Hyderabad: ఇదేం ట్రెండ్‌రా నాయనా.. నడిరోడ్డుపై రొమాన్స్‌ చేసిన జంట | Hyderabad couple get cosy while sitting on sunroof of moving car | Sakshi
Sakshi News home page

Hyderabad: ఇదేం ట్రెండ్‌రా నాయనా.. నడిరోడ్డుపై రొమాన్స్‌ చేసిన జంట

Published Mon, Oct 16 2023 2:06 PM | Last Updated on Mon, Oct 16 2023 2:54 PM

Hyderabad couple get cosy while sitting on sunroof of moving car - Sakshi

శనివారం రాత్రి ఎక్స్‌ప్రెస్‌ వేపై ఓ కియా కారు శంషాబాద్‌ వైపు నుంచి మెహదీపట్నం వైపు ప్రయాణించింది.

హైదరాబాద్: బీహార్‌లోని గయ, ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌, ఘజియాబాద్‌ల్లో రోడ్లపై ప్రయాణిస్తున్న జంటలు వికృత చేష్టలకు పాల్పడిన వీడియోలు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఓ ఘటనే శనివారం రాత్రి నగరంలోని పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌ వేపై చోటు చేసుకుంది. అయితే ఉత్తరాదిలోని జంటలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రెచ్చిపోగా... నగరంలోని జంట మాత్రం మరో అడుగు ముందుకు వేసి కారును వాడుకుంది.

శనివారం రాత్రి ఎక్స్‌ప్రెస్‌ వేపై ఓ కియా కారు శంషాబాద్‌ వైపు నుంచి మెహదీపట్నం వైపు ప్రయాణించింది. ఇది ఎక్స్‌ప్రెస్‌ వేపై ఉండగానే దాని సన్‌రూఫ్‌ ఓపెన్‌ చేసుకున్న ఓ జంట అందులోంచి బయటకు నిలబడింది. పబ్లిక్‌గానే ఆలింగనాలు, చుంబనాలతో అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఆ కారు వెనుకే మరో కారులో ప్రయాణిస్తున్న వారు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

ఇవి ఆదివారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరాదిలోని నగరాలు, పట్టణాల్లో ఇలా వీధుల్లో వికృత చేష్టలకు పాల్పడిన జంటల్ని అక్కడి పోలీసులు సోషల్‌ మీడియాలోని వీడియోల ఆధారంగా పట్టుకుని చర్యలు తీసుకున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ వే జంట విషయంలో ఇక్కడి పోలీసుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement