
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం
అలహాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ఉదయం అలహాబాద్‌లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ ఎంపీలు హాజరుకానున్నారు.
ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలతో అమిత్ షా భేటీయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు రచించనున్నారు. ఈ సమావేశాలను యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శంఖారావ సభగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ అభివర్ణించిన విషయం తెలిసిందే.