లక్నో: దొంగల బారీనుంచి ప్రజలను రక్షించాల్సిన పోలీసులే చోరీకి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగింది. రాత్రివేళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నఇద్దరు పోలీసులు పక్కన మంచంపై నిద్రిస్తున్న ఓ వ్యక్తిని చూసి ఆగారు. అనంతరం ఓ పోలీసు ఆ వ్యక్తి వద్దకు వెళ్లాడు. హాయిగా నిద్రపోతున్న వ్యక్తి మంచంపై ఉన్న ఫోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం చక్కా దాన్ని చూసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఓ వ్యక్తి ట్వీట్టర్‌లో షేర్ చేశాడు.
పోలీసుల తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతనాలు చేయడమేంటని మండిపడ్డారు. ఇలాంటి వారికి పోలీసులుగా కొనసాగే అర్హత లేదని, వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Shameful act of Kanpur Police
— AkshayKTRS (@AkshayKtrs) October 9, 2022
The soldiers patrolling at night stole the phone of the sleeping person, the incident was captured in CCTV @drlaxmanbjp Anna Any words on this ?#doubleengine sarkaaru👇 pic.twitter.com/YdnFcbmxpb
చదవండి: వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..
Comments
Please login to add a commentAdd a comment