kiss issue
-
Hyderabad: ఇదేం ట్రెండ్రా నాయనా.. నడిరోడ్డుపై రొమాన్స్ చేసిన జంట
హైదరాబాద్: బీహార్‌లోని గయ, ఉత్తరప్రదేశ్‌లోని హపూర్, ఘజియాబాద్‌ల్లో రోడ్లపై ప్రయాణిస్తున్న జంటలు వికృత చేష్టలకు పాల్పడిన వీడియోలు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఓ ఘటనే శనివారం రాత్రి నగరంలోని పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వేపై చోటు చేసుకుంది. అయితే ఉత్తరాదిలోని జంటలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రెచ్చిపోగా... నగరంలోని జంట మాత్రం మరో అడుగు ముందుకు వేసి కారును వాడుకుంది. శనివారం రాత్రి ఎక్స్‌ప్రెస్ వేపై ఓ కియా కారు శంషాబాద్ వైపు నుంచి మెహదీపట్నం వైపు ప్రయాణించింది. ఇది ఎక్స్‌ప్రెస్ వేపై ఉండగానే దాని సన్‌రూఫ్ ఓపెన్ చేసుకున్న ఓ జంట అందులోంచి బయటకు నిలబడింది. పబ్లిక్‌గానే ఆలింగనాలు, చుంబనాలతో అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఆ కారు వెనుకే మరో కారులో ప్రయాణిస్తున్న వారు ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఇవి ఆదివారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరాదిలోని నగరాలు, పట్టణాల్లో ఇలా వీధుల్లో వికృత చేష్టలకు పాల్పడిన జంటల్ని అక్కడి పోలీసులు సోషల్ మీడియాలోని వీడియోల ఆధారంగా పట్టుకుని చర్యలు తీసుకున్నాయి. ఎక్స్‌ప్రెస్ వే జంట విషయంలో ఇక్కడి పోలీసుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
బలవంతపు ముద్దుకు తగిన మూల్యం.. ఫెడరేషన్ చీఫ్‌పై సస్పెన్షన్ వేటు
స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ తమ దేశ స్టార్ క్రీడాకారిణి జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఉదంతం అనంతరం స్పెయిన్‌లో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో రుబియాలెస్‌పై ఫిఫా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని ఫిఫా పేర్కొంది. సస్పెన్షన్‌తో పాటు రుబియాలెస్‌పై క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని తెలిపింది. కాగా, స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు జగజ్జేతగా అవతరించిన అనంతరం మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా రుబియాలెస్.. జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసందే. ఆ సమయంలో రుబియాలెస్.. జెన్నిఫర్‌తో పాటు మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. రుబియాలెస్ నుంచి ఊహించని ఈ ప్రవర్తన చూసి జెన్నిఫర్‌తో పాటు అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఉదంతంపై స్పెయిన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఓ మహిళలను అయిష్టంగా చుంబించడం సమర్ధనీయం కాదని స్పానిష్ ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ఉదంతం స్పెయిన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ రంగంలోకి దిగారు. రుబియాలెస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని సూచించారు. క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రుబియాలెస్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఫిఫా జోక్యం చేసుకుని రుబిమాలెస్పై తూలెసస్పెన్షన్ వేటు వేసింది. -
ఫుట్‌బాల్ క్రీడాకారిణికి ముద్దు పెట్టిన ఫెడరేషన్ చీఫ్.. స్పెయిన్‌లో రచ్చ రచ్చ
2023 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను స్పెయిన్ తొలిసారిగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆగస్ట్ 20న జరిగిన ఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్‌ను 1-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి జగజ్జేతగా ఆవిర్భవించింది. అయితే మ్యాచ్ అనంతరం ఆ దేశ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ సొంత క్రీడాకారిణుల పట్ల వ్యవహరించిన తీరు స్పెయిన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా లూయిస్.. స్వదేశీ స్టార్ ఫుట్‌బాలర్ జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని వల్గర్‌గా బిహేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్పెయిన్‌లో నిరసనలు హోరెత్తాయి. దీంతో లూయిస్ ఓ మెట్టుకిందికి దిగొచ్చి సదరు క్రీడాకారిణిలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. అయినా స్పెయిన్‌లో నిరసనలు శాంతించలేదు. ఔ లూయిస్ ఉద్దేశపూర్వకంగా తప్పుచేసి, సారీ చెబితే సరిపోతుందా అంటూ నిరసనకారులు స్వరాలను పెంచారు. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ జోక్యం చేసుకున్నారు. లూయిస్ నామమాత్రం సారీ చెబితే సరిపోదని నిరసనకారులతో స్వరం కలిపారు. ముద్దు వివాదంపై లూయిస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, ఫెడరేషన్ అధ్యక్షుడిపై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని చేతులు దులుపుకున్నాడు. దీంతో క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రంగంలోకి దిగింది. స్పెయిన్ ప్రభుత్వం కాని సాకర్ కౌన్సిల్ కాని లూయిస్‌పై చర్యలు తీసుకోకపోతే తాను చర్యలకు ఉపక్రమిస్తానని కౌన్సిల్ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి స్పెయిన్‌లో ముద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారుతుంది. -
కెమెరాల ముందు 30 సెకన్ల పాటు లిప్‌లాక్.. బుర్ర పనిచేస్తుందా?
బాలీవుడ్ నుంచి జియో సినిమాలో ప్రసారమవుతున్న 'బిగ్ బాస్ OTT 2'లో రోజుకో అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల షోలోని కంటెస్టెంట్ జైద్ హదీద్, ఆకాంక్ష పూరి వివాదం వైరల్ అయ్యింది. పూరి ఆకాంక్షను జైద్ హదీద్ తప్పుగా తాకినప్పుడు ఆమె గొడవ చేసింది. తాజాగా వారిద్దరూ ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: బ్రహ్మానందం కోసం మహేష్ బాబు ఏం చేశారంటే..?) 'బిగ్ బాస్ OTT 2' జూన్ 17 నుంచి జియో సినిమాలో ప్రసారం అవుతుంది. షో ప్రారంభం అయిన వెంటనే, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు షోలో ఇలాంటివి చాలా జరిగాయి. ముఖ్యంగా షో ప్రారంభం అయిన 24 గంటల్లోనే ఒక పోటీదారుడిని తొలగించడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి. వెంటనే షోలోని పోటీదారులు జైద్ హదీద్, ఆకాంక్ష పూరిల వివాదం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఒక వీడియో కనిపించింది, దీనిలో ఆకాంక్ష, జైద్ 30 సెకన్ల పాటు ఫ్రెంచ్ ముద్దులు పెట్టుకున్నారు. ఇందులో బిగ్‌బాస్ 'డేర్ గేమ్' పేరుతో ఒక టాస్క్ ఇచ్చాడు. పోటీలో పాల్గొనేందుకు మొదట ఎవరూ ముందుకు రాలేదు. కానీ కొంత సమయం తర్వాత జైద్ హదీద్, ఆకాంక్ష పూరి గేమ్‌లో పాల్గొన్నారు. అలా 30 సెకన్ల పాటు ఓపెన్‌గా ముద్దు పెట్టుకునే ధైర్యం చేశారు. ఆ తర్వాత కూడా కొందరు కంటెస్టెంట్స్ ధైర్యం చేసి ఫ్రెంచ్ కిస్ చేశారు. దీంతో నెటిజన్లు షో నిర్వాహుకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. టాస్క్‌ల పేరుతో ఇలాంటి పిచ్చి పనులు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ బుర్ర పనిచేస్తుందా అంటూ మండిపడుతున్నారు. #SalmanKhan had said he will let #BiggBossOTT2 contestants cross the line, Lets see who he reacts to this Kiss by #AkankshaPuri and #JadHadid pic.twitter.com/ZFV1h3J80d — The Khabri (@TheKhabriTweets) June 29, 2023 (ఇదీ చదవండి: ఆస్కార్‌లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ) -
ముద్దు వివాదంపై రచ్చ రచ్చ!
రియోడిజనీరో: రియో ఒలింపిక్స్ లో భాగంగా ఒలింపిక్ విలేజ్ ను కొన్ని రోజుల ముందే సిద్ధంచేయాలి. అయితే ఒలింపిక్ గ్రామం ఏర్పాట్లపై సర్వత్రా విమర్శులు వ్యక్తమవుతున్న తరుణంలో రియో మేయర్ ఎడ్యార్డో పేస్ చేసిన చిన్న పొరపాటుపై పెను దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే బ్రెజిల్ వాసులు కూడా రియో ఏర్పాట్లు, నిర్వహణ తీరుపై చాలా నిరాశగా ఉండగా, మేయర్ ముద్దు వివాదంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రియోకు రావడంలో భాగంగా స్థానిక మేయర్ పేస్‌ను ఆస్ట్రేలియాకు చెందిన కీలక అధికారిణి కిట్టీ చిల్లర్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ పేస్, కిట్టీ బుగ్గపై ముద్దుపెట్టారు. ఒలింపిక్ విలేజ్ లో ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శలు ఎక్కవయ్యాయి. అన్ని ఏర్పాట్లు దాదాపు బాగున్నాయని, కొంతమేరకు సమస్యలు తన దృష్టికి వచ్చాయని పేస్ పేర్కొన్నారు. కిట్టీ చిల్లర్ మాట్లాడుతూ.. గత ఐదు ఒలింపిక్స్ లో నిర్వహణ ఇంత సాధారణంగా లేదని, ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని రియో మేయర్ కు ఆమె సూచించారు. ముద్దు వివాదంపై తీవ్ర విమర్శల వ్యక్తమవుతున్న నేపథ్యంలో పేస్ స్పందిస్తూ.. తాను ఎలాంటి తప్పిదం చేయలేదని, క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చుకున్నారు. కేవలం మర్యాదపూర్వకంగా ఆమెతో ప్రవర్తించానని బుధవారం స్థానిక మీడియాతో ఈ వివరాలు తెలిపారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా మెగా ఈవెంట్ నిర్వహిస్తే చాలంటూ మేయర్ పై స్థానికుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.