wall collapse
-
ప్రహరీ కూలి ముగ్గురు కూలీల దుర్మరణం
మంచిర్యాల క్రైం: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ముగ్గురు కూలీలు నిర్మాణ పనులు చేస్తూ ప్రహరీ గోడ కూలి దుర్మరణం చెందారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకున్న ఈ దుర్ఘటన వివరాలిలా.. స్థానిక బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో నందిని ఆస్పత్రి నిర్వాహకులు నూతన భవనం నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం రుద్రపురం గ్రామానికి చెందిన ఏనంక హన్మంత్(35), బాబాపూర్‌కు చెందిన ఆత్రం శంకర్(40), చింతలమానెపల్లికి చెందిన గోలేం పోషం(50) సెల్లార్లో పనులు చేస్తున్నారు. పనుల్లో భాగంగా పిల్లర్ల మధ్యలో మట్టి, బండలు నింపుతుండగా పక్కనే ఉన్న పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలి పోషం, శంకర్, హన్మంత్‌పై పడడంతో దానికింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. వీరి పక్కనే పనిలో ఉన్న రాములును మరో ఇద్దరు కూలీలు లాగడంతో స్వల్ప గాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు, స్థానికులు రెండు గంటలపాటు డ్రిల్లర్, జేసీబీ సాయంతో శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. çమృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మిక సంఘాలు డిమండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. ఘటనాస్థలాన్ని అదనపు కలెక్టర్ రాహుల్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించి ప్రమాద వివరాలు సేకరించారు. -
నిద్రలోనే తెల్లారిన బతుకులు.. ఒక్కొక్కరికి రూ.4లక్షల పరిహారం
సాక్షి, సూర్యాపేట: నిద్రలోనే ముగ్గురి బతుకులు తెల్లారిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు బాగా తడిసిన ఇంటి గోడ కూలడంతో వృద్ధ దంపతులతో పాటు కుమారుడు దుర్మరణం చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలోని నాగారం మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. శీల రాములు(90), రామక్క (83) దంపతులు తమ చిన్న కుమారుడు, ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీను(38)తో కలిసి చిన్న రేకుల ఇంట్లో జీవిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీను భార్య.. పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. కాగా బుధవారం రాత్రి రోజూ మాదిరిగానే శిథిలావస్థకు చేరిన ఆ రేకుల ఇంట్లోనే ఓ గదిలో ముగ్గురు కలిసి ఒకే చోట నిద్రించారు. వర్షాలకు ఇంటి గోడలు బాగా తడవడంతో రాత్రి సమయంలో మధ్య గోడ కూలి వారి మీద పడటంతో ముగ్గురూ నిద్రలోనే విగతజీవులుగా మారారు. గురువారం సాయంత్రం విద్యుత్ సిబ్బంది మీటర్ రీడింగ్ తీసేందుకు ఆ ఇంటికి రాగా ఎప్పుడూ బయట కూర్చునే వృద్ధదంపతులు కనిపించకపోవడం, ఇంటి గడియ లోనికి వేసి ఉన్నా ఎవరూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. స్థానికులతో కలిసి గోడల మట్టిని తొలగించగా మృతదేహాలు కన్పించాయి. పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒక్కొక్కరికి రూ.4లక్షల పరిహారం విషయం తెలిసిన వెంటనే మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొరికి రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. తక్షణ సహాయంగా రూ. 25 వేల చొప్పున మొత్తం రూ. 75వేలు మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా అందజేశారు. వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యావకాశం కల్పించడంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. చదవండి: భారీ వర్షాలు, వరదలు.. ‘ధ్రువీకరణ’ వరదపాలు. వరంగల్ విద్యార్థుల గోస -
కూలిన కుటుంబం.. సూర్యాపేటలో విషాదం
సాక్షి, సూర్యాపేట: తల్లిదండ్రులను చూసేందుకు ఇంటికి వచ్చిన కొడుకు.. ఆ తల్లిదండ్రులతో కలిసి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ ఇంటి గోడ కూలి మట్టిపెళ్లల కింద నలిగి ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. సూర్యపేట జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. నాగారం మండల కేంద్రంలో శీలం రాములు తన భార్య రాములమ్మ, కొడుకు శ్రీనివాస్(35)తో ఉంటున్నాడు. అయితే కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు శ్రీను హైదరాబాద్‌కు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల్ని చూసేందుకు ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి భారీగా గాలి దుమారం వీచింది. అప్పటికే ఆ ఇంటి మట్టి గోడలు వర్షాలకు నానిపోయి ఉండడంతో.. అవి కుప్పకూలి ఆ ముగ్గురి మీద పడినట్లున్నాయి. గురువారం ఉదయం విద్యుత్ శాఖ ఉద్యోగి కరెంట్ బిల్లు ఇచ్చేందుకు వెళ్లే వరకు ఆ ఇల్లు కూలిన విషయాన్ని ఎవరూ గమనించకపోవడం గమనార్హం. దీంతో.. ఆ ఉద్యోగి స్థానికులను అప్రమత్తం చేశాడు. అయితే అప్పటికే మట్టిపెళ్లల కింద చిక్కుకుని రాములు, రాములమ్మ, శ్రీను ప్రాణం విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ట్రాక్టర్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిద్రలోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఖాళీ స్థలంలో ఆడుకుంటుండగా కుప్పకూలిన గోడ.. హైదరాబాద్‌లో విషాదం
సాక్షి, హైదరాబాద్: గోడకూలి ఓ బాలుడు మృతి చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. కాచిగూడ ఇన్స్పెక్టర్ రామ లక్ష్మణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ నుంచి బండి సింగ్, సేవారాజ్ కుటుంబాలు నగరానికి వలస వచ్చి కూలీ పనిచేసుకుంటూ కాచిగూడ, నింబోలిఅడ్డలో నివాలముంటున్నారు. బండి సింగ్ కుమారుడు ధీరూ సింగ్ (6), సేవా రాజ్ కుమార్తె రాధిక (5) తమ ఇంటి సమీపంలో ఉండే ఖాళీ స్థలంలో ఆడుకుంటుండగా గోడకూలి చిన్నారి ధీరూ సింగ్ అక్కడికక్కడే మరణించగా, రాధిక తీవ్రంగా గాయపడింది. రాధికను కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాలికను అక్కడి నుంచి మరింత మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా నిర్మాణం వల్లే.. ఖాళీ స్థలానికి అనుకుని పక్కనే ఉన్న స్థలంలో సత్యేందర్ నూతనంగా ఇంటి పిల్లర్ల నిర్మాణం చేపడుతున్నాడు. ఇంటి నిర్మాణం చేపడుతున్న సమయంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఇంటి నిర్మాణపు పనులు చేపడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంటి యజమాని సత్యేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రామలక్ష్మణ రాజు తెలిపారు. సంఘటన స్థలాన్ని కాచిగూడ పోలీసులు సందర్శించి వివరాల సేకరించారు. చదవండి: Hyderabad: ఐటీ కారిడార్‌లో దారుణం -
ఘోర ప్రమాదం.. గోడ కూలి 10 మంది దుర్మరణం!
లక్నో: భారీ వర్షాలు, వరదలు ఉత్తర్‌ప్రదేశ్‌లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఇటావా జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రెండు వేరు వేరు ప్రాంతాల్లో గోడలు కూలిపోయి మొత్తం 10 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటావాతో పాటు ఫిరోజాబాద్, బలరాంపుర్ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇటావా చంద్రపురా ప్రాంతంలో ఇంటి గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందగా.. క్రిపాల్‌పుర్ ప్రాంతంలో పెట్రోల్ పంపు ప్రహారీ గోడ కూలి గుడిసెపై పడగా వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో అందావా కే బంగ్లా గ్రామంలో ఇంటి గోడ కూలిపోయి 35 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇటావా గ్రామంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు -
లక్నోలో ఘోర ప్రమాదం.. గోడ కూలి తొమ్మిది మంది దుర్మరణం!
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం సంభవించింది. భారీ వర్షాల ధాటికి గోడ కూలి తొమ్మిది మంది మృతి చెందారు. లక్నో దిల్‌ఖుషా ప్రాంతంలో శుక్రవారం వేకువ ఝామున ఈ ఘటన జరిగింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ సూర్య పాల్.. అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. దిల్‌ఖుషా ఏరియాలో గుడిసెల్లో కొందరు కార్మికులు నివసిస్తున్నారు. ఆర్మీ ఎన్క్లేవ్ గోడను ఆనుకుని వాళ్లు గుడిసెలు వేసుకున్నారు. ఈ క్రమంలో.. గత ఇరవై నాలుగు గంటల నుంచి వాన కురుస్తూనే ఉంది. గోడ కూలి ప్రమాదం జరిగింది అని లక్నో పోలీస్ జాయింట్ కమిషనర్ పీయూష్ మోర్డియా వెల్లడించారు. తొమ్మిది మృతదేహాలను ఘటన జరిగిన వెంటనే దిబ్బల నుంచి వెలికి తీశామని, మరొకరు సజీవంగా బయటపడ్డారని ఆయన తెలిపారు. మరో చోట గోడ కూలిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. Lucknow city wall collapsed after Heavy #Rain near-Dilkusha in #Lucknow#HeavyRain #UP pic.twitter.com/bVPaz25gUB — Himanshu dixit 🇮🇳💙 (@HimanshuDixitt) September 16, 2022 -
ఘోర ప్రమాదం.. గోడ కూలి పాప, మహిళ మృతి
సాక్షి, బెంగళూరు: డెంకణీకోట పట్టణంలోని ఉరుసు జాతరలో ఘోరం సంభవించింది. గోడ కూలడంతో ఓ పాప, మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. పట్టణంలోని యారబ్ దర్గాలో కొన్నిరోజులుగా ఉరుసు జరుగుతోంది. ఇందులో అసోం రాష్ట్రానికి చెందిన వారు అంగళ్లను ఏర్పాటు చేసుకొన్నారు. బుధవారం ఉరుసు ముగింపు సందర్భంగా అంగళ్లను ఖాళీ చేస్తుండగా పాత రాతి గోడ కూలిపోయింది. రాళ్ల కింద చిక్కి అసోం రాష్ట్రానికి చెందిన హామియాబేగం (35), రబికుల్ ఇస్లాం (22), సాధ్ ఆలీ (35), డెంకణీకోట జైవీధికి చెందిన బాలాజీ కూతురు సహన (11), వెంకటేష్ కూతురు హేమావతి(12)లు చిక్కుకొన్నారు. వెంటనే స్థానికులు వారిని బయటకు తీసి చికిత్స కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా హామియాబేగం, సహన మృతి చెందారు. మిగతా ముగ్గురికి డెంకణీకోట ప్రభుత్వ ఆస్ఫత్రిలో చికిత్సలందజేస్తున్నారు. ఈ ఘటనపై డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: బెంగళూరులో ఏకధాటిగా వర్షాలు.. 1989 తరువాత ఇదే తొలిసారి -
విషాదం.. గోడ కూలి ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి!
రాయ్‌పుర్: స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ఇంటి గోడ కూలిపోయి ముగ్గురు పిల్లలు సహా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కంకెర్ జిల్లాలో సోమవారం జరిగింది. పఖంజోర్ ప్రాంతం, ఇర్పానార్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ శలభ్ సిన్హా తెలిపారు. గోడ కూలిపోయిన సమయంలో బాధితులు ఇంట్లో నిద్రిస్తున్నారని వెల్లడించారు. ప్రమాదం సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు గ్రామానికి చేరుకుని పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అందాల్సిన సాయాన్ని వెంటనే అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అతి కష్టంపై అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్, కోర్బా, ముంగేలి, గరియాబంద్, రాయ్‌పుర్, దుర్గాంద్ ధంతారి జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: ప్రేమ పెళ్లి.. పది నెలలకే ఊహించని దారుణం! -
వానకు ఇల్లు కూలి తల్లీబిడ్డ మృతి.. 2 నెలల కిందే అమ్మాయికి వివాహం
నల్లగొండ: అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డకు రెండు నెలల కిందే పెళ్లి చేసింది. ఆషాఢ మాసం కావడంతో ఆచారం ప్రకారం ఆ బిడ్డ వారం కింద తల్లి వద్దకు వచ్చింది. గురువారం రాత్రి కలిసి అన్నం తిన్నారు. ముచ్చట్లు చెప్పుకొంటూ పడు కొన్నారు. కానీ జోరు వానకు మట్టిగోడ తడిసి ఇల్లు కూలిపోయింది. దానికింద కూరుకుపోయి తల్లీబిడ్డ ఇద్దరూ కన్నుమూశారు. నల్లగొండ పట్టణంలోని పద్మానగర్‌లో ఈ ఘటన జరిగింది. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం మాకివలస గ్రామానికి చెందిన నడిపూరి లక్ష్మి (47), ఆమె కుమార్తె కల్యాణి (21)గా గుర్తించారు. రెండు నెలల కిందే పెళ్లి చేసి.. మాకివలసకు చెందిన లక్ష్మి భర్త నాయుడు ఆర్థిక ఇబ్బందులతో పదేళ్ల కింద ఆత్మహత్య చేసుకు న్నాడు. దీనితో పిల్లలు భాస్కర్‌రావు, కల్యాణి ఇద్దరినీ ఆమెనే పోషిస్తోంది. నల్లగొండలోని పద్మా నగర్‌కు వలస వచ్చి మూడేళ్లుగా రైల్వే కూలీలకు వంట చేసి పెడుతూ జీవిస్తోంది. కల్యాణికి మే 14న శ్రీకాకుళం జిల్లా ధర్మూర్ మండలానికి చెందిన బంధువుల అబ్బాయి శ్రీనుతో వివాహం చేసింది. బిడ్డ, అల్లుడు శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటున్నారు. ఆషాఢ మాసం కావడంతో కల్యాణి వారం క్రితమే తల్లి దగ్గరికి వచ్చింది. శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో కుమారుడు బయటపడ్డాడని స్థానికులు చెప్తున్నారు. మృతదేహాలను అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తీసుకెళ్లారు. -
గోడ కూలుతుందని చెప్పినా వినలేదు
వరంగల్/రామన్నపేట: పాతకాలం నాటి మట్టి గోడను కదిలిస్తే కూలిపోతుందని యజమానికి, మేస్త్రీకి ఎంత చెప్పినా వినిపిం చుకోలేదు. యజమాని, మేస్త్రీలు కలసి నిర్ల క్ష్యంగా గోడను కదిపి కూలీల జీవితాలను నిలువునా కూల్చివేశారు. వరంగల్ నగరంలో గిర్మాజిపేటలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గిర్మాజిపేట కు చెందిన ముజామిల్ షరీఫ్ అనే వ్యక్తి పాత భవనం కొనుగోలు చేసి మరమ్మతులు చేపట్టాడు. ఈ భవనం పక్కనే ఉన్న మరో భవనానికి మధ్య ఒక్కటే అడ్డుగోడ ఉంది. దీనిని కూల్చేందుకు ఆ భవనం యజమాని అంగీకరించలేదు. పాతకాలం నాటి గోడ కా వడం వల్ల ఎక్కువ మందం (సుమారు 18 ఇంచులు)ఉంది. అందులో తనకు చెందిన 9ఇంచుల వరకు బెడ్ పోసుకునేందుకు పక్క భవనం యజమాని అంగీకరించాడు. ఈ నిర్మాణ పనులను షరీఫ్ తాపీ మేస్త్రీ శ్రీను అనే వ్యక్తికి అప్పగించాడు. 18ఇంచుల గోడ లో సగం 9ఇంచుల వరకు గాలా తీసి అందులో ఇనుప రాడ్లు పెట్టే క్రమంలో పాత గోడ ఒక్కసారిగా కూలిపోయి అక్కడే పనిచేస్తున్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో దేశా యిపేటకు చెందిన సబీరాం సాగర్(26), సుందరయ్యనగర్‌కు బోసు సునీత(24)లు అక్కడికక్కడే చనిపోయారు. మేస్త్రీతోపాటు మరో కూలీ జ్యోతి కొద్దిపాటి గాయాలతో బయట పడ్డారు. అనాథలైన పిల్లలు.. గోడ కూలిన ఘటనలో చనిపోయిన సునీత భర్త ఎనిమిది నెలల క్రితం చనిపోయాడు. ఈమెది మంచిర్యాల కాగా, పని కోసం నగరానికి వచ్చి సుందరయ్య కాలనీలో అత్తతో కలిసి నివాసం ఉంటోంది. ఈమెకు ముగ్గురు పిల్లలు. సునీత చనిపోవడంతో వృద్ధురాలు, పిల్లలు అనాథలయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోషించే కోడలు చనిపోవడంతో ముగ్గురు పిల్లలతోపాటు తాను ఎలా బతకాలని వృ ద్ధురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇంటికి పెద్దదిక్కు పోయాడు దేశాయిపేటకు చెందిన సబీరాం సాగర్ తండ్రి సూరిబాబు తోళ్ల కార్ఖానాలో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. కార్ఖానాలు మూతపడటంతో జీవనోపాధి లేకపోవడం తో సాగర్ చదువును మధ్యలోనే ఆపి భవన నిర్మాణ రంగంలో సలాక(ఐరన్) కార్మి కుడిగా మారాడు. రోజూ కూలీకి వెళ్తూ తమ్మున్ని చదవిస్తున్నాడు. సాగర్ చనిపో వడంతో కుటుంబం మొత్తం రోడ్డున పడింది. -
పాఠశాలలో గోడ కూలి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
చెన్నై: పాఠశాలలో వాష్‌రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తిరునెల్వేలిలో ఉన్న షేఫర్ హయ్యర్ సెకండరీ బాయ్స్ ప్రైవేట్ పాఠశాలలో శుక్రవారం ఉదయం సంభవించింది. విద్యార్ధులు మూత్ర విసర్జను వెళ్లగా మరుగుదొడ్డి గోడ కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో మరణించిన ముగ్గురు చిన్నారులు అన్బళగన్ (9వ తరగతి), విశ్వరంజన్ (8వ తరగతి), సుతేష్ (6వ తరగతి)గా గుర్తించినట్లు స్కూల్ యాజమాన్యం పేర్కొంది. గాయపడిన విద్యార్థులను సంజయ్ (8వ తరగతి), ఇసాకి ప్రకాష్ (9వ తరగతి), షేక్ అబూబకర్ కిదానీ (12వ తరగతి), అబ్దుల్లా (7వ తరగతి)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన విద్యార్థుల మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిని వారికి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సానుభూతి తెలిపారు. అలాగే మరణించిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు ప్రకటించింది. చదవండి: ప్లీజ్ సార్, వెళ్లొద్దు.. బోరున విలపిస్తు రోడ్డెక్కిన విద్యార్థులు కాగా ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని, అప్పుడే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని తిరునెల్వేలి పోలీసులు తెలిపారు. మరోవైపు గోడ కూలిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళన చేశాయి. పాఠశాలలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశాయి. అయితే స్కూల్ భవనం పాతబడిందని, కరోనా కారణంగా ఏడాదిన్నరపాటు అది మూతపడి ఉండగా.. ప్రభుత్వం అనుమతివ్వడంతో ఇటీవల స్కూల్‌ను తెరిచారని పోలీసులు తెలిపారు. అయితే, స్కూళ్లు తెరిచే ముందు పాఠశాలల పరిస్థితిని చెక్ చేసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ముందే సూచించిందని తెలిపారు. చదవండి: ఆమె సంకల్పానికి సలాం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకి.. -
విషాదం: వాకింగ్ కోసమని వెళ్లి.. మట్టి పెళ్లల కింద..
సాక్షి, రహమత్‌నగర్: వాకింగ్ కోసం వెళ్లిన ఓ వ్యక్తి మట్టి పెళ్లలు కింద మృతదేహమై కనిపించాడు. బుధవారం మిత్రుడిని కలిసి వెళ్తున్న క్రమంలో గోడ కూలి మీద పడటంతో ఆశిష్ (25) అనే యువకుడు అసువులు బాశాడు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. రహమత్‌నగర్ డివిజన్ శ్రీరాంనగర్ పోచమ్మ ఆలయం సమీపంలోని శ్రీ అనూష రెసిడెంట్ ప్రహరీ బుధవారం సాయంత్రం వర్షం కారణంగా కూలిపోయింది. స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ లేకపోవడం, వర్షం మూలంగా ఎవరి ఇళ్లలోకి వారు వెళ్లారు. సహాయక చర్యల్లో భాగంగా గురువారం ఉదయం జీహెచ్ఎంసీ సిబ్బంది జేసీబీతో మట్టి పెల్లలు తొలగిస్తుండగా అందులో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. తమ్ముడు కనిపించడం లేదని.. వాకింగ్ కోసమని వెళ్లిన తన తమ్ముడు కనిపించడం లేదని అంతకుముందు రోజు ఆశిష్ సోదరి ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. మృతుడి జేబులో ఉన్న కారు తాళం చెవిని చూసి ఆశిష్‌గా వారు గుర్తించారు. కల్యాణ్ నగర్ వెంటర్– 3కు చెందిన ఆశిష్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. నిత్యం వాకింగ్ కోసం వస్తూ అనూష రెసిడెంట్‌లో ఉండే మిత్రుణ్ని కలుస్తుంటాడు. ఈ క్రమంలోనే బుధవారం స్నేహితుడిని కలిసి వెళ్తున్న క్రమంలో గోడ కూలడంతో మృత్యువాత పడ్డాడని పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ప్రపుల్లా రెడ్డి, ఎమ్మెల్యే, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఈఈ రాజ్‌కుమార్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. రూ.కోట్ల వ్యయంతో అపార్ట్మెంట్ కట్టి ప్రహరీ నిర్మించపోవడంతోనే ప్రమాదం జరిగిందని బస్తీ వాసులు మండిపడుతున్నారు. మట్టితో కట్టిన పాత గోడతో ఎప్పుడైనా ప్రమాదం వాటిల్లవచ్చని.. దానిని తొలగించి కొత్త గోడను ఏర్పాటు చేసుకోవాలని బస్తీ వాసులు పల మార్లు అపార్ట్‌మెంటువాసులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. -
నీటిలో కలిసిన ప్రాణాలు.. కుటుంబాల్లో విషాదం
చాంద్రాయణగుట్ట: ఓ వెంచర్ నిర్వాహకుడి నిర్లక్ష్యమే చాంద్రాయణగుట్టలో ఎనిమిది అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్ తెలిపిన మేరకు.. బండ్లగూడ గౌస్‌నగర్‌లో మహ్మద్ హిల్స్ వెంచర్ పేరుతో మహ్మద్ పహిల్వాన్ కుటుంబ సభ్యులు వెంచర్‌ను చేస్తున్నారు. ఎత్తైన ప్రదేశంలో గుట్టపై ఉన్న ఈ వెంచర్‌కు ఇటీవలే భారీగా ప్రహారీ నిర్మించారు. కాగా ఈ ప్రహారీని ఎలాంటి పునాది లేకుండా బండరాళ్ల పైనే సిమెంట్ వేసి గ్రానైట్‌తో పైకి లేపారు. అనంతరం మట్టితో చదును చేశారు. అయితే ఇటీవల కురుస్తున్న భారీ వర్షానికి మట్టి కూరుకుపోవడంతో పాటు పునాది లేకపోవడంతో ప్రహారీ కూడా పట్టుతప్పి మంగళవారం రాత్రి ఒక్కసారిగా సగం మేర కూలి దిగువన ఉన్న రేకుల ఇళ్లపై పడింది. ఐదారు ఇళ్లపై గ్రానైట్లు పడినప్పటికీ....కేవలం రెండిళ్లపై ప్రభావం ఎక్కువగా చూపి అందులో ఉన్న ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి. ఒకే ఇంట్లో ఐదుగురి మృతి.. గౌస్‌నగర్‌కు చెందిన మహ్మద్ జహంగీర్ తన ఇద్దరు కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, పిల్లలతో సంతోషంగా మంగళవారం రాత్రి నిద్రించాడు. నిద్రించిన కాసేపటికే భారీ శబ్దాలు రావడంతో చిన్న కుమారుడు మహ్మద్ నవాజ్ అఖ్నీ వెంటనే బయటికి పరుగులు తీశాడు. ఇంట్లో ఉన్న జహంగీర్ కుమారుడు పెద్ద కుమారుడు సమద్ రబ్బానీ (35), కోడలు సబా హాష్మీ(26), రెండో కుమార్తె ఫౌజియా నాజ్ (36), ఆమె కుమారులు సయ్యద్ జైన్((3), జొయేద్ (19 రోజులు)లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో కుమార్తె సబియా అనాజ్ (31) తీవ్రంగా గాయపడింది. ఇలా ఒకే ఇంట్లో మొత్తం ఐదు మంది మృతి చెందారు. తల్లి, సంతానాన్ని కోల్పోయిన సిద్దిఖీ జహంగీర్ ఇంటిని ఆనుకునే సిద్దిఖీ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటిపై కూడా ఇదే మాదిరిగా గోడ కూలడంతో సిద్దిఖీ తల్లి జాకీ రా బేగం (50), కుమారుడు సయ్యద్ సాదిక్ (1), కుమార్తె సయ్యదా అన్వారీ (3)మృతి చెందారు. గౌస్‌నగర్‌లో విషాధచాయలు గౌస్‌నగర్‌లో పక్కపక్కింట్లోనే నివాసం ఉండే ఎనిమిది మంది మృత్యువాత పడడంతో స్థానికంగా తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. రాత్రి వర్షం కారణంగా రాలేకపోయిన బంధుమిత్రులు బుధవారం ఉదయమే పెద్ద ఎత్తున ఇళ్లకు చేరుకున్నారు. అనంతరం మృతదేహాలు రాకపోవడంతో పోస్టుమార్టం చేస్తున్న ఉస్మానియా ఆసుపత్రికి బయల్దేరారు. నీటిలో కలిసిన ప్రాణాలు భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. జలం మధ్యలో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జనం విలవిల్లాడారు. వరద నీటి సమస్యనుంచి బయటపడే ప్రయత్నంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. విద్యుదాఘాతంతో కార్పెంటర్ మృతి నాగోలు: కాసోజు నారాయణ చారి (35) ఎల్బీనగర్ బైరామల్‌గూడ కేకే గార్డెన్ సాగర్ ఎన్క్లేవ్ కాలనీలో నివాసముంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం కురిసిన భారీ వర్షంతో సాగర్ ఎన్క్లేవ్ కాలనీలో వరద నీరు వచ్చింది. ఇంట్లో స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయగా షార్ట్ సర్క్యూట్‌తో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా మంగళవారం రాత్రి మృతి చెందాడు. సెల్లార్ నీటిలో మునిగి చిన్నారి.. చంపాపేట: రమావత్ జితేంద్ర, లక్ష్మి దంపతులు సరూర్‌నగర్ పీఅండ్‌టీ కాలనీలోని సాహితీ నెస్ట్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వీరికి అర్జిత్సాయి (3) అనే కుమారుడున్నాడు. భారీవర్షానికి అపార్ట్మెంట్ సెల్లార్లో వరదనీరు చేరింది. బుధవారం ఉదయం ఆడుకుంటూ సెల్లార్లోకి వెళ్ళిన అర్జిత్సాయి నీటిలోకి ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అర్జిత్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. వరదలో కొట్టుకుపోయి మహిళ పహాడీషరీఫ్: మణికొండ ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు భార్య వరలక్ష్మి (32) గోషామహాల్లో జలమండలి కార్యాలయంలో స్వీపర్‌గా పని చేస్తుంది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో సోదరుడు జోగు శంకర్ వెంట బైక్‌పై ఆదిబట్ల నుంచి శంషాబాద్ వైపు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో వెళుతున్నారు. ఫ్యాబ్‌సిటీ సరస్సు నిండటంతో నీటి ప్రవాహంలో అదుపుతప్పారు. శంకర్ బయటికి వచ్చినా వరలక్ష్మి రాలేకపోయింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం రాత్రి 7 గంటలకు మృతదేహం లభించిందని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సెల్లార్లో నీటిని తోడుతూ.. అంబర్‌పే: బాగ్ అంబర్‌పేట వినాయక్‌నగర్‌లో మహాలక్ష్మి అపార్టుమెంట్ సెల్లార్లో నీరు చేరడంతో చంద్రమౌళి కుమారుడు రాజ్‌కుమార్(33) మోటార్ బుధవారం మోటార్ బిగిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడని అంబర్‌పేట పోలీసులు తెలిపారు. సెల్లార్లో షాక్.. ప్రైవేట్ ఉద్యోగి మృతి అమీర్‌పేట: గంటా శ్రీనివాస్ (47) ధరం కరం రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఐసీఐసీఐ బ్యాంకు వెనకాల సెల్లార్లో ఉన్న గోల్డెన్ కేఫ్ బార్ ఆండ్ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో వరదనీరు రెస్టారెంట్లోకి వచ్చిన సమయంలో క్యాషియర్ శ్రీనివాస్‌తో పాటు, మేనేజర్ సుబ్బారెడ్డి, మరో బాయ్‌లో లోపలే ఉన్నారు. కరెంటు పోవడంతో జనరేటర్ ఆన్‌చేశారు. తరువాత కరెంటు రావడంతో నీటిలో విద్యుత్ ప్రవహించింది. వరద నీటిలో ఉన్న షాక్ తగిలి పడిపోయాడు. అక్కడే ఉన్న మేనేజర్, బాయ్ పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్‌వైర్లు బయటకు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిని పంపింగ్ చేస్తూ వైద్యుడు.. బంజారాహిల్స్: డాక్టర్ చల్లా సతీష్‌కుమార్ రెడ్డి (49) యోగా, ఫిజియోథెరపి, నేచురోపతి స్పెషలిస్ట్‌గా శ్రీనగర్‌కాలనీలోని ఎస్బీహెచ్ కాలనీలో సేవలందిస్తున్నాడు. సతీష్‌కుమార్‌రెడ్డి ఇంటి సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. బుధవారం ఉదయం నీటిని బయటికి పంపింగ్ చేసేందుకు ఆయన మెట్లు దిగి మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. భయంతో గుండెపోటు..వృద్ధురాలి మృతి బడంగ్పేట్: బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని సాయిబాలాజీ టౌన్షిప్ కాలనీమొత్తం ముంపునకు గురైంది. మంగళవారం రాత్రి ఇంటిలోకి వరదనీరు రావడంతో భయాందోళనకు గురైన రామసహాయం రత్నమాల(65), గుండెపోటుతో చనిపోయింది. అర్ధరాత్రి కాలనీ మొత్తం జలమయం కావడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేకపోవడంతో రాత్రి మొత్తం ఇతర కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటు గడిపారు. -
నాణ్యత మహానందీశుడికెరుక !
మహానంది: మహానంది క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. పట్టుమని ఆరునెలలు కూడా కాకముందే రాజగోపురం ముందు భాగంలో రెండు సుపథ మండపాల మధ్యలో గ్రీనరీ కోసం యూ ఆకారంలో నిర్మించిన గోడ బుధవారం కూలిపోయింది. గోడల మధ్యలో వేసిన మట్టికి పైప్ ద్వారా నీరు పడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, చిన్నపాటి నీటి ఫోర్స్‌కే ఇలా జరగడంతో నిర్మాణాల్లో నాణ్యతపై స్ధానికులు, భక్తులు పెదవి విరుస్తున్నారు. దీనిపై ఈఓ మల్లికార్జునప్రసాద్ మాట్లాడుతూ సిబ్బంది ఫైర్ ఇంజన్లకు వాడే పైపుతో నీరు పట్టడం ద్వారా ఫోర్స్‌కు గోడ కూలిపోయిందని బాధ్యులపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాగా ఈ గోడ నిర్మాణానికి సుమారు రూ. 55 వేలకు పైగా ఖర్చు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. -
ఉమెన్స్ హాస్టల్లో తప్పిన పెను ప్రమాదం!
మాదాపూర్: సెల్లార్ తవ్వడంతో హాస్టల్ గోడ కూలి ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్‌లోని పత్రికానగర్‌లో మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఒక్కసారిగా సెల్లార్ పక్కనే ఉన్న గది గోడ కూలడంతో హాస్టల్లో ఉన్న వారందరూ భయభ్రాంతులకు గురయ్యారు. పత్రికానగర్‌లో సాయిసంగమేశ్వర హాస్టల్‌ను నెల్లూరు జిల్లా పంగం గ్రామానికి చెందిన శ్రీహరి అనే వ్యక్తి తల్లితో కలిసి మూడేళ్లుగా పీజీ ఉమెన్స్ హాస్టల్‌ను నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా హాస్టల్ పక్కనే భవన నిర్మాణం చేసేందుకు సెల్లార్‌ను తీస్తున్నారు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు హాస్టల్‌కి అదనంగా ఉన్న గది గోడ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో గదిలో నిద్రిస్తున్న నిర్వాహకులు వెంకటమ్మకు తీవ్రగాయాలయ్యాయి. రెండు చేతులు, వెన్నెముక దెబ్బతిన్నాయి. మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. హాస్టల్ ఖాళీ.. హాస్టల్ కింది భాగమంతా బీటలు వారడంతో ప్రమాదకరంగా మారింది. ఇందులో ఉన్నవారిని ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. దీంతో దాదాపు 70 మంది విద్యార్థినులు, వర్కింగ్ ఉమెన్స్ లగేజ్‌లు తీసుకొని వెళ్లిపోయారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులు స్థల యాజమానులపై కేసులు నమోదు చేశారు. యాజమానులు కాసు శైలజారెడ్డి, కాసు దినేష్‌రెడ్డి, సెక్షన్ ఇంజనీర్ రాజరాం తివారీ, టెక్నికల్ శ్రీశైలంలపై కేసులను నమోదు చేశారు. ఇలాంటి సెల్లార్లను తీసే సమయంలో ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇస్తూ చుట్టుపక్కల వారికి కూడా సమాచారం ఇవ్వాలి. అలాంటివి ఏమి చేయకుండా సెల్లార్లను తవ్వినట్లు అధికారులు తెలిపారు. -
ఇంటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి
-
ముగ్గురు చిన్నారులను మింగిన గోడ
నాంపల్లి: ఇంటి మధ్య గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడిన సంఘటన గురువారం రాత్రి నగరంలోని హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అఫ్జల్‌సాగర్ మాన్గార్ బస్తీలో రోజు కూలితో పొట్టపోసుకునే మిఠాయి లాల్, సీమ దంపతులు తమకున్న ఆదాయ వనరులతో పునాదులు లేకుండా సిమెంట్ ఇటుకలతో చిన్న శ్లాబ్ ఇల్లు నిర్మించుకున్నారు. అదే ఇంట్లో గబ్బార్, సురేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. మిఠాయిలాల్, సీమలకు రోష్ని (4), లక్ష్మీ (5) పావని (రెండు నెలలు) సంతానంకాగా గబ్బార్, సురేఖలకు వరలక్ష్మి (5), గీత (3), ఆరోల (2) పిల్లలుఉన్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చిన తల్లిదండ్రులు బయట వీధిలోకి వెళ్లారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో గదిలోని వంట గది దిమ్మె వేడెక్కి గదికి మధ్యలో ఉన్న గోడపై పడింది. దీంతో ఆ గోడ ఒక్కసారిగా పిల్లలపై పడటంతో మిఠాయిలాల్ దంపతుల ముగ్గురు పిల్లలూ మరణించారు. అలాగే గబ్బార్ దంపతుల పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నిలోఫర్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. -
చితికిపోయిన పేదల బతుకు
వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు. కాయకష్టం చేశారు.పొద్దుపోయాక ఇంటికి చేరుకున్నారు. భోజనాలు చేసి ఒక్కొక్కరూ నిద్రకు ఉపక్రమించారు. గాఢనిద్రలోకి జారుకున్నారు. సరిగ్గా తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ప్రహరీ గోడ కూలింది. తేరుకునేలోపే రెండు కుటుంబాలనుమింగేసింది. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా మృత్యువు మొత్తం 17 మందినిపొట్టనపెట్టుకుంది.శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని అధికారులుఅనుమానిస్తున్నారు. ఈ విషాదకర ఘటనమేట్టుపాళయంలోతీవ్ర విషాదాన్ని నింపింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: మేట్టుపాళయం సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలి 17 మంది మృత్యువాత పడ్డారు. కుటుంబాలకు, కుటుంబాలే శిథిలాల కింద నలిగిపోయాయి. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వివరాలు.. కోయంబత్తూరు జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మేట్టుపాళయం, కట్రుపుర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఎడతెరిపిలేకుండా కురిసిన వాన ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మేట్టుపాళయం సమీపం నడూరు కన్నప్పన్ లే–అవుట్లో పేరొందిన వస్త్రదుకాణం యజమాని ఇల్లు ఉంది. దీనికి సమీపంలో 50 మందికిపైగా పేద రైతులు, కార్మికులు గుడిసెలు, పెంకుటిళ్లు వేసుకుని నివసిస్తున్నారు. శివగామీ, అరుక్కానీ అనే మహిళలు మట్టితో పెంకుటిళ్లు నిర్మించుకుని కుటుంబసభ్యులతో నివాసముంటున్నారు. వస్త్రవ్యాపారి తన ఇంటికి 30 అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తులో బండ రాళ్లతో నిర్మించిన ప్రహరీ గోడ ఈ ఇళ్లకు అనుకునే ఉంది. ఇటీవల వర్షాలకు నేల మెత్తబడి, ప్రహరీ గోడ తడిసి కూలేస్థితికి చేరింది. ప్రహరీ పక్కన ఇళ్లలో నివసించే పేదలు ఆదివారం రాత్రి యథావిధిగా నిద్రించారు. శిథిలాలను తొలగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది సోమవారం తెల్లవారు జాము 4 గంటల సమయంలో ఆ ప్రహరీ గోడ పెద్ద శబ్దంతో శివగామి, అరుక్కానీ పెంకుటిళ్లపై కూలింది. ఈ రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారు. మేట్టుపాళయం పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ ప్రొక్లయిన్లను రప్పించి శిథిలాలను తొలగించగా మొత్తం 17 మంది నిద్రిస్తున్న దశలోనే ప్రాణాలువిడిచినట్టు కనిపించాయి. అరుక్కానీ, శివగామీ కుటుంబాల్లో అందరూ శిథిలాల కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. మృతుల్లో గురుస్వామి (45), రామనాథన్ (20), ఆనందకుమార్ (40), శివకామీ (45), ఓవియమ్మాళ్ (50), నిత్య (30), వైదేహీ (20), తిలకవతి (50), అరుక్కాని (55), రుక్మిణి (40), నివేదా (18), చిన్నమ్మాళ్ (70), మంగలమ్మాళ్(60), హరిసుధ (16), అక్షయ (7), లోగురాం (7), మహాలక్ష్మి (10) ఉన్నారు. శిథిలాలు పూర్తిగా తొలగిస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. శిథిలాల తొలగింపునకు కోయంబత్తూరు నుంచి ప్రకృతి వైపరీత్యాల రక్షణ దళాలను రప్పించారు. కోయంబత్తూరు కలెక్టర్ రాజామణి బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరఫున తలా రూ.4 లక్షల ఆర్థికసహాయాన్ని ప్రకటించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన వంద మందితో కూడిన బృందాన్ని రప్పించినట్లు పోలీస్‌శాఖ పశ్చిమ మండల డీజీపీ పెరియయ్యా తెలిపారు. మేట్టుపాళయంలో లాఠీచార్జీ రెండు కుటుంబాలను సమూలంగా తుడిచిపెట్టేసిన ఈ ఘోర ప్రమాదం రాష్ట్ర ప్రజలను గగుర్పాటుకు గురిచేసింది. మేట్టుపాళయం ప్రజలు ఆగ్రహానికి లోనయ్యారు. పక్కా ప్రణాళిక లేకుండా బలహీనమైన ప్రహరీ గోడ నిర్మించుకుని 17 మందిని పొట్టనపెట్టుకున్న వస్త్రవ్యాపారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించిన మేట్టుపాళయం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి బైఠాయించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా కదలక పోవడంతో లాఠీచార్జీ చేసి చెదరగొట్టాల్సి వచ్చింది. ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు మేట్టుపాళయంకు సీఎం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మంగళవారం మెట్టుపాళయంకు చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు. -
నిద్ర నుంచే అనంత లోకాలకు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అందరిలాగే వారు కూడా రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. కానీ మూసిన కళ్లు తెరవక ముందే వారి జీవితాలు ముగిసిపోయాయి. ఏం జరిగిందో గుర్తించేలోపే ప్రమాదం ముంచుకురావడంతో పడుకున్న స్థితిలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. తెల్లవారుజామున ప్రశాంతంగా నిద్రిస్తున్న రెండు కుటుంబాల్లోని 17 మందిని మృత్యుదేవత తడిసిన గోడ రూపంలో కబళించిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా మరణించిన వారిలో పది మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సమీపం నడూరు కన్నప్పన్ లే–అవుట్లో ఓ వస్త్రవ్యాపారి ఇంటి సమీపంలో 50 మందికి పైగా పేద రైతులు, కార్మికులు గుడిసెలు, పెంకుటిళ్లు వేసుకుని నివసిస్తున్నారు. ఈ ఇళ్లకు ఆనుకునే ఉన్న వస్త్రవ్యాపారి ఇంటికి 30 అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తులో బండరాళ్లతో నిర్మించిన ప్రహరీగోడ ఉంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం ధాటికి.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు పెంకుటిళ్లపై కూలింది. రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారు. మేట్టుపాళయం పోలీసులు, అగ్నిమాపక దళాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 17 మంది నిద్రిస్తున్న దశలోనే ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కోయంబత్తూరు కలెక్టర్ రాజామణి బాధితులను పరామర్శించి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మంగళవారం మేట్టుపాళయంకు వెళ్లనున్నారు. -
ఛాత్ ఉత్సవాల్లో 30 మంది మృతి
పాట్నా: గోడ కూలడం, తొక్కిసలాట, మునిగిపోవడం వంటి వాటి కారణంగా బిహార్‌లో 30 మంది మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలు బిహార్ ప్రజలు జరుపుకునే ఛాత్ పండగ సందర్భంగా శని, ఆదివారాల్లో చోటుచేసుకున్నాయి. ఇద్దరు మహిళలు గోడ కూలిన ఘటనలో, ఇద్దరు పిల్లలు తొక్కిసలాటలో, మరో 26 మంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉత్సవాల సందర్భంగా మునిగిపోయి మరణించారు. ఛాత్ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. లక్షలాది మంది ఈ పండుగను దేవాలయాల వద్ద, ఘాట్ల వద్ద స్నానాలాచరించి జరుపుకున్నారు. -
గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి
సాక్షి, ఉంగుటూరు : గోడ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణ పురంలో చోటు చేసుకుంది. రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజే కొద్దిగా వర్షం తెరిపి ఇవ్వడంతో పెద్దిరెడ్డి రాఘవమ్మ(60) అనే వృద్ధురాలు అటుగా వెలుతున్న సిరిపురపు శ్రీను(40) ఇంటిపై కవర్ కప్పాల్సిందిగా కోరింది. దీంతో శ్రీను ఇంటిపైకి బరకం వేస్తుండగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో శ్రీను, రాఘవమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. -
కూలిన నారాయణ కాలేజీ గోడ
సాక్షి, నెల్లూరు: నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. కళాశాల గోడ కూలడంతో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలు.. జిల్లాలోని అరవింద్ నగర్లో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో గోడ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ కొందరు విద్యార్థులు ఉండడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని కళాశాల సిబ్బంది వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ కానీ, యాజమాన్యం కానీ ఇంతవరకూ స్పందించలేదు. ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ప్రస్తుతం నారాయణ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టాయి. కాలేజీ లోనికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. -
ముంబై అతలాకుతలం
సాక్షి, ముంబై: ముంబైను కుండపోత వర్షాలు మంగళవారమూ స్తంభింపజేశాయి. మలద్‌లోని పింప్రిపద ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ గోడ కూలి, పక్కన గుడిసెల్లో నివసిస్తున్న 21 మంది మరణించారు. మరో 78 మంది క్షతగాత్రులయ్యారు. గత రెండ్రోజుల్లో వర్షం సంబంధిత కారణాలతో మహారాష్ట్రలో మొత్తంగా 39 మంది మరణించారని అధికారులు చెప్పారు. ఆదివారం నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్డు, రైలు, విమాన రవాణా సేవలు ప్రభావితమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ముందుగానే హెచ్చరించడంతో ప్రభుత్వం ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం సాధారణ సెలవుగా ప్రకటించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. మలద్ ప్రాంతంలో గోడ కూలిన ఘటనలో 15 ఏళ్ల బాలిక శిథిలాల కింద చిక్కుకోగా, ఆమెను రక్షించే ప్రయత్నం విఫలమైంది. శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చే సమయానికే బాలిక మృతి చెందింది. మలద్ ప్రాంతంలోనే వరద రావడంతో మరో ఇద్దరు వ్యక్తులు కారులో చిక్కుకుని చనిపోయారు. విలే పార్లే ప్రాంతంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మరణించగా, ముంబై శివారు ప్రాంతమైన ములంద్లోనూ గోడ కూలి ఓ సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోనే 25 మంది వర్షాల కారణంగా మృత్యువాత పడ్డారు. ముంబైలోని ఎయిర్పోర్ట్ కాలనీ, వకోలా జంక్షన్, పోస్టల్ కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. మిఠీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు పరివాహక ప్రాంతాల నుంచి వెయ్యి మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించాల్సిన ఓ పరీక్షను కూడా ముంబై విశ్వవిద్యాలయం వాయిదా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండ్రోజులపాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్యన ఉన్న 24 గంటల్లో ముంబైలో 16.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైకి తూర్పున ఉన్న శివారు ప్రాంతాల్లో 32.9 సెంటీ మీటర్లు, పడమరన ఉన్న శివారు ప్రాంతాల్లో 30.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 203 విమానాల రద్దు.. మరో 55 దారి మళ్లింపు మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలో ప్రజా రవాణా సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాతావరణం సహకరించని కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాల్లో 203 పూర్తిగా రద్దవ్వగా, మరో 55 దారి మళ్లాయి. మరో 350 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గురువారం వరకు విమానాశ్రయంలో ప్రధాన రన్‌వే మూసి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య, పశ్చిమ రైల్వే జోన్లకు సంబంధించిన అనేక దూరప్రాంతపు రైళ్లను కూడా రద్దు చేశారు. మరిన్ని రైళ్లు గమ్యస్థానం చేరకుండానే మధ్యలో నిలిచిపోయాయి. పట్టాలపైకి నీరు రావడం తో లోకల్ రైళ్లు కూడా కొన్ని చోట్ల దారి మధ్యలోనే నిలిచిపోయాయి. రైళ్లలో చిక్కుకున్న వేలాదిమంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ జవాన్ల సాయంతో మధ్య రైల్వే సిబ్బంది రక్షించి, వారికి తేనీరు, ఆహార పదార్థాలు అందించారు. పశ్చిమ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ తమ సబర్బన్ రైలు సేవలు చర్చిగేట్, విరార్‌ల మధ్య సాధారణం కన్నా తక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయని చెప్పారు. రోడ్లన్నీ నీళ్లతో నిండటంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం కలిగింది. పుణేలోనూ ఆరుగురు.. ఇక మహారాష్ట్రలోని రెండో అతిపెద్ద నగరం పుణేలోని అంబేగావ్‌లో సోమవారం రాత్రి పొద్దుపోయాక గోడ కూలడంతో ఆరుగురు కార్మికులు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఠాణే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలోనూ మంగళవారం ఉదయం గోడ కూలి ముగ్గురు మరణించారు. బుల్ధానా జిల్లాలో పిడుగు పడటంతో 52 ఏళ్ల మహిళ చనిపోయింది. నాసిక్ జిల్లాలో మంగళవారం నీళ్ల ట్యాంకు కూలి నలుగురు కూలీలు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర కొంకణ్ ప్రాంతం మొత్తం రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. కాగా, ప్రభుత్వాల అవినీతి కారణంగానే ముంబై, పుణేల్లో గోడలు కూలి ప్రజలు చనిపోయారని ప్రతిపక్ష పార్టీలు మంగళవారం అధికార బీజేపీ, శివసేన పార్టీలపై విరుచుకుపడ్డాయి. నగరాన్ని నీళ్లతో ముంచేసినందుకు ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఉండే ప్రాంతమైన బాంద్రాలోని కళా నగర్ కూడా నీట మునిగిందని, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఠాక్రే తమ ఎంపీలతో గుళ్లు, గోపురాలకు తిరగకుండా తమ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని ఎద్దేవా చేశారు. అదే స్ఫూర్తి.. భారీ వర్షాలతో కష్టాల్లో చిక్కుకున్న వారికి నగర ప్రజలు ఆపన్నహస్తం అందించారు. దారి మధ్యలో చిక్కుకున్న వారిని వీలైతే గమ్యస్థానాలకు చేర్చడం, సమీప ఇళ్లలో ఆశ్రయం కల్పించడం తదితర చర్యలతో సాయం చేశారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో దగ్గర్లో ఎవరైనా చిక్కుకుపోతే తమ ఇళ్లకు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా పలువురు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘నేనే చేసేది చాలా చిన్న సాయమే. వీర దేశాయ్ రోడ్ లేదా అంబోలీ ప్రాంతంలో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వర్షం, వరద తగ్గే వరకు మా ఇంటికి వచ్చి ఉండటానికి మొహమాట పడకండి. ఎవరైనా ఉంటే నాకు నేరుగా మెసేజ్ పంపండి’ అని బిభాష్ చటర్జీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు అవెంజర్స్ సూపర్ హీరోలు అని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. ముంబైని భద్రంగా ఉంచేందుకు వారెంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేస్తూ ‘ముంబై విమానాశ్రయం మూతపడింది. పాఠశాలలను మూసేశారు. రైల్వే స్టేషన్లలోకి నీరు చేరింది. అయినా నా ఇంటికి వార్తా పత్రికలు సరైన సమయానికి, తడవకుండా వచ్చాయి. ఎవరికీ కనిపించని విధంగా గొప్ప గొప్ప పనులు చేస్తున్న వాళ్లందరికీ నేను అభివాదం చేస్తున్నా’ అని పేర్కొన్నారు. వర్షాలు, వరదలను తట్టుకునేలా సరైన మౌలిక వసతులు లేకపోవడం, పరిస్థితిని ఎదుర్కొనేందుకు యంత్రాంగం ముందుగా సిద్ధం కాకపోవడం తదితర సమస్యలపై వ్యాపారవేత్తలెవరూ ఒక్క మాటా మాట్లాడకపోవడం గమనార్హం. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ భారీ వర్షం ధాటికి రన్‌వే నుంచి పక్కకు వెళ్లిన విమానం ఘట్కోపర్లో వరదతో నిండిన రోడ్డు ముంబైలో చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్తున్న స్థానికుడు -
పుణెలోని అంబెగాన్లో విషాదం
-
ముంబై అతలాకుతలం.. వర్షాలకు 22మంది మృతి
సాక్షి, ముంబై/పుణె: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై మహా నగరం అతలాకుతలం అవుతోంది. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం అతలకుతలమవుతోంది. భారీ వర్షాలకు రోడ్డు, రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ముంబైతోపాటు, కళ్యాణ్, పుణెలలో సంరక్షణ గోడలు కూలడంతో సుమారు 22మంది మరణించారు. ముంబయి నగరంలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో గోడకూలి 13 మంది మృతిచెందారు. ఇంకో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే.. సంఘటన జరిగిన పింపరీపాడ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు స్పందించి పలువురినని శిథిలాల నుంచి బయటకు తీసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అంబేగావ్‌లోనూ.. పుణెలోని అంబెగావ్‌లోనూ విషాదం చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలకు అంబేగావ్‌లోని సిన్గాడ్ కళాశాల గోడ కూలి ఆరుగురు మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన తెల్లవారుఝామున జరిగింది. ఘటన సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి తడిచిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మరోవైపు ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలోని కల్యాణ్ ప్రాంతంలో అర్ధరాత్రి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. ఒక వ్యక్తి గాయపడ్డారు. పశ్చిమ కల్యాణ్ ప్రాంతంలోని దుర్గ ఆలయానికి అభిముఖంగా ఉన్న జాతీయ ఉర్దూ పాఠశాల గోడ కూలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.