ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో ముగ్గురు చిన్నారులు మృతిచెందగా, మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన కొత్తడొంకలో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. దాదాపు ఎనమిదేళ్ల వయసున్న చిన్నారులు గుడిమెట్ల నవదీప్, కట్టా మణికంట, ప్రేమ్‌చంద్‌తో పాటు బాలుడి సోదరి సింధే ప్రేమ జ్యోతి స్కూలు నుంచి ఇంటికొచ్చారు. అయితే వారి ఇంటి పక్కన నిర్మాణంలో ఉన్న భవనం వద్దకెళ్లి ఆడుకుంటున్నారు.