
లక్నో : రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న చిన్న వివాదం కర్రల దాడి వరకు వెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్ఫట్‌లో రెండు వర్గాల చెందిన పలువురు వ్యక్తులు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. కర్రలు, ఇనుప రాడ్లతో ఒకరిపై ఒకరు దాడికి దిగి నానా హంగామా సృష్టించారు. విక్షణారహితంగా కర్రలతో కొట్టుకుంటూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో యూపీ పోలీసులు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మిగతా వారిని కూడా అరెస్ట్ చేసేందుకు గాలింపు ప్రారంభించారు. అయితే ఈ వాగ్వాదం ఎందుకు చోటుచేసుకుంది అనేది తెలియాల్సి ఉంది.