రంగా రంధ్రాలు వేసి వదిలేశారు. అదే సామాన్య ప్రజలు ఒక చిన్న ఇల్లు నిర్మించుకుంటే అనుమతులు లేవని, అక్రమ కట్టడాలు తొలగిస్తున్నామని ప్రకటనలు చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు బహుళ అంతస్తుల భవనాలు, పెద్ద భవనాలు, వ్యాపార సముదాయాలు వంటి నిర్మాణాల్లో అ«ధికార పార్టీ నేతల సిఫార్సులు, మాముళ్లు ఉంటే ఆ వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చిరు వ్యాపారులపై కొరడా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామంటూ రోడ్డు మార్జిన్లలో చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారిపై కొరడా ఝుళిపించడం ఆనవాయితీగా మారింది. చివరకు రోడ్డు విస్తరణ పనుల్లోనూ సమన్యాయం పాటించడం లేదు. పలుకుబడి, డబ్బు ఉన్న వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దానికి ఉదాహరణే కర్నూలు రోడ్డు విస్తరణలో రోడ్డు అష్ట వంకర్లు తిరగటం. రెండు నెలల నుంచి కమ్మపాలెం రోడ్డు విస్తరణ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా మార్కింగ్ ఇచ్చారు. ఆ తర్వాత రోడ్డు విస్తరణను కుదించి ఒక వైపే భవనాలు తొలగిస్తామని అధికారులు చెప్పారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఓఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ గుమాస్తాపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన వద్ద కోట్లాది రూపాయల ఆస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. ఏసీబీ దాడులు చేస్తున్నా టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల్లో జంకుబొంకు లేకపోవడం గమనార్హం. -
యువకుడి దారుణ హత్య
ఒంగోలు క్రైం : నగరంలోని ఉత్తర బైపాస్ సమీప పొలాల్లో ఓ యువకుడు సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక నేతాజీ కాలనీకి సమీపంలోని చింతచెట్టు కుంటలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. హత్యకు గురైన యువకుడు నగరంలోని గద్దలగుంటకు చెందిన దుగ్గిరాల వివేక్ వంశీ రాజు(24)గా గుర్తించారు. హతునిపై గతంలో తాలూకా పోలీసుస్టేషన్లోనే మహిళలను వేధించిన కేసులు రెండు నమోదై ఉన్నాయి. ఆదివారం రాత్రి హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. హతుని ముఖంపై బలమై కత్తి గాయాలు, మద్యం బాటిళ్లను పగులగొట్టి పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. హత్యను ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమంది కలిసి కుంట కట్టపై ఉన్న చింతచెట్టు కింద మద్యం తాగినట్లు అర్థమవుతోంది. ఏం జరిగిందో ఏమోగానీ మద్యం బాటిళ్లను పగులగొట్టి ముఖంపై బలంగా పొడిచినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. సంఘటన స్థలంలో చిన్నపాటి కత్తి, కారం పొట్లం ఉంది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం హత్యకు ముందు కళ్లల్లో కారం చల్లానుకున్నారా లేక మద్యంలోకి తెచ్చుకున్న తినుబండారాల్లో ఉందా.. అన్నది అర్థం కావడం లేదు. అర్ధరాత్రి సమయంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం పక్కనే ఉన్న చింతచెట్టు కుంటలో మృతదేహాన్ని పడేశారు. గతంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్లాట్ల విషయంలో పలువురిపై వివేక్ వంశీ రాజు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టి ఉన్నాడు. బి.ఫార్మసీ చదివిన వివేక్ వంశీ రాజు తండ్రి శ్రీనివాసరావు రిటైర్డ్ లెక్చరర్. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్ తాలూకా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు డాగ్ స్క్వాడ్ వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించింది. హత్య జరిగిన ప్రదేశంలో హతునికి సంబంధించిన ఆధారాలను డాగ్ స్క్వాడ్ పోలీస్ జాగిలానికి వాసన చూపించింది. పోలీసు జాగిలం సంఘటన స్థలం నుంచి ఉత్తరం వైపుగా కొం త దూరం ప్లాట్లు వేసిన ప్రాంతం వైపు పరుగులు తీసింది. శునకం పరుగులు తీసిన ప్రాంతంలో ఆటో వెళ్లిన ఆధారాలు కనిపించాయి. అంటే హత్య అనంతరం నిందితులు ఆటోలో త్రోవగుంట వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం వేలిముద్రల నిపుణులు జక్కంరాజు ఆధ్వర్యంలో కొన్ని ఆధారాలు సేకరించారు. తాలూకా పోలీసులు హంతకుల కోసం ప్రత్యేక బృందాలను కేటాయించారు. మృతదేహానికి సంఘటన స్థలంలోనే రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కడలి కెరటాలకు ఇద్దరు విద్యార్థుల బలి
ఒంగోలు, కొత్తపట్నం : సముద్ర స్నానం చేస్తున్న ఇద్దరు విద్యార్థులను కెరటాలు కాటేశాయి. మృతుల్లో ఒకరు పాలిటెక్నిక్ విద్యార్థికాగా మరొకరు ఇంటర్ విద్యార్థి. ఈ సంఘటన కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం బీచ్‌లో గురువారం జరిగింది. స్థానిక ఎస్ఐ వి.ఆంజనేయులు కథనం ప్రకారం.. ఉదయం 6 గంటలకు ఒంగోలు నుంచి తొమ్మిది మంది విద్యార్థులు సముంద్ర స్నానం చేసేందుకు బైకులపై వచ్చారు. తమ స్నేహితుడు రంగాయపాలెంలో ఉంటున్న షేక్ అల్ఫాతుల్లా ఇంటికి వెళ్లి అతడిని నిద్ర లేపుకుని అందరూ కె.పల్లెపాలెం బీచ్‌కు వెళ్లారు. బీచ్ ఆవరణలో కొద్దిసేపు బైకులపై సరదాగా తిరిగారు. బైకులు సముద్రపు ఒడ్డున ఉంచారు. షేక్ అల్ఫాతుల్లా (17), దాలా నాగపవన్కాళ్యాణ్ (17), మరో విద్యార్థి దుస్తులు ఒడ్డున పెట్టి సరదాగా సముద్ర స్నాçనం చేస్తున్నారు. అల్ఫాతుల్లా లోతుకు వెళ్లడం..మళ్లీ ఒడ్డుకు రావడం చేస్తున్నాడు. మరింత లోతుకు వెళ్లి స్నానం చేస్తుండగా అలలు తీవ్రతకు గల్లంతయ్యాడు. ఆ పక్కనే సముద్ర స్నానం చేస్తున్న నాగపవన్ కాళ్యాణ్ (17) కూడా అలలు తాకిడికి గల్లంతయ్యాడు. మూడో యువకుడు పరుగు తీసి ఒడ్డుకు చేరాడు. అల్ఫాతుల్లా, నాగపవన్కళ్యాణ్లు చేతులు పైకి ఎత్తి సముద్రంలో కొట్టుకుపోయారు. ఒడ్డునే ఉన్న స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. ఆ సమయంలో మత్స్యకారులు ఎవరూ లేకపోవడంతో కాపాడలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత మత్స్యకారులు వచ్చి అలల మధ్యలో కనిపిస్తున్న అల్ఫాతుల్లాను అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. ఆ సమయంలో కుటుంబ సమేతంగా సరదా గడిపేందుకు సముద్రానికి వచ్చిన ఓ ఎస్ఐ అల్ఫాతుల్లాకు సపర్యలు చేసి బతికించే ప్రయత్నం చేశారు. కడుపు నిండా ఉప్పునీరు ఉండటంతో అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెందాడు.మృతుడి తల్లి సుబ్బాయమ్మ,తండ్రి రహంతుల్లా, సోదరి, బంధువులు వచ్చి భోరున విలపించారు. తల్లిదండ్రులకు అల్ఫాతుల్లా ఒక్కడే కుమారుడు. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. అల్ఫాతుల్లా పేస్ కాలేజీలో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొట్టుకొచ్చిన మరో విద్యార్థి మృతదేహం సంఘటన స్థలానికి ఎస్సై వి.ఆంజనేయులు తన సిబ్భందితో వచ్చి నాగపవన్ కాళ్యాణ్ ఆచూకీ కోసం ఐలా వలతో అలల మధ్య గాలింపు చర్యలు చేపట్టారు. అతడి తండ్రి శ్రీనివాసరావు, బంధువులు సముద్ర తీరానికి వచ్చి బిడ్డ రాక కోసం ఎదురు చూశారు. సాయంత్రం సమయంలో నాగ పవన్‌కళ్యాణ్ మృతదేహం కృష్ణా హేచరీ సమీపానికి కొట్టుకొచ్చింది. యువకుడి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం ఆ మృతదేహాన్ని కూడా రిమ్స్‌కు తరలించారు. తల్లిదండ్రులకు పవన్‌కళ్యాణ్ ఒక్కడే కుమారుడు, ముగ్గురు కుమర్తెలు ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒంగోలు రెండో పట్టణ సీఐ ఎస్. సురేష్‌కుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల తల్లిదండ్రులను ఓదార్చారు. మృతుడు ఒంగోలు ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అంతా శారదా బాలకుటీర్ పూర్వ విద్యార్థులు స్నేహితులంతా ఒంగోలులోని శారదా బాలకుటీర్ పూర్వ విద్యార్థులు. 2014–15 సంవత్సరం పదో తరగతి బ్యాచ్. దసరా సెలల్లో కొత్తపట్నం బీచ్‌కు వెళ్లి ఎంజాయ్ చేయాలని పది రోజుల క్రితం నిర్ణయించుకున్నారు. వారు వివిధ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్నారు. -
సయ్యద్ జిలానీ @ భవానీ
ఒంగోలు , కందుకూరు : అతను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పేరు సయ్యద్ జిలానీ. దుర్గామాతకు వీరభక్తుడైన ఇతను మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాడు. 24 ఏళ్లుగా అమ్మవారి సేవలో తరిస్తూ ఏకంగా దుర్గామాత ఆలయాన్ని నిర్మించి ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నాడు. ఆలయంలో దూపదీప నైవేద్యాలకు, అమ్మవారి ఉత్సవాలకు లోటులేకుండా అన్నీ తానై నిర్వహిస్తున్న సయ్యద్ జిలానీ భవానీ స్వామిగా పేరుపొందాడు. గుంటూరుకు చెందిన సయ్యద్ బడేషా, హుస్సేన్‌బీ దంపతులకు ఆరుగురు సంతానం. చివరివాడైన సయ్యద్ జిలానీ తండ్రితో విభేదాలు తలెత్తడంతో ఇల్లు వదిలి బయటకు వచ్చాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ భార్యతో కలిసి కందుకూరు చేరుకున్నాడు. అంకమ్మ దేవాలయంలో ఓ చిన్న గదిలో ఉంటూ.. ఆరు నెలలపాటు భవానీ దీక్ష తీసుకున్నాడు. దుర్గమ్మ ఆలయం నిర్మించాలని నిర్ణయించుకుని, జనార్దన కాలనీకి చేరుకుని కోవూరు రోడ్డు పక్కనే 4 సెంట్ల స్థలాన్ని రూ.10 వేలకు కొనుగోలు చేశాడు. కాలనీ పెద్దలతోపాటు దాతల సాయంతో రూ.20 లక్షలు వెచ్చించి ఆలయాన్ని నిర్మించాడు. ఇటీవలే మరో రూ.14 లక్షలతో భారీ శివలింగంతోపాటు, నవగ్రహాలు, నాగబంధం విగ్రహాలను ప్రతిష్టించాడు. ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు పండుల సమయాల్లో వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. జిలానీ భార్య బేగంతోపాటు ముగ్గురు కుమార్తెలు దుర్గమ్మ సేవకు అంకితమయ్యారు. కుమార్తెలకు అంకమ్మ, శివనాగమ్మ, రేణుకాదుర్గ అని పేర్లు పెట్టాడు. పెద్ద కుమార్తె అంకమ్మకు మసీదులో పేష్ ఇమామ్‌గా పనిచేసే యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. -
అధికారం.. అవినీతి పక్షమా!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీని అప్పుల్లో ముంచి సంక్షోభంలోకి నెట్టిన పాలకవర్గానికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మద్దతుగా నిలవడంపై సొంత పార్టీ వర్గాల నుంచే వ్యతిరేకత పెల్లుబుకుతోంది. డెయిరీ విషయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తోపాటు అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఇక సాక్షాత్తు టీడీపీ అనుబంధ సంఘాలైన తెలుగు రైతు, టీఎన్‌టీయూసీలు సైతం అధికార పార్టీ శాసనసభ్యుల తీరుపై విమర్శలు గుప్పిస్తుండటం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. డెయిరీని సంక్షోభం నుంచి గట్టెక్కించి వేలాది మంది రైతులు, ఉద్యోగులను ఆదుకోవాల్సిన పార్టీ నేతలు వారి గోడు పట్టించుకోకుండా డెయిరీ చైర్మన్‌కు ఆర్థిక సాయం అందించి, లాభం ఆర్జించి పెట్టేందుకు ప్రయత్నించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావును ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి డెయిరీకి ఆర్థిక సాయం చేయాలంటూ విన్నవించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చైర్మన్ చల్లా శ్రీనివాసరావు పాలనలో ఒంగోలు డెయిరీ పతానవస్థకు చేరింది. 2014 వరకు లాభాల్లో ఉన్న డెయిరీ గత మూడేళ్లలో రూ.80 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. పాల రైతులకు, ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి పాలకవర్గం అవినీతి అక్రమాలే కారణం’ అని సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన తెలుగు రైతు, టీఎన్టీయూసీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. డెయిరీలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల పెత్తనం లేదు. అంతా అధికార పార్టీ పెత్తనమే. ఇక్కడి ఉద్యోగులు సైతం అధికార పార్టీ అనుబంధ సంఘం టీఎన్టీయూసీ పరిధిలో పని చేస్తున్నారు. డెయిరీని ముంచింది ‘చల్లా’నే.. డెయిరీ పతానవస్థను కళ్లారా చూసిన ఉద్యోగులు, రైతులు చైర్మన్ చల్లా శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. బహిరంగ విమర్శలకు సైతం దిగారు. డెయిరీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 17 రోజులుగా టీఎన్టీయూసీ డెయిరీ వద్దే దీక్షలకు దిగింది. ఇంకా దీక్షలు కొనసాగుతున్నాయి. మరో వైపు రైతులు సైతం తమకు బకాయిలు చెల్లించకుండా పాలకవర్గం డెయిరీ ఆస్తులను కొల్లగొడుతోందని ఆరోపిస్తున్నారు. తెలుగు రైతు, టీఎన్టీయూసీ మొర అరణ్య రోదన అధికార పార్టీకి చెందిన తెలుగు రైతు, టీఎన్‌టీయూసీలు ఆరోపిస్తున్నా.. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వారి మొర ఆలకించడం లేదు. రైతులు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇప్పించే ప్రయత్నం చేయడం లేదు. డెయిరీని తిరిగి సహకార చట్టంలోకి మార్చాలన్న వారి డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. మూడేళ్లలోనే డెయిరీ రూ.80 కోట్ల అప్పుల్లో మునగడానికి పాలకవర్గం అవినీతి అక్రమాలే కారణమని తెలిసినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ అధిష్టానం ఏ మాత్రం స్పందించడం లేదు. పైపెచ్చు డెయిరీ సంక్షోభానికి కారణమైన చల్లా శ్రీనివాస్‌ను ఆదుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు తప్పితే రైతులను, ఉద్యోగులకు బాసటగా నిలిచి భవిష్యత్తులో మళ్లీ అవినీతి, అక్రమాలు జరగకుండా చూసే ప్రయత్నాలు చేయడం లేదు. ప్రజాప్రతినిధుల తీరుపై రైతులు, ఉద్యోగులతోపాటు అధికార పార్టీ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
అంతా ఆయనే చేశారు!
ఒంగోలు : పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబుపై బ్యాంక్ డైరెక్టర్లు తాజాగా 27 అంశాలకు సంబంధించి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు గురువారం మీడియా కార్యాలయాలకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైస్ చైర్మన్ కండే శ్రీనివాసరావు, డైరెక్టర్లు ఆర్.వెంకట్రావు, చిడిపోతు మస్తానయ్య, గండికోట చినవీరయ్య, జాగర్లమూడి యలమందరావు, కె.మురహరి, మేణావత్ హనుమాన్‌నాయక్ సంతకాలతో ఈ ప్రకటన జారీ అయింది. ఆరోపణల్లో ముఖ్యమైనవి.. ⇔ తన ఇష్టానికి అనుకూలంగా వ్యవహరించడం లేదంటూ 8 మంది బ్యాంకు సీఈఓలను మార్చారు. ⇔ బ్యాంకులో లాకర్లు, సేఫ్ డోర్లు నాణ్యమైనవి కొనుగోలు చేయాల్సి ఉండగా నాసిరకంవి కొని నాణ్యమైన వాటి ధరకన్నా అధిక మొత్తం చెల్లించారు. ⇔ బ్యాంకు స్టాండింగ్ కౌన్సిల్లో సొంత మనిషిని నియమించుకుని వారి ద్వారా.. సిరి ఇన్ఫ్రా అనే డొల్ల కంపెనీ స్థాపించి బ్యాంకులో అన్ని రకాల కొనుగోళ్లు, లోన్లకు సంబంధించి లీగల్ ఒపీనియన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ⇔ బ్యాంకు స్టాండింగ్ లాయర్ లీగల్ ఒపీనియన్‌కు నిర్ణయించిన ధర కంటే అధిక మొత్తం చార్జీల కింద వసూలు చేశారు. ⇔ సంఘంలో అవుట్ స్టాండింగ్‌కు తగ్గ షేరు ధనం మాత్రమే బ్యాంకు వారు వసూలు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా సంఘ పరిస్థి«తులను బట్టి 2017 మార్చిలో రూ.5 నుంచి రూ.10 లక్షల షేరు ధనం వసూలు చేశారు. ⇔ బంగారు వేలం నోటీసులు ఓ పత్రికకు ఎక్కువ మొత్తంలో ఇచ్చి, అదే పత్రికకు సంవత్సర చందాలు కట్టాలని సొసైటీలపై ఒత్తిడి చేశారు. ⇔ బ్యాంకు ఉద్యోగులకు అరియర్స్, జీతాలు ఇచ్చే విషయంలోనూ, స్వల్పకాలిక రుణాల మంజూరు విషయంలో, బ్యాంకు ఉద్యోగులకు వయోపరిమితి సడలించే విషయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. ⇔ నగదు కౌంటింగ్ మెషీన్లను రిపేరు చేయించకుండా కొత్తవి కొనుగోలు చేయడంలోనూ రూ.60 లక్షలు చేతులు మారింది. ⇔ బ్యాంకులో సిబ్బంది ఉన్నప్పటికీ వారిని కాదని రిటైరైన ఉద్యోగులను నియమించడం ద్వారా లక్షలాది రూపాయలు దుర్వినియోగమయ్యాయి. ⇔ 2016 ఏప్రిల్‌లో సంఘాల ద్వారా బ్యాంకులో చేర్చుకున్న సిబ్బంది నియమ నిబంధనలు లేకున్నా వారికి తప్పుడు ధ్రువీకరణలతో అవకాశం కల్పించారు. ⇔ బ్యాంకు పాలన నాబార్డు, ఆర్బీఐ, ఆర్సీఎస్ వారి సూచనలకు లోబడి, బ్యాంకు బైలాలకు లోబడి నడపాల్సి ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరించారు. అందువల్ల బ్యాంకులో జరిగిన చట్టవ్యతిరేక పనులను పాలకవర్గం ఆమోదించలేదు. ఆ విషయాలకు తాము బాధ్యులం కాదు. ⇔ ఇందిరాదేవి సెక్షన్ 52 కింద జరిపిన గోల్డ్‌లోన్ విచారణ నివేదిక లోపభూయిష్టంగా ఉంది. ఇంతవరకు గోల్డు లోన్ ద్వారా జరిగిన నష్టం వసూలు చేయలేదు. ⇔ ఒంగోలు డీసీఎంఎస్ వారు బ్యాంకుకు చెల్లించాల్సిన రుణం వేలానికి వచ్చి పెండింగ్‌లో ఉండగా ఐసీడీపీ ద్వారా రూ.25 లక్షలు మంజూరు చేయించారు. ⇔ తారకరామ డెయిరీ నుంచి ఎన్పీఏ మొత్తం వసూలు చేయకుండా ఒన్‌టైమ్ సెటిల్మెంట్కు అవకాశం కల్పించి వాయిదా వేశారు. ⇔ స్టడీ టూర్ల పేర్లతో లక్షలాది రూపాయల దుర్వినియోగం జరిగింది. ఒక్క స్టడీ టూరు కూడా బ్యాంకుకు మేలు చేయలేదు. అన్ని విహార యాత్రలుగానే మిగిలాయి. ⇔ గుంటూరు పాలకవర్గ సమావేశంలో పాలకవర్గ ధన దుర్వినియోగాలపై జరిగిన విచారణ నివేదిక ద్వారా పాలకవర్గ సభ్యులను బాధ్యులను చేయడం వల్ల.. తాము కూడా అలా బాధ్యులం కాగలమని భావించి మోసపూరిత అంశాలను కనుగొన్నాం. బ్యాంక్ చైర్మన్‌పై తమ నమ్మకం వమ్ము అయింది. -
దర్శి కొత్తపాలెంలో వైఎస్ఆర్ కుటుంబం
-
ప్రకాశం జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
పాలేరు వాగులో చిక్కుకున్న రైతులు సేఫ్
-
ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
-
డేంజర్ బెల్స్..!
-
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ప్రకాశం జిల్లాలో కల్తీ మద్యం కలకలం
-
ప్రకాశం జిల్లాలో సిఐ అమానుషం
-
ప్రకాశం జిల్లాలో పెన్షన్ల వ్యవహారంలో గందర గోళం
-
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: 11 మందికి గాయాలు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బాలిరెడ్డినగర్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. జాతీయ రహదారిపై వెళుతున్న ఆటో ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడ్డవారిలో ఆరుగురికి కాళ్లూచేతులు విరగ్గా, మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడగలిగారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా ఉలవపాడు మండలం రామాయపట్నం వాసులు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం
గిద్దలూరు: ఏపీలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ (భువనేశ్వర్- బెంగళూరు బౌండ్) రైలులో బీభత్సం సృష్టించిన దొంగలు.. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కొని, చైన్ లాగి రైలు ఆపి దర్జాగా పారిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు సమీపంలోని కృష్ణంశెట్టిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీలసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే దొంగలు అడవుల్లోకి పారిపోయారని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తరచూ రైలు దోపిడీ ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ రైల్వే అధికారులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. -
రిటైర్డ్ ఎస్సై ఇంట్లో చోరీ
మార్కాపురం: రిటైర్డ్ ఇంట్లో దొంగలు పడి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. స్థానిక పవర్ ఆఫీస్ వెనుక భాగంలో నివాసముంటున్న రిటైర్డ్ ఎస్సై షేక్ అజ్మల్ భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఇంటికి తాళం వేసి చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లారు. ఇది గుర్తించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న రూ. 3 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలతో పాటు రూ. 15 వేల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన బంధువులు ఇది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మోసం చేసిందనే మల్లీశ్వరిని చంపా: బాషా
అద్దంకి: 'భర్తను వదిలేసిన తర్వాత నాకు దగ్గరైంది. మొదట్లో అన్యోన్యంగానే ఉన్నాం. కానీ రానురానూ తాను విపరీతంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఎవరెవరితోనో మాట్లాడేది. ఎక్కడెక్కడికో వెళ్లేది. వద్దని ఎంత మొత్తుకున్నా వినేదికాదు. గట్టిగా అడిగితే నిన్నొదిలేసి హైదరాబాద్ వెళ్లిపోతానని బెదిరించేది. అంతే, పట్టలేని కోపంతో పక్కనున్న నవారు తీసుకొని తన గొంతు నులిమా' అంటూ మల్లేశ్వరిని ఎందుకు చంపాడో పోలీసులకు వివరించాడు బాషా. ప్రకాశం జిల్లా అద్దంకిలో సంచలనంరేపిన ఈ హత్యకేసు పూర్వాపరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం పల్లమల్లి గ్రామానికి చెందిన మల్లీశ్వరి(25)కి అద్దంకి మండలం మనికేషం గ్రామానికి చెందిన రామారావుతో వివాహమైంది. చాలా ఏళ్ల కిందటే వారు విడిపోయారు. భర్తతో తెగదెంపుల అనంతరం కొత్తదామవారిపాలెంకు చేరుకున్న మల్లీశ్వరి అక్కడ ఒంటరిగా నివసిచసాగింది. ఈ క్రమంలో ముజావర్ పాలెంకు చెందిన బాషా(30) అనే వ్యక్తితో పరిచయమైంది. అదికాస్తా ప్రేమగామారి ఇరువురూ సహజీవనం చేస్తున్నారు. తనతో కలిసి ఉంటూనే మరికొందరితోనూ దగ్గరగా ఉంటోందని మల్లేశ్వరిపై అనుమానం పెంచుకున్నాడు బాషా. చాలాసార్లు హెచ్చరించి చూశాడు. శనివారం రాత్రి కూడా ఇరువురి మధ్య ఇదేవిషయంలో ఘర్షణ జరిగింది. తనను అనుమానిస్తే హైదరాబాద్ వెళ్లిపోతానని మల్లేశ్వరి బెదిరించింది. దీంతో కోపోద్రిక్తుడైన బాషా ఇంట్లో ఉన్న నవారుతో ఆమెకు ఉరి వేసి.. ఏమి తెలియనట్లు నటించాడు. తాను రావడానికి ముందే మల్లీశ్వరి ఉరి వేసుకుందని చుట్టుపక్కలవారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి బాషాను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా మల్లీశ్వరిని తానే చంపానని బాషా అంగీకరించాడు. దీంతో బాషాపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. -
చెర్లోపాళెం దుర్ఘటన మృతుల వివరాలు
-
చెర్లోపాళెం దుర్ఘటన మృతుల వివరాలు
కందుకూరు: ప్రకాశం జిల్లా కందుకూరుకు సమీపంలోని చెర్లోపాళెం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో 15 మంది పేర్లు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 15 మంది మృతిచెందినట్లు తెలిసింది. వీరిలో మహిళలు, చిన్నారుల సంఖ్యే ఎక్కువ. ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. గాయపడ్డ మరో 25 మంది స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయినవారి పేర్లు.. 1. సమాధి నాగమ్మ(45) 2. మోటుపల్లి పద్మ(35) 3. సన్నబోయిన రాజమ్మ(40) 4. నక్కల సుభాషిణి(25) 5. కొల్లి సుశీల(40) 6. సన్నబోయిన చందు(12) 7. శ్రీలేఖ(11) 8. ఆదినారాయణ(9) 9. సమాధి రంగయ్య(50) 10. హజరత్తయ్య(40) 11. వెంకటేశ్వర్లు(45) 12. తోలేటి చిరంజీవి (40) 13. తులగాల సుబ్బయ్య(70) 14. రాయిన సుబ్బయ్య(70) 15. తోడేటి ప్రసాద్(30) -
ఆ ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడంటే...
-
బస్సు, లారీ ఢీ: ఒకరు మృతి
-
కూలీలను కబళించిన మృత్యువు
కూలికి వచ్చిన తమను విధి చిన్నచూపు చూస్తుందని వారు ఊహించలేదు. ద్విచక్ర వాహనం రూపంలో మృత్యువు ఎదురొస్తుందని తెలియనేలేదు. పని ముగించుకుని సొంతూరికి బయలుదేరిన కొద్దిసేపటికే వారి బతుకులు తెల్లారిపోయాయి. లారీ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ సమీపంలో శనివారం జరిగిన ఈ ఘటన జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. వినుకొండ /ఈపూరు : ఈపూరు మండలం అంగలూరు పంచాయతీ పరిధిలోని శ్రీనగర్ గ్రామం నుంచి పశువుల ఎరువును లారీలో లోడు చేసుకుని కూలీలు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామం వెళ్తున్నారు. లారీ క్యాబిన్లో డ్రైవర్‌తో పాటు మరో 7గురు ప్రయాణిస్తున్నారు. వీరిలో 6 ఏళ్ళ బాలిక కూడా ఉంది. బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు మువ్వా గంగమ్మ, హనుమంతురావులు ద్విచక్రవాహనంపై వినుకొండ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. కొండ్రముట్ల సమీపంలో ద్విచక్రవాహనం వేగంగా ఎదురుగా వస్తుండటంతో, దానిని తప్పించేందుకు లారీని రోడ్డు పక్కకు తీస్తుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న లోతైన కాలువలో పడిపోయింది. దీంతో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు అయింది. ద్విచక్ర వాహనం కూడా అదుపు తప్పటంతో వారికి కూడా తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదంలో యర్రగొండపాలెంకు చెందిన డ్రైవర్ షేక్ మౌలాలి, యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామానికి చెందిన గోపినీడు పెదవెంకటేశ్వర్లు, కన్నమనీడు పెద వెంకటేశ్వర్లు, మువ్వా సుందరమ్మ, మువ్వా మంగమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పొక్లెయిన్ సాయంతో క్యాబిన్ నుంచి బయటకు తీశారు. సంఘటనలో తీవ్ర గాయాలైన వాదంపల్లికి చెందిన దుగ్గినీడు ఆదిలక్ష్మి, చింతల పెదవెంకటేశ్వర్లు, మూడమంచు వెంకటేశ్వర్లు, మూడమంచు గంగమ్మ, మూడమంచు పెదవెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటకు చెందిన మువ్వా గంగమ్మ, మువ్వా హనుమంతరావులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో మువ్వా గంగమ్మ, హనుమంతరావుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సంఘటనా ప్రాంతాన్ని పట్టణ సీఐ శ్రీనివాసరావు, ఈపూరు ఎస్ఐ ఉజ్వలకుమార్ పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు సంఘటనా ప్రాంతం లో సహాయక చర్యలు చేపట్టారు. మృత్యుంజయరాలు కౌశల్య.. కర్ణాటకలో ఉండే ఆరేళ్ల కౌశల్య శుక్రవారం అమ్మమ్మ వద్దకు వచ్చింది. అమ్మమ్మ కూలి పనులకు వస్తుండటంతో ఇంటి వద్ద ఎవరూ లేకపోవటంతో వారితో పాటు కౌశల్య లారీలో వచ్చింది. అయితే జరిగిన ప్రమాదంలో కౌశల్యకు ఎలాంటి గాయాలు కాకపోవటం విశేషం. -
ఏసీబీ వలలో అవినీతి చేప
-
మళ్లీ అడ్డంగా దొరికారు
-
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు తెరలేపింది'
ఒంగోలు: ఓటుకు కోట్లు కేసులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుఉ ప్రజా సమస్యలను గాలికి వదిలిలేశారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన ప్రకాశం జిల్లా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ కుయుక్తులకు తెరలేపిందని, అక్రమాలకు పాల్పడాలని చూస్తొందన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలపు ఖాయమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
ఓటుకు నోటు సిగ్గు చేటు
ప్రకాశం : ఓటుకు నోటు సిగ్గు చేటని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు ధర్నా చేపట్టారు. మంగళవారం ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఈ ధర్నాలో పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు నోటు సిగ్గుచేటని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొని ప్రసంగించారు. -
టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక రసాభాస
ప్రకాశం: టీడిపీ ప్రకాశం జిల్లా అధ్యక్ష ఎన్నికల సమావేశం రసాభాసగా మారింది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ఒక వర్గం నినాదాలు చేసింది. మరో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి ఆపదవి ఇవ్వాలని మరో వర్గం పోటాపోటీగా నినాదాలు చేసింది. దీంతో తీవ్ర గందరగోళం నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్ష ఎన్నిక వాయిదా వేశారు. -
చిత్రరూపంలో రామాయణ ఘట్టాలు
-
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం వేకువజామున దోపిడీ జరిగింది. ప్రకాశం జిల్లాలోని దావర- ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్ల సమీపంలో గుర్తు తెలియని దుండగులు రైలును ఆపి. ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6 బోగీల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. మారణాయుధాలతో ప్రయాణికులను బెదిరించి నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఈ విషయమై బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదుచేశారు. -
లారీ బోల్తా,ఆరుగురు మృతి
-
నేడు పేట మీదుగా ప్రకాశం జిల్లాకు వైఎస్ జగన్
చిలకలూరిపేట: పేట మీదుగా గురువారం ప్రకాశం జిల్లా వెళుతున్న వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలకాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. యద్దనపూడిలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి దివంగత గొట్టిపాటి నరసయ్య విగ్రహావిష్కరణకు వైఎస్ జగన్ చిలకలూరిపేట జాతీయరహదారి మీదుగా వెళుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట నియోజకవర్గంలోని పార్టీ నాయకు లు, కార్యకర్తలు, అభిమానులు ఉదయం 9.30 గంటలకు నరసరావుపేట సెంటర్ వద్దకు చేరుకొని జననేతకు ఘన స్వాగతం పలకాలని కోరారు. -
కూలీ పనులు చేసుకునే బాలికల పై అత్యాచారం
-
ప్రకాశంలో టీడీపీ నేతల దౌర్జన్యం
ఒంగోలు: మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారనే అక్కసుతో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేశారు. టంగుటూరులో ఆదివారం అర్ధరాత్రి టీడీపీ నేతలు ముస్లింల ఇళ్లపై దాడులుకు దిగి విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్, బైక్‌లు ధ్వంసం చేశారు. దీంతో మహిళలు, పిల్లలు భయంతో వణికిపోయారు. ఆదివారం తొలివిడత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. -
ప్రకాశం జిల్లాలో డిగ్రీ విద్యార్థి దారుణ హత్య
-
మార్కాపురంలో నాగుర్ అనే వ్యక్తి హత్య
ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాగుర్ అనే వ్యక్తి హత్యకు గురైయ్యాడు. శనివారం అర్థరాత్రి ఒంటరిగా ఉన్న నాగుర్పై కొందరు దుండగులు దాడి చేసి, అతడి కళ్లలో కారం చల్లి కత్తులలో పొడిచారు. దాంతో నాగుర్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నాగుర్ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. నాగుర్ మృతిపై అతడి కుటుంబసభ్యుల సమాచారం అందించారు. అయితే నాగుర్ మృతిపై హత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లా ఓటర్లు 16,86,020
జిల్లా ఓటర్ల తుది జాబితా ఖరారైంది. గత ఏడాది నవంబర్‌లో మొదలు పెట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈ జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 16,86,020కి చేరింది. ఈ సారి నాలుగు శాతం ఓటర్లు పెరిగారు. అయితే యువ ఓటర్లు మాత్రం ఒక శాతమే పెరిగారు. విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఎట్టకేలకు జిల్లా ఓటర్ల జాబితా తయారైంది. గత ఏడాది నవంబర్‌లో ఓటర్ల సవరణ ప్రక్రియను మొదలుపెట్టారు. అవగాహన సదస్సులు, ఓటర్ల నమోదు కార్యక్రమాలు, ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన తర్వాత దాదాపు నాలుగు శాతం మంది కొత్త ఓటర్లు తాజా జాబితాలో చోటు సంపాదించారు. ఈ సారి కూడా జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయి కావడం విశేషం. తాజా జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 16,86,020కి చేరింది. ఇందులో పురుషులు 8,31,743 మంది, మహిళలు 8,54,170 మంది ఉండగా ఇతరులు 107 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 67,308 ఓట్లు అదనంగా పెరి గాయి. ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముం దు జిల్లాలో 16,18,712 మంది ఉండే వారు. ఇందులో పురుషులు 7,99,382 మంది కాగా, మహిళలు 8,19,225మంది, ఇతరులు 105 మంది ఉన్నారు. కానీ చేర్పులు, తొలగింపుల తర్వాత 67,308 ఓట్లు అదనంగా పెరిగాయి. ఇక కొత్తగా సుమారు 89వేల ఓట్లు చేరగా, సుమారు 22 వేల ఓట్లను తొలగించారు. మొత్తంగా నాలుగు శాతం ఓట్లు పెరిగినట్లు అంచనా. అయితే కొత్తగా చేరిన యువ ఓట్లు 1శాతం లోపే ఉండడం కాసింత నిరాశకు గురి చేస్తోంది. -
ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిన మహిళలు
-
వాగులో చిక్కుకున్న బస్సులు
-
‘ఆధార్’ లేకుంటే గ్యాస్ భారమే!
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో ఆధార్‌కార్డులు లేని వారికి గ్యాస్ కష్టాలు తప్పేట్టు లేవు. కొందరు ఆధార్ నమోదులో పాల్గొన్నా కార్డులు ఇప్పటికీ చేరలేదు. జిల్లాలో అక్టోబర్ నుంచి నగదు బదిలీ పథకం అమలుకానుంది. ఇప్పటికే మొదటి విడతలో ఐదు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలు అవుతోంది. రెండో విడతలో పొరుగున్న ఉన్న ప్రకాశం జిల్లాలో సెప్టెంబర్ నుంచి ఈ పథకం అమలుకానుంది. అధిక సంఖ్యలో ప్రజలు అధార్ నమోదు ప్రక్రియలో భాగస్వాములు కాలేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 29.74 లక్షల జనాభా ఉండగా వీరిలో 25 లక్షల మంది ఆధార్ నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 20.60 లక్షల మందికి మాత్రమే ఆధార్‌నంబర్లు ‘జనరేట్’ అయ్యాయి. గ్యాస్ ఏజెన్సీలకు వివరాలు అందించింది 1.90 లక్షల మంది జిల్లాలో మొత్తం 5,35,137 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆధార్, బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కేవలం లక్షా 90 వేల మంది మాత్రమే వివరాలు అందించారు. నగదు బదిలీ పథకం అమలైతే వీరంతా అర్హులు అవుతారు. మిగిలిన లబ్ధిదారులంతా గ్యాస్ సిలిండర్‌ను రూ.990కి కొనుగోలు చేయకతప్పదు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలు అవుతోంది. ఆయా ప్రాంతాల్లో వినియోగదారులు వివరాలు అందచేయకపోవడంతో గ్యాస్‌ను రూ.990కి కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. 15 రోజుల్లో వివరాలు అందించాలి : జేసీ 15 రోజుల్లోగా ఆయా గ్యాస్ ఏజెన్సీలకు ఆధార్, బ్యాంక్ ఖాతా, కుటుంబసభ్యుల వివరాలు తప్పనిసరిగా అందించాలి. ఆధార్‌కార్డులు అందని వారు ‘యూఐడీ, ఈఐడీ నంబర్లను అందచేయవచ్చు. త్వరలో గ్యాస్ వినియోగదారుల వివరాలను బ్యాంక్ ఖాతా నంబర్లతో అనుసంధాన ప్రక్రియ జరగనుంది. వినియోగదారులంతా త్వరితగతిన వివరాలందించాలి. అలాగే రేషన్‌కార్డుదారులు కూడా, బ్యాంక్ ఖాతా వివరాలను రేషన్‌దుకాణాల్లో అందజేయాలి.