ఐదుగురు కూలీలపై గోడ కూలడంతో వారు సజీవ సమాధి అయ్యారు.
అలహాబాద్: ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు కూలీలపై గోడ కూలడంతో వారు సజీవ సమాధి అయ్యారు. అలహాబాద్ ప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ఘటన జరిగింది. ఓ ఈద్గా గోడకు అనుకొని ఏర్పాటు చేసిన టెంటులో బసచేస్తున్న వారిపై అర్థరాత్రి దాటిన తరువాత గోడకూలింది. కూలీలంతా నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆదివారం ఉదయం గోడకూలి ఉండటం గమనించిన స్థానికులు.. శిధిలాల కింద కూలీల మృతదేహాలను గుర్తించినట్లు పోలీస్ అధికారి దినేష్ షా వెల్లడించారు. ఈద్గా పురాతనమైనది కావడంతో దానిని రిపేర్ చేసే పనిలో ఉన్న కూలీలు అక్కడ తాత్కాలిక బస ఏర్పాట్లు చేసుకోగా.. వారిపై గోడ కూలినట్లు ఆయన వెల్లడించారు.