allahabad
-
జైప్రకాశ్ అసోసియేట్స్‌పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్)పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. ఇందుకోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన దివాలా పిటిషన్ల విషయంలో ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. జేపీ గ్రూప్‌లో కీలకమైన జేఏఎల్ ప్రధానంగా నిర్మాణం, హాస్పిటాలిటీ తదితర వ్యాపారాలు సాగిస్తోంది. కంపెనీ 2037 కల్లా మొత్తం రూ. 29,805 కోట్ల రుణాలను (వడ్డీతో కలిపి) కట్టాల్సి ఉండగా ఇందులో రూ. 4,616 కోట్లు 2024 ఏప్రిల్ 30 నాటికి చెల్లించాల్సి ఉంది. దీన్ని చెల్లించడంలో సంస్థ విఫలమైంది. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం వల్ల లిక్విడిటీ కొరత ఏర్పడటమే డిఫాల్ట్ కావడానికి కారణమంటూ జేఏఎల్ వినిపించిన వాదనలను తోసిపుచ్చిన ఎన్సీఎల్టీ తాజా ఆదేశాలిచ్చింది. -
హైకోర్టును ఆశ్రయించిన ఐదేళ్ల బుడ్డోడు.. కారణమిదే!
యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ బుడ్డోడు అలహాబాద్ హైకోర్టును ఒక ప్రత్యేక అభ్యర్థనతో ఆశ్రయించాడు. తాను చదువుకుంటున్న పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఉందని, దానిని తొలగించాలంటూ ఆ ఐదేళ్ల చిన్నారి హైకోర్టులో పిటిషన్ వేశాడు. మందుబాబులు పాఠశాలను అసాంఘిక కార్యకలాపాలకు ఆడ్డాగా మార్చారని ఆ చిన్నారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి కారణంగా తమ చదువులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది. కాన్పూర్‌లోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి అథర్వ తన కుటుంబ సభ్యుల సాయంతో కోర్టుకు ఈ ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రతి సంవత్సరం ఈ మద్యం దుకాణం కాంట్రాక్టును ఎలా పునరుద్ధరిస్తున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పాఠశాల కాన్పూర్ నగరంలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో ఉంది. అక్కడికి 20 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఉంది. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల తర్వాతే తెరవాలి. అయితే తరచూ ఉదయం ఆరు గంటల నుంచే ఇక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అథర్వ కోర్టుకు తెలిపాడు. అథర్వ కుటుంబ సభ్యులు ఈ విషయమై కాన్పూర్ అధికారులకు, యూపీ ప్రభుత్వానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా ఈ పాఠశాల 2019లో ప్రారంభమయ్యిందని, మద్యం దుకాణానికి సంబంధించిన ఒప్పందం దాదాపు 30 ఏళ్లనాటిదని వైన్స్ దుకాణ యజమాని వాదనకు దిగారు. ఈ నేపధ్యంలో అధర్వ తన కుటుంబ సభ్యుల సహకారంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, జస్టిస్ క్షితిజ్ శైలేంద్రలతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది. -
Aditi Sen De: అద్వితియ ప్రతిభ
పాపులర్ అయిన తరువాత ఆ బాటలో ప్రయాణించడం విశేషమేమీ కాదు. దార్శనికులు మాత్రం వర్తమానంలో ఉంటూనే భవిష్యత్ వెలుగును దర్శిస్తారు. ఇలాంటి వారిలో ఒకరు అదితి సేన్ డె. ‘క్వాంటమ్’ అనే కాంతి మిణుకు మిణుకుమంటున్న కాలంలోనే దాని ఉజ్వల కాంతిని ఊహించింది అదితి. క్వాంటమ్ సైన్స్‌లో చేసిన కృషికి డా.అదితి సేన్ డె ‘జీడీ బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సెలెన్స్’ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డ్‌కు ఎంపికైన 33వ శాస్త్రవేత్త, తొలి మహిళా శాస్త్రవేత్త అదితి సేన్ గురించి.... అలహాబాద్‌లోని హరీష్చంద్ర రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ (క్యూఐసీ)లో అదితి ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ‘క్యూఐసీ’ అనేది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యున్నత రూపం. ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల శాస్త్రం. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన పరిశోధన రంగాలలో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ ఒకటి’ అంటుంది అదితి. కోల్‌కతాలో పుట్టి పెరిగిన అదితికి చిన్నప్పటి నుంచి గణితం ఇష్టమైన సబ్జెక్ట్. తల్లి లక్ష్మి టీచర్. తండ్రి అజిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. కలకత్తా యూనివర్శిటీలో అప్లాయిడ్ మ్యాథమేటిక్స్‌లో ఎంఎస్సీ చేసిన అదితి పోలాండ్లోని గడాన్స్క్ యూనివర్శిటీలో భౌతికశాస్త్రంలో పీహెచ్డీ చేసింది. తన థీసీస్‌కు క్వాంటమ్ ఫిజిక్స్‌కు సంబంధించిన అంశాన్ని ఎంచుకుంది. ‘రెండు వేల సంవత్సరంలో నా కెరీర్‌ను మొదలు పెట్టాను. ఆ సమయంలో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రారంభ దశలో ఉంది. పరిమిత సంఖ్యలో అప్లికేషన్లు ఉండేవి’ అంటూ ఆనాటి పరిమితులను గుర్తు తెచ్చుకుంటుంది అదితి. పరిమితులు, ప్రతిబంధకాలతో పనిలేకుండా ‘క్వాంటమ్ ఫిజిక్స్’పై తన ఇష్టాన్ని పెంచుకుంటూ పోయింది. కాలంతో పాటు నడుస్తూ, ఎప్పటికప్పుడు ‘క్వాంటమ్ ఫిజిక్స్’ను అధ్యయనం చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. క్వాంటమ్ థర్మల్ యంత్రాల రూపకల్పన(బ్యాటరీలు, రిఫ్రెజిరేటర్లాంటివి) నుంచి క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ అల్గారిథమ్‌ల సమర్థవంతమైన అమలు, సూటబుల్ క్వాంటమ్ సిస్టమ్స్ వరకు... ఎన్నో విషయాలపై పని చేస్తోంది అదితి. ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్ (2018) అందుకుంది. 2022లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మెంబర్‌గా ఎంపికైంది. క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ స్విన్సిస్టమ్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ విత్ అల్ట్రా– కోల్డ్ గ్యాసెస్, క్వాంటమ్ కోరిలేషన్స్... మొదలైన వాటికి సంబంధించి అదితి లెక్చర్స్, టాక్స్ ఆదరణ పొందాయి. బెనర్జీ, శ్రీజన్ ఘోష్, శైలాధిత్యలతో కలిసి ‘స్ప్రెడింగ్ నాన్ లోకాల్టీ ఇన్ క్వాంటమ్ నెట్వర్క్స్’, కవన్ మోదీ, అరుణ్ కుమార్, ఉజ్వల్ సేన్లతో కలిసి ‘మాస్కింగ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపాజిబుల్...మొదలైన పుస్తకాలు రాసింది. క్లాసులో పాఠం చెప్పినా, సెమినార్లో ఉపన్యాసం ఇచ్చినా, పుస్తకం రాసినా విషయాన్ని కమ్యూనికేట్ చేయడంలో తనదైన శైలిని ఎంచుకుంది. సంక్లిష్టమైన శాస్త్రీయ విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో కమ్యూనికేట్ చేయడం ఆమె శైలి. ‘క్వాంటమ్’పై ఆసక్తి చూపుతున్న ఈతరంలోని చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు అదితి సేన్. ‘క్వాంటమ్’ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. సమన్వయం చేసుకుంటూ... కెరీర్, ఫ్యామిలీలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడంపైనే మహిళా శాస్త్రవేత్తల కెరీర్ కొనసాగుతుందా, ఆగిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. అయితే కెరీర్, ఫ్యామిలీని సమన్వయం చేసుకుంటూ వెళితే సమస్యలు ఉండవు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత తిరిగి పనిలో చేరి అద్భుతమైన శక్తిసామర్థ్యాలను చాటుకున్న మహిళా శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు. – అదితి సేన్ -
‘కీచక న్యాయం’పై కొరడా!
ఎన్ని చట్టాలున్నా, ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తరచు రుజువవుతూనే వుంది. ఆఖరికి న్యాయదేవత కొలువుదీరే పవిత్ర స్థలం కూడా అందుకు మినహాయింపు కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని బాందా జిల్లా మహిళా సివిల్ జడ్జి రాసిన బహిరంగ లేఖ స్పష్టం చేస్తోంది. జిల్లా జడ్జి, ఆయన అనుచరుల నుంచి ఆమె ఎదుర్కుంటున్న వేధింపులు ఎలాంటివో, అవి ఎంత ఆత్మ న్యూనతకు లోనయ్యేలా చేశాయో మహిళా జడ్జి వాడిన పదజాలమే పట్టిచూపుతోంది. ‘నన్నొక వ్యర్థపదార్థంగా చూస్తున్నారు. పురుగుకన్నా హీనంగా పరిగణిస్తున్నారు’ అని అన్నారంటే ఆమె వేదనను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... ‘గత ఏడాదిన్నరగా నడిచే శవంగా బతుకీడుస్తున్నాను. ఇక జీవరహితమైన ఈ కాయాన్ని కొనసాగించలేను. ఆత్మహత్యకు అనుమతించండి’ అని కూడా ఆమె రాశారు. ‘మీరంతా ఆటబొమ్మగా, ప్రాణరహిత పదార్థంగా మారటం నేర్చుకోండి’ అని మహి ళలనుద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తనను రాత్రిపూట ఒంటరిగా కలవమంటూ వేధిస్తున్నారని మొన్న జూలైలో ఆమె చేసిన ఫిర్యాదుపై హైకోర్టులోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించింది. కానీ కింది ఉద్యోగులు ధైర్యంగా సాక్ష్యం చెప్పాలంటే ఆ జడ్జిని విచారణ సమయంలో బదిలీ చేయాలన్న వినతిని పట్టించుకున్నవారు లేరు. దీనిపై సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేస్తే ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం తోసిపుచ్చటం ఆమె తట్టుకోలేక పోయారు. నిరుడు దేశవ్యాప్తంగా మహిళలపై 4.45 లక్షల నేరాలు చోటు చేసుకున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక చెబుతోంది. లైంగిక నేరాలకు సంబంధించి సగటున ప్రతి 51 నిమిషాలకూ ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతున్నదని ఆ నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ 65,473 కేసులతో మొదటి స్థానంలో వుంటే మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. పనిచేసే చోట మహిళలను వేధించటంలో ఢిల్లీ అగ్రస్థానంలో వుంది. నిజానికి వాస్తవ ఘటనలతో పోలిస్తే కేసుల వరకూ వెళ్లే ఉదంతాలు తక్కువనే చెప్పాలి. అందరి దృష్టిలో పడతామని, ఉపాధి కోల్పోతామని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ప్రతీకారానికి దిగొచ్చని భయపడి చాలామంది ఫిర్యాదు చేయటానికి వెనకాడతారు. ఈ వేధింపుల పర్యవసానంగా చాలామంది మహిళలు ఆత్మాభిమానం దెబ్బతిని, మానసిక క్షోభకు లోనయి వృత్తిపరంగా ఎదగలేని నిస్సహా యస్థితిలో పడుతున్నారు. ఇలాంటì కేసులు తమముందు విచారణకొచ్చినప్పుడు నేరగాళ్లను కఠి నంగా శిక్షించి, బాధితులకు ఉపశమనం కలగజేయాల్సిన చోటే... మహిళా న్యాయమూర్తులకు వేధింపులుంటే ఇంతకన్నా ఘోరమైన స్థితి ఉంటుందా? నిజానికి న్యాయవ్యవస్థలో లైంగిక వేధింపులుంటున్నాయని ఆరోపణలు రావటం ఇది మొదటిసారేమీ కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనే ఫిర్యాదులొచ్చిన సందర్భా లున్నాయి. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ గొగోయ్‌పై 2019లో ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసినప్పుడు ఆమెను మొదట బదిలీ చేసి,ఆ తర్వాత సర్వీసునుంచి తొలగించి చివరకు చీటింగ్ కేసు కూడా పెట్టారు. గొగోయ్ పదవీ విరమణ చేశాక ఆ మహిళకు తిరిగి ఉద్యోగం లభించింది. జస్టిస్ గొగోయ్‌కి మాత్రం ఏం కాలేదు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేసిన మహిళ కూడా ఇలాంటిస్థితినే ఎదుర్కొన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తనను వేధించిన తీరు గురించి ఆమె ఫిర్యాదు చేశారు. తన గోడు అరణ్యరోదన కావటంతో గత్యంతరం లేక 2014లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన వేధింపులు ఎలావుండేవో సోదాహరణంగా వివరించారు కూడా. ‘నీ పని తీరు చాలా బాగుంది. నీ అందం మరింత బాగుంది’ అనటం, ఒక శుభకార్యంలో నృత్యం చేయాలంటూ భార్యతో ఫోన్ చేయించటం, ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ అని ఫోన్ చేయటం తేలిగ్గా కొట్టిపారేయదగ్గ ఆరోపణలు కాదు. కానీ విషాదమేమంటే ఆ ఫిర్యాదుకు అతీగతీ లేక పోయింది. ఆ న్యాయమూర్తి నిక్షేపంగా తన పదవీకాలం పూర్తిచేసుకున్నారు. ఆయన రిటైర్ కావటంతో తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆమె 2018లో పిటిషన్ పెట్టుకున్నారు. చివరకు ఆ మహిళా జడ్జి స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించుకుని నిరుడు ఉద్యోగంలో చేరడానికి అనుమతించింది. చదువూ సంస్కారం లేనివాళ్లూ, జులాయిలుగా తిరిగేవాళ్లూ మహిళలపై, బాలికలపై వేధింపులకు దిగుతారనే అపోహ వుంది. కానీ పెద్ద చదువులు చదువుకుని, ఉన్నత పదవులు వెలగబెడు తున్న వారిలో కొందరు ఆ తోవలోనే ఉంటున్నారని అప్పుడప్పుడు వెల్లడవుతూనే వుంది. ఇలాంటి కేసుల్లో అసహాయ మహిళలకు ఆసరాగా నిలవాల్సిన మహిళా న్యాయమూర్తులకు సైతం వేధింపులుంటే ఇక దిక్కెవరు? కాలం మారింది. యువతులు చదువుల్లో ఎంతో ముందుంటున్నారు. ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. వేరే వృత్తి ఉద్యోగాలను కాదనుకుని న్యాయవ్యవస్థ వైపు వచ్చే వారిలో చాలామంది సమాజానికి ఏదో చేద్దామన్న సంకల్పంతో వస్తారు. అలాంటి వారికి సమస్య లుండటం దురదృష్టకరం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆ మహిళా జడ్జి లేఖపై వెనువెంటనే స్పందించటం, అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదిక కోరటం హర్షించదగ్గ అంశం. గతంలో మాదిరి కాక దోషులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఈ కీచకపర్వం ఆగదు. -
3 హైకోర్టులకు 13 మంది అదనపు న్యాయమూర్తుల నియామకం
అలహాబాద్, కర్నాటక, మద్రాస్ హైకోర్టుల్లో 13 మంది అదనపు జడ్జీలు నియమితులయ్యారు. వీరిలో 11 మంది లాయర్లు కాగా ఇద్దరు న్యాయాధికారులు. వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం జనవరిలో సిఫార్సు చేసింది. వీరిలో మద్రాస్ హైకోర్టు న్యాయవాది లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి బీజేపీతో సంబంధాలున్నాయనే ఆరోపణ వివాదం రేపింది. ఈమె పేరును సిఫార్సు చేయడాన్ని మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. బార్‌కు చెందిన 21 మంది లాయర్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ‘‘తాను బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శినంటూ గౌరీ అంగీకరించారు. మైనారిటీలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. మత ఛాందస భావాలున్న ఆమె న్యాయమూర్తిగా అనర్హురాలు’’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 10న విచారణ జరగాల్సి ఉంది. దానిపై మంగళవారమే విచారణ చేపడతామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. పార్టీలతో సంబంధాలున్న వారూ జడ్జీలు కావచ్చని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు అనడం తెలిసిందే. -
కోర్ట్ లో టిప్పులు.. యూనిఫామ్ పై QR కోడ్..
-
చదువుల తల్లికి కోర్టు అండ.. అడ్మిషన్ ఫీజు అందించిన వైనం
లక్నో: ప్రతిష్టాత్మక ఐఐటీ బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)కి అర్హత సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అడ్మిషన్ కోల్పోతున్నాను అంటూ దళిత సామాజిక వర్గానికి చెందిన బాలిక సంస్కృతి రంజన్ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది. అయితే ఆమె జేఈఈ ఉమ్మడి పరీక్షలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, షెడ్యూల్డ్ కులాల విభాగంలో రెండు వేల ర్యాంకును సాధించింది. ఈ మేరకు సంస్కృతి రంజన్ హైకోర్టుకు హాజరై... ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా గణితం, కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన ఐదేళ్ల కోర్సు ప్రవేశ రుసుము మొత్తం రూ 15 వేలు చెల్లించలేకపోతున్నాను. నా తండ్రి కిడ్ని వ్యాధి కారణంగా మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతోంది’’ అని తెలిపింది. (చదవండి: జపాన్‌లో తొలి ఒమిక్రాన్ కేసు..!!) అంతేకాక ‘‘నేను నా పరిస్థితిని వివరిస్తూ..అడ్మిషన్ గడువు తేదిని పొడిగించండి అంటూ జాయింట్ సీట్ల కేటాయింపు అథారిటీకి చాలాసార్లు లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందువల్ల నన్ను కాలేజీలో చేర్చుకునేలా విశ్వవిద్యాలయానికి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సీట్ల కేటాయింపు సంస్థకు ధర్మాసనం ఆదేశాలు ఇవ్వాలి" అని పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన దినేష్ కుమార్ సింగ్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ యూనివర్సిటిలో మూడు రోజుల్లో రిపోర్టు చేయాల్సిందిగా పిటిషన్లో కోరింది. అయితే ధర్మాసనం ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించడమేకాక తన తండ్రి ఆరోగ్య దృష్ట్యా కిడ్ని మార్పిడి చేయించుకోమని సలహా సూచించింది. ఈ క్రమంలో న్యాయమూర్తి దినేశ్‌సింగ్ మాట్లాడుతూ..."అంతేకాదు మేము ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని డబ్బుని అందజేస్తాం. పైగా ఒక దళిత యువతి ఐఐటీలో ప్రవేశం పొందాలనే తన కలను సాకారం చేసుకునేందుకు తనకు న్యాయం చేయమని కోరుతూ ఈ కోర్టు ముందుకి వచ్చింది. అందువల్లే ఈ కోర్టు స్వయంగా సీటు కేటాయింపు కోసం రూ. 15,000 విరాళంగా ఇస్తోంది." అని న్యాయమూర్తి దినేశ్ సింగ్ అన్నారు. (చదవండి: బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!) -
దారుణం: వెంటిలేటర్ లేక సీనియర్ వైద్యుడు మృతి
సాక్షి,లక్నో: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో రోజుకు మూడున్నర లక్షలకుపైగా వణికిస్తోంది. రోజుకు రోజుకుపెరుగుతున్న బాధితులతో దేశ రాజధానిలో కరోనా ఉగ్రరూపాన్నిదాల్చింది. తీవ్ర ఆక్సిజన్ కొరత మృత్యు ఘంటికలను మోగిస్తోంది. అటు ఉత్తర ప్రదేశ్‌లో కరోనా కల్లోలం కానసాగుతోంది. ఈ క్రమంలో వెంటిలేటర్ లభ్యంకాక ఒక సీనియర్ డాక్టర్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాగ్‌రాజ్ ఆసుపత్రిలో 50 ఏళ్లపాటు ఎనలేని సేవలదించిన సీనియర్ సర్జన్ డాక్టర్ జెకె మిశ్రా (85) సమయానికి వెంటిలేటర్ అందుబాటులోకి రాక అదే ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కోవిడ్‌తో బాధపడుతున్న ఆయన భార్య, ప్రముఖ గైనకాలజిస్ట్ రామ మిశ్రా (80) కళ్లముందే ఆయన ప్రాణాలు విడిచారు. దీంతో మిశ్రా కుటుంబ సభ్యులతో పాటు, ఆసుపత్రి సిబ్బంది,ఇతరులు విచారంలో మునిగి పోయారు. అలహాబాద్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ (ఎస్ఆర్ఎన్) ఆసుపత్రిని తరువాతి కాలంలో ప్రయాగ్‌రాజ్ అని పేరు మార్చారు. ఈ ఆసుపత్రిలో మొట్టమొదటి రెసిడెంట్ సర్జన్లలో మిశ్రా ఒకరు. ఆయన భార్య డాక్టర్ రామ మిశ్రా అధ్యాపక సభ్యురాలు.ఇద్దరు పదవీ విరమణ చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు లేకపోవడంవల్లే తమ బంధువులను కోల్పోయామని బాధిత కుటుంబాలు ఇప్పటికే ఆరోపణలు గుప్పించాయి. దాదాపు 50 ఏళ్లపాటు విశేష సేవలందించిన మిశ్రాకు వెంటిలేటర్ దొరకక ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యం సీనియర్ వైద్యులుగా తమకెదురైన భయంకరమైన అనుభవాలను మీడియాతో షేర్ చేశారు. (కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం) ‘‘ఆ హాస్పిటల్ ఆయనకు రెండో ఇల్లు... ఈ హాస్పిటల్ తమను కాపాడుతుందని భావించాం.. కానీ కానీ అదే తాము చేసిన పెద్ద తప్పయిపోయింది. తీవ్ర అనారోగ్యంతో ఆక్సిజన్ స్థాయి లెవల్స్ పడిపోయి స్థితిలో ఏప్రిల్ 13న ఆసుపత్రిక వచ్చాం..నొప్పితో బాధపడుతూ, చికిత్స కోసం ఎదురుచూస్తూ, బెడ్స్ దొరక్క ఒక రాత్రంతా గడిపాల్సి వచ్చిందదంటూ రామ మిశ్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు హాస్పిటల్ సిబ్బంది మిశ్రాకోసం బెడ్ సమకూర్చారు. కానీ, నేను మాత్రం నేలపైనే పడుకున్నా. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు. బీపీ మానిటర్ లాంటి కనీస సౌకర్యాలు లేవు. ఆయనకు మొదటి రెండు రోజుల్లో ఇంజక్షన్లుఇచ్చారు. కానీ అవేమిటో అడిగినా చెప్పలేదు. అసలు అక్కడ రోగులను పట్టించుకునేనాధుడేలేదు.. ఈ క్రమంలో ఏప్రిల్ 16 మధ్యాహ్నం నుంచి తన భర్త పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. వెంటిలేటర్లో ఉంచమని వైద్యులను వేడుకున్నాను. కానీ కీలకమైన (లారింగోస్కోప్, ఎండోట్రాషియల్ (ఇటి) ట్యూబ్) పరికరాలు వెంటనే అందుబాటులో లేవు. మరోవైపు ఆయనకు విపరీతమైన దగ్గు, రక్తం పడుతోంది. క్షణ క్షణానికి పరిస్థితి విషమిస్తోంది. హాస్పిటల్ సిబ్బందిని గట్టిగా అరిచేసరికి ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే ఆయన్ను పై అంతస్తులో ఐసీయూలోకి తరలించారు. దీంతో పరిస్థితి మరింత విషమించింది. తాను పైకి వెళ్లేసరికే ఆయన ఊపిరి ఆగిపోయిందంటూ ఆమె కన్నీంటి పర్యంతమయ్యారు. రెండో ఆలోచన లేకుండా.. ఆదుకుంటుందనే ఆశతో ఈ ఆసుపత్రికి వచ్చాం...కానీ ఈ ఆసుపత్రే తన భర్త ప్రాణాలను బలి తీసుకుందంటూ ఆమె ఆవేదన వెలిబుచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తిరస్కరించింది. 25-30 కంటే తక్కువ ఆక్సిజన్ స్థాయిలతో 500 మంది రోగులు ఉన్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. రోగులందరినీ కాపాడటానికి చేయగలిగిందంతా చేస్తున్నాం.. అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం తమకు ఉందని తెలిపింది. అలాగే డాక్టర్ జెకె మిశ్రా గుండెపోటుతో మరణించారని కూడా వెల్లడిండంచింది. కాగా రికార్డు స్థాయి కేసులతో దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్ ప్రకంపనలు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. దీంతో పలువురు వైద్యులు తమ ప్రాణాలకు తెగించి మరీ కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది వైద్యులు,ఇతర సిబ్బంది కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. చదవండి :ఆక్సిజన్ కొరత: సింగపూర్ భారీ సాయం పీరియడ్స్ టైంలో మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? -
అలహాబాద్ పేరు మార్పుపై సుప్రీం నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సోమవారం నాడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అలహాబాద్ హెరిటేజ్ సొసైటీ దాఖలు చేసిన ఈ పిటిషన్ భారత ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య బెంచీ ముందుకు వచ్చింది. (చదవండి: వామ్మో! ఇన్ని పేర్లు ఎలా మార్చగలం ?) అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా 2018, అక్టోబర్ నెలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ నిర్ణయం ద్వారా మార్చారు. దాన్ని నాడు కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘గంగా, యమున సంగమం ప్రాంతంలో మొగల్ చక్రవర్తి అక్బర్ తన కోటను నిర్మించిన 16వ శతాబ్దానికి ముందు అలహాబాద్‌ను ప్రయాగ్‌గా పిలిచేవారు. నాడు ఆయన ప్రయాగ్‌ను ఇలాహాబాద్‌గా పేరు మార్చగా, ఆయన మనవడు షా జహాన్ దాన్ని అలహాబాద్‌గా మార్చారు. బ్రహ్మ దేవుడు ప్రయాగ్ వద్ద మొట్ట మొదటి యజ్ఞాన్ని నిర్వహించారు. రెండు నదులు కలిసే చోటును ప్రయాగ్ అంటారు. అలహాబాద్‌లో గంగా, యమున, సరస్వతి మూడు నదులు కలిశాయి. అందుకని అది ప్రయాగ్‌కు రాజ్ లాంటిది. కనుక ప్రయాగ్‌రాజ్ అయింది’ అని నాడు యోగి ఆదిత్యనాథ్ పేరు మార్పు వెనక కథనాన్ని వినిపించారు. అప్పుడు సోషల్ మీడియాలో ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్పుపై హాస్యోక్తులు వెల్లువెత్తాయి. ‘నీవు ఎక్కడ పుట్టావు ?’ అని ఒకరు ఒకరిని ప్రశ్నించగా, ‘ప్రయాగ్‌రాజ్’లో అంటూ సమాధానం. ‘ఏ కోచ్‌లో పుట్టావ్?’ అంటూ అనుబంధ ప్రశ్న. అప్పటికే ఢిల్లీ–అలహాబాద్ మధ్య తిరిగే రైలొకటి ‘ప్రయాగ్‌రాజ్’గా ప్రసిద్ధి చెందిన విషయం తెల్సిందే. -
జడ్జీలు నిర్భీతి ప్రబోధకులుగా ఉండాలి
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడానికి జడ్జీలు నిర్భయులైన ప్రబోధకులుగా ఉండాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 2012లో ఓ న్యాయవాది యూపీలోని అలహాబాద్ చీఫ్ మెజిస్ట్రేట్‌పై దాడికి ప్రయత్నించాడు. ఈ కేసును శుక్రవారం విచారించిన ధర్మాసనం..‘జడ్జీలు నిర్భీతితో, నిష్పాక్షికంగా తమ తీర్పులను ఇవ్వాల్సి ఉంటుంది. వారిని అవమానించడం, దూషించడం ద్వారా తీర్పులను ప్రభావితం చేయరాదు’ అని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దిగువకోర్టు విధించిన 6 నెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానాను సమర్థించిన సుప్రీంకోర్టు.. శిక్ష అమలును మూడేళ్ల పాటు వాయిదా వేసింది. 2022, జూన్ 30 వరకూ సదరు న్యాయవాది అలహాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోకి రాకుండా, సత్ప్రవర్తనతో మెలిగితే ఈ శిక్షను కొట్టివేస్తామని స్పష్టం చేసింది. -
కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
-
అతడి స్టైల్ అదే.. అందరినీ అలాగే చంపాడు!
లక్నో : వరుస హత్యలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న సీరియల్ కిల్లర్‌ను కుంభమేళా వద్ద అలహాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గత ఆర్నెళ్లలో పది మందిని హతమార్చి మరో ఇద్దరిని హత్య చేయబోయిన అతడిని పట్టుకున్న టీమ్‌కు 50 వేల రూపాయల నజరానా లభించింది. వివరాలు... ప్రయాగ్ రాజ్(అలహాబాద్) జిల్లా బసెహర గ్రామానికి చెందిన కలువా అలియాస్ సుభాష్(38) గతేడాది జూలై నుంచి కిడీగంజ్, పరేడ్‌గ్రౌండ్, కుంభమేళా తదితర ప్రాంతాల్లో వరుసగా హత్యలకు పాల్పడ్డాడు. ఫుట్‌పాత్‌పై నిద్రించే కూలీలను లక్ష్యంగా చేసుకుని అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో శుక్రవారం కుంభమేళా పరిసర ప్రాంతాల్లో నిద్రపోతున్న ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన ఎస్ఎస్సీ నితిన్ తివారీ మాట్లాడుతూ...‘ గత ఆరు నెలలుగా సుభాష్ పది మందిని హత్య చేశాడు. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. బాధితుల దుస్తులతోనే వారి ముఖాన్ని కప్పి ఊపిరాడకుండా చేసేవాడు. ఆ తర్వాత గొడ్డలి వంటి పదునైన ఆయుధాలతో దాడికి పాల్పడి వారిని అంతమొందించేవాడు’ అని చెప్పారు. హత్యలు చేయడం వెనుక అతడి ఉద్దేశం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విచారణలో ఆ విషయాలన్నీ బయటపడతాయని పేర్కొన్నారు. -
స్త్రీలోక సంచారం
జనవరి 19 నుంచి అలహాబాద్‌లో మొదలయ్యే ప్రయాగ కుంభ మేళా ఉత్సవాలకు వచ్చే మహిళా భక్తులతో మర్యాదగా ఎలా మసులుకోవాలో, వారికి అవసరమైన సదుపాయాలకు లోటు రాకుండా ఎలా నిర్వహణ ఏర్పాట్లు చేయాలో పోలీస్ సిబ్బందికి, పారామిలటరీ దళాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్)లోని ‘గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ (జీబీపీఎస్‌ఎస్‌ఐ) ముందుకొచ్చింది. మార్చి 4 వరకు జరిగే ఈ కుంభమేళాకు దాదాపు 10 కోట్ల మంది వస్తుండగా, వారిలో సగం మంది మహిళలే ఉంటారన్న అంచనా ఉంది కనుక ఎన్నడూ లేని విధంగా మహిళలకు ప్రత్యేక ఘాట్లను నిర్మిస్తున్నారు. కుంభ్ ఏరియా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.పి.సింగ్‌కి వచ్చిన ఈ ఆలోచనతో కుంభమేళ ఉత్సవాలను ఈసారి ‘ఉమెన్ ఫ్రెండ్లీ’గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇవాళ ఆదివారం ఈ రద్దీ మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో ‘ట్రావంకోర్ దేవస్వం బోర్డు’ అందోళన చెందుతోంది. అయితే అందుకు వేరే కారణం ఉంది. కోర్టు తీర్పుతో లభించిన స్వేచ్ఛతో చెన్నైలోని ‘మానితి’ అనే సంస్థ సభ్యులు (వీరంతా యాభై ఏళ్లలోపు వారే) 50 మంది ఇవాళ అయ్యప్ప దర్శనానికి శబరిమల చేరుకోబోతున్నారు. వారి రాకను ప్రతిఘటిస్తున్న స్థానిక రాజకీయ పక్షాల కారణంగా తలెత్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించి వీలైనంత వరకు ఇరువైపుల వారి మనోభావాలు దెబ్బతినకుండా చూసేందుకు దేవస్వం బోర్డు పోలీసు యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతోంది. -
‘పేరు’ గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనా!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2017లో ఆదిత్యనాథ్ యోగిని ఎంపిక చేసినప్పుడు ‘కరడుగట్టిన హిందూత్వ’ వాదిని ఎంపిక చేయడానికి తామేమి వెనకాడమని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. అప్పటికీ గోరఖ్‌పూర్ ఆలయానికి పీఠాధిపతిగా కొనసాగుతున్న ఆయనపై పలు దొమ్మి కేసులతోపాటు మత ఘర్షణలు, హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నించారంటూ పలు కేసులు ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచ్చాన తనపై ఉన్న అన్ని కేసులను తానే స్వయంగా కొట్టివేసుకున్నారు. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌ను పాకిస్తాన్ టెర్రరిస్టుగా అభివర్ణించి, మసీదుల్లో హిందూ విగ్రహాలను ప్రతిష్టిస్తానంటూ ఆదిలోనే వివాదాస్పదుడిగా ముద్ర పడిన యోగి ఆదిత్యనాథ్ యూపీలోని అన్ని ముస్లిం ప్రాంతాల పేర్లను తొలగించి వాటి స్థానంలో హిందూ పేర్లను ప్రవేశ పెడుతూ పోతున్నారు. గోరఖ్‌పూర్‌లోని భారత వైమానిక దళానికి చెందిన విమానాశ్రయానికి మహాయోగి గోరఖ్‌నాథ్ పేరును పెట్టారు. ముఘల్సరాయ్ రైల్వేస్టేషన్‌కు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ అని, మొఘల్ చక్రవర్తి అక్బర్ కనుగొన్న అలహాబాద్ నగరం పేరు మార్చి ప్రయాగ్‌రాజ్ పేరు పెట్టారు. ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా మారుస్తున్నట్లు దీపావళి వేడుకల్లో ఆదిత్యనాథ్ ప్రకటించారు. గతంలోనే ఉర్దూ బజార్‌ను హిందీ బజార్‌గా, హుమాయున్ నగర్‌ను హనుమాన్ నగర్‌గా మార్చారు. తాజ్ మహల్ పేరును కూడా మార్చి రామ్ మహల్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రామ రాజ్యాన్ని స్థాపిస్తానని ముఖ్యమంత్రయిన కొత్తలో ప్రకటించిన ఆయన పేర్ల ఆలోచనలో పడి ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయినట్లున్నారు. ఒక్క భారత్‌లోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే పేద ప్రాంతంగా, పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిన రాష్ట్రంగా యూపీ ఇప్పుడు గుర్తింపు పొందింది. సబ్ సహారా ఆఫ్రికాలో పుట్టడం కన్నా యూపీలో ఓ శిశువు జన్మిస్తే నెల లోపల ఆ శిశువు మరణించే అవకాశాలు రెండింతలు ఉన్నాయని ‘లాన్సెట్’ మెడికల్ జర్నల్ తాజా సంచికలో వెల్లడించింది. పొరుగునున్న నేపాల్‌కన్నా యూపీలో మనిషి ఆయుషు ప్రామాణం తక్కువ. నైజీరియా, బంగ్లాదేశ్‌లకన్నా సరాసరి రాష్ట్ర జీడీపీ రేటు తక్కువ. యూపీలోని కాన్పూర్ నగరాన్ని ప్రపంచంలోనే అతి కాలుష్యనగరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలనే ప్రకటించింది. ఇక మానవ అభివృద్ధి సూచికలో పాకిస్థాన్ కన్నా వెనకబడి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై యోగి దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. -
రావణాసుర, దుర్యోధన.. ఈ పేర్లు ఎందుకు పెట్టరు?
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్‌గా మార్చడాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సమర్థించుకున్నారు. తన నిర్ణయాన్ని పౌరాణిక పాత్రలైన రావణాసుర, దుర్యోధునులతో పోలుస్తూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘అలహాబాద్ పేరును ఎందుకు మార్చారని కొంత మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. వారందరనీ ఒకటి అడుతుతున్న.. మీ తల్లిదండ్రులు మీకు రావాణాసుర, దుర్యోధన అని ఎందుకు పేర్లు పెట్టడం లేదు? ఇది కూడా అలాగే. ఎవరైనా మంచి పేర్లను పెడుతారు’ అని యోగి పేర్కొన్నారు. అలహాబాద్ అసలు పేరు ‘ప్రయాగ్’. కానీ 16 శతాబ్దంలో మొగల్ చక్రవర్తి అక్బర్.. గంగా, యమున నదుల సమీపంలో ఓ కోటను స్థాపించి దాని పేరు సంగం అని పెట్టారు. అలాగే ప్రయాగ్ ప్రాంతం, సంగం ప్రాంతాల మొత్తాన్ని ఇలహాబాద్‌గా నామకరణం చేశారు. తర్వాత అక్బర్ మనువడు షాజహాన్ దాన్ని అలహాబాద్‌గా నామకరణం చేశారు. (అయోధ్య’పై త్వరలో శుభవార్త) కాగా ఇటీవల అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్‌గా యోగి ఆదిత్యానాథ్ సర్కార్ తీర్మానం చేసింది. ‘బ్రహ్మదేవుడు మొదట యజ్ఞం చేసిన ప్రదేశం ప్రయాగ్. రెండు నదులు కలిసే చోట ఇది ఉంది. అలాగే అలహాబాద్‌లో గంగా, యమునా, సరస్వతీ మూడు నదులు కలుస్తాయి. అందుకే దాన్ని కింగ్ ఆఫ్ ప్రయాగ్ అంటారు. ఈ కారణంతోనే అలహాబాద్‌కు ‘ప్రయాగ్ రాజ్’ పేరును ఖరారు చేశామ’ని సీఎం యోగి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా యోగి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఒక రాజకీయ జిమ్మిక్కు అని, బలవంతంగా హిందూత్వ ఎజెండాను ప్రజలపై రుద్దుతున్నారని ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి. అయోధ్యలో రాముని భారీ విగ్రహం! -
అలహాబాదూ... నీ పేరేం బాలేదు!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగికి వన్ ఫైన్ డే అలహాబాద్ పేరు తీరు నచ్చలేదు. వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించి ఆ పేరుని ప్రయాగ రాజ్‌గా మార్చి పారేశారు. ఇంతకు ముందు చాలా ఏళ్ల క్రితం రెండు సార్లు ఆ ప్రయత్నం జరిగినా ఫలితం లేకపోయింది. యోగినా మజాకా.. వెంటనే తేల్చి పారేశారు. దెబ్బకు అలహాబాద్ చరిత్ర పుటల్లో కలిసిపోయింది. అయితే కారణం కూడా సెలవిచ్చారు. అక్బర్ తప్పుని తాను సరిచేస్తున్నట్టు ప్రకటించారు. క్షణ కాలం తికమక పడ్డాను.. ఈమధ్య కేంద్ర మంత్రి అక్బర్ తప్పుల మీద కుప్పలు కుప్పలుగా అమ్మాయిల ఆరోపణలు వస్తున్నాయి. వాటికీ, దీనికీ లింకేమిటా అని. అప్పుడు బల్బు వెలిగింది. ఈ అక్బర్ కాదు.. నాటి మొఘల్ చక్రవర్తి అక్బర్ అని. ఆయన పెట్టిన పేరు అలహాబాద్. అలహాబాద్ పేరు 500 ఏళ్ల నుంచి జనం నోళ్లలో నానుతూ, అలవాటైన తరువాత దాన్ని ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి తప్పు అంటున్నారు. పోనీ ఆయన అంతవరకూ వేరే పేరుతో ఉన్న నగరానికి పేరు మార్చి పెట్టారా అంటే అదీ లేదు. మరి తప్పేమిటో? ఎవరైనా దీనిపై సందేహం వెలిబుచ్చితే మీకు సంస్కృతి గురించి ఏమాత్రం తెలియదంటారు. అయినా ఊరు పేరు మార్చి గొప్పలు పోవడమే వింత. ఇంతవరకూ ఏడుగురు ప్రధానుల్ని అందించిన అలహాబాద్, జీవన ప్రమాణాల్లో (లివబుల్ సిటీస్) 111 భారతీయ పట్టణాల్లో, 96వ స్థానంలో నిలిచింది. అంటే అంత తీసికట్టులో ఉంది. అక్కడ సౌకర్యాలు పెంచడానికి కృషి లేకపోయినా, పేరు మార్చి ఘనకార్యంగా భావిస్తోంది ఆ ప్రభుత్వం. అయినా ఆ బ్రహ్మచారి ముఖ్యమంత్రికి బారసాల కార్యక్రమాలు కొత్తేమి కాదు. వీధులు పేర్లు, వాడల పేర్లు వందల కొద్దీ మార్చేస్తున్నారు. అంతగా మాట్లాడితే అక్కడంతా అదే తీరు. మాయావతి ముఖ్యమంత్రిగా జిల్లాల పేర్లు మార్చేస్తే, తరువాత పదవిలోకి వచ్చిన అఖిలేష్ మళ్లీ వాటిని మార్చారు. ఈ అనవసర నామకరణం, బారసాల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా స్ఫూర్తిగా తీసుకొనే ప్రమాదం కనబడుతోంది. అదే బాధాకరం. నగరాలు, పట్టణాల పేర్లను మార్చడంలో రికార్డు సృష్టిస్తున్న పాలకులు వాటి అధ్వాన పరిస్థితులను కూడా కాస్త పట్టించుకుంటే బావుంటుంది కదా! డా‘‘ డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం -
అందరు చూస్తుండగానే.. రౌడీ షీటర్ హత్య
అలహాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఓ రౌడీషీటర్‌ను సినీ ఫక్కీలో దారుణంగా హత్య చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలహాబాద్‌లోని రాజాపూర్ కాలనీలో దుర్గామాత పూజ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో అందరు చుస్తుండగానే కొందరు దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం బాంబు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధంచి దృశ్యాలు సీసీ కెమెరాలో రాకార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తిని నీరజ్ బాల్మీకిగా గుర్తించారు. అతనిపై రౌడీషీటుందని, పాత కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. -
అలహాబాద్ ఇక ప్రయాగ్ రాజ్..!
సాక్షి, లక్నో/ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్‌గా యోగి ఆదిత్యానాథ్ సర్కార్ మంగళవారం మార్చేసింది. ఈ మేరకు పేరు మారుస్తూ.. యోగి కేబినెట్ తీర్మానం చేసింది. యోగి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఒక రాజకీయ జిమ్ముక్కు అని, బలవంతంగా హిందూత్వ ఎజెండాను ప్రజలపై రుద్దుతున్నారని ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి. -
అలహాబాద్.. ఇకపై ప్రయాగ్‌రాజ్!
అలహాబాద్: చారిత్రక నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడారు. విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే అలహాబాద్ పేరును మారుస్తాం. ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలన్నది ఎక్కువ మంది ప్రజల ఆకాంక్ష. అందరూ అంగీకరిస్తే ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తాం’ అని తెలిపారు. ఈ మేరకు సీఎం పంపించిన ప్రతిపాదనలకు గవర్నర్‌తో పాటు కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఇక్కడ జరగనున్న కుంభమేళాకు ముందుగానే కొత్తపేరు ప్రయాగ్‌రాజ్‌ను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. -
యూపీ సీఎం సంచలన నిర్ణయం
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్య పట్టణమైన అలహాబాద్ పేరును మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది కుంభమేళా జరగనున్న నేపథ్యంలో త్వరలోనే అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అలహాబాద్ పేరు మార్పు ప్రతిపాదన గవర్నర్ ముందు పెట్టామని.. అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. కేబినెట్ ఆమోదం అనంతరం ‘ప్రయాగ్ రాజ్’ వాడుకలోకి వస్తుందని చెప్పారు. కుంభమేళా ఏర్పాట్లపై మాట్లాడుతూ.. ‘ఇప్పటికే ఏర్పాటు ప్రారంభమయ్యాయి. కుంభమేళా జరిగే ప్రాంతంలో అన్ని సదుపాయలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ పాంత్రంలో ఎటీఎంలు, సెల్ టవర్లు, చేతిపంపులు, నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాం’ అని సీఎం అన్నారు. 2019 జనవరి 15న కుంభమేళా ప్రారంభం కానుంది. దాదాపు 192 దేశాల నుంచి కోట్లలో భక్తులు రానున్నారు. -
నడిరోడ్డుపై దారుణం!
-
వైరల్: నడిరోడ్డుపై దారుణం!
అలహాబాద్: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ భూవివాదం రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రాణాలను తీసింది. నడిరోడ్డుపై వెళ్తున్న ఆ మాజీ పోలీస్ అధికారిని దుండగలు పట్టపగలే చితక్కొట్టారు. పెద్ద పెద్ద రాడ్లతో దారుణంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఆ అధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆ వృద్ధునిపై దాడి చేస్తుంటే పక్కన ఉన్నవారు ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. 70 ఏళ్ల అబ్దుల్ సమద్ ఖాన్ రిటైర్డ్ ఎస్ఐ. అతను సైకిల్‌పై వస్తుండగా.. ఓ వ్యక్తి పెద్ద రాడ్‌తో అతనిపై దాడి చేశాడు. దీంతో అబ్దుల్ కిందపడిపోగా మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ అబ్దుల్‌ను స్థానికులు అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భూవివాదమే కారణమని, నిందితుల్లో ఒకరికి నేరచరిత్ర ఉందని తెలిపారు. -
భార్యను చంపి ఫ్రిజ్‌లో, పిల్లల్ని సూట్‌కేసులో..
అలహాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఒకరు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా.. మరొకరి శవం ఫ్రిజ్‌లో, ఇద్దరి శవాలు సూటుకేసులో, ఇంకొకరిది బీరువాలో లభించాయి. మృతదేహాలు అలహాబాద్‌లోని ధుమాన్‌గంజ్ చెందిన మనోజ్ కుష్వాహ(35), అతడి భార్య, వారి ముగ్గురు పిల్లలవిగా పోలీసులు గుర్తించారు. భార్యపై అనుమానంతో భర్తే.. గత మూడు రోజులుగా మనోజ్ కుష్వాహా ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా మనోజ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. అతడి భార్య మృతదేహం వేరే గదిలో ఉన్న ఫ్రిజ్‌లో, ఇద్దరు పిల్లల శవాలు సూట్‌కేసులో, మరో పాప శవం బీరువాలో లభించాయి. భార్యా పిల్లలను హత్య చేసి మనోజ్ ఈ ఘాతుకానికి పాల్పడివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భార్యపై అనుమానంతోనే అతడు ఇంత దారుణానికి ఒడిగట్టివుంటాడని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఫ్రిజ్, సూట్‌కేసు, బీరువాలో శవాలు
లక్నో: ఒక కుటుంబంలోని మొత్తం ఐదుగురు సభ్యులు చనిపోయి వుండడం కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్, అలహాబాద్, ధుమాంగంజ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద పరిస్థితిలో మృతదేహాలు పడివుండటం పలు సందేహాలకు తావిస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇంటి తాళం వేసి వుండటంతో పగుల గొట్టి ప్రవేశించిన పోలీసులు అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలను గుర్తించారు. ఒక వ్యక్తి (భర్త) ముందుగదిలో ఉరికి వేలాడుతూ కనిపించగా, లోపల ఫ్రిజ్‌లో మహిళ (భార్య) మృతదేహం కనిపించింది. ఇద్దరు కుమార్తె శవాలు సూట్‌కేస్‌లో, బీరువాలో కుక్కి వుండగా, మూడువ కుమార్తె శవం మరో గదిలో పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మతృదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. భార్య, ముగ్గురు కుమార్తెలను హత్య చేసి భర్తకూడా ఆత్మహత్య చేసుకొని వుండొవచ్చనే సందేహాన్ని అలహాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ నితిన్ తివారీ వ్యక్తం చేశారు. దర్యాప్తు జరుగుతోందన్నారు. -
రాజు మెచ్చిన చిత్రం
పాదుషా గారికి వైకల్యం ఉంది. ఒక కన్ను కనిపించదు. ఒక కాలు నడవనివ్వదు. అయినా పాలనా వ్యవహారాలు నిర్వర్తించడంలో ఏ లోటూ రానిచ్చేవారు కాదు. ఒకరోజు పాదుషా గారికి తన ముఖచిత్రాన్ని గీయించుకోవాలనే కోరిక కలిగింది. ‘‘ఎవరైతే నాలో ఉన్న శారీరక లోపాలు కనపడకుండా నా చిత్రాన్ని గీస్తారో వాళ్లకు గొప్ప బహుమానాన్ని అందిస్తాను’’ అని ప్రకటించారు. రాజ్యంలోని ప్రముఖ చిత్రకారులందరూ రాజుగారి చిత్రాన్ని గీసేందుకు బారులు తీరారు. చిత్రకారులంతా పాదుషా గారి వైకల్యం కనబడకుండా చిత్రించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. అందులోనుంచి ఒక పల్లెటూరి చిత్రకారుడు ‘‘పాదుషా గారూ! మీరు కోరినట్లుగా మీ చిత్రాన్ని నేను గీస్తాను’’ అని చెప్పాడు. చెప్పినట్లుగా రాజుగారి ముఖచిత్రాన్ని అత్యంత సుందరంగా, రాజుగారు మెచ్చుకునేలా చిత్రీకరించాడు. చిత్రంలో రాజుగారు అశ్వంపై ఆసీనులై బాణం ఎక్కుపెట్టినట్లు చిత్రించి తన చిత్ర నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. నడవనివ్వని కాలును గుర్రానికి కనపడని వైపు ఉంచి, కనిపించని కన్నును మూసి బాణాన్ని ఎక్కుపెట్టినట్లు చిత్రించి రాజుగారి మన్ననల్ని పొందాడు. రాజుగారు తన ముఖారవిందాన్ని చిత్రంలో చూసుకుని ఎంతో సంతోషించారు. ఆ పల్లె చిత్రకారుడికి ఎన్నో విలువైన బహుమతులతో సత్కరించారు. ఇది కేవలం కథ మాత్రమే కాదు పాఠం. మనమూ ఇతరుల లోపాలను బహిర్గతం కాకుండా చిత్రాలను గీయవచ్చు. దైవానుగ్రహం పొంది ఎన్నో వరాలను పొందవచ్చు. ఒకరి లోపాలను ఎత్తి చూపడం అల్లాహ్‌కు అస్సలు ఇష్టం ఉండదు. ఎదుటి వారిలోని మంచినే చూడాలి. మనలో ఉన్న లోపాలను తొంగి చూసుకోవాలి. అంతేకాని, ఎప్పుడూ ఎదుటి వారి లోపాలపైనే దృష్టి పెడితే మనం అభాసుపాలవుతాం. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు, బలహీనతలుంటాయి. ఒకరి లోపాలు, బలహీనతలను నలుగురిలో చెప్పి నవ్వులపాలు చేయకుండా ప్రవర్తిస్తే అల్లాహ్ మన లోపాలు, మన బలహీనతలపై ముసుగు వేస్తాడు. – నాఫియా