వీడియో.. ఎస్పీకి ఎమ్మెల్యే బెదిరింపులు | UP BJP MLA Threatens Allahabad SP Video Viral | Sakshi
Sakshi News home page

Published Sun, May 20 2018 11:54 AM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

UP BJP MLA Threatens Allahabad SP Video Viral - Sakshi

ఎస్పీని బెదిరిస్తున్న ఎమ్మెల్యే హర్షవర్దన్‌

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ బాజ్‌పాయి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలహాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఎస్పీపై బెదిరింపులకు దిగారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. శనివారం అలహాబాద్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ముఖ్యఅతిథిగా ఓకార్యక్రమం జరిగింది. దీనికి అలహాబాద్‌ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే హర్షవర్దన్‌ బాయ్‌పాయి హాజరయ్యారు. ఆయన వాహనం లోపలికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారు దిగిన ఆయన పోలీసులపై చిందులు తొక్కారు. ‘నన్ను గుర్తుపట్టకపోగా, పైగా వాహనాన్ని అడ్డుకుంటారా?’ అంటూ అధికారులపై మండిపడ్డారు. ఇంతలో అలహాబాద్‌ ఎస్పీ అక్కడికి రాగా, ఆయన్ను హర్షవర్దన్‌ బెదిరించారు. ‘నన్ను ఆపుతారా? హింస అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది కదా’.. అంటూ వ్యాఖ్యలు చేస్తుండగా, అనుచరులు ఎమ్మెల్యేని లోపలికి తీసుకెళ్లారు. గతంలో బీజేపీ ఎమ్మెల్యే రాధా మోహన్‌ దాస్‌.. చారు నిగమ్‌ అనే అధికారణిపై మండిపడగా, ఆమె కంటతడి పెట్టుకున్న వీడియోలు అప్పట్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement