ఘోరం: నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే.. | Man Assassinated On Busy Uttar Pradesh Street But No One Helps | Sakshi
Sakshi News home page

నడిరోడ్డు మీద దారుణ హత్య.. కానీ

Published Tue, Dec 29 2020 8:15 AM | Last Updated on Tue, Dec 29 2020 12:29 PM

Man Assassinated On Busy Uttar Pradesh Street But No One Helps - Sakshi

లక్నో: రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బాటసారులు చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప ఒక్కరు కూడా బాధితుడిని కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా ఈ అమానుష చర్యను వీడియోలు తీస్తూ దూరంగా నిలబడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు... ఘజియాబాద్‌లోని లోనీకి చెందిన సంజయ్‌, గోవింద్‌కు మధ్య కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. పూలకొట్టు పెట్టే విషయంలో స్థల కేటాయింపు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో గోవింద్‌ సంజయ్‌పై పగ పెంచుకున్నాడు.(చదవండి: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఆత్మహత్య)

ఈ క్రమంలో సోమవారం ఉదయం సంజయ్‌ సోదరుడు అజయ్‌ లోనీ మార్గం గుండా వెళ్తుండగా, అతడిని అటకాయించాడు. తన స్నేహితుడు అమిత్‌తో కలిసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో అజయ్‌ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై సంజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులు గోవింద్‌, అమిత్‌లను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కాగా పోలీసులు సత్వరమే స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement