Caught on Camera
-
Hyderabad: ఇదేం ట్రెండ్రా నాయనా.. నడిరోడ్డుపై రొమాన్స్ చేసిన జంట
హైదరాబాద్: బీహార్‌లోని గయ, ఉత్తరప్రదేశ్‌లోని హపూర్, ఘజియాబాద్‌ల్లో రోడ్లపై ప్రయాణిస్తున్న జంటలు వికృత చేష్టలకు పాల్పడిన వీడియోలు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఓ ఘటనే శనివారం రాత్రి నగరంలోని పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వేపై చోటు చేసుకుంది. అయితే ఉత్తరాదిలోని జంటలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రెచ్చిపోగా... నగరంలోని జంట మాత్రం మరో అడుగు ముందుకు వేసి కారును వాడుకుంది. శనివారం రాత్రి ఎక్స్‌ప్రెస్ వేపై ఓ కియా కారు శంషాబాద్ వైపు నుంచి మెహదీపట్నం వైపు ప్రయాణించింది. ఇది ఎక్స్‌ప్రెస్ వేపై ఉండగానే దాని సన్‌రూఫ్ ఓపెన్ చేసుకున్న ఓ జంట అందులోంచి బయటకు నిలబడింది. పబ్లిక్‌గానే ఆలింగనాలు, చుంబనాలతో అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఆ కారు వెనుకే మరో కారులో ప్రయాణిస్తున్న వారు ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఇవి ఆదివారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరాదిలోని నగరాలు, పట్టణాల్లో ఇలా వీధుల్లో వికృత చేష్టలకు పాల్పడిన జంటల్ని అక్కడి పోలీసులు సోషల్ మీడియాలోని వీడియోల ఆధారంగా పట్టుకుని చర్యలు తీసుకున్నాయి. ఎక్స్‌ప్రెస్ వే జంట విషయంలో ఇక్కడి పోలీసుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
ఫోన్ కొట్టేసిన దొంగ పోలీస్.. వీడియో వైరల్!
లక్నో: దొంగల బారీనుంచి ప్రజలను రక్షించాల్సిన పోలీసులే చోరీకి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగింది. రాత్రివేళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నఇద్దరు పోలీసులు పక్కన మంచంపై నిద్రిస్తున్న ఓ వ్యక్తిని చూసి ఆగారు. అనంతరం ఓ పోలీసు ఆ వ్యక్తి వద్దకు వెళ్లాడు. హాయిగా నిద్రపోతున్న వ్యక్తి మంచంపై ఉన్న ఫోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం చక్కా దాన్ని చూసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఓ వ్యక్తి ట్వీట్టర్లో షేర్ చేశాడు. పోలీసుల తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతనాలు చేయడమేంటని మండిపడ్డారు. ఇలాంటి వారికి పోలీసులుగా కొనసాగే అర్హత లేదని, వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. Shameful act of Kanpur Police The soldiers patrolling at night stole the phone of the sleeping person, the incident was captured in CCTV @drlaxmanbjp Anna Any words on this ?#doubleengine sarkaaru👇 pic.twitter.com/YdnFcbmxpb — AkshayKTRS (@AkshayKtrs) October 9, 2022 చదవండి: వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు.. -
రాజన్న దర్శనం.. భక్తుల వద్ద హోంగార్డు చేతివాటం
వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ప్రదీప్ భక్తుల నుంచి డబ్బు తీసుకుని నేరుగా భారీకేడ్ జరిపి ఆలయంలోకి అనుమతించిన వైనం సెల్‌ఫోన్ కెమెరాకు చిక్కింది. ఎస్పీఎఫ్ సిబ్బంది ఈ విషయాన్ని ఈవో రమాదేవి దృష్టికి తీసుకెళ్లారు. సదరు హోంగార్డుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈవో ఆదేశించారు. (చదవండి: మంత్రుల ఆదేశాలు బేఖాతర్.. కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడే) -
‘ఐరన్‌మ్యాన్’కి ఏమైంది?, కారులో ముద్దులతో ‘స్పైడర్‌మ్యాన్’ అలా..
ఐరన్‌మ్యాన్.. మార్వెల్ కామిక్స్‌లో పిల్లలకు ఓ ఫేవరెట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్‌కు తనదైన శైలి నటనతో వెండితెరపై ప్రాణం పోసి.. అశేష అభిమానాన్నిసంపాదించుకున్నాడు నటుడు రాబర్డ్ డానీ జూనియర్. అయితే తాజాగా ఆయన చర్యలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. రాబర్డ్ డానీ.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కొందరిని అన్‌ఫాలో అయ్యాడు. అయితే ప్రత్యేకించి మార్వెల్ నటులను అన్ ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. ‘కెప్టెన్ అమెరికా’ క్రిస్ ఎవాన్స్, స్పైడర్ మ్యాన్ ‘టామ్ హాలాండ్’ లాంటి మంచి స్నేహం ఉన్న నటులను సైతం అన్‌ఫాలో కావడం విశేషం. దీంతో అభిమానుల్లో ఏం జరిగిందో అనే ఆత్రుత పెరిగింది. కొంపదీసి మార్వెల్‌కు డానీ గుడ్‌బై చెప్పాడా? ఇక ఐరన్ మ్యాన్‌గా కనిపించడా? అనే వాళ్లలో వాళ్లు చర్చించుకున్నారు కూడా. అయితే డానీ తన ఇన్‌స్టా వాళ్లతో పాటు మరికొందరిని కూడా అన్‌ఫాలో అయ్యాడు. మొత్తంగా అతని 43 మంది ఫాలోవర్స్‌లో.. ఏ ఒక్క యాక్టర్ లేకుండా చూసుకున్నాడు అంతే. ఇక ట్విటర్లో మాత్రం అందరినీ ఫాలో అవుతున్నాడు 56 ఏళ్ల రాబర్ట్ జాన్ డానీ జూనియర్. ముద్దులతో స్పైడర్‌మ్యాన్ టామ్దయా.. ఇది కొత్తగా ఆ హాలీవుడ్ జంటకు అభిమానులు పెట్టుకున్న పేరు. స్పైడర్‌మ్యాన్ ఫేమ్ టామ్ హోలాండ్(25).. తన కో స్టార్ జెన్దయాతో రిలేషన్లో ఉన్నాడని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ రిలేషన్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఇద్దరు కారులో ముద్దుపెట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. కాగా, ఈ బ్రిటిష్ నటుడు.. 24 ఏళ్ల అమెరికన్ నటి జెన్దయాతో ప్రేమలో ఉన్నాడు. స్పైడర్‌మ్యాన్ హోంకమింగ్(2017) నుంచి పీటర్ పార్కర్-ఎంజే క్యారెక్టర్ జోడిగా వీళ్లిద్దరూ అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. I can’t breathe #TOMDAYA #TOMHOLLAND #ZENDAYA pic.twitter.com/bYLEf2YpBM — 🦖 (@8ncvrr) July 2, 2021 -
పిశాచి పిడుగు : షాకింగ్ వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: గుర్గావ్లో విషాదం చోటు చేసుకుంది. వర్షం నుంచి రక్షించుకునేందుకు చెట్టు కిందకు చేరిన వ్యక్తులు అనూహ్య ప్రమాదంలో ఇరుక్కున్నారు. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి అక్కడిక్కడే కుప్పకూలి చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. దిగ్భ్రాంతికరమైన ఈ విజువల్స్ స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గుర్గావ్ సెక్టార్ 82 లోని సిగ్నేచర్ విల్లాస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో వర్షంలో తడిసిపోకుండా ఉండేందుకు ఈ నలుగురు చెట్టుకింద నిలబడ్డారు. అకస్మాత్తుగా పిడుగువారిపై పడింది. అంతే క్షణాల్లో వారంతా కుప్పకూలిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రమైన కాలిన గాయాలతో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. బాధితులంతా రెసిడెన్షియల్ సొసైటీలోని హార్టికల్చర్ సిబ్బందికి చెందిన వారుగా తెలుస్తోంది. కాగా సాధారణంగా పిడుగులు పడేటప్పుడు అందరూ చెట్లకిందకు, భవనాలు కిందకు వెళుతుంటారు. వాస్తవానికి ఇది ఇంకా ప్రమాదకరం. ఈ సమయంలో చెట్లకింద నిలబడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిడుగులు ఎత్తైన వాటిని ఆకర్షిస్తాయి. దీంతో చెట్లపైనా, ఎత్తైన భవనాలపైనే పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. -
గుర్గావ్లో పిశాచి పిడుగు
-
నడిరోడ్డుపై నరికి చంపారు
సాక్షి, చెన్నై: గంజాయి విక్రయాల విషయంలో పోటీ ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. చెన్నైలోని ఆరుబాక్కం వైష్ణవ కళాశాల ఎదురుగా ఉన్న కెనరా బ్యాంకు ఏటీఎం ముందు చోటు చేసుకున్న ఈ హత్యోదంతం సీసీటీవీలో రికార్డు అయ్యింది. చూలైమేడుకు చెందిన కుమరేశన్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పలు కేసులు నమోదయ్యాయి. అదే సమయం అతనిపై హత్య, హత్యాయత్నం తదితర కేసులు కూడా ఉన్నాయి. కుమరేశన్‌కు అదే ప్రాంతంలో గంజాయి విక్రయించే ముఠాకు కొంతకాలంగా వర్గపోరు నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కూడా కుమరేశన్‌పై హత్యాయత్నం జరిగ్గా తృటిలో తప్పించుకున్నట్టు తెలిసింది. సోమవారం కుమరేశన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో నరికి చంపటం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి సీసీటీవీ పుటేజ్ ఆదారంగా దర్యాప్తు చేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో చెన్నై నగరంలో నడిరోడ్డుపై నాలుగు హత్యలు జరగటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గుమ్మడిపూండి ప్రాంతంలో శనివారం రాత్రి ముగ్గురు యువకులను వెంటాడి నరికి చంపారు. -
అడ్డంగా దొరికిపోయిన సీఎం రమేష్
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో ఏదో జరిగిందంటూ కట్టుకథ అల్లిన టీడీపీ ఎంపీల అసలు స్వరూపం బయటపడింది. ప్రధానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదాభివందనం చేశారంటూ ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో విజయసాయిరెడ్డిపై దుష్ప్రచారానికి దిగిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్.. సాక్ష్యాల విషయాన్ని కొచ్చేసరికి తెగ కంగారు పడ్డారు. ఈ క్రమంలో కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయారు. తొలుత సభలో ఏదో జరిగిందంటూ మీడియాతో మాట్లాడిన రమేశ్.. తర్వాత మాట్లాడేందుకు మరో ఎంపీ మురళీ మోహన్‌కు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ఓ విలేకరి వైఎస్సార్ సీపీ ఎంపీల వాదనను ప్రస్తావించగా.. ‘సాక్ష్యాలిస్తే వాళ్లు రాజీనామా చేస్తారా?’ అని సీఎం రమేశ్ ఆవేశంగా మాట్లాడారు. అంతలో మురళీమోహన్ జోక్యం చేసుకుని ‘ఫుటేజీ ఉంది కదా!’ అనటం.. ‘ఉంది, ఉంది.. మీరు అది చెప్పొద్దు’ అంటూ మురళీమోహన్‌కు సీఎం రమేశ్ సూచించటం చూడొచ్చు. దీంతో రమేశ్ చేసే ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉన్నదన్నది అర్థమైపోతోంది. మరోపక్క తనపై చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సీఎం రమేష్‌ను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫుటేజ్ బయటపెట్టాలంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు విజయసాయిరెడ్డి లేఖ కూడా రాశారు. -
అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎంపీ
-
ఇలా దమ్ము కొట్టగలరా?.. వైరల్ వీడియో
బాండుంగ్ (ఇండోనేషియా) : అది ఇండోనేషియాలోని ఓ జూపార్క్. వివిధ రకాల జంతువులను చూసేందుకు వచ్చిన ఔత్సాహికుల్లో ఒకరు సిగరెట్ తాగుతూ ఒరాంగ్టాంగ్ ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. కొద్దిసేపు ఒరాంగ్టాంగ్ను తదేకంగా చూసిన ఆ వ్యక్తి తాను తాగుతున్న సిగరెట్‌ను దాని ఎదురుగా విసిరేశాడు. అది వెంటనే దాన్ని తీసుకొని మగరాయుళ్లెవరూ కూడా తాగలేనంత స్టైల్‌గా సిగరెట్ తాగింది. గుప్పుగుప్పుమంటూ పొగను ముక్కల్లో నుంచి కూడా బయటకు తీసింది. ఓ కెమెరా కంటికి చిక్కిన ఆ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో పెద్ద వైరల్‌గా మారింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరీ.. -
అడ్డంగా దొరికిపోయిన మేయర్
-
మీడియాకు అడ్డంగా దొరికిపోయిన మేయర్
సాక్షి, న్యూఢిల్లీ : బవానా భారీ అగ్ని ప్రమాదంపై స్పందిస్తూ ఢిల్లీ(ఉత్తర) మేయర్ అడ్డంగా దొరికిపోయారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ప్రకటనలు చెయొద్దంటూ మీడియా ముందే ఆమె అధికారులకు సూచించారు. బీజేపీ నేత, ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్ మేయర్ ప్రీతి అగర్వాల్ ప్రమాద ఘటనపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ఈ ఫ్యాక్టరీ లైసెన్స్ మన దగ్గర ఉంది. మీరెవ్వరూ మీడియాతో మాట్లాడకండి అంటూ ఆమె అధికారులకు సూచించారు. అందుకు వారు సరేనని చెప్పటం ఆ వీడియోలో గమనించవచ్చు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ నిర్మించారని.. ప్రామాణికాలు పాటించలేదన్న అంశాలు వెలుగులోకి వచ్చిన కాసేపటికే.. మేయర్ మాట్లాడిన మాటలు చక్కర్లు కొడుతున్నాయి. బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణ సంచా కర్మాగారంలో శనివారం మంటలు ఎగిసిపడి 17 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మృతుల్లో 10 మంది మహిళలు ఉండగా.. మరో 30 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఊపిరాడక చనిపోయారని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి యాజమాని మనోజ్ జైన్‌ను ఆదివారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అది ఫేక్ వీడియో... బీజేపీ మేయర్ ప్రీతి అగర్వాల్ వ్యాఖ్యల వీడియోపై బీజేపీ స్పందించింది. అది ఫేక్ వీడియో అని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చెబుతున్నారు. మార్ఫింగ్ చేసిన ఆ వీడియోను చివరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తన ట్విటర్లో పోస్టు చేయటం దారుణమని తివారీ అంటున్నారు. మరోవైపు మేయర్ ప్రీతి కూడా అది మార్ఫింగ్ వీడియో అని.. తాను అసలు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెబుతుండటం కొసమెరుపు. -
చిన్నారిపై సవతి తల్లి దాష్టికం.. వైరల్ వీడియో
చండీగడ్: క్యాన్సర్‌తో తల్లి మరణించడంతో అమ్మ ప్రేమకు దూరమైన చిన్నారికి ప్రేమను పంచాల్సిన ఓ సవతి తల్లి దాష్టికంగా ప్రవర్తించి కటకటాలపాలైంది. చండీఘడ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చండీగడ్ సెక్టార్ 29లో నివాసముండే ఓ మహిళ తన సవతి కూతురైన చిన్నారని సంచిలోకుక్కి చితకబాదింది. జుట్టు పట్టి, చెవులు పిండుతూ.. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసింది. అప్పటికే కాలు గాయంతో బాధపడుతున్న చిన్నారిపై కాస్త కనికరం కూడా చూపించలేదు. ఈ తతంగాన్ని ఆ చిన్నారి సోదరుడు సెల్ఫోన్లో చిత్రికరించడంతో విషయం బయటకు వెలుగు చూసింది. రెండు నెలల క్రితం ఆ చిన్నారి తల్లి క్యాన్సర్ మరణించడంతో తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతను ఆ కసాయి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నెటీజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. -
చిన్నారిపై సవతి తల్లి దాష్టికం.. వైరల్ వీడియో
-
ఉత్తరప్రదేశ్‌లో రెచ్చిపోయిన పోలీసులు
-
ఎల్బీనగర్ మొబైల్‌షాపులో చోరీ
-
క్లాస్‌రూమ్‌లో అమ్మాయిల జుట్టు పట్టుకుని..
-
క్లాస్‌రూమ్‌లో అమ్మాయిల జుట్టు పట్టుకుని..
అమ్మాయిలను జుట్టు పట్టుకుని తిప్పుతూ ఉన్మాదిలా ఊగిపోతూ కొట్టాడు. తలకు దెబ్బ తగిలేలా పలుమార్లు బలంగా కొట్టాడు. చెంపలు వాయించాడు. అమ్మాయిలను గొడ్డును బాదినట్టు బాదాడు. ఇక అబ్బాయిలపైనా ఇదే ప్రతాపం చూపించాడు. దెబ్బలు తిన్న ఈ అమ్మాయిలు, అబ్బాయిలు నేరస్తులేమీ కాదు.. భావి భారత విద్యార్థులు. హోం వర్క్ చేయకపోవడమే వీళ్లు చేసిన నేరం. వీధి రౌడీలా ప్రవర్తించిన ఆ వ్యక్తి టీచర్. హరియాణాలోని కర్నల్‌లో టీచర్ చేసిన నిర్వాకాన్ని ఓ విద్యార్థి రహస్యంగా వీడియో తీశాడు. కర్నల్‌లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో టీచర్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఈ టీచర్‌ను ప్రదీప్ ఆరోరాగా గుర్తించారు. కోచింగ్ సెంటర్ యజమాని కూడా ఇతడే. హోం వర్క్ చేయని 10, ఇంటర్ విద్యార్థులను దారుణంగా కొట్టాడు. క్లాస్‌లో వెనుక వైపు కూర్చున్న ఓ విద్యార్థి మొబైల్ ఫోన్‌తో టీచర్ నిర్వాకాన్ని వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఓ టీవీలో ప్రసారమవడంతో టీచర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీవీలో ప్రసారమైన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు కర్నల్ ఎస్పీ పంకజ్ నైన్ చెప్పారు. కాగా విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ టీచర్‌పై ఫిర్యాదు చేయలేదు. ప్రదీన్ అరోరా రిటైర్డ్ నేవీ ఉద్యోగి. మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ఎలాంటి శిక్షయినా వేయాలని తల్లిదండ్రులు తనకు చెప్పారని వివరణ ఇచ్చాడు. -
'నేను వీఐపీని.. నాకు సిగ్నల్ లేదు..తప్పుకో'
-
'నేను వీఐపీని.. నాకు సిగ్నల్ లేదు..తప్పుకో'
న్యూఢిల్లీ: దేశంలో వీఐపీ కల్చర్ పెరిగిపోతోంది. వారి ఆగడాలు రోజుకింత పెరిగిపోతున్నాయి. వారి చేష్టలతో సామాన్య జనాలకు తెగ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ప్రశ్నించినవారిపై దాడికి సిద్ధపడుతున్నారు. మొన్నటికి మొన్న కేంద్రంమంత్రి మహేశ్ శర్మ కారును ఆపారనే కారణంతో ఆయన ప్రభుత్వేతర సిబ్బంది సెక్యూరిటీ గార్డ్స్ పై దారుణంగా దాడి చేసిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. నోయిడాలో ఈ ఘటన ఆగస్టు 24న జరిగింది. దీనిని రికార్డు చేసిన ప్రశాంత్ సక్సేనా అనే వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో దానిని పోస్ట్ చేయగా సదరు వీఐపీ నిర్వాకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అందులో రికార్డయిన ప్రకారం నోయిడాలోని ఓ చౌరస్తా వద్ద ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడింది. దాంతో అన్ని వాహనాలు ఆగాయి. వాటి పక్కన ఓ కారు ఆగింది. అందులోని ఒక వ్యక్తి అతడి కారు ఎదురుగా ఉన్న ఓ మోటారు సైకిలిస్టును పక్కకు జరగమని అడిగాడు. ఇంకా సిగ్నల్ పడలేదుగా అని అతడు ప్రశ్నించగా తాను వీఐపీనని చెప్పాగా.. అంటు దురుసుగా మాట్లాడాడు. ఈ క్రమంలో అతడిపై దాడి చేసినంత పనిచేశాడు. ఇదంత ఓ కారులో కూర్చుని ఉన్న ప్రశాంత్ తన ఫోన్ లో రికార్డు చేస్తుండగా అతడి కూతురు తండ్రికి చెప్పడంతో రికార్డు చేస్తున్న ప్రశాంత్ పైకి దూసుకొచ్చి ఆ ఫోన్ ను కిందపడేశాడు. నోయిడాలోని సెక్టార్ 57లో ఉదయం 8గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
జేడీయూ లీడర్ షాకింగ్ వీడియో..
పాట్నా: బిహార్‌లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి గదిలో బందించి చితక్కొడుతున్న వీడియో బయటకు వచ్చి హల్ చల్ చేస్తోంది. అధికార పార్టీ జేడీయూకు చెందిన విద్యార్థి విభాగం నేతలు ఈ దాష్టీకానికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటన రెండు నెలల కిందటే జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియో రికార్డయిన దృశ్యాల ప్రకారం.. జేడీయూ విద్యార్థి విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి మనీశ్ మాలిక్ శివం అనే విద్యార్థిని కిడ్నాప్ చేశాడు. అనంతరం ఓ గదిలో బందించి ఆ విద్యార్థి బట్టలు విప్పేసి మరికొందరితో కలసి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన తాజాగా బయటకు రావడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఏకే 47 బుల్లెట్లు దిగినా..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు పోలీసులను నడి రోడ్డుపైనే కాల్చి చంపిన ఉగ్రవాదులు ఓ వీడియోకి చిక్కారు. వారి చేతుల్లో ఆ సమయంలో ఏకే 47 గన్ లతో వీడియోల్లో కనిపించారు. పేలుళ్ల చప్పుళ్లు వినిపించగానే పరుగులు పెట్టినట్లు ఈ వీడియోలో రికార్డయింది. గత శనివారం అనంతనాగ్ జిల్లాలోని ఓ బస్టాండ్ వద్ద ఉన్న పోలీసులపై సాయుధులుగా వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మృతిచెందిన వారిలో ఓ ఎస్సై కూడా ఉన్నారు. ఆ ఘటనను ఓ పాదచారి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఈ వీడియోలో రికార్డయిన ప్రకారం ఓ ఉగ్రవాది బ్లూ షర్ట్ తో భుజాన పెద్ద బ్యాగు వేసుకొని చేతిలో ఏకే 47 గన్ తో ఉండగా మరో ఉగ్రవాది బ్లాక్ పాయింట్.. తిక్ బ్లూ షర్ట్ ఏకే47 గన్ తో కనిపించాడు. తొలుత కాల్పులు జరిపిన వారిద్దరు కిందపడిన పోలీసు అధికారి దగ్గరకు వెళ్లి అతడి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించినా అతడు ప్రతిఘటించాడు. ఈ లోగా పోలీసుల కాల్పుల చప్పుళ్లు వినిపించడంతో వారు పారిపోతూ కనిపించారు. ఈ ఉగ్రవాదుల్లో ఒకరిని జునాయిడ్ లష్కరే తోయిబాకు చెందిన జునాయిడ్ మతూగా పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాదిని గుర్తించేందుకు స్థానికుల సహాయం తీసుకుంటున్నారు. జనరల్ బస్టాండ్ సమీపంలో ఉన్న పోలీసులపై ఒక్కసారిగా ఈ మిలిటెంట్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించగా అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్‌గా గుర్తించారు. -
గాల్లో ఐదుగురు బంతిలా ఎగిరిపడ్డారు
చెన్నై: చెన్నైలో ఓ కారు భీభత్సం సృష్టించింది. అడ్డొచ్చిన వారిని గాల్లోకి బంతుల్లాగా ఎగరేసింది. దాని వేగం భారిన పడిన మొత్తం ఐదుగురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా కూడా చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో ఉంచిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందులో రికార్డయిన ప్రకారం చెన్నైలోని మంగళవారం రాత్రి ఓ వీధిలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్లగా మరో ముగ్గురు వ్యక్తులు కాస్త రోడ్డు మీదుగానే నడుస్తూ వెళుతున్నారు. అదే సమయంలో ఓ గోడకు ఢీకొని అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చిన ఎర్రటి శాంత్రో కారు వారిని బలంగా ఢీకొట్టింది. అందులో ముగ్గురు చెల్లా చెదురుగా పడిపోగా మరో ఇద్దరు కొద్ది సేపు కారు బానెట్‌పైనే ఉండిపోయి కొద్ది సేపటి తర్వాత గాల్లోకి బంతుల్లాగా ఎగిరిపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగితావారు గాయాలపాలయ్యారు. అయితే, ఆ కారు డ్రైవర్‌ను వెంకటేశ్ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడు మంచి అనుభవం ఉన్న డ్రైవరేనని, కానీ గోడకు కారు ఢీకొనడంతో బ్రేక్ వేయాల్సింది అనుకోకుండా ఎక్స్లేటర్మీద కాలు పెట్టడం వల్ల అమాంతం కారు పాదచారులపైకి దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు. -
టికెట్ అడిగినందుకు ఎమ్మెల్యే కొడుకు దాడి
లక్నో: సమాజ్‌వాది పార్టీ నేతలే కాదు.. వారి పుత్ర సంతానం కూడా రౌడీల్లాగానే ప్రవర్తిస్తున్నారు. ఓ షాపింగ్‌మాల్‌లో గార్డుగా చేస్తున్న వ్యక్తిపై ఓ ఎమ్మెల్యే కొడుకు, అతడి స్నేహితులు దారుణంగా దాడి చేశారు. ఏమాత్రం జాలి చూపకుండా పిడిగుద్దులు కురిపించారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన తీరు మొత్తం సీసీటీవీ పుటేజ్‌లో రికార్డయింది. అసలేం జరిగిందంటే.. లక్నోలోని గోమతి నగర్లో ఓ షాపింగ్ మాల్లోని సినిమా థియేటర్‌కు ఎస్పీకి చెందిన మున్నీ సింగ్ అనే ఎమ్మెల్యే కుమారుడు ఉగ్రసేన్ ప్రతాప్ సింగ్ అతడి స్నేహితులు వెళ్లారు. అయితే, షాపింగ్ మాల్లో ఓ సెక్యూరిటీ గార్డు ఆ సినిమా టిక్కెట్లు చూపించమని అడిగాడు. దీంతో తమనే టిక్కెట్లు అడుగుతావా అంటూ అతడిపై ఉగ్రసేన్, తన స్నేహితులు విరుచుకుపడి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సీసీటీవీలో ఓ ఎమ్మెల్యే కుమారుడి దౌర్జన్యం స్పష్టంగా కనిపించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ బహదూర్ పాఠక్ నిలదీశారు. ఆ గార్డు చేసిన తప్పేమిటి, అతడు తన విధులను తాను సక్రమంగా చేశాడు అయినా కొడతారా అని ప్రశ్నించారు.